English | Telugu
‘పుష్ప2’ విషయంలో జానీ మాస్టర్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. వాళ్ళపై కేసు ఫైల్ చేస్తాను!
Updated : Oct 25, 2024
లైంగిక వేధింపుల కేసులో పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కొన్నిరోజులుగా జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ‘పుష్ప2’ చిత్రంలోని ఒక పాటకు జానీ మాస్టర్ పని చెయ్యాల్సి ఉందని, అతనిపై కేసు నమోదైన కారణంగా ఆ పాట అతనితో చేయించడం లేదని వినిపిస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ వివరించారు.
‘పుష్ప2 చిత్రానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చెయ్యడం లేదు. గతంలో చిత్ర యూనిట్ అతన్ని సంప్రదించింది. అయితే అతను బిజీగా ఉన్న కారణం చెయ్యలేకపోతున్నానని చెప్పడం, దాంతో చిత్ర యూనిట్ గణేష్ ఆచార్యతో పాట చేయించుకోవడం జరిగింది. ఈ కేసుకి మైత్రి సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇది వారి వ్యక్తిగత వ్యవహారం. దీనికి, ఫిలిం ఛాంబర్‌కి ఏమిటి సంబంధం. ఈ విషయంలో కమిటీది తప్పు. ఇక జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే.. న్యాయం గెలిచిందని నేననుకుంటున్నాను. బెయిల్‌పై విడుదలయ్యాడు. నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను. అతనికి క్లీన్ చిట్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఫైనల్‌గా కోర్టు ఏ ఆదేశాలు ఇస్తే వాటి ప్రకారమే అందరూ నడుచుకోవాలి. జానీ మాస్టర్ అతని పని అతను చేసుకోవచ్చు. చెయ్యడానికి వీలు లేదని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అతనిపై కేసు మాత్రమే పెట్టారు. అది ఇంకా నిరూపణ కాలేదు. కాబట్టి అతను నిరభ్యంతరంగా వర్క్ చేసుకోవచ్చు.
ఇక ఫిలిం ఛాంబర్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీ పరువును తీసుకొచ్చి రోడ్డున పడేశారు. జానీ మాస్టర్ కార్డును రద్దు చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు. అతని కేసు ఇంకా కోర్టులోనే ఉంది. నిరూపణ అవ్వలేదు. అలాంటప్పుడు అతనికి ఫుడ్ పెట్టే కార్డును ఎలా రద్దు చేస్తారు. వీళ్లెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి. ఇక్కడ ఒక వైపే మాట్లాడుతున్నారు. జానీ మాస్టర్‌ని దోషిని చేశారు. బాధితురాలికి సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పరువును నిలువునా తీసిన తమ్మారెడ్డి భరద్వాజ, రaాన్సీ, ప్రగతి, దామోదరప్రసాద్, వివేక్ కూచిబొట్లపైన ఇండస్ట్రీ కేసు ఫైల్ చెయ్యాలి. డిఫర్‌మేషన్ సూట్ వెయ్యాలి. వాళ్ళు నా కోసం మాట్లాడితే.. నేను అందరి కోసం మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ కేసు వెయ్యకపోతే నేను వాళ్ళందరి మీదా కేసు ఫైల్ చేస్తాను, డిఫర్‌మేషన్ వేస్తాను’ అన్నారు నట్టికుమార్.