English | Telugu
సుమంత్ గుర్రానికి బ్రేకులు
Updated : Jan 24, 2014
సుమంత్ హీరోగా నటించిన "ఏమో గుర్రం ఎగరావచ్చు" చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్త్యంగా విడుదలకావలసింది. కానీ ఫైనాన్షియల్ సమస్యల వలన ఈ సినిమా విడుదలను ఆపేసారు. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పి.మదన్ కుమార్ నిర్మించారు. కానీ ఈ చిత్రాన్ని రేపు ఎలాగైనా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో సుమంత్ సరసన పింకీ సావిక హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్ర విడుదల మరింత వాయిదాలు పడుతుందో లేక త్వరగానే విడుదలవుతుందో చూడాలి.