English | Telugu

మోహన్ బాబు ఆలోచన అదేనా...?

మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలలో నటించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ చిత్రంలోని పాటలు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇందులో విష్ణు హన్సికతో, మనోజ్ ప్రణీతతో జతకట్టారు. వీరికి రొమాంటిక్ సన్నివేశాలతో పాటుగా పాటలు కూడా ఉన్నాయి. మరి నాకేం తక్కువ అని అనుకున్నాడో ఏమో మోహన్ బాబు కూడా తన జోడి రవీనాతో కలిసి ఓ సాంగ్ లో ఎంజాయ్ చేసాడు. ఈ సినిమాతో తను కూడా విష్ణు, మనోజ్ లకు పోటీ ఇస్థాను అనే ఆలోచనలో ఉన్నాడట మోహన్ బాబు. ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.