సొంత గూటికి చేరిన వలస కూలీలు  

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను,  జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ వలస కూలీలకు స్వాగతం పలికి ఆహ్వానించారు. గుజరాత్ రాష్ట్రం నుండి గరికపాడు చెక్ పోస్ట్  ద్వారా 12 బస్సులలో 887 మంది మత్స్యకారులు చేరుకున్నారు. శ్రీకాకుళం 700, విజయనగరం 98, విశాఖపట్నం 77, తూర్పుగోదావరి ఐదు మంది, ఒడిశా రాష్ట్రం ఆరు మంది,చత్తీస్గడ్ ఒకరు వున్నారు. చెక్ పోస్ట్ వద్ద మత్స్యకారులకు అల్పాహారం త్రాగునీరును పోలీసు అధికారులు అందించారు. లాక్ డౌన్అమలు నేపథ్యంలో  రాష్ట్రం నుండి అక్కడకు వెళ్లి, చిక్కుకుపోయిన మత్స్యకారుల సంరక్షణార్థం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మత్స్యకార మంత్రిగారు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న కష్టాలను చూసి గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారని ఎస్పీ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్రభుత్వం  నిర్వహించే వైద్య పరీక్షలకు అందరూ సహకరించాలని ఆయ‌న కోరారు. ముఖ్యమంత్రిగారి గారి చొరవ వల్ల అక్కడ చిక్కుకున్న 4400 మందిని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాష్ట్రాలను దాటుకుని మొదటి విడతగా 12 బస్సులు వ‌చ్చాయి. మత్స్యకార కుటుంబాలను వారి వారి ప్రాంతాలకు ఈరోజు సాయంత్రం లోపు పంపించనున్నారు. వారికి ఆహారం, త్రాగు నీరు అందించి, వారి వారి ప్రాంతాలకు పోలీసు బందోబస్తు ఎస్కార్టు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అవసరం మేరకు వారిని quarantine సెంటర్లకు పంపి వైద్య అందించడం జరుగుతుంది. వారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉంటే వారిని హౌస్ ఖ్వారంటైంన్ కు పంపిస్తారు.

కేటీఆర్‌కు బావమరిది సంస్థతో ఒప్పందమా! రేవంత్ రెడ్డి

కరోనాను తరిమి కొట్టేందుకు మార్చి 21న కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పాలసీ మేరకు హైడ్రాక్సీ క్లోరోఫిన్ మాత్రలు దేశీయ ముడిసరకుతోనే ఇక్కడే తయారు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు. మాత్రల కోసం కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.’’ ‘‘ఈ పాలసీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ద్వారా జాయింట్ వెంచర్స్ చేసి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థ అయిన లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థతో మాత్రల తయారీకి ఒప్పందం చేసుకున్నారు. ‘‘తెలంగాణలో ల‌క్సాయ్ లైఫ్ సైన్స్ అనే సంస్థ ఉంది. దీని డైరెక్టర్ పాకాల రాజేంద్ర ప్రసాద్. ఈయన మంత్రి కేటీఆర్‌కు బావ మరిది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో చేసుకున్న ఒప్పందం ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే లక్సాయ్ లైఫ్ సైన్సెస్ అనేది ఓ గల్లీ సంస్థ. దాన్ని విలువ కేవలం రూ.14 కోట్లు అయితే, పాకాల డైరెక్టర్‌గా వచ్చాక రూ.150 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.’’   ‘‘ప్రపంచ వ్యాప్తంగా మందులు ఎగుమతి చేస్తున్న దిగ్గజ సంస్థలు తెలంగాణలో ఉండగా.. ఈ గల్లీ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఏప్రిల్ 25 నాడు ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో అమెరికా సహా దాదాపు 50 దేశాలకు ఎగుమతులు చేయాల్సిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను దిగ్గజ సంస్థలను కాదని ఆ సంస్థకు ఎలా ఇస్తారు? లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థకు సాంకేతిక సామర్థ్యం, గతంలో ఆ సంస్థ బాగా పర్ఫార్మ్ చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. కనీసం రాజేంద్ర పాకాలకు సైన్స్ రంగంలో ఎలాంటి అనుభం లేదు. దానికి సంబంధించి నైపుణ్యం అతనికి లేదు. ఇతనికి ఉన్న ఏకైక అర్హత కేటీఆర్‌కు బావ మరిది కావడం.’’ క‌రోనాతో కేటీఆర్ ఫ్యామిలీకి కనక వర్షం కురుస్తోందంటూ  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉపద్రవం తలెత్తినా తెలంగాణ పాలకులు తమ వ్యాపార దృక్ఫథాన్ని వదల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీని వెనక ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం కేసీఆర్, కేటీఆర్‌పైన ఉంది.  అర్హత లేని కంపెనీలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? ప్రజలకు వివరించే బాధ్యత మీపై లేదా బండి సంజయ్ గారూ..’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

క‌రోనా వైరస్ ఆ ల్యాబ్ నుంచే వచ్చింది: ట్రంప్‌

కొవిడ్‌-19. ఈ వైరస్‌ చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని అంత బలంగా ఎలా చెప్పగలరని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..''నేను ఆ విషయాలు బటయకు చెప్పలేను. అలా చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదిలోనే దాన్ని నిలువరించి ఉండాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ''చైనా కట్టడి చేయలేకపోయిందా.. లేక కావాలనే నిర్లక్ష్యం వహించిందా అన్నది పక్కనబెడితే.. దీని ప్రభావం మాత్రం ప్రపంచంపై భారీ స్థాయిలో ఉంది'' అని వ్యాఖ్యానించారు.  బహుశా కీలక సమయంలో స్పందించకపోయి ఉండడం వల్లే చేజారిపోయి ఉంటుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.  అసలు చైనాలో ఏం జరిగిందన్నది త్వరలోనే, దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది త్వ‌ర‌లోనే తేలుస్తామ‌ని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి.

బ్యాంకుల్లో వున్న ప్ర‌జ‌ల డ‌బ్బును ఇలా దోచుకుంటారా?

లాక్డౌన్ కడుపు కోతకు మాత్రమే. కోట్ల ఎగవేతకు కాదు. దేశమంతా లాకౌన్డ్ లో నుండి ఎలా బయట పడాలా అని ఆందోళన చెందుతుంటే కేంద్రం మాత్రం తనకు కావాల్సిన వాళ్లు చెల్లించాల్సిన 68 వేల కోట్లు బకాయిలు మాఫీ చేసింది. అందులో పంజాబ్ నేషనల్ బాంక్ ను ముంచి దేశం వదిలి పారిపోయిన మెహల్ చోక్సి మొదలు బాబా రాందేవ్ వరకు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నెలకు.7500 డిపాజిట్ చేయటానికి కేంద్రం వద్ద నిధులు లేవు. కానీ అస్మదీయులకు కట్టబెట్టడానికి 68 వేల కోట్లు రెడీగా ఉన్నాయి! త‌మ‌కు కావాల్సిన వారికి కేంద్రం ఎలా దోచిపెట్టిందో ఓసారి చూద్దాం! Lone Waive కంటే Loan Write off ఎందుకు ప్రమాద‌కరం ఎలా అంటే... 1. Lone waive off లో ఎంత మాఫీ అయిందనే లెక్క ఉంటుంది తద్వార ఖచ్చితమైన లెక్కలతో బ్యాంకులు విధానాల్ని రూపొందిస్తాయి .కానీ Loan write off లో ఇది సాధ్యం కాదు . 2. Loan waiver పొందిన వ్యక్తులు మళ్ళీ loan పొందాలంటే సాంకేతికంగా సాద్యం కాదు .కాని Write off ప్రకటించిన తర్వాత ..దాన్ని Asset Reconstruction company కి గానీ ,DRT కీ గానీ లేదా IBC కి గాని బదిలీ చేసి ...అతి తక్కువ డబ్బుతో ..సెటిల్మెంట్ జరుగుతుంది .తద్వార ఉద్యేశపూర్వక ఎగవేతదారు కాస్త లీగల్ గ తన అప్పును వదిలించుకోని మళ్ళీ రకరకాల పేర్లతో  మళ్ళీ  అప్పు తీస్కుంటాడు  1. ఇదే లోన్ Write off ని చిన్న అప్పులకు ,రైతులకు ఎందుకు వర్తించరు ? 2. ప్రతి సంవత్సరం జరిగే సాధారణ ప్రక్రియ అన్నప్పుడు ...అదే ప్రక్రియను మిగితావారికి ఎందుకు ఆపాదించరు ? 3. 10 సంవత్సరాల తర్వాత కూడా రైతుల అప్పు అలాగే ఎందుకుంటుంది ?  4. సామన్యుల దగ్గర ముక్కు పిండి వసూల్ చేసే బ్యంకులు ఇలా బాడా దొంగల దగ్గర ఎందుకు వసూల్ చేయలేకపోతుంది ? 5. ఇలా ఉద్యేశ పూర్వక ఎగవేత దార్ల పేర్లు భహిరంగంగా ఎందుకు ప్రకటించలేకపోతున్నరు ?  6. రాజకీయ పార్టీలకు ఒస్తున్న విరాళాల వివరాలు ఎందుకు వెల్లడించరూ ? ఎందుకంటే ఇలా బ్యాంకుల నుండి దోచిన డబ్బులే వారికి విరాళాల రూపంలో అందుతాయి . 7. పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతూ ఎంతమంది ఇలా బ్యంకులకు డబ్బులుఎగ్గొట్టారు ? వారికి సభ్య‌త్వం అవసరమా ? 8. కాయకష్టం చేస్కోని బ్యంకుల్లో దాచుకున్న డబ్బులను ఇలా దోచేయడం ఎంతవరకు న్యాయం.  అస‌లు Write off అంటే ఏమిటీ ఇదివరకే Loss Assets కింద పరిగణించబడి ..ఇంకా తిరిగి రావు అనుకున్న ఆస్థులను ..బ్యాంకులు తమ బ్యలెన్స్ షీట్స్ నుండి తొలగించివేయడం . అంటే మళ్ళీ ఆ అస్థులను వసూల్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటూనే వాటిని తమ బ్యాలెన్స్ షీట్స్ నుండి తొలగిస్తాయి . దీని వల్ల బ్యాంకులకు ఒచ్చే లాభమేంటీ ?  1. నిరర్థక ఆస్థులకు సంభందించించి "ట్యాక్సు " కట్టాల్సిన పని లేదు ..కాని ఇది ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గిస్తుంది  2. తమ బ్యలెన్స్ షీట్ లో ఎన్నో రోజుల నుండి ఆస్థులుగా పరిగణింపబడి ,ఎలాంటి ఆదాయాన్ని సమకూర్చని ఆస్థులను తొలగించుకుంటాయి .తద్వార తాము వసూల్ చేయలేకపోయామనే అపవాదును తప్పించుకుంటాయి  దీనివల్ల దేశానికి ఒచ్చే నష్టమేమిటీ అంటే!  1. ఇది వరకే loss assets గా పరిగణింపబడి ,ఇప్పుడు Write off కిందికి ఎల్లిన ఈ ఆస్థులు ఇంకా ..దాదాపుగా తిరిగిరానట్టే అని సంకేతికంగా చేతులెత్తేసినట్టూ . 2. దీని మూలంగా ఈ అస్థుల ద్వారా వచ్చే "ట్యాక్సు " ను ప్రభుత్వం కోల్పోయి ,అప్పులు తెచ్చి వడ్డి కట్టాల్సిన పరిస్థిథి ( ఇప్పటికే భారత్ ప్రతి గంటకు 95 కోట్ల అప్పు చేస్తుంది .ఇప్పటీకి భారత్ అప్పు దాదాపుగా 16 లక్ష ల కోట్లు దాటిపోయి ...ఈ సంవత్సరం మనం 7 లక్షల కోట్ల వడ్డీ కట్టాము . 3. బ్యాంకులు  తమ Lneding Capacity ని కోల్పోతాయి ..తద్వార మర్కేట్ లో ద్రవ్య సరపర తగ్గి , MSME Sector కి , అవ్యస్థిక్రుత రంగానికి లోన్లు దొరకని పరిస్థితి దాపురించి ,పెట్టుబడులను తగ్గించి ,GDP తగ్గి తద్వార ప్రజల జీవణ ప్రమాణాలు పడిపోతాయి . 4. బ్యాంకులు  వద్ద ద్రవ్య లబ్యత లేనందువల్ల ..వడ్డీ రేట్లు పెరిగి ,సామాన్యుడు అప్పు తీస్కోలేని పరిస్థితికి దిగజారుతారు . 5. దీని మూలంగా "బ్యాంకులకు " ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చాలీ ...అదీ కూడా ప్రజల సొమ్మే . ఈ రకంగా Loan Write Off అనేది సంకేతికంగా లోన్లను రద్ధు చేయకున్నా ,పలు విధాలుగా ప్రజా ధనాన్ని లూటీ చేస్తుంది.

ఎంఐఎం కార్పొరేట‌ర్ పోలీసులు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌! కేసు న‌మోదు!

ఎంఐఎం కార్పోరేటర్ పోలీసు కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగ‌డం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో.. ఎంఐఎం కార్పొరేటర్ ముర్తుజా అలీపై మాదన్నపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలోని చావ్నీ నదే అలీ బాగ్‌ ప్రాంతంలోని మసీదు వద్ద బందోబస్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంఐఎం కార్పొరేటర్ ముర్తుజా అలీ బెదిరించారు. ఉన్నతాధికారులకు చెప్పి సస్పెండ్ చేయిస్తామన్నారు. కానిస్టేబుళ్లు చేతులతో బ్యాడ్జ్‌ను కవర్ చేసేందుకు ప్రయత్నించగా.. కార్పొరేటర్ వారితో దురుసుగా ప్రవర్తించారు. పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ముర్తుజా అలీపై కేసు నమోదు చేశామని సంతోష్ నగర్ ఏసీపీ ఎస్వీఎన్ శివరాం శర్మ తెలిపారు.  పోలీసులు మసీదుకు తాళం వేయాలని చెప్పారని కార్పొరేటర్ ఆరోపించారు. మసీదు లాక్ వేయడానికి పర్మిషన్ లెటర్ ఉంటే చూపించామని తాను వారిని అడిగానన్నారు. ఆ ప్రాంతంలో కానిస్టేబుళ్లు ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శుక్ర‌వారం కావ‌డంతో, మ‌సీదుకు తాళం వేయడంతో  చావ్నీ నదే అలీ బాగ్ ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించారు. బందోబ‌స్తు పెంచారు.

ఏపీ, మహారాష్ట్ర కు వెళ్లొద్దు! మ‌ళ్లీ స‌రిహ‌ద్దులు మూసివేసిన తెలంగాణ!

తెలంగాణ ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్,  మహారాష్ట్రకు వెళ్లకుండా తెలంగాణ సర్కార్ బ్యాన్ విధించింది.  కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో జిల్లా సరిహద్దుల‌ను మూసివేశారు. స‌రిహ‌ద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున తెలంగాణా ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. నిర్ణయ అమలుకు పోలీసు బలగాలను పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది.  కర్నూలులో మొత్తం  386 క‌రోనా బారిన ప‌డ్డారు. 9 మంది మరణించారు. కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం.. తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు అక్కడికి వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది.  గుంటూరు జిల్లాలో మొత్తం  287 కేసులు న‌మోదు అయ్యాయి. 8 మంది మ‌ర‌ణించారు. కృష్ణ జిల్లాలో మొత్తం  246 పాజిటివ్ కేసులొచ్చాయి. 8 మంది  మరణించారు. ఈ నేప‌థ్యంలో ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా ప్రభుత్వం భద్రతను పెంచింది.

ఆంధ్ర ప్రదేశ్ లో మత్స్యకారులకు మహర్ధశ

 * రాష్ట్రవ్యాప్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్లు, 1చోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం *  9 చోట్ల చేపలవేటకు చక్కటి మౌలిక సదుపాయాలు *  రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లు, ఒక చోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం  * దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం *  రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం జగన్‌ సమీక్ష శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నంలో 1, తూ.గో.లో 1, ప.గో.లో 1, కృష్ణాజిల్లాలో 1, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరులో 1 చొప్పున ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో బడగట్లపాలెం– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,  శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో– ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం, విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, తూ.గో.జిల్లా ఉప్పాడలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్ , ప.గో.జిల్లా నర్సాపురంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్ , కృష్ణాజిల్లా మచిలీపట్నంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, గుంటూరుజిల్లా నిజాంపట్నంలో– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, ప్రకాశం జిల్లా  కొత్తపట్నంలో– మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోకూడదని, రెండున్నర మూడు సంవత్సరాల వ్యవధిలో వీటిని పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలని, గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ ఫెసిలిటీస్‌ మాత్రమే ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ చెప్పారు.  గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్టు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఇప్పుడు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ కట్టబోతున్నామని కూడా మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

సీఎం జగన్‌ చెప్పింది వాస్తవమే: మేకపాటి గౌతమ్‌రెడ్డి

కరోనా బాధితులను ట్రాక్ చేసేందుకు పరికరాన్ని రూపొందిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎస్ మోడ్యూల్ ని తయారు చేస్తామని.. ఇప్పటికే కంపెనీలతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కరోనా పేషేంట్‌కి ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా నిరంతరం ట్రాక్‌ చేయొచ్చన్నారు. దేశంలో మొదటిసారి ఏపీలోనే చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ మోడ్యూల్ అవసరం చాలా ఉంటుందన్నారు. గ్రీన్ జోన్ లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనాపై చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం చెప్పింది వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు కరోనా వైరస్‌ ప్రపంచమంతా ఉంటుందన్నారు. దేశంలోనే అందరికంటే ఎక్కువ నియంత్రణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. కరోనా టెస్ట్‌లు చేయడంలో ఏపీ ప్రథమస్థానంలో ఉందని.. కిట్ల ఉత్పత్తి కూడా మనమే చేస్తున్నామని మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

మీడియాపై ఏపీ ప్ర‌భుత్వ జులుం!

తెలుగుఒన్ కార్యాల‌యంపై సిఐడి డాడులు! సోషల్ మీడియాలో వస్తున్ప పోస్టులపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం, అధికారపార్టీ నేతల జులుం మొదలైంది.  ఈ మధ్య తమపై సోషల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పోలీసుల స‌హాయంతో మీడియ‌కు వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్ర‌మ కేసులు పెట్టడానికి సోష‌ల్ మీడియా కార్యాల‌యాల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ప్రభుత్వంలోజరుగుతున్న అక్రమాలు, కొవిడ్‌-19, అధికారపార్టీ నేతల అవినీతిపై తెలుగుఒన్‌లో వార్త‌లు రాయ‌డం, ప్రశ్నించటమే పెద్ద నేర‌మైపోయింది. హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని తెలుగుఒన్ కార్యాల‌యంపై సిఐడి దాడులు నిర్వ‌హించారు. బుధ‌వారం రాత్రి 11 గంట‌ల నుంచి గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు తెలుగుఒన్ కార్యాల‌యంలో ఏపీ సిఐడి పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆరుగురు సిఐడి పోలీసులు ఈ సోదాలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా తెలుగుఒన్ కార్య‌క్ర‌మాలన్నీ ఉద్యోగులు ఇళ్ళ నుంచే చేస్తున్నారు. కార్యాల‌యంలో డ్రైవ‌ర్, వాచ్‌మెన్ త‌ప్ప మ‌రేవ‌రూ లేరు. బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఏపి సిఐడి పోలీసులు హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని తెలుగుఒన్ కార్యాల‌యంపై ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. తెలుగుఒన్‌ ఎం.డి. ర‌విశంక‌ర్ ఎక్క‌డ వుంటారు. ఆయ‌నకు సంబంధించిన వివ‌రాల్ని అడిగారు. ఎం.డి. గురించి త‌మ‌కేమీ తెలియ‌ద‌ని చెప్ప‌డంతో పోలీసులు వెళ్ళిపోయారు. మ‌ళ్ళీ గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు తెలుగుఒన్ కార్యాల‌యానికి ఏపీ సిఐడి పోలీసులు ఆక‌స్మికంగా వ‌చ్చారు. నెల చివ‌రి రోజు కావ‌డం. ఉద్యోగుల జీతాల‌కు సంబంధించి ప‌ని ఉండ‌టంతో అకౌంటెంట్ ప్ర‌సాద్ ఆ స‌మ‌యంలో తెలుగుఒన్ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఏపీ సిఐడి పోలీసులు ఆయ‌న్ని విచారించారు. ఎం.డి. ర‌విశంక‌ర్‌కు సంబంధించిన వివ‌రాలు అడిగారు. అయితే త‌న‌కు ఆయ‌న ఎక్క‌డ ఉండేది తెలియ‌దు. తాను కేవ‌లం అకౌంట్స్ మాత్ర‌మే చూస్తాన‌ని ప్ర‌సాద్ చెప్ప‌డంతో పోలీసులు ఎం.డి. డ్రైవ‌ర్ చిన్నా‌ను బెదిరించారు. ఎం.డి. రూం తాళాం తెరిపించి రూంలో ఉన్న సి.డి.లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.  తెలుగుఒన్ ఎం.డి. త‌ర‌ఫు అడ్వ‌కేట్ సిఐడి పోలీసుల‌తో మాట్లాడ‌డానికి ఫోన్‌లో మూడు సార్లు ప్ర‌య‌త్నించినా పోలీసులు అడ్వ‌కేట్‌తో మాట్లాడ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. పైగా సిఐడి పోలీసులు‌ గద్దించడంతో భయపడిన డ్రైవ‌ర్ చిన్నా పోలీసుల్ని ఎం.డి. ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎం.డి.గారు వేరే ప‌ని మీద బ‌య‌టికి వెళ్ళి వుండ‌టంతో మేడంతో మాట్లాడి సిఐడి పోలీసులు మ‌ళ్ళీ తెలుగుఒన్ కార్యాల‌యానికి వ‌చ్చారు. వాచ్‌మెన్ ద‌గ్గ‌ర తాళాలు తీసుకొని మెయిన్ స‌ర్వ‌ర్‌, హార్డ్‌డిస్క్‌, సిసిఫుటేజ్‌, సిసిటీవీ ఎక్విప్‌మెంట్, సి.డి.లు, పెన్‌డ్రైవ్‌లు అన్నీ సిఐడి పోలీసులు తీసుకొని వెళ్ళారు. కొవిడ్‌-19 కు సంబంధించి అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున ఏపి సిఐడి పోలీసులు తెలుగుఒన్ కార్యాల‌యంపై ఆక‌స్మిక దాడుల‌కు పాల్ప‌డ్డారు.

సర్వే సిబ్బందిపై భౌతిక దాడులపై ఏపీ సర్కార్ సీరియస్

కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే నిర్వర్తిస్తున్న సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే సమయంలో, రోగుల మృత దేహాల ఖననాల సందర్భముగా  దహన వాటికలలో ,  వైద్య సేవలు అందించే ఆసుపత్రులు/క్లినిక్ లు, క్వారంటైన్/ ఐసొలేషన్ కేంద్రాలు, మొబైల్ వైద్య సేవలందించే విభాగాలు, తదితర ప్రదేశాల్లో భౌతిక దాడులు జరుగు తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  కరోనా వైరస్ వ్యాప్తిపై లేని పోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కలిగించ రాదని,  కోవిడ్ వ్యాధిగ్రస్తుల యొక్క  కాంటాక్ట్ ల అన్వేషణ వంద శాతం పూర్తి  చేసి, సంబంధిత వ్యక్తులకు తగు పరీక్షలు చేయటం ద్వారానే ఈ వ్యాధి నివారణ త్వరిత గతిన సాధ్య మవుతుందని డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి  పేర్కొన్నారు.    కోవిడ్ వ్యాధిగ్రస్తుల పార్దివ దేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్  చేసి సీల్ చేయటం జరుగుతుంది. ఇటువంటి మృత దేహాలను   పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా  వ్యాప్తికి ఎటువంటి ఆస్కారం ఉండదు. కనుక ప్రజలందరూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా కోరటమైంది. సమాజ హితం కోసం పాటు పడే  వైద్య సిబ్బంది విధుల నిర్వహణకు సమాజంలోని ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  కేంద్ర ప్రభుత్వం 22 ఏప్రిల్ 2020 న తీసుకొని వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా విధి నిర్వహణలో ఉన్న   వైద్య/వైద్యేతర  సిబ్బంది పై జరిగే  దౌర్జన్యకర సంఘటనలన్నింటినీ శిక్షార్హమైన, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇటువంటి  దౌర్జన్యకర చర్యలకు పాల్పడే లేదా ప్రేరేపించే లేదా ప్రోత్సహించే వారికి 3 నెలల నుంచి 5 సంవత్సరాలు కారాగార వాస శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించ వచ్చు. అలాగే విధి నిర్వహణలో ఉన్న వైద్య, వైద్యేతర  సిబ్బందిని ప్రమాదకరంగా గాయపరిచే సంఘటనలకు పాల్పడే వారికి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించవచ్చు. దీనికి తోడు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారే బాధితులకు నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం అందించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం  కఠిన చర్యలు తీసుకోవల్సినదిగా జిల్లా కల్లెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చినట్టు డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

అమెరికాలో భారతీయ మహిళ హత్య, భర్త ఆత్మహత్య

ఐదు నెలల గర్భవతి అయిన 35 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైయ్యారు. ఆమె భర్త సమీపంలోని హడ్సన్‌ నదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 26న గరిమా కొఠారి తన నివాసంలో హత్యకు గురికాగా, ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. కొఠారి భర్త మన్‌మోహన్‌ మాల్‌ (37) మృతదేహాన్ని నది నుండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  వీరిద్దరూ 'నుక్కడ్‌' రెస్టారెంట్‌ను నడుపుతున్నారని, వారు మంచి జంట అని రెస్టారెంట్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. మాల్‌ కూడా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించేవారని అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) పూర్వ విద్యార్థి అయిన మాల్‌ కొలంబియా యూనివర్శిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లారు.  మాల్‌ మరణానికి గల కారణాలు తెలియలేదని అన్నారు. న్యూజెర్సీ సిటీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహాయంతో ప్రత్యేకాధికారులు ఈ కేసును విచారిస్తున్నాయని తెలిపారు.  

కర్నూలు ఘటనపై సీఎం జగన్ సీరియస్

అమరావతి : కర్నూలు జిల్లాలో కరోనా మరణించిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కరోనాపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఘటన ప్రస్తావనకు వచ్చింది. ఇది నిజంగా చాలా అమానవీయమని సీఎం పేర్కొన్నారు. కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చని.. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చని చెప్పుకొచ్చారు. డీజీపీకి సూచన : ‘ కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం కరెక్టుకాదు. అలాంటి పరిస్థితుల్లో వారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్ట్ కాదు. అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు. మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో..? అలాగే స్పందించాలి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలి’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీఎం జగన్ సూచించారు.   వారిపై కేసులు కూడా పెట్టొచ్చు : ‘కరోనా వస్తే మందులు తీసుకుంటే అది పోతుంది. కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడటం సరికాదు. తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టొచ్చు. కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరానితనంగా చూడ్డం సరికాదు. కరోనా అన్నది సోకితే , మందులు తీసుకుంటే పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?.. నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?. తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు. దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?. అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది’ అని సమీక్షలో అధికారులతో సీఎం జగన్ వివరించారు.

పులివెందుల వంటి ప్రాంతానికి కూడా నీటిని అందించాం: చంద్రబాబు

ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలుగుగంగ మొదలు.. పోలవరం వరకు తెలుగు దేశం చేసిన భగీరథ ప్రయత్నాలకు నిదర్శనాలే జలం ఉన్న చోటే సంస్కృతి. నాగరికత జనిస్తాయి జల సంరక్షణ, ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ కృషి చెసింది జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు భగీరథ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుని స్పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణ, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ నిరంతరం కృషి చేసిందని ఆయన ట్వీట్ చేశారు. పులివెందుల వంటి ప్రాంతాలకు కూడా నీటిని అందించామని చెప్పారు. తెలుగుగంగ మొదలు.. నిన్నటి పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం వరకు తమ పార్టీ చేసిన ప్రయత్నాలకు నిదర్శనాలే అని అన్నారు. ‘దేశం ఈరోజు భగీరథ జయంతిని జరుపుకుంటోంది. జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయి. అందుకే మన భారత సంప్రదాయంలో గంగను భూమ్మీదకు తెచ్చి ప్రజలకు వరంగా అందించిన భగీరథుడంటే అంతటి పూజ్యభావం. భగీరథుని స్ఫూర్తిగా జల సంరక్షణకు, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సదా కృషి చేసింది తెలుగుదేశం. ఎన్టీఆర్ నాటి తెలుగుగంగ మొదలు నిన్నటి పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం వరకు తెలుగుదేశం చేసిన భగీరథ ప్రయత్నాలకు నిదర్శనాలే. పులివెందుల వంటి ప్రాంతానికి కూడా నీటిని అందించాం. నీరు-ప్రగతి కార్యక్రమంతో నీటి వనరులను పెంపొందించాం. ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు’అని చంద్రబాబు వరుస ట్వీట్స్‌ చేశ్వారు.

కోవిడ్‌ -19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి కర్నూలు జీజీహెచ్‌ ఆస్పత్రిలో సౌకర్యాలపై పరిశీలన చేయాలని సీఎం ఆదేశం వెంటనే వాటిని మెరుగుపరచడానికి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి:  సీఎం క్వారంటైన్లలో వసతి, సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిపెట్టాలి: పారిశుద్ధ్యం, మంచి భోజనం అందించడానికి దృష్టిపెట్టాలి: ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షల సంఖ్య 94,558  ప్రతి పదిలక్షల జనాభాకు 1,771 పరీక్షలు పాజిటివిటీ కేసుల శాతం 1.48 శాతం, దేశవ్యాప్తంగా 4 శాతం  మరణాల రేటు 2.21 శాతం, దేశవ్యాప్తంగా 3.26 శాతం ఇవికాక 68వేలకుపైగా ర్యాపిడ్‌ టెస్టులు చేశామన్న అధికారులు గడచిన మూడు–నాలుగు రోజుల్లో మరణాలు లేవన్న అధికారులు రానున్న రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి సంఖ్య బాగా పెరుగుతుందన్న అధికారులు ప్రస్తుతం కేసుల వారీగా రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్స్‌ – 80, యాక్టివ్‌ క్లస్టర్స్‌–64, డార్మంట్‌ క్టస్టర్స్‌– 66, 28 రోజుల నుంచి కేసుల్లేని క్లస్టర్స్‌ 20 కేసులు అధికంగా వస్తున్న కర్నూలు, విజయవాడ, గుంటూరుల్లోని ప్రాంతాల్లో పటిష్ట ఆరోగ్య వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు ఇక్కడ పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని వెల్లడి హైరిస్క్‌  ఉన్నవారిని ముందుగానే గుర్తించి, వారికి విస్తృతంగా పరీక్షలు చేసి ముందస్తుగానే వైద్య సేవలు అదించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టామన్న అధికారులు దీనివల్ల మరణాలు లేకుండా చూడ్డానికి వీలవుతుందన్న అధికారులు టెలిమెడిసిన్‌పైనా సీఎం సమీక్ష ప్రిస్కిప్షన్లు, వీటితోపాటు మందులు అందేలా మూడు రోజుల్లోగా సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చ ఇది చాలా అమానవీయమని పేర్కొన్న సమావేశం కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చు: సీఎం అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు : సీఎం అంటరాని వాళ్లగా చూడ్డం కరెక్టుకాదు :సీఎం అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్టుకాదు: సీఎం అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదు: అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు: మనవాళ్లకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి: ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీని  ఆదేశించిన సీఎం కరోనా వస్తే.. మందులు తీసుకుంటే.. పోతుంది: కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడ్డం సరికాదు: తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసు∙కుంటాం, కేసులుకూడా పెడతామన్న అధికారులు: కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరాని తనంగా చూడ్డం సరికాదు: రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?: నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?: తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నంచేయొద్దు : సీఎం దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?: అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది: వ్యవసాయం– అనుబంధ రంగాలు : రైతుల ఇబ్బందులపై ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా దాన్ని పాజటివ్‌గా తీసుకుని ౖవాటి తొలగించడంపై దృష్టిపెట్టండి: వీలైంత త్వరగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌  ద్వారా సమాచారాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి: అలాగే 1902 నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలి: కష్టం ఉందని ఎక్కడనుంచి రైతులు ఫోన్‌చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలి: సీఎం కూపన్లు జారీచేసి పంటలు కొనుగోలు చేసిన విధానంపట్ల రైతుల్లో మంచి సానుకూలత ఉందన్న అధికారులు అన్ని పంటలకూ ఇదే విధానాన్ని వర్తింపుచేయాలన్న సీఎం రోజుకు 60వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు వీలైనంతమేర సేకరించాలని సీఎం ఆదేశం అలాగే మొక్కజొన్న రోజుకు 8వేల టన్నులు సేకరిస్తున్నామని వెల్లడించిన అధికారులు.

టీడీపీ శాశ్వ‌తంగా క్వారంటైన్‌లోనే

తాడేప‌ల్లి: క‌రోనా కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సింది పోయి చంద్ర‌బాబు పారిపోయార‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అన్నారు. హైద‌రాబాద్‌లో కూర్చొని చంద్ర‌బాబు ఇచ్చే దిక్కుమాలిన స‌ల‌హాలు ఎవ‌రికీ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. రాష్ర్టంలో ప్ర‌తిప‌క్షం ప‌నికిరాని ప‌క్షంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో టీడీపీ నేత‌లు ఎక్క‌డున్నారు అని ప్ర‌శ్నించారు. కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికే ఆద‌ర్శంగా నిలిచిందన్నారు. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంద‌ని పేర్కొన్నారు. వాలంటీర్ వ్య‌వ‌స్థ క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తూ క‌రోనా రోగుల‌ను నిర్థారించడంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న క‌రోనా బాధితుల‌కు మంచి పౌష్ఠికాహారం అందిస్తూ, త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ అధికారంలో ఉంటే క‌రోనాను కూడా కాసుల పంటగా మార్చుకునేవార‌ని దుయ్య‌బ‌ట్టారు. హుద్‌హుద్ తుఫాను స‌మ‌యంలో చేసిన చేసింద‌దే క‌దా అని గుర్తుచేశారు.  బ‌ల‌హీన వ‌ర్గాలును ఓటుబ్యాంకు కోసం టీడీపీ నేత‌లు  వాడుకొని వ‌దిలేశార‌ని, వైఎస్సార్‌సీపీ  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వాళ్ల‌ను ఆదుకున్నామ‌ని పేర్కొన్నారు. జీవో.49  ద్వారా గీత కార్మికుల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోమ‌న్‌రెడ్డి లక్ష 20 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు.  బడుగు బలహీన వర్గాలకు సీఎం జ‌గ‌న్  అభినవ పూలే గా నిలిచారని కొనియాడారు. గుజరాత్ రాష్ట్రంలో వేటకు వెళ్లి ఇరుక్కుపోయిన 4500 మంది మ‌త్స్య‌కారుల‌ను కేంద్రంతో మాట్లాడి, వెనక్కి తీసుకువ‌చ్చారుని వెల్ల‌డించారు.

ఇజ్రాయెల్ లో క‌రోనాపై పోరాటం.. అర‌బ్ డాక్ట‌ర్ కీల‌క‌ పాత్ర!

ఫిబ్రవరి నుండి ప్రతి ఉదయం, ఇజ్రాయెల్ అరబ్ వైద్యురాలు ఖితం హుస్సేన్ తెల్లవారుజామునే  మేల్కొని  కరోనా వైరస్ పై ఇజ్రాయిల్ చేస్తున్న పోరాటంలో పాల్గొనటానికి ఉద్యోగానికి వెళ్తారు. 44 ఏళ్ల హుస్సేన్ ఇజ్రాయెల్ లోని ప్రముఖ  అరబ్ డాక్టర్.. ఈమె  కరోన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ తరఫున ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద ఆసుపత్రి అయిన హైఫా సమీపంలోని రాంబం ఆసుపత్రిలో కరోన కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వైద్య బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుంది మరియు నెలల తరబడి రోజుకు కనీసం 12 గంటల పని చేస్తుంది. ఇజ్రాయెల్ లో ఇజ్రాయెల్ అరబ్బులు పాలస్తీనియన్ల వారసులు,  వారు జనాభాలో 20 శాతం ఉన్నారు మరియు వైద్య వృత్తిలో ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డాక్టర్ హుస్సేన్ ప్రధాన వృత్తి రోగి అరబ్ లేదా యూదు అయినా వ్యక్తుల ప్రాణాలను కాపాడటం-. ఆమె ఈశాన్య పట్టణం రమేహ్‌లో జన్మించింది, కానీ ఇప్పుడు గెలీలీలోని కార్మిల్ నగరంలో నివసిస్తోంది.  కరోనావైరస్ సంక్షోభం లో వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో దాదాపు రెండు నెలలుగా ఆమె తన వృద్ధాప్య తల్లిని సందర్శించలేదు. ఆమె భర్త, న్యాయవాది, వారికి  ఇద్దరు కుమార్తెలు, ఎనిమిది మరియు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఆమె సహోద్యోగులలో కొందరు కరోనా తమ కుటుంబ సభ్యులకు సోకుతుందనే భయంతో ఇంటికి వెళ్ళరు. "నేను నా తల్లిదండ్రులను చూడకుండా ఆపివేసాను, కాని నా కుమార్తెలను చూడటం ఆపలేను" అని హుస్సేన్ అన్నారు. ఇజ్రాయెల్ లో డాక్టర్ ఖితం హుస్సేన్ కృషి కొనియాడబడినది. ఆమె చేస్తున్న పనికి  సర్వత్రా ప్రసంసలు లబించినవి. ఇజ్రాయెల్ సమాజంలో అరబ్ డాక్టర్లు  ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందిగా కొనియాడబడినారు.. ప్రఖ్యాత ఇజ్రాయెల్ కళాకారులు రాంబం ఆసుపత్రికి ఆన్‌లైన్ నిధుల సేకరణను నిర్వహించారు, అరబ్బులు మరియు యూదుల మధ్య సహజీవనం యొక్క చిహ్నంగా దీనిని గుర్తించారు..

ఏపీలో 1400 దాటిన కరోనా కేసులు!

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1400 దాటేసింది.. గత 24 గంటల్లో 71 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ స్టేట్ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ నంబర్ 140లో  పేర్కొంది. తాజాగా నమోదైన 71 కేసులతో కలిపి.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1403కు చేరింది. ఇక, 321 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1051 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో మొత్తం 6,497 సాంపిల్స్ పరీక్షించగా 71 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.  గత 24 గంటల్లో నమోదైన కేసులు పరిశీలిస్తే అత్యధికంగా కర్నూలులో 43 నమోదు కాగా.. కృష్ణా జిల్లాల్లో 10 కేసులు, గుంటూరు, కడపలో నాలుగు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరులో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక, 386 పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గుంటూరులో 287, కృష్ణా  జిల్లాల్లో 246, నెల్లూరులో 84, చిత్తూరులో 80 కేసులు నమోదయ్యాయి.

రిషి కపూర్‌ టాలెంట్‌కు పవర్ హౌస్‌ లాంటి వారు: ప్రధాని మోదీ

రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి స్ఫూర్తివంతమైన, చురుకైన వ్యక్తి ఆయనను కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను ఆయన మృతితో కలత చెందాను బాలీవుడ్ నటుడు రిషి కపూర్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన మృతితో కలత చెందానని ట్వీట్ చేశారు.  'రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్ఫూర్తివంతమైన మనిషి, చురుకైన వ్యక్తి. ఆయన టాలెంట్‌కు పవర్ హౌస్‌ లాంటి వారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనతో చేసిన చర్చ, ఆయనను స్వయంగా కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను' అని మోదీ ట్వీట్ చేశారు. 'ఆయనకు సినిమాలు, భారత అభివృద్ధి కార్యక్రమాలు అంటే మక్కువ ఎక్కువ. ఆయన మృతితో కలత చెందాను. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి' అని మోదీ ట్వీట్ చేశారు.