English | Telugu

సైకోగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమల్ హాసన్ 

భారతీయ సినీ ప్రేక్షకులని ఏ హీరో ప్రయోగాలకి పెట్టింది పేరు అని అడిగితే అందరు కమల్ హాసన్ అని టక్కున చెప్తారు. రెగ్యులర్ ఫార్మెట్ లో సినిమాలు తెరకెక్కే సమయంలోనే కమల్ ఎన్నో వైవిధ్యమైన ప్రయోగాత్మకమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ అనుభూతిని ప్రేక్షకులకి అందించాలని ఒక సూపర్ హిట్ మూవీ ని కమల్ రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.

కమల్ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2000 వ సంవత్సరంలో తమిళంలో తెరకెక్కిన మూవీ ఆళవందన్. ఈ చిత్రమే తెలుగులో అభయ్ అనే పేరు తోవచ్చింది. అభయ్ అనే టైటిల్ ని వినగానే ఇదేదో మామూలు సినిమా అని అనుకునేరు. ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఒక సూపర్ క్రేజీ సైకో థ్రిల్లర్ చిత్రం. కమల్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాలోని కమల్ సైకో యాక్టింగ్ కి జై జై లు కొట్టని ప్రేక్షకుడు లేడు. ఇప్పుడు ఈ అభయ్ సినిమానే రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. సుమారు వెయ్యి కి పైగా థియేటర్స్ లో విడుదల కాబోతున్న అభయ్ చిత్రం మళ్ళీ సరికొత్త రికార్డు లు సృష్టించడం ఖాయమని కమల్ అభిమానులు అంటున్నారు. చిత్ర బృందం అతి త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది.


ఇప్పుడొస్తున్న ఎన్నో సైకో థ్రిల్లర్ చిత్రాల్లో సైకో గా నటించిన నటుల కంటే ముందే కమల్ ఈ చిత్రంలో సైకోగా చాలా అద్భుతంగా నటించాడు. కమల్ సరసన రవీనాటాండన్, మనీషా కొయిరాలా లు నటించారు.హిందీ లో కి కూడా విడుదల అయిన ఈ అభయ్ చిత్రానికి కమల్ స్క్రీన్ ప్లే ని అందించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.