English | Telugu

మళ్ళీ మీ ముందుకు సిల్క్ స్మిత 

80 ,90 వ దశకాల్లో తెలుగు తమిళ చిత్ర సీమని ఒక ఊపు ఊపిన నటీమణి సిల్క్ స్మిత. హీరోయిన్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత ఆమె తీసుకున్న ఒక నిర్ణయం తెలుగు సినిమా చూడటం కోసం జనం థియేటర్ల ముందు బారులు కట్టేలా చేసింది. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి నర్తించి తన కంటు ఒక బ్రాండ్ ని సిల్క్ స్మిత సృష్టించుకుంది. తెరపై ఆమె కనపడితే చాలు ఆ సినిమాకి కనకవర్షం కురుస్తుంది. అలాగే భారతీయ చిత్రసీమలో ఉన్న అతికొద్దిమంది గొప్ప డ్యాన్సర్లలో సిల్క్ స్మిత కూడా ఒకరు. ఆమె జీవిత కథ ఆధారంగా గతంలో కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకులని అలరించాయి. తాజాగా ఇంకో సినిమా ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది.

బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి మూవీలో నటించిన చంద్రిక రవి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న సిల్క్ స్మిత బయోపిక్ లో సిల్క్ స్మిత పాత్రని పోషించబోతుంది.సిల్క్ స్మిత ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టాగ్ లైన్ తో చంద్రిక రవి సిల్క్ స్మిత లుక్ తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. చంద్రిక రవి డిటో సిల్క్ స్మితలాగ ఉందని పోస్టర్‌ చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. జయరామ్ దర్శకత్వం లో 2024లో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఎస్ ట్రీఆర్ఐ సినిమాస్ పై ఎస్‌బీ విజయ్‌ నిర్మించనున్నారు.

ఇంకా టైటిల్ ని నిర్మిచని ఈ సిల్క్ స్మిత బయోపిక్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ ,హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాల్లో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నప్పుడే వ్యక్తిగత కారణాలతో 1996 సెప్టెంబర్ 23 న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.