English | Telugu

Aindham Vedham web series review: ఐందామ్ వేదం వెబ్ సిరీస్ రివ్యూ

 

వెబ్ సిరీస్ : ఐందామ్ వేదం
నటీనటులు: సాయి ధన్విక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజ్ గోపాల్,  వై జీ మహేంద్ర తదితరులు
ఎడిటింగ్: రెజీష్
సినిమాటోగ్రఫీ: శ్రీనివాసన్ దేవరాజన్
మ్యూజిక్: రేవా
నిర్మాతలు:  అభిరామి రామనాథన్, నల్లమ్మాయి రామనాథన్
దర్శకత్వం: ఎల్ నాగరాజన్
ఓటీటీ: జీ5

కథ: 

కోల్ కతా కి చెందిన అనూ(సాయి ధన్సిక) ఓ తెలుగు అమ్మాయి. తన తల్లి అస్థికలని గంగలో కలపడానికి వారణాసి వెళ్తుంది. ఆమెకు అక్కడ  ఓ స్వామిజీ కన్పిస్తాడు.  అనూకి ఓ పెట్టె ఇచ్చి ' అయ్యంగారపురం' లోని శివాలయం పూజారికి ఇవ్వమని స్వామిజీ చెప్తాడు.  అయితే అనూ తనకేం సంబంధం లేనట్టు ఉంటుంది. అనూ సింగర్ అవ్వాలని ఆడిషన్స్ కోసం త్రివేండ్రం వెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఆమెకి తెలియకుండానే ఆ కారు అయ్యంగారపురంకి వెళ్తుంది. అసలు అనూకి ఆ ఊరికి గల సంబంధమేంటి? అసలు ఆ గుడి రహస్యమేంటి అనేది మిగతా కథ. 

విశ్లేషణ:

ఐందామ్ వేదం అనేది తమిళ పదం. ఐదవ వేదం అనేది దీని అర్థం. ఈ సిరీస్ మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. బాక్స్ ని అనూ తీసుకున్నపట్టి నుండి కథలో వేగం పెరుగుతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి ముప్పై నిమిషాల పైనే ఉంటుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు తరాలని ఎంతగా ప్రభావితం చెప్తూనే.. సృష్టిలో మనిషి చూడలేని మరో వేదం అంటు ఒకటుందని దర్శకుడు పరిచయం చేసిన విధానం బాగుంది. కథ మొత్తం అయ్యంగారపురం చుట్టూ తిరుగుతుంది. అయితే కథ ముందుకెళ్తున్న కొద్దీ పాత్రలు ఎక్కువవుతుంటాయి. ప్రతీ పాత్రని గుర్తుపెట్టుకోవడం ఆడియన్ కి కాస్త కష్టమే కానీ ఆ పాత్రలన్నీ కథకి తగ్గట్టుగానే ఉండటంతో ఆసక్తికరంగా ఉంటుంది. అనూకి ఆ గుడికి మధ్య గల సంబంధమేంటని చెప్పడంతో కథ(ఐందామ్ వేదం) మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే సిరీస్ లో ప్రధానమైన భాగాన్ని ఎప్పుడో ఏడో ఎపిసోడ్ లో రివీల్ చేస్తాడు దర్శకుడు. ‌

అసభ్యకర సంభాషణలు గానీ సన్నివేశాలు గానీ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. అయితే ట్విస్ట్ రివీల్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక చివరి ఎపిసోడ్ లో మరో భాగం ఉందంటూ కథని ముగించాడు దర్శకుడు.  రెజీష్ ఎడిటింగ్ బాగుంది. శ్రీనివాసన్ దేవరాజన్ సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. రేవా నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

అనూ పాత్రలో సాయి ధన్విక ఒదిగిపోయింది. మిగిలిన పాత్రలు వారి పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే థ్రిల్లింగ్ 'ఐందామ్ వేదం'. 

రేటింగ్: 2.75 / 5

✍️. దాసరి  మల్లేశ్