టీడీపీ కొత్త రగడ.. భూమా ఆఖిల ప్రియ వర్సెస్ గంగుల
మొన్నటి వరకూ టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డికి, శిల్పా సోదరులకు మద్య విబేధాలు ఉండేవి. ఎలాగొలా వారిద్దరి మధ్య విబేధాలు ముగిసిపోయాయి అనుకునేలోపు.. మరో రగడ మొదలైంది అప్పుడే. అయితే ఈసారి భూమా ఆఖిల ప్రియ, గంగుల వంతు వచ్చింది. చాగలమర్రి మండలం గొడిగనూరులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టిన వేళ, గంగుల ప్రతాపరెడ్డి వర్గీయులు వాటిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వర్గీయుల ఆక్రమణలను కాదని, తమ వారి కట్టడాలను మాత్రమే కూల్చుతున్నారని గంగుల వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇద్దరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టి ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.