English | Telugu
పార్టీ చేసుకున్న సూపర్‌స్టార్
Updated : Aug 26, 2023
హిమాలయాల నుంచి, తన ఆధ్యాత్మిక ట్రిప్ నుంచి తిరిగి వచ్చేశారు తలైవర్ రజనీకాంత్. వచ్చీరాగానే జైలర్ టీమ్‌ని పిలిచి సెలబ్రేట్ చేసుకున్నారు. జైలర్ ఇప్పుడు 500 కోట్ల మార్కు దాటేసింది. ఈ సందర్భంగా పెద్ద కేక్ కట్ చేశారు సూపర్ స్టార్ రజనీ కాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా జైలర్. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర బాద్షాగా నిలుచుంది. ఐకాన్ స్టార్‌డమ్‌కి ఇది నిదర్శనమని అంటున్నారు చెన్నై క్రిటిక్స్. ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేశారు జైలర్‌ని.
సూపర్‌స్టార్ అరేంజ్ చేసిన పార్టీకి సినిమా డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, కంపోజర్ అనిరుద్ రవిచందర్, రమ్యకృష్ణన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. డైరక్షన్, ప్రొడక్షన్ టీమ్ కూడా ఈ పార్టీకి హాజరైంది.
తన ట్రిప్ కంప్లీట్ చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చినప్పుడే రజనీకాంత్ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందే నార్త్ ట్రిప్ వెళ్లినట్టు తెలిపారు. సీఎం ఆదిత్యనాథ్ యోగి కాళ్లకు నమస్కరించిన విధానం కూడా వైరల్ అయింది. అయితే అందులో తప్పేం లేదని, తనకన్నా చిన్న వాళ్లైనప్పటికీ సాధువులకు తాను మొక్కుతానని అన్నారు రజనీకాంత్.
ఇప్పటిదాకా తమిళనాడులో హయ్యస్ట్ గ్రాసర్‌గా ఉంది రజనీకాంత్ నటించిన 2.0. 750 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకున్న మూవీగా రికార్డుల్లో ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని మొన్న మొన్నటిదాకా కేప్చర్ చేసింది పొన్నియిన్ సెల్వన్ 1. ఈ సినిమాను పక్కకు తోసి ఇప్పుడు సెకండ్ ప్లేస్‌ని కూడా తానే కబ్జా చేశారు రజనీకాంత్. 500 కోట్ల ప్లస్ గ్రాస్‌తో జైలర్ సినిమా రెండో స్థానాన్ని ఆక్యుపై చేసింది.
జాకీ ష్రాఫ్, తమన్నా భాటియా, సునీల్, మిర్న మీనన్, వసంత్ రవి, యోగిబాబు, నాగబాబు, కిశోర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా జైలర్.