English | Telugu
అనన్య ఎవరికోసం వెతుకుతారో తెలుసా?
Updated : Aug 26, 2023
ఇవాళ్రేపు సోషల్ మీడియాలో గంటల తరబడి సమయాన్ని గడపని వారే కనిపించడం లేదు. తాను కూడా అచ్చం అలాంటిదాన్నేనని అంటున్నారు లైగర్ బ్యూటీ అనన్య పాండే. ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ 2 శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలను రివీల్ చేశారు అనన్య. సోషల్ మీడియాలో తాను అమితంగా వెతికే వ్యక్తిని గురించి కూడా చెప్పుకొచ్చారు.
డ్రీమ్ గర్ల్ 2 సినిమా ప్రీమియర్లకు అనన్యతో పాటు వచ్చారు ఆదిత్యరాయ్ కపూర్. ఆమెను చియరప్ చేశారు. అనన్య సోషల్ మీడియాలో ఎక్కువగా వెతికేది ఇతని గురించేనని అందరూ గుసగుసలాడుకున్నారు. అయితే ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు అనన్య పాండే.
అనన్య పాండే మాట్లాడుతూ ``నేను జీనత్ అమన్‌ని సోషల్ మీడియాలో ఎక్కువగా వెంటాడుతుంటాను. ఆమె ఏ పోస్టు పెట్టినా నాకు ప్రత్యేకమే. కొన్నిసార్లు ఆమె పా త సినిమా సెట్స్ మీద ఉన్న ఫొటోలు పెడుతుంటారు. నేను వెంటనే ఆ సినిమాలను చూసేస్తాను. అలా ఆమెను ఫాలో అయ్యి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నటన ఇంప్రూవ్ చేసుకున్నాను. అంతెందుకు ఇటీవల డ్రీమ్ గర్ల్ 2 మూవీ కోసం నేను మధుర ప్రాంతానికి వెళ్లాను. అక్కడి ప్రజల యాసభాషలన్నీ నేర్చుకున్నాను. నా సినిమాల్లో వాటినే రిఫ్లక్ట్ చేస్తుంటాను. అప్పుడే నేచురల్ పెర్ఫార్మెన్స్ వస్తుందన్నది నా ఫీలింగ్. నా దృష్టిలో నటీనటులకు అబ్జర్వేషన్ చాలా ముఖ్యం``అని అన్నారు. అనన్య పాండే నటించిన డ్రీమ్ గర్ల్ 2 ని రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మించారు. పరేష్ రావల్, మంజోత్ సింగ్, రాజ్ పాల్ యాదవ్, విజయ్ రాజ్, అను కపూర్ కీ రోల్స్ చేశారు. ఇందులో ఆమె ఆయుష్మాన్ ఖురానా లవ్ ఇంట్రస్ట్ పారి కేరక్టర్‌లో కనిపించారు.