English | Telugu

ప్రభాస్ తో అభిషేక్ బచ్చన్ ఢీ!

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)తన అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ 'కేరళ' లో పాటల చిత్రీకరణలో ఉందని, ఆ తర్వాత విదేశాల్లో మరికొన్ని పాటలని చిత్రీకరించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని కూడా 'ప్రభాస్' పారలాల్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, కొన్ని షెడ్యూల్స్ ని కూడా జరుపుకుంది. పీరియాడిక్ అంశాలతో కూడిన మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ మూవీలో బాలీవుడ్ బడా హీరో 'అభిషేక్ బచ్చన్'(Abhishek Bachchan)నటించబోతున్నాడనే వార్తలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హాట్ టాపిక్ గా నిలిచాయి. ప్రభాస్ తర్వాత కథలో ఒక కీలకమైన క్యారక్టర్ ఉందని, ఆ క్యారక్టర్ కి బాలీవుడ్ హీరో అయితే సరిపోతాడని భావించి, మేకర్స్ 'అభిషేక్ బచ్చన్' ని సంప్రదించారనే వార్తలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు అభిషేక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అంటున్నారు. కొంత కాలం నుంచి హిందీ చిత్రసీమకి చెందిన హీరోలు, తెలుగు చిత్రాల్లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడనే చర్చ కూడా జరుగుతుంది.

అభిషేక్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)నట వారసుడిగా రెండున్నర దశాబ్డల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఎన్నో వైవిద్యమైన క్యారక్టర్ లని పోషించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించడం అభిషేక్ స్పెషాలిటీ. ఈ ఏడాది' హౌస్ ఫుల్ 5 ', 'కాళిధర్ లాపాతా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రాజాశివాజీ లోను టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ బాహుబలి దగ్గర్నుంచి నార్త్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి కాంబో పాన్ ఇండియా లెవల్లో సరికొత్త క్రేజ్ ని ఏర్పాటు చేసుకోవడం ఖాయం.



టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .