ఆస్ట్రేలియా పై గంభీర్ సెంచరీ
posted on Feb 16, 2013 @ 5:14PM
ఆస్ట్రేలియా తో జరగనున్న టెస్ట్ సిరీస్ కి చోటు సంపాదించడంలో విఫలమైన గంభీర్ ప్రాక్టీస్ మ్యాచ్ లో మాత్రం తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో గంభీర్ 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు.రోహిత్ శర్మ77 పరుగులు చేసి గంభీర్ కి సహకారం అందించాడు. తివారి 77 అర్థ సెంచరీ చేసి నాట్ అవుట్ గా క్రీజులోవున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో దోర్తీ 3 వికెట్లు పడగొట్టాడు. హెన్రీక్వీస్ ఒక వికెట్ దక్కించుకున్నారు.