English | Telugu
నందమూరి బ్రాండ్ తో పెట్టుకుంటే అట్లనే ఉంటుంది మరి
Updated : Oct 26, 2024
నందమూరి నట సింహం బాలకృష్ణ(balakrishna)తన 109 వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు.చిరంజీవి(chiranjeevi)కి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ ని అందించిన బాబీ దర్శకుడు కావడంతో బాలయ్య అభిమానుల్లో ఆ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.లేటెస్ట్ గా అఖండ 2(akhanda 2)ని కూడా ప్రారంభించిన బాలయ్య ఆ మూవీకి కూడా డేట్స్ కేటాయించబోతున్నాడు.
లేటెస్ట్ గా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నఅన్‌స్టాపబుల్ సీజన్ 4(unstoppable season 4) స్టార్ట్ అయ్యింది.మొదటి ఎపిసోడ్ కి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ గా వచ్చారు.అందులో బాలకృష్ణ మాట్లాడుతూ పాదయాత్ర మొదటి నుంచి ప్రమాణ స్వీకారం దాకా విశ్రమించకుండా పని చేసిన నిజమైన లీడర్ నారా లోకేశ్ అని కొనియాడారు. ఆ తర్వాత పాదయాత్ర ఎవరి నిర్ణయం అని చంద్రబాబుని అడిగితే అది లోకేశ్ నిర్ణయం.ఒక తండ్రిగా కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పాను.విద్వేష పూరితమైన ప్రభుత్వం ఉన్నప్పుడు పాదయత్రకి వెళ్లడం కరెక్ట్ కాదని,ఎంతకైనా తెగిస్తారని చెప్పాను.లేదు నాన్న నేను వెళ్ళాలి, లోకేశ్(nara lokesh)అనే వ్యక్తి నందమూరి తారకరామారావు గారి మనవడిగానో,చంద్రబాబు నాయుడు కొడుకుగానో, బాలయ్య అల్లుడిగానో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత కావాలని, తాను నిరూపించుకుంటానని,ప్రజల కోసం పోరాడతానని వెళ్ళాడు.
లోకేష్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు,2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు మొత్తం 3,132 కిమీ కొనసాగింది. అన్ని చోట్ల కూడా ప్రజలు లోకేష్ కి బ్రహ్మ రధం పట్టారు.