ముసుగులు తీసేసిన ముద్రగడ, చేగొండి!

మాటకు ముందూ మాటకు తరువాత నా కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం, కాపు జాతి సంక్షేమమే తన లక్ష్యం అంటూ అడిగినా అడగకపోయినా సలహాలూ, సూచనలూ అంటూ పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖలు రాస్తూ శ్రేయోభిలాషినని చెప్పుకునే  చేగొండి హరిరామజోగయ్యలు ఇప్పుడు తమ ముసుగులు తీసేశారు. కాపు సామాజికవర్గ శ్రేయస్సు కంటే తమ రాజకీయ స్వార్థమే ముఖ్యమని తేటతెల్లం చేశారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించిన క్షణం నుంచీ వీరురువురూ గతంలో ఏం చేసినా, ఎలా వ్యవహరించినా, రాష్ట్రంలోని కాపులందరి తరఫునా వకాల్తా పుచ్చుకుని మరీ హడావుడి చేశారు. పొత్తు పొసగకుండా పవన్ కల్యాణ్ వెనక్కు లాగేందుకు చేయగలిగినంతా చేశారు. అది కదరకపోయే సరికి సీట్ల సర్దుబాటులో బెట్టు చేయాలంటూ సూచనలు చేశారు. బహిరంగ లేఖలు రాశారు. చివరకు తమ మాట పవన్ వద్ద చెల్లుబాటు కాదని తేలిపోయిన తరువాత అప్పటి వరకూ వేసుకున్న కాపు ముసుగును తీసేసి.. వైసీపీ గూటికి చేరిపోయారు.  తెలుగుదేశం, జనసేన పొత్తు పొసగకుండా, ఒక వేళ పొత్తు పొసగినా సరే సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీలకూ సమన్వయం కుదరకుండా  ఇరువురు నేతలూ పడిన తాపత్రేయం, ఆత్రం అంతా ఇంతా కాదు. చివరికి తెలుగుదేశం, జనసేన తాడేపల్లి గూడం సభలో తమ రెండు పార్టీల మధ్యా చక్కటి సమన్వయం ఉందనీ, బలాబలాలూ, గెలుపు అవకాశాలూ అన్నీ బేరీజు వేసుకునే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని సందేహాలకు అతీతంగా స్పష్టం చేసేయడంతో  తమ అసలు రూపు బయటపెట్టేయడానికి క్షణం ఆలస్యం చేయలేదు. చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీ గూటికి చేరిపోయి.. ఆ పార్టీ నుంచి పాలకొల్లు టికెట్ దాదాపు ఖరారు చేసుకున్నారు. మరో వైపు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇంత కాలం ఆ ఇరువురు నేతలూ పవన్ కల్యాణ్ కు శ్రేయోభిలాషులమంటూ బిల్డప్ ఇస్తూ చేసిన తతంగం అంతా వైసీపీ హైకమాండ్... తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనేనని అందరికీ అవగతమైపోయింది.  హరిరామ జోగయ్య గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా తనదైన శల్యసారథ్యం చేసి కొంప ముంచారు అది వేరే సంగతి. ఆయనకు కాపు సామాజిక వర్గానికి పెద్దగా, ఆ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడే వ్యక్తిగా తనకు తాను ప్రకటించేసుకుని పబ్బం గడుపుకోవడం అలవాటేనని ఆయనను తెలిసిన వారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దాంతో తెలుగుదేశం, జనసేన పొత్తుల విషయంలో ఆయన చేసిన సూచనలూ, ఇచ్చిన సలహాలను ఆ సామాజికవర్గానికి చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. వయస్సుకు, సీనియారిటీకి మాత్రమే గౌరవం ఇస్తున్నట్లు పవన్ మొదట్లోనే ప్రకటించి, ఆయనను పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు.  కానీ ముద్రగడ విషయం అలా కాదు.  ముద్రగడ తొలి నుంచీ తెలుగుదేశం, జనసేన పొత్తును వ్యతిరేకిస్తూనే వచ్చారు. అందులో ఆయన ఎటువంటి దాపరికం లేకుండానే వ్యవహరించారు. కాపు రిజర్వేషన్లు కుదిరే పని కాదని జగన్ సీఎం హోదాలో కుండబద్దలు కొట్టేసినా ఆయన కిమ్మనలేదు. పైగా జగన్ పార్టీకి గట్టి మద్దతుదారుగా తనను తాను ప్రకటించుకున్నారు కూడా.  కాపుల మద్దతు జనసేనకు దక్కకుండా  అడ్డుకోవడానికి వైసీపీ ముద్రగడను తొలి నుంచీ పావులాగా వాడుకుంది.  చాలాకాలంగా సీరియస్ నేతగానే  కాపులలో బలమైన ప్రభావం చూపగలిగిన నేతగా ముద్ర ఉన్న ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై సవాల్ చేసిన సమయంలో తాను కాపు సామాజిక వర్గ శ్రేయస్సు కంటే జగన్  పక్షపాతిగా ఉండడానికి ఇష్టపడతానని చెప్పకనే చెప్పేశారు. అప్పట్లో   ద్వారంపూడికి మద్దతుగా పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగారు.  గతంలో కాపు రిజర్వేషన్ కోసం ఉవ్వెత్తున జరిగిన ఉద్యమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది ద్వారంపూడేననీ, ఆయన ఖర్చుతోనే నాడు కాపు ఉద్యమ కారులకు ఉప్మా పెట్టాననీ ముద్రగడ రాసిన లేకపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ ఆయనకు పెద్ద ఎత్తున మనీ ఆర్డర్లు పంపించిన సంగతి  కూడా తెలిసిందే. దీంతో బాహాటంగా జనసేనను వ్యతిరేకిస్తూ, జగన్ తో అంటకాగితే జనం నమ్మరని గ్రహించి అప్పటికి నెమ్మదించిన ముద్రగడ ఆ తరువాత జనసేన వైపే తన మొగ్గు అంటూ ఫీలర్లు పంపారు. జనసేన నేతలు కూడా ముద్రగడ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉండడాన్ని స్వాగతించారు.   కానీ ఎందుకో పవన్ కల్యాణ్ ఆయనను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదన్న విషయం ఇప్పుడు తేటతెల్లమైంది. పవన్ తనకు సలహాలూ, సూచనలూ అక్కర్లేదనీ, తనతో కలిసి నడిచే వారే తన వారనీ కుండబద్దలు కొట్టేయడంతో  ఇక ముసుగులతో పని లేదని ముసుగుతొలగించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనసేనలో చేరి ఆ పార్టీనీ, పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయాలన్న వ్యూహం పురిట్లోనే సంధి కొట్టడం వల్లే   ముద్రగడ ముసుగు తీసేసి జగన్ పార్టీ గూటికి చేరిపోయారనీ, ఇప్పుడు పిఠాపురం నుంచి ఏకంగా పవన్ పైనే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారనీ పరిశీలకులు అంటున్నారు.   అందుకే ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ఖరారైన వంగా గీతను జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని సర్ది చెప్పారని అంటున్నారు. అంతే కాకుండా ఒక వేళ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే.. తాను ఆయనపై పోటీ చేసి గెలిచే అవకాశం లేదని వంగా గీత కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముసుగులు తీసేసిన కాపు నేతలను ఆ సామాజికవర్గం నమ్మే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

టిడిపిలో చేరిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో  వైసీపీ నుంచి టిడిపిలో చేరికలు పెరిగిపోతున్నాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం  అధికారంలో రాదని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు... టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని... ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అన్నింటికీ చంద్ర‌బాబేనా? ప్ర‌జ‌ల‌ను ఎన్నాళ్లు న‌మ్మిస్తారు స‌జ్జ‌లా!

ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ నేత‌ల విచిత్ర ప్ర‌వ‌ర్త‌న ప్ర‌జ‌ల‌కు వెగుటు పుట్టిస్తోంది. త‌ప్పు చేయ‌డం ప‌క్క పార్టీల మీద నెట్ట‌డం.. ఇదే ఫార్ములాను వైసీపీ అధిష్టానం నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ తు.చ. త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. అధికారంలోకి రాకముందు,  వ‌చ్చిన త‌రువాత కూడా వారి బుద్దిలో ఏమాత్రం మార్పు రాలేదు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య‌ కేసు విష‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అచ్చుగుద్దిన‌ట్లు ఇదే ఫార్ములాను అనుస‌రిస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య‌ కేసును సునాయాసంగా అప్ప‌టి సీఎం చంద్ర‌బాబుపై నెట్టేసి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది అధికారంలోకి వ‌చ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వివేకా హ‌త్య జ‌గ‌న్ వ‌ర్గీయుల ప‌నేనంటూ ఒక్కో విష‌యం వెలుగులోకి రావ‌డం ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. స్వ‌యాన వివేకానందరెడ్డి కూతురు, సీఎం జ‌గ‌న్ చెల్లెలు న‌ర్రెడ్డి సునీతారెడ్డి మా నాన్న‌ను హ‌త్య‌చేసింది వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డిలేన‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. వారిని కాపాడేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారనీ, ఆయ‌న్ను కూడా విచారించాల‌ని  డిమాండ్ చేస్తున్నారు. కానీ చెల్లెలు రోదన‌లు ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. త‌న సిపాయిల‌ను మీడియా ముందుకు పంపించి సునీత చెప్పేదంతా చంద్ర‌బాబు డ్రామాలో భాగ‌మే అంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌త ఐదేళ్లుగా వివేకా హ‌త్య గురించి ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్రజలకు వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారుల విషయంలో స్పష్టత వచ్చింది. ఈ హ‌త్య‌ కేసులో అరెస్ట‌యి జైలుకెళ్లిన వాళ్లుసైతం నిందితులు జ‌గ‌న్ మ‌నుషులే అని చెబుతున్నారు. అయినా, ప్ర‌జ‌లంతా పిచ్చోళ్లు అన్న‌ట్లుగా నిజాల‌ను అబ‌ద్దాలుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేయ‌డం నీచ‌ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట అంటూ పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌యం ఏమిటంటే, చంద్ర‌బాబు ముస‌లోడు.. ఆయ‌న రాజ‌కీయాల‌కు, వ్యూహాలు ప‌న్న‌డానికి ప‌నికిరారు అంటూ ప‌బ్లిక్ మీటింగ్ ల‌పై  చెప్పే వైసీపీ నేత‌లు.. వివేకానంద హ‌త్య‌కేసులో జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గం వారి ప్ర‌మేయం ఉంద‌ని జ‌గ‌న్ చెల్లెలే స్వ‌యంగా మొత్తుకుంటుంటే మాత్రం.. దానికి కార‌ణం చంద్ర‌బాబు అని స‌జ్జ‌ల, వైసీపీ నేత‌లు అంటుండ‌టం విడ్డూరంగా ఉంది.  తాజా ప‌రిణామాల‌తో వివేకా హ‌త్య‌ మ‌ర‌కను తుడుచుకునేందుకు జ‌గ‌న్, స‌జ్జ‌ల చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూసి విస్తుపోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల వంత‌వుతున్నది. అస‌లు విష‌యానికి వ‌స్తే, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి తన తండ్రి హత్యకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే అని వారిద్దరినీ జగన్మోహన్‌ రెడ్డి కాపాడుతున్నారని నేరుగా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, హంతకులు ఎక్కడో లేరు మన మధ్య‌నే ఉన్నారు. హత్యా రాజకీయాలు చేసే వైసీపికి ఎవరూ ఓట్లు వేయవద్దని సునీతారెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీతారెడ్డి ప్రెస్ మీట్ ఢిల్లీలో అయిపోయిన వెంట‌నే.. వైసీపీ తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి తాడేప‌ల్లిలో మీడియా ముందు కొచ్చారు. సునీతారెడ్డి మాట‌ల‌న్నీ అబ‌ద్దం. మేము చెప్పేదే నిజం.. ప్ర‌జ‌లంతా మేము చెప్పిందే న‌మ్మాలి అన్నంత ప‌నీ చేశారు స‌జ్జ‌ల‌. అంతేకాక‌ ఇన్నాళ్ళకు సునీతారెడ్డి తన ముసుగును తీసేసి తన అసలు రూపం బయటపెట్టుకున్నందుకు ముందుగా ఆమెకు చాలా థాంక్స్ చెపుతున్నాను అంటూనే,  ఇన్నేళ్ళుగా మాట్లాడని ఆమె ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డిని, మా ఎంపీ అవినాష్ రెడ్డిని నిందిస్తున్నారంటూ అరిగిరిన క్యాసెట్ నే  మ‌ళ్లీ వినిపించారు స‌జ్జ‌ల‌. ఇక్క‌డ స‌జ్జ‌ల‌కు తెలియాల్సిన విష‌యం ఏమిటంటే.. సునీతారెడ్డి గ‌త నాలుగేళ్లుగా త‌న తండ్రిని చంపిన నిందితుల‌కు శిక్ష‌లు వేయాల‌ని మీడియా ముందు అనేక‌సార్లు ప్ర‌స్తావించారు.. ఆమె ప్ర‌త్యేకంగా ఎన్నిక‌ల ముందు వ‌చ్చి మాట్లాడ‌లేదు. అంతేకాదు, చంద్ర‌బాబు ముస‌లోడు అంటూ ప్ర‌చారం చేసిన చేయించిన స‌జ్జ‌ల‌.. ఇప్పుడు మాత్రం సునీతా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్ట‌గానే అదంతా చంద్ర‌బాబు ప‌నేనంటూ చెప్ప‌డం వైసీపీ శ్రేణులనుసైతం విస్మ‌యానికి గురిచేస్తున్నది. వివేకా హత్య కేసుని వారంరోజుల్లో తేల్చేయవచ్చని సునీతారెడ్డి అంటున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలోఎందుకు అడగలేదు? వివేకా హత్య జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలుపైగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? అప్పుడే కేసుపై దర్యాప్తు జరిపించి దోషులను ఎందుకు పట్టుకోలేదు? అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ ప్రశ్నలన్నిటికీ చాలా ఎదురు ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వివేకాని తెలుగుదేశం నేతలే హత్య చేసిన్నట్లయితే, ఎన్నికల సమయంలో అదే విషయం చాటింపు వేసుకుంటే వైసీపీకే లబ్ధి కలిగేది కదా?  కానీ  గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్దం చెప్పారు? హత్య జరిగిన‌ట్లు తెలీయకుండా బ్యాండేజీలు ఎందుకు చుట్టారు? ఎవరు చుట్టారు?  పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎందుకు ప్రయత్నించారు? తెలుగుదేశం నేతలే ఈ హత్య చేసిన్నట్లయితే రాష్ట్రంలో వైసీపీయే అధికారంలో ఉంది కదా? మొదట ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యధారాలన్నిటినీ సీబీఐకి సమర్పించి తెలుగుదేశం నేతలను లోపల వేయించేయొచ్చు కదా?  కానీ  వివేకా హత్య కేసు ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌జ్జ‌ల స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా అని జనం ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సునీతా రెడ్డి ఢిల్లీలో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు స‌జ్జ‌ల స‌మాధానాలు చెప్ప‌లేక అంతా చంద్ర‌బాబు చేశారంటూ పాత‌పాటే పాడుతూ.. త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ఏపీ ప్ర‌జ‌లను విస్మ‌యానికి గురిచేస్తోంది.

పశ్చాత్తాపడుతున్నారు.. ప్రాయశ్చితం చేసుకుంటామంటూ బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు!

రాష్ట్రం అభివృద్ధికి నిరంత‌రం కృషిచేసిన‌ నేత‌.. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చేందుకు ప్ర‌తి క్ష‌ణం తాప‌త్ర‌య ప‌డిన నాయ‌కుడు, ప్ర‌పంచ దేశాల్లో తెలుగు వారికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చిన ఐటీ మాస్ట‌ర్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయ‌నకు చాలా బిరుదులు ఉన్నాయి. ఆయ‌న ఎవ‌రోకాదు..  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఏపీలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు స‌మ‌యం దగ్గ‌ర‌ప‌డుతున్న వేళ,  ఏపీ ప్ర‌జ‌ల‌తోపాటు, ఏపీతో సంబంధం క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ చంద్ర‌బాబు నాయుడు జ‌పం చేస్తున్నారు. ఇన్నాళ్లూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వెనుకేసుకొచ్చిన ప‌లువురు వైసీపీ నేత‌లు సైతం ఈసారి ఏపీకి చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రి కావాలంటూ కోరుకుంటున్నారు.  కొంద‌రైతే చంద్ర‌బాబును ఇన్నాళ్లూ విమ‌ర్శించినందుకు ప‌శ్చాత్తాప ప‌డుతున్నారు. దీనంతంటికీ కార‌ణం  ఏపీ అభివృద్ధికి ఐదేళ్లు చంద్ర‌బాబు నాయుడు చేసిన కృషితోపాటు.. ప్ర‌స్తుతం నాలుగున్న‌రేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌.  2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీలో సంద‌డి వాతావ‌ర‌ణం ఉండేది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిపేందుకు చంద్ర‌బాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రోజుకు 18 గంట‌ల‌పాటు అనుక్ష‌ణం రాష్ట్రం అభివృద్ధి కోసం బాబు ప‌నిచేశారు. ఒక‌వైపు పోల‌వ‌రం, మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని, ఇంకో  వైపు ప్రాజెక్టుల నిర్మాణం.. మ‌రో వైపు రైతుల అభ్యున్న‌తికి కృషి.. ఇలా అన్ని రంగాల్లోనూ ఏపీని అభివృద్ధి ప‌థంలో చంద్ర‌బాబు న‌డిపించారు. అంతేకాదు.. ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధి చెందిన పెద్ద‌పెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా చంద్ర‌బాబు చేసిన కృషి అమోఘం. కానీ, 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మితో ఏపీలో ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీ పూర్తిగా దివాళా తీసే ప‌రిస్థితికి చేరింది. క‌నీసం రోడ్లు వేసేందుకు సైతం వైసీపీ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో  కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు మాత్ర‌మే జ‌రిగాయి. చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టిన కంపెనీలు వైసీపీ హ‌యాంలో వెన‌క్కు వెళ్లిపోయాయి. యువ‌త ప‌ని చేసుకునేందుకు క‌నీసం ఉపాధి లేకుండా పోయింది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈసారి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కాకుంటే రాష్ట్రం ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిపోతుంద‌న్న ఆవేద‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు జ‌గ‌న్ కు అండ‌గా నిలుస్తూ.. సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబును విమ‌ర్శించిన వైసీపీ సానుభూతిప‌రులు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం గా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోని ప‌లు ప్లాట్ ఫాంల ద్వారా ప‌లువురు వైసీపీ సానుభూతి ప‌రులు ఇన్నాళ్లు చంద్ర‌బాబును విమ‌ర్శించినందుకు ప‌శ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.  అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.  పలువురు వైసీపీని వీడి తెలుగుదేశంలో  చేరుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు చంద్ర‌బాబు జ‌పం చేస్తున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వైసీపీ సానుభూతిప‌రుడు పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఆయన ఆ పోస్టులో  చంద్ర‌బాబు నాయుడు గొప్ప‌త‌నం గురించి చెబుతూ.. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించ‌డానికి గ‌ల కార‌ణం.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డానికి కార‌ణాల‌ను వివ‌రించాడు.           చంద్ర‌బాబు గొప్ప‌త‌నం గురించి వైసీపీ సానుభూతిప‌రుడు సోష‌ల్ మీడియాలో పేర్కొన్న వివ‌రాల‌ ప్ర‌కారం.. తాను వైసీపీలో ఉన్నప్పుడు పని మీద ఏలూరు వైపు వెడుతున్న సమయంలో  అటువైపు వరి పొలాలన్నీ  పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. ఒక పొలంలో కర్రతో పాతిన ఒక బోర్డ్ కనిపించింది.. బహుశా చంద్రబాబు అభిమాని అయి ఉంటాడు.  ఆ బోర్డ్ మీద "ఈ పంటను పట్టిసీమ నీటితో పండించాము" అని రాసి ఉంది. దాన్ని ఫోటోతీసి గౌతమి ఐడీలో పట్టిసీమ మీద, చంద్ర‌బాబుపై వెటకారంగా పోస్ట్ పెట్టింది.. 700పైనే లైక్స్ వచ్చాయి. ఈ ఐదేళ్ళలో జ‌గ‌న్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటికూడా లేకపోగా.. ఉన్న ప్రాజెక్టులతోపాటు వాటి గేట్లు కూడా కొట్టుకు పోతుంటే చంద్ర‌బాబు గొప్పతనం, ఆయన కట్టిన పట్టిసీమ గొప్పతనం ఏంటో బాగా తెలిసి వచ్చింది. చంద్ర‌బాబు పాలనలో ప్రతి ఇంటికి మరుగు దొడ్డి కట్టిన రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని న్యూస్ వచ్చింది. ప్రతి ఇంటికీ మరుగు దొడ్లు కట్టే పనిలో భాగంగా చంద్ర‌బాబు ఒక బాత్రూమ్ దగ్గర దిగిన ఫోటోను తాను  ట్రోల్ చేసిన తీరు తలుచుకుంటే చాలా బాధ కలుగుతోందని స‌ద‌రు వ్య‌క్తి   ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. పశ్చాత్తాపపడ్డారు. అంతేకాదు, అప్పట్లో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేసినా   వెటకారంగా ట్రోల్ చేసేవాడిననీ,  చంద్ర‌బాబు రోజుకి 18గంటలు పని చేస్తాడని రాత్రి 2గంటల వరకు పని చేస్తున్నట్టు వెనుక వైపు గడియారంలో టైమ్ కనిపిస్తున్న ఫోటోను కూడా చాలా వెటకారంగా ట్రోల్ చేస్తే అది కూడా వైరల్ అయిందనీ ఆ పోస్టులో పేర్కొని,  ఇప్పుడు తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి బయటకురాని, సాయంత్రం 6 గంటలు దాటితే మంచం ఎక్కేసే జగన్ ను చూస్తుంటే ..  రేయింబవళ్ళు కష్టపడి పనిచేసిన చంద్ర‌బాబునా తాను  ట్రోల్ చేసింది అని తన మీద తనకే అసహ్యం కలుగుతోందంటూ  కన్ఫెస్ అయ్యారు.   మళ్ళీ చంద్ర‌బాబు ఎప్పుడు సీఎం అవుతారా?  సీఎం అయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి గురించి గొప్పగా ప్రచారం చేసి గతంలో నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నానని ఆ పోస్టులో పేర్కొన్నారు. తెలుగుదేశం విజయం సాధిస్తే తనకేవో పదవులు వస్తాయన్న కోరిక తనలో ఇసుమంతైనా లేదనీ, తాను తెలుగుదేశం పార్టీలో చేరడానికి గతంలో తాను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలన్న బలమైన ఆకాంక్షే కారణమని విస్ఫష్టంగా పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి అయినా సరే   చంద్ర‌బాబు విజ‌యంకోసం పని చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యాను. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని పేర్కొన్నారు. అందుకే కేసులు పెట్టి లోపల వేసినా కూడా జైల్లో వెయ్యక ముందు కంటే కూడా వేసిన తర్వాతనే మరింత కసిగా పని చేస్తున్నాను అటూ సోష‌ల్ మీడియాలో  పోస్టు పెట్టి చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ.. జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేశాడు. ఇలా ఒక్క‌రు, ఇద్ద‌రు కాదు.. ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై విసిగిపోయారు. గతంలో జగన్ కోసం పని చేసిన వారు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు పడిన తపనను, చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ,  మ‌ళ్లీ నువ్వేరావాలి బాబూ అంటూ  తెలుగుదేశం విజయం కోసం తపిస్తున్నారు. అందుకోసం నిస్వార్థంగా పని చేసేందుకు సమాయత్తమౌతున్నారు.   

చేగొండి రాజకీయం ఇదీ!.. వైసీపీ గూటికి సూర్యప్రకాశ్

మాజీ మంత్రి, కాపు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ కు విరామం లేకుండా లేఖలు రాస్తూనే ఉన్నారు. తాను జనసేన బాగు కోరేవాడినని చెప్పుకుంటూనే ఉన్నారు. నోటితో పలుకరించి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఆయన ఓ వైపు జనసేన బలం గురించి గొప్పలు చెబుతూ మరో వైపు ఆయన కుమారుడిని వైసీపీలోకి పంపిస్తున్నారు. ఈ రోజు ఆయన తాను వైసీపీ కోవర్టుని ఎలా అయ్యానో చెప్పాలని జనసేనానికి ఓ లేఖ రాశారు. ఆ తరువాత కొద్ది సేపటికే ఆయన కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జగన్ తో భేటీకి తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్నారు. ఇప్పటి వరకూ జనసేనలో క్రియా శీల సభ్యుడిగా ఉన్న సూర్య ప్రకాశ్ ఇహనో, ఇప్పుడో వైసీసీ తీర్ధం తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ పరిణామం ద్వారా హరిరామ జోగయ్య వైసీపీ కోవర్ట్  ఎలా అయ్యారో పవన్ కల్యాణ్ వివరించి చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరికీ తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకుండానే తనకు సలహాలూ సూచనలూ అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఎవరు ఏ ఉద్దేశంతో  అవి ఇస్తున్నారో తనకు తెలుసుననీ, తన మాటకు విలువనిచ్చి తనతో నడిచే వారే తనవారని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో అప్పటి వరకూ జనసేనానిపై పొత్తు పొడవాలంటే అధిక స్థానాల కోసం డిమాండ్ చేయాలి, లేదా రెండేళ్లు సీఎం పదవి కోసం పట్టుబట్టాలి అంటూ ఒత్తిడి తీసుకువచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. దీంతో ఓ వైపు తమ మాట వినలేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే బహిరంగ లేఖల ద్వారా తాము ఏ ప్రయోజనం ఆశించి జనసేనానిపై ఎక్కువ స్థానాలు, పదవి కోసం ఒత్తిడి తేవడానికి ప్రయత్నించామో చెప్పకనే చెప్పేస్తున్నారు. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఇరువురూ కూడా కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులం అన్న ముసుగు మాటున జనసేన, తెలుగుదేశం పొత్తు పొడవకుండా ఉండేందుకు తమ స్థాయికి మించిన ప్రయత్నాలే చేశారనీ, అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటువంటి ఒత్తిడులకూ లొంగకుండా, మీ సలహాలు అవసరం లేదనడం ద్వారా వారిని దూరం పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇక ముసుగులు తీసేసి ఇప్పటి వరకూ తాను ఎవరి కోసమైతే జనసేన ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయాలంటూ వచ్చారో, వారితోనే కలిసేందుకు రెడీ అయిపోయారని చేగొండి సూర్యప్రకాశ్ పవన్ తో భేటీని ఉదాహరణగా చూపుతున్నారు.  జనసేన రాజకీయ వ్యవహారాల కమాటీ సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్య ప్రకాశ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఆయన ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ చార్జిగా కూడా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన జనసేనకు రాజీనామా చేసి తాడేపల్లి ప్యాలెస్ తలుపుతట్టారు. జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీ అభ్యర్థిగా ఆచంట లేదా నిడదవోలు నుంచి టికెట్ అడుగుతున్నారు. అయితే వైసీపీ నుంచి ఆయనకు పాలకొల్లు టికెట్ ఆఫర్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతే కాకుండా చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీ గూటికి చేరడం అన్నది ఇప్పటికిప్పుడు చోటు చేసుకున్న పరిణామం కాదని కూడా అంటున్నారు.  

దేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ 

ఎపిలో వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేసింది. అనపర్తి రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కాస్తా ప్రమాణాల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ చేశారు. తన దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్న రామకృష్ణారెడ్డి.. ఇవాళ నిరూపించేందుకు సిద్ధమయ్యారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కూడా సై అన్నారు. నడిచి వస్తావో హెలికాప్టర్ ఎక్కి వస్తావో.. వేదిక సిద్ధమంటూ ప్రకటించారు. రామకృష్ణారెడ్డి రాకపోతే ఆధారాలు నిరూపించలేకపోయినట్లే అన్నారు. అయితే తన సవాల్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమైన రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనను కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.  

గోదావరి జిల్లాల్లో గాలాడక ఫ్యాన్ కు ఉక్కపోత!

ఉభయ గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ పార్టీకి గాలి ఆడక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. వచ్చే ఎన్నికలలో ఇక్కడ కనీసం ఖాతా తెరవగలమా అన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలలో విజయం సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న నమ్మకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నుంచీ ఉంది. ఇప్పటి వరకూ అలాగే జరిగింది కూడా. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 స్థానాలలో, తూర్పుగోదావరిలో 19 స్థానాలకు గానూ 14 స్థానాలలో  వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది.  అయితే ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆ పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషించడమే కాదు, స్వయంగా వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. అసలు గత ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం అధిరోహించిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఆరంభమైంది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక సంఖ్యాకంగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అధికారంలోకి రాగానే జగన్ కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని చెప్పడంతో కాపు సామాజిక వర్గం జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. దానికి తోడు ఆయన పాలనా తీరు కూడా ఆ ఆగ్రహాన్ని మరింత పెంచేదిగానే ఉంది. సామాన్య ప్రజలలో జగన్ పాలన పట్ల అసంతృప్తి ప్రజా వ్యతిరేకతగా మారితే.. జిల్లాలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గం ఆసంతృప్తికి తోడు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీకి ఈ సారి మద్దతు ఇచ్చేది లేదని కంకణం కట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇంతటి వ్యతిరేకతకు తోడు పార్టీలో అంతర్గత పోరు వైసీపీ పుట్టి ముంచడం ఖాయంగా కనిపిస్తోంది.  తొలుత వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. ఆయన పార్టీలోనే ఉంటూ జగన్ కు పక్కలో బల్లెంగా మారారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అసంబద్ధ విధానాలను రచ్చబండలో ఎండగడుతూ వస్తున్నారు. ఇక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం పార్టీకి మరింత చేటు తీసుకువచ్చేలా మారింది. అలాగే  అమలాపురంలో  మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య యుద్ధం తార స్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే  తీవ్ర అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా  ఈ పరిస్థితిని తెలుగుదేశం, జనసేన కూటమి క్యాష్ చేసుకుంది. గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూటమివైపు తిప్పేందుకు పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. ఈ జిల్లాల్లో వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం, జనసేనలు పని చేస్తున్నాయి. అందులో భాగంగానే జనసేనాని పవన్ కల్యాణ్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు.   పవన్ ఇప్పటికే  ఉభయగోదావరి జిల్లాల నేతలతో  పలు మార్లు భేటీ అయ్యారు.  నియోజకవర్గాల సమీక్ష కూడా చేశారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారు.  ప్రజలలో వైసీపీపై తీవ్ర అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే  కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో ఈ జిల్లాల్లో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గంటా, బొత్స టామ్ అండ్ జెర్రీ

రోగి, వైద్యుడూ ఒకటే కోరారన్నట్లుగా తయారైంది గంటా శ్రీనివాసరావు పరిస్థితి. ఆయన ఈ సారి ఎన్నికలలో భీమిలీ నుంచే పోటీలోకి దిగాలని భావిస్తుంటే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచి పోటీలోకి దిగమంటున్నారు. అధినేత నిర్ణయం శిరసావహిస్తానని గంటా సమాధానపడ్డారు. అయితే అసలు గంటాను భీమిలీ నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించడం వెనుక అసలు కారణం, అక్కడ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగుతారనీ, ఆయనకు దీటైన అభ్యర్థి గంటా అవుతారన్న ఉద్దేశింతోనే. అయితే ఇప్పుడు స్వయంగా బొత్స సత్యనారాయణే వైసీపీ అధినేతను తనను భీమిలికి మార్చమని కోరుతున్నారు. సొంత నియోజకవర్గం వదిలి పారిపోవాలని బొత్స కోరుకోవడానికి కారణం ఆయన సతీమణి  బొత్స ఝాన్సీ. ఆమె ఎలా కారణమయ్యారంటే.. జగన్ ఈసారి విశాఖ పార్లమెంటు స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో గంటా బొత్స ఝాన్సీ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి వైపీసీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిలోనూ తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలన్న షరతు విధించారు. అందులో భాగంగానే తాను కూడా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భీమిలీ నుంచి పోటీ చేస్తానని కోరారనీ, అందుకు జగన్ ఓకే అన్నారనీ వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  దీంతో గంటా ఇప్పుడు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. బొత్సకు ప్రత్యర్థిగా గంటాను భీమిలి నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు గంటాయే చీపురుపల్లి వదిలి భీమిలీకి మారుతుంటే.. ఇక గంటాను చీపురుపల్లికి మార్చడం ఎందుకు అని చంద్రబాబు భావించి గంటా కోరిన విధంగా భీమిలి టికెట్ ఇస్తారా అన్న చర్చ అయితే తెలుగుదేశంలో జరుగుతోంది. అదే జరిగితే..  చీపురుపల్లిలో తెలుగుదేశం ఆశావహుడు  కిమిడీ నాగార్జున అక్కడ నుంచి పోటీకి ఎటూ రెడీగా ఉన్నారు.  అయితే గంటా భీమిలి నుంచి రంగంలోకి దిగుతున్నారని తెలిస్తే అక్కడ నుంచి  పోటీకి బొత్స ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంచితే   ఇప్పటి వరకూ గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసి గెలిచిన స్థానం నుంచి రెండో సారి పోటీ చేసిన చరిత్ర లేదు. ఈ సారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, లేక బోత్సకు చెక్ పెట్టేందుకు బొత్స ఒక వేళ భీమిలి నుంచి రంగంలోకి దిగితే.. గంటా కూడా అక్కడ నుంచే పోటీ చేస్తారా చూడాల్సి ఉంది. 

జగన్ కు, వైసీపీకి ఓటు వేయవద్దు.. డాక్టర్ సునీత

తన అన్న జగన్ రెడ్డికి, ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అన్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ సునీత ఈ రోజు హస్తినలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనన్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర జాప్యం వెనుక తన సొదరుడు జగన్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు.  తన తండ్రి హత్య అనంతరం తాను జగన్ రెడ్డిని కలిశాననీ, అయితే అప్పట్లో ఆయన మోటివ్ పై ఎటువంటి అనుమానం రాలేదన్నారు. సొంత వాళ్లను అంత తేలిగ్గా అనుమానించలేమని సునీత చెప్పారు. అయితే క్రమంగా తనకు విషయాలు బోధపడుతూ, అర్ధమౌతూ వచ్చాయని సునీత వివరించారు. ఈ కేసులో తన తండ్రి గుండెపోటుతో మరణించారని తొలుత మీడియాకు చెప్పిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిని సీబీఐ ఇప్పటి వరకూ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. అంతే కాదు తన తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని సునీత అన్నారు.   ఇంత దారుణంగా తన తండ్రి వివేకాను హత్య చేసిన వారిని వదిలేయడం అంటే ప్రజలలో ఎలాంటి సందేశం పంపుతున్నట్లు అని ప్రశ్నించారు. ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు.  తన తండ్రి వివేకా జగన్ కు సొంత చిన్నాన్న అనీ, అలాంటిది సొంత చిన్నాన్న హత్య కేసు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. దీనిపై జగన్ ను గట్టిగా నిలదీస్తే.. ఆయన తన మీద ఇప్పటికే 11 కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే ఇది పన్నెండో కేసు అవుతుందనీ అన్నారనీ, వివేకా హత్య కేసు అలా కాకూడదనే న్యాయం కోసం పోరాడుతున్నానని సునీత అన్నారు.  వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని సునీత విస్పష్టంగా చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయన్నారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని... అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు.  ఈ కేసులో జగన్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నప్పుడు తాను అభ్యంతరం చెప్పానని అన్న సునీత, అప్పుడు జగన్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు  వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తాడనితనతో అన్నారనీ, దీంతో జగన్ తో లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి   తానే వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీబీఐని కలిసిన తర్వాత తనకు, తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. అనుమానితులందరినీ సీబీఐ విచారించాల్సిందేనని చెప్పారు. తనను, తన భర్తను కూడా అనుమానితులుగానే సీబీఐ విచారించిందని తెలిపారు. తనను విచారించినట్టే ప్రతి ఒక్కరినీ విచారించాలని అన్నారు. ఏది ఏమైనా తన తండ్రి హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడే వరకూ, తనకు న్యాయం జరిగే వరకూ విశ్రమించనని స్పష్టం చేశారు. తాను రాజకీయాలలోకి రావడం, ఎన్నికలలో పోటీ చేయడంపై ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సునీత అన్నారు. 

ఏపీకి 465 కంపెనీల కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు బలగాలు

 వచ్చే ఎన్నికలలో ఏపీలో పటిష్ట భద్రత, బందోబస్తు కోసం  465 కంపెనీల కేంద్ర ఆర్మ డ్ పోలీసు బలగాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కోరారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జవహర్ రెడ్డి ఈ మేరకు కోరారు. వచ్చే ఎన్నికలలో భద్రత బందోబస్తు కోసం 58 కంపెనీల స్పెషల్ ఆర్మ్ డ్ బలగాలు అవసరమని, ప్రస్తుతం అయితే 32 కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నారు. మరో 26 కంపెనీలు పంపాలనీ కోరారు. వివిధ రాష్ట్రాల సీఎస్ లు, సీఈవోలు హోం శాఖ కార్యదర్శులతో అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికార ముఖేశ్ కుమార్ మీనా, హోం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ చలో మేడిగడ్డపై కాంగ్రెస్ చలోక్తులు

లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ మేడిగడ్డ పేరు చెప్పి బీఆర్ఎస్ తో ఓ ఆటాడుకుంటోంది.  బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపుపై చలోక్తులు విసురుతోంది. కల్వకుంట్ల కనస్ట్రక్షన్స్  మేడిగడ్డ అన్న టైటిల్ తో రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కు బలే మేసినవ్ బిడ్డా అంటూ ట్యాగ్ లైన్ పెట్టి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటును అదేమంత పెద్ద విషయం కాదంటూ కవరింగ్ ఇచ్చుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను సెటైర్లతో ఎద్దేవా చేస్తూ ఓ ఆటాడుకుంటోంది. కేటీఆర్ చలో మేడిగడ్డ పిలుపుపై సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన పోస్టర్ లో కాంగ్రెస్ మేత మేసిన మేడిపండ్లన్నీ మేడిగడ్డకు బయల్దేరాయ్ అంటూ ఎకసెక్కాలాడింది.  మేడిగడ్డ లోపాలను బయటపెట్టిన కాగ్, నేషనల్ సేఫ్టీ అథారిటీల నివేదికలను ఉటంకిస్తూ  బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. కాగ్ కు ఏం తెలుసు కాకరకాయ్, నేషనల్ సేష్టి అథారిటీకేం తెలుసు అరటికాయ్ అంటూ అసలు విషయాలన్నీ  బీఆర్ఎస్ బిల్డప్ బాబాయ్ లకే తెలుసు, ఎందుకంటే వాళ్ల అధినేత 80 వేల పుస్తకాలు చదివి మరీ ఇంజనీర్లను పక్కన పెట్టి డిజైన్ చేశారంటూ సెటైర్లు గుప్పించింది.   ఇక ఇప్పుడు ఆ అజ్ణానంతో లోపాలు సహజమే అని సమర్ధించుకోవడానికి బయలు దేరారంటూ విమర్శలు గుప్పించింది. నిజంగా మేడి గడ్డ బ్రహ్మాండంగా ఉంటే అప్పుడే ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పుడు దొంగల్లా మేడిగడ్డకు వచ్చి పోవడం ఎందుకని ప్రశ్నించింది.  

పార్టీల ఫేట్ మార్చేస్తున్న క్రాస్ ఓటింగ్.. ఇంతకీ బీజేపీది బలుపా.. వాపా?

తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, బీజేపీలకు తలనొప్పిగా మారింది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ వల్ల ఎక్కుల లబ్ధి పొందింది మాత్రం భారతీయ జనతాపార్టీయే అనడంలో  సందేహం లేదు. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు వరకూ బీజేపీకి ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ అన్న గుర్తింపు ఉండేది. పార్టీలు మారడం, ప్రభుత్వాలను కూల్చడానికి ఎమ్మెల్యేలను గంపగుత్తగా ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నడం, ప్రలోభాలకు గురి చేయడం ఇవన్నీ కాంగ్రెస్ కల్చర్ అనీ, అయితే బీజేపీ అటువంటి వాటికి దూరంగా ఉండే   విలువలు ఉన్న పార్టీగా బీజేపీకి ఒక ఇమేజ్ ఉండేది.  క్రమశిక్షణ కలిగి, విలువలు పాటించే విషయంలో బీజేపీ ముందుంటుందన్న భావన జనబాహుల్యంలో కూడా ఉండేది. అయితే 2014 ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధాకరం చేపట్టిన తరువాత క్రమంగా ఆ పార్టీకి ఉన్న స్పెషల్ ఇమేజ్ కనుమరుగౌతూ వచ్చింది.  అధికారం, అందుకోసం ఏం చేసినా ఫరవాలేదన్న భావన ఇప్పుడు ఆ పార్టీలో నిలువెల్లా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అయితే అధికారం ఒక్కటే చాలదు, చట్టసభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీయే లక్ష్యం అంటోంది. అంతే కాదు.. దేశంలో ఇన్ని పార్టీలు ఎందుకు బీజేపీ ఒక్కటే చాలు అన్న భావన కూడా ఆ పార్టీ అగ్రనేతల్లో బలంగా వ్యక్తం అవుతోంది. కేంద్రంలో అధికారంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ అధికారాన్ని గుప్పెట ఉంచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ తరువాత అంతటి బలం, సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యన్ని బాహాటంగానే ప్రకటించి అందుకు అనుగుణంగా రాజకీయ అడుగులు వేస్తున్నది. అసలిప్పుడు మోడీ అండ్ కో నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్.  అంటే ఆ పార్టీ లక్ష్యమేమిటో, ఉద్దేశమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ బెడదను బీజేపీ కూడా ఎదుర్కొన్నప్పటికీ, దాని వల్ల ఆ పార్టీకి ఏ మంత నష్టం వాటిల్లలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ లో కోలుకోలేని దెబ్బ తగిలింది.  అసలింతకీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే అనర్హత వేటు పడుతుందని తెలిసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుకు సాహసించడం వెనుక  నిస్సందేహంగా  బీజేపీ ప్రోత్సాహం ఉందని పరిశీలకులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ వారి క్రాస్ ఓటింగ్ కారణంగా రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. దీంతో ఆ పార్టీకి రాజ్యసభలో మరెవరి తోడ్పాటూ లేకుండా తన మాట చెల్లించుకోవడానికి అవసరమైన మెజారిటీని నాలుగడుగుల దూరంలో  నిలిచింది.  అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకూ.. బీజేపీకి పరోక్ష మద్దతుదారులుగానే ఉన్నాయి కనుక భవిష్యత్ లో  సభలో మాట నెగ్గించుకోవడం, బిల్లులు ఆమోదింప చేసుకోవడంలో బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు ఉండవని చెప్పొచ్చు. ఇక యూపీలో కూడా బీజేపీ ఇతర పార్టీల సభ్యుల క్రాస్ ఓటింగ్ వల్ల లబ్ధి పొందింది.  అయితే కర్నాటకలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.   మొత్తంగా 56  రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరిగితే బీజేపీ 30 గెలుచుకుని, రాజ్యసభ లో 97 సీట్ల తో పెద్ద పార్టీ గా నిలిచింది. నామినేటెడ్ సభ్యులతో కలిసి ఎన్డీయే బలం 117 కి చేరింది.  ఖాళీ స్థానాలు వదిలేస్తే రాజ్యసభ బలం 240, అంటే 121 సాధారణ మెజార్టీ కి  ఎన్డీయే కేవలం నాలుగు స్థానాల దూరంలో ఉంది.   అదే  మూడింట రెండోంతుల మెజారిటీకి 39 స్థానాలు తక్కువ. అయినా అదేమీ పెద్ద అవరోథం కాదు. ఎందుకంటే వైసీపీ, బీజేడీ ,  బీఎస్పీ, బీఆర్ఎస్, ఏడిఎంకే లు ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. పలుకుతాయి.  ఇలా చూసుకుంటే మరో పది మంది మద్దతు చూరగొంటే చాలు  రాజ్యసభ లో  ఎన్డీయేకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నట్లే. సో ఇప్పుడు ఇక బీజేపీ దృష్టంతా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ సాధించడంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ  ఒంటరిగానే 370 గెలవాలి,  అదే ఎన్డీయే స్థానాల సంఖ్య  400దాటాలి అని మోడీ పిలుపు వెనుక అర్ధం, ఉద్దేశం, లక్ష్యం ఇదే.    లోక్ సభలో మూడింట రెండోంతుల మెజారిటీ అంటే 362 స్థానాలు. ఆ బెంచ్ మార్క్ ను దృష్టిలో ఉంచుకునే మోడీ బీజేపీ గెలవాల్సిన స్థానాల సంఖ్య 370గా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.  ఆ లక్ష్యాన్ని సాధిస్తే   బిజెపికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ  వచ్చేస్తుంది. అంటే ఇక ఇష్టారాజ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవడానికి మోడీ అండ్ కోకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.   విపక్షాలు కూడా ఇదే భయంతో మోడీ హఠావో అంటూ జాతీయ స్థాయిలో ఐక్య కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో సారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ఆందోళనలో బీజేపీయేతర పార్టీలున్నాయి. ఇప్పటికే 2024లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే 2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలే జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. అయితే క్రాస్ ఓటింగ్ తో రాజ్యసభలో బీజేపీకికి పెరిగిన సంఖ్య బలుపా, వాపా అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. 

బిజెపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి యమునాపాఠక్ ? 

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన  బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటూ ఇతర కీలక నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దియో సాయ్ తదితరులు పాల్గొన్నారు.  ఏప్రిల్ - మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితాను ఈసీ నోటిఫికేషన్ కు ముందే విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ ఎంపీ  బిజెపి అభ్యర్థి ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆధ్యాత్మిక వేత నడింపల్లి యమునా పాఠక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా గతవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే స్థానాలపై చర్చలు జరిపారు.హైద్రాబాద్ ఎంపీగా మజ్లిస్ పార్టీ నుంచి వరుసగా గెలుపొందుతున్న అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టడానికి బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. పార్టీ నిర్వహించిన సర్వే నివేదికల్లో యమునాపాఠక్ పేరు వెల్లడయ్యింది. మతోన్మాదపార్టీగా  బిజెపికి బలమైన ముద్ర ఉంది. కేవలం హిందూ ఓట్లతో ఆ పార్టీ గెలుపొందే అవకాశాలు తక్కువే. ఇప్పటివరకు  ముస్లిం ఓట్లతో మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ వస్తోంది. ఓవైసీని ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఓల్డ్ సిటీ అడ్డా మజ్లిస్ అనే అభిప్రాయాన్ని ఆమె చెరిపి వేసే ప్రయత్నం చేస్తున్నారు మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన ఓల్డ్ సిటీలో బిజెపి గెలుపుసాధ్యమేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం వింటే ప్రతీ భారతీయుడు ఔననే  అంటారు. ఎవరు చెప్పారు  అండి ఓల్డ్ సిటీ అడ్డా మజ్లిస్ అని ఆమె వాదనకు దిగుతారు. హైదరాబాద్ మజ్లిస్ అడ్డా  కాదని కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిరూపించింది. ముస్లింల సంక్షేమం , అభివృద్ది కోసం బిజెపి ప్రభుత్వం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదని ఆమె అంటున్నారు. హైదరాబాద్ ఏ కులానికో, మతానికో, ప్రాంతానికో, జాతికో పరిమితం కాదు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హైదరాబాద్ అని నిరూపణ అయ్యింది. హైదరాబాద్ అందరి సొత్తు అంటారామె. గంగా జమున తెహజీబ్ హైదరాబాద్ అని అంటున్నారు. బిజెపి అధికార ప్రతినిధి హోదాలో  ఆమె తన గళాన్ని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. విద్య, వైద్యం అందించడంలో మజ్లిస్ పార్టీ వైఫల్యం చెందిందని యమునాపాఠక్ ఆరోపించారు. పాత బస్తీ పురవీధుల్లో నిరక్షరాస్యత తాండవిస్తుందని, ప్రతీసారి మజ్లిస్ గెలుపొందడానికి ఇదే కారణమని ఆమె అంటున్నారు. ఓవైసీ హాస్పిటల్స్ లో పేదముస్లింలకు చికిత్స జరగడం లేదని, అమాయక ప్రజలకు ఓవైసీ దోచుకుంటున్నాడని యమునాపాఠక్ బలంగా వినిపిస్తున్నారు. ముస్లింల ఎంపవర్ మెంట్ కోసం ఆమె అనెక కార్యక్రమాలు చేపడుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మే వారిలో యమునా పాఠక్ అగ్రస్థానంలో నిలిచారు. అధికారికంగా ఆమె పేరు శుక్ర, శనివారాల్లో వెల్లడి కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

వివేకా హత్య కుట్రదారులెవరు?..హస్తిన వేదికగా సునీత ప్రెస్ మీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు  జగన్ సొంత చిన్నాన్న  వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం (మార్చి 1) న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆప్ ఇండియా వేదికగా..  వివేకా హత్య.. కుట్రదారులు ఎవరు?.. అనే అంశంపై ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఆహ్వానం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో తన తండ్రి హత్యపై నర్రెడ్డి సునీత ప్రెస్‌మీట్‌ ఏర్పాటుపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన నాటి నుంచి ఈ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. బుల్లితెరలో ప్రసారమయ్యే మాంఛి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్‌ను తలపిస్తోందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు.  హత్య జరిగిన రోజు తొలుత.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ.. వైసీపీ  కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారు. దీంతో  వివేకా మరణ వార్త ప్రపంచానికి తెలిసింది. అయితే  కొద్ది సేపటికే.. ఆయన గుండెపోటుతో మరణించ లేదు.. దారుణ హత్యకు గురయ్యారంటూ.. మీడియాలో వరుస వార్తా కథనాలు వెల్లువెత్తడం.. దానిని సైతం పోలీసులు ధృవీకరించడంతో.. వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారని విషయం ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ హత్య జరిగిన రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి తాపీగా పులివెందుల చేరుకున్న అప్పటి  ప్రతిపక్ష నేత   జగన్.. తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని.. అందులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటూ.. నర్రెడ్డి సునీత,  షర్మిల, వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలోనే ప్రకటించారు. అంతటితో ఆగకుండా  వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. ఈ కేసులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు బహిర్గతం అవ్వరని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ కడప జిల్లా వాసులు సునీత హస్తిన వేదికగా ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడించడం ఖాయమంటున్నారు.   అప్పట్లో జగన్ నారాసుర రక్త చరిత్ర అంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. సొంత బాబాయ్ హత్య అప్పటి ఎన్నికలలో వైసీపీకి సానుభూతి పవనాలు వీచడానికి కారణమై విజయానికి దోహదపడింది. దరిమిలా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. జగన్  పాలనలో.. తన తండ్రి హత్య కేసులో  తప్పక న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని అప్పట్లో సునీత వ్యక్తం చేశారు. అయితే.. ఇంతలో వివేకా హత్య కేసు సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ విపక్ష నేతగా తాను కోర్టులో   దాఖలు చేసిన పిటిషన్‌ను సీఎం అవ్వగానే జగన్ వెనక్కి తీసుకోవడంతో పాటు.. ఈ హత్య కేసు దర్యాప్తును దాదాపుగా నీరు గార్చేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో తన తండ్రి హత్య ఎందుకు జరిగింది.. ఎవరు చేశారు.. దీనిలో ప్రమేయం ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరో బయటకు రావాలంటూ.. సోదరుడు ప్లస్ సీఎం   జగన్‌ను సునీత పలుమార్లు కోరారు.  ఆ క్రమంలో వారి మధ్య చోట చేసుకున్న సంభాషణతో.. సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం..  తన తండ్రి హత్య కేసులో దాగి ఉన్న అన్ని కోణాలు బయటకు రావాలంటే,  అందుకు సీబీఐ దర్యాప్తు ఒక్కేటే మార్గమని బావించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.     దాంతో ఈ కేసు సీబీఐ విచారణలో భాగంగా.. పలువురిని ప్రశ్నించగా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారి.. ఈ హత్యలో ఉన్న పాత్రధారులు... తెర వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు వరుసగా సీబీఐకి వివరించడమే కాకుండా...  ఈ హత్యకు కోట్లాది రూపాయిల డీల్ కుదిరిందని వెల్లడించండంతో వివేకా హత్య  ఇంటి దొంగల పనేననే విషయం ప్రపంచానికి తెలిసింది.  ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలలో అంటే.. కడప ఎంపీ   అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి  భాస్కరరెడ్డితోపాలు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సీబీఐ విచారణకు  అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో తొలిసారి హాజరైనప్పుడు  వైసీపీ అధినేత, సీఎం   జగన్ వ్యవహరించిన తీరు దగ్గర నుంచి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు, భారతీ పీఏను సైతం కడపకు పిలిపించి సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం వరకూ ఒకెత్తు అయితే... ఆ తర్వాత సీబీఐ అధికారులకు స్థానికంగా బెదిరింపులు ఎదురు కావడం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ మరొకెత్తని కడప వాసులు అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి  గన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. వచ్చిన ప్రతీసారి.. ఈ కేసు దర్యాప్తులో వేగం మందగించిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కడప వాసులు గుర్తు చేసుకుంటున్నారు.   ఇక ఆ తర్వాత ఇదే హత్య కేసులో  అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలవడం.. ఆ క్రమంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందంటూ.. కర్నూలు ఆసుపత్రిలో చేర్చడం.. దీంతో ఆ పరిసరాలకు సీబీఐ అధికారులు వెళ్లలేక పోవడం.. ఆ తర్వాత.. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటే.. సీబీఐ అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొందనే ఓ ప్రచారం   జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని జిల్లా వాసులే ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.   మరోవైపు ఇదే వివేకా హత్య కేసులో సీఎం జగన్ సొంత సోదరి వైయస్ షర్మిల.. ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత ఇదే కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. కడప ఎంపి టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందంటూ.. ఓ క్లూను ఆమె బాణంలా వదిలారు.  అదీకాక ఆస్తి కోసమే  వివేకా హత్య జరిగిందంటూ ఓ వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో, షర్మిల ఆ వాదనను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్నా.. తన ఆస్తులన్నీ ఎప్పుడో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతకు రాసేశారని.. అలా అయితే ఆస్తుల కోసమే ఈ హత్య జరిగి ఉంటే.. ముందు సునీతను కదా హత్య చేయాల్సిందంటూ.. ఓ లాజిక్ జనంలోకి వదిలారు. ఆమె లాజిక్‌తో..   వివేకా హత్యపై ప్రజల్లో ఉన్న అన్ని సందేహాలు దాదాపుగా పటాపంచలు అయిపోయాయని.. ఇంకా చెప్పాలంటే.. వివేక హత్యపై ప్రజలకు ఫుల్ క్లారిటీ   వచ్చిందని.. దీంతో ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు   షర్మిల బాసటగా నిలిచినట్లు అయిందనే భావన కడప వాసులలో వ్యక్తం అవుతోంది. అయితే  వివేకా హత్యపై .. అదీ ఢిల్లీ వేదికగా ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత.. ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే.. తన తండ్రి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఎక్కడుంది, తన తండ్రి హత్యలో పాత్రధారులు, సూత్రధారులు అరెస్ట్ కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది.. న్యాయస్థానాలు ఆదేశించినా, దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణకు మోకాలడ్డుతున్నది ఎవరు?.. ఈ దేశంలో న్యాయం అనేది సామాన్యులకే కాదు.. కొంత మంది పెద్దవాళ్లు.. అందునా ఒంటరి పోరాటం చేస్తున్న వారికి అందని ద్రాక్షగానే మిగిలి పోతుందా? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. అధికారమనే అందలం ఎక్కిన వారి ఇంటి వసారాలో న్యాయం అనేది గూటిలో రామ చిలకలాగా బందీ అయిపోయిందా? అని  కడప  జిల్లా వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక సునీత నర్రెడ్డి .. ప్రెస్‌మీట్ పెట్టి.. తన తండ్రి హత్య .. కుట్రదారులు ఎవరు అని ప్రశ్నిస్తే.. కనీసం ఎన్నికల వేళ అయినా.. ఆమెకు న్యాయం జరుగుతుందా? అని జిల్లా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది మార్చి 15కు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై అయిదేళ్లు పూర్తి అవుతుందని వారు  ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్నికల బరిలో లిక్కర్ కింగ్స్!

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు  సీరియస్  కసరత్తులు  చేస్తున్నాయి. ఆ క్రమంలో అంగ బలం, అర్థం బలం ఉన్నవాళ్లకు ఆ యా పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లి వచ్చిన వారి పేర్లను సైతం అభ్యర్థులుగా ప్రకటించే పనిలో పార్టీలు ఉన్నాయనే ఓ ప్రచారం  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు ఇప్పటికే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. అయనపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ఈ కేసులో ఆయన తీహార్ జైలుకు  వెళ్లి,  అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయటకు వచ్చారు.   ఇదే స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరపున ఆయన అన్నీ తానై వ్యవహరించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.  అయితే.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నఅనిల్ కుమార్ యాదవ్‌ను నరసారావుపేట ఎంపీగా బరిలో దిగుతుండగా, నెల్లూరు జిల్లాలోని పలువురు వైసీపీ  ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశంలోకి జంప్ కొట్టేశారు. అలాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయి రూప్ కుమార్‌తో పాటు పలువురు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సైతం.. వైసీపీకి  బై బై గుడ్ బై చెప్పేసి.. త్వరలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తామని ప్రకటించేశారు.  ఇక జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా  పార్టీని వీడడంతో.. నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి పూర్తి ఆధ్వానంగా మారిపోయింది. దాంతో ఎంపీగా శరత్ చంద్రారెడ్డిని బరిలో దింపేందుకు తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. ఆ పక్కనే ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వైసీపీకి  రాం రాం చెప్పేయడమే కాదు,  రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతున్నారని.. అయితే ఆయన ఏ పార్టీ తరఫున బరిలో దిగేది త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.  ఇక ఈ మాగుంట రాఘవరెడ్డి కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పీకల్లోతూ ఇరుక్కొని ఉండడమే కాదు.. ఆయన కూడా ఈ కేసులో తీహార్ జైలుకు వెళ్లి వచ్చారు. అయితే ఈ కేసులో తన కుమారుడిని బయటకు తీసుకు రావడంలో అధికార జగన్ పార్టీ ప్రత్యేక శ్రద్ద పెట్ట లేదంటూ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆడపా దడపా తన అనుచరుల వద్ద గోడు వెళ్ల బోసుకోనే వారని.. ఆయన వైసీపీకి రాజీనామా చేయడానికి అది కూడా ఒక కారణమని పోలిటికల్ సర్కిల్‌లో ఓ ప్రచారం జరుగుతోంది.  మరో వైపు..  త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డికి టికెట్లు కేటాయిస్తే.. వారు గెలుస్తారా? అనే ఓ చర్చ సైతం వాయువేగంతో పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఎందుకంటే, తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిండా మునిగిపోవడం... అందులోభాగంగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం తీహార్ జైలుకు వెళ్లి.. రావడం..జరిగిందని.. కానీ ఇదే కేసులో పలుమార్లు ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లి వచ్చిన కల్వకుంట్ల కవిత మాత్రం.. నేటికి జైలుకు వెళ్ల లేదు,  అయితే ఆమె జైలుకు వెళ్లక పోవడం వెనుక బీఆర్ఎస్, బీజేపీలు తెరచాటు ఒడంబడిక కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ విషయాన్ని తెలంగాణ ఓటర్లు పసిగట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్‌కు సాగనంపారని.. అలాంటి పరిణామాలు చోటు చేసుకొంటున్న క్రమంలో..  రానున్న ఎన్నికల్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి బరిలో దిగితే.. ఆయా నియోజకవర్గ ప్రజలు.. వారికి ఓటు వేసి గెలిపిస్తారా? లేకుంటే స్కామర్లు, అవినీతి పరులకు ఓటు వేసేది లేదు.. వారిని ఇంటికి సాగనంపుతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు... తమ ఓటు హక్కు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారా? అన్న చర్చ కూడా  పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.

బాబు గారు.. మీరు సూపరండి!

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా  ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకులో  ఆమె బుధవారం (ఫిబ్రవరి 28) పర్యటించారు.  ఆ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకొంది. అరకులో.. అరకు కాఫీ షాప్ వద్ద నారా భువనేశ్వరి కాఫీ తాగారు. ఆమె కాఫీ తాగుతున్న పోటో తీసి.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో భువనేశ్వరి పోస్ట్ చేశారు. ఆ తరువాత  కొద్దిసేపటికే  నారా చంద్రబాబు నాయుడు ఈ ఫొటో చూసి.. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మన గిరిజన సోదర సోదరీమణులు  ఉత్పత్తి చేసిన అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ప్రశ్నించారు.   ఆ వెంటనే నారా భువనేశ్వరి తన భర్త చేసిన ట్వీట్ కు తనదైన శైలిలో ఎక్స్‌లో స్పందించారు. ఈ కాఫీ బాగా నచ్చిందండి. మన వంట గదిలో ఈ అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ.. అరుకు లాంటి అందమైన ప్రదేశాల్లో ఇక్కడి ప్రజల మధ్య కూర్చుని కాపీ తాగుతుంటే.. ఈ అరకు కాఫీ రుచి మరింత మధురంగా ఉందండి. ఈ కాఫీ ఇంత అద్భుతంగా ఉండడం వెనుక దాగి ఉన్న రహస్యం.. మన గిరిజన సోదర సోదరీమణులు పెంచుకున్న ప్రేమేనని ఆమె అభివర్ణించారు. అలాగే అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా మార్చిన ఘనత మీదేనని.. అందుకు తాను గర్వపడుతున్నానని.. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు నారా భువనేశ్వరి తెలిపారు.  ఎక్స్  వేదికగా వీరిరువురి మధ్యా చోటు చేసుకున్న సంభాషణ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అవుతోంది.   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు కాఫీ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశ పెట్టి.. ఆ కాఫీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ కాఫీ సాగు ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో.. వారంతా కాఫీ సాగు పట్ల  ఆసక్తి కనబరిచారు. దీంతో అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది.   ఈ అరకు కాఫీ రుచికి ప్రపంచంలోని కాఫీ ప్రేమికులంతా ఫిదా అయిపోయారు. అరకు రైతులు.. కెమికల్స్  ఉపయోగించకుండా.. అరకులో కాఫీ పంట సాగు చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చేప్పాలంటే.. సేంద్రియ పద్దతుల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కొండ ప్రాంతాలైన అనంతగిరి, పాడేరు, పెద్ద బయలు, జి మాడుగులతోపాటు ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతాల్లో ఈ కాఫీ పంటను సాగు చేస్తున్నారు.  ఇక్కడ పండిన పంటను పలు యూరోపియన్ దేశాలతోపాటు.. పలు ఇతర దేశాలకు  ఎగుమతి అవుతోంది. అమెరికా బ్రిటన్ తదితర దేశాల్లో ఇప్పటికే అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారంటే.. అరకు కాపీ రుచిలో ఉన్న మత్తు.. గమ్మత్తు ఏంటో అర్థమవుతోంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జీ 20 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాధ్యక్షులు అరకు కాఫీ రుచి చూసి.. మనస్సు పారేసుకున్నారు. అదీ అరకు కాఫీకి ఉన్న పవర్.

రుషికొండ‌లో క్షుద్ర పూజ‌లు?.. నరబలి?

రుషికొండ‌లో క్షుద్ర పూజ‌లు జ‌రిగాయా? అందుకే మీడియాను సైతం అనుమ‌తించ‌లేదా? వంద‌ల కోట్ల‌ ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాకుండా మంత్రి రోజా, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అంత ర‌హ‌స్యంగా ఎందుకు ప్రారంభించాల్సి వ‌చ్చింది? రుషికొండ‌పై నిర్మించిన భ‌వ‌నాలు టూరిజంకోసం వినియోగించేందుకా? ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు సీఎం క్యాంప్ కార్యాలయానికా? రుషి కొండ‌పై అస‌లేం జ‌రుగుతోంది..? ప్ర‌స్తుతం ఈ అంశాల‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ఈ భ‌వ‌నాల‌ను మంత్రి రోజా ప్రారంభించారు. అందులోనూ స్వ‌రూపానంద స్వామీజీ కూడా ఉన్నారు. దీంతో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే రుషికొండ భ‌వ‌నాల్లో న‌ర‌బ‌లి జ‌రిగింద‌ని, అందుకే స్వ‌రూపానంద వెళ్లారంటూ ఆరోపించారు. పాల్ వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా.. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ర‌హ‌స్యంగా ప్రారంభించ‌డంపై ఏపీ ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ‌లో ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌. ఈ కొండ‌ను అక్ర‌మంగా త‌వ్వేసిన తీరుపై మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌తోపాటు విశాఖ ప్ర‌జ‌లు సైతం రుషికొండ‌పై త‌వ్వ‌కాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. రుషికొండ‌పై అనుమ‌తులు ఒక‌లా.. ప‌నులు మ‌రోలా జ‌ర‌గ‌డం వివాదాస్ప‌దంగా మారింది. రుషికొండ‌పై రిసార్ట్స్ పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీటీడీసీ కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి 9.88 ఎక‌రాల‌కు సీఆర్‌జ‌డ్ అనుమ‌తి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం భ‌వ‌న నిర్మాణాల ప్లాన్‌కోసం 65 ఎక‌రాల‌కు అనుమ‌తి కోర‌డం అప్ప‌ట్లో వివాదాస్ప‌దంగా మారింది. జీవీఎంసీకీ స‌మ‌ర్పించిన ప్లాన్‌లోని భ‌వ‌నాల‌కు సంబంధించిన ఆకృతులు ప‌ర్యాట‌క వ‌స‌తుల‌కు వీలుగా లేవు. దాదాపు అన్ని నిర్మాణాల ఆకృతులు కార్యాల‌యాల‌ను పోలి క‌నిపించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి తోడు మొద‌టి నుంచి ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు రుషికొండ‌పై త‌వ్వ‌కాల‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చారు. హైకోర్టు, జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్‌జీటీ)లో కేసులు దాఖ‌ల‌య్యాయి. హైకోర్టు ఆదేశాల మేర‌కు అయిదుగురు స‌భ్యుల నిపుణుల క‌మిటీ రుషికొండ మీద స‌ర్వే చేప‌ట్టి ప‌లు ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయ‌ని తేల్చింది. ఆ త‌రువాత హైకోర్టు కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ ను ప‌రిశీల‌న‌కు ఆదేశించింది. ఎంవోఈఎఫ్ సైతం నిపుణుల క‌మిటీతో ప‌రిశీలించింది. దీనికి సంబంధించి తుది తీర్పు త్వ‌ర‌లో రానుంది. తీర్పు రాక‌ముందే.. ఈ భ‌వ‌నాలు ప్రారంభించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. కోర్టు ఈ అంశాన్ని సిరీయ‌స్ గా తీసుకుంటే రోజాకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న ఉంది. రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ వెళ్లారు. అయితే  పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రుషికొండ లోపల ఏం జరుగుతుందో తెలియాలి. ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు అంత రహస్యం అని ప్రశ్నించారు. శారదా పీఠం స్వామిని పిలిచారు. లోపల నరబలి ఏమయినా జరిగిందేమో అని అనుమానం ఉంది. ఇదే స్వ‌రూపానంద తెలంగాణ‌లో కేసీఆర్ కోసం న‌ర‌బ‌లి ఇచ్చారని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్ కోసం అదే చేస్తున్నారని అనుమానంగా ఉంది. న‌ ర‌బ‌లి ఇచ్చాడు కాబ‌ట్టే ఎవ‌ర్నీ రానివ్వ‌డం లేదంటూ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రుషికొండ అక్రమాలు, ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి పిల్ వేస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు. అయితే, భ‌వ‌నాల ప్రారంభం త‌రువాత టూరిజం మంత్రి రోజా మాట్లాడుతూ.. రుషికొండ‌లో హ‌రిత రిసార్ట్స్ పాత‌వి ఉండేవి.. వాటి స్థానంలో అత్యంత ఆధునిక ప‌ద్ద‌తుల్లో ఏడు బిల్డింగ్ లు నిర్మాణం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. టూరిజం కోసం అన్ని అనుమతులూ తీసుకొని వాటిని నిర్మాణం చేయ‌టం జ‌రిగింది. విశాఖ నుంచి  పాల‌న ప్రారంభ‌మైతే సీఎం జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం ఎక్క‌డ నుంచి అయితే బాగుంటుంద‌ని త్రీమెన్ క‌మిటీ ప‌లు ప్రాంతాల‌ను చూసింద‌ని, రుషికొండను క్యాంప్ కార్యాల‌యంగా చేసుకొని పాల‌న సాగిస్తే బాగుంటుంద‌ని చెప్ప‌డం జ‌రిగింద‌ని రోజా తెలిపారు. అయితే, అది సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని, సీఎం క్యాంప్ కార్యాల‌యంగా అది వినియోగించుకోక‌పోతే టూరిజం భ‌వ‌నాలుగా కొన‌సాగుతాయ‌ని రోజా చెప్పారు. మొత్తానికి జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం కోస‌మే ఈ భ‌వ‌నాలు నిర్మాణం చేసిన‌ట్లు రోజా చెప్ప‌క‌నే చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ హ‌డావుడిగా రుషికొండ‌పై భ‌వ‌నాల‌ను ర‌హ‌స్యంగా ప్రారంభించ‌డం వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద ప్లాన్ ఉంద‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తిని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తాన‌ని, అందులో విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఉంటుంద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ ను ఏపీ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్యతిరేకించారు.   అయినా.. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో విశాఖ నుంచి పాల‌న సాగించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. కానీ కోర్టులు మొట్టికాయ‌లు వేస్తుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింది. తాజాగా కోర్టుల‌ను ధిక్క‌రించేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్నద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండ‌పై నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సుమారు 500 కోట్ల‌తో నిర్మాణం చేసిన భ‌వ‌నాలను మంత్రి రోజా, వైసీపీ నేత‌లు మీడియాను సైతం అనుమ‌తించ‌కుండా ప్రారంభించారు. రోజా టూరిజం మంత్రి కాబ‌ట్టి ఆమె ప్రారంభిస్తే అవి టూరిజం భ‌వ‌నాలేన‌ని ప్ర‌జ‌ల‌ను నమ్మించవచ్చని జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా వీటిని ఆమె చేత ప్రారంభింపచేశారు. అయితే ఆ వ్యూహం వికటించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వారంలో మూడు రోజులు ఈ భ‌వ‌నాల్లో ఉంటార‌ని తెలుస్తోంది. త‌ద్వారా విశాఖ నుంచి పాల‌న చేస్తాన‌న్న త‌న మాట‌ను నెగ్గించుకునేందుకు జ‌గ‌న్ ఇలాంటి ఎత్తుగ‌డ వేశార‌ని పరిశీలకులు అంటున్నారు.