పరాజయం నేర్పే పాఠాలు

జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.   మనుషుల విలువ నేర్పుతుంది ‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.   వినయం విలువ నేర్పుతుంది అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.   లక్ష్యం విలువ నేర్పుతుంది కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.   జీవితం విలువ నేర్పుతుంది అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.   - నిర్జర.

భారతీయ స్త్రీలకి ఎక్కువవుతున్న మానసిక వత్తిడి

    సరోజ అయిదు గంటలకే లేచింది. బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని కాసేపు యోగా చేసి, పిల్లల్ని లేపి, స్కూల్ కి రెడీ కమ్మని చెప్పి వంట గదిలోకి దూరింది. బ్రేక్ ఫాస్ట్ చేసింది. అందరూ ఒకటే రకం తినరు. కొంతమందికి ఇడ్లీ, చట్నీ చేసి, పాలు, సిరియల్, పళ్ళరసం, బ్రెడ్ టోస్ట్ చేసి, బట్టర్, జామ్, టేబుల్ మీద పెట్టింది. తనకి, భర్తకి కాఫీ, కలిపింది. పిల్లలకి లంచ్ బాక్స్ ల్లో ఒకరికి పరోటా, స్నాక్ కి కుక్కిస్, జ్యూస్ పెట్టింది, మరొకరికి సాండ్ విచ్, స్నాక్, చాక్లెట్ మిల్క్ పెట్టింది. కూతురు బ్రేక్ ఫాస్ట్ చేయగానే రెండు జడలు వేసింది, కూచిపూడి నేర్చుకుంటుంది కాబట్టి జుట్టు కట్ చేసుకోకుండా పెంచుకుంటుంది కాబట్టి రోజు జడలు వేయాల్సిందే. పిల్లలు రెడీ అయ్యి స్కూల్ బస్ వచ్చే టైమ్ కి పరిగెత్తారు. భర్త కూడా రెడీ అవుతున్నాడు, సరోజ తమ ఇద్దరికి లంచ్ ప్యాక్ చేసి టేబుల్ మీద పెట్టి బట్టలు మార్చుకుని రెడీ అయ్యి, బ్రేక్ ఫాస్ట్ తిన్నాననిపించింది, కాఫీ చల్లారి పోతే వేడి చేసింది, భర్త బ్రేక్ ఫాస్ట్ టి.వి.లో న్యూస్ చూస్తూ తింటున్నాడు. సరోజ కాఫీ సిప్ చేస్తూనే గిన్నెలు డిష్ వాషర్ లో పెట్టేసింది. టైమ్ కాగానే ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయట పడ్డారు.   సరోజ పిల్లల స్కూల్ అయిపోయేవరకే వర్క్ చేస్తుంది. మిగిలిన పని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పనులయ్యాక రాత్రి ఒక రెండు గంటలు పని చేసుకుంటుంది. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చి వారికి తినడానికి ఏదైనా పెట్టి ఒకరిని పియానో క్లాస్ కి, మరొకరినీ సాకర్(ఇండియాలో ఫుట్ బాల్) ప్రాక్టీస్ దగ్గర దిగబెట్టి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఒకొక్కరిని పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వారికి హోం వర్క్ లో సాయం కావాలంటే చేస్తుంది మళ్ళీ సాయంత్రం వంట, ఇల్లు క్లీనింగ్, లేదా లాండ్రీ పనులు చేసుకుంటుంది. భర్త ఇంటికి త్వరగా వస్తే పిల్లలకి హోం వర్క్ చేయించడమో, లాండ్రీ పనో, ఎపుడైనా ఒకసారి ఇల్లు వాక్యూమ్ పని చేస్తాడు. రోజు పిల్లలకి స్కూల్ తర్వాత ఏదో ఒక క్లాస్ వుంటుంది. ఇండియన్ పిల్లలందరికి ప్రజ్ఞా క్లాస్ అనీ శ్లోకాలు అవి నేర్పిస్తారు,పాపని కూచిపూడి డ్యాన్స్ కి పంపిస్తారు, బాబుకి మృదంగం, మళ్ళీ ఇద్దరికీ కలిపి కర్ణాటక సంగీతం గాత్రం నేర్పిస్తారు. మాతృభాష తనే నేర్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు మళ్ళీ దానికి క్లాసులకి పంపించడం మొదలు పెట్టారు. ఇలా సరోజ అటూ ఉద్యోగం, ఇటు పిల్లలకి మన సంస్కృతిని మర్చిపోకుండా వుండాలంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి అనుకుని చాలా సమయం పిల్లల్ని ఈ రకరకాల క్లాసులకి తీసుకెళ్ళడానికి కార్లోనే గడిపేస్తుంది. ఈ మధ్యనే తనకి థైరాయిడ్ సమస్య వచ్చింది. త్వరగా అలిసిపోతుంది. వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళడమో, వారిని పిల్చి గెట్ టుగెదర్ చేసుకోవడమో చేస్తారు. కొంతమంది స్త్రీలు వలంటీర్ పని చేయడం, ఏదైనా ఇండియన్ సంస్థలో కానీ అక్కడి వలంటీర్ సంస్థల్లో వారికిష్టమయిన పనులు చేస్తుంటారు. ఒకోసారి రాత్రిపూట ఎవరైనా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి వారికి ఏ విధంగా సాయం చేయగలరో అలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఉరుకులు పరుగుల మీద సాగుతుంటుంది సామాన్యంగా విదేశాల్లో వుండే ఏ భారతీయ స్త్రీ జీవితం అయినా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.   ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మానసిక వత్తిడి ఎదుర్కునే స్త్రీలెవరంటే, భారతీయ స్త్రీలు 87% కంటే ఎక్కువగా మానసిక వత్తిడి (Stress)కి గురవుతున్నారని నీల్ సన్(Nielsen)సర్వేలో తేలింది 2010 సంవత్సరంలో. భారతీయ స్త్రీలు ప్రతి రంగంలో అడుగిడుతున్నారు, తాము ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు, విజయాలేన్నో సాధిస్తున్నారు. అయినా ఇంకా భారతీయ కుటుంబంలో ఆడపిల్ల పుడుతుందంటే భయం, ఎందుకూ? ఆడపిల్లని చదివించాలి, మొగపిల్లలని కూడా చదివిస్తారనుకొండి, కానీ వారయితే వృద్దాప్యంలో తమని చూసుకుంటారని పున్నామ నరకం నుండి తప్పిస్తారని ఒక మూడ నమ్మకం. స్త్రీలు అత్తగారి ఇంట ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకుని, కొత్త మనుషులని తన మనుషులుగా అనుకుని సర్ధుకు పోవాలి, అక్కడే ఆమె ధైర్యం, తెగువ కనిపిస్తాయి. ఎక్కడకెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒదిగిపోయి ఆ యింటిని ఒక ఆనందనిలయంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. మారుతున్న సమయంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి.   కొడుకులు తమని వృద్దాప్యంలో చూసుకుంటార నుకున్నవారు, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చి లేదా అక్కడ జీవితం ఇక్కడికన్నా బాగుంటుందని వెళ్ళేవారు కొందరు. అలా కొడుకులు దూరమైతే వారిని చూసుకుంటున్నది ఎవరూ? కేవలం కొడుకులున్నవారైతే స్నేహితులతో, బందువులతో, తమలా ఒంటరిగా బ్రతుకుతున్న వారిని స్నేహితులుగా చేసుకుని కాలేక్షేపం చేస్తున్నారు తల్లి తండ్రులు. అమ్మాయిలున్నవారు వారి కుటుంబంతో పాటు తల్లి తండ్రులని చూసుకుంటున్నారు. ఎవరైతే భారమవుతారనుకుంటున్నారో నేడు వారే, బాగా చదువుకుని, మంచి వుద్యోగాలు చేస్తూ తల్లి తండ్రులకి కూడా ఆసరా అవుతున్నారు.   మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే.... ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు, అందులో ఇద్దరు విదేశాల్లో వున్నారు, ఇండియాలో వున్న కూతురు మంచి వుద్యోగం చేస్తుంది, తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒకోసారి కొన్ని వారాలకి, నెలలకి ఇతర దేశాలకి వెళ్ళాల్సి వుంటుంది. ఇంట్లో పనులతో పాటు, పిల్లలను చూసుకుంటూ, ఒంట్లో బాగాలేని తండ్రికి అప్పాయింట్ మెంట్ కోసం ఆఫీసు నుండి టైమ్ తీసుకుని వచ్చి తీసుకెళ్ళడం, టెస్ట్ లు చేయించడం, మందులు కొని ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టి శనివారం, ఆదివారం వారితో గడపడానికి పిల్లలు, భర్తతో వెళ్ళి తల్లి తండ్రికి కావాల్సినవి అన్నీ అమర్చిపెడుతుంది. తల్లి ఈ మధ్యనే రిటైర్ అయ్యింది, వారం అంతా తండ్రిని చూసుకోవడంలో బిజీగా వుండే అమ్మని కాసేపు బయటికి తీసుకెళ్ళడం, రాత్రిళ్ళు ఆఫిసు పనులు ఇంటికి తెచ్చుకుని చేసుకోవడం చేస్తుంది. అత్తగారు, మామగారు వచ్చినా వారికి కావాల్సినవి అన్నీ చూసుకుంటుంది తన తల్లి తండ్రులకి చూసుకున్నట్టుగానే.   ఇప్పుడు చెప్పండి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న స్త్రీలు మానసిక వత్తిడికి లోనుకావడంలో ఆశ్చర్యం ఏమైనా వుందా! అందరికీ భర్తల సహకారం వుంటుందని లేదు అలాంటి వారు, తాము అనుకున్న పనులన్నీ చేయాలంటే వారితో వాదిస్తూ కూర్చోవడం కంటే అన్నీ పనులు తాము చేసుకుంటేనే సులువవుతుందని చేసుకుంటుంటారు.   కొంతమంది స్త్రీలకి తాము నమ్మే సిద్దాంతాల కోసం పాటు పడాలని వుంటుంది. వారు అనుకున్నది చేస్తున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురుకుంటూ ముందుకు సాగుతున్నారు. వుద్యోగాల్లో ఒకో మెట్టు ఎక్కుతూ ప్రమోషన్లు సంపాదిస్తూ సాగుతున్నవారు ఒకోసారి పెద్ద ప్రమోషన్లు వచ్చినపుడు ఏం చేయాలో తెలియక అవస్థ పడుతున్నారు. ప్రమోషన్ తీసుకుంటే, ఇంట్లో బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించలేమని, పిల్లలను ఎప్పుడో ఒకసారి చూసుకోవాల్సి వస్తుందని, రోజులు, వారాలు లేదా నెలలు కాన్పరెన్స్ లకో, మీటింగ్ లకో, వేరే వూళ్ళకి, దేశాలకి వెళ్ళాల్సి వస్తుందని, పిల్లలు పెరిగిపోతుంటే వారితో పాటు సమయం గడపలేకపోతున్నామనే బాధ అమ్మలని పీకుతూనే వుంటుంది. అందుకని కొంతమంది ప్రమోషన్లు వదులుకుంటున్నవారు కూడా వున్నారు. అదే గాక వర్క్ ప్లేస్ లో వివక్షతని ఎదుర్కునేవారు దాన్ని పట్టించుకోని వారు కొందరయితే, మరి కొంతమంది ధైర్యంగా వివక్షతకి, సెక్స్యువల్ హరాస్మెంట్ కి వ్యతిరేకంగా పోరాడుతూ, ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మానసిక వత్తిడిని పెంచకపోతే మరేం చేస్తాయి? చెప్పండి.   ఈ మానసిక వత్తిడికి గురి కాకుండా వుండాలంటే, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో అందరు కుటుంబ సభ్యులని కానీ, వుద్యోగం చేసే దగ్గర కానీ ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే రూల్ లేదు, అది సాధ్యం కాదు కూడా అందుకని సినిమాలోలా మంచి కోడళ్ళుగా వుండాలంటే అసాధ్యం కనుక మీకు తృప్తి కలిగే వరకు ఏదైనా పనిని చేసి వదిలి పెట్టండి, అది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఆ పనిని అసలు చేయడానికి ప్రయత్నం కూడా చేయరు. స్త్రీలూ మనుషులుగానే పని చేయాలి కానీ "సూపర్ మామ్స్" లా, "సూపర్ వుమెన్" లా వుండాలని, రోబోట్స్ లా ప్రతి నిముషం పని చేస్తుంటే శారీరక, మానసిక వత్తిడి ఎక్కువయి జబ్బుల పాలవుతారు. అందుకని కేవలం మీకంటూ సమయం పెట్టుకుని రిలాక్స్ కావడానికి ప్రయత్నించండి. రిలాక్స్ కావడానికి మంచి సంగీతం వినవొచ్చు, లేదా పాడుకోవచ్చు, మీకు వచ్చిన ఏవైనా కళలను(ఒక భార్యగా, అమ్మగా, కోడలిగా, వదినగా, వుద్యోగినిగా, ఇలా ఎన్నో బాధ్యతల మధ్య మీరూ మీకిష్టమైన కళని నేర్చుకున్నారనే విషయాన్ని మర్చిపోతారు చాలామంది) బయటికి తీసి వాటిని మళ్ళీ సాధన చేయడం మొదలు పెట్టండి.   యోగాసనాలు చేస్తే శరీరానికి మంచిది, మెదడుకి ప్రశాంతత లభిస్తుంది. అపుడు ఫ్రెష్ గా అన్నీ పనులు ఎక్కువ వత్తిడి లేకుండా చేసుకోవచ్చు. యోగా ఒకటే కాదు ఇపుడు ఎన్నో రకాల ఎక్సర్ సైజులు వచ్చాయి అందులో మీకు ఏది బాగా సూట్ అవుతుందో, నచ్చుతుందో అదే ఎన్నుకొని చేసుకొండి.   వుద్యోగంలో మీకు తృప్తిగా వుంటే వుండండి లేదా మీకూ, మీరు ఎంత కష్ట పడి చేసినా ఆ పనికి విలువనివ్వకపోతే మీకు మరో వుద్యోగం సంపాదించుకోగలను అనే నమ్మకం వుంటే అది వదిలేసి వీలయితే ఎన్నో కొత్త కొత్త కోర్సులు, ట్రైనింగులు, డిగ్రీలు వున్నాయి, కొత్త పనులు నేర్చుకొండి. ఎప్పుడూ ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి వుండేలా చూసుకొండి. ఎప్పటికీ భర్త మీద ఆధార పడి వుంటే ఎప్పుడూ ప్రతి దానికి చెయ్యి జాపాలి, లేదా ఇంటి జమా ఖర్చులు లెక్క తప్పకుండా చెబుతూ వుండాలి, మీకంటూ స్వతంత్రంగా ఏమీ చేసుకోలేరు బాగా కంట్రోలింగ్ భర్త వుంటే. మీ మీద మీకు నమ్మకం, ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థయిర్యాన్ని పెంపెందించుకుని ధైర్యంగా వుంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కునే మన:స్థయిర్యం వుంటుంది. ప్రతి పనిలో పర్ఫెక్షన్ వుండాలి అనే వత్తిడిని మనమే పెట్టుకుంటే చాలా ఇబ్బందులకి గురవుతాము.   అన్ని పనుల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం రాకపోతే నిరాశ చెందడానికి మనం పరీక్షల్లో పాల్గొనటం లేదు, అలా అనుకుంటే మనసు బాధ పడడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోకుండా వదిలేసి మీకు ఆ రోజు మంచి పుస్తకం చదవాలనిపిస్తే హాయిగా కిటికీ పక్కన కూర్చొని, వేడి ఏది పల్లీలని నముల్తూ మీ పుస్తకంలో లీనమై పొండి. దానివల్ల ఇంటికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇల్లు అక్కడే వుంటుంది, సర్ధడానికి పనీ అక్కడే వుంటుంది. మీకు ఓపిక వున్నప్పుడు అంతా ఒకటేసారి చేసేయాలనుకోకుండా మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా చేసుకొండి. ఇందులో కుటుంబ సభ్యుల్ని కలుపుకున్నారనుకొండి ముఖ్యంగా పిల్లల్ని వారికీ పనుల్ని నేర్పించినవారవుతారు, ప్రతి రోజు అమ్మ ఎంత కష్టపడుతుందో దాని విలువ కూడా తెలుస్తుంది. మీ పిల్లలకు ఏం నేర్పించాలి, వారికి ఏదంటే ఇష్టం కనుక్కుని మీకు వీలయిన వాటిల్లోనే జాయిన్ చేయండి. ఇతరులను చూసి వాళ్ళ పిల్లలు బోలెడన్నీ చేస్తున్నారు మన పిల్లలు కొన్నే చేస్తున్నారు అని మీరు కంగారు పడి, పిల్లల్ని హైరానా పెట్టి మీకూ, వారికి కూడా "స్ట్రెస్స్" ని ఎక్కువ చేసుకుంటున్నారు. జీవితం పరుగు పందెం కాదు, వేరే వాళ్ళు చేసే పనులన్నీ మనం చేయాలనుకుంటే పిల్లల మీద వత్తిడి పెరిగి కొన్నిట్లో కూడా సరిగ్గా చేయలేరు. అదే వారికిష్టమయిన వాటిలో చేర్పిస్తే చక్కగా మనసు పెట్టి నేర్చుకుంటారు, చూడండి.   ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం అనే ఆలోచన మనసులోనుండి తీసేయండి. మనసుని ముందునుండే గట్టి పరుచుకుంటే అన్నీ చేయవచ్చు. ఉదాహరణకి పిల్లలతో సమయం గడపడం లేదని బాధ పడే వారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పిల్లలతో ఎంత సమయం గడిపామన్నది కాదు ముఖ్యం, వారితో కొద్ది సమయం కానీ ఎక్కువ సమయం కానీ ఎలా గడిపామన్నదే ముఖ్యం. పిల్లలు మీతో గడిపిన సమయాన్ని సంతోషంగా గుర్తుపెట్టుకుంటే వారు సంతోషంగా వున్నట్టే, వారికి మీ పై ఎలాంటి కంప్లయింట్లు లేవు అని అర్ధం. ఈ విషయం ఇతర కుటుంబ సభ్యులకి కూడా వర్తిస్తుంది. ఇలాగే ప్రతి విషయంలో మనం ఆ విషయాన్ని చూసే దృక్కోణం మార్చుకుంటే చాలు. అన్నీ సులువు అవుతాయి.   అన్నిటికన్నా ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకొండి, అంటే ఎవరో మీకు, మీరు ఎలా వున్నారో చెప్పడం కాదు, మీరే నిర్ణయించుకోవాలి, మీరు ఎంత బరువుండాలి, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మీకు మేకప్ అవసరమా లేదా, మీరు సన్నగా కమర్షియల్స్ లో వచ్చే మాడల్స్ లా సన్నగా, పీలగా, ఒక గెడ కర్రలా వుండాలో, ఆరోగ్యంగా, ఎప్పుడూ సంతోషంగా వుంటూ, నలుగురికీ మీకు చేతనయినంత సాయం చేస్తూ మీ మనసుకి నచ్చినట్టు వుండాలా లేదా నిర్ణయించుకోవల్సింది మీరు. వేరే వారికి మిమ్మల్ని ఇలా వుండాలి, అలా వుండాలి అనే హక్కు లేదు. ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటే అది వారి సమస్య కానీ మీ సమస్య కాదు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఆనందంగా వుండడం మీ చేతిలో వుంది. నాకు తెల్సు ఇది చెప్పడం చాలా తేలిక దాన్ని చేరుకోవడం చాలా కష్టం అని.   ముఖ్యంగా కట్నాలు తేలేదని హింసించే భర్త, అత్తామామలున్న సమాజంలో, ఆడపిల్ల పుడితే ఇంట్లో నుండి తరిమేయడమో, విడాకులివ్వడమో చేసే భర్తలున్న సమాజంలో, వుద్యోగానికి వెళ్ళొస్తే అనుమానించి నెల జీతం అంతా తీసుకొని కేవలం బస్ పాస్ డబ్బులిచ్చే భర్తలున్న ఈ దేశంలో, రోజంతా కష్టపడి కుటుంబం అంతా పని చేసి కనీసం ఒక్క పూటయినా అందరూ కూర్చుని సంతోషంగా తిని కంటినిండా నిద్ర పోవడానికి నోచుకోనివ్వకుండా సంపాదించిందంతా తాగుడికి తగలపెట్టి ఇంటికి వచ్చి భార్యా, పిల్లల సంపాదన కూడా లాక్కుని చితకబాదే భర్తలున్న సమాజంలో, మంచి బట్టలేసుకుని బయటికి వెళితే ఆ పిల్ల ఇంటికి తిరిగి వచ్చేదాక గుండెల్లో దడతో తల్లి తండ్రులు భయపడుతూ బ్రతుకుతున్న సమాజంలో ఇంకా ఎన్నో సమస్యల్తో, పోరాటాలతో బ్రతుకుతున్న మన దేశంలో అది సాధ్యమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా వుంటేనే ఇతరులకి సాయం చేయగలుగుతాము.   అందుకని మానసిక వత్తిళ్ళకు దూరంగా వుండాలంటే మనని మనం కొద్దిగా మార్చుకోవాల్సిందే మరి! ఏమంటారు. ప్రయత్నించండి, "సాధనమున పనులు సమకూరు ధరలోన," అన్నారు వేమన గారు. గుడ్ లక్....   -కనకదుర్గ  

ఆలస్యం! అమృతం! విషం!

ఒక కుర్రవాడికి కేన్సర్‌ చివరి దశలో ఉందని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ అతనికి ఈ ప్రపంచం ఒక దుఃఖసాగరంగా మారిపోయింది. ఎటు చూసినా, ఏది పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా తన వ్యాధే గుర్తుకు వచ్చేది. అందుకనే నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ తన గదిలో ఒంటరిగా చివరి రోజులను వెళ్లదీస్తూ ఉండేవాడు. ఒకసారి ఎందుకనో కుర్రవాడికి అలా వీధి చివరిదాకా వెళ్లి రావాలని అనిపించింది. చాలాకాలం తరువాత కుర్రవాడు వీధిలోకి అడుగుపెట్టడం చూసి అతని తల్లికి కూడా సంతోషం వేసింది. ఊరికనే అలా నాలుగడుగులు వేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇంతలో వీధి చివర కొత్తగా పెట్టిన సీడీల షాప్ చూసేసరికి అందులోకి అడుగుపెట్టాలనిపించింది. కుర్రవాడు సీడీల షాప్‌లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ కౌంటర్‌ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని చూసి మనసు చెదిరిపోయింది. ఆ అమ్మాయిని చూడటం కోసం అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఆ షాపులోకి వెళ్లి ఏదో ఒక సీడీని కొనుక్కునేవాడు కుర్రవాడు. ఆ సీడీని భద్రంగా ఓ కవర్లో పెట్టి, చిరునవ్వుతో అతనికి అందించేది అమ్మాయి. ఆ అమ్మాయితో ఓసారి సరదాగా అలా షికారుకి వెళ్తే ఎంత బాగుండో అనుకునేవాడు కుర్రవాడు. కానీ తీరా కాదంటే ఆ బాధని తట్టుకునే స్థితిలో అతని మనసు లేదు. అందుకనే కనీసం ఒక్క పది నిమిషాలైనా ఆమెని చూస్తూ గడపడం కోసం రోజూ షాపుకి వెళ్లేవాడు. కానీ అలా ఎన్నాళ్లని వెళ్తాడు. నెల తిరక్కుండానే ఆ కుర్రవాడిని క్యాన్సర్‌ కబళించివేసింది.    కుర్రవాడి చావుకి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎలాగొలా బంధువుల సాయంతో అతని అంత్యక్రియలు పూర్తిచేసింది. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అతని జ్ఞాపకాలని వదలలేకపోయింది తల్లి. కాసేపు అతని గదిలో కూర్చునైనా సేదతీరుదామనుకుంటూ, అతని గదిలోకి అడుగుపెట్టింది. తల్లి గదిలోకి అడుగుపెట్టేసరికి ఒక మూల గుట్టగా పేర్చి ఉన్న సీడీలు కనిపించాయి. కొన్నవి కొన్నట్లు ఆ సీడీలు అలాగే ఉన్నాయి. కనీసం వాటిని కవర్లోంచి కూడా తీయలేదు కుర్రవాడు. అతని అవసరం సీడీలు కాదు కదా! అందులో ఒక కవర్‌ని తెరిచి చూసింది తల్లి. అంతే! కవర్లో ఉన్నదాన్ని చూసి ఆమె గుండె చెదిరిపోయింది. ‘మీ నవ్వు చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కాఫీ తాగాలనుంది’ అన్న చీటీ సీడీతో పాటే ఆ కవర్లో ఉంచింది ఆ అమ్మాయి. రెండో కవరు, మూడో కవరు, మరో కవరు, ఇంకో కవరు.... అన్నింటిలోనూ ఇలాంటి చీటీలే ఉన్నాయి. ఆ కవర్లని కుర్రవాడు ఒక్కసారన్నా తెరిచి చూస్తే అతని చివరి రోజులు ఎంత అందంగా గడిచేవో కదా! పోనీ తన మనసులో ఉన్న మాటనన్నా అతను చెప్పగలిగితే ఎంత బాగుండేదో! మనలో చాలామంది ఆ కుర్రవాడిలాగే ప్రవర్తిస్తుంటాం. మనకి అర్హత లేదనో, సాధ్యం కాదనో... మన లక్ష్యాలని మనసులోనే దాచేసుకుంటాం. దక్కదేమో అన్న భయంతో ఉన్న కొద్ది రోజులనీ భారంగా గడిపేస్తుంటాం. వెనక్కి తిరిగి చూసుకునే సరికి కాలం కాస్తా కరిగిపోతుంది.

ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు మ‌రింత జాగ్ర‌త్త!

21వ శ‌తాబ్దం వ‌చ్చేసింది. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని అంద‌రికీ అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్య‌ప‌రంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల వివ‌క్ష‌త త‌గ్గింద‌న్న అంచ‌నాలూ ఉన్నాయి. నిజానికి ఆడ‌పిల్లల జీవితాలు ఏమాత్రం మార‌లేదంటూ ఓ ప‌రిశోధ‌న వెలువ‌డింది. ఇంగ్లండులోని లివ‌ర్‌పూల్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆడ‌పిల్ల‌ల మ‌న‌స్థితి మీద ఒక అధ్య‌య‌నం చేశారు. ఒక‌టీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గ‌ణాంకాల‌ను సేక‌రించారు. ఇందుకోసం 2000-2001లో జ‌న్మించిన దాదాపు ప‌దివేల మంది పిల్ల‌ల‌ను నిశితంగా గ‌మ‌నించారు. 3, 5, 7, 1, 14 ఏళ్ల‌లో వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉందో అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ప్ర‌శ్నాప‌త్రాల ద్వారా పిల్ల‌ల మ‌న‌స్థితిని గ‌మ‌నించారు. మ‌గ‌పిల్ల‌లైనా, ఆడ‌పిల్ల‌లైనా చిన్న‌ప్పుడు అంతా సంతోషంగానే క‌నిపించారు. వారి మ‌న‌సుల్లో పెద్ద‌గా క‌ల‌త క‌నిపించ‌లేదు. కానీ వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ... ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు కుంగిపోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... ప‌ధ్నాలుగో ఏడు వ‌చ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడ‌పిల్ల‌లలో డిప్రెష‌న్ తాలూకు ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అదే మగ‌పిల్ల‌లో అయితే కేవ‌లం ప‌దిశాతం లోపుమంది పిల్ల‌ల‌లోనే డిప్రెష‌న్ సూచ‌న‌లు క‌నిపించాయి. కుటుంబ ఆర్థిక‌ప‌రిస్థితులు క‌నుక బాగోలేక‌పోతే.... డిప్రెష‌న్‌కు లోన‌య్యే ప్ర‌మాదం మ‌రింత తీవ్రంగా ఉండ‌టం మ‌రో విషాదం. సాధార‌ణంగా పిల్ల‌లు త‌మ మ‌న‌సులోని దుగ్ధ‌ను స్ప‌ష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్ద‌లే, పిల్ల‌ల మ‌న‌సులోని విచారాన్ని ఊహించే ప్ర‌య‌త్నం చేయాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌గ‌పిల్ల‌లని మ‌న‌సుని ప‌సిగ‌ట్టేసే పెద్ద‌లు, ఆడ‌పిల్ల‌ల మ‌న‌సులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేక‌పోతున్నార‌ట‌. దాంతో ఆడ‌పిల్ల‌ల మ‌న‌సుని సాంత్వ‌న ప‌రిచే ప‌రిస్థితులు లేక‌, వారు మ‌రింత‌గా డిప్రెష‌న్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మ‌గ‌పిల్ల‌ల‌తో పోలిస్తే ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొనే ప‌రిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మాన‌సికంగానూ వారు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివ‌క్ష ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇవ‌న్నీ కూడా వారి మ‌న‌సుల మీద చెర‌గ‌ని గాయం చేస్తాయి. మ‌గ‌పిల్ల‌లతో పోలిస్తే, ఆడ‌పిల్ల‌ల‌ని మ‌రింత కంటికిరెప్ప‌లా కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ ప‌రిశోధ‌న గుర్తుచేస్తోంది. దీనిని త‌ల్లిదండ్రులు ఓసారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే... ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు మ‌రింగ బాగుంటుందేమో! - నిర్జ‌ర‌.  

డబ్బుతో కొనలేనిది

అతనో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగి. సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయడంలోనే అతనికి అంతులేని తృప్తి ఉండేది. అలా పనిచేసని ప్రతిసారీ అతనికి పై అధికారుల నుంచి అభినందనలో, పదోన్నతలో లభించేసరికి... తను ఆ సంస్థకి ఉన్నతికి ఎంతగా అవసరమో తెలిసొచ్చేది. అలాంటి ఉద్యోగి ఓ అర్ధరాత్రి వేళ తన ఇంటికి చేరుకునేసరికి, అక్కడ తన పదేళ్ల కొడుకు ఇంకా మేలుకునే కనిపించాడు. ‘‘ఇంత రాత్రయ్యింది ఇంకా పడుకోలేదా’’ అంటూ చిరాగ్గా కొడుకుని అడిగాడు ఉద్యోగి. అతని మనసులో ఇంకా ఉద్యోగం తాలూకు చిరాకు అలానే ఉంది. ‘‘లేదు! నీతో కలిసి తిందామని ఎదురుచూస్తున్నాను’’ అన్నాడు కొడుకు దీనంగా. ‘‘నాతో నీకు పోటీ ఏమిటి! సమయానికి తిని, చదువుకొని, పడుకోక..’’ అంటూ విసుగ్గా భోజనాల బల్ల దగ్గరకి చేరుకున్నాడు తండ్రి. కొడుకు ఏమీ మాట్లాడకుండా ఒకో ముద్దా నిదానంగా తింటున్నాడు. అలా తింటూనే తండ్రి వంక చూస్తున్నాడు. తండ్రి ఇంకా తన ఆఫీసు వ్యవహారాల నుంచి బయటపడలేదు. తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఏవో మెయిల్స్ చూసుకుంటూ అన్యమనస్కంగా భోజనం చేస్తున్నాడు. ‘‘నాన్నా! నువ్వు రోజుకెంత సంపాదిస్తావు?’’ అని హఠాత్తుగా అడిగాడు కొడుకు. ఆ మాటలకి తండ్రికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘‘నీకసలు బుద్ధుందా! పెద్దవాళ్లను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని తెలియదా! అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా విను. నా జీతం రోజుకి రెండువేలు. నా తోటివారందరికంటే అది రెట్టింపు. ఎంత కష్టపడితనే నేను ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసా!’’ అన్నాడు తండ్రి. అతని మాటలలో తెలియని గర్వమేదో తొణికిసలాడింది. కొడుకు కాసేపు ఏం మాట్లాడలేదు. అటు తరువాత బిక్కుబిక్కుమంటూ ‘‘నాన్నా! నాకు ఓ వేయి రూపాయలు ఇవ్వగలవా!’’ అంటూ అడిగాడు.   ఆ మాటలతో తండ్రిలోని కోపం నషాళానికంటింది. ‘‘ఇందాకేమో! నీ జీతం ఎంత అని అడిగావు. ఇప్పుడేమో ఓ వేయి రూపాయలు ఇమ్మంటున్నావు. ఇలా నన్ను విసిగించడానికేనా ఇంత రాత్రివేళ మెలకువగా ఉన్నది. అయినా అంత డబ్బుతో నీకేం పని...’’ అంటూ నానా తిట్లూ తిట్టి చివరికి ఓ వేయి రూపాయల నోటు కొడుకు మొహం మీద విసిరికొట్టాడు. కొడుకు కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా నిదానంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తండ్రి భోజనం పూర్తయ్యింది. ఇక పడుకుందామనుకుంటూ ఉండగా కొడుకు గుర్తుకువచ్చాడు. ‘పాపం తెలిసీతెలియని వయసు. వాడిని మరీ ఎక్కువగా తిట్టాను. ఆఫీసులో కోపమంతా వాడిమీదే చూపించాను,’ అని జాలిపడుతూ ఓసారి కొడుకు గదిలోకి తొంగిచూశాడు. కొడుకు ఇంకా మెలకువగానే ఉన్నాడు. వాడి ముందు బోలేడు చిల్లర ఉంది. ‘వాడేదో కొనుక్కోవాలనుకొని డబ్బులు పోగేసినట్లున్నాడు. దానికి తక్కువ కావడంతో నన్ను అడిగాడు పిచ్చివెధవ’ అనుకున్నాడు. కొడుకు భుజం మీద చేయివేసి- ‘ఏం నాన్నా! ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు. నేను ఇచ్చిన డబ్బుతో లెక్క సరిపోతుందా’ అని అనునయంగా అడిగాడు. కొడుకు బెరుకుగా- ‘‘నాన్నా వచ్చే సోమవారం నా పుట్టినరోజు. ఆ రోజు నువ్వు నాతోపాటు ఇంట్లోనే ఉంటావా!’’ అని అడిగాడు. ‘‘అబ్బే సోమవారమా! ఇంకేమన్నా ఉందా. అయినా మరీ అత్యవసరం అయితే తప్ప నేను సెలవు పెట్టనని నీకు తెలుసు కదా..’’ అన్నాడు తండ్రి తడుముకోకుండా.   కొడుకు మరేం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న చిల్లరనంతా తండ్రి దగ్గరకి జరిపాడు. దాని మీద ఇందాక తండ్రి ఇచ్చిన వేయి రూపాయలు కూడా పెట్టాడు. ‘‘నాన్నా నీ రోజు జీతం రెండు వేలన్నావు కదా! ఇవిగో రెండువేలు. ఇవి తీసుకునన్నా నాతో ఒక్కరోజు గడపవా ప్లీజ్. నేను ఆర్నెళ్ల నుంచి దాచుకున్న డబ్బంతా కలిపి వేయి రూపాయలయ్యింది. దానికి నువ్వు ఇందాక ఇచ్చిన వేయి రూపాయలు కలిపితే రెండేవేలవుతాయి. ఇవి తీసుకుని నా పుట్టినరోజు నాతోనే గడుపు ప్లీజ్‌!’’ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తాను ఎదుగుతున్నాడని సంబరపడ్డాడే కానీ, ఆ ఎదిగే క్రమంలో ఏ లోతుల్లోకి జారిపోతున్నాడో ఇన్నాళ్లూ అతను గ్రహించలేకపోయాడు. ఎదుగుదల అందరికీ అవసరమే! కానీ దానికోసం దేన్ని ఎంతవరకు వదులుకోవాలి అన్నదే ప్రశ్న. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.  

అందమైన దాంపత్యం

అనగా అనగా ఒక అన్యోన్యమైన జంట. వాళ్లిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్లందరికీ ముచ్చటగా ఉండేది. అలాగని వారు అందరికంటే అందంగా ఉండేవారని కాదు! ఎప్పుడూ కొట్టుకోకుండా ఉండేవారనీ కాదు! కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసిమెలిసి ఉండేవారు. అలాంటి వారిద్దరి మధ్యా ఒక కథ నడిచింది...   ఒక రోజు భర్త ఇంటికి వస్తూనే ‘నేను ఇవాళ దాంపత్యం గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం విని వస్తున్నాను’ అన్నాడు. ఏం చెప్పారేంటి ఆ ఉపన్యాసంలో!’ అంటూ ఆసక్తిగా అడిగింది భార్య. ‘భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదంట. అందుకోసం ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే, వాటి గురించి ముందుగానే చర్చించుకుని తేల్చుకోవాలంట!’ అంటూ చెప్పుకొచ్చాడు భర్త. భార్య ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ‘ఈ ఉపన్యాసం విన్న తరువాత నాకు ఓ ఉపాయం తట్టింది. ఇవాళంతా కూర్చుని నీలో నచ్చని విషయాలు ఏమున్నాయో, ఒక కాగితం మీద రాస్తాను. నువ్వు కూడా నాలో నచ్చని విషయాలు ఏమేం ఉన్నాయో ఒక కాగితం మీద రాసి ఉంచు. అలా కాగితాలలో రాసుకున్న లోపాల గురించి రేపు చర్చించుకుందాం’ అంటూ హడావుడిగా గదిలోకి వెళ్లి ఒక పెన్నూ, కాగితం పట్టుకున్నాడు.   మరుసటి రోజు ఉదయం వేళకి భర్త వంటింట్లోకి ఒక మూడు కాగితాలు తీసుకువచ్చాడు. ‘నీలో నాకు నచ్చని విషయాల జాబితా ఒకటి తయారుచేశాను. అవన్నీ చదువుతాను విను’ అంటూ బడబడా ఆ మూడు కాగితాలలో రాసిన ‘భార్యలోని లోపాలను’ చదవసాగాడు. జాబితాని చదవడం పూర్తయిన తరువాత హుషారుగా ‘ఇప్పుడు నీ జాబితాని కూడా చదువు. తరువాత వాటిలో విషయాల గురించి చర్చించుకుందాం.’ అన్నాడు భర్త. భార్య మాత్రం నిశ్శబ్దంగా ఒక కాగితాన్ని తీసుకుని భర్త చేతిలో పెట్టింది. ఆశ్చర్యం! అది ఖాళీగా ఉంది. ‘అదేంటీ నువ్వు రాసేందుకు నాలో ఒక్క లోపం కూడా కనిపించలేదా!’ అని అడిగాడు భర్త.   ‘నేను కూడా మీలో లోపాలని రాద్దామనే కూర్చున్నాను. కానీ మన బంధాన్ని నాశనం చేసేంతటి లోపాలు ఏవీ మీలో కనిపించలేదు. ఒకవేళ ఏదన్నా చిన్న లోపం కనిపించినా, ఒకోసారి దాని వల్ల ఉపయోగం కూడా కనిపించేది. పోనీ మీలో నాకు నచ్చని విషయాలను రాద్దామా అంటే... నాకు నచ్చనంత మాత్రాన వాటిని లోపాలుగా ఎలా అనుకోగలను. మీరు మీలాగా ఉంటే చాలు అనిపించింది. ఎప్పటిలాగే ప్రేమని పంచుతూ, బాధ్యతగా చూసుకుంటే ఉంటే చాలనిపించింది,’ అంది భార్య. భర్తకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ కళ్ల నుంచి నీరు ఆగలేదు. అంత ఉద్వేగంలో కూడా, తన చేతిలో ఉన్న కాగితాలను చించడం మాత్రం మర్చిపోలేదు.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

రాజీ పడితే జీవితం అంతే!

ఆమధ్యన ఒక శాస్త్రవేత్త చిన్నపాటి ప్రయోగం ఒకటి చేశాడట. కొన్ని పురుగులని పట్టి ఒక గాజు సీసాలో ఉంచాడు. సీసాలో వేయగానే ఒక్కసారిగా ఆ పురుగులన్నీ బయటకి ఎగిరేందుకు ప్రయత్నించాయి. అవి అలా పైకి ఎగురుతుండగానే.... సీసాకి ఓ మూతని బిగించేశారు. అంతే! ఆ పురుగులన్నీ శక్తి కొద్దీ వెళ్లి ఆ మూతకి తగులుతూ కిందకి పడిపోవడం మొదలుపెట్టాయి. అలా కాసేపు జరిగిన తర్వాత ఇక ఆ సీసాను దాటుకుని వెళ్లడం అసాధ్యమన్న విషయానికి అవి అలవాటుపడిపోయాయి. దాంతో ఇక మూతని తాకకుండా అక్కడక్కడే ఎగరడం మొదలుపెట్టాయి. కొంతసేపటి తర్వాత సీసా మూతని తీసేసినా కూడా పురుగులు అందులోంచి బయటపడేందుకు ప్రయత్నించలేదు. అడ్డుగా ఉన్న మూతని దాటుకుని వెళ్లడం అసాధన్యమన్న భ్రమలోనే అవి ఉండిపోయాయి.   ఇంటర్నెట్‌లో ‘flear in a jar’ అని టైప్ చేస్తే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించేదంతా నిజమో కాదా అన్నదాని మీద పెద్ద వివాదమే ఉంది. కానీ చాలా సందర్భాలలో జీవుల ప్రవర్తనను ఇలా ప్రభావితం చేసేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. జంతువులలో కనిపించే ఇలాంటి ప్రవర్తనని conditioning అంటారు. ఈ conditioning ద్వారానే వాటిని ఒకోసారి మనకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాము కూడా!   వీడియోలో కనిపించేంది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుందన్నది సైకాలజిస్టుల మాట. మనుషులు కూడా తమ చుట్టూ ఉండే పరిస్థితులకి ఇలాగే లోబడిపోతుంటారని తెలిసిందే! ‘నేను ఎందుకూ పనికిరానివాడిని,’ ‘నా లోపాలను మించి నేను ఎదగలేను’, ‘ఈ సమస్యలను దాటడం నా వల్ల కాదు’... లాంటి సవాలక్ష నమ్మకాలతో మనల్ని మనమే conditioning చేసుకుంటూ ఉంటాము.   ఎప్పుడో ఒకసారి మనకి ఎదురుపడిన పరాజయం మన అనుమానాలు నిజమేనన్న బలాన్ని కలిగిస్తాయి. పైకి ఎదిగేందుకు అడ్డుగా నిలుస్తాయి. మన నమ్మకాలు నిజమో కాదో మరోసారి పరీక్షించకుండానే, వాటని మన లోపాలుగా మార్చేసుకుంటూ ఉంటాము. అందుకే! పరాజయపు మాట పక్కన పెట్టి మరోసారి ప్రయత్నించి చూడమని ఈ పరిశోధన చెబుతోంది. ఎగిరేందుకు ప్రయత్నిస్తేనే కదా.... మనకి హద్దు, అదుపు ఉన్నాయో లేదో తెలిసేది! - నిర్జర.

సలహా ఇవ్వడం కూడా ఒక కళే!

ప్రపంచంలో అతి సులువుగా లభించేది ఏమన్నా ఉంటే సలహానే! అందుకనే ఎవరికి వారు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ ఒకోసారి మనం ఆచితూచి ఇచ్చే సలహానే మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. వారి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అండగా నిలుస్తుంది. అందుకనే అనువైన సలహాని ఇవ్వడం కూడా ఒక కళగా భావించవచ్చు. ఇందుకోసం కొన్ని మెలకువలు పాటిస్తే సరి...   అడగనిదే! అవతలివారి సమస్య మీకెంత సామాన్యంగా తోచినా, దానికి ఖచ్చితమైన సలహా మీ దగ్గర ఉందని అనిపించినా... అడగకుండా ఇచ్చే సలహాకి అంత ఉపయోగం ఉండదు. సరికదా! వారు నొచ్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు... తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టడానికే అవకాశం ఉంది. అందుకే అడగకుండా సలహా ఇవ్వకూడదంటారు పెద్దలు. ఒకవేళ అతని సమస్యకు మీ దగ్గరే పరిష్కారం ఉందని తోస్తే అతని అనుమతి తీసుకునో, ఒంటరిగా ఉన్నప్పుడో, మధ్యవర్తుల ద్వారాలో మీ సలహాను అందిస్తే సరి.   సావధానంగా విన్నాకే! సమస్య ఉన్నవారే సలహా కోసం అభ్యర్థిస్తారు. సమస్య ఉంది కాబట్టి దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడి కొంత ఉపశమనాన్ని పొందాలని అనుకుంటారు. కాబట్టి సలహా ఇవ్వాలనుకుంటూ వారి మాటలను సావకాశంగా వినితీరాలి. మనకి కాస్త విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా సంభాషణను సాగించాలి. వీలైతే మరిన్ని ప్రశ్నలు వేసి, సమస్యలోని భిన్న కోణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.   మనదిగా భావించి! సమస్య మనది కాకపోవచ్చు. కానీ మనం ఇచ్చే పరిష్కారంతో అది ముగిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే, అందులోని లోతుపాతులు తెలుస్తాయి. అలా కాకుండా కేవలం ఒక మూడో వ్యక్తిగానే ఉంటే, సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. ‘ఇదే ఇబ్బంది నాకు తలెత్తితే, నేను ఏం చేయగలను? నేను తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎలాంటి సావకాశాలు ఉన్నాయి?’ అని ఆలోచిస్తేనే సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం లభిస్తుంది.   చర్చించండి! సలహా అడిగారు కదా అని అవతలివారిని ఊదరగొట్టేస్తే సరిపోదు. సలహాలదేముంది! సవాలక్ష చెప్పేయవచ్చు! అవతలివారు కూడా మొహమాటానికి పోయి ఊరకుండిపోవచ్చు. కానీ సమస్య గురించి మీకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు... అన్నీ కూడా అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం అనేది ఒక కాలక్షేపంగా కాకుండా కార్యాచరణకు మార్గంగా నిలుస్తుంది.   నిజాయితీతో! సలహా కోసం వచ్చారు కదా అని చాలామంది అవతలివారిని చులకనగా చూస్తుంటారు. కానీ అవతలివారు తమమీద ఒక భరోసాతో వచ్చారన్న బాధ్యతని గుర్తుంచుకోరు. అలాంటి భేషజాలకు పోకుండా సమస్యను సానుకూలంగా విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వడం అవసరం. ఒకవేళ సమస్య పరిథి మనల్ని దాటిపోతోందని అనిపిస్తే... ఫలానా వ్యక్తినో, నిపుణుడినో కలిస్తే మంచిది అని చెప్పేయడం మంచిది.   - నిర్జర.

Managing Anger

  We've heard enough on anger and said enough on it. But it has been our companion all through the while. We tried hard to control it and failed. So! let's give one more try!! The Occurrence: Anger might be the result of the external situation (like traffic, argument..) or might be triggered by our low mood. Surprisingly it was found out that some people can genetically be much furious than the rest. And of course, the circumstances that we've faced and the way we've moulded our character do affect our angry moods. The Result: The fire in the tree would burn it and the forest. So does the anger! We and our lives are the first and fatal victims to our anger. If suppressed, it would boil our heart and mind. And if expressed it would derail our circumstances.  Our goodwill, relations, transactions... get vulnerable at our ire. By the time we realise that, things should have been dealt with ease... they would've turned worse. And repentance is all that's left after the fist of rage. The Solution: While there are lot of advices given on the net and in the books on anger management... I've found the following to be practical and useful . You can add your own solution to the list.   - Expressing in the most plausible manner: If you feel that your displeasure should be conveyed, do it with a coat of sugar. Convey that you are upset, let them know that your are hurt... but let your tone be mild, and your words be polite. - Divert the force: Every emotion of us is a power! If expressed, it would result into something. So why not get a positive result from our displeasure. I've once heard from my lecturer - `Whenever my family members did upset me, I just kept quiet and immersed in my studies. I'm certainly aware of the fact that a bright career is the solution for many of my personal problems.` - Skip the environment: Anger needs a dais for us to express. It might be the highway or the kitchen. It's better to move away from the place and let passions dilute. - The alternatives: Some situations keep recurring. They make you tense on the daily basis. It might be the pits on the road you pass or a friend that robs every penny out of you. Just change the road or bid goodbye to the friend   - Think logically: The first side effect that come along with anger is, that you lose the power to reason. Just let your mind be intact. Evaluate what has happened, deduce the possibilities, conclude a few things... and decide the course of action. - Watch your words: When we are in the hold of anger. We try to hurt as much as we could with our words. So let's watch our words. Let`s be civilised and let's hear what the other one is saying.  In other words, we say a lot when we are in anger. So let's hear a lot too! - Don't dig the past: The worst thing we do, during those moments of anger... is to dig the filth out of the past! Each and every moment of displeasure is recollected and associated with the present situation. So treat the present situation as unique and be likewise. - Calming down: This is my favourite one. The way we breath is directly associated to our emotions. So let's slow our veins down. Taking a deep and slow breath filling every inch of our lungs and exhaling slowly would certainly calm us down..     -nirjara

ఆడవాళ్లని ఏడిపించడం ఓ సరదా!

ఆడవాళ్లు అర్ధరాత్రి నిర్భయంగా తిరగడం గురించి గాంధీగారు అన్నమాటలూ, స్త్రీ స్వేచ్ఛ గురించి మనం చెప్పుకొనే కబుర్లు అన్నీ అలాగే వినిపిస్తున్నాయి. కానీ వాస్తవాలు మరోలా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి మాటేమోగానీ, మిట్టమధ్యాహ్నం నడివీధిలో సైతం ఆడవాళ్లకి వేధింపులు తప్పడం లేదు. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు ఐక్యరాజ్యసమితి ఒక సర్వేని చేపట్టింది. International Men and Gender Equality Survey (IMAGES) పేరుతో చేపట్టిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.   వేధించి వదలిపెట్టారు: పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలోని లెబనాన్‌, ఈజిప్ట్‌, మొరాకో, పాలస్తీనా వంటి దేశాలలో ఈ సర్వేని చేపట్టారు. అసభ్యకరమైన కామెంట్లు చేయడం, వెంటపడటం, వేధించడం, అదేపనిగా తినేసేలా చూడటం... లాంటి చేష్టలతో బయట తిరిగే ఆడవారు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో గమనించే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రతిదేశం నుంచీ సిగ్గుపడే వాస్తవాలు బయటపడ్డాయి. ఈజిప్టునే తీసుకుంటే- తమ జీవితకాలంలో ఏదో ఒక స్థాయిలో ఆడవాళ్లని ఏడిపించామంటూ 64 శాతం మంది మగవారు ఒప్పుకున్నారు.   సరదా కోసమే! మిగతాదేశాలలోకంటే మొరాకోలా తక్కువగా... ఓ 33 శాతం మందే తాము ఆడవాళ్లని ఏడిపించామంటూ ఒప్పుకున్నారు. అంటే తక్కువలో తక్కువగా కనీసం మూడోవంతు మంది మగవారైనా ఆడవాళ్లని ఏడిపించే ఉంటారన్నమాట! ‘ఇంతకీ మీరు ఆడవాళ్లని ఎందుకు ఏడిపిస్తారు?’ అని అడిగిన ప్రశ్నకి చాలా చిత్రమైన సమాధానం వినిపించింది. 90 శాతం మంది మగవారు తాము కేవలం సరదా (fun) కోసమే ఆడవాళ్లని ఏడిపించామని ఒప్పుకున్నారు.   బాధితురాలిదే తప్పు: ఎవరన్నా తమని ఏడిపించారంటూ ఆడవాళ్లు బాధపడితే... నేరస్తుడిని వదిలిపెట్టి, ఆడవాళ్లదే తప్పు అన్నట్లుగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. విచిత్రమేమిటంటే- సాటి ఆడవాళ్లు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారట! ‘రెచ్చగొట్టే బట్టలు వేసుకున్న ఆడవాళ్లని వేధించడం సహజమే!’ అని 84 శాతం మంది ఆడవాళ్లు భావిస్తున్నారట. ఇక ‘రాత్రిపూట బయటకివచ్చే ఆడవాళ్లు వేధింపులని ఆహ్వానించినట్లే!’ అని 43 శాతం మంది అభిప్రాయంగా ఉంది.   చదువు ఎక్కువైతే సంస్కారం తగ్గుతోంది: చదువు- సంస్కారం అని అంటూ ఉంటాము. కానీ నిరక్షరాస్యులకంటే చదువుకున్నవారే ఆడవాళ్లని ఏడిపించడంలో ముందుంటున్నారట. అంతేకాదు! చదువుకున్న ఆడవాళ్లే ఎక్కువగా వేధింపులకి గురవుతున్నట్లు తేలింది. సర్వేలో తేలిన విషయాలు చూసిన ఐక్యరాజ్యసమితి, ఇలాంటి వేధింపులు తగ్గేందుకు కొన్ని చర్యలను సూచించింది. వాటి   ‘సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా వంటి రంగాల ద్వారా స్త్రీల పట్ల ఉన్న చులకన భావాన్ని తగ్గించాలి’ అన్నది ఓ ముఖ్యమైన సూచన. హుమ్‌! అది సాధ్యమేనంటారా?          - నిర్జర.

క్యారీ బ్యాగ్‌లు ఎందుకంత ప్రమాదం!

చేతిలో గుడ్డసంచిని తీసుకుని బజారుకి బయల్దేరడం ఇప్పుడు నామోషీ. అలా సరదాగా సూపర్‌మార్కెట్లోకి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసి ఓ రెండు వస్తువులను కొని.... ఓ క్యారీబ్యాగ్‌లో వేసుకురావడం ఓ ఫ్యాషన్‌! ఇక పాలప్యాకట్‌ని కూడా క్యారీబ్యాగ్‌లోనే పట్టుకునే సుకుమారం కొందరిది. సరదానో, సున్నితత్వమో కానీ క్యారీబ్యాగ్‌ల వాడకంతో పర్యావరణానికి తీరని హాని జరుగుతోందని బాధపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. వారి బాధలో అర్థం లేకపోలేదు. నేలలో కలవదు క్యారీబ్యాగ్‌లు ఒక పట్టాను మట్టిలో కలిసిపోవు. కాలం గడిచేకొద్దీ చిన్నచిన్న ముక్కలుగా పిగిలిపోయి కలిసినట్లు కనిపిస్తాయంతే! అలా నిదానంగా మట్టిలోకి జారుకునే సమయంలో క్యారీబ్యాగ్‌లు వెలువరించే విషరసాయనాలు, అక్కడి సారాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి మట్టిన వాసన చూసే ప్రాణుల ఊపిరితిత్తుల్లోకి చేరి వాటి చావుకి కారణం అవుతాయి. నీటిలో కరగదు ఏటా మురుగు ద్వారా కొన్ని కోట్ల ప్లాస్టిక్‌బ్యాగ్‌లు సముద్రాలలో కలుస్తున్నాయి. ఇప్పుడు నదులలో కూడా ఎక్కడ చూసినా ఈ క్యారీబ్యాగులే తేలుతూ కనిపిస్తున్నాయి. వీటిని ఆహారంగా భ్రమించి నోటకరుచుకునే నీటి జంతువులు చావుకి దగ్గరవుతున్నాయి. దీనికి తోడు నగరాలలోకి డ్రైనేజిలో ఎప్పటికప్పుడు పేరుకుపోతున్న క్యారీబ్యాగ్‌లు, ఒకోసారి వరదలకు కూడా కారణం అవుతున్నాయి. మొన్నామధ్య ముంబై మహానగరం వర్షపునీటిలో మునిగిపోవడానికి కారణం, క్యారీబ్యాగ్‌ల వల్ల డ్రైనేజీలు పూడుకుపోవడం అని తేలింది. జంతువులని వదలదు మిగిలిపోయిన ఆహారాన్ని క్యారీబ్యాగ్‌లలో ముడివేసి పారేయడం మనకి ఉన్న అలవాటు. ఈ ఆహారం కోసం ఆవులు, కుక్కలు వంటి జంతువులు అమాంతం ప్లాస్టిక్‌ సంచులను కూడా తినేస్తూ ఉంటాయి. ఫలితం! జీర్ణాశయంలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ సంచులు, వాటికి చావుని రుచి చూపిస్తున్నాయి. కేవలం ఇలా ప్లాస్టిక్‌ సంచుల బారిన పడి ఏటా కొన్ని వేల జంతువులు చనిపోతున్నట్లు అంచనా! రీసైక్లింగ్‌ జరగదు క్యారీబ్యాగ్‌లను రీసైక్లింగ్‌ చేయడం కంటే కొత్తవాటిని ఉత్తత్తి చేయడమే తేలిక! అందుకని మనం వాడి పారేసిన క్యారీబ్యాగ్‌లలో కేవలం 1 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు నోచుకుంటాయని తేలింది. అందుకని వాటిని రీసైక్లింగ్ చేసే ఆలోచనే లేకుండా అవసరం అయితే తగలపెట్టి, అందులోని రసాయనాలను గాల్లో కలిపేందుకే పురపాలక సంస్థలు కూడా ప్రయత్నిస్తుంటాయి. మరేం చేయడం??? - అన్నింటికంటే సులువైన మార్గం క్యారీబ్యాగ్లని వీలైనంతవరకూ వాడకపోవడం. చేతిలో ఒక సంచీని పట్టుకువెళ్లడమో, అలా చేయడం మొహమాటంగా అనిపిస్తే ఒక పాత ప్లాస్టిక్‌సంచిని జేబులో పెట్టుకుని వెళ్లడమో చేయాలి. - కొన్ని ప్రదేశాలలో క్యారీబ్యాగ్‌ల బదులు పల్చటి గుడ్డతో చేసిన సంచులు లేకపోతే కాగితంతో చేసిన సంచులు అందుబాగులో ఉంటున్నాయి. అవకాశం ఉన్నప్పుడు అలాంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోండి. - మరీ అవసరం అనుకుంటే మందపాటి క్యారీబ్యాగ్‌లనే వినియోగించండి. నిజానికి మన ప్రభుత్వం కనీసం 40 మైక్రాన్ల మందమైన క్యారీబ్యాగ్‌లనే వాడాలని ఎప్పుడో చట్టాన్ని తెచ్చింది. క్యారీబ్యాగ్‌లు ఇలా మందంగా ఉండటం వల్ల మట్టిని పాడుచేయవనీ, మళ్లీమళ్లీ వాడుకోవడానికి వీలుగా ఉంటాయనీ ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆచరణలో దీనిని పట్టించుకునేవారు తక్కువ. అన్నింటికంటే ముఖ్యమైన విషయం... వ్యాపారస్తులు క్యారీబ్యాగ్‌లను మన చేతిలో పెట్టేటప్పుడు నిజంగా వాటిని తీసుకోవాలా అక్కర్లేదా అని ఒక్క సెకను ఆలోచించడం. క్యారీబ్యాగ్‌ అవసరం లేదు అని మనకు అనిపించి, దాన్ని తిరిగిచ్చే ప్రతిసారీ.... మనం ఈ పర్యావరణానికి ఎంతో కొంత మేలుచేసినవారమవుతాం!   - నిర్జర.

మన కోపమే మన శత్రువు

మంచి వంటకం కుదరాలంటే అన్ని రుచులు వేటికవి సమపాళ్ళలో పడాలి. అప్పుడే కమ్మని వంటకం తయారవుతుంది. పొరపాటున ఏ ఒక్క రుచి ఎక్కువైనా వంటకంమొత్తం పాడైపోయినట్టే. జీవితం కూడా అంతే కదా! అన్ని భావావేశాలు వేటి స్థాయిలో అవి ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ ఒక్క భావావేశం మనసుని అతిగా ఆక్రమించినా మొత్తం చికాకుగా తయారవుతుంది. మనం గుర్తించంగానీ, కొన్నిసార్లు కొన్ని భావావేశాలు మనల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బందిపెడతాయి. ఎటొచ్చీ అలవాటు పడిపోయిన మనం వాటిని గుర్తించడానికి, వాటిని వదిలించుకోవడానికి, మనం మారడానికి ఇష్టపడం.   కోపం మనల్నే దహిస్తుంది.. చాలామందిని ఇబ్బందిపెట్టే కోపాన్నే తీసుకోండి. ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలవుతుందో తెలీదు. అప్పటి వరకు ప్రశాంతంగా వున్న మనసు ఒక్క నిమిషంలో అల్లకల్లోలంగా మారిపోతుంది. సర్దుకుందామని, ఆ కోపాన్ని దూరంగా నెట్టేద్దామని ప్రయత్నించిన కొద్దీ మరికొంచెం ఎక్కువవుతుందే గానీ తగ్గదు. ఒకోసారి ఆ కోపాన్ని అంత తొందరగా వదులుకోవడం ఇష్టంలేనట్టు మనం కూడా ఒకదానిపై నుంచి మరో దానిపైకి మన కోపాన్ని మళ్ళిస్తూనే వుంటాం. మండే కట్టె మంటని ఎగజిమ్ముతూనే తనని తాను దహించుకున్నట్టు కోపం వచ్చినప్పుడు ఎవరిమీదో కోపం చూపిస్తున్నాం అనుకుంటాం. కానీ, అది మనల్నే ఎక్కువ బాధపెడుతుంది.   కోపంతో జీవితం శూన్యం.. ఆ నిమిషానికి వచ్చిపోయే కోపం పెద్దగా హాని చేయకపోయినా కొంతకాలం పాటు కొందరిపై నిలిచిపోయే కోపం తప్పకుండా బంధాలను బలహీనపరుస్తుంది. ఒకోసారి మన మనసుని, జీవితాన్ని కూడా శూన్యంగా మార్చేస్తుంది. ఒక్కసారి గుర్తుచేసుకోండి ఎప్పుడైనా ఎవరిపైన అయినా వచ్చిన కోపానికి కారణం మొదట చిన్నదే అవుతుంది. రానురాను ఒకదానికి ఒకటి చేరుతూ మందమైపోతుంది. మనసుని రాయిగా మార్చేస్తుంది. మనకి తెలీకుండానే ఎదుటి వ్యక్తిని బాధపెడతాం. విసుక్కుంటాం. విసిరికొడతాం. ఫలితం తెలిసిందే. కానీ, ఎంత కోపం వచ్చినా మనం అంత తీవ్రంగా ఒక వ్యక్తిని బాధపెట్టడం కరెక్టేనా?   మనసులని గాయపరచొద్దు.. మనసులో ఎక్కడో దాగున్న అక్కసుని తీర్చుకునేందుకు కోపాన్ని సాధనంగా వాడుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటుండదు. ఒకరిని చూసి మరొకరు, ఒకరు చేశారు కదా అని మరొకరు ఇలా మనసుల్ని గాయపరచుకుంటూ వెళుతుంటే కొన్నాళ్ళకు గాయపడ్డ మనసులు, దూరమైన బంధాలు మిగులుతాయి. పరిగెట్టే కాలంతో అన్నీ సవ్యంగా వుంటేనే బంధాలని కాపాడుకోవడం కష్టంగా మారిన కాలంలో మనసుల్ని గాయపర్చుకుంటూ వెళితే ఆత్మీయత అనే లేపనాన్ని రాసేపాటి అవకాశం కూడా వుండదు.   ఒక మంచి మాట చాలు... క్షమించడం లాంటి పెద్ద పదాలు వాడక్కర్లేదుగానీ, చెదిరిపోయిన మనసుల్ని, బంధాల్ని సరిచేసే ఒక మంచి మాట మనసు లోతులోంచి వస్తేచాలు అద్భుతాలు జరగక మానవు. కోపం, పగ, ప్రతీకారం వంటి లక్షణాలను ప్రత్యేకంగా అలవర్చుకోనక్కర్లేదు. ముందు తరాల వారికి అలవాటు చేయక్కర్లేదు. వద్దన్నా అవి మన మనసుపై దాడి చేస్తూనే వుంటాయి. ఆత్మీయత అనే కవచాన్ని ధరిస్తే వాటి దాడి నుంచి తప్పించుకోవచ్చు. ద్వేషాని ద్వేషించి దూరంగా తరిమికొట్ట గలిగితే మనకి మనం మంచి చేసుకున్నవారమవుతాం. ప్రేమాప్యాయతలనే మంచి గంధాన్ని మనసు మూలల్లో దాచినా చాలు.. అది సువాసనలు వెదజల్లకపోదు. చుట్టూ తన పరిమళాన్ని నింపకపోదు. ఏమంటారు.. ఆలోచించండి! -రమ

విలువ

ఒక యువకుడు తన జీవితంలో తరచూ ఎదుర్కొంటున్న సమస్యలతో విసిగిపోయాడు. నలుగురితో మంచిగా ఉండటం వల్లే తనకి అన్నేసి కష్టాలు వస్తున్నాయన్న అభిప్రాయానికి వచ్చేశాడు. అందుకే ఇక నుంచి ఎదుటివాడి సొమ్ముని దోచుకుని బతకాలని నిశ్చయించుకున్నాడు. తను సాగే ఈ మార్గం గురించి ఎప్పటికైనా తన తల్లికి తెలియక తప్పదు. అందుకనే ముందుగా ఈ విషయాన్ని తల్లి దగ్గర వెల్లడించాడు యువకుడు. అంతా విన్న తల్లి... ‘సరే! నువ్వూ పెద్దవాడివి అవుతున్నావు. ఫలానా పని చేయవద్దంటూ నేను చెప్పిన నువ్వు వింటావన్న నమ్మకం లేదు. నువ్వు నీ మొదటి దొంగతనానికి వెళ్లే ముందర ఓ వెండి నాణేన్ని నాకు ఇస్తావా’ అని అడిగింది తల్లి. తన కొత్త జీవితానికి తల్లి అంత తేలికగా ఒప్పుకుంటుందని ఊహించలేదు యువకుడు. ‘ఓస్‌ వెండి నాణెమే కదా!’ అంటూ తన జేబులలో ఉన్న వెండిరూపాయిని తీసి తల్లి చేతిలో పెట్టాడు. కొడుకు తన చేతిలో వెండి రూపాయిని ఉంచగానే, తల్లి దాన్ని కాలి కింద వేసి తొక్కింది. ఆ తరువాత ఆ నాణేన్ని నేలకేసి టపాటపా కొట్టడం మొదలుపెట్టింది. తల్లి చేసిన పని చూసి కొడుకు విస్తుపోయాడు. ‘నీకేమన్నా పిచ్చి పట్టిందా’ అని కోపంగా అడిగాడు కొడుకు. ‘అబ్బే అదేం లేదయ్యా!’ అంటూనే ఆ వెండి రూపాయిని దుమ్ములో వేసి ఆడించింది తల్లి. తల్లి చేసే పనిని వింతగా చూస్తున్నాడు కొడుకు. నిజంగానే తన తల్లికి పిచ్చి పట్టి ఉంటుంది. లేకపోతే ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? తన వంక వింతగా చేస్తున్న కొడుకు వంక చిరునవ్వుతో చూస్తూ ‘బాబూ ఈ వెండి నాణెం నీకు ఇంకా కావాలా నాయనా!’ అంటూ అడిగింది తల్లి. ‘కావాలిగా మరి! ఎంత దుమ్ముకొట్టుకుపోయినా, గాట్లు పడినా వెండి రూపాయి విలువ తగ్గదు కదా! ’ అన్నాడు కొడుకు నాణేన్ని తల్లి చేతిలోంచి లాక్కొంటూ.   ‘నీ వ్యక్తిత్వం కూడా ఈ వెండి నాణెంలాగానే ఉండాలిరా! కష్టాలు, సమస్యలతో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నీ విలువని కోల్పోకూడదు. ఆకలితో కడుపు మండుతున్నా, నీ వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు. మిగతా అందరిలాగానే నువ్వు కూడా ప్రత్యేకమైనవాడివే! నువ్వు కూడా విలువైన మనిషివే! ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విలువని కనుక ఓర్పుతో నిలుపుకోగలిగితే... ఏదో ఒక రోజున నీ కష్టాలు దాటిపోవడాన్ని గమనిస్తావు!’ అంటూ చెప్పుకొచ్చింది. పిచ్చి చేష్టలుగా కనిపించిన తల్లి ప్రవర్తన వెనుక ఇంత అపురూపమైన సందేశం ఉందని తెలుసుకున్న కొడుకు, తన మనసుని మార్చుకున్నాడు. - నిర్జర.

కుక్క బతుకు

ఆయన ఒక పశువుల వైద్యుడు. ఆ వైద్యుడికి ఒక రోజు తమ ఇంటికి రమ్మంటూ ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఇంట్లో ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉందట. సరే! వైద్యుడు దానిని ఎలాగైనా నయం చేసే అవకాశం ఉందేమో చూసేందుకు సదరు ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి పెరట్లోకి అడుగుపెట్టిన వైద్యుడికి ఓ మూలగా కూర్చుని ఉన్న కుక్కని చూడగానే అర్థమైపోయింది. దానికి వయసు మీదపడిపోయిందనీ, తన అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం లేదనీ!   కుక్క చుట్టూ ఆ ఇంటి యాజమానీ, అతని భార్యా, వారి పన్నెండేళ్ల కొడుకూ దీనంగా నిల్చొని కనిపించారు. ‘‘మీకు ఈ మాట వినడం కష్టంగా ఉంటుందని తెలుసు! కానీ వాస్తవం చెప్పక తప్పదు. ఈ కుక్క ఊపిరితిత్తులు క్షీణించిపోయాయి. అది మరెంతో కాలం బతకదు. కానీ దాన్ని కనుక ఇలాగే వదిలేస్తే అది అనుక్షణం నరకయాతన పడాల్సి ఉంటుంది. మీకు సమ్మతం అయితే కనుక అది ఇంక ఎలాంటి బాధా పడకుండా వెంటనే చనిపోయేందుకు ఒక ఇంజక్షను ఇస్తాను,’’ అని చెప్పాడు వైద్యుడు.   వైద్యుడి మాటలు వినగానే వారి మొహాలు పాలిపోయాయి. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ ఆ కుక్క వారి కుటుంబంలో భాగంగా మారిపోయింది. అది లేకుండా వారికి పూటైనా గడిచేది కాదు. పొద్దు పోయేదీ కాదు! అలాంటి కుక్కని తమ చేతులతో తాము చంపాల్సి రావడం వారి గుండెని పిండేసింది. కానీ అది బాధతో చనిపోయేకంటే అనాయాసంగా చనిపోవడమే మేలనిపించింది. దాంతో మనసుని రాయి చేసుకుని ‘మీ ఇష్టం! మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి!’ అన్నాడు కుటుంబ యజమాని.   వైద్యుడు నిదానంగా తన బ్యాగ్‌లోంచి ఒక ఇంజక్షను తీసుకుని ఆ కుక్కకు ఇచ్చాడు. మరుక్షణమే అది మూలుగుతూ తన ప్రాణాలను విడిచింది. ఆ దృశ్యంతో కుటుంబసభ్యులలో ఉన్నా కాస్త నెత్తురూ పాలిపోయింది. వారి తలలు వాలిపోయాయి. కుక్క పట్ల వాటి యజమానులు చూపించే అభిమానం వైద్యుడికి కొత్తేమీ కాదు. అందుకనే వారిని కాస్త ఓదార్చేందుకు- ‘‘కుక్కలు కూడా మనలాగే నిండు నూరేళ్లు బతికితే బాగుండు కదా! కానీ పాపం అవి ఎందుకో పది పదిహేను ఏళ్లకు మించి బతకవు,’’ అన్నాడు. వైద్యుని మాటలకు యజమాని కొడుకు చివ్వున తలెత్తి చూశాడు. ‘‘కుక్కలు అంత తొందరగా ఎందుకు చనిపోతాయో నాకు తెలిసిపోయింది!’’ అన్నాడు.   కుర్రవాడు ఏం చెబుతాడా అని అంతా ఆసక్తిగా చూశారు. అతను తన కుర్రతనానికి తగిన సమాధానం ఇస్తాడులే అన్నట్లుగా అతని వంక చులకనగా చూశాడు వైద్యుడు. కానీ అతను చెప్పిన సమాధానానికి వారి దిమ్మ తిరిగిపోయింది. ‘‘మనిషి తన తోటివారిని ప్రేమించేందుకు, ప్రతి రోజునీ కొత్తగా స్వీకరించేందుకు, ప్రతిక్షణం సంతోషంగా జీవించే నేర్పు సాధించేందుకు... చాలా కాలం పడుతుంది. కానీ కుక్కకి ఆ నేర్పు పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఆ నేర్పుతోనే అది బతికే కొద్దికాలం హాయిగా బతికేస్తుంది. ఇక దానికి నూరేళ్లు జీవించాల్సిన అవసరం ఏముంది!’’ అన్నాడు కొడుకు తలవంచుకునే. అందరూ కుక్క బతుకంటే హీనమైనదంటారు. కానీ అసూయాద్వేషాలతో నిండు నూరేళ్లు రగిలిపోయేవారికన్నా కుక్క బతుకు ఎంత నయమో కదా! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

Are you compatible?

We must of have heard this sentence by many people, who are couples, just married or married for long and also from people who are couples to be. People often say that compatibility is the key for any relationship. But what is this compatibility all about? For example, when he/ she getting married or looking for partner, their selection may happen based on looks, professional outlooks, or pay cheques etc.. But the most important thing in choosing a partner should be campatibility of values. Because, looks, professions, careers, tastes will change but values will never change. They remain with you through out. We often say that, you have to take right decissions in marriage; but make the decisions right in your marriage should be the correct attitude. When we call life as a journey, partner is also sailing with us through out.  To make this journey beautiful,  happy and memorable, we certainly have to invest our time and energies. When marriage  is  commitment for the life time you have to keep up your word by working on it continuously. compatability is having this thought of "continuous work" from both sides. However,  when one is weak in the he pair then the other one has to walk that extra mile to reach the goal. For this  you need to have trust, faith and belief in self and others and the philosophy you follow. When this matches  with  each other's thought process, this is called compatibility of values. This is the only thing which can help the couple to hold the relationship. Here the issue is not about inter cast, inter religion or different social and financial status but it's all about how far your values are compatible with your partner's. For example if you both trust in God whether it is Jesus or Jagannath,  you "having trust in the devine" is your compatibility.  you can worship eighter of them but "praying" play important role here. But if one believe in prayers and one won't then this difference of openion may lead to arguments. In a marriage,  when your values differ with each other, belief system is different from each other , there you suffer and your kids suffer more than any body. To avoid such circumstances,  find out your partner,  who is campatible with you in values of life.  In this current scenario,  we have so many options to know each other beforeentering  in to the wedlock. This helps a lot to know about your compatibility levels. Remember, marriage is a relationship where you need to work constantly.  This bonding will be always under construction. Enjoy the journey. ...............Bhavana  

The Cockroach Theory

At a restaurant, a cockroach suddenly flew from somewhere and sat on a lady. She started screaming out of fear. With a panic stricken face and trembling voice, she started jumping, with both her hands desperately trying to get rid of the cockroach. Her reaction was contagious, as everyone in her group also got panicky. The lady finally managed to push the cockroach away but it landed on another lady in the group. Now, it was the turn of the other lady in the group to continue the drama. A waiter rushed forward to their rescue. In the relay of throwing, the cockroach next fell upon the waiter. The waiter stood firm, composed himself and observed the behaviour of the cockroach on his shirt. When he was confident enough, he grabbed it with his hand and threw it out of the restaurant. Sipping my coffee and watching the amusement, the antenna of my mind picked up a few thoughts and started wondering, was the cockroach responsible for their histrionic behaviour? If so, then why was the waiter not disturbed? He handled it near to perfection, without any chaos. It is not the cockroach, but the inability of the ladies to handle the disturbance caused by the cockroach that disturbed the ladies. I realized that, it is not the shouting of my father or my boss or my wife that disturbs me, but it’s my inability to handle the disturbances caused by their shouting that disturbs me. It’s not the traffic jams on the road that disturbs me, but my inability to handle the disturbance caused by the traffic jam that disturbs me. More than the problem, it’s my reaction to the problem that creates chaos in my life. Lessons learnt from the story: I understood, I should not react in life. I should always respond. The women reacted, whereas the waiter responded. Reactions are always instinctive whereas responses are always well thought of, just and right to save a situation from going out of hands, to avoid cracks in relationship, to avoid taking decisions in anger, anxiety, stress or hurry. (Most People attribute this anecdote to Sundar Pichai, the CEO of Google... though no one is sure of the narrator. But everyone who has read this story is certainly sure of its worth!) ..Nirjara

నీలో ‘షై’తాన్ తరిమేసెయ్...

తమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.