ఉప్పల్ టెస్ట్: పూజారా డబుల్ సెంచరీ,అవుట్

          హైదరాబాద్ ఉప్పల్ లో ఆస్ట్రేలియా తో జరుగుతున రెండో టెస్టు మూడో రోజు పూజారా డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో పుజారా టెస్టుల్లో వెయ్యి పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇది టెస్టులో రెండో డబుల్ సెంచరీ. ఇంతకుముందు ఇంగ్లాండ్ పై ద్విశతకం చేశాడు. 311/1తో మూడో రోజు బరిలోకి దీగిన భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో వికెట్ కు 370 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పిన తరువాత మురళి విజయ్ 361 బంతుల్లో 161 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆతరువాత డబుల్ సెంచరీ చేసిన పూజారా కూడా మూడో వికెట్ గా వెనుదిరిగాడు. లంచ్ విరామానికి ఇండియా స్కోరు 400/3. సచిన్ మూడు పరుగులు, కోహ్లి నాలుగు పరుగులతో ఆడుతున్నారు.

ఉప్పల్ టెస్ట్: సెంచరీలు చేసిన విజయ్, పూజారా

        ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శతకాలు సాధించారు. చటేశ్వర్ పూజారా, భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీలు సాధించారు. టెస్టుల్లో పూజారాకు ఇది నాలుగో శతకం. 188 బంతుల్లో పూజారా సెంచరీని సాధించాడు. భారత ఓపెనర్ మురళీ విజయ్ 243 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. ఈ శతకంలో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు వున్నాయి. టెస్టుల్లో విజయ్‌కు ఇది రెండో శతకం. పుజారా, విజయ్‌లు చెలరేగి సెంచరీలు చేయడంతో భారత్ 311/1 పరుగులు చేసింది. సెహ్వాగ్ త్వరగా అవుటైనా విజయ్, పుజారాలు మైదానంలో సెంచరీల మోత మోగించారు. ఆసీస్ పైన రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 74 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఉప్పల్ టెస్ట్: ఆస్ట్రేలియా237/9, భారత్ 5/0

        హైదరాబాద్ ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 237 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మూడు ఓవర్ల ఆట మిగిలిన ఉన్న స్థితిలో ఇన్నింగ్సును డిక్లేర్ చేసి, భారత ఓపెనర్లపై ఒత్తిడి పెంచేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్రయత్నించాడు. అంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులతో, మురళీ విజయ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.   టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ను భునేశ్వర్ కుమార్ మూడు ప్రధాన వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ను కెప్టెన్క్ క్లార్క్‌, మాథ్యూ వాడే ఆదుకున్నారు. అర్థ సెంచరీ చేసిన తర్వాత వాడే 62 పరుగుల వద్ద హర్భజన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు చెయ్యలేకపోయారు. క్లార్క్ 91 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసుకోగా, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. డిక్లేర్ చేసే సమయానికి పాటిన్సన్ ఒక పరుగుతో, దోహర్తీ జీరో పరుగులతో క్రీజులో ఉన్నారు.  

హైదరాబాద్ టెస్ట్: ఆస్ట్రేలియా 19/2

        ఇండియా..ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో పేలుళ్లు జరిగిన నేపధ్యంలో ఈ మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. వార్నర్ 6 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతరువాత కోవాన్ కూడా నాలుగు పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి 19 పరుగులతో ఆడుతోంది.

చెన్నై టెస్ట్: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా

        చెన్నైలో ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జడేజా బౌలింగ్ లో చివరి వికెట్ కోల్పోయింది. ఇండియా కు పరుగుల 50 టార్గెట్ సేట్ చేసింది. 50 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ మురళి విజయ్ మళ్ళీ విఫలమయ్యాడు. 12 బంతుల్లో ఒక సిక్సర్ బాదేసి అవుటయ్యాడు. 19 పరుగులు చేసిన సెహ్వాగ్ లాయోన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన మాస్టర్ సచిన్ వరుస బంతుల్లో రెండు సిక్స్ లు బాది13 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఛతేశ్వర్ పుజారా 8 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. ఇండియా ఆస్ట్రేలియా పై 8 వికెట్ల తేడాతో విజయం సాదించింది. ఈ విజయంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది. ఈ ఒక్క విజయంతో ఇండియా సంబరపడిపోకుండా ఒక్కసారి ఇంగ్లాండ్ సిరీస్ ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంగ్లాండ్ తో కూడా మొదటి మ్యాచ్ గెలిచి మిగతా మ్యాచ్ లు వాళ్ళకి సమర్పించిన విషయం తెలిసిందే.       

చెన్నై టెస్ట్: ముగిసిన ధోని ధనాధన్ ఇన్నింగ్స్

        ఆస్ట్రేలియా పై ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా 572 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు 192 పరుగుల ఆధిక్యం దక్కింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఇన్నింగ్సు ఆడి సోమవారం ఉదయం అవుటయ్యాడు. అతను 224 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాటిన్సన్ బౌలింగులో అవుటయ్యాడు. ధోనీ తర్వాత భువనేశ్వర్ కుమార్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 572 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ బౌలర్లు పటిన్సన్ ఐదు వికెట్లు, లైయోన్ మూడు వికెట్లు, సిడిల్ ఒకటి, హెన్సిక్స్ ఒక వికెట్‌ను తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ 380 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

చెన్నై టెస్ట్ : ఆస్ట్రేలియా పై ధోని డబుల్ ధమాకా

        ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇండియా సెంచరీల మోత మోగించింది. మూడోరోజు సెంచరీ చేస్తాడనుకున్న మాస్టర్ సచిన్ అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ, ధోనిలు మాత్రం అదరగొట్టారు. సచిన్ టెండూల్కర్ 81 పరుగుల చేసి లియాన్ బౌలింగులో అవుటయ్యారు. ఆతరువాత క్రీజులో వచ్చిన ధోని తన ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. వరుసగా వికెట్లు పోతున్నా ధోనీ నిబ్బరంగా ఆడుతూ 200 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం స్కోరు 515 ఎనిమిది వికెట్లు కోల్పోయింది.  ఆసీస్ పై ఇండియా 135పరుగుల ఆధిక్యం సాధించింది. ధోనీ నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటడమే కాకుండా తొలిసారి డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో డబుల్ చేయడం ధోనీకి ఇదే తొలిసారి. 231 బంతుల్లో ద్విశతకం చేసిన ధోనీ 21 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ధోనీ ఇప్పటి వరకు 74 టెస్టుల్లో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలు చేశాడు. 2005 డిసెంబర్ 5న ధోనీ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. మళ్లీ అదేగట్టపై ధోనీ తొలి డబుల్ సెంచరీ చేశాడు.

అంబటి రాయుడు సూపర్ సెంచరీ

        రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ కప్‌ను 25వసారి అందుకునే దిశగా అడుగులేస్తోంది. అంబటి రాయుడు 217 బంతుల్లో 118పరుగుల అజేయ సెంచరీ చేశాడు. అర్ధ సెంచరీలను శతకాలుగా మార్చాల్సిన అవసరం ఉందని తెలుగు తేజం అంబటి రాయుడు అంటున్నాడు. టీమిండియా జట్టులో చోటుకోసం ఆలోచించడడం లేదన్న రాయుడు.. తన బ్యాటింగ్‌తో సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. '50 పరుగులు పైబడి చేసే ఇన్నింగ్స్‌ను శతకాలుగా మార్చాలి. ప్రస్తుతం 27 అర్ధ సెంచరీలు, 14 సెంచరీలు. భవిష్యత్తులో ఈ నిష్పత్తిని సమం చేస్తా' అని రాయుడు చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ మాత్రమే చేశానని, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌పైనే ధ్యాస నిలపాలి తప్ప పరుగులపై కాదనుకున్నానని తొలిసారి ఇరానీ కప్‌లో ఆడుతున్న రాయుడు అన్నాడు. ఈ సీజన్ తనకెంతో కలిసొచ్చిందంటున్న రాయుడు.. సెంచరీల సంఖ్యను పెంచుకోలేకపోవడం నిరాశ పర్చిందన్నాడు. తన బ్యాటింగ్ శైలిలో కొన్ని మార్పులు చేయడంతో ఇకపై భారీగా పరుగులు రాబట్టగలననే ఆశాభావం వ్యక్తం చేశాడు.  

చెలరేగిన సచిన్, రికార్డ్ బ్రేక్

        ముంబైలో జరుగుతున్న ఇరానీ కప్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. వాంఖేడే స్టేడియంలో ముంబై తరఫున ఆడుతున్న సచిన్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీ సాధించాడు. మాస్టర్ కి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది 81వ సెంచరీ. ఇరానీ కప్ లో రెండో సెంచరీ.1989లో ఇదే స్టేడియంలో ఢిల్లీ పైన 16 ఏళ్ల వయస్సులో ఇరానీ కప్‌లో సెంచరీ సాధించాడు. సచిన్ ఈ సెంచరీను మూడో రోజు చేశాడు. సునీల్ గవాస్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచులలో చేసిన 81 సెంచరీల రికార్డును సచిన్ సమం చేశాడు.రెస్ట్ ఆఫ్ ఇండియాపై ముంబై 409 పరుగులకి ఆలౌటైంది. సచిన్ 18 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 140 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు

స్టెయిన్ బౌలింగ్ అదుర్స్ : పాక్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం

        జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్టు లో సౌత్ఆఫ్రికా ఘనవిజయం సాదించింది. రెండో ఇన్ని౦గ్స్ లో పాకిస్తాన్ 268 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా మొదటి టెస్టులో 211 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.   మొదటి టెస్టులో డేల్ స్టెయిన్ బౌలింగ్ పాక్ ఎదురునిల్వలేకపోయింది. తొలి ఇన్ని౦గ్స్ లో 49 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్, రెండో ఇన్ని౦గ్స్ లో 268 పరుగులకే ఆలౌటైంది. డేల్ స్టెయిన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే ఐదు వికెట్లు సాధించాడు. వికెట్ కీపర్ డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో పాటు 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డును సమం చేశాడు.  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అద్భుత బౌలింగ్‌తో రాణించిన స్టెయిన్‌కే దక్కింది.

40వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై

        రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై ఘనవిజయం సాధించింది. సౌరాష్ట్ర పై 125పరుగులు ఇన్ని౦గ్స్ తేడాతో గెలిచి రికార్డ్ 40వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్ని౦గ్స్ లో ధవళ్ కులకర్ణి, అజిత్ అగరార్కర్ దెబ్బకు సౌరాష్ట్ర 82కే ఆలౌటైంది. అజిత్ అగరార్కర్ 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, కులకర్ణి 32 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మొదటి ఇన్ని౦గ్స్ లో  సౌరాష్ట్ర144 పరుగులు చేయగా, ముంబై 355 పరుగులు చేసింది. రెండో ఇన్ని౦గ్స్ లో కూడా సౌరాష్ట్ర బ్యాట్స్ మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. ఎస్‌హెచ్ కోటక్ (0), ఎస్‌డి జోగియానీ (0), ఆర్ఆర్ దావే (5), ఎవి వాసదేవ (0), జెఎన్ షా (6), ఎస్‌పి జాక్సన్ (9), కెఆర్ మక్వానా (7), ఎస్ సానాండ్యా (16) చెత్తగా అవుటయ్యారు. టీ విరామ సమయానికి సౌరాష్ట్ర 58 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. టీ విరామ సమయం తర్వాత ధర్మేంద్ర సిన్హ్ జడేజా (22), జైదేవ్ ఉనద్కత్ (9) త్వరగా అవుటయ్యారు. సౌరాష్ట్ర పై ముంబై 125పరుగులు ఇన్ని౦గ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. రంజీల్లో సెంచరీల రికార్డ్ బద్దలు కొట్టిన వసీం జాఫర్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

రోహిత్, రైనా దూకుడు, వన్డే సిరీస్ మనదే

        ఎట్టకేలకు టీమిండియా విజయపధంలో దూసుకుపోతుంది. ఇటీవల సొంతగడ్డపై కూడా సిరీస్‌లు సమర్పించుకున్న భారత్ ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్ లో హ్యాట్రిక్ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొహాలీ లో ఇంగ్లాండ్ పై ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది.   258 పరుగుల లక్ష్య౦తో బరిలోకి దిగిన ఇండియా రహానె స్థానంలో వచ్చిన రోహిత్ 83 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలపాడు. రైనా 79 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 89 నాటౌట్ గా నిలిచి లక్ష్యాన్ని పూర్తిచేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 257 పరుగులు చేసింది. కుక్ 76, కెవిన్‌పటర్సన్ 76పరుగులు చేసి అవుటయ్యారు. రూట్ 45 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. రవీంద్ర జడేజా (3/39) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇషాంత్ శర్మ, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. ఓ దశలో కుక్‌సేనను 43 ఓవర్లలో 176/4తో కట్టడి చేసిన భారత బౌలర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు.  

బ్రిస్బేన్ వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు, 74 ఆలౌట్

        బ్రిస్పేన్ లో శ్రీలంక తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కి క్యూకట్టారు. ఆస్ట్రేలియా ఒక సందర్భంలో 40 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే, మిచెల్ స్టార్క్, జేవియర్ దొహర్తీ 8.1 ఓవర్లలో 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాస్తా ఊరట కల్పించారు. శ్రీలంక బౌలర్లు నువాన్ కులశేఖర (5/22), లసిత్ మలింగ (3/14) కంగారూలకు చుక్కలు చూపించారు. శ్రీలంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఆస్ట్రేలియా 74 పరుగులకే పరిమితమైంది. 1986 తర్వాత ఆస్ట్రేలియా ఇంత దారుణమైన స్కోరు సాధించడం ఇదే మొదటిసారి. శ్రీలంక 75 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చేదించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, శ్రీలంక చెరో మ్యాచులో విజయం సాధించాయి. దీంతో సిరీస్ 1-1 స్కోరుతో సమంగా ఉంది.

రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

        కోచిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఇండియా జట్టు కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండు, భారత్ రెండో వన్డే జట్టులో ఓ మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా స్థానంలో పాకిస్తాన్‌తో జరిగిన చివరి వన్డేలో సత్తా చాటిన పేసర్ షమీ అహ్మద్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండు కూడా ఒక మార్పు చేసింది. టిమ్ బ్రెస్నన్ స్థానంలో క్రిస్ వోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ను గెలుచుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నా, రెండో వన్డేలోనూ విజయం సాధించి తీరాలని కుక్ సేన పట్టుదలతో ఉంది.   ఇండియా: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), గౌతం గంభీర్, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమీ అహ్మద్ ఇంగ్లాండు: అలిస్టిర్ కుక్ (కెప్టెన్), జ్యో రూట్, ఇయాన్ బెల్, జడే డెర్న్‌బ్యాచ్, స్టీవెన్ ఫిన్, క్రెయిగ్ కీష్వెట్టర్ (వికెట్ కీపర్), ఇయోన్ మోర్గాన్, సమిత్ పటేల్, కెవిన్ పీటర్సన్, జేమ్స్ ట్రెడ్‌వెల్, క్రిస్ వోక్స్

రాజ్ కోట్ వన్డేలో ఓడిన భారత్

        రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే లో ఇండియా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి నష్టానికి 316 పరుగులు చేసింది. 326 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దీగిన భారత్ ఓపెనింగ్ జోడి చాల రోజుల తరువాత మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అజింక్యా రహనే 47 పరుగులు చేయగా, ఆ తర్వాత గంభీర్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు.యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గంభీర్ అర్థ సెంచరీలు చేసినా ఇండియాను గెలిపించలేకపోయారు. ట్రెడ్‌వెల్ నాలుగు వికెట్లు తీసి భారత్ దెబ్బ కొట్టాడు. భారత్ ఓడిన చివరి వరకు పోరాడింది.   టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.     

రాజ్కోట్ వన్డే: ఇండియా టార్గెట్ 326

        రాజ్ కోట్ లో ఇండియా తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.   ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.    

అదరగొట్టిన సచిన్..కాళ్లకు దండం పెట్టిన ఓ అభిమాని

      వన్డే క్రికెట్ రిటైర్మెంట్ తరువాత క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ముస్సోరిలో గడిపాడు. అనంతరం ము౦బై తిరిగి వచ్చిన సచిన్ రంజీ మ్యాచ్ లో అదరగొట్టాడు. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబాయి ను సచిన్, జాఫర్ సెంచరీలతో నిలబెట్టారు. సచిన్ (233 బంతుల్లో 108; 10 ఫోర్లు, 1 సిక్సర్), వసీం జాఫర్ (256 బంతుల్లో 137 బ్యాటింగ్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. తొలిరోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. సచిన్‌కు రంజీల్లో ఇది 18వ సెంచరీ కాగా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 80వది. భారత్ తరఫున గవాస్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (81) రికార్డుకు సచిన్ మరో సెంచరీ దూరంలో నిలిచాడు. ముంబయి జట్టు తరఫున ఆడుతున్న సచిన్ ప్రత్యర్థి బరోడా టీం బౌలర్లకు చుక్కలు చూపించాడు. సచిన్ టెండుల్కర్ చేసి పాంలోకి రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఓ అభిమాని ఏకంగా స్టేడియం దిశగా దూసుకొచ్చాడు. అయితే అతనిని నిరాశపర్చడం ఇష్టం లేని సచిన్ చేతులు కలిపాడు. దీంతో ఆ అభిమాని సచిన్ కాళ్లకు దండం పెట్టడం విశేషం.