వివేకా కేసులో దోషులు వైఎస్ కుటుంబ సభ్యులేనా? 

వైఎస్ వివేకా కేసులో సీబీఐ ఛార్జిషీట్లు, సి.ఎం. జగన్, ఎం.పి. అవినాష్ రెడ్డి సహా వైఎస్ కుటుంబంవైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీ ప్రెస్ మీట్ వైసీపీలో కలకలం రేపుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే సొంత జిల్లా కడపలో సైతం వైసీపీ గెలుపు కష్టంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య ఎవరికి అవసరం అన్న కోణంలో ప్రచారాన్ని మార్చేందుకు వైఎస్ భారతి ఆధ్వర్యంలోని సాక్షి పత్రిక ఓ తప్పుడు కథనాన్ని వండివార్చింది. గతంలో వివేకా హత్యకు చంద్రబాబే కారణం అన్నట్లు నారాసుర రక్తచరిత్ర అంటూ కథనాలు రాసిన సాక్షి.. ఇప్పుడు తిరిగి అలాంటి పరిస్దితులే వచ్చేసరికి మరోసారి అదే ప్రచారం ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్టు మీడియాకు తెలిపారు. అనంతరం హత్యంటూ మీడియా సమావేశంలో టీడీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, మంత్రి ఆది నారాయణ రెడ్డి మీద తమకు అనుమానాలున్నాయని అన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డికి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల వల్లే ఈ హత్య జరిగిందని అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వివేకా మృతి కేసు విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. వివేకాది ‘మర్డర్ ఫర్ గెయిన్'(ల‌బ్ధి కోసం హ‌త్య‌). ఎంపీ సీటు కోసమే ఈ హ‌త్య జ‌రిగిందా?  అంటే.. ల‌బ్ధి అవినాష్‌కు క‌లిగిందనేగా?! అవినాష్ మాత్రం ‘మ‌ర్డ‌ర్ ఫ‌ర్ గెయిన్‌’  వివేకా కూతురుకు, అల్లుడికి అనే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.  అదే సాక్షి పేప‌ర్‌లో నింపేశారు.   వివేకా ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారని,  ఆమెకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని, అంతేకాకుండా.. వివేకా త‌న‌ పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడని అవినాష్ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో వివేకా ఆస్తులన్నీ ముస్లిం భార్య కుటుంబానికి వెళ్లిపోతాయని, రాజకీయ వారసులుగా వస్తారని భావించిన వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కుట్ర చేశారంటూ సాక్షి ప్ర‌చారం చేస్తోంది.  హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారని,    హత్య వెనుక‌ ఆస్తి తగాదాలు ఉన్నాయని సాక్షిలో రాశారు. అయితే.. ఈ ‘మ‌ర్డ‌ర్ ఫ‌ర్ గెయిన్‌’లో సందేహాలు అనేకం ఉన్నాయ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 1) వివేకా ముస్లిం మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్న‌ది ఇప్పుడు కాదు. వైఎస్ హ‌యాంలోనే ఆయ‌న ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత‌.. కోర్టు జోక్యంతో అంద‌రికీ తెలిసిందే. 2) అప్ప‌ట్లోనే భ‌ర‌ణం కింద‌.. ఆమెకు కొంత భూమిని ఇచ్చేశారు. సో.. ఈ విష‌యంలో ఆస్తి త‌న‌కు అవ‌స‌రం లేద‌ని ముస్లిం భార్య అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది. 3) వివేకా హ‌త్య త‌ర్వాత‌.. ముస్లిం భార్య వ‌చ్చి.. ఆయ‌న పార్థివ దేహాన్ని చూసివెళ్లారు. ఆమె ఎవ‌రిపైనా అనుమానాలు వ్య‌క్తం చేయ‌లేదు. మ‌రి ఆమెకు లేని అనుమానాలు.. అవినాష్‌కు ఎందుకు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. వివేకా కేసు మాత్రం ఇప్ప‌ట్లో కొలిక్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. క‌డ‌ప ఎంపీ సీటు హ‌త్య‌కు దారి తీసింద‌నే  గతంలో సీబీఐ వాదన వినిపించింది. వివేకా హ‌త్య కేసు: సీబీఐ తుది చార్జిషీట్  1. వివేకా హత్యకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ తెలిపింది.  హత్యకు సంబంధించిన కుట్ర కోణాన్ని వెల్లడిస్తూ సీబీఐ తాజా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.  ఈ కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్న పలువురి పేర్లు,  వారి పాత్రను కూడా సీబీఐ పేర్కొంది.  కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను  సీబీఐ కోర్టుకు వివరించింది.  గూగుల్ టేక్ అవుట్,  ఫోన్ల లొకేషన్ డేటాలు,  ఫొటోలను సమర్పించింది.  వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.  వివేకా హత్య తర్వాత ఆధారాల ధ్వంసం విషయంలో  వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు  మనోహర్ రెడ్డి కూడా సహకరించినట్లు సీబీఐ పేర్కొంది.  అయితే హత్య కుట్ర విషయంలో మాత్రం ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించలేదని తెలిపింది. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లో  వైఫై రూటర్ కు కనెక్ట్ అయిన ఫోన్లు,  వాటి లొకేషన్లు తెలుసుకుంటున్నట్లు సీబీఐ పేర్కొంది.  అలాగే వివేకా రాసిన లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు  నిన్ హైడ్రిన్ పరీక్ష చేశారు. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగానే క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని  సీబీఐ నిందుతులుగా పేర్కొంది.  ''వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత సునీల్ యాద‌వ్ లేడు.  2019, మార్చి 15న ఉద‌యం 8.05 గంట‌ల‌కు వివేకా ఇంటి బ‌య‌ట‌, 8.12 గంట‌ల‌కు ఇంటిలోప‌ల ఉన్నాడు. వివేకా హత్య కేసు ఏపీ ఎన్నికల్ని శాసించబోతోంద‌నుకోవ‌చ్చు. సునీత కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మీరీ చెప్పేశారు. అన్న‌కు ఓటు వేయ‌వ‌ద్ద‌ని. 8 కోట్ల రూపాయ‌ల‌ భూమి సెటిల్ మెంట్ కోస‌మో, లేక ఎంపి సీటు కోస‌మే వివాదం అయితే వుంది. ఆ వివాదం 2019 ఎన్నిక‌లు, 2024 ఎన్నిక‌ల్లోనూ కీల‌కం కానుంది.

మేడారం జాతర హుండీ కానుకల ఆదాయం కొత్త రికార్డు

తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన సమ్మక్క సారక్క జాతరలో హుండీ కానుకల ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ జరిగిన ఈ మహాజాతరకు కోటీ 40లక్సలకు మందిపైగా భక్తులు వనదేవతలను సందర్శించుకున్నారు. భక్తుల సంఖ్య కూడా ఈ ఏడాది కొత్త రికార్టు సృష్టించిందని అధికారులు తెలిపారు. ఇక హుండీ కానుకల ఆదాయం విషయానికి వస్తే ఈ ఏడాది జాతరలో హుండీ కానులకల ఆదాయం 13 కోట్ల పాతిక లక్షల 22 వేల 551 రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. జాతర సందదర్భంగా  540 హుండీలు ఏర్పాటు చేశారు. ఆ హుండీలలో భక్తుల వేసిన కానుకల లెక్కింపు బుధవారం (మార్చి 6)  ముగిసింది.  ధర్మాదాయ, రెవెన్యూ, సమ్మక్క సారక్క జాతర ట్రస్టు బోర్డు సభ్యుల సమక్షంలో సీసీ కెమేరాల నిఘాలో హుండీ కానుకల లెక్కింపు జరిగింది.  గత జాతర సందర్భంగా హుండీ కానుకల ఆదాయం 11 కోట్ల 64లక్షల రూపాయల ఆదాయం రాగా, ఆ సారి అది భారీగా పెరిగింది. అసలు 13 కోట్ల పాతిక లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం జాతర చరిత్రలోనే రికార్డు అని అధికారులు తెలిపారు. ఈ హుండీ కానుకల ఆదాయాన్ని 1, 3 నిష్పత్తిలో పూజారులు దేవాదాయ శాఖకు జమ అవుతాయి. ఈ కానుకలలో బంగారం, వెండి కూడా ఉన్నాయి.  

జగన్ పుట్టి ముంచనున్న వివేకా హత్య కేసు?.. కడప ఫలితమే తేల్చేస్తుందా?

ఏపీలో ఎన్నికలకు నిండా రెండు నెలల సమయం కూడా లేదు.  పొలిటికల్ హీట్స్ రాష్ట్రంలో ఎప్పుడో పీక్స్ కు చేరింది.  విజయం సాధించి అధికారాన్ని చేపట్టేది ఎవరన్న విషయంలో కూడా ఇప్పుడు ప్రజలే కాదు, పొలిటికల్ పార్టీలూ ఓ అంచానకు వచ్చేశాయి. ఒకటి రెండు స్థానాల తేడా తప్ప గెలుపు ఓటముల విషయం ఇప్పటికే అందరికీ అవగతమైపోయింది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఏపీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది బహిరంగ రహస్యంగా మారిపోయిన తరుణంలో ఈ ఎన్నికలలో కడప లోక్ సభ స్థానంలో గెలుపు ఒక కేసులో ప్రజాతీర్పు ఎటువైపు ఉందన్న విషయాన్ని కూడా తేల్చేయనుంది. ఆ సీటు కడప లోక్ సభ స్థానం. ఆ స్థానంలో విజయం ద్వారా న్యాయస్థానాల తీర్పులతో పని లేకుండా వివేకా హత్య కేసులో నిందితులు, నేరస్తులు ఎవరు అన్న విషయంలో ప్రజల తీర్పు ఏమిటన్నది కూడా తేలిపోనున్నది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. కారణాలేమైతేనేం అరెస్టు కాకుండా దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇక ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణభయం ఉంది మొర్రో అని మొరపెట్టుకుంటున్నారు. భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ కేసులో కీలక నిందితులు తనను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులూ చేస్తున్నారు. వివేకా హత్య జరిగిన నాటి నుంచీ ఈ కేసు దర్యాప్తులో అనేకానేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన వెంటనే ఎవరిమీదైతే అప్పటికి విపక్షంలో ఉన్న వైసీపీ అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించింది. అప్పటి విపక్ష నేత జగన్.. సొంత బాబాయ్ ని పొట్టన పెట్టుకున్నారంటూ శోనక్నాలు పెట్టి ప్రజా సానుభూతిని సంపాదించుకున్నారు. చివరికి ఆ సానుభూతే ఆయనకు అధికార పీఠవ తక్కేలా చేసింది. అయితే  తీరా అధికారంలోకి వచ్చాకా.. ఆరోపణలన్నీ రివర్స్ అయ్యాయి. అప్పట్లో జగన్ అండ్ కో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై వివేకా హత్య వెనుక వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన  జగన్ అండ్ కో  ఆ తరువాత అంటే అధకారంలోకి వచ్చిన తరువాత తన ఆరోపణలను చాపచుట్టూసినట్లు చుట్టేసింది. అంతే కాదు విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ అండ్ కొ  అధికారం చేతికి వచ్చిన తరువాత స్వయంగా సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ తన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకుంది. ఆ తరువాత వైఎస్ వివేకా కుమార్తె పట్టుదలతో న్యాయం కోసం  సాగించిన అపుపెరుగని పోరాటం ఫలితంగా వివేకా హత్్ కేుసు సీబీఐ చేతికి వెళ్లింది. ఆ దర్యాప్తునకు అడుగడుగునా జగన్ తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై పులివెందులలో దాడి యత్నాలు జరిగాయి. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడ్డారు. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు నమోదయ్యాయి. దీంతో మళ్లీ మరోసారి వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యేలా చేశారు. మొత్తంగా ఈ కేసులో  సీబీఐ దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులెవరన్న విషయంలో జన బాహుళ్యంలో ఒక స్పష్టత వచ్చింది. ఇంటి దొంగలే వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్నారన్న అనుమానాలు నిరాధారమైనవేమీ కావన్న స్పష్టత వచ్చింది.    కడప లోక్ సభ అభ్యర్థి విషయంలో వచ్చిన విభేదాలే వివేకా హత్యకు మోటివ్ గా సీబీఐ దర్యాప్తు తేల్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారు. వివేకా కుమార్తె సునీత కూడా తన అన్న అధికారంలో ఉండగా తన తండ్రి హత్య కేసు తేలే అవకాశాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే అన్నకు వ్యతిరేకంగా హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు.   ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసులో ప్రజా తీర్పు ఏమిటన్నది ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం తేల్చేస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి ప్రజల మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు క్లైమాక్స్ కు వచ్చేసినట్లూనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు కూడా ఒకటి .. ఇప్పుడు అదే హత్యకేసు అధికార వైసీపీ పుట్టి ముంచుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకున్న జగన్, ఆయన పార్టీకి ఇప్పుడు అదే హత్య కేసు రివర్స్ లో చుట్టుకుంది.   అప్పుడు వైసీపీ ఈ కేసును ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు  రివర్స్ లో జగన్, ఆయన పార్టీని  కోలుకోలేని విధంగా దెబ్బతీయబోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీయనున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఈ కేసులో అవినాష్ కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డడాన్ని జనం గమనించారని అంటున్నారు.    అందుకే నాడు జగన్ కు జనం సానుభూతిని తెచ్చిపెట్టిన వివేకా హత్య కేసే ఇప్పుడు ఆయనపై జనాగ్రహం అస్త్రంలా దూసుకు రావడానికి కారణమౌతుందంటున్నారు. 

రేవంత్ రెడ్డికి చుక్కెదురు... దాసోజ్ శ్రావణ్ , కూర సత్యనారాయణలకు ఊరట 

గత బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ పక్కన పెట్టి నూతన కాంగ్రెస్ ప్రభుత్వ సిఫారసుల ప్రకారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నియమించడం  సరి కాదని తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి పరాభవం అని విశ్లేషకులు చెబుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నియామ‌కంపై హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. కోదండ‌రామ్, అమీర్ అలీఖాన్‌ల‌ను నియ‌మిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల జారీ చేసిన‌ గెజిట్‌ను కొట్టిపారేసింది. కొత్త‌గా ఎమ్మెల్సీల నియామ‌కం చేప‌ట్టాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. మంత్రి మండ‌లి నిర్ణ‌యానికి గ‌వ‌ర్న‌ర్ క‌ట్టుబ‌డి ఉండాల‌ని సూచించింది. ఎమ్మెల్సీల నియామ‌కంపై ప్ర‌భుత్వం పున స‌మీక్షించుకోవాల‌ని కోర్టు తెలిపింది. ఇక హైకోర్టు తాజా తీర్పుతో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది.   బీఆర్‌ఎస్‌ లీడర్లు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణకు హైకోర్టులో ఊరట లభించింది.  వీళ్లిద్దరి ఎమ్మెల్సీ దరఖాస్తులను పునఃపరిశీలించాలని గవర్నర్‌ తమిళిసైకు హైకోర్టు సూచించింది. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా చేయాలని గత ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

చంద్ర‌బాబు బిగ్ స్కెచ్‌.. కదులుతున్న తాడేపల్లి ప్యాలెస్ పునాదులు!?

ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఐదేళ్లుగా క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ‌ద్దెదింపేందుకు అన్నివ‌ర్గాలు ఏక‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతోపాటు, తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో వైసీపీ ఇప్పటికే గెలుపు ఆశలను వదిలేసుకుంది. అయితే రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ గ్రాఫ్ దిగజారిపోతున్నదన్న సంకేతాలు బలంగా వస్తుండటంతో ఓటమి ఎంత ఘోరంగా ఉండబోతోందో అన్న ఆందోళ‌న‌కు    వైసీపీ నేత‌లు గురౌతున్నారు.   తాజాగా మాజీ మంత్రి, జగన్ కు సొంత బాబాయ్ అయిన దివంగత  వివేకానంద‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నేత‌లు , ముఖ్యంగా జగన్ కు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు బెంబేలెత్తిపోతున్నారు.  రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వానికి ఎదురు  గాలి వీస్తుండ‌టంతో ఆ పార్టీని వీడుతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల కారణంగా అన్నివైపుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న క్ర‌మంలో..  ఆయ‌న సొంత జిల్లా అయిన ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో  వైసీపీ కోట‌కు కూడా బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు చ‌ర‌మ‌గీతంపాడేందుకు ఆయన  కుటుంబ స‌భ్యులు సైతం రంగంలోకి దిగ‌బోతున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య‌ తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.  బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపై నెట్టేసిన‌ జ‌గ‌న్.. గ‌త ఎన్నిక‌ల్లో  సానుభూతితో విజ‌యం సాధించారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా తన అధికారాన్నంతా వినియోగించి మరీ అడ్డుకున్నారు. అయితే  వివేకా హ‌త్య‌కు కార‌కులు జ‌గ‌న్ కు ద‌గ్గ‌రి వ్య‌క్తులేన‌ని  ఇంత వరకూ జరిగిన దర్యాప్తులో సందేహాలకు అతీతంగా తేల‌డంతో వైసీపీ శ్రేణులు సైతం షాక్ కు గుర‌య్యారు. ఎంపీ సీటుకోస‌మే అవినాశ్ రెడ్డి త‌న తండ్రిని హ‌త్య‌చేశారని, ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయ‌ని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆవేద‌న వ్య‌క్తం చేస్తూన్నారు.  వివేకా హ‌త్య లో దోషుల‌కు శిక్షప‌డేలా కోర్టుల్లో త‌న‌ వాద‌న‌లు వినిపిస్తూనే..  మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా సునీతారెడ్డి అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. అయితే  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న రాజ‌కీయ బలం, అధికార బలంతో ఈ కేసు ముందుకుసాగ‌కుండా, దోషుల‌కు శిక్ష‌ప‌డ‌కుండా అడ్డుకుంటూ వ‌స్తున్నారు. రాజ‌కీయంగా బ‌లం లేక‌పోవ‌టం వ‌ల్ల‌నే త‌న తండ్రి హ‌త్య‌కేసులో నిందితుల‌కు శిక్ష‌ప‌డేలా చేయ‌లేక పోతున్నాన‌ని సునీతా, ఆమె కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు వివేకానంద‌రెడ్డి కుటుంబ స‌భ్యులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.  వివేకా హ‌త్య కేసులో నిందితుల‌కు శిక్ష‌ప‌డేలా చేయాలంటే రాజ‌కీయ అండ‌దండ‌లుకూడా అవ‌స‌రమ‌ని భావిస్తున్న వివేకానంద రెడ్డి కుటుంబ స‌భ్యులు.. క‌డప లోక్ సభ స్థానం నుంచి  వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు   సిద్ధ‌మ‌వుతున్నారు. వివేకానంద కుమార్తె సునీతారెడ్డి లేదా ఆయ‌న‌ భార్య సౌభాగ్య‌మ్మ  బ‌రిలో నిలుస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా వివేకానంద‌రెడ్డి భార్య సౌభాగ్యమ్మ‌ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. తొలుత ఇండిపెండెంట్ గా పోటీచేయాల‌ని వారు భావించినా ఏపీ కాంగ్రెస్  అధ్యక్షురాలు ష‌ర్మిల సూచ‌న‌ల మేర‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే ఏపీలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను సౌభాగ్యమ్మకు ఈ విషయంలో పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమని స్పష్టత ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే సౌభాగ్యమ్య కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న సమాచరంతో  వైసీపీ పెద్ద‌లు వ‌ణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.   జ‌గన్ సొంత జిల్లా అయిన ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోనూ వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా వివేకానంద హ‌త్య‌ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి జగన్ అండ ఉందని జనం నమ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో వివేకా కుటుంబ స‌భ్యులు క‌డ‌ప పార్ల‌మెంట్ నుంచి బ‌రిలో నిలిస్తే వారి విజయం నల్లేరు మీద బండినడకే అవుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  దీంతో వివేకానంద‌రెడ్డి భార్య క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆమె ఇండిపెండెంట్ గా లేదా, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీచేయాల‌ని తొలుత భావించారు. కానీ, జ‌గ‌న్ అధికార బ‌లంతో, బెదిరింపుల‌కు పాల్ప‌డి ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకుంటార‌న్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ అధికార బ‌లాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొట్టాలంటే ఒక్క తెలుగుదేశంతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని వివేకా కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ట‌. ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ప‌నిచేస్తున్నాయి. నేడో రేపో బీజేపీకూడా ఈ కూటమితో క‌లిసే అవ‌కాశం ఉంది. ఈ మూడు పార్టీల మ‌ద్ద‌తుతో క‌డ‌ప లోక్ సభ స్థానం నుంచి వివేకానందరెడ్డి భార్య  పోటీచేస్తే విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుందని వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.  చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం అందుకు స‌ముఖంగా ఉండ‌టంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివేకానంద స‌తీమ‌ణి క‌డ‌ప పార్ల‌మెంట్  స్థానం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌డం దాదాపు ఖాయ‌మైంద‌న్నచ‌ర్చ‌ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. వివేకా కుటుంబం తాజా నిర్ణ‌యంతో తాడేప‌ల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు 

నొప్పింపక.. తానొప్పక.. తప్పించుకు తిరుగువాడు.. ధన్యుడు సుమతి! అది అప్పట్లో కావచ్చు..! కానీ ఇప్పుడు..! తప్పించకుండా.. పట్టించుకోకుండా... తన పని తాను చేసుకుపోతే మాత్రం న్యాయస్థానాలు ఊరుకోవడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  విషయంలో అదే జరిగింది.   లిక్కర్ పాలసీ విచారణ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, ఈడీకి మధ్య డ్రామా కొసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, పలు కారణాలను చూపుతూ విచారణకు కేజ్రీవాల్ వెళ్లడం లేదు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ అధికారులు మరోసారి ఆశ్రయించారు. తాము ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తనకు జారీ చేస్తున్న సమన్లకు సంబంధించి ఈడీకి ఇటీవల కేజ్రీవాల్ లేఖ రాశారు. అసెంబ్లీలో బలపరీక్ష ఉన్నందున విచారణకు హాజరుకాలేనని తెలిపారు. మార్చి 12 తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధమేనని చెప్పారు. విచారణకు ప్రత్యక్షంగా కాకుండా, వర్చువల్ గా హాజరవుతానని తెలిపారు. అయితే, కేజ్రీవాల్ ప్రతిపాదనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు సహరించడం లేదని కోర్టులో మరోసారి పిటిషన్ వేశారు.

జగన్ కు వాసిరెడ్డి పద్మ షాక్

ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పాపం విజయసాయి.. కార్ల ర్యాలీకి కార్యకర్తలే లేని దుస్థితి!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్  విడుదల కావడానికి పది రోజుల సమయం కూడా లేని తరుణంలో రాజకీయ పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలతో ఎన్నికలలో విజయం లక్ష్యంగా తమ తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికలకు సమాయత్తం అయ్యే విషయంలో ఒక వెసులు బాటు ఉంటుంది. షెడ్యూల్ విడుదలవ్వడానికి ముందే.. కొత్త పథకాల ప్రకటన, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఇలా ప్రజలకు చేరువకావడానికి చేయాల్సినదంతా చేసే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు దేశమంతా సుడిగాలి పర్యటేనలు చేస్తూ లక్షల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేసేస్తున్నారు. పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కూడా మోగించేశారు.  అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మాత్రం గత ఐదేళ్లలో చేసిందేమిటో చెప్పుకోలేక, జనంలోకి వెళ్లలేక సతమతమౌతోంది. అంతేనా అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో క్లారిటీ లేక మల్లగుల్లాలు పడుతోంది. గెలుపు గుర్రాలు కాదంటూ సిట్టింగులను మార్చేస్తూ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తోంది. మళ్లీ  ఆ మార్పులను మార్చేస్తూ అసలు వచ్చే ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలో తెలియని అయోమయంలో ఉంది. పార్టీ పరాజయాన్ని ముందుగానే ఊహించేసి పలువురు సిట్టింగులు పక్క పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. వలసలను ఆపలేక, సొంత పార్టీ శ్రేణుల విశ్వసనీయతను పొందలేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో గెలుపు వ్యూహాల పేరిట చేస్తున్న కసరత్తులు సర్కస్ ను తలపిస్తున్నాయి.  ఇప్పటి వరకూ పదికి ఒకటి తక్కువగా తొమ్మిది జాబితాలు విడుదల చేసి కూడా వంద మంది అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయిన జగన్.. శ్రేణుల్లో పార్టీని మళ్లీ మరొక సారి అధికారంలోకి తీసుకురాగలరన్న నమ్మకాన్ని కోల్పోయారు. పార్టీ అభ్యర్థులను గెలిపించగలనన్న ధీమా లేని వ్యక్తి పార్టీ నేతగా ఎందుకన్న ప్రశ్న పార్టీ కార్యకర్తల నుంచే వస్తోందంటే జగన్ పరిస్థితి ఏమిటో ఉహించవచ్చు. ఇక గత ఎన్నికలలో  నెల్లూరు జిల్లాలో  జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో అక్కడ ఈ సారి ఎన్నికలలో గతంతో వచ్చిన ఫలితం రివర్స్ అవుతుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే జగన్ అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి ఎదురీతగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలలో కూడా పార్టీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ వ్యూహాత్మకంగా ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా పదేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా చక్రం తిప్పుతున్న పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా రంగంలోకి దింపారు. ఆయన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రభ మళ్లీ వెలుగుతుందని ఆశించారు. కానీ ఆ ఆశ మొగ్గలోనే వాడిపోయిందని పరిశీలకులు అంటున్నారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఖరారైన తరువాత విజయసాయి రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఉలవపాడు నుంచి ఈ ర్యాలీని ప్రారంభించేందుకు పక్కా ప్రణాళిక కూడా రచించారు. అయితే 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని తలచిన ఆయనకు పార్టీ క్యాడర్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో కంగుతిన్నారు. కారుకు కనీసం ఒకరిద్దరు కూడా ఉండే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలలో నిలబడితే ఆయన ఫేట్ ఏమిటో  అభ్యర్థిగా ఖరారైన రోజే తేలిపోయింది. దీంతో  భారీ ర్యాలీని విరమించుకుని సాదాసీదాగా నియోజకవర్గంలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కీలక నేత పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన నియోజకవర్గాలలో అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నది ఊహకు అందనిదేమీ కాదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.   సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభలకే డబ్బులిచ్చి, మద్యం పోసి మరీ జనాలను తరలించాల్సిన పరిస్థితి ఉందనీ, క్యాడర్ కూడా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదనీ వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే.. ఎన్నికలలో విజయం సంగతి తరువాత ముందు అభ్యర్థుల దొరుకుతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. 

బెంగళూరు పేలుడు ఘటన.. రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాట సరికాదు!

దేశంలో అత్యంత ప్రశాంతమైన, శాంతియుత నగరాల్లో  ముందువరుసలో ఉండే బేంగళఊరు ఉగ్రదాడితో ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ సంఘటన నిఘావర్గాల వైఫల్యాలను కళ్లకుకట్టింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మన భద్రత డొల్ల తనాన్ని సందేహాలకు అతీతంగా బట్టబయలు చేసింది. ఔను బెంగళూరు బ్రూక్ షీల్డ్ లోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగి రోజులు గడుస్తున్నా.. ఈ పేలుడు వెనుక ఉన్న ఉగ్ర సంస్థ, పేలుడుకు కారణమైన వ్యక్తి వంటి వివరాలు తెలియరాలేదంటూ మన నిఘా, దర్యాప్తు సంస్థల పనితీరు ఎంత దివ్యంగా ఉందో అర్ధమౌతోంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించిన తరువాత కూడా వీసమెత్తు అయినా పేలుడు వెనుక శక్తులు, పేలుడు మోటివ్ వంటివి ఏవీ కనుగొనలేకపోయింది.  ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పేలుడు తీవ్రత, అది జరిగిన ప్రదేశం గమనిస్తే దీనిని ఆషామాషీగా తీసుకోవడానికి ఎంత మాత్రం వీలులేదన్న సంగతి బోధపడుతుంది.  ఈ పేలుడు ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.  దేశంలోనే అత్యంత ప్రశాంతమైన నగరంగా పేరున్న బెంగళూరులో ప్రశాంతత  నేతిబీరకాయలో నేతి చందమేనని రుజువైపోయింది.   జనసమ్మర్దం అధికంగా  ఉన్న ప్రాంతంలో పేలుడుకు పాల్పడటం వెనుక ముష్కరుల ఉద్దేశం ఏమిటన్నది తపేలుడు పరికరాన్ని అమర్చడం వెనుక దుండగుల ఉద్దేశం ఏమిటన్నది అర్థమైపోతూనే ఉంది. మొదట్లో ఈ దుర్ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందనో, వ్యాపార కక్షల వల్ల జరిగిందనో భావించారు. కొద్దిపాటి దర్యాప్తు అనంతరం దుండగుల అసలు ఉద్దేశం అర్థమైపోయింది. ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన తరువాత మాత్రమే ఈ పేలుడు వెనుక ఐఎస్ఐ హస్తం ఉందన్న సంగతి బయటపడింది. బెంగళూరు పోలీసులు తమ దర్యాప్తులో ఇది కుక్కర్ పేలుడనీ,  నాలుగేళ్ల కిందట .. అంటే 2020  మంగళూరులో జరిగిన కుక్కర్‌ పేలుడుకూ పోలిక ఉందని తెలిపారు అప్పుడు ఉపయోగించిన పేలుడు పరికరాన్ని, పేలుడు పదార్థాన్ని, టైమర్‌ నే ఇప్పుడు కూడా ఉపయోగించడం జరిగిందని చెబుతున్నారు.  బెంగళూరు పేలుడుపై దర్యాప్తు ప్రారంభించిన నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోయంబత్తూరు పేలుళ్లకు, బెంగళూరు, మంగళూరు పేలుళ్లకు సంబంధం ఉందని, పేలుడు జరిగిన తీరును బట్టి ఇది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐ.ఎస్‌) వ్యవహారంగా స్పష్టమౌతోందని   వెల్లడించింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం  ఐఎస్‌ఐ ప్రమేయాన్ని కొట్టి పారేస్తున్నారు. వ్యవహారమన్న అభిప్రాయానికి రాలేమని, తాము అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  మామూలుగా ఉగ్ర దాడులు వంటి విషయాలలో ఎన్ఐఏ దర్యాప్తుపైనే విశ్వసనీయత ఉంటుంది. కానీ రాజకీయ కారణాలతో కర్నాటక ప్రభుత్వం నగర పోలీసుల అభిప్రాయాన్నే పెద్దగా ప్రచారం చేస్తున్నది. బెంగళూరు లాంటి ప్రశాంతమైన నగరంలో ఐఎస్ఐ దాడులు జరిగే అవకాశం లేదని ఆ రాస్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు.  తొలుత ఆయన కూడా ఇది కుక్కర్ బాంబు పేలుడేనని ప్రకటన  కూడా జారీ చేశారు. అయితే ఎన్ఐఏ దర్యాప్తులో  బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ సంఘటనకు బాధ్యుడైన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని కడపలో అరెస్టు చేడయమే కాదు, అతడు  పి.ఎఫ్‌.ఐకి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు.   పి.ఎఫ్‌.ఐకి, ఐ.ఎస్‌ కి సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే.   నిజానిjr బేంగళూరు పేలుడు ఘటనపై  పూర్తి స్థాయి దర్యాప్తు జరగక ముందే బెంగళూరు పోలీసులు కుక్కర్ బాంబు పేలుడుగా ప్రకటించేయడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే చెప్పేయడం తొందరపాటే అవుతుంది. ఎన్నికల వేళ దేశంలో ఉగ్రకదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి.  బెంగళూరు పేలుడు ఘటనలో రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాట కోసం ప్రయత్నించే కంటే.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. అలాగే బేంగళూరు ఘటనలో నిజానిజాలు బయటపడేంత వరకూ దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమే మంచిది. 

చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌రికొత్త వ్యూహం.. వైసీపీ మైండ్ బ్లాక్!

ఏపీలో మ‌రి కొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీని చిత్తుగా ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా  తెలుగుదేశం, జనసేన కూటమి అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీ విజయం సాధించకూడదనీ, ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడో ప్రకటించారు. అందుకోసం తెలుగుదేశంతో కలిసి ముందుకు సాగడమే మార్గమని నిర్ణయించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.  అంతే కాకుండా  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌ల డోస్ ను తీవ్ర‌త‌రం చేశారు. జ‌గ‌న్ కు స‌రైన మొగుడ్నినేనే.. పాతాళాకి తొక్కేస్తానంటూ ప‌వ‌న్ హెచ్చ‌రిక‌లు సైతం జారీ చేశారు. ఇప్ప‌టికే  తెలుగుదేశం అధినేత‌ చంద్ర‌బాబు, లోకేశ్ ల దూకుడుతో బెంబేలెత్తిపోతున్న వైసీపీ శ్రేణులు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా తోడుకావ‌డంతో తమ పార్టీ ఓటమి  ప‌క్కా అనే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ను ఎదుర్కొనేందుకు జ‌గ‌న్, వైసీపీ పెద్ద‌లు అనేక‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ అవి ఎలాంటి ఫ‌లితాల‌ను ఇవ్వ‌క‌పోవ‌టం వైసీపీ శ్రేణుల‌ను మ‌రింత క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. దీంతో చాలా మంది నేత‌లు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఓ భ‌యం వెంటాడుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్లా ఓడిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈసారి ఎలాగైనా చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగు పెట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే, తెలుగుదేశం బ‌లం తోడుకావ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ట్ట‌సభ‌లో  అడుగు పెట్ట‌డం ఖాయ‌మ‌ని జ‌న‌సైనికులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక‌లెక్కైతే.. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్  రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారనీ, అందులో ఒకటి లోక్ సభ స్థానం అయితే మరొకటి అసెంబ్లీ స్థానం అంటూ వస్తున్న సమాచారం వైసీపీ శ్రేణుల‌ను కలవరానికి గురి చేయడమే కాకుండా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఒంట‌రిగా పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో గాజువాక, భీమవరం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు చోట్లా ప‌రాజ‌యం పాల‌య్యారు. జ‌న‌సేన పార్టీ కేవ‌లం ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ ఎమ్మెల్యే సైతం కొద్దిరోజుల‌కే వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈసారి ఎలాగైనా జ‌న‌సేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని ప‌వ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో  తెలుగుదేశంతో క‌లిసి ఎన్నిక‌లో బ‌రిలోకి దిగుతున్నారు. వీరికి బీజేపీకూడా తోడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. జ‌న‌సేన పార్టీ త‌ర‌పున 24 మంది అభ్య‌ర్థులు అసెంబ్లీ , ముగ్గురు పార్ల‌మెంట్ బ‌రిలో దిగ‌నున్నారు.  అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. తొలుత కాకినాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ అసెంబ్లీ బ‌రిలో నిలుస్తార‌ని, ఆ తరువాత అనంతరం లేదా భీమవరంలో పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా పిఠాపురం నుంచి ప‌వ‌న్ బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని, అక్క‌డ ఇల్లు కొనుగోలు చేసేందుకూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని జ‌న‌సైనికులు పేర్కొంటున్నారు. దీనికితోడు ప‌లు ద‌ఫాలుగా ప‌వ‌న్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యావ‌కాశాల‌పై స‌ర్వేలుసైతం నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు స‌మాచారం.  పవన్ క‌ల్యాణ్ అసెంబ్లీ స్థానంతోపాటు.. లోక్ సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయబోతున్నారనే విషయం తెలిసి వైసీపీ నేతలు ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తుండ‌గా.. ఎంపీ అభ్య‌ర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ప‌వ‌న్‌ ఉన్నారని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ, నాగ‌బాబు అచ్యుతాపురంలో   ఇంటినికూడా ఖాళీ చేయడంతో ఆయ‌న అనకాపల్లి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తప్పుకున్నారని, ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ప‌వ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక  చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహం ఉందని అంటున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ లోక్ సభ బరిలో దిగే విషయమై  ప‌వ‌న్ టీడీపీ అదినేత చంద్ర‌బాబు, బీజేపీ పెద్ద‌ల‌తో  సైతం చర్చించినట్లు తెలుస్తోంది.   ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంతోపాటు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచికూడా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌టం వెనుక పెద్ద ప్లానే ఉంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లగా పవన్ కల్యాణ్ ఆ కూటమికి బయట నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే, విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య విబేధాలు త‌లెత్తాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ కూడా కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు. అప్పట్లో ఏర్పడిన సమన్వయలోపం పునరావృతం కాకుండా ఉండాలంటే తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి బలమైన నాయకుడిగా పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు, ప‌వ‌న్ బీజేపీ పెద్ద‌ల‌తో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నార‌ని స‌మాచారం. రాష్ట్రంలో తెలుగుదేశం , జనసేన కూటమి అధికారం ఖరారైపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు చూసుకుంటారని, కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాల విషయంలో ప‌వ‌న్ అన్ని అంశాల‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను భుజానికెత్తుకుంటార‌ని తెలుస్తోంది. దీంతో అటు కేంద్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇటు రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ప‌క్కా ప్లాన్ తో బీజేపీతో క‌లిసి ముందుకెళ్త‌ున్నారని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. పవన్ లోక్ సభ బరిలోకి దిగడం అంటే బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం ఖాయమని అంటున్నారు. అంటే బీజేపీ దూరంగా ఉంటుందన్న జగన్ చివరి ఆశ కూడా ఆవిరైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు ఇటీవల కాలంలో ఎంతగా ప్రయత్నిస్తున్నా మోడీ అప్పాయింట్ మెంట్ దొరకకపోవడానికి ఇదే కారణమై ఉంటుందని చెబుతున్నారు. 

బీజేపీలో కుమ్ములాట‌. .. తెలంగాణా గ‌ట్టుమీద క‌మ‌లం విక‌సిస్తుందా

అసెంబ్లీ ఎన్నికల్లో  8 సీట్లు గెల్చి14 శాతం ఓట్లు కూడా తెచ్చుకున్న బీజేపీ  లోక్ సభ ఎన్నికలపై  దృష్టి సారించింది.  కనీసం రెండంకెల సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. మొత్తం 17 సీట్లు ఉండగా, 10 నుండి 12 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  8 సీట్లు గెల్చి14 శాతం ఓట్లు కూడా తెచ్చుకున్న బీజేపీ  లోక్ సభ ఎన్నికలపై  దృష్టి సారించింది.  కనీసం రెండంకెల సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. మొత్తం 17 సీట్లు ఉండగా, 10 నుండి 12 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొదటగా రామమందిర సెంటిమెంట్‌ను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ నుంచి అయోధ్యకు  17 ప్రత్యేక రైళ్లను నడపారు.  ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000మంది ఉచితంగా అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించారు.  తెలంగాణాలో బిజెపి ప‌ద్మ‌వ్యూహంతో దూసుకు వెళుతుంద‌ట‌. అయితే పార్టీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న కుమ్ములాట‌.... సీనియ‌ర్లు వ‌ర్సెస్ వ‌ల‌స‌నేత‌ల మ‌ధ్య యుద్ధ‌మే జ‌రుగుతోంద‌ని చెప్పుకోవ‌చ్చు.  వలస నేతలకే బీజేపీ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తోంది?  వలస నేతలకే టిక్కెట్లు కేటాయించ‌డంతో తెలంగాణ బీజేపీ సీనియర్లు నేత‌లు రగిలిపోతున్నారు. తొలి విడత టికెట్ల పంపకం తర్వాత బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…బీజేపీ పూర్తిగా తమ వారి కంటే బయట వారినే ఎక్కువగా నమ్ముకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.     బంగారు శృతి: బీజేపీ తెలంగాణ శాఖలో టికెట్ల చిచ్చు చెలరేగుతున్నది.  ఇన్నాళ్లూ కష్టమొచ్చినా..నష్టమొచ్చినా పార్టీనే అట్టిపెట్టుకుని ఉన్న  బంగారు శృతి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా వెళ్లి కలవటం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఆమె త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారమూ జరుగుతున్నది.  డీకే అరుణ వర్సెస్‌ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర టికెట్‌ తనకంటే తనకే అంటుండటంతో డీకే అరుణ వర్సెస్‌ జితేందర్‌రెడ్డి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తాజా ఎంపీ బీబీ పాటిల్‌కు రాత్రికి రాత్రే టికెట్‌ ఖరారు చేశారు.  పోతుగంటి రాములు కుమారుడికీ చాన్సిచ్చారు.  మురళీధర్‌రావు మల్కాజిగిరి స్థానం దక్కకపోవటంపై పార్టీలో హార్డ్‌కోర్‌ నాయకుడిగా పేరున్న మురళీధర్‌రావు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.  కూన శ్రీశైలంగౌడ్‌,  తూళ్ల వీరేందర్‌గౌడ్‌ బీజేపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  వీరేందర్ గౌడ్ కు అసెంబ్లీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు.  ఈ సారి తమకే టికెట్లు అని పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న  సోయం బాపూరావు,  డీకే అరుణ,  రఘునందన్‌రావు టికెట్‌ ఖరారు చేయకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు.  మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వలస నేతలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. నల్లగొండ నుంచి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని,  ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీ నామానాగేశ్వర్‌రావును,  మహబూబాబాద్‌ నుంచి తాజా బీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కాదంటే హుస్సేన్‌ నాయక్‌,  వరంగల్‌ నుంచి ఆరూరు రమేశ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.  ఇప్పటికే రాష్ట్ర కీలక నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు.

లోక్ సభ ఎన్నికల రేసులో బీఆర్ఎస్ ఫేడౌట్!?

లోక్ సభ ఎన్నికల రేసులో బీఆర్ఎస్ ఫేడౌట్ అయిపోయిందా? అంటే పరిశీలకులే కాదు.. పార్టీ శ్రేణులూ ఔననే అంటున్నారు.  అధికారంలో ఉన్నంత కాలం కంటి చూపుతో  రాష్ట్ర రాజకీయాలను  శాసించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు కనీసం తన పార్టీ నేతలను, క్యాడర్ ను కూడా కదిలించలేకపోతున్నారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమైన కేసీఆర్.. ఒక్క ఓటమితో పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాజయం పాలైన మూడు నెలలలోనే  బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్ధితులు నెలకొన్నాయని అంటున్నారు. ఓటమి నుంచి తేరుకుని లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన తరుణంలో పార్టీలో వలసలు ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉందో అవగతమయ్యేలా చేస్తున్నాయంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 స్థానాలలో నిలబడేందుకు అభ్యర్థులే దొరకని దయనీయ స్థితికి పార్టీ దిగజారిపోవడం నాయకత్వ లోపంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే అధినేత దర్శనం దుర్లభం అనే పరిస్థితులు ఉంటే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైందని అంటున్నారు. ఇప్పుడు అధినేత ఆదేశించినా నేతలు వినే పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు. ఏకంగా గత ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్యేలే పక్క చూపులు చూస్తున్నారంటే పార్టీ నాయకత్వంపై వారి విశ్వసం ఎంతగా సన్నిగిల్లిందో అర్ధమౌతోందంటున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీలు కూడా ఎన్నికల ముంగిట పార్టీని వీడుతున్నారంటే.. ఆ పార్టలో ఉండి పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు లేవన్నది స్పష్టంగా అవగతమౌతోంది. ఇప్పటికే  ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలేశారు. ఇక చేవెళ్ల ఎంపీ అయితే తాను పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. అంటే సిట్టింగ్ ఎంపీలలో నలుగురు కాడె వదిలేసినట్లేనని చెప్పవచ్చు. ఇంకా మహమూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ కూడా టికెట్ ప్రకటించినా పోటీ చేస్తారన్న నమ్మకం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.  ఇప్పటికే టికెట్ ఖరారు చేసిన నామా నాగేశ్వరరావు బీజేపీ వైపు చూస్తున్నారు.  మొత్తంగా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టేందుకే బీఆర్ఎస్ అధినేత నానా కష్టాలూ పడుతున్న పరిస్థితి చూస్తుంటే లోక్ సభ ఎన్నికల రేసులోంచి బీఆర్ఎస్ పూర్తిగా ఫేడౌట్ అయిపోయినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం డిఫాక్టో సీఎంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు వంటి నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకోకుండా, కేవలం ప్రకటనలు, విమర్శలకు పరిమితమౌతుండటం చూస్తుంటే.. బీఆర్ఎస్ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. 

మోడీ అప్పాయింట్ కోసం జగన్ పడిగాపులు?.. పక్షం రోజులుగా ఎదురుచూపులు!

గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా అప్పులు చేయడానికీ, అప్పుల పరిమితితో సంబంధం లేకుండా రుణాలు పొందడానికి జగన్ కు అన్ని విధాలుగా సహకారం అందించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ముఖం చాటేస్తోందా? అసలు ఏపీ సీఎం కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకే మోడీ సుముఖంగా లేరా అంటే గత పక్షం రోజులుగా పరిస్థితిని గమనిస్తున్న పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో పది పదిహేను రోజుల లోపే వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రకటన వెలువడేలోగానే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే తన  ఐదేళ్ల పాలనను చూసిన జనం కేవలం ప్రకటనలను నమ్మరన్న భావన కూడా ఆయనలో బలంగా ఉంది. అందుకే కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఏదో మేరకు ఆ పథకాల లబ్ధిదారులను సొమ్ములను పందేరం చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని నడపడానికే కటకటలాడుతున్న పరిస్థితుల్లో కొత్త పథకాల పందేరానికి తీవ్రమైన నిధుల కొరత ఉండటంతో రుణం కోసం డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసినా, కోట్లకు కోట్ల ప్రతి నెలా అప్పులు తీసుకువచ్చినా ఏ నెలకానెల గడవడమే గగనంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి ఎవరూ అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. చివరాఖరికి సెక్రటేరియెట్ ను కూడా తాకట్టు పెట్టేసిన జగన్ నిర్వాకాన్ని చూసి ఆర్థిక నిపుణులు సైతం ముక్కున వేలేసుకుని,  నోటమాట రాక నివ్వెరపోతున్న పరిస్థితి. సర్వ నిబంధనలకూ తిలోదకాలోదిలేసి జగన్ ఈ ఐదేళ్లుగా సాగించిన ఆర్థిక ఆరాచక విధానాలకు ఇప్పుడు ఎన్నికల ముంగిట కేంద్రం చెక్ పెట్టడానికి రెడీ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత పక్షం రోజులుగా జగన్ అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా మోడీ అప్పాయింట్ మెంట్ దక్కడం లేదని అంటున్నారు. నిజమే మోడీ అప్పాయింట్ మెంట్ ఎప్పుడు లభిస్తే అప్పుడు రెక్కలు కట్టుకుని మరీ హస్తనలో వాలిపోవడానికి జగన్ డిస్పరేట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే మోడీ అప్పాయింట్ మెంట్ విషయంలో నో అన్న సమాధానం రాకపోయినా, ఆ అప్పాయింట్ మెంట్ మాత్రం ఫిక్స్ కావడం లేదని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ఇక పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మోడీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 13 వరకూ ఆయన పర్యటనల్లో బిజీగా ఉంటారు. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల లోగా జగన్ కు మోడీ అప్పాయింట్ మెంట్ దొరికే అవకాశాలు మృగ్యమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ లోగా తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ జట్టుకట్టే విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక జగన్ మోడీ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం కూడా దండుగేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో  కొత్త పథకాలతో సంక్షేమం పేరిట ఎన్నికలకు ముందు పందేరం చేయాలన్న జగన్ ఆశలు అడియాశలు కాకతప్పవని పరిశీలకులు అంటున్నారు. మోడీ అప్పాయింట్ మెంట్ పై ఆశతో తన చివరి కేబినెట్ భేటీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న జగన్ ఇక ఆ భేటీ నిర్వహిస్తారా అన్న అనుమానాలూ  వ్యక్తం అవుతున్నాయి. 

పల్నాడు జిల్లాలో తొలి సహస్ర లింగం!

-పల్నాడు జిల్లా చేజర్లలో క్రీ.శ. 4వ శతాబ్ది సహస్ర లింగం!!  -చేజర్లలో 1600 సం|| నాటి తొలి సహస్ర లింగం!! - ఆనంద గోత్రికుల కాలంనాటిదంటున్న శివనాగిరెడ్డి పల్నాడు జిల్లా,  నకరికల్లు మండలం, చేజర్ల కపోతేశ్వరాలయ ప్రాంగణంలోనున్న పల్నాటి సున్నపురాతిలో చెక్కిన శివలింగమే మన దేశపు తొలి సహస్ర లింగమని, పురావస్తు పరిశోధకుడు , ప్లీచ్ ఇండియా, సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల సహస్ర లింగాలపై ప్రత్యేక పరిశోధన చేస్తున్న ఆయన, ఇటీవల చేజర్ల కపోతేశ్వరాలయంలోని సహస్ర లింగాలను అధ్యయనం చేస్తుండగా, ఆరడుగుల ఎత్తుతో పల్నాడు సున్నపురాతిలో చెక్కిన శివలింగంపై, 25 నిలువు వరుసలున్నాయని, ఒక్కో వరుసలో 40 చిన్న శివలింగాల చొప్పున మొత్తం వెయ్యి శివలింగాలున్నాయని, అసలు శివ లింగంతో కలిపితే ఆ రాతిపై 1001 శివలింగాలున్నాయని, ఈ శివలింగాన్ని ఏకోత్తర సహస్ర లింగ మంటారని, సర్వం శివమయం అన్న భావనకు ఇది తొలి ప్రతీక అని ఆయన అన్నారు.  ప్రతిమా లక్షణాన్ని, ఇంకా పల్నాటి సున్నపురాతిపై చెక్కటాన్ని అనుసరించి, ఈ సహస్ర లింగం, కపోతపురమని పిలవబడిన చేజర్ల రాజధానిగా, ఉమ్మడి గుంటూరు మండలాన్ని పాలించిన శైవమతాభిమానులైన ఆనంద గోత్రిన రాజవంశీకుల (క్రీ.శ. 4వ శతాబ్ది) కాలానికి చెందిందని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని పరశురామేశ్వరాలయంలోనున్న క్రీ.శ. 7వ శతాబ్దం నాటి సహస్ర లింగమే, అత్యంత ప్రాచీనమైనదని చరిత్రకారులు భావిస్తున్న నేపథ్యంలో, కేంద్ర పురావస్తు శాఖ, అమరావతి సర్కిల్ పరిధిలోనున్న చేజర్ల సహస్ర లింగం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొందని అన్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా, దేశంలోనే తొలిదైన ఈ సహస్ర లింగాన్ని సందర్శించి తరించాలని పల్నాడు జిల్లా ప్రజలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవిలత ... కమలనాథుల్లో   కొంచెం నీరు కొంచెం నిప్పు 

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ సినిమాలోని  మాస్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొంచెం నీరు కొంచెం నిప్పు  మాదిరిగా తయారయ్యింది హైద్రాబాద్ కమలనాథుల్లో. ప్రముఖ సామాజిక కార్యకర్త, సనాతన సాంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తున్న కొంపల్లి మాధవిలతకు ఏకంగా హాట్ సీట్ హైద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. బిజెపిలో అధికార ప్రతినిధి హోదాలో ఉన్న నడింపల్లి యమునాపాఠక్  పేరు ప్రముఖంగా  వినిపించినప్పటికీ హఠాత్తుగా మాధవిలత ఈ సీటును ఎగరేసుకు పోవడం పార్టీలో కొంత అసంతృప్తి మాత్రం కొంత వరకు ఉంది. మాధవిలత కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అయినా పార్టీ అధిష్టానం మాధవిలతకు టికెట్ ఇవ్వడంతో హైద్రాబాద్ నుంచి హిందుత్వవాదాన్ని బలపరిచే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా అధిష్టానాన్ని ఏకి పారేశారు. హైద్రాబాద్లో మగాడు ఎవ్వరూ దొరకలేదా? అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది నానుడి . కానీ హైదరాబాద్  బిజెపి ఎంపీ అభ్యర్థి విషయంలో ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. మాధవిలత ఇంట గెలవకుండానే రచ్చ గెలుస్తా అని బయలు దేరారు. 1984 లో సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్ గా గెలుపొందారు ఆ తర్వాత ఆయన మజ్లిస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి మజ్లిస్ పార్టీ హైదరాబాద్ సీటును కైవసం చేసుకుంటుంది. సుల్తాన్  సల్లావుద్దీన్ ఓవైసీ తర్వాత ఆయన  కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ సీటును వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ ఎంపీ సీటుకు ముక్కోణపు పోటీ ఉంది. మజ్లిస్ పార్టీ నుంచి దివంగత యాకుత్ పురా ఎమ్మెల్యే మస్కతీ కుమారుడు అలీబిన్ మస్కతిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించబోతుంది. అలీ బిన్ మస్కతి టిడిపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి అలీబిన్ మస్కతీని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మాధవిలత గెలుపు సునాయసమౌతుంది. ఎందుకంటే ముస్లిం వోట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పెరిగాయి. పాత బస్తీలో కూడా కాంగ్రెస్ పార్టీ కి ఆదరణ పెరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఒక్కోటి అమలవుతున్నాయి. మైనార్టీ వోటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేధించడంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓవైసీ సోదరులను కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు జైల్లో పెట్టడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయ కారణాలతో మజ్లిస్ కాంగ్రెస్ పార్టీతో  విభేధించి బిఆర్ఎస్ కు దగ్గరయ్యింది. బిజెపి బీ టీం  మజ్లిస్, బిఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. దీంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. అదే టెంపో ప్రస్తుతం కొనసాగుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది.  నా జోలికి వస్తే మస్కతీ వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తానని అసదుద్దీన్ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ముస్లింల ప్రయోజనాలు దెబ్బతీస్తే  ప్రొడక్ట్     చెక్నా చూర్ కరూంగా   మస్కతీ ప్రొడక్ట్ ను ముక్కలు ముక్కలు చేస్తానన్నారు. మస్కతీ డైరీ వ్యాపారం పాతబస్తీలో పాతుకుపోయింది. ఇప్పుడు అదే వ్యాపారాన్ని దెబ్బతీస్తానన్నారు ఓవైసీ.  కాబట్టి ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటి నెలకొంది. 

ప్రాంతాల మధ్య చిచ్చు.. జగన్ కొత్త వ్యూహం.. విశాఖ నుంచే ప్రమాణం ప్రకటన అందుకేనా?

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్తోంది. వీరి క‌ల‌యిక స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో చిచ్చుపెట్టేందుకు వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేస్తూ.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వైసీపీ కోవ‌ర్టులు, కాపు సంఘం పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాల‌ను సైతం ప‌వ‌న్‌, చంద్ర‌బాబు చాలా చాలా బలంగా తిప్పికొట్టారు. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లమ‌వ్వడంతో ఓట‌మి ఖాయ‌మ‌ని జ‌గ‌న్ సహా వైసీపీ పెద్ద‌ల‌కు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది.   జ‌గ‌న్ సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ మ‌ళ్లీ అధికారం  అసాధ్య‌మ‌ని తేలిపోయింది. దీంతో జ‌గ‌న్ కొత్త నాట‌కానికి తెర‌లేపారు. ప్రాంతాల వారిగా వైసీపీ బ‌లాబ‌లాల‌ను విశ్లేషించుకున్న జ‌గ‌న్‌  పోలింగ్ స‌మ‌యం నాటికి విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అనే అంశాన్ని ప్ర‌జ‌ల్లో రెచ్చ‌గొట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోని విశాఖ రాజ‌ధాని అంశాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్లుండి తెర‌పైకి తెచ్చారు. అంతేకాదు.. తాను మళ్లీ  అధికారంలోకి వ‌స్తే విశాఖ నుంచే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని విశాఖ వేదిక‌గా చెప్పారు. దీని ద్వారా విశాఖప‌ట్ట‌ణంతోపాటు చుట్టు ప‌క్క‌ల జిల్లాల ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.  వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఉపాధిలేక హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు వంటి ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్తున్న ప‌రిస్థితి. దీంతో గ‌తం ఎన్నికల్లో ఓట్లేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్ర‌జ‌లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌తో పాటు.. అగ్నికి అజ్యం తోడైనట్లు  తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తుగా ఎన్నిక‌లో బ‌రిలోకి దిగుతుండ‌టం, మ‌రోవైపు కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సైతం రాష్ట్రంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మితో క‌లిసినడిచేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో జ‌గ‌న్ లో  ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. భారీ స్థాయిలో ఓట‌మిని చ‌విచూడ‌కుండా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ రాజ‌ధాని అంశాన్ని ఉన్న‌ట్లుండి తెర‌పైకి తెచ్చార‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. ఏపీని రాజ‌కీయంగా మూడు ప్రాంతాలుగా తీసుకుంటే.. సౌత్ కోస్ట‌ల్ ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలు, నార్త్ కోస్ట‌ల్ ఆంధ్రా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాళం ఉమ్మ‌డి జిల్లాలు.. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలో ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూల్ ఉమ్మ‌డి జిల్లాలు ఉంటాయి. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ల అంచ‌నా ప్ర‌కారం.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ  వైఖ‌రితో గుంటూరు, కృష్ణా ఉమ్మ‌డి జిల్లాల ప్ర‌జ‌లు జగన్ అన్నా జగన్ పార్టీ అన్నా మండిపడుతున్నారు.  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో ఈ రెండు ఉమ్మ‌డి జిల్లాల‌కు తోడు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ కూట‌మిదే  తిరుగులేని ఆధిపత్యం అని సర్వేలు సందేహాలకతీతంగా తేల్చేశాయి.  రాయ‌ల‌సీమలోని ఉమ్మ‌డి జిల్లాల్లో ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే, ఆ జిల్లాలలో తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీల మధ్య హోరాహోరీ తప్పదని పేర్కొన్నాయి.  ఇక ఉత్తరాంధ్రలోని విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నది. సొంత సర్వేలే పార్టీ గెలిచే అవకాశాలు లేవని తేల్చేయడంతో  జగన్ వ్యూహాత్మ‌కంగానే విశాఖ, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం ప్రాంతాల‌పై దృష్టిసారించారు.  అందుకే మరోసారి విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమ‌రావ‌తి రాజధాని విష‌యంలో పార్టీ స్టాండ్ ప్ర‌కారం, మ‌రోవైపు   తెలుగుదేశం, జనసేన పొత్తు కార‌ణంగా ఎన్నిప్ర‌య‌త్నాలు చేసినా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అద‌నంగా వ‌చ్చే ఓటు బ్యాంకు ఏమీ ఉండ‌ద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రాయ‌ల‌సీమ‌పై వైసీపీ అధిష్టానం ప్ర‌త్యేక దృష్టిసారించింది. ఆ ప్రాంతంలో గ‌తంకంటే సీట్లు త‌గ్గినా మెజార్టీ సీట్లు సాధించేలా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక విశాఖ, దాని ప‌రిధిలోని జిల్లాల్లో ప‌ట్టు సాధించేందుకు సీఎం జ‌గ‌న్ దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. విశాఖ రాజ‌ధాని అని మొద‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్నా ఆ ప్రాంత ప్ర‌జ‌లు అంత‌గా స్పందించ‌డం లేదు. స్పందన ఏంటి అసలు జగన్ మాట నమ్మడం లేదు. విశాఖ నుంచే పాలన అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి మిన్నకుండటంతో జగన్ మాటల మీద ఉత్తరాంధ్ర జనాలకు నమ్మకం పోయింది.  దీంతో జగన్ ఇప్పుడు విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అనే నినాదాన్ని తెర‌పైకి తెచ్చి రెండు ప్రాంతాల ప్ర‌జ‌ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న వ్యూహానికి తెరతీశారు.  త‌ద్వారా విశాఖ‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లోని జిల్లాల్లో  ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌వచ్చని భావిస్తున్నారు. ఎటూ రాయలసీమలో తనకున్న పట్టు ద్వారా అధిక స్థానాలు సొంతం చేసుకోలనన్న నమ్మకం జగన్ లో ఉంది.  జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంత‌కైనా తెగిస్తార‌నేది ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌య‌మే. ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రెండు ప్రాంతాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించి ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగానే జ‌గ‌న్ ఉన్న‌ట్లుంటి విశాఖ‌నే ఏపీ రాజ‌ధాని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే ఇక్క‌డే ప్ర‌మాణ స్వీకారం చేస్తా అంటూ వ్యాఖ్యానించాడ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

కేంద్రంలో అధికారం ఎవరిది? దక్షిణాది రాష్ట్రాల తీర్పే కీలకం!

సార్వత్రిక ఎన్నికలలో  దక్షిణాదికి ఇప్పటి వరకూ పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ లోక్ సభలో అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా అవతరించి దాదాపుగా విపక్ష పాత్ర పోషించింది. అయితే అప్పుడు ఉన్నది ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తరువాత అవి రెండు రాష్ట్రాల మధ్యా విడిపోయాయి. తెలంగాణలో 17, ఏపీలో పాతిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత తగ్గింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ చాలా వరకూ ప్రాంతీయ పార్టీల హవా ఉండటంతో సార్వత్రిక ఎన్నికలలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ఈ సారి అలా కాదు... ఉత్తరాదిన కాంగ్రెస్ బలహీన పడటం, అదే సమయంలో దక్షిణాదిన పుంజుకుంటూ వస్తున్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ సాధిస్తున్న పట్టును దెబ్బతీయడం ప్రధాన టార్గెట్ గా మారింది. అదే సమయంలో దక్షిణాదిలో పార్టీ బలహీనతను దక్షిణాదిలో అత్యధిక స్థానాలలో విజయం సాధించడం ద్వారా భర్తీ చేసుకుని కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడానికి భాగస్వామ్య పక్షాలను ఆకర్షించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. దీంతో సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందన్నదానిపైనే కేంద్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలే అవకాశాలున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  అందుకే  తనకు పట్టు ఉన్న దక్షిణాదిపై  సహజంగానే కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తే.. కాంగ్రెస్ ముక్త భారత్ ను సాకారం చేయలేకపోయినా.. దక్షిణాదిలో ఆ పార్టీ మరింత బలోపేతం కాకుండా చూడటమే లక్ష్యంగా బీజేపీ కూడా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాస్తవానికి దక్షిణాదిలో బీజేపీకి కర్నాటకను మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్టేక్ లేదు. కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేంద్ర పాలత ప్రాంతం పుదుచ్చేరిలలో ఆ పార్టీ ఉనికి, ఓటు కూడా నామమాత్రమే. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏదో మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా.. అధికారంలోకి వచ్చేంత బలం కానీ  ఓటు కానీ ఆ పార్టీకి లేదు. ఆయా రాష్ట్రాలలో పొత్తుల ద్వారా ఏవో కొన్ని స్థానాలకు పరిమితమౌతూ వచ్చింది. అటువంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఒంటరి పోరు ద్వారా చెప్పుకోదగ్గ లోక్ సభ స్థానాలను గెలుచుకోగలమన్న ధీమాతో ఉంది. తమిళనాడులో కూడా జయలలిత మరణం తరువాత  చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దూకుడుతో అక్కడ కొద్ది మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా, సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ను చూసిన తరువాతే అక్కడ కమల వికాసం ఏలా ఉందో చెప్పగలం. ఇక ఏపీలో  బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సొంతంగా బలోపేతం అవ్వడం సంగతి అటుంచి పొత్తు కుదుర్చుకున్నా భాగస్వామ్య పార్టీల నుంచి ఓటు ట్రాన్స్ ఫర్ అవ్వడం అనుమానమేనని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఇక కేరళలో ఇప్పటికీ వామపక్ష ఆధిపత్యమే కొనసాగుతోంది.     దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్నాటక మాత్రమే. ఆ రాష్ట్రంలో మాత్రమే బీజేపీ సార్వత్రిక ఎన్నికలలో డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకోగలనన్న విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ కు దక్షిణాదిలో పెరుగుతున్న పట్టుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా  బీజేపీ  ప్రత్యేక దృష్టి సారించడంతో  ఈసారి సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. అందరి దృష్టీ ఈ రాష్ట్రాలపైకి మళ్లింది.  ప్రతి రాష్ట్రం నుంచీ లోక్ సభలో కనీస ప్రాతినిథ్యం అన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరి దక్షిణాది ఓటర్లు ఏం తీర్పు ఇస్తారన్నది వేచి చూడాల్సిందే.