English | Telugu

అప్పుడే సంవత్సరం అయ్యిందా కృష్ణ గారు 

తనకి మాత్రమే సాధ్యమయ్యే నటనతో కొన్ని కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణ గారు సృష్టించిన ప్రభంజనం ప్రస్తుతం నడుస్తున్న సినీ యుగానికి ఒక దిక్సుచి లాంటిది. సుమారు 330 కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ గారు గత సంవత్సరం ఇదే రోజున తెలుగు ప్రజల్ని శోక సంద్రంలో ముంచెత్తుతు పరమపదించారు.

ఈ రోజు కృష్ణ గారి మొదటి సంవత్సరికం కార్యక్రమంజరిగింది. మహేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులందరు కృష్ణ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి కృష్ణ గారితో గడిపిన గత స్మృతుల్ని గుర్తుచేసుకున్నారు. అలాగే కృష్ణ గారి ఫోటో పక్కనే కృష్ణ గారి సతీమణి దివంగత ఇందిరాదేవి గారి ఫోటో ఉంచి ఆమెకి కూడా నివాళులు అర్పించారు.

ఈ రోజు కృష్ణ గారి సంవత్సరికం గురించి తెలుసుకున్నచాలా మంది సినీ ప్రముఖులు అలాగే కృష్ణ గారి అభిమానులు అప్పుడే కృష్ణ గారు మా అందర్నీ వదిలేసి సంవత్సరం దాటిందా అని అనుకుంటున్నారు.కానీ ఒక్క విషయం మాత్రం నిజం.. కృష్ణ గారు భౌతికంగా మరణించి ఉండవచ్చు. కానీ కృష్ణ గారు .తాను నటించిన సినిమాల రూపంలో మన ముందు ఎప్పుడు సజీవంగానే ఉంటారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.