అప్ప‌ట్లో స్పానిష్ ఫ్లూ ఎలా తగ్గింది? 50 మిలియన్ల మందిని చంపేశారా?

1918లో ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని స్పానిష్ ఫ్లూ బలితీసుకుంది. దాదాపు 6,75,000 మంది అమెరికన్లు చనిపోయిన వారిలో ఉన్నారు. బ్రిటన్ దేశంలో 2.28 లక్షల మంది చనిపోయారు. స్పానిష్ ఫ్లూ సోకిన దాదాపు 50 మిలియన్ల మందిని చంపేశారని టాక్ ఉంది. వ్యాధిని అరికట్టడానికి ప్రపంచాన్ని బతికించడానికి మందులేని ఈ వ్యాధి నుంచి ఇలా మనుషుల ప్రాణాలు తీశారనే అపవాదు ప్రచారంలో ఉంది. దీనిపై అధికారికంగా మాత్రం సమాచారం లేదు. స్పానిష్ ఫ్లూ ఎక్కువగా 20-30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లకు మాత్రమే వచ్చింది. ఆ వయసు వాళ్లకు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఉండగా.. ఈ ఫ్లూను దేశాలు పట్టించుకోలేదు. దీంతో అపార ప్రాణ నష్టం సంభవించింది. అందరినీ ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉండాలని ఆనాడు ప్రభుత్వాలు ఆదేశించాయి. 1918లో ఈ స్పానిష్ ఫ్లూ కు మందులు లేవు. చికిత్స చేయడానికి ఏలాంటి పరికరాలు లేవు. యాంటి బయాటిక్స్ కూడా లేవు. దీంతో వేలమంది చనిపోయారు. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. తుమ్ములు దగ్గుల ద్వారా ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. సబ్సుతో ముక్కు కడుక్కోవాలని సూచించింది. క్వారంటైన్ ఉండి.. మాస్కులు పరిశుభ్రత పాటించి చాలా మంది చనిపోయాక సామాజిక దూరం నిబంధలు నాడు పాటించడం వల్ల ఆ వైరస్ అంతర్థానమైంది. ప్ర‌స్తుతం కరోనా కూడా అదే స్థాయిలో ఉంది. అప్పటి సీన్లే రిపీట్ అవుతున్నాయి. కాబ‌ట్టి పరిశుభ్రతతోనే ఈ వైరస్ ను అరికట్టడం సాధ్యం అవుతుంది.

కృష్ణా నీళ్ల దొంగతనాన్ని ఆపండి!మరో ఉద్యమం తప్పదు!

నీళ్లు ,నియామకాలు ,నిధులు పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ స్వార్ధ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురి అయ్యే అవకాశం ఉంది. అపర భగీరథుడు గా తన వందిమాగధులు చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరం... ఇటీవల కాలంలో జగన్ కు తానే మార్గదర్శకుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త లిఫ్ట్ గురించి తెలియకపోవడం తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడమే. కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఉత్తర తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దక్షిణ తెలంగాణను విస్మరించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్త లిఫ్ట్ తో శ్రీశైలం నుండి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతే పాలమూరు, నల్లగొండ , రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగనుంది. కొన్ని విషయాల్లో సంప్రదింపులు జరుపుకునే కెసిఆర్ జగన్ మాట మాత్రం చర్చించకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏడు వేల కోట్లతో ఫస్ట్ ఫేస్ కింద పనులు జరపాలని నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. కృష్ణా గోదావరి ట్రిబ్యున ళ్ళ ను తానే పద్ధతి ప్రకారం తీర్చిదిద్దాడని చెప్పే కెసిఆర్ కు చెప్పకుండా దక్షిణ తెలంగాణలో మూడు జిల్లాలను ఎండబెట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే... ఓ వైపు జగన్ కెసిఆర్ అన్నదమ్ములు అంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం... ఆంధ్ర తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వీళ్ళిద్దరికీ పరోక్షంగా దగ్గరగా ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది...కాలేశ్వరం కింద చేపట్టే ప్రాజెక్టులన్నీ తన ఘనతగా చెప్పుకునే కెసిఆర్ ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వంచను ఎలా సమర్థించుకుంటా డు. "నువ్వు కొట్టినట్లు చెయ్ నేను ఏడ్చినట్లు చేస్తా "అన్న సామెత లాగా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలి... ఇప్పటికైనా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎంపీలు మాట్లాడకపోతే... మరో ఉద్యమం తప్పదు.

మీరు రాయలసీమ బిడ్డేనా? చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు!

శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవోపై మీ స్టాండ్ ఏమిటి? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడతారు ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు మనసు రాలేదా? అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా ప్ర‌తిప‌క్ష నేత‌పై విమ‌ర్శ‌లు చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల కృష్ణా నీటిని ఎత్తి కుడి ప్రధాన కాల్వలోకి విడుదల చేయడంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాయలసీమ ప్రాంతానికి నీటిని అధికంగా సరఫరా చేయాలని అనుకుంటోంది. అలాగే గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను కూడా 30 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెల 5న జీవో కూడా జారీ చేసింది. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం రాజుకున్న విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబు గారూ.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా? మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..?' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజుకుంది! కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ!

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ బేసిన్‌లో మిగులు జలాల వివాదం మరోమారు అగ్గిరాజుకుంటోంది. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి నీటిని వాడేసుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే మాకు కేటాయించిన నీటినే మేం వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ బుధవారం సమావేశం నిర్వహించనుంది. కృష్ణా మిగులు జలాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం ఐఎండీ సీఈ, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా, తెలంగాణ, ఆంధప్రదేశ్‌ అంతరాష్ట్ర వ్యవహారాల చీఫ్‌ ఇంజినీర్లు సమావేశం కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం జరగనుంది. నీటి పంపకాల విషయంలో కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీరు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకం ప్రధానంగా చర్చకు రానుంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొల్పడానికి.. వివాదాలను కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) ద్వారా పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీరు అధ్యక్షతన కేంద్ర జలవనరుల శాఖ ఓ కమిటీ ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు స్కైప్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. కృష్ణా బేసిన్‌లో మిగులు జలాల్ని తెలుగు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలో డిసైడ్ చేస్తారు. హైదరాబాద్‌, విజయవాడ, ఢిల్లీ నుంచి కమిటీ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీర్ ఉన్నారు. సభ్యులుగా ఏపీ, తెలంగాణ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం... కృష్ణా బేసిన్‌లోని నికర జలాల్లో ఏపీ, తెలంగాణకు 811 టీఎంసీలను కేటాయించగా... వాటిలో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అంతా క్లారిటీగా ఉంటే... మరి వివాదం ఎందుకు వచ్చిందన్నది కీలక అంశం. కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని సంవత్సరాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. అప్పుడు కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీల కంటే ఎక్కువ నీరు వస్తుంది. ఆ ఎక్కువ నీరును ఎలా పంచుకోవాలి అన్నది ఇప్పటివరకూ డిసైడ్ చెయ్యలేదు. ఎందుకంటే... అలా ఎక్కువ నీరు వస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ మిగులు జలాలపై రచ్చ నడుస్తోంది కాబట్టి... దానిపై కూడా లెక్క తేల్చేయడం బెటరని కృష్ణా బోర్డు అనుకుంది. కేంద్రంతో మాట్లాడితే... కేంద్రం ఓ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చక్కగా సమస్యను చర్చించి... రెండు రాష్ట్రాలకూ ఇబ్బంది లేకుండా పరిష్కారం చూపించేస్తే... ఇక ఏ వివాదమూ ఉండదు. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలూ... అన్నదమ్ముల్లా హాయిగా ఉన్నాయి.

నేపాల్లో 5.3 తీవ్రతతో భూకంపం...

గత అర్ధరాత్రి నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. మంగళవారం అర్ధ రాత్రి సరిగ్గా 11:53 గంటలకు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో ఖాట్మాండు, కాస్కీ, పర్సా, సింధుపల్‌చోక్‌ తదితరా ప్రాంతాల్లో భూకంపనాలు సంభవించాయని 'హిమాలయన్‌ టైమ్స్‌' పేర్కొంది. అయితే భూకంపం ధాటికి ఎవరు గాయపడినట్టు, చనిపోయినట్టు, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు. నేపాల్‌ సరిహద్దులోని భారత్‌ ప్రాంతంలోనూ భూకంపనాలు సంభవించలేదని సమాచారం.

ఇది విభజన చట్టానికి విరుద్ధం!న్యాయ పోరాటం చేస్తాం! కేసీఆర్

కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎపి ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సిఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘‘గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఎపికి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఎపి తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

జూన్‌లోనూ బ‌స్సులు న‌డ‌పం! ఏపీ ప్రైవేటు ట్రావెల్స్!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెలాఖరు వరకు బస్సులు నడపకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని పన్ను మినహాయింపు పొందాయి. రాష్ట్రంలో వివిధ ట్రావెల్స్‌కు చెందిన 800 బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 బస్సుల యాజామాన్యాలు బస్సులు నడపబోమని తాజాగా దరఖాస్తు చేసుకున్నాయి. రవాణా వాహనాలను మూడు నెలలపాటు నడపకూడదని భావిస్తే త్రైమాసిక పన్ను నుంచి వాటికి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పన్ను మినహాయింపు కావాలంటే మార్చిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజారవాణా ఆగిపోవడంతో మార్చిలోనే ఆయా బస్సుల యాజమాన్యాలు బస్సులు నడపబోమంటూ రవాణాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులకు రవాణాశాఖ అధికారులు అనుమతి ఇవ్వడంతో తాజాగా మరో 400కుపైగా బస్సుల యాజమాన్యాలు జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని దరఖాస్తు చేసుకుని త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి.

మానవత్వంతో ఆలోచించండి: కృష్ణా జలాల వివాదంపై జగన్ స్పందన

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటీనికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది ఏపీకి కేటాయించిన నీటినే మేము వాడుకుంటాం అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నాం కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని... దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని జగన్ చెప్పారు. ఈ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లేందుకు కృష్ణా బోర్డు కూడా ఒప్పుకోదని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామని చెప్పారు. శ్రీశైలం డ్యాములో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు కూడా మించి ఉండదని చెప్పారు. ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నీటి మట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లలేదని చెప్పారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్తుందని తెలిపారు.

కియాలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభం

అనంతపురం : కియా ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని అంతర్జాతీయ కియా మోటర్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి మళ్లీ మొదలైంది. కియా రోజుకు 400 కార్ల తయారీని చేపట్టింది. పనిచేసేందుకు 500 మంది కార్మికులకు అనుమతి లభించింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్ల ఉత్పత్తి చేస్తామని కియా యాజమాన్యం తెలిపింది. ఇక, కంటైన్మేంట్ జోన్లలో నివసించే కార్మికుల సెలవులను పొడగించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముంద్తు జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కరోనా!

  క‌రోనా వైరస్ తమిళనాడు ప్రజలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత పది రోజుల్లోనే కేసులు మూడింతలయ్యాయి. వీటిలో అత్యధికంగా చెన్నైలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక, కోయంబేడు మార్కెట్ ప్రభావం చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. చెన్నై తర్వాత అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నది ఇక్కడే. ఈ డెడ్లీ వైర‌స్‌ బారినపడిన 190 మంది పోలీసులు ప‌డ్డారు. . మరోవైపు, ఉన్నతాధికారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. అలాగే, చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా బారినపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి.

క‌రోనాపై పోరుకు 20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌! లాక్ డౌన్ 4  మే 18 కంటే ముందే ప్ర‌క‌టిస్తాం!

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని మే 17వ తేదీ లోగా నాలుగో విడత లాక్ డౌన్ విధివిధానాలను వెల్లడిస్తామని ప్ర‌ధాని వివరించారు. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా కట్టడికి మార్గమని ఆయన అన్నారు. ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. క‌రోనాతో పోరాటం చేద్దాం. ముందుకు వెళ్దాం. క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని సైంటిస్టులు, డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌ట్టికీ క‌రోనా మ‌న జీవ‌నంలో భాగ‌మై పోయింది.  మాస్క్ ధ‌రించుదాం. సామాజిక దూరాన్ని పాటిద్దాం.  ఆత్మస్థైర్యం కలిగిన భారత్ ఆ విధంగా ముందుకెళుతుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవస్థ, డెమోగ్రపీ అనే నాలుగు పిల్లర్లు, ఐదో పిల్లర్ డిమాండ్ అని మోడీ పేర్కొన్నారు. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నామ‌ని ప్రధాని చెప్పారు. మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం. లోక‌ల్ ప్రాడెక్ట్స్ కొన‌డ‌మే కాదు వాటికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

ప్రాణాలు కాపాడుకుంటూ క‌రోనాపై యుద్ధం కొన‌సాగిద్దాం! ప్ర‌ధాని మోదీ

జాతిని ఉత్తేజ పరుస్తూ ప్ర‌ధాని మోదీ మ‌ళ్లీ ప్ర‌సంగించారు. 2020లో 20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను ‌ప్ర‌క‌టించారు. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ ల‌క్ష్యంగా ప్ర‌ధాని ఆర్థిక ప్యాకేజ్‌ను ప్ర‌క‌టించారు. ఇది దేశ జిడిపిలో 10 శాతం. అన్నివ‌ర్గాల‌కు న్యాయం చేసేలా ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. స్వ‌యం స‌మృద్ధికి ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఒక వైర‌స్‌ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. మ‌న‌వ‌త్వానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. క‌రోనాపై పోరాటాంలో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. అయితే ఇది గెల్చి తీరాల్సిన యుద్ధం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 42 ల‌క్ష‌ల మందిపై క‌రోనా ప్ర‌భావం చూపింది. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి యుద్ధం చేస్తున్నారు. ప్ర‌పంచంలో జీవ‌న్మ‌ర‌ణ పోరాణం కొన‌సాగుతోంది. దేశంలో అనేక మంది త‌మ వారిని కోల్పోయారు. ఈ విప‌త్తు క‌న్నా మ‌న సంక‌ల్పం గొప్ప‌ది. మ‌న ద‌గ్గ‌ర సామ‌ర్థ్యం వుంది.  ఇలాంటి విప‌త్క‌ర స్థితిని చూడ‌లేదు. విన‌లేదు. ఈ సంక్షోభం నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలి. ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం వుంది. మ‌న ధృక్ప‌థం దృఢంగా వుండాలి. గ‌త శ‌తాబ్దం నుంచే వింటూనే వున్నాం. 21వ శ‌తాబ్దం భార‌త‌దేశానిదే. భార‌త పురోగ‌తే ప్ర‌పంచ పురోగ‌తిగా మారింద‌ని ప్ర‌ధాని అన్నారు.

కరెంటు బిల్లుల్ని చూసి ప్ర‌జ‌లు గుడ్లు తేలేస్తున్నారు! కరెంటు షాక్!

లిక్కర్‌ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న ప్రభుత్వాల క‌న్ను ఇప్పుడు కరెంటు బిల్లుల మీద పడింది. కరోనా వైరస్‌ కారణంగా ఓ నెల రీడింగులు తీయకపోవడంతో, శ్లాబ్‌లు మారిపోయాయి. అదొక్కటే కారణం కాదు.. ఇతరత్రా కారణాలు కూడా కలిసి బిల్లులు వాచిపోతున్నాయి.. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది. విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. క‌రోనా కార‌ణంగా బాగా ఆల‌స్యం జ‌రిగింది. దీంతో శ్లాబ్‌ల లెక్క మారిపోయింది. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది. లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఇప్పుడే మొదలైంది అసలు మజా... ముందుంది మరింత వాయింపుడు వ్యవహారమంటూ, ఆర్టీసీ ఛార్జీలు సహా.. ఇతరత్రా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.

దేవుడు సంపాదిస్తేనే సేవ‌కుల‌కు జీతాలా? టిటిడి లీల‌లు!

పాల‌కులు త‌ల‌చుకుంటే విద్య, వైద్యం మాత్రమే కాదు. భక్తి కూడా మార్కెట్ వ‌స్తువు అయిపోయింది. ‌దేవుడ్ని కూడా వ్యాపార వ‌స్తువుగా చేసేశారు. ఆధ్యాత్మిక‌త ఉట్టిప‌డేలా వుండాల్సిన మ‌త సంస్థ‌ల్ని ఆదాయ‌వ‌న‌రుగా చూడ‌డం ప్రారంభించారు. అందుకే వ్యాపార భాష మాట్లాడుతూ ఆదాయం త‌గ్గింది కాబ‌ట్టి టిటిడి ఉద్యోగుల జీతాల్లో కోత విధించామంటున్నారు. కరోనా వైరస్‌ కారణంగా టీటీడీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింద‌ట‌. దాంతో, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా టీటీడీ ఉద్యోగులకూ వేతనాల కోత అమలవుతోంది. ఇది 'కోత' కాదు, 'సర్దుబాటు' అని ప్రభుత్వం చెబుతున్నా, జీతాల కోతతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు. టీటీడీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? మ‌రి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు సంబంధించిన టన్నుల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. మరి, అలాంటి టీటీడీ సుమారు 100 కోట్లు వెచ్చించి, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వలేదా.? వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక, టీటీడీలో చాలా మార్పులొచ్చాయి. అద్దె గదుల రేట్లు, లడ్డూ రేటు పెరిగాయి. టీటీడీ అంటే, భక్తులకి సౌకర్యాలు కల్పించడం కాదు, వీఐపీల సేవలో తరించేదేనన్న అభిప్రాయం రోజురోజుకీ బలపడిపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. భక్తులకు అవసరమైన మేర, తక్కువ ధరలో లడ్డూ ప్రసాదం అందించలేని ఆర్థిక సమస్యల్లో టీటీడీ వుందా.? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాలకు వివిధ రూపాల్లో ఆదాయం ల‌భిస్తుంది. అందులో హుండీ ద్వారా వ‌చ్చే దానితో పాటుగా ద‌ర్శ‌నాల టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణ క‌ట్ట స‌హా ప‌లు మార్గాల్లో ఆదాయం వ‌స్తుంది. క‌రోనా దెబ్బ‌తో తిరుమ‌ల పూర్తిగా ఖాళీ కావ‌డంతో ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి. టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది. అంటే నెల‌కు వంద కోట్ల‌కు పైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే, అది రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. అనే వాదన ఎప్పటినుంచో వుంది. అందులో వాస్తవం లేకపోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆ పార్టీ, తమకు అత్యంత సన్నిహితులైనవారిని టీటీడీకి సంబంధించి కీలక పదవుల్లో నియమించడం చూస్తూనే వున్నాం. కేంద్ర మంత్రి పోస్ట్‌తో సమానంగా టీటీడీ ఛైర్మన్‌ పదవికి 'గిరాకీ' వుందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

'వాట్సాప్ పాఠాలు'... ఏపీ ప్రభుత్వం నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు... సిలబస్‌ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం... ప్రతీ పాఠశాలకూ ఓ ‘వాట్సాప్ గ్రూప్’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక పాఠశాలలోని విద్యార్ధులు, టీచర్లు... ఒక గ్రూపులో ఉంటారు. పదవ తరగతి పరీక్షల కోసం... విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ మీడియా ద్వారా అందించనున్నట్లు సమాచారం. ‘ఆన్‌లైన్’ ద్వారా తరగతులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మొత్తం పాతిక వేల మంది వరకు విద్యార్ధులు, మరో 933 మంది ఉపాధ్యాయులు ఈ వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ‘ యూ ట్యూబ్‌’లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత ‘యూఆర్‌ఎల్ లింక్’లను వాట్సాప్ గ్రూప్ లేదా ‘ఈ-మెయిల్’ ద్వారా విద్యార్ధులకు పంపుతారు. ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది. అలాగే విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటుంది. మొత్తంమీద ఈ విధానంతో కరోనాను కట్టడి చేయడంతోపాటు విద్యార్ధులకు సమయం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు కూడా ఇదే విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎల్ జీ గ్యాస్ లీక్ కి కార‌ణం మానవ తప్పిదమే! ఫోరెన్సిక్

లాక్ డౌన్ సందర్భంగా మెయిన్ టెనెన్స్ లో నిర్లక్ష్యం, మానవ తప్పిదాల ఫలితంగానే స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్టు ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం తెలిపింది. విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ కి మానవ తప్పిదమే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. స్టెరీన్ స్టోరేజీ ట్యాంక్ లోపల ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్ని మిక్స్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అలాగే 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చూడడంలో అలసత్వం వహించిన‌ట్లు తెలిసింది. డాక్టర్ సరీన్, టి.సురేష్ నేతృత్వంలో ఈ సంస్థకు చెందిన టీమ్ ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి సాక్ష్యాధారాలు సేకరించి రిపోర్ట్ త‌యారుచేసింది. సెల్ఫ్ పాలిమరైజేషన్ ని నివారించేందుకు స్టెరీన్ గ్యాస్ ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్లో కలపాల్సి ఉందని, కానీ లాక్ డౌన్ కాలంలో ఇలా జరగలేదని వివరించారు. సెల్ఫ్ పాలిమరైజేషన్ క్రమంగా మొదలై.. కెమికల్ రియాక్షన్ కి దారి తీసింది..దీంతో 150 డిగ్రీల సెంటీగ్రేడ్ తో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడింది అని ఈ నివేదిక తెలిపింది. దీనిని వెరిఫై చేయడానికి కంట్రోల్ రూమ్ లో ఒక ఆపరేటర్ ఉండాలని, తాము సైట్ ని పరిశీలించిన రోజున స్టోరేజీ ట్యాంక్ లో టెంపరేచర్ 120 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్టు ఈ బృందం పేర్కొంది. కూలింగ్ ప్రాసెస్ ని కూడా సరిగా నిర్వహించలేదని డాక్టర్ సరీన్ తెలిపారు.

పిచ్చి చైనా.. తాను తీసుకున్న గోతిలో తానే పడింది

కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొన్ని కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు అసలు శాశ్వతంగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనంతటికి కారణం చైనా అని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే.. కరోనా వైరస్ సృష్టించింది చైనానే అనడానికి తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతోంది. ఓ రకంగా దాదాపు అన్ని దేశాలు చైనా వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు.. ఈ కరోనా ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద గట్టిగానే పడింది. మనం ఓ పది వస్తువులు కొంటే వాటిల్లో దాదాపు ఏడెనిమిది వస్తువులపై 'మేడ్ ఇన్ చైనా' అని రాసి ఉంటుంది. దీనినిబట్టే ప్రపంచ మార్కెట్ పై చైనా వస్తువుల ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పిన్నీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా క్వాలిటీతో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఐటమ్స్ తయారుచేసి ప్రపంచ దేశాల మీదకు వదులుతుంటుంది చైనా. కాస్ట్ కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు కూడా తెలిసో తెలియకో చైనా వస్తువులు కొంటుంటారు. దీంతో ఇన్నాళ్లు చైనా ఆటలు సాగాయి. అయితే ఇప్పుడు కరోనా గేమ్ లో చైనా కూడా బలైంది. కరోనా దెబ్బకి నిత్యవసరాలు తప్ప అనవసర వస్తువులు కొనాలన్నా ఆలోచన ప్రజల్లో లేదు. ఒకవేళ కొనాలన్నా డబ్బులు కూడా లేవు. దీనికితోడు ఇప్పుడు దేశాలు కూడా వస్తువులు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో లేవు. ఇక చైనా నుంచైనా అసలు ఛాన్సే లేదు. అందుకే చైనాలో చాలా కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ముఖ్యంగా గార్మెంట్స్, టాయ్స్ కంపెనీలు మూతపడ్డాయి. తయారుచేసినా కొనేవారు లేరు, వర్కర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో పలు కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రపంచ మార్కెట్ ని శాసించిన చైనాలోని కంపెనీలే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయంటే, ఇలాంటి సమయంలో మన దేశం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

10 వేల మందితో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మహానాడు!

ప్ర‌తి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును తెలుగు తమ్ముళ్లు పండుగలా జరుపుకుంటారు. అయితే ఈసారి మహానాడు వినూత్నంగా జరుగబోతోంది! భారీ బహిరంగసభ గాకుండా.. వర్చువల్‌ మీడియా వేదికగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 29న టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించగా ఇప్పుడు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మహానాడు జరుగనుంది. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుండడం ఇదే తొలిసారని టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పదుల సంఖ్యలో నేతలతో భేటీకి అవకాశం ఉంటుంది. ఒకేసారి 10వేల మందితో జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించడం సాధారణ విషయం కాదని వారు పేర్కొంటున్నారు. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల దృష్ట్యా కిందటిసారి మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు. లాక్‌డౌన్‌ ఎప్పటివరకు ఉంటుందో స్పష్టత లేకపోగా... కరోనా నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నాయా లపై పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. జూమ్‌ కాన్పరెన్స్‌కు అనుగుణంగా ఏర్పాట్లుచేయాలని వారికి సూచించారు.