English | Telugu
‘రాజా సాబ్’కి సంబంధించి ఒకటి కాదు, రెండు రాబోతున్నాయి.. ఏమిటవి?
Updated : Sep 26, 2025
టాలీవుడ్ టాప్ హీరోలంతా ఒక్కొక్కరు తమ సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ థియేటర్లలోకి వచ్చేసి సందడి చేస్తోంది. ఇక రాబోయే సినిమాల్లో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజాసాబ్’పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదట ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి వాయిదా వేశారు.
త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ట్రైలర్ ఒక రేంజ్‌లో ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ ట్రైలర్‌ను కట్ చేసేందుకు ముంబై నుంచి ఒక స్పెషల్ టీమ్ హైదరాబాద్ వచ్చింది. అయితే ఇక్కడి ప్రేక్షకులకు ముంబై టీమ్ మ్యాచ్ అయ్యేలా ట్రైలర్ కట్ చేస్తుందా అనే సందేహంతో ఫైనల్‌గా ఇక్కడి వారితోనే ఆ ట్రైలర్‌ను చేయించారు.
వచ్చేవారం ‘రాజాసాబ్’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 2న కాంతార చాప్టర్1 రిలీజ్ కాబోతోంది. రాజాసాబ్ ట్రైలర్‌ను ఈ సినిమాకి ఎటాచ్ చేస్తారని తెలుస్తోంది. కాంతార చాప్టర్ 1 కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో రాజాసాబ్ ట్రైలర్ అందరికీ రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. రాజా సాబ్ సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ చేస్తే టూ ఎర్లీ అవుతుందన్న ఆలోచన కూడా టీమ్‌కి ఉంది. అందుకే సినిమా రిలీజ్ టైమ్‌కి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారట. అందుకే ఇప్పుడే రెండు ట్రైలర్స్‌ను కట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రాజాసాబ్‌కి సంబంధించి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెంచుతున్నాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న మొదటి ట్రైలర్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.