చెన్నై టెస్ట్: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా
posted on Feb 26, 2013 @ 2:17PM
చెన్నైలో ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జడేజా బౌలింగ్ లో చివరి వికెట్ కోల్పోయింది. ఇండియా కు పరుగుల 50 టార్గెట్ సేట్ చేసింది.
50 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ మురళి విజయ్ మళ్ళీ విఫలమయ్యాడు. 12 బంతుల్లో ఒక సిక్సర్ బాదేసి అవుటయ్యాడు. 19 పరుగులు చేసిన సెహ్వాగ్ లాయోన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన మాస్టర్ సచిన్ వరుస బంతుల్లో రెండు సిక్స్ లు బాది13 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఛతేశ్వర్ పుజారా 8 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. ఇండియా ఆస్ట్రేలియా పై 8 వికెట్ల తేడాతో విజయం సాదించింది. ఈ విజయంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది.
ఈ ఒక్క విజయంతో ఇండియా సంబరపడిపోకుండా ఒక్కసారి ఇంగ్లాండ్ సిరీస్ ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంగ్లాండ్ తో కూడా మొదటి మ్యాచ్ గెలిచి మిగతా మ్యాచ్ లు వాళ్ళకి సమర్పించిన విషయం తెలిసిందే.