English | Telugu
కలెక్షన్లతో అదరగొడుతున్నమహేష్1
Updated : Jan 25, 2014
మహేష్ నటించిన "1" సినిమా హాలీవుడ్ రేంజులో దర్శకుడు తెరకెక్కించాడు. దాంతో "1"కు టాలీవుడ్ లో ఆదరణ కరువయ్యింది. కానీ ఓవర్‌సీస్‌లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం వసూళ్ళ పరంగా "1" నాలుగో స్థానంలో ఉంది. అమెరికాలో విడుదలైన తొలిరెండు వారాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగవ తెలుగు చిత్రంగా "1" నిలిచింది. ఈ కలెక్షన్ల ఇలాగే కొనసాగితే త్వరలోనే మూడో స్థానంలోకి చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. కలెక్షన్లు మరింత పెంచడానికి టికెట్ ధర జనవరి 24వ తేదీ నుండి పెద్దలకు 10 డాలర్లు, పిల్లలకు 6 డాలర్లుగా టికెట్ ధర నిర్ణయించారు చిత్ర నిర్మాత. దీంతో మరింత కలెక్షన్లు పెరిగే అవకాశమున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.