షాంపైన్ ఎందుకు అంత ఖరీదైనది

దేవతలు అమృతం తాగి అమరులైతే సంపన్నులు షాంపైన్ తో ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ధనవంతులు విందువినోదాల్లో తప్పనిసరిగా ఉంటుంది షాంపైన్. ప్రపంచంలోనే ఖరీదైన మద్యంగా దీన్ని చెప్పవచ్చు. మరి మిగతా వైన్ లకు షాంపైన్ కు వ్యత్యాసం ఎంటో తెలుసుకుంటే ఇది ఎందుకు ఇంత ఖరీదు అయినదో తెలుస్తుంది. షాంపైన్ అనేది విలాసానికి, వినోోదానికి  పర్యాయపదంగా ఉంది. ఇతర వైన్స్ కన్నా రెట్టింప ధర ఉంటుంది.  తక్కువలో తక్కువ షాంపైన్ ధర యాభై డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకు ఉఁటుంది. అంతేకాదు పాత షాంపైన్ బాటిల్ ధర వెయ్యి డాలర్ల వరకు పలుకుతుంది. మరీ షాంపైన్ ఇంత ఖరీదు ఎందుకు మెరిసేదంతా బంగారం కానట్టు షాంపైన్ గా పిలువపడే అన్ని రకాల వైన్లు షాంపైన్ కావు. కేవలం ఉత్తర ఫ్రాన్స్‌లోని షాంపైన్ ప్రాంతంలో తయారు చేస్తే షాంపైన్ మాత్రమే నిజమైన షాంపైన్. ఈ ప్రాంతం వెలుపల తయారు చేసిన అన్ని ఇతర వైన్లను, ఫ్రాన్స్   పొరుగు ప్రాంతాల నుండి వచ్చే వాటిని కూడా గుర్తించాలి.  ప్రాసిక్కో , కావా వంటి ఇతర  వైన్ల ధర కంటే రెట్టింపు ధరలో షాంపైన్ దొరుకుతుంది. మంచి-నాణ్యమైన షాంపైన్ బాటిల్ ధర ఎక్కవగా ఉంటుంది. ప్యారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో, ఫ్రాన్స్‌లోని ఈ అత్యంత రక్షిత ప్రాంతం షాంపైన్.  ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన,  ఖరీదైన షాంపైన్ అమ్మకందారులకు కొనుగోలుదారులకు ఇచి కేరాఫ్ గా చెప్పవచ్చు. మోయిట్ & చాండన్ , పెరియర్-జౌట్ కంపెనీలు కూడా  ఈ ప్రాంతం వెలుపల తయారు చేసిన వైన్ లను అమ్ముతాయి. ఫ్రాన్స్ లో తయారైనా, ఫ్రాన్స్ వెలుపల తయారైన షాంపైన్ గా లేబుల్ చేయాలి. ఈ చిన్న ప్రాంతంలో శాన్ ఫ్రాన్సిస్కో కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో నిజమైన షాంపైన్  తయారు చేయబడుతుంది.  ప్రతి సంవత్సరం 300 మిలియన్ బాటిళ్లకు పైగా ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఈ షాంపైన్  వార్షిక ఆదాయం 5 బిలియన్ డాలర్లు. షాంపైన్ అమ్మకాలు 1950 ల నుండి క్రమంగా పెరిగాయి.  కానీ దాని భవిష్యత్ ఈ ప్రాంతంలోని  ప్రత్యేక వాతావరణం పరి రక్షణపై ఆధారపడి ఉంది. ఉత్తర ఫ్రాన్స్  ప్రత్యేక పరిస్థితులు పెరిగిన ధరలకు మొదటి కారకం. సగటున 50 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో, ఈ ప్రదేశం ఫ్రాన్స్ లో ఇతర వైన్ తోటలు పెరుగు తున్న ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది, ఇది ద్రాక్షకు మెరిసే-వైన్ ఉత్పత్తికి సరైన ఆమ్లతను ఇస్తుంది. ఏదేమైనా, తరచుగా గడ్డకట్టే ఖండాంతర వాతావరణం,  పర్యావరణ వ్యవస్థ  వైన్ రుచిని మరింత ప్రత్యేకంగా మార్చుతాయి. "షాంపైన్ ఎక్కువ మన్నికైనది కావడానికి  చాలావరకు  ద్రాక్ష పంట పెరిగే భౌగోళిక పరిస్థితులు, అక్కడి స్థానిక వాతావరణం పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు దాని ఉత్పత్తిచేసే విధానం కూడా ప్రత్యకంగా ఉంటుంది. కాలక్రమేణా ఈ తయారీ విధానం మరింత మెరుగుపరచబడింది.  మేము  రెండు శతాబ్దాలకు పైగా ఇక్కడ ద్రాక్షను పండిస్తున్నాం. ఇది నిజంగా  చాలా ముఖ్య మైన అంశం. దీనితో పాటు  ఆల్కహాలిక్ కిణ్వ  ప్రక్రియ లో తయారయ్యే  వైన్  చాలా  కిక్ ఇస్తుంది.  వివిధ రకాల  వైట్ వైన్లకు మించి రుచి ఇస్తుంది అంటున్నారు " ఫాబ్రిస్ రోసెట్, చైర్మన్ అండ్ సిఇవో, షాంపైన్ డ్యూట్జ్  ద్రాక్షపంటకోత సమయంలో దాదాపు 1,20,000 మంది కార్మికులు పనిచేస్తారు. వీరంతా 84,000 ఎకరాల విస్తీర్ణంలో పండిన  తోటల నుంచి ద్రాక్షను సేకరిస్తారు. ద్రాక్ష పంటల సాగులో యంత్రాలను ఉపయోగించడం నిషేధం. అందుకే భూమి సాగు నుంచి పంటకోత వరకు అన్నీ కార్మికులే  చేతులతో చేస్తారు. అంతే కాదు ఉత్తమమైన ద్రాక్షను మాత్రమే ఎంచుకుంటూ   తీగల నుంచి ద్రాక్షను సేకరిస్తారు.  దీనివల్ల నాణ్యమైన ద్రాక్షను ఉపయోగించ డం వీలవుతుంది. కొండపై రోజంతా సూర్యురశ్మి తగులుతుంది. అంతేకాదు వర్షం పడినా నీరు మాత్రం ఆగదు. ఈ నేలలో ద్రాక్ష సాగు చారిత్రాత్మకంగా కొనసాగుతుంది. దీనితో ఉత్తమమైన నేలలో పండిన ద్రాక్ష లభిస్తుంది. ఇక్కడి మట్టి , వాతావరణంలో పెరిగే ద్రాక్షకు మాత్రమే షాంపైన్ తయారుచేసే ఉత్తమగుణాలున్నాయి. అంటాడు ఇరేలియన్ లాహెర్టే, ద్రాక్ష తోటల పెంపకందారుడు. ప్రామాణికమైన షాంపైన్ మాథోడ్ ఛాంపెనోయిస్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ వైన్ ఓక్ ,  స్టెయిన్లెస్ స్టీల్ వాట్స్‌  లో ప్రాధమిక కిణ్వ ప్రక్రియకు జరుగుతంది. ఆ తర్వాత  బాటిల్ లోపల ద్వితీయ కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. ఈ పద్ధతి యూరోపియన్ యూనియన్‌కే పరిమితం చేయబడింది. అందుకే షాంపైన్ ప్రాంతం వెలుపల నుండి వచ్చే వైన్‌లను షాంపైన్ అని అనరు. ఏదేమైనా ప్రపంచం నలుమూల్లో అన్ని రకాల వైన్ సరిగ్గా అదే విధంగా ఉత్పత్తి చేయబడుతుంది. అయితే షాంపైన్ మాత్రం సాంప్రదాయక ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. యూరప్ వెలుపల ఉన్న దేశాలలో కొంతమంది వైన్ తయారీదారులు యూరోపియన్ లేబులింగ్ చట్టాలను పూర్తిగా విస్మరిస్తారు. షాంపైన్ పేరుతో  మెరిసే వైన్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రామాణికమైన షాంపైన్ బ్రాండ్‌ను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 80 మందికి పైగా న్యాయవాదులతో కలిసి పనిచేసే కామిట్ షాంపైన్ ఈ అనుకరణలను నిరంతరం సవాలు చేస్తుంది. అంతిమంగా, ఉత్పత్తిలో సారూప్యతలు , రుచి ఉన్నప్పటికీ, నిజమైన షాంపైన్ మాత్రమే ఈ ప్రాంతం  చరిత్ర, ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది. షాంపైన్ ఉత్పత్తి విధానం మూడవ శతాబ్దం నాటిది. రోమన్లు మొట్టమొదట ఈశాన్య ఫ్రాన్స్‌లో ద్రాక్షతోటలను సాగుచేశారు. 17 వ శతాబ్దం మధ్యలో సీసాలో కిణ్వ ప్రక్రియ అభివృద్ధి చేయడంతో  షాంపైన్ అధికారికంగా రుచికరమైన పానీయంగా మారింది.  దీన్ని  లూయిస్ XIV హయాంలో రాజు ఇచ్చే విందులో అతిథిలకు అందించేవారు.   ప్రారంభంలో సీసాలను భూమితో దాచేవారు. అయితే సీసాల లోపల ఉత్పత్తి అయ్యే  కార్బన్ డయాక్సైడ్ వాయువు తరచుగా సీసాలు పేలడానికి కారణమయ్యేది. 19 వ శతాబ్దం నాటికి షాంపైన్ ప్రజాదరణ పొందింది.  ముఖ్యంగా ధనిక, రాయల్ కుటుంబాల్లో  షాంపైన్ విలాసవంతమైన వైన్ గా పేరుగాంచింది.  వారి ఇంట్లో మందమైన గాజు సీసాల్లో మెరిసే షాంపైన్ బాటిల్స్  ఉంచడం స్టేటస్ గా భావించేవారు. దాంతో ఆధునిక షాంపైన్ పరిశ్రమ ఏర్పడటం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే  మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయాల్లో ఈ ప్రాంతం కీలక యుద్ధభూమిగా మారినప్పటికీ, కొన్ని షాంపైన్ ఉత్పత్తి  మాత్రం కొనసాగింది. అయితే  యుద్ధం ముగిసేనాటికి షాంపైన్ ద్రాక్షతోటలలో 40శాతం నాశనమయ్యాయని అంచనా. ఉత్పత్తిలో కోత కారణంగా యుద్ధ సమయంలో తయారు చేసిన సీసాలు అధిక ధర పలికాయి.  2015 లో సోథెబైస్ క్రుగ్ యుద్ధకాలంలోని 1915నాటి షాంపైన్ బాటిల్ ను  116,000 డాలర్లకు వేలం వేసింది. విలాసానికి, సంపదకు, ప్రముఖులకు  షాంపైన్ అనుబంధం ఎంతో ఉంది. రాజులకు పట్టాభిషేకం చేసే సమయంలోనూ, పెద్దపెద్ద నౌకలను ప్రారంభించే సమయంలోనూ షాంపైన్  ధరలను అధికంగా  ఉండేవి. అమెరికన్ ర్యాపర్, జే-జెడ్ 2014 లో కాటియర్ కుటుంబం నడుపుతున్న షాంపైన్ బ్రాండ్ అర్మాండ్ డి బ్రిగ్నాక్ తయారు చేసే "ఏస్ ఆఫ్ స్పేడ్స్" లో భాగస్వామి అయ్యాడు. సెప్టెంబరు 2019 లో వారు 2009, 2010, 2012 ఏండ్ల నాటి ఉత్పత్తులైన అరుదైన షాంపైన్ రకాలను విడుదల చేశారు. ఇందులో 3,535 బ్రాండ్ మాత్రం  వెయ్యి డాలర్ల ధరతో అందుబాటులో ఉంది. ఈ షాంపైన్ ఆరు సంవత్సరాల పాటు బాటిల్ లో నిల్వచేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాముఖ్యతను, డిమాండ్ ను సంపాదించుకున్న షాంపైన్ భవిష్యత్ ఏంటీ అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. షాంపైన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వైన్-పెరుగుతున్న ప్రాంతంగా అవతరించింది. అయితే గణాంకాలను బట్టి చూస్తే గ్లోబల్ వార్మింగ్  కారణంగా గత 30 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.. దాంతో ద్రాక్ష పంట కోతకు వచ్చే తేదీల్లో మార్పులు వచ్చాయి.  15రోజుల ముందుగానే పంట చేతికి వస్తుంది. షాంపైన్ ప్రాంత  వాతావరణ పరిస్థితులు మారుతున్నందున, పారిస్ ఒప్పందం వాతావరణ లక్ష్యాలు గ్లోబల్ వార్మింగ్‌ను కొనసాగించడంలో విఫలమైనందున భవిష్యత్త్ లో ఈ చారిత్రాత్మక ప్రాంతంలో వైన్ తయారీ ప్రమాదంలో పడుతుంది.  

భూమిని రక్షించే 22 ఆవిష్కరణలు...!

విపరీతంగా ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి ఉష్టోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ కారణంగా వాతావరణంలో వచ్చే పెనుమార్పులు ప్రకృతివైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఆధునిక జీవనశైలిని పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మార్చేలా అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని.. 1. పాత ప్లాస్టిక్ బాటిళ్లను బల్బులుగా మార్చడం.  నీళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా బాటిల్స్ లోనే లభ్యమవుతున్నాయి. ఇవి అంత త్వరగా భూమిలో కలిసిపోవు. వీటిని రీ యూజ్ చేయడం ద్వారా చాలావరకు పర్యావరణాన్ని రక్షించవచ్చు. పాత ప్లాస్టిక్ బాటిళ్లలో సూక్ష్మమైన సోలార్ పానెల్ లు ఉంచడం వల్ల వీటిని బల్బులుగా మార్చవచ్చు. ఇవి పేద వర్గాల నివాసప్రాంతాలకు విద్యుత్ కాంతిని అందించడానికి వీలుగా ఉంటాయి. 2. తినదగిన వాటర్ బాల్స్ నీళ్ల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఆవిష్కరణ ఇది. వాటర్ ను బాల్స్ గా అందుబాటులోకి తీసుకురావడంతో ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగం చాలావరకు తగ్గుతుంది. తినదగిన వాటర్ బాల్స్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి సహాయపడతాయి. 3. మిస్టర్ ట్రాష్ నదుల్లో చెత్త పెరుకుపోవడంతో నదీజలాలు, సముద్రజలాలు కలుషితం అవుతున్నాయి. కోట్లాది జలచరాలు ప్రాణాలో కోల్పోతున్నాయి. ఈ ముప్పును తగ్గించడానికి అందుబాటులోకి వచ్చిన ఆవిష్కరణ మిస్టర్ ట్రాష్. ఇది నదుల నుండి చెత్తను తొలగిస్తుంది. కరెంట్ లేదా సోలార్ తో పనిచేసే ఇది బెల్టిమోర్ లో 999 టన్నుల చెత్తను తొలగించింది. 4. ప్లాస్టిక్ రహిత షాంపో పాడ్లను, కరిగే ఫిల్మ్స్ ద్వారా తయారు చేస్తారు. బెంజమిన్ స్ట్రెయిన్ తన 14వ ఏట దీన్ని రూపొందించాడు. కేవలం 5 మిల్లిలీటర్లు ఉన్న ఆ పాడ్ ఎంతటి పొడవైన జుట్టునైన శుభ్రం చేస్తుంది. 5. మెల్లిగా కదిలే నీళ్ళద్వారా టర్బైన్ హార్వెస్ట్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం మోటార్ పనిచేయాలంటే అతి తక్కువగా  2mph కరెంటు ఉంటే చాలు. 6. పాత కంటైనర్లును బాగుచేసి, షిప్పింగ్ కంటైనర్ పూల్ ను తయారు చేస్తారు. వాటిలో నీటిని ఫిల్లర్ చేసే పరికరాలు, మెట్లు, డెక్ అన్ని అమర్చబడి ఉంటాయి. 7. సీబిన్ సముద్రంలోని చెత్తను సేకరిస్తుంది. అందులో ఉన్న పంపు నీటి ప్రవాహాన్ని సృష్టించి చెత్త అంతా ఆ బ్యాగ్ లో నిండేలా చేస్తుంది. మరోవైపు నుండి నీరు అంతా బయటకు వెళ్ళిపోతుంది. 8. తినదగిన ఈ స్పూన్లు చిన్న చిన్న ఫంక్షన్స్ లోనూ ప్లాస్టిక్ స్పూన్లు ఉపయోగిస్తారున్నారు. వీటిని తగ్గించే ప్రయత్నమే తినదగిన స్పూన్లను రూపకల్పన. ఇవి ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గిస్తుంది. అవి వేపర్స్ లాగా రుచిగా ఉంటాయి. వీటిని రైస్, మిల్లెట్స్, గోధుమల నుండి తయారు చేస్తారు. 9.సాల్ట్ వాటర్ బ్రేవరీ సముద్ర జీవులకు  ఆహారంగా తీసుకోవడానికి వీలుగా ప్యాకింగ్ చేస్తుంది. ఉత్పత్తి చేసే రింగ్స్ ను బార్లీ, గోధుమలతో తయారు చేస్తారు. వీటిని జలచరాలు సులభంగా తిన గలవు. 10. ఈ పోర్టబుల్ టర్బైన్ అనేది 24 గంటలూ విద్యుతును ఉత్పత్తి చేస్తునే ఉంటుంది. ఇది 12 kwh వరకు ఉత్పత్తి చేస్తుంది. ఒక ఇంటికి ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇది పర్యావరణ రహితం కూడా. 11. ప్లాస్టిక్ బాటిల్ కట్టర్ అనేది బాటిళ్లను దారాలుగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాటిళ్ల దారాన్ని వేరే రూపంగా ఉపయోగించుకునేందుకు పనికొస్తాయి. కార్లకు కట్టి లాక్కెళ్లాడానికి మొదలైన వాటికి పనికొస్తాయి. 12. ఈ టూత్‌పేస్ట్ మాత్రలు అనేవి ప్యాకేజీలో దొరుకుతాయి. లిండ్సే మెకార్మీస్ వీటిని తయారుచేసింది. వాటిని ఫ్రెష్ గా భద్రపరచాల్సిన అవసరం కూడా లేదు. 13. పాత టైర్లను ముక్కలుగా చేయడం.. పాత టైర్లను ముక్కలుగా చేసే ఈ భారీ యంత్రం టైర్లకు సెకండ్ లైఫ్ ఇస్తుందనే చెప్పవచ్చు. ఇది కాటన్, ఫైబర్, ఉక్కు మొదలైన వాటి నుండి రబ్బరును వేరు చేస్తుంది.  ఈ మెటీరియల్ ను తిరిగి ఉపయోగించుకునేలా చేస్తుంది. 14. వాటర్ లిల్లీ.. ఈ చిన్న టర్బైన్ అనేది గ్రిడ్  శక్తిని పెంచుతుంది. ఈ వాటర్ లిల్లీ గాలి లేదా నీటి నుండి శక్తిని సేకరించి విద్యుత్ గా మారుస్తుంది. ఇది ఎటువంటి పవర్ డివైజ్ ను అయినా ఛార్జ్ చేస్తుంది. 15. సోయాబీన్స్ తయారు చేయబడిన పౌడర్ నీటి నుండి మురికిని వేరు చేస్తుంది. దీన్ని మురికినీటిలోనో, పొల్యూషన్ నీటిలోనో మిక్స్ చేస్తే ఆ మురికినంతా అడుక్కు చేరేలా చేసి నీటిని శుభ్రపరుస్తుంది. 16. ఈ బాల్స్ మానుషుల విసర్జనతో తయారుచేయబడిన బొగ్గులు. మానవ వ్యర్థాలను రెండు మూడు వారాలపాటు గ్రీన్ హౌస్ లో ఎండబెట్టి  ఆ తర్వాత వాసనను పోగొట్టడానికి 700 సెంటిగ్రేడ్ దగ్గర వాటిని వేడి చేస్తారు. ఆ తర్వాత బాల్స్ గా తయారుచేస్తారు. 17. ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగులు నీటిలో కరిగిపోతాయి. వీటిని దుంపజాతి పంటలైన కర్రపెండలం నుండి తయారు చేస్తారు. నీటిలో అవి కరిగిపోయిన తర్వాత తాగేందుకు ఉపయోగపడతాయి. 18. ఈ వర్ల్పూల్ టర్బైన్బైన్లు చాలా ఇండ్లకు కరెంటును అందిస్తాయి. ఇవి 24 గంటలు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం వీటిని రూపొందించారు. 19. ఈ కంపోస్ట్ బిన్ అనేది చెత్తను గ్యాస్ గా మారుస్తుంది. ఒక లీటరు సేంద్రియ వ్యర్థాలకు 200 లీటర్ల గ్యాస్ ను  ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ బిన్ ను ఒక పైప్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేసుకోవాలి. 20. ఈ యంత్రం కరెంట్ లేకుండా వాషింగ్ మిషన్ లో  బట్టలు ఉతికి పెడుతుంది. దీనికి కావాల్సిందంతా మానవ శక్తి , కొన్ని నీళ్లు. పెడల్ తొక్కడం ద్వారా తిరిగే ఈ యంత్రాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని కనుక్కోబడింది. 21. క్యాప్ స్టవ్ 2 అనేది పొగను తగ్గించే యంత్రం. ఇంధన వినియోగాన్ని సగానికి పైగా తగ్గిస్తుంది. స్టవ్  నుండి పొగ వెలువడటం ద్వారా సంవత్సరంలో 1.5 మిలియన్ మంది ప్రజలు చనిపోతున్నారు. 22. హైడ్రో వీల్ ఒక మైలు దూరం వరకు నీటిని పంపుచేస్తుంది. దీనికి ఎటువంటి విద్యుత్ అవసరం ఉండదు. పైగా దీనికి పెద్దగా మెకానికల్ పార్ట్స్ ఉండవు కాబట్టి సులభంగా మెంటేన్ చేయవచ్చు.

సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువైన పనిచేసే తేనెటీగలు

తేనెటీగలు అంతరించిపోతే .. పార్క్ లోనూ... ఎప్పుడైనా పొలాల వైపు వెళ్లినప్పుడో తేనెటీగలను చూస్తాం. అవి ఎక్కడ కుడ్డతాయో అని భయపడతాం. కానీ, ఆ తేనెటీలు లేకపోతే మనకు ఆహారమే కష్టం అన్న విషయం మాత్రం గమనించం. వాటి మకరందం సేకరణ వెనుక జీవజాతి ఆహారం ఆధారపడి ఉంది అన్నది వాస్తవం.. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్నది నిత్యసత్యం. తేనెటీగలకు మనం తినే ఆహారానికి ఎంటో సంబంధం అనుకుంటున్నారా.. చాలా ఉంది.. పర పరాగ సంపర్కం.. సైన్సు పాఠ్య పుస్తకాల్లో కనిపించే సామాన్య పదం ఇది. కొన్ని రకాల కీటకాలు ఒక పువ్వు నుంచి మరో పువ్వు మీద వాలినప్పుడు, వాటి కాళ్లకు అంటుకున్న పుప్పొడి రేణువుల ద్వారా పర పరాగ సంపర్కం జరిగి ఆయా మొక్కల ప్రత్యుత్పత్తి జరుగుతుందని ఈ పాఠం చెబుతుంది. అంటే ప్రకృతి పచ్చగా కళకళలాడాలంటే కీటకాల పాత్ర కీలకం. తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు... ఇవన్నీ కూడా పుప్పొడి వాహక కీటకాలే. పర పరాగ సంపర్క చోదకాలే. ఇలాంటి వాటన్నిటినీ కలిపి ‘పాలినేటర్స్‌’ అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ తప్పిదాల వల్ల క్రమక్రమంగా ఈ ‘పాలినేటర్స్‌’ అంతరించిపోతున్నాయి. ‘పాలినేటర్స్‌’ లేని ప్రపంచాన్ని ఊహించడమంటే... పోషకాలనిచ్చే పండ్లు, గింజలు, కూరగాయల మొక్కలు లేని ప్రకృతిని వీక్షించడమే. అందుకే పలు గుణపాఠాల అనంతరం యావత ప్రపంచం అప్రమత్తమయ్యింది. పలు దేశాలు యుద్ధప్రాతిపదికన వీటిని అభివృద్ధి చేయడానికి నడుం బిగించాయి. తేనెటీగలు మీకు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు. ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధేస్తుంది. అయితే పర పరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి.  ప్రపంచ జనాభాకు కావల్సిన ఆహారంలో అధికశాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం ములానే లభిస్తుంది. . కానీ నేడు రికార్డ్ స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే, మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది..? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై ఉన్న తేనెటీగలనీ చనిపోతే పరిస్తితులేం బావుండవు.  సమతుల్య ఆహారం కోసం, మానవులకు అవసరమైన పండ్లు, ఇతర కూరగాయలు, మొక్కల పునరుత్పత్తి చేయడానికి, వాటిని పెంచడానికి ఈ పరాగ సంపర్కం అవసరం. ఈ సంపర్కాన్ని తేనెటీగలు బెస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి పుష్పించే మొక్కలతో కలిసి ఉండటం వల్ల ఇవి పరాగ సంపర్క యంత్రాలుగా మారిపోయాయి. మనం తినే 84శాతం పంటలను పరాగ సంపర్కం చేయడానికి తేనెటీగలు సహాయపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆహార వార్షిక ఉత్పత్తిలో 236 బిలియన్ డాలర్ల నుండి 577 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ తేనెటీగలు లేదా పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు లేకుంటే ఇవాళ ఉండే సూపర్ మార్కెట్లలోని కూరగాయలు, పండ్లు సగం వరకు ఉంటాయి. తేనెటీగల్లో విలుప్త వినాశనకరమైన డొమైన్ ను కలిగివుంటుంది. అది మొక్కలను తినే జంతువులని సంహరించడమే కాకుండా ఫుడ్ చైన్ ను పెంచుతూ పోతుంది. అమెరికన్ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తేనెటీగలు మనకు చేసే పని సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువతో సమానం అని లెక్కకట్టింది. ఒకవేళ అవే లేకుంటే మన ఉత్పత్తి ఖర్చు ఆకాశాన్ని అంటుకునేదేమో..?సామాజికంగా, ఆర్థికంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న వాళ్ళు సమతుల్యమైన ఆహారాన్ని ఇప్పటికే పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్లపై మరింత ఘోరమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మనం ఊహించిన దానికంటే కూడా తేనెటీగలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. 2018 సంవత్సరంలో అమెరికాలోని తేనెటీగల పెంపకందారుల్లో తమ కాలనీలో 45శాతం కోల్పోయామని చెప్పారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంగా రికార్డ్ స్థాయిలో తేనెటీగలు చనిపోతున్నాయి. తేనెటీగలు అకస్మాత్తుగా ఇలా తగ్గిపోవడానికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను కనుగొనలేదు కానీ, గ్లోబల్ వార్మింగ్, అధిక మోతాదులో పురుగుల మందుల వాడకం, తేనెటీగల పెంపకంపై వైరసును వ్యాప్తి చేసే పరాన్నజీవి వర్రోవా వంటి పురుగులు కారణం అని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తేనెటీగలను పర్యవేక్షణ చేయడానికి, రోబోట్లను ఉపయోగించి కొత్త పరాగ సంపర్క పద్దతులను రూపొందించడానికి కృషి చేస్తున్నారు. సగటు మనిషి తేనెటీగలతో స్నేహంగా ఉండటానికి ఏమిచేయవచ్చు అనే ప్రశ్న రావచ్చు. మీకు ఉద్యానవనం ఉంటే అందులో పువ్వులను నాటండి, వాటిపై వాలిన తేనెటీగలు సంవత్సరం పొడవునా అమృతాన్ని ఇస్తాయి.  తేనెటీగల్లో స్థానిక తేనెటీగలు, అడవి తేనెటీగలు అని రకాలు ఉంటాయి. కొన్ని మట్టిలో గుడుకట్టుకొని ఉంటాయి. ఒకవేళ మట్టిని చదును చేస్తుంటే తేనెటీగలు ఉన్న వాటిని వదిలివేయడం, ఆ మట్టికి నీళ్ల అందేలా చూడటం, సాధ్యమైతే పురుగుల మందులకు దూరంగా ఉండటం కూడా వాటికి సహాయ పడినట్లే. ప్రపంచ తేనెటీగల జనాభాను కాపాడటానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నప్పటికీ భూమిని రక్షించు కోవడానికి ఇంకా చేయాల్సింది మాత్రం చాలానే ఉంది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర 7 వీధులు

ప్రపంచంలో అందమైన నగరాలను చూశాం. అద్భుతమైన సముద్రతీరాలను తిలకించాం.ఎత్తైన భవనాలను, విలాసవంతమైన హోటల్స్ ఇలా అనేక అంశాలను మనం తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని దేశాల్లోని వీధుల్లో అడుగు పెట్టాలంటే భయంతో వణికే పరిస్థితి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో భద్రత లోపించడం ఇందుకు ప్రధానకారణం. మరి అంత భయంకరమైన వీధులు ఎక్కడ ఉన్నాయో.. అవి ఎందుకు సురక్షితం కాదో మనం తెలుసుకుందాం.. 1. కాటియా, కారకాస్, వెనిజులా( catia,caracas, venezuela) ఈ వీధి అత్యంత ప్రమాదకరమైన వీధిగా పేరుగాంచింది. ఈ నగరంలో సురక్షితం కాని ప్రాంతాల్లో ఇది ఒకటి. 2016 లో ఈ నగరంలో మర్డర్ రేటు  చాలా భయానకంగా ఉందేది. అది రోజురోజుకూ పెరిగింది.  ప్రస్తుత రాజకీయ వాతావరణం కారణంగా ఈ నగరాన్ని సందర్శించకపోవడమే మంచిది. ఇక్కడ జరిగే నేరాలు స్థానిక ప్రజలనే కాదు పర్యాటకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వెనిజులా ఎలాంటి వాతావరణం, ప్రజల పరిస్థితి ఉందో చెప్పడానికి  ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 2. రెనాసిమింటో, అకాపుల్కో, మెక్సి కో(renacimiento, acapulco, mexico) పాత హాలీవుడ్ చలనచిత్రాల్లో కనిపించే  ఆకర్షణీయమైన బీచ్ పట్టణం ఇది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.  ఇది మెక్సికోలో అత్యంత హింసాత్మక నగరంగా మారింది. ఇక్కడ కొన్ని వీధుల్లో జరుగుతున్న హత్యలు ఇక్కడ ఉన్న నేరపరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన  నేరాలు  2017 సంవత్సరం  జూన్ నెలలో జరిగాయి. ఇక్కడ గ్యాంగ్ లదే పైచేయిగా మారింది. అంతేకాదు ఈ నగరంలో నివసించే ప్రతి  ఒక్కరూ వారి వారపు జీతంలో కొంత భాగాన్ని రౌడీ మాములుగా  చెల్లించడానికి క్యూలో నిలబడాలి. ఇది ఇక్కడి ప్రజల దుస్థితికి అద్దం పడుతుంది. అక్రమ పదార్థ రవాణా, గ్యాంగ్ ల మధ్య  వార్ ల  కారణంగా  ఇక్కడ అనునిత్యం హింసాత్మక వాతావరణం ఉంటుంది. 3. ఫోర్టాలెజా, సీరా, బ్రెజిల్ (fortaleza,  ceara, Brazil) ముఠాల మధ్య వివాదం కారణంగా మే నెల 2018 లో ఒక నైట్‌క్లబ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు.  ఈ నగరంలో నేరాల రేటు పెరగడానికి ముఠాల మధ్య గొడవలే  ప్రధాన కారణంగా మారాయి. ఇక్కడ అనేక ప్రాంతాల నేరాలకు చిరునామాగా కనిపిస్తాయి.  అనేక నగరాలు ఇక్కడ సురక్షితం కావు. ముఖ్యంగా చీకటి పడ్డాక బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.  బీచ్ ప్రాంతం చుట్టూ ఉన్న వీధుల్లో నేరాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. అనుక్షణం జాగ్రత్తగా ఉంటూ నేరాల నుంచి తప్పించుకోవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. 4. సాన్ పెడ్రో సులా, కోర్టెస్, హోండురాస్ (SAN pedro Sula, cortes, Honduras) చాలా భయంకరమైన ఈ నగరంలో వీధుల  చుట్టూ చనిపోయిన మృతదేహాలను చూడటం చాలా సాధారణంగా కనిపిస్తుంది. వాటిని చూసి  మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది దక్షిణ అమెరికా లోని  అత్యంత భయంకరమైన నగరాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ నేరాలకు కారణం అవుతుంది. రహదారులు, వీధుల్లో భద్రత ఉండదు. ప్రశాంతమైన ప్రజాజీవనానికి విఘాతం కలిగిస్తున్న ఈ ప్రాంతం లోో నేరాలను అదుపు చేయడానికి వివిధ సంస్థలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇవి నెమ్మదిగా ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచడానికి దోహదం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు త్వరగా ఫలించి ఈ నగరం నేరాల  జాబితా నుంచి త్వరగా బయటపడుతుందని  ఆశిద్దాం. 5. శాన్ సాల్వడార్, ఎల్ సాల్వడార్ (san salvador, El salvador) ఈ నగరం హత్యలకు మారుపేరుగా నిలిచింది. 2016 లో ప్రతి 1,00,000 మందికి సగటున 83.39శాతం హత్యలు ఇక్కడ జరిగాయి.  దురదృష్టవశాత్తు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్‌లో ఎంఎస్ -13 అనే ముఠా కార్యకలాపాలు లోతుగా పాతుకుపోయాయి.  ఈ ముఠాను అమెరికాలో సాల్వడార్ వలసదారుల పిల్లలు ప్రారంభించారు. అనేక నేరాలతో సంబంధాలు కలిగి ఉండే ఈ ముఠాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. చాలా వీధులు నేరాలకు నిలయాలు. 6. కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా (cape town, south africa) పోలీసుల లెక్కల  ప్రకారం ఈ ప్రదేశం 2016-2017 సంవత్సరానికి దక్షిణ ఆఫ్రికాలోనే అత్యధిక నేరాలు జరిగిన ప్రాంతం.  అయితే ఈ నగరం ఇతర నగరాల మాదిరిగా కాకుండా అత్యంత సుందరమైన, అద్భుతమైన నగరం కావడంతో సందర్శకులు వస్తుంటారు.  నగరం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ  నేరాలు ఎక్కువగా జరగడంతో సందర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నగరం వాస్తవిక పరిస్థితి తెలిసిన వారెవ్వరూ ఈ నగరంలోని అద్భుతాలను చూసేందుకు ఆసక్తి చూపించరు. ఇక్కడ ఉండటం అనేది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా రాత్రివేళ వీధుల్లో తిరగడం, ఈ నగరంలో బస చేయడం అనేది ఎంతమాత్రం సురక్షితం కాదు. 7. ఈస్ట్ సెయింట్ లూయిస్, సెయింట్ క్లెయిర్ కౌంటీ, ఇల్లినాయిస్ (East saint louis, St clair county, illinois) ఇది అమెరికాలో ఉన్న చెత్త నగరంగా పేరుగాంచింది.  ఈ ప్రదేశం  వీధులు పేదరికం, నేరాలతో నిండి ఉంటాయి. ఇక్కడ 2013లో తలసరి హత్య రేటు అమెరికా జాతీయ  సగటు కంటే 18 శాతం ఎక్కువ. 19 హత్య లు, 42 అత్యాచార కేసులు, 146 దోపిడీ కేసులు, 682 తీవ్ర దాడి కేసులు, 12 కాల్పుల కేసులు 2015 లో నమోదయ్యాయి. అప్పుడు జనాభా కేవలం 26,616 మాత్రమే.  ఈ నగరం  2016లో మొత్తం దేశంలోనే అత్యధిక హత్య రేటును కలిగి ఉంది. ఇది మరింత ప్రమాదకరమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడ నేరాల సంఖ్య పెరుగుతునే ఉంది. పేదరికం నేరాలకు పెరగడానికి మరోకారణం. సో.. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వీధులు, నగరాలు. కొత్త ప్రదేశానికి వెళ్లేముందు ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి ఇలాంటి సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

ఫోర్బ్స్ ప్రకారం భూమిపై అత్యంత శక్తివంతమైన ఏడుగురు మహిళలు

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వారిలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రతి ఏటా ఫోర్బ్స్ సంస్థ  వెల్లడిస్తోంది. తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన జాబితా ప్రకారం అత్యంత శక్తివంతమైన మహిళల్లో మొదటి ఏడుగురి గురించి తెలుసుకుందాం... 1 ఏంజెలా మెర్కెల్,(Angela Merkel) ఛాన్సలర్, జర్మనీ  జర్మనీ రాజకీయాల్లో సంచలన నేత ఏంజెలా మెర్కెల్. శాస్త్రవేత్తగా ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె రాజకీయాల్లోనూ అరుదైన రికార్డులు సృష్టించారు. ఆమె 2005 లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్ అయ్యారు.  ఆ తర్వాత వరుసగా నాల్గవసారి ఆమె ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. ఆమె జర్మనీలోని  బెర్లిన్ లో నివసిస్తున్నారు. జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.  యూరోప్‌లో  పెరుగుతున్న వలస వ్యతిరేక భావనతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  మెర్కెల్ జర్మనీకి ఛాన్సలర్ కాకముందు శాస్త్రవేత్త. ఆమె భౌతిక రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసి  క్వాంటం కెమిస్ట్రీపై  థీసిస్ రాశారు. లీప్జిగ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన ఆమె అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆమె "శరణార్థులను కాపాడటంలో యూరోప్ విఫలమైతే అది మనం కోరుకున్న యూరోప్ కాదు." అంటూ ఆమె తన గళాన్ని గట్టిగానే వినిపిస్తారు. 2.  క్రిస్టిన్ లాగార్డ్ (Christine lagarde) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు అధిపతి అయిన మొదటి మహిళగా క్రిస్టిన్ రికార్డు సృష్టించారు. నవంబర్ 1, 2019 న ఆమె ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్నారు.  ఆమె ప్రపంచ ద్రవ్య వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి పనిచేసే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు  2011 నుండి 2019 మధ్యకాలం వరకు సారధ్యం వహించారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఆమె నివసిస్తున్నారు. క్రిస్టిన్ టీనేజ్ లో మంచి స్మిమ్మర్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఫ్రెంచ్ స్మిమ్మర్స్ టీమ్ లో సభ్యురాలు. యూరోపియన్ ఆర్థిక వృద్ధి మందగించే సమయంలో ఆమె ద్రవ్య విధానానికి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధిని నడిపించారు. దేశీయ అవకాశాలను పెంచుకుంటూ బహుపాక్షిక వాణిజ్యంపై దృష్టి సారించారు. ఆమె వయసు 64. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఉంటున్నారు. 3.  నాన్సీ పెలోసి (Nancy pelosi) యు.ఎస్. ప్రతినిధుల సభకు స్పీకర్. యు.ఎస్. ప్రతినిధుల సభకు నాన్సీ పెలోసి 52 వ స్పీకర్. ఈ పదవి ఆమెను దేశంలో అత్యధిక ర్యాంకు పొందిన మహిళగా  నిలబెట్టింది.     2013 లో జరిగిన కార్యక్రమంలో ఆమెను నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. 2007 నుంచి 2011 వరకు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆమె మరోసారి 2019 లో స్పీకర్‌గా ఎన్నుకోబడ్డారు. అంతేకాదు యుఎస్ చరిత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నాల్గవసారి అభిశంసన విచారణను ఆమె 2019 లో ప్రారంభించారు. ఆమె  కాలిఫోర్నియాలోని  శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తారు.  ట్రినిటీ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్ పూర్తి చేశారు. వివాహం చేసుకుని ఐదుగురు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 4 ఉర్సులా వాన్ డెర్ లేయన్ (Ursula von der leyen) అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్,  యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షపదవిలో జూలై 2019 లో ఉర్సులా వాన్ డెర్ లేయన్ నియమితులయ్యారు. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు ఉర్పులా. అంతేకాదు ఏంజెలా మార్కెల్ క్యాబినెట్‌లో 2005 నుండి 2009 వరకు అతి ఎక్కువ కాలం పనిచేశారు. గతంలో ఏ క్యాబినెట్ సభ్యులు కూడా ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేయలేదు. కేబినెట్‌లో ఉన్న చివరి ఆరు సంవత్సరాలుగా ఆమె జర్మనీ రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న ఆమె  బెల్జియంలో నివసిస్తున్నారు. 5. మేరీ బరా (Mary barra) సీఈఓ, జనరల్ మోటార్స్ మేరీ  2014 నుండి జనరల్ మోటార్స్ CEO. డెట్రాయిట్ బిగ్ త్రీ వాహన తయారీ సంస్థ ఆమెకు అత్యధిక పరిహారంగా  2018 లో 21.9 మిలియన్ డాలర్లు అందించింది. ఆమె ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు  మావెన్ అనే రైడ్-షేర్ సేవలలో బిలియన్ల పెట్టుబడులు పెట్టారు. మేరీ ఆటోమొబైల్ వాహన తయారీ సంస్థకు నేతృత్వం వహించిన  మొట్టమొదటి మహిళా.  ఆమె వయసు 58 సంవత్సరాలు. మిచిగాన్ లోని నోవిలో ఆమె నివాసం ఉంటున్నారు. USA సిటిజన్ షిప్ కలిగిన మేరీ వివాహం చేసుకుని ఇద్దరు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెట్టెరింగ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాలను అందుకున్నారు. 6.  మిలిండా గేట్స్(Melinda gates) కో-చైర్, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థపకురాలు. దాతృత్వంలో అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2000 లో స్థాపించబడిన మిలిండా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ల ట్రస్ట్ మూలధనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఛారిటబుల్ ఫౌండేషన్ గా ఏర్పడింది. ఈ ఫౌండేషన్ లక్ష్యం విద్య అందించడం, పేదరిక నిర్మూలన, పారిశుధ్యం, ఆరోగ్యం అందించడం మొదలైనవి. కఠినమైన  సవాళ్లను పరిష్కరించడంలో మిలిండా ఎక్కువగా కృషి చేస్తారు.ప్రజలందరికీ ఆరోగ్యకరమైనక జీవితాలను అందించే  ఫౌండేషన్ మిషన్‌లో భాగంగా  ఆమె ఎక్కువ భాగం మహిళలు, బాలికల హక్కుల సాధన కోసం  పనిచేశారు. ఆమె వయసు 55 సంవత్సరాలు. మదీనా, వాషింగ్టన్ లో ఆమె నివాసం.  బిల్ గేట్స్ ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. డ్యూక్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ లో  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. 7 అబిగైల్ జాన్సన్ (Abigail Johnson) CEO, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆమె ఆస్తుల విలువ 15 బిలిియన్ డాలర్లు.   అబిగైల్ జాన్సన్ 2014 నుండి ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్  CEO గా పనిచేశారు, ఆమె తన తండ్రి నుంచి 2016లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి చైర్మన్‌గా ఉన్నారు.  ఆమె తాత, ఎడ్వర్డ్ జాన్సన్ II మ్యూచువల్ ఫండ్ సంస్థను 1946 లో బోస్టన్ లో స్థాపించారు. ఆ సంస్థలో ఆమె వాటా 24.5శాతం. అంటే దాదాపు 2.9 ట్రిలియన్ డాలర్లు. జాన్సన్ కుటుంబం బోస్టన్ ప్రాంతంలో లాభాపేక్షలేకుండా అనేక దానధర్మాలు చేస్తుంది. అంతేకాదు న్యూ ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహాకారం అందించింది.   ఆమె మసాచుసెట్స్ లోని మిల్టన్ లో నివసిస్తున్నారు.  యుఎస్ పౌరసత్వం ఉన్న జాన్సన్ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

అంతర్జాతీయ పరిశోధనారంగంలో అగ్రగామిగా..

అందుబాటు ధరల్లో వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో భారత్ బయోటెక్   వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి తమ దేశం రావాలన్న సుదీర్ఘ లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు వారిద్దరు. వారి ఆలోచనతో 1996లో బ్యాంకు రుణాలతో ప్రారంభమైంది భారత్ బయోటెక్ - ఈనాడు అంతర్జాతీయ వ్యాక్సిన్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. కోవిడ్ లాంటి భయంకరమైన వైరస్ నుంచి రక్షణ కల్పించే కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉంది. ఈ రోజు దేశప్రధాని నరేంద్ర మోడి స్వయంగా వచ్చి ఈ సంస్థ చేస్తున్న పరిశోధనలను అభినందించడం వెనుక దాదాపు పాతికేళ్ల శ్రమ ఉంది. ఇద్దరు దంపతుల ఆశయం ఉంది. ఒకరు పరిశోధనలపై దృష్టి పెడితే మరొకరు మార్కెటింగ్ పై పట్టు సాధించారు. వారే భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా. ఇప్పుడు భారతదేశంలో హైపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన ప్రతిబిడ్డకు ఇస్తున్నాం అంటే అందుకు కారణం ఈ సంస్థే. అంతేకాదు ప్రపంచంలో 1 వ వైద్యపరంగా నిరూపితమైన కంజుగేట్ టైఫాయిడ్ వ్యాక్సిన్, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, రోటవైరస్ వ్యాక్సిన్‌, జికా వ్యాక్సిన్ ఇలా అనేక వ్యాక్సిన్ లను అందించిన ఘనత భారత్ బయోటెక్ సొంతం. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రజాజీవనాన్ని స్తంభింపచేసిన కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ అతి తర్వలో అందుబాటు ధరలో తీసుకువచ్చే ప్రయత్నం విజయానికి చేరవలో ఉంది. మరి ఇదంతా సాధించడం వెనుక సుచిత్ర ఎల్లా అకుంఠిత దీక్ష ఉంది. డిగ్రీ చేతపట్టుకుని అమెరికా వెళ్ళిన సుచిత్ర మార్కెటింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. గృహ ణిగా.. ఉద్యోగినిగా.. పారిశ్రామికవేత్తగా మారిన  సుచిత్ర ఎల్లా ప్రస్థానం ...   బి.ఎస్. దేవరాజులు, కాంచనమాల దంపతుల రెండో సంతానం సుచిత్ర. దేవరాజులు  నైవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్లో మైనింగ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. కాంచనమాల గృహిణి. వారికి ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మసైర్యం కోల్పోవద్దని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నారు. మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన  తరువాత ఎల్లా కృష్ణతో వివాహం జరిగింది. వారి పెళ్లినాటికి కృష్ణ ఎల్లా మాలిక్యూలర్ బయాలజీలో పరిశోధన చేస్తున్నారు. పెళ్లి తర్వాత వారు అమెరికా వెళ్లారు. వారికి ఇద్దరు పిల్లలు. అక్కడ వచ్చే స్టైఫండ్ తో బతకడం కష్టం కావడంతో సుచిత్ర ఉద్యోగంలో చేరారు. చంటిపిల్లలను చూసుకోవడం కోసం ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీసు వెళ్లేవాళ్లు. శని, ఆదివారాలు కృష్ణ రిసెర్చ్ కు సెలవు కావడంతో ఆ రెండురోజులు సుచిత్ర డే షిప్టులకు వెళ్లేవారు. అలా షిఫ్ట్ ల ప్రకారం ఉద్యోగాలు చేస్తూ ఇంటిబాధ్యతలు పంచుకునేవారు. ఒక వైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి బాధ్యతలు చూస్తూనే బిజినెస్ మార్కెటింగ్ లో పీజీ పూర్తిచేశారు సుచిత్ర.    సుదూర లక్ష్యంతో స్వదేశానికి... కృష్ణ ఎల్లా పరిశోధన పూరైయిన తరువాత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. అదే సమయంలో ఇండియా విదేశాల నుంచి వాక్సిన్లను దిగుమతి చేసుకోవడం, అనేక చిన్నదేశాలకు వాక్సిన్స్ ఉత్పత్తికి అవసరమైన నిధులు సమకూర్చుకునే శక్తి లేక పోవడం గమనించి వారిద్దరూ బాధ పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. తన పరిశోధనానుభవాన్ని స్వదేశం కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇండియాకు తిరిగి రావాలనుకున్న వారి నిర్ణయం విని స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. బంధువులు కూడా ఇక్కడకు వచ్చి ఎం చేస్తారు.. అంటూ నిష్టూరంగా మాట్లాడారు. అయినా వారు వెనుకడుగు వేయలేదు. తమ విజ్ఞానం స్వదేశానికి ఉపయోగపడాలి. స్వంతంగా వ్యాక్సిన్స్  తయారుచేసుకునే స్తోమత ఇండియాకు రావాలి. చిన్న చిన్న దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయాలి అన్న లక్ష్యం తో స్వదేశానికి పయనమయ్యారు.   పరిశోధనారంగంలో వ్యాక్సిన్ తయారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి వద్ద తగిన ఆర్థిక వనరులు లేవు. కృష్ణ పరిశోధనానుభవం, సుచిత్ర  మార్కెట్ మెలకువలు, స్నేహితుల సహకారంతో బ్యాంక్ లో అప్పులు తీసుకుని 1996లో భారత్ బయోటెక్ ఏర్పాటు చేశారు. త్యాగాలకు సిద్ధపడి ఈ సంస్థను ఏర్పాటు చేసాం అంటారు సుచిత్ర.  త్యాగాలు అని ఎందుకు అన్నానంటే ఆ రోజుల్లోనో.. నెలలగడువులోనోమా ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చేది కాదు. వ్యాక్సిన్ తయారి అనేది పరిశోధన.. ఆ పరిశోధన ఫలితాలు తెలియడానికి సంవ త్సరాలు.. కొన్నిసార్లు దశాబ్దాలు పడుతుంది. అయితే డాక్టర్లు వీటిని ప్రిఫర్ చేయాలి. మనపై ఎంతో నమ్మకం కుదరాలి. అన్నీ అనుకూలించాలంటే.. ఓపిక, పట్టుదల ఉండాలి.   పరిశోధనారంగంలో అంత పెట్టుబడి పెట్టి, ఫలితాలకోసం ఎదురుచూసేవారు చాలా తక్కువ. ప్రొడక్ట్ గురించి చెప్పడమే తప్ప .. ఫలితాలను వెంటనే చూపించలేం. మా లక్ష్యం ఎమిటో స్పష్టంగా ఉంది కాబట్టి, శాయ శక్తుల శతవిధాల ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి అనుమతి పొందాం. ప్రొడక్ట్ మార్కెట్లోకి రావడానికి, వచ్చిన తరువాత ఫలితాలు తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. మా ఉత్సాహాన్ని, పరిశోధనారంగంలో ఉన్న అనుభవాన్ని, మనదేశంలో వ్యాక్సిన్ తయారీకి ఉన్న కొరతను గమనించిన ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించింది. ఇప్పుడు ప్రభుత్వానికి హైపటైటిస్ - బి వ్యాక్సిన్, ఇతర వ్యాక్సిన్స్ లతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థకు దాదాపు 150 పేటెంట్స్ ఉన్నాయి.   దేశం పేరును అంతర్జాతీయంగా నిలపాలనే... చారిత్రకంగా, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ముందు ఉంటుంది. ఇతర దేశాల మాదిరిగా బిలియన్ డాలర్లతో పరిశోధనలు చేసే ఆర్థిక స్థితి లేకపోయినా మేధోసంపత్తిని పెట్టుబడిగా పెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించి, ప్రపంచఖ్యాతి పొందిన దేశం మనది. అందుకే మా సంస్థకు మా పిల్లల పేర్లో, ఇతర పేర్లో పెట్టకుండా భారత్ బయోటెక్ అని నమోదు చేశాం. వ్యాక్సిన్ తయారిలోనూ మన దేశం అంతర్జాతీయంగా పేరు సాధించాల న్నది మా ఆకాంక్ష, వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి రావాలి అన్నదే తమ లక్ష్యం అంటారు సుచిత్ర ఎల్లా.   మహిళా సాధికారతే జాతీయ సంపద... చాలామంది ఆడవారికి చదవు ఉంటే చాలు అనుకుంటారు. కాని, విజ్ఞానం. విషయపరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఖాళీగా ఉంటే దేశ సంపద నిరూపయోగంగా ఉన్నట్టే కదా.. సంపద అంటే ఆస్తులు, ధనమే కాదు..ఉత్పాదక శక్తి. ఆలోచన ఉన్న వ్యక్తి ఖాళీగా ఉండటం కూడా అభివృద్ధి నిరోధకమే అన్నది నా అభిప్రాయం. ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన మహిళలు కూడా వివాహం తరువాత, పిల్లలు పుట్టిన తరువాత ఉద్యోగాలు మానేస్తారు. అలా చేస్తే వారి కెరీర్ డెబ్బతింటుంది. కేవలం వారు ఎన్నుకున్న రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అవగాహన పెంచుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎంటర్ ప్రెన్యూర్ గా ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు. సంస్థను స్థాపించాలంటే చాలా విషయాలను త్యాగం చేయాలి. పాజిటివ్ థింకింగ్, కొత్తగా ఆలోచించగల నేర్పు, కష్టనష్టాలను ఎదుర్కోగల ఓర్పు కావాలి. మహిళల్లో ఈ గుణాలు ఎక్కువే. మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నప్పటికీ చాలా మంది 30 సంవత్సరాలు పై బడిన మహిళలు తమ ప్రొఫెషన్ కు  దూరం అవుతు న్నారు. సామాజిక ఒత్తిడిని, వ్యక్తి గతజీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే విజయం సుసాధ్యమవుతుంది.   అందుబాటు ధరల్లో వ్యాక్సిన్స్... కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో నేటి తరం అనేక వ్యాధులకు గురౌతున్నది. ఇక రేపటి తరం ఎలా ఉంటుందో అన్న ఆలోచనే భయంగా ఉంది. అందుకే చిన్నారులకు అనేక వ్యాధులు నుంచి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్లను మా సంస్థ తయారు చేస్తోంది. కిందిస్థాయి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తాం అంటున్నారు సుచిత్ర..

భూమిపై గురుత్వాకర్షణ లేని 6 ప్రదేశాలు...!

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కానీ భూమి తిరుగుతున్నప్పుడు, దానిమీద ఉన్న మనం , ఇతర వస్తువులు ఎందుకు కిందపడట్లేదో ఎప్పుడైనా ఆలోచించామా..? కింద పడిపోక పోవడానికి కారణం గురుత్వాకర్షణ. దీన్ని మొదటిసారిగా ఆర్యభట్ట వివరించాడు. ఈ భూమిపై నిలబడి మనం ఏ వస్తువును విసిరివేసిన.. లేదా కిందకు పాడేసిన అది కిందపడి పోతుంది. కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం కిందకు వేసినవి భూమిపైన పడకుండా పైకే వెళతాయి. అలాంటి 6 వింతలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.. 1. రివర్స్ జలపాతం, ఇంగ్లాండ్. ఈ జలపాతం హేఫీల్డ్ దగ్గర ఉంది. ఈ ప్రదేశంలో నీళ్లు కిందకు ప్రవహించడానికి బదులు పైకే ప్రవహిస్తుంది. దీనికి కారణం గాలి. ఇక్కడ గాలి బలంగా వీస్తుంది. అందుకని దిగువకు ప్రవహించే నీరు గాలి ఒత్తిడి మూలంగా పైకి పైకి నెట్టబడుతుంది. అద్భుతమైన ఈ జలపాతం  78 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2. రహస్యాల ఇల్లు, ఒరెగాన్, యు.ఎస్. ఇక్కడి అడవిలో చిన్న గది లాంటి ఇల్లు ఉంది. ఇదేమి ఒరెగాన్ ఆధ్యాత్మిక సుడిగుండం కాదు. స్థానిక అమెరికన్లు ఈ ప్రాంతాన్ని 'నిషేధిత భూమి'గా వర్ణించారు. ఈ స్థలంలో ఒక రకమైన గోళాకారపు శక్తి కేంద్రం ఉందని వాళ్ళు నమ్ముతారు. అందులో సగం శక్తి కింద అడుగు భాగాన, మరికొంత పై భాగాన కేంద్రీకృతం అయి ఉందని భావిస్తారు.  ఇక్కడికి వచ్చిన సందర్శకులు వాస్తవికంగా ఆ అనుభూతిని చెందుతారు. ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ ఉండదు. కాబట్టి నడవడం సాధ్యం కాదు. సందర్శకులు సముద్రంలో పడకుండా ఉండాలంటే గోడలను పట్టుకోవాలి. ఆ ఇంట్లో చీపురు ను ఉంచినా కూడా కిందపడకుండా ఎప్పుడూ అది నిటారుగానే ఉంటుంది. ఈ విచిత్రమైన మర్మమైన ప్రదేశంలో బాల్స్ ను ఉంచినా అవి ఉపరితలంపై పైకి వస్తాయి. ఈ మాయా ఘటనల వెనుక ఎటువంటి ట్రిక్స్ లేవు. కేవలం గురుత్వాకర్షణ లేకపోవడమే దీనికి కారణం.  3.  అరాగట్స్ పర్వతాల కింద ఉన్న రోడ్, ఆర్మేనియా. ఈ పర్వతం టర్కీ, అర్మేనియా సరిహద్దులో ఉంది. ఈ అద్భుతమైన గురుత్వాకర్షణ నిరోధక దృగ్విషయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తారు. ఈ పర్వతం కింద ఎవరైనా కార్ ఇంజన్ ఆపి అక్కడే ఉంచితే దాన్ని డ్రైవ్ చేయకున్నా కూడా పైకి వెళుతుంది. ఆ ప్రదేశాన్ని సందర్శించిన వ్యక్తులు దిగువ వైపు వెళ్లడం కంటే పైవైపు వెళ్లడం చాలా సులభం అని చెబుతారు. 4. హూవర్ డ్యామ్, నెవాడా, యుఎస్. ఈ ఆనకట్ట ఎత్తు 726.4 అడుగులు. ఎవరైనా కానీ ఈ పొడవైన ఆనకట్టను అధిరోహించాలని అనుకుంటే చిన్న ప్రయోగం చేస్తే చాలు. పెద్దగా చేయవలసిన అవసరం లేదు, బాటిల్లోంచి కొంచెం నీళ్లను కిందుకు పోస్తే అది కింది వైపు ప్రవహించదానికి బదులు పైకి ప్రవహిస్తుంది. ఇది కేవలం ఒక్క నీటి విషయంలోనే కాదు, ఆ ఆనకట్ట నుండి ఏ వస్తువును క్రిందికి విసిరినా ఆ వస్తువు కిందికి పడకుండా పైకి తేలుతుంది. ఇలా వస్తువులు తేలుతూ లేదా నీరు పైకి ప్రవహించటానికి కారణం ఈ ప్రదేశంలో ప్రవహించే బలమైన గాలి. 5. డెవిల్స్ టవర్, వ్యోమింగ్, యుఎస్. ఈ ప్రదేశం  లాడ్జ్ రేంజర్ జిల్లాలో ఉంది. మట్టిదిబ్బ అద్భుతమైన ఆకారం, పరిమాణం వ్యోమింగ్‌లో చాలా ముఖ్యమైన దృశ్యాన్ని చేస్తుంది. హైకర్లు కూడా ఇష్టపడతారు. కాని కొన్ని కారణాల వల్ల, ఎవరెస్ట్ మౌంట్ ఎక్కిన హైకర్లు కూడా డెవిల్స్ టవర్ శిఖరాన్ని అధిరోహించడంలో విఫలమవుతాడు. ఇది 1,267 అడుగుల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ, దీని వెనుక కారణం అది నిటారుగా ఉన్న గోడలు. ఈ నిటారుగా ఉన్న గోడలు హైకర్లు పైకి చేరుకోవడం అసాధ్యం చేస్తుంది .  తిరిగి రావడం మరింత కష్టతరం చేస్తుంది. 6. దక్షిణ కొరియాలోని మర్మమైన రహదారి. జెజు ద్వీపంలోని ఈ రహదారిపై ఖాళీగా పడి ఉన్న డబ్బాలు, సీసాలు సాధారణంగా క్రిందికి వెళ్లడానికి బదులుగా పైకి వెళ్తాయి. పర్యాటకులు దీనిని చాలాసార్లు ప్రాక్టికల్ గా ప్రయత్నించి చూశారు కూడా.  దీన్ని గమనించిన అధికారులు ఈ రహదారిని మాగ్నెట్ కలిగిన పర్యాటక ప్రాంతంగా మార్చారు. గురుత్వాకర్షణ క్రమరాహిత్యం ఎక్కడ మొదలవుతుందో చూపించేందుకు అక్కడ సైన్ బోర్డును కూడా పెట్టారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 పడవలు

భూమిపై మూడువంతుల నీరు, ఒక వంతు భూమి ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అందుకే మన పూర్వీకులు జల ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. చిన్నచిన్న పడవల నుంచి టన్నుల కొద్ది సరుకులను దేశవిదేశాలకు ఎగుమతిదిగుమతి చేయడంలో జల రవాణా సాధనాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. రామాయణంలో వనవాసానికి బయలుదేరిన రాముడు సీత, లక్ష్మణుడు పడవ ప్రయాణం ద్వారానే అయోధ్యను దాటారు. వాస్కోడిగామా పడవ ప్రయాణం చేస్తూనే కొత్తదేశాల ఆనవాళ్లు తెలుసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పడవల చరిత్ర చాలానే ఉంది. అయితే ప్రస్తుతం రవాణాసాధనాల తీరు మారింది. భూ, జల మార్గాలే కాదు వాయుమార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పడవలు కేవలం రవాణా సాధనాలుగానే కాదు వారివారి సంపదకు చిహ్నాలుగా మారాయి. ప్రపంచంలోని సంపన్న బిలియనీర్లకు ఖరీదైన కార్లు, విమానాలే కాదు ఆధునిక వసతులతో  పడవలు కూడా ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన పడవల్లో హెలిప్యాడ్‌లు, థియేటర్లు, కచేరీ హాళ్లు,  స్విమ్మింగ్ పూల్ లు, ఆవిరి స్నానాలు, హాట్ టబ్‌లు వంటి అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. మరి వాటి వివరాలు ఎంటో తెలుసుకుందామా.. 1. హిస్టరీ సుప్రీం (HISTORY SUPREME) ఖరీదు -  4.8 బిలియన్( 35,54,43,12,000 రూపాయలు) హిస్టరీ  సుప్రీం పడవ ఖరీదు 4.8 బిలియన్ డాలర్లు. ఇంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఈ పడవ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడినది. అంతే ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన పడవగా రికార్డు సృష్టించింది. ఈ నౌక  మలేషియా కు చెందిన సంపన్నుడు  రాబర్ట్ నోక్ సొంతం. ఈ ఓడ తయారీలో పది వేల కిలోల  బంగారం,  ప్లాటినం ఉపయోగించారట.  100 అడుగుల పొడవైన ఈ పడవ నిర్మించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందట. దీనిని UK కు చెందిన  ప్రఖ్యాత లగ్జరీ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ రూపొందించారు. బంగారం , ప్లాటినం లోహాలతో పడవను దాని బేస్ నుండి భోజన ప్రాంతం, డెక్, మెట్లు తదితర భాగాలను  అలంకరించారు. ఈ లగ్జరీ ఓడతో అత్యధికంగా ఆకర్షించేది మాస్టర్ బెడ్ రూమ్.  ఇది మెటోరైట్ రాక్ నుండి తయారు చేయబడిన గోడ. అంతేకాదు టైరన్నోసారస్ రెక్స్ ఎముకలతో తయారు చేసిన విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. 2. ఎక్లిప్స్  (ECLIPSE) ఖరీదు -  1.5 బిలియన్ డాలర్లు( 11,10,75,97,500 రూపాయలు) ప్రపంచంలో రెండవ అతిపెద్ద పడవ ఎక్లిప్స్. ఇది రష్యన్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ సొంతం. ఈ పడవతో డిటెక్షన్ సిస్టమ్ ద్వారా క్షిపణి గుర్తింపు వ్యవస్థ ఉంటుంది. అంతేకాదు 2 హెలిప్యాడ్‌లు, 24 గెస్ట్ క్యాబిన్లు, డిస్కో హాల్, రెండు స్విమ్మింగ్ పూల్ లు, హాట్ టబ్‌లు ఉన్నాయి. దీనిని జర్మనీకి చెందిన బ్లోమ్ , వోస్ నిర్మించారు. 533 అడుగుల పొడవైన పడవలో మినీ జలాంతర్గామి కూడా ఉంది, ఇది నీటిలో 50 మీటర్ల వరకు మునిగిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాస్టర్ బెడ్ రూమ్ కిటికిలు  బుల్లెట్ ప్రూఫ్. 3. ది అజ్జామ్ ( THE AZZAM) ఖరీదు -  600 మిలియన్ డాలర్లు ( 44,42,49,90,000రూపాయలు) 590 అడుగుల పొడవైన పడవ 35 కిలోమీటర్ల వేగంతో నీటిపై దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  పడవ ఇది.  యుఎఇ  రాజకుటుంబ సభ్యుడు అజ్జామ్ యాజమాన్యంలో ఉందని వినికిడి. దీని తయారీదారుల ప్రకారం, ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత క్లిష్టమైన పడవ ఇది.ఫ్రెంచ్ ఇంటీరియర్ డెకరేటర్ క్రిస్టోఫ్ లియోని అధునాతన ఇంటీరియర్‌లను డిజైన్ చేయగా, దాని వెలుపలి భాగాలను నౌటా యాచ్ రూపొందించారు. ఇది మొత్తం 35048 కిలోవాట్ల శక్తితో రెండు గ్యాస్ టర్బైన్లు ,రెండు డీజిల్ ఇంజన్లు ఉంటాయి. 4. మోటర్ యాచ్ ఎ (MOTOR YACHT A ) ఖరీదు - 440 మిలియన్ డాలర్లు (32,58,97,00,000) మోటారు యాచ్ ఎ  రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ మెల్నిచెంకోకు చెందినది. ఇందులో 14 మంది అతిథులు ,  42 మంది సిబ్బందిని ఉండవచ్చు. 400 అడుగుల పొడవైన పడవ ఇంటీరియర్స్ 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2,500 చదరపు అడుగుల మాస్టర్ బెడ్‌రూమ్ , డిస్కోతో పాటు ఆరు అతిథి సూట్‌లు ఉన్నాయి. వీటిని నాలుగు పెద్ద స్టేటర్‌ రూమ్‌లుగా మార్చడానికి అనువుగా మూవబుల్ వాల్స్ ఉంటాయి. ఇంటీరియర్స్ , ఫర్నిచర్, గ్లాస్ వేర్,  ఫ్రెంచ్ క్రిస్టల్‌తో తయారు చేసిన టేబుల్‌వేర్లను అలంకరించిన అద్దాలు పడవ విలాసవంతమైన  లుక్ ను మరింత పెంచుతాయి. ఇందులో హెలిప్యాడ్,  30 అడుగుల స్పీడ్ బోట్ ఉంటాయి. ఈ పడవలో మూడు స్విమ్మింగ్ పూల్స్  ఉన్నాయి.  వాటిలో ఒకటి గ్లాస్ బాటమ్తో, మరోకటి డిస్కో పై ఉంటుంది. ఈ విలాసవంతమైన పడవను ఆర్కిటెక్ట్ మార్టిన్ ఫ్రాన్సిస్,  ఫిలిప్ స్టార్క్ రూపొందించారు. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ,  సూపర్ లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 5. దుబాయ్ (DUBAI) ఖరీదు -  400 మిలియన్ డాలర్లు(29,63,98,00,000) ఈ పడవ యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సొంతం.  531 అడుగుల పొడవు ఉన్న దుబాయ్ పడవను బ్లోమ్,  వోస్ నిర్మించారు.  దాని వెలుపలి భాగాలను ఆండ్రూ వించ్ రూపొందించారు. అత్యంత ఖరీదైన ధరతో పాటు  గొప్ప నాణ్యత,  సృజనాత్మకత కనిపిస్తాయి. అదేవిధంగా ఇందులో మొజాయిక్ స్విమ్మింగ్ పూల్, వృత్తాకార మెట్లు, హెలిప్యాడ్ కలిగి ఉంది. ఈ బ్రహ్మాండమైన సూపర్‌యాచ్‌లో సిబ్బందితో సహా 155 మంది అతిథులు ఉండేలా సదుపాయాలు ఉంటాయి.  దాని ఔట్ లుక్ తో పాటు  లోపలి భాగం చాలా దృఢంగా  ఉంటుంది.  పడవ  ఇంటీరియర్స్  రంగులతో ఆధిపత్యం చెలాయిస్తుండగా, దాని డెక్‌లో స్ప్లిట్-లెవల్ యజమాని డెక్, లాంజ్, అనేక విఐపి ప్రాంతాలు , అతిథుల సూట్‌లు ఉంటాయి. ఈ పడవలో సెలవురోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా అలా సముద్రయానం చేయవచ్చు.

ప్రపంచంలో అతి ఖరీదైన హోటల్స్

లవర్స్ డీప్ లగ్జరీ సబ్మెరైన్ హోటల్ 1,50,000 డాలర్లు(1,10,73,367రూపాయలు) ప్రపంచంలోనే అతి ఖరీదైన హోటల్. ఇందులో ఒకరోజు  గడిపే అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. అండర్ వాటర్ సబ్ మెరిన్ లో ఏర్పాటు చేసిన ఈ హోటల్లో గడిపే క్షణాలు మధురమైన అనుభూతినిస్తాయి. ఫైవ్ స్టార్ సదుపాయాలతో కూడిన ఈ హోటల్లో బస చేయడం అద్బుతమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. 1.  సబ్మెరైన్ కం హోటల్ చుట్టూ సముద్రంలో గ్లాసు కిటికి ల నుంచి సముద్రజీవులను కదలికల సుందరమైన దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఉండే హోటల్ క్యాప్టెన్ బట్లర్ ప్రైవేట్ స్పీడ్ బోట్ ఫెసిలిటీస్ తో ఉంటుంది. అంతేకాదు అడిషనల్ ఆఫీస్ లు  కూడా ఉన్నాయి హెలికాప్టర్ సదుపాయం,  ట్రాన్స్ ఫా ర్మర్స్ బీచ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ మరిన్ని మెరుగైన సదుపాయాలు ఇక్కడ అందుకోవచ్చు. సబ్ మెరిన్ మొత్తం కూడా అల్టిమేట్ లగ్జరీ తో ఉంటుంది. ఇందులో ప్రతి అంగుళం , ప్రతి గది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. మరో మెరుగైన సదుపాయం ఏంటంటే మీకు నచ్చిన రీతిగా మీరు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు.  లొకేషన్ లోనే కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ హోటల్లో ఉండడం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక అనుభూతిగా మిగిలిపోతుంది. 2.ఎంపతి, సూట్ ఫామ్స్ లక్ష డాలర్లు (73,82,245 రూపాయలు) ఈ హోటల్ మొత్తాన్ని రిలీజ్ డిజైన్ చేశారు . డామియన్ హర్స్ ట్ పూర్తిగా రూపకల్పన చేసిన హోటల్ ఇది.  పాత స్కై విల్లా సూట్ ను రీడిజైన్ చేసి అందమైన హోటల్ గా తీర్చిదిద్దారు. ఈ హోటల్ లో మీకు రెండు మాస్టర్ బెడ్ రూములు,  మసాజ్ టేబుల్స్తతో పాటు ఆధునిక వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఈ హోటల్ ప్రత్యేకంగా ఆర్ట్ లవర్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇక్కడ అద్భుతమైన ఆర్ట్ కలెక్షన్ చూడవచ్చు. ఈ హోటల్ సూట్ నిజంగా కళా ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ స్థలంలో ఆరు డెమైన్ హస్ట్ ఆర్జినల్స్ ఉన్నాయి.  ఇందులో కస్టమ్ ఫర్నిచర్ కూడా ఉంది,  ఈ హోటల్ డామియన్ హర్స్ట్ అభిమానులందరికీ నిజమైన ట్రీట్. 3. రాయల్ పెంట్ హౌస్ హోటల్ విల్సన్ 80,000 డాలర్లు(59,05,804 రూపాయలు) ఈ హోటల్ ప్రెసిడెంట్ విల్సన్ లోని రాయల్ పెంట్ హౌస్.  హోటల్ మొత్తం 8 వ అంతస్తులో ఉంది. ఇది 12 బెడ్ రూములు, 12 బాత్‌రూమ్‌లు ఉంటాయి. అంతేకాదు ఇక్కడి నుంచి చూస్తే  జెనీవా సరస్సు , మాంట్ బ్లాంక్  విస్తృత దృశ్యం సాక్షాత్కరిస్తుంది. విలాసవంతమైన అలంకరణలు దర్శనమిస్తాయి. అంతేకాదు ఈ హోటల్ లో మీకు  24/7 వ్యక్తిగత సహాయకుడు, ప్రైవేట్ చెఫ్ , బట్లర్ అందుబాటులో ఉంటారు.  భద్రత విషయంలో పూర్తిగా సురక్షితం ఈ హోటల్. ఇది సురక్షితమైన హోటళ్లలో ఒకటి కాబట్టి మీరు ఉండవలసిన ప్రదేశం ఇది. ఇది బుల్లెట్ రూఫ్డ్ గ్లాస్, 24/7 సెక్యూరిటీ, సెక్యూరిటీ కెమెరా సిస్టమ్, మీ విలువైన వస్తువులను నిల్వ చేయడానికి అవసరమైన సేఫ్ లాకర్స్ ఉంటాయి. ఇందులో 1930 బ్రున్స్ విక్ బిలియర్డ్ టేబుల్, స్టీన్వే గ్రాండ్ పియానో , బ్యాంగ్ & ఓలుఫ్సేన్  బీవిజన్ 4-103 హోమ్ సినిమా వ్యవస్థ కూడా ఉన్నాయి. మీరు దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటే, మీరు మీ స్వంత ప్రైవేట్ ఎలివేటర్‌తో పొందవచ్చు. 4. మార్క్ పెంట్ హౌస్ మార్క్ హోటల్ 75000 డాలర్లు(55,36,687) ఇది యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద హోటల్ సూట్ పెంట్ హౌస్. ఇది 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ హోటల్ లో మీరు పై అంతస్తులలో విస్తరించి ఉన్న విశాలమైన పెంట్ హౌస్ ను పొందవచ్చు. మీకు 5 బెడ్‌రూమ్‌లు 6 బాత్‌రూమ్‌లు 4 ఫైర్ ప్లేస్‌లు, రెండు వెట్ బార్‌లతో పాటు పెద్ద ఓపెన్ ప్లాన్ లివింగ్ రూమ్ లభిస్తుంది. 26 అడుగుల పైకప్పులతో పూర్తి పరిమాణ బంతి గదిగా మార్చగల సామర్థ్యం ఉంటుంది.  దాని స్వంత పార్టీ ట్రిక్ ఉంది. ఈ పెంట్ హౌస్ సూట్  చక్కని లక్షణాలు ఏమిటంటే ఇది 250 చదరపు మీటర్ల టెర్రస్ ను అందిస్తుంది, విస్తృత దృశ్యాలతో న్యూయర్స్ లోని  సెంట్రల్ పార్క్ , మిడ్ పార్క్ చూడవచ్చు.  న్యూయార్క్ రాణిని పాత్ర పోషించాలనుకుంటే ఈ హోటల్‌లో సూట్ బుక్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. 5. టై వార్నర్ పెంట్ హౌస్ నాలుగు సీజన్లు 60,000 డాలర్లు ఈ లగ్జరీ హోటల్ సూట్ కు టై యజమాని వార్నర్ పేరు పెట్టారు. ఇది భవనం 52 వ అంతస్తులో ఉంది, ఇది చాలా ఎత్తులో  ఉంటుంది. ఈ 400 చదరపు మీటర్ల సూట్ పూర్తి చేయడానికి సుమారు 50 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. ఇది నగరాన్ని  360 డిగ్రీల  వ్యూ చూడవచ్చు. 4 గ్లాస్ బాల్కనీల నుంచి నగరం అందాలను వీక్షించవచ్చు. పెంట్ హౌస్ నుంచి చూసినప్పుడు  అప్‌టౌన్, మిడ్‌టౌన్ మాత్రమే కాదు న్యూయార్క్ డౌన్ సిటీ అద్భుతదృష్యాలను కనువిందు చేస్తుంది.  ఈ సూట్‌తో కేవలం ఒక బాత్రూమ్‌ ఉంటుంది. . అంతేకాదు ఈ హోటల్ లో  స్పా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎన్నిసార్లు అయినా మసాజ్‌లు చేయించుకోవచ్చు.

తెల్ల కాగితం- నల్ల చుక్క

‘‘ఇవాళ మీకో పరీక్ష పెట్టబోతున్నాను’’ క్లాసులోకి అడుగుపెడుతూనే చెప్పారు ప్రొఫెసర్‌. అకస్మాత్తుగా ఈ పరీక్ష ఏమిటా అని విద్యార్థులంతా తలపట్టుకుని కూర్చున్నారు. కానీ ప్రొఫెసర్‌ మాటని ఎవరు కాదనగలరు. ఎలాగొలా పరీక్షని పూర్తిచేసేందుకు అంతా సిద్ధపడ్డారు. అందరికీ తలా ఒక ప్రశ్నాపత్రాన్నీ ఇచ్చారు ప్రొఫెసర్‌. ‘‘ఈ ప్రశ్నాపత్రం వెనుకనే మీ జవాబులు రాసి ఇవ్వండి. మీకు ఒక్క అరగంటే సమయం ఉంది,’’ అంటూ పరీక్షని మొదలుపెట్టేశారు.   విద్యార్థులంతా ప్రశ్నాపత్రాలని తెరిచి చూస్తే ఏముంది. కాగితం మధ్యలో ఒక చిన్న చుక్క కనిపించింది అంతే! ప్రొఫెసర్‌గారు తమ తెలివితేటల్ని పరీక్షించేందుకే హఠాత్తుగా ఈ పరీక్షని పెట్టారన్న విషయం విద్యార్థులకి అర్థమైపోయింది. కాబట్టి అంతా ఆ చుక్కని చూసి తమకి తోచిన జవాబుని ఏదో ప్రశ్నాపత్రం వెనకాల రాయడం మొదలుపెట్టారు.   అరగంట గడిచిపోయింది, ఒకో విద్యార్థీ వచ్చి తను పూర్తిచేసి ప్రశ్నాపత్రాన్ని ప్రొఫెసర్‌గారి బల్లమీద ఉంచి వెళ్లారు. ప్రొఫెసరుగారు ఆ ప్రశ్నాపత్రాలన్నింటినీ తీసుకుని వాటిలోంచి ఒక్కో విద్యార్థీ రాసిన జవాబుని చదవడం మొదలుపెట్టారు. ప్రశ్నాపత్రంలో ఉన్న చుక్కని చూసి విద్యార్థులు రకరకాల జవాబులు రాశారు. కొంతమంది ఆ చుక్క ఆకారాన్నీ, రంగునీ వర్ణించారు. మరికొందరు కాగితంలో దాని స్థానం గురించి కొలతలు వేశారు. ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి ‘జీవితం ఓ చుక్కలాంటిది...’ అంటూ కవితలల్లారు. కొందరైతే అసలు ఏ జవాబూ లేకుండా కాగితాన్ని అలాగే వదిలివేశారు.   ప్రశ్నాపత్రాలన్నింటినీ చదివిన తరువాత ప్రొఫెసరుగారు తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టారు- ‘‘మీకు ఓ నల్ల చుక్క ఉన్న పత్రాన్ని ఇచ్చి మీకు తోచింది రాయమని అడగ్గానే, అంతా కాగితం మధ్యలో ఉన్న నల్లని చుక్క గురించే రాశారు. ఎవ్వరూ కూడా మనం చెప్పుకునే సబ్జెక్టు గురించి కానీ, మీ లక్ష్యాల గురించి కానీ, జీవితం మీద మీకు ఉన్న అభిప్రాయాల గురించి కానీ... ఆఖరికి మీ గురించి కానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. మన జీవితం కూడా మీకిచ్చిన తెల్లకాగితం లాంటిదే! దాని మీద అనారోగ్యం, పేదరికం, అసంతృప్తి, కుటుంబ కలహాలు లాంటి చిన్న చిన్న మరకలు కనిపిస్తూ ఉంటాయి. మనమంతా విలువైన జీవితాన్ని మర్చిపోయి ఎంతసేపూ ఆ మరకల మీదే మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాము. వాటి గురించే మన మనసునీ కాలాన్నీ వెచ్చిస్తూ ఉంటాము. అంతేకానీ, చేతిలో ఉన్న తెల్లటి కాగితం మీద ఎంత అందమైన జవాబుని రాయవచ్చో, ఎంత అద్భుతమైన చిత్రాలని గీయవచ్చో మర్చిపోతూ ఉంటాము. నేను మీకు ఈ పరీక్ష పెట్టింది మీకు మార్కులు ఇవ్వడానికి కాదు, మీకు జీవితం విలువ నేర్పడానికి,’’ అంటూ ముగించారు ప్రొఫెసరుగారు. ఆయన మాటలు విన్న తరువాత విద్యార్థులకి తమ జీవితాల్లో అత్యంత ఉపయోగపడే పాఠం అదే అనిపించింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

మనకోసం మరో మూడు గ్రహాలు

భూమి ఓ అసాధారణమైన గ్రహం. అదృష్టమో, ప్రకృతి వరమో కానీ ఇక్కడ జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అనువైన ఉష్ణోగ్రతలు, సూర్యుడి నుంచి తగినంత దూరం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, నీటి సౌలభ్యం, రాతి నేల, గురుత్వాకర్షణ శక్తి, భూమి మీదకు ఉల్కలు దూసుకురాకుండా కాపాడే గురుగ్రహం.... ఇలా చెప్పుకొంటూపోతే అద్భుతం అనదగ్గ సానుకూలతలు ఎన్నో భూమికి సొంతం. అందుకనే భూమిలాగా జీవానికి సహకరించే ప్రాంతం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదని నమ్ముతుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడో శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ వంటి అతికొద్ది ఉపగ్రహాల మీద మాత్రమే జీవం మనుగడ సాగించే సావకాశం ఉందని భావిస్తుంటారు. మరి ఇప్పుడో... భూమికి కేవలం 39 కాంతిసంవత్సరాల దూరంలో సౌరకుటుంబాన్ని పోలిన ఓ వ్యవస్థ ఉన్నట్లు నాసా ప్రకటించింది. ఏడాదిలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అది ఓ కాంతి సంవత్సరం అన్న విషయం తెలిసిందే! వినడానికి ఈ దూరం కాస్త ఎక్కువే అనిపించినా, ఈ అనంత విశ్వంలో ఇది ఇంచుమించు పక్కింటితో సమానం. కుంభరాశిలో భాగంగా ఉన్న ఈ వ్యవస్థలోని నక్షత్రానికి ట్రాపిస్ట్‌ 1 అని పేరు పెట్టారు. ఈ ట్రాపిస్ట్‌ 1 నక్షత్రం చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నట్లు గమనించారు. ఈ గ్రహాలన్నీ కూడా సదరు నక్షత్రానికి చాలా చేరువలో ఉన్నాయట. ఒక గ్రహం మీద నిలబడి చూస్తే మిగతా ఆరు గ్రహాలన్నీ కూడా కనిపించేంత దగ్గరదగ్గరగా ఇవి ఉన్నాయి. సూర్యుడితో పోలిస్తే ఈ ట్రాపిస్ట్‌ నక్షత్రం దాదాపు పదోవంతు మాత్రమే ఉంటుంది. పైగా దీని నుంచి వచ్చే కాంతి మన సూర్యకాంతికంటే 200 రెట్లు తక్కువట. అయితే నక్షత్రానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల దీని చుట్టూ తిరిగే గ్రహాల మీద ఉష్ణోగ్రతలు 0- 100 మధ్యలోనే ఉంటాయని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా 4,5,6 గ్రహాలు జీవానికి మరింత అనువుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ట్రాపిస్ట్‌ 1 గురించి అందిన సమాచారమంతా వాటి మీద మనిషి మనుగడకి సంబంధించి కొత్త ఆశలను కల్పించేట్లుగానే ఉంది. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ గ్రహాల మీద నీటి లభ్యత ఎంత, వాటి మీద లభించే ఖనిజాల ఏమిటి... లాంటి పరిశోధనల ఇంకా జరగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వాటి మీద మనుషులు జీవించే అవకాశం ఉందో లేదో నిర్ధారించగలం. అసలు ఇప్పటికే వాటి మీద కొన్ని జీవులు బతికేస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. ఏది ఏమైనా ఇన్నాళ్లకి భూమిని పోలిన గ్రహాలు కొన్ని శాస్త్రవేత్తలకు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.   - నిర్జర.

అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్న బిలియనీర్లు

ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో వారి పేర్లు నమోదు అయ్యాయి.. అయినా వారి జీవనశైలీ అతి సాధారణంగా ఉంటుంది. వందలాది కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యినప్పటికీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారెన్ బఫెట్ లాంటి వ్యాపారదిగ్గజాలు ఉన్నారు. 1. వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్,  సి.ఏ.ఓ వారెన్ బఫెట్.  అయినప్పటికీ, అతను పాత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటిని అతను 1958 లో 31,500  డాలర్లకు కొన్నాడు. అతన్ని ఒరాహా ఆఫ్ ఒరాకిల్ అని కూడా పిలుస్తారు. చాలా సున్నితమైన వ్యాపారవేత్తగా ప్రసిద్ది చెందాడు. ఇప్పటికీ అతని వద్ద, స్మార్ట్ ఫోన్‌ ఉండదు. డెస్క్ పైన కనీసం కంప్యూటర్ లేదు. అతను ఎప్పుడు చెప్పే మాట  స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వంటి ఆధునిక పరికరాలు ఉంటే నా జీవితం సంతోషంగా ఉండదు. నిజానికి, నాకు ఆరు లేదా ఎనిమిది ఇళ్ళు గానీ ఉండి ఉంటే మరింత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం నాకు అవసరం ఉన్న ప్రతిదీ నా దగ్గర ఉంది, నాకు ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే  దీని తర్వాత పెద్దగా తేడా ఏం ఉండదు కాబట్టి. 2. మార్క్ జుకర్‌బర్గ్. అతను  ఫేస్బుక్ స్థాపకుడు. ఆ సంస్థకు   సిఇవో కూడా అయిన అతను ఇప్పటికి వోక్స యాగన్ హ్యాచ్ బ్యాక్ను నడుపుతాడు. తను ఈ భూమి మీద ఉన్న అత్యంత ధనవంతుడైన టెక్ మొగల్స్‌లో ఒకరు అయినప్పటికీ తన భార్య, కుమార్తెతో కలిసి చాలా సాధారణం జీవితాన్ని గడుపుతున్నాడు.  ఒక మాములు టీ-షర్టు, హూడీ జీన్స్ మాత్రమే ధరిస్తూ ఉంటాడు.  'నేను నా జీవితం గురించి స్పష్టం చేయాలనుకుంటున్నాను, సాధ్యమైనంత తక్కువ నిర్ణయాలు తీసుకోని తద్వారా ఈ సమాజానికి ఎలా ఉత్తమంగా సేవ చేయాలనే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అంటాడు  జుకర్‌బర్గ్. 3. కార్లోస్ స్లిమ్ హెలు. తను గ్రూపో కార్సో స్థాపకుడు. గత  40 సంవత్సరాలుగా A 6 బెడ్ రూమ్ ఇంటిలోనే నివసిస్తున్నాడు. మెక్సికోలో ఇప్పటికీ అత్యంత ధనవంతుడు ఇతనే. అయితే ఇతర సంపన్నుల మాదిరిగా ప్రయివేటు  విమానాలు, పడవలు ఆయనకు లేవు. ఇప్పటికీ పాత మెర్సిడెజ్ లోనే తిరుగుతూ ఉంటాడు. తన కంపెనీని కూడా చాలా పొదుపుగా నడుపుతూ ఉన్నాడు. అతను తన స్టాఫ్ హ్యాండ్‌బుక్స్‌లో 'సంపన్న సమయాల్లో కూడా కాఠిన్యాన్ని కొనసాగించమని రాశాడు. 4. చార్లీ ఎర్గెన్ అతను డిష్ నెట్‌వర్క్ చైర్మన్ అయినా కూడా ఇప్పటికీ ప్రతిరోజూ బ్రౌన్ పేపర్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ ప్యాక్ చేసికొని తీసుకెళుతు ఉంటాడు. అతను వ్యాపారంలో  ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. తన నిజ జీవితంలో విలువైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. అతని పొదుపు లక్షణాలు బాల్యంలో అతని తల్లి నుండి వచ్చాయి. కఠినమైన సమయాల్లో పెరిగినప్పుడు అతనికి జీవితం చాలా నేర్పింది. కార్లోస్ తన సహచరులతో కలిసి ప్రయాణించేటప్పుడు హోటల్ గదులను కూడా  తన వారితో కలిసి షేర్ చేసుకుంటారు. 5. అమన్సియో  ఒర్టెగా. అతను  ఇండిటెక్స్ స్థాపకుడు; ప్రతి రోజు భోజనాన్ని తన ఉద్యోగులతో కలిసే కేఫ్ టెరియాలో చేస్తాడు. చాలా నిశ్శబ్ద జీవితాన్ని గడిపే అతను, తరచూ అదే కాఫీ షాప్‌కు వెళ్తూ ఉంటాడు. అతను పరిచయం అవసరం లేని జారా అనే బ్రాండ్ స్థాపకుడు. ఇటీవల భూమిపై రెండవ ధనవంతుడిగా పేరు పొందాడు. అతి సాధారణ వ్యక్తి మాదిరిగానే జీవితాన్ని గడుపుతార ఈ జాబితాలోని మరొక బిలియనీర్ జుకర్‌బర్గ్ మాదిరిగానే  ప్రతిరోజూ  బ్లూ బ్లేజర్, వైట్ షర్ట్ , యాష్ కలర్  ప్యాంటు ధరిస్తారు.

పంచుకుంటే నష్టపోయేది లేదు!

అది హిమాలయాలకు దగ్గరలోని ఒక పల్లెటూరు. ఆ ఊరిచివర ఒక ఆశ్రమం ఉండేది. ఒక రోజు ఊరిలోని రైతు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. నేరుగా అక్కడ ఓ చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్న సాధువు దగ్గరకి వెళ్లాడు. కళ్లు తెరిచి చూసిన సాధువుకి రైతు, రైతు చేతిలో యాపిల్‌ పళ్లు కనిపించాయి.   ‘స్వామీ నేను ఎప్పుడు ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టినా మీరు నన్ను ఆదరంగా చూసేవారు. నా సమస్యలని విని సానుకూలమైన పరిష్కరాలు చెప్పేవారు. పంటలు సరిగా పండక నాకు నష్టం వచ్చినప్పుడు నా ఆకలిని తీర్చేవారు. నేను నాటిన యాపిల్‌ చెట్లు ఈసారి విరగకాశాయి. మీరు నా పట్ల చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా వాటి పళ్లను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాదనకండి!’ అంటూ సాధువు చేతిలో పళ్లని ఉంచి వెళ్లిపోయాడు.   రైతు తన పట్ల చూపిన కృతజ్ఞతకి సాధువు మురిసిపోయాడు. ‘తన గురువుగారు చూపిన సన్మార్గంలో నడవడం వల్లనే కదా, ఇలాంటి జనానికి తన పట్ల గౌరవం ఏర్పడింది!’ అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న పళ్లను గురువుగారికి ఇవ్వాలని అనిపించింది. గురువుగారి గదిలోకి ప్రవేశించి ఆయన పాదాల దగ్గర యాపిల్‌ పళ్లను ఉంచి జరిగిందంతా చెప్పాడు. తన శిష్యుడు ప్రయోజకుడు కావడం చూసి గురువుగారికి ముచ్చట వేసింది. అంతకుమించి, అతనికి లభించిన బహుమతిని తన పాదాల దగ్గర ఉంచడం చూసి సంతోషం కలిగింది.   అంతలో గురువుగారికి ఆశ్రమంలోని ఇతర శిష్యులు కూడా గుర్తుకువచ్చారు. వారిలో ఒక శిష్యుడు పాపం వారం రోజుల నుంచీ విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆ శిష్యుని గదిలోకి ప్రవేశించారు గురువుగారు. గురువుగారి రాకతో శిష్యుడు పరమానందభరితుడయ్యాడు. ఆయన పరామర్శనీ, దాంతోపాటుగా అందించిన యాపిల్‌ పళ్లనీ చూసేసరికి అతని రోగం సగం తగ్గిపోయినంత ఓపిక వచ్చేసింది.   ఆ యాపిల్ పళ్లని చూస్తూ కూర్చున్న శిష్యుడికి రోజూ తన బాగోగులు చూసుకునే వంటవాడు గుర్తుకువచ్చాడు. పాపం ఆ వంటవాడు తనకి ఏ ఆహారం సరిపడుతుంది, ఎలాంటి పథ్యం చేయాలి అన్న విషయాలను చాలా శ్రద్ధగా గమనించేవాడు. శ్రమ అనుకోకుండా తనకి రోజూ ప్రత్యేకంగా వంట చేసేవాడు. వెంటనే తన కృతజ్ఞతకి గుర్తుగా శిష్యుడు వంటగదిలోకి వెళ్లి వంటవాడి చేతిలో యాపిల్ పళ్లని ఉంచాడు. యాపిల్‌ పళ్లని చూసిన వంటవాడికి నోట మాట రాలేదు. ఏదో ఆశ్రమంలో ఉంటూ నలుగురితో పాటుగా పొట్ట నింపుకుందామని అనుకున్నాడు కానీ, వారు తనని ఇంత గౌరవంగా చూసుకుంటారని అనుకోలేదు. యాపిల్ పళ్లదేముంది! తాను ఎప్పుడూ తినేవే! కానీ ఈసారి చేతికి వచ్చిన పళ్లు చాలా అపురూపమైనవి. అవి తన పట్ల ఓ సాధువు చూపిన అభిమానానికి గుర్తు. అందుకనే వాటిని తన ఇంటికి తీసుకువెళ్లి కొడుకు చేతిలో పెట్టాడు. రోగంతో బాధపడిన శిష్యుడికి తను చేసిన సేవ గురించి చెబుతూ ‘నువ్వు కూడా నాలాగా ఇతరుకు సాయపడే గుణాన్ని అలవర్చుకోవాలి’ అంటూ భుజం తట్టాడు.   ‘తండ్రి చెప్పింది నిజమే కదా!’ అనిపించింది కొడుకుకి. ఒకసారి తమ గతాన్నంతా అతను నెమరువేసుకున్నాడు. ఏడాది క్రితం తమ కుటుంబం కటిక దరిద్రంలో ఉండేది. వంటవాడి ఇంట్లో వండుకునేందుకు గింజలే లేవయ్యే! అలాంటి పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చిన ఓ సాధువు తన తండ్రిని తీసుకువెళ్లి వాళ్ల ఆశ్రమంలో చేర్పించాడు. ‘ఈ రోజున తను వేళకి ఇంత తినగలుగుతున్నాడంటే ఆ ఆశ్రమం చలవే!’ అనుకున్నాడు కొడుకు. వెంటనే ఆశ్రమం వైపు బయల్దేరాడు. అక్కడ పదులకొద్దీ సాధువులు తిరుగుతున్నారు. కానీ ఆ రోజు తన తండ్రికి సాయం చేసిన వ్యక్తిని మాత్రం స్పష్టంగా గుర్తుపట్టాడు కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి పళ్లని అతని చేతిలో పెట్టాడు. ఆ సాధువు ఎవరో కాదు.... పళ్లని గురువుగారి పాదాల చెంత ఉంచినవాడే! సంతోషాన్ని ఒకరితో పంచుకోవాలనుకుంటే, అది తిరిగి ఎలా తన దగ్గరకే వస్తుందో సాధువుకి అర్థమైపోయింది. పంచుకునే గుణంలో ప్రతి ఒక్కరి మనసూ తృప్తి చెందుతుందని తెలిసిపోయింది. - నిర్జర.

దుబాయ్‌లోని 8 మంది ధనవంతులు...!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఒకటైన దుబాయ్  చిన్నదేశమే అయినా సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. దుబాయ్ లో వలసవాసులుగా భారతీయులు అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఈ దేశంలో ఉన్న సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో భారతీయుులు, భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య  ఎక్కు వే ఉంది. 1. ఉస్సేన్ సేజ్వాని (Hussain Sajwani) అతని మొత్తం ఆస్తుల విలువ. 2.1 బిలియన్ డాలర్లు. సేజ్వాని, 2002 లో 'డమాక్ ప్రాపర్టీస్' అనే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ  స్థాపించాడు. అప్పటి నుండి ఇది యూరోప్ లో తన వ్యాపారాన్ని విస్తరించి ప్రముఖ సంస్థగా ఎదిగింది. సేజ్వాని రియల్ ఎస్టేట్ రంగంలో సాధించిన ప్రగతికి గాను అతన్ని అరేబియా బిజినెస్ రియల్ ఎస్టేట్ అవార్డులతో, అలాగే రియల్ ఎస్టేట్ లెజెండ్ బిరుదుతో సత్కరించారు. అలాగే 2018 సంవత్సరంలో గల్ఫ్  బిజినెస్ అవార్డులతో పాటు ఆ సంవత్సరపు రియల్ ఎస్టేట్ బిజినెస్ లీడర్ గా ఎన్నికైనాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి జాబితాలో అతని స్థానం 962. 2. సన్నీ వర్కీ.(Sunny Varkey) ఇతని మొత్తం ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయుడైన సన్నీ బిలియనీర్ల జాబితాలో  స్థానాన్ని సంపాదించుకున్నాడు. జేమ్స్  విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా 250 పాఠశాలలను నిర్వహిస్తున్నాడు. అలాగే  ప్రపంచంలోని అతిపెద్ద k-12 పాఠశాలలను నడుపుతున్నాడు.   అతన్ని 2007 సంవత్సరపు అత్యుత్తమ ఆసియా వ్యాపారవేత్త తో సహా అనేక అవార్డులతో సత్కరించారు. అలాగే 2012లో మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్  సీఈవో గా ఎడ్యుకేషన్ బిజినెస్ లీడర్ గా అవార్డులు సొంతం చేసుకున్నాడు. విద్యా రంగంలో చేసిన కృషికి ఆయనకు అవార్డులు లభించాయి. 3. అబ్దుల్ బిన్ అహ్మద్ అల్ ఘురైర్(Abdulla Bin Ahmad Al Ghurair)  ఇతని మొత్తం ఆస్తుల విలువ 4.9 బిలియన్ డాలర్లు.  మాష్రేక్‌బ్యాంక్‌ను స్థాపించాడు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రముఖ బ్యాంకులలో ఒకటి.  దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 4. బి.ఆర్. షెట్టి.  (B.R.Shetty) ఇతని ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయ మూలాల కలిగిన దుబాయ్ వ్యాపారవేత్త. దుబాయ్ లో అనేక వ్యాపారాలను సొంతం చేసుకున్నాడు.  ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక సేవల సామ్రాజ్యానికి అధిపతి అయిన ఇతనికి బి.ఆర్. లైఫ్, ఎన్ఎంసి హెల్త్ కేర్, ఫైనాబీఆర్ హోల్డిగ్ వంటి కంపెనీలు ఉన్నాయి.  తన సంపదలో సగం సేవా కార్యకలాపాలను విరాళంగా ఇచ్చే విషయంపై 2018లో అతను సంతకాలు చేసి తనలో నిజమైన మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు.  5. సైఫ్ అల్ ఘురైర్ (Saif Al Ghurair) ఇతని  ఆస్తుల నికర విలువ 1.7 బిలియన్.  ప్రపంచంలోని టాప్ 500 ధనవంతులలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతను యుఎఇలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్,  ప్రొడక్షన్  సంస్థలలో ఒకటైన అల్ ఘురైర్ గ్రూపుకు అధిపతి.  యాష్రెడ్‌లో కొన్ని పెట్టుబడులను కలిగి ఉన్నాడు, ఇది యుఎఇలో ప్రైవేటు ఆధీనంలో ఉన్న పురాతన బ్యాంకు. 6. మిక్కీ జగ్టియాని.(Micky jagtiani) ఇతని ఆస్తుల విలువ 3.1 బిలియన్ డాలర్లు. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అట్టడుగు నుండి అత్యున్నత స్థానం వరకు సాగింది అతని ప్రస్థానం. లండన్ లో టాక్సీ డ్రైవర్‌గా తన క్యారియర్‌ను ప్రారంభించిన అతను 1973 సంవత్సరంలో యుఎఇకి వచ్చాడు. బహ్రెయిన్‌లో 10 సంవత్సరాలు బేబీ ప్రొడక్ట్ షాపును నడిపి, తరువాత దానిని మరింత విస్తరించాలని నిర్ణయించుకొని ఆ వ్యాపారాన్ని 6 షాపుల వరకు విస్తరించాడు. గల్ఫ్  యుద్ధం ప్రారంభమైన తరువాత, అతను ప్రస్థానం కొనసాగింది. ల్యాండ్‌మార్క్ గ్రూప్ అనే కార్పొరేషన్‌ను స్థాపించాడు . అది కాస్త  ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ , ఫర్నిచర్ వంటి ఇతర వ్యాపారాలను విస్తరించింది. దాంతో మిక్కీ  సంపన్నుల జాబితాలో చేరాడు.   ఫోర్బ్స్  జాబితా ప్రకారం ప్రపంచంలోని ధనవంతుల్లో ఇతను 478 వ స్థానంలో ఉన్నాడు. 7. ఎం.ఏ.యూసుఫ్ అలీ(M.A.Yusuff Ali) ఇతని ఆస్తుల విలువ 3.7 బిలియన్ డాలర్లు. అతను లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అధిపతి. భారతదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్త. తన వాణిజ్యవ్యాపారాలను అంతకంతకు పెంచుకుంటూ సంపన్నుల జాబితాలో చేరాడు. 8. రవి పిళ్ళై. (Ravi Pillai) ఇతని ఆస్తుల విలువ 4.2 బిలియన్ డాలర్లు. ఇతను కేరళకు చెందిన వ్యక్తి. దురదృష్టవశాత్తు అతని వ్యాపారం క్షిణించడంతో  దుబాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి స్థానిక భాగస్వామి సహాయంతో ఒక చిన్న వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించాడు. రెండు సంవత్సరాలల్లో అతని వ్యాపారం అపారంగా పెరిగింది. రవి పిళ్ళై  కొత్తగా నాజర్ ఎస్.హాల్.హజారే కార్పొరేషన్ (NSH) ను స్థాపించాడు. దుబాయ్ లోని ధనవంతుల జాబితాలో చేరాడు.   

రతన్ టాటా జీవనశైలి..

రతన్ టాటా.. పరిచయం అక్కరలేని పేరు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. టాటా గ్రూప్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో కొనసాగిస్తూ అనేక నూతన ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేశారు. నానో కారు ఆయన ఆలోచనే. దేశభక్తి, ఉద్యోగుల పట్ల అనురక్తి, వ్యాపారవిస్తరణలో యుక్తి ఆయన సొంతం. ఆయన జీవనశైలిని గమనిస్తే స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం కనిపిస్తుంది..   రతన్ టాటా తండ్రి నావెల్ టాటా దత్తత వచ్చారు.  తండ్రి మాదిరిగానే రతన్ టాటా బాల్యంలో చాలా కష్టాలు అనుభవించారు. అతని పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో బామ్మ వద్ద పెరిగారు.  ఐబిఎంలో వచ్చిన ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. ఒకవేళ ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలి ఉండకపోతే ఈ రోజు ఇంత పేరుప్రఖ్యాతులు దక్కేవి కావు. అధికారం, హోదా ఉన్నప్పటికీ రతన్ టాటా సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు.   రతన్ టాటా  ఆర్కిటెక్చర్ డిగ్రీని  పూర్తి చేసిన తర్వాత  హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఏ మాత్రం ఖాళీ సమయం ఉన్న తనకు ఎంతో ఇష్టమైన ఫెరారీ కారు నడపడాన్ని ఇష్టపడతారు. అంతేకాదు అతని వద్ద అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంటుంది. ఫెరారీ కాలిఫోర్నియాతో పాటుగా కాడిలాక్ ఎక్స్‌ఎల్‌ఆర్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, క్రిస్లర్ సెబ్రింగ్, హోండా సివిక్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మసెరటి క్వాట్రోపోర్ట్, మెర్సిడెస్ బెంజ్ 500 ఎస్ఎల్, జాగ్వార్ ఎఫ్ టైప్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్-ఆర్ తదితర కార్లు ఉన్నాయి.   రతన్ టాటా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలు,  బ్రిటిష్ ఎంపైర్ కైట్స్ గ్రాండ్ క్రాస్ అందుకున్నారు. పైలట్ లైసెన్స్ పొందిన అతను టాటా గ్రూప్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపారు. 17ఏళ్ల వయసులోనే  మొదటిసారి సోలోగా ఫ్లైట్ నడిపిన ఆయన ఒక ఫ్లైట్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఎఫ్ - 16 ఫైటర్ జెట్ ను ఎయిర్ షోలో నడిపిన మొదటి భారతీయ వ్యక్తి రతన్ టాటానే.   జాగ్యార్, కోరస్, ల్యాండ్ రోవర్, టెట్లీలను సంపాదించిన అతను భారతీయ కంపెనీని అంతర్జాతీయ స్థాయికి  చేర్చారు. అతను మిత్సుబిషి కార్పొరేషన్, బూజ్ అలెన్ హామిల్టన్, ఏఐజి అండ్ జెపి, మోర్గాన్ చేజ్ సంస్థల  సలహా బోర్డు సభ్యునిగా ఉన్నారు. నానో కార్లు రతన్ ప్రియమైన ప్రొజెక్ట్. మధ్యతరగతివారికి లక్షరూపాయలకే సొంతకారు కొనుక్కొనే అవకాశం కల్పించారు.   వ్యాపార రంగంలో బిజిగా ఉండే అతనికి పెంపుడు కుక్కలన్నా చాలా ఇష్టం. తన రెండు పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. రతన్ టాటా నిస్వార్థపరుడు, అద్భుతాలను సృష్టించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. తమ సంస్థ ఏర్పాటుచేసిన సంక్షేమ ట్రస్ట్ ఇప్పటికే ఎంతోమందిని ఆదుకుంటుంది.   రతన్ టాటా బిలియనీర్ల జాబితాలో చేర్చబడలేదు, ఎందుకంటే సంపదను దాచకుండా పంచుకోవడమే అతనికి ఇష్టం.తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అతని వినయంతో కూడిన జీవనశైలి డబ్బు కన్నా మనుషులకు ఎక్కువ విలువ ఇస్తారని స్పష్టం చేస్తుంది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ అతనికి ఎంతో గౌరవాన్ని తెచ్చింది. తన హోదాను ప్రదర్శించుకోవాలన్న ప్రయత్నం ఎప్పుడు రతన్ టాటా చేయరు.   రతన్ టాటా పెద్ద వ్యాపార వేత్త అయినప్పటికీ అవసరమైనప్పుడు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తారు. డాబు దర్పం ప్రదర్శించాలన్నఆలోచన లేదు.  రతన్ సేవలు వెలకట్టలేనివి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయచర్యలకు రిలీఫ్ ఫండ్ అందించడంలో రతన్ టాటా పేరు ఎప్పుడు ముందే ఉంటుంది.   అందరినీ సమానత్వంతో చూసుకోవడమే చాలా మందికి స్ఫూర్తినిస్తుందని నమ్మే దార్శనికుడు రతన్ టాటా.  ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్ నే కాకుండా సామాజిక కార్యకర్త , గొప్ప నాయకుడు అని చెప్పవచ్చు. అందుకు కారణం వినయం, నిస్వార్థంతో కూడిన అతని జీవనశైలి.  వందలాది కోట్లకు అధిపతి అయినా అందరితో కలిసిపోయే తత్త్వం ఆయన సొంతం. ఆ వ్యక్తిత్వమే ఆయనను గొప్పవ్యక్తిగా దేశమే కాదు ప్రపంచం గుర్తించేలా చేసింది.

ఎవరి జీవితమూ వృథా కాదు

  అది ఒక కొండ మీద ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నీరు కరువుగా ఉండేది. గ్రామంలో ఉన్న పేదలు కాస్తోకూస్తో ఉన్న నీటితో సరిపెట్టుకుంటుంటే, ధనికులు మాత్రం కొండ దిగువన ఉన్న చెరువు నుంచి నీటిని కావడితో తెప్పించుకునేవారు. అలా ఓ పెద్దాయన తన యజమాని కోసం రోజూ కావడితో నీటిని మోసుకు వెళ్లేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా...  ఒకరోజు కావడిలో ఉన్న రెండు కుండలలో ఒకదానికి పగులు వచ్చింది. కానీ దాన్ని పెద్దాయన అవతలికి పడేయకుండా, ఎప్పటిలాగా దానిలో నీటిని నింపి కొండమీదకు తీసుకువెళ్లసాగాడు. రోజూ ఆ కుండ నిండా నీటిని నింపడం, కొండ మీద ఉన్న యజమాని ఇంటికి చేరుకునేసరికి దానిలో ఉన్న సగం నీరు వృథాగా నేలపాలవడం జరుగుతూనే ఉండేది.   ‘నీ వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ!’ అని ఒక రోజు పగులు ఉన్న కుండని ఆడిపోసుకుంది మంచి కుండ. దానికి ఏం సమాధానం చెప్పాలో పగిలిన కుండకి అర్థం కాలేదు. ‘నిజంగానే తనకి ఉన్న పగులు వల్ల ఆ పెద్దాయన శ్రమంతా వృధా అయిపోతోంది కదా’ అనుకుంది. ఆ రోజు మొదలు- మంచి కుండ, పగులు ఉన్న కుండని రోజూ దెప్పిపొడవడం.. పగులు ఉన్న కుండ మారుమాట్లాడలేక దిగాలుగా ఉండిపోవడం జరుగుతూనే వస్తోంది.   ‘నన్ను అవతల పడేయండి. నా వల్ల మీ శ్రమంతా వృథా అయిపోతోంది. యజమానికి తగినంత నీరుని కూడా ఇవ్వలేకపోతున్నారు,’ అంటూ తనని మోస్తున్న పెద్దాయనతో ఒక రోజు మొరపెట్టుకొంది పగులు ఉన్న కుండ. కుండ నేరుగా తనతో మాట్లాడటం చూసి పెద్దాయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అటు మీదట చిరునవ్వుతో... ‘నిన్ను అవతల పడేయటం మాట అటుంచు. ముందు నీ దిగులుని పోగొట్టే ఉపాయం ఒకటి చెబుతా విను. ఇవాళ కొండ మీదకి ఎక్కే దారిలో అటూఇటూ విరగబూసిన పూలను కాస్త గమనించు. వాటి అందం చూసి నీ మనసులో ఉన్న ఆందోళన అంతా మాయమైపోవడం ఖాయం!’ అన్నాడు.   పగులు ఉన్న కుండ ఆ రోజు నిజంగానే దారికి ఇరువైపులా ఉన్నా పూలబాటను గమనించింది. నిజంగానే ఆ అందమైన రంగురంగుల పూలని చూసి దాని మనసులో దిగులు మాయమైంది. సాయంత్రం కాగానే పెద్దాయన పగిలిన కుండతో- ‘నేను చెప్పినట్లుగా దారిలో ఉన్న పూల చెట్లను గమనించావా?’ అని అడిగాడు. దానికి పగిలిన కుండ - ‘ఓ! గమనించాను. కానీ నా సంగతేంటి? మీరు నన్ను ఎప్పుడు అవతల పడేస్తున్నారు?’ అని అడిగింది.   ‘నిన్ను అవతల పడేసే ప్రశ్నే లేదు! ఎందుకంటే ఆ దారిలో ఉన్న పూలచెట్లన్నీ నీ చలవే. కాస్త కాస్తగా నీ నుంచి జారే నీటితో ఆ దారంతా అందమైన పూల మొక్కలు పెరిగాయి. అవి ఇప్పుడు ఆ బాటన పోయే ప్రతివారికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి ముందు ముందు కూడా ఆ మొక్కలకి నీళ్లు అవసరం కదా! నిన్నెలా వదులుకోగలను. పొద్దుగూకులా కష్టపడే నా మనసుకి తృప్తిని అందించేంది ఆ పూల మొక్కలే సుమా!’ అంటూ చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఆ మాటలకి పగిలిన కుండ మనసులో ఉన్న కాస్తో కూస్తో దిగులు కాస్తా ఆవిరైపోయింది. ప్రపంచంలో ఎవరి జీవితమూ నిరుపయోగం కాదనీ, తమ లోటుపాట్లను గుర్తించినట్లే సామర్థ్యాలను కూడా గుర్తుంచుకోవాలనీ తెలిసివచ్చింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) ..Nirjara

కళ్లు చెప్పే మాటలు

మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసే ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సామాజిక జీవితం వాటిలో ముఖ్యమైనది. సమాజంలో మెలిగేందుకు, సంఘజీవిగా నిలదొక్కుకునేందుకు భాష, భావం... ఈ రెండూ చాలా అవసరం. భావాన్ని వ్యక్తీకరించడంలో మన కళ్లు చూపే ప్రతిభ అసాధారణం. మనిషి కళ్లలో ఉండే స్క్లెరా అనే తెల్లటి పదార్థం వల్ల మనిషి కనుగుడ్లు చిత్రవిచిత్రమైన భావాలను పలికించగలవు. అతని కనుగుడ్లలో మార్పులు, కదలికలను బట్టి.... అతను ఎటు చూస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అన్నది పసిగట్టేయవచ్చు. దీని గురించి ప్రత్యేకమైన శిక్షణ ఏమీ అవసరం లేదు. అలా తెలిసిపోతుందంతే! కాకపోతే మనకి తెలియకుండానే మన కళ్లు చేసే మాయ గురించి కాస్త అవగాహనను ఏర్పరచుకుంటే, కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉంటుంది. - మనలో ఎంత విశ్వాసం ఉన్నాగానీ, అవతలి మనిషి కళ్లలోకి అదేపనిగా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే... ఎదుటివారికి వ్యతిరేక భావం కలుగుతుంది. ఎంతటి దగ్గరవారైనా కానీ మాట్లాడే సమయంలో 70 శాతం మించి సమయాన్ని కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదంటున్నారు బాడీలాంగ్వేజ్‌ నిపుణులు.   - అదేపనిగా చూస్తే బాగోదు అంటూ ఒక పక్క సంభాషణ జరుగుతూ ఉన్నా కూడా దిక్కులు చూస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంది. మీలో ఏదో అపరాధ భావం ఉందనో, అవతలి మనిషంటే లెక్కలేదనో... చూపులతోనే చెప్పినట్లవుతుంది. - కొంతమంది ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. పక్కచూపులతో వేరొకరిని చూస్తూ ఉంటారు. ఇది కూడా అవతలి మనిషిలో చిరాకు కలిగించే అంశమే! మాట్లాడే వ్యక్తికి సదరు పక్క వ్యక్తి అంటే అనుమానమో, ఆసక్తో ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది.     - సంభాషణ మధ్యలో అవతలివాడు కను రెప్పలను చాలా నిదానంగా మూసి, ఒక్క క్షణం అలా మూసే ఉంచుతున్నాడంటే... అతను నిరాసక్తిగా ఉన్నట్లే! ఒక రకంగా చెప్పాలంటే అవతలి మనిషిని కాసేపు మర్చిపోవడానికి కళ్లు మూసుకున్నాడని అనుకోవచ్చు. ఇక దానికి తోడు సుదీర్ఘమైన నిట్టూర్పు కూడా వచ్చిందంటే అతని మీద జాలి పడక తప్పదు. అలా కాకుండా అవతలి వ్యక్తి మాట్లాడుతూ మాట్లాడుతూ తెగ కళ్లని ఆర్పుతున్నాడంటే... అతను ఏదో ఉద్వేగంలో ఉన్నట్లు లెక్క. - సంభాషణలో మనం ఎదుటివారి వంక చూస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు రకాలుగా మన చూపుని వారి మీద కేంద్రీకృతం చేస్తాము. ఒకటి ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత అతని నుదుటి మధ్యలోకి... అంటే ఒక త్రిభుజాకారంలో వారిని గమనిస్తాము. లేదా ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత వారి నోటి వైపుకీ... అంటే తలకిందులుగా ఉన్న త్రిభుజాకారంలో చూస్తాము. మొదటి పద్ధతిలో ఎదుటి వారి మీద మనం ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నామన్న హెచ్చరికను అందచేస్తుంది. పై అధికారులు, ఇంటర్వూ చేసేవారు ఇలాంటి చూపులు చూస్తుంటారు. ఇక రెండో పద్ధతిలో అవతలివారితో స్నేహపర్వకంగా మెలుగుతున్న సూచనను తెలియచేస్తుంది.       - కేవలం సంభాషణలోనే కాదు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నా కూడా అతని కళ్లు ఏం చేస్తున్నాయదన్నదాటి బట్టి అతని మనస్థితిని గ్రహించవచ్చు. ఎదో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా, వైరాగ్యంలో ఉన్నాడా, తనలో తాను మాట్లాడుకుంటున్నాడా అన్నది అతని కళ్లని బట్టి తేలిపోతుంది. అదెలాగంటారా! మీరే ఆ భావాలను అనుకరించడానికి ప్రయత్నించండి! ఆ సమయంలో మీ కళ్లు అసంకల్పితంగానే మీ స్థితికి అనుగుణంగా కదలడాన్ని గమనిస్తారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఈ లోకాన్ని చూడటానికే కాదు, మీ భావాలను అవతలివారితో పంచుకోవడంలో కూడా ముఖ్యపాత్రని వహిస్తాయి. అందుకే శరీరభాష (బాడీలాంగ్వేజ్‌)లో కళ్లకి ఉన్న ప్రాధాన్యత అసాధారణం. మీ ఆసక్తి, ఓపికలని బట్టి కంటి భాష గురించి ఎన్ని వివరాలనైనా సేకరించుకోవచ్చు. - నిర్జర.  

అందమైన డ్రాయింగ్ రూం కోసం

  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.

వినడం కూడా ఒక కళే!

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నానారకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వేరొకరికి చెప్పుకుంటే చాలు, సగం తీరిపోతాయని వారి నమ్మకం. ఆఖరికి వైద్యుడి దగ్గరకు వెళ్లిన రోగి కూడా, తన మనసులో ఉన్న బాధని వైద్యునితో చెప్పుకునే అవకాశం వస్తే... సగం రోగం నుంచి ఉపశమనం పొందినంతగా తృప్తి చెందుతాడు. కానీ ఇతరుల బాధని పట్టించుకునే నాథుడు ఎవడు! అంత తీరికా, ఓపికా ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయి. అందుకనే అందరూ మాట్లాడటానికి ఇచ్చిన ప్రాముఖ్యతని, వినడానికి ఇవ్వడం లేదు. ఇతరుల మనసుని గెలవాలన్నా, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నా... వినడం అనే కళలో ఆరితేరాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకోసం వారు కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. అవేమిటంటే...     తగిన వాతావరణాన్ని కల్పించండి చాలామంది ఇళ్లలోకి వెళ్లినప్పుడు... వాళ్లు ఒకపక్క మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరో పక్క టీవీనో దినపత్రికో చూస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చికాకుని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చెప్పే మాటలని వినాలీ అంటే దానికి తగిన వాతావరణాన్ని సృష్టించాలి. రణగొణధ్వనుల మధ్యా, టీవీ శబ్దాల మధ్యా, నలుగురూ మెసిలే చోటా సంభాషణ సీదాసాదాగా సాగిపోతుందే కానీ మనసులో ఉన్న మాటలు నిస్సంకోచంగా వెల్లడి కావు.     శరీర భాష వినడం అంటే శూన్యంలో చూస్తూ ఉండిపోవడం కాదు. మాట్లాడే వ్యక్తికి మీరు ఆసక్తిగా వింటున్నారన్న భావన కలగాలి. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండటం. మధ్యమధ్యలో తలని ఆడిస్తూ ఉంటడం, మెడని కాస్త ముందుకి వంచడం... వంటి సంకేతాల ద్వారా మీరు అవతలి వ్యక్తిని ఆలకిస్తున్నారన్న భావనని కల్పించగలగాలి.     ప్రోత్సహించండి మీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే అవతలివారు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి మధ్యమధ్యలో వారి నుంచి మరింత సమాచారాన్నీ, మరింత స్పష్టతనీ రాబట్టేందుకు ప్రయత్నించండి. అవునా, అలాగా, నిజమే వంటి పదాలను వాడటం ద్వారా ‘నీ ఉద్దేశం ఏమిటి?’, ‘నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నల ద్వారా అవతలి వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా వెల్లడించేందుకు అవకాశాన్ని ఇవ్వండి.   అడ్డుకోవద్దు ఇతరులు చెబుతున్న విషయం మీద మనకు విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవతలి మనిషి చెప్పే విషయం మీద మనకే ఎక్కువ అవగాహన, తెలివి ఉన్నాయి అనిపించడమూ సహజమే! కానీ ఎదుటివారికి తన మనసులోని మాటని పూర్తిగా చెప్పే అవకాశాన్ని కల్పించాలి. అలా కాకుండా చీటికీమాటికీ అడ్డుకోవడం వల్ల మీకు అతని అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేలిపోతుంది. ‘వినడం’ అన్న స్థానంలో ‘వాదన’ చోటుచేసుకుంటుంది.   కేవలం వినండి ఎదుటి వ్యక్తి మాటలను వింటూనే, మనం వాటి గురించి అప్పటికప్పుడు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. అంటే వినడమూ, విశ్లేషణా ఏకకాలంలో జరిగిపోతూ ఉంటాయి. కొంతసేపటి తరువాత మనం ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణంగానే అతని పట్ల మన దృక్పథమూ మారిపోతుంది. ఇది నిజంగా తొందరపాటే అవుతుంది. అందుకే ముందు కాస్త స్థిమితంగా అవతలి వ్యక్తి చెప్పే మాటలన్నీ వినాలి, ఆ తరువాత వాటిని విశ్లేషించుకుకోవాలి, చివరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతను చెప్పిన విషయం మీద ఒక అవగాహనకు రావాలి.   అన్నింటికీ మించి ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన అభిప్రాయాలు ఉండే అర్హత ఉందని భావించిననాడు... ఒక సాటి మనిషిగా అతని విలువని గుర్తించినప్పుడు, అతని మాటలను కూడా శ్రద్ధగా ఆలకించాలని అనిపిస్తుంది. మన ఆలోచనే గొప్ప, మన వ్యక్తిత్వమే ఉన్నతం అనుకునే అహంకారంలో ఎవ్వరి మాటలూ వినిపించవు. వినిపించినా మనసులోకి చేరవు.   - నిర్జర.