అప్పుడు వైఎస్‌.. ఇప్పుడు జ‌గ‌న్‌.. సంగంతో పెట్టుకుంటే షాకే..

దేశంలో తిక్క స‌ర్కారు ఏదైనా ఉందంటే అది ఏపీ ప్ర‌భుత్వ‌మే. మోస్ట్ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ సీఎం జ‌గ‌న్‌రెడ్డి. గ‌ద్దెనెక్కిన నాటి నుంచి క‌క్ష సాధింపు చ‌ర్య‌లే. అభివృద్ధిని, పాల‌న‌ను గాలికి వ‌దిలేసి.. ఆప‌రేష‌న్ టీడీపీపైనే ఫోక‌స్ పెడుతూ వ‌చ్చారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలోనూ అదే తీరు. కొవిడ్ వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి.. ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌, సంగం డెయిరీ స్వాధీనంతో బ‌రితెగించాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి. నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచి.. అడ్డ‌గోలు జీవోలు జారీ చేసి.. పాడి రైతుల పెన్నిధి అయిన సంగం డెయిరీని ప్ర‌భుత్వ పాలు చేశారు. కాలిని త‌న్నేవాడు ఒక‌డుంటే.. త‌ల‌ను త‌న్నేవాడు ఇంకొక‌డు ఉంటాడ‌న్న‌ట్టు.. ఏపీ స‌ర్కారు అరాచ‌క నిర్ణ‌యాల‌ను హైకోర్టు ఎప్ప‌టిక‌ప్పుడూ అడ్డంగా కొట్టేస్తూ వ‌స్తోంది. తాజాగా, సంగం డెయిరీ కేసులోనూ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల‌తో సంగం డెయిరీని క‌నుమ‌రుగు చేసేందుకు జ‌గ‌న్‌రెడ్డి చేసిన కుట్రలు విఫ‌ల‌మ‌య్యాయి. సంగం డెయిరీ మ‌రోసారి వైఎస్ కుటుంబ కుతంత్రాల నుంచి బ‌య‌ట‌ప‌డింది. అవును, గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్సార్ ముఖ్య‌మంత్రి ఉన్న‌ప్పుడు కూడా సంగంపై ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగారు. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా ఉండ‌టాన్ని ఓర్వ‌లేక పోయారు. సంగంపై పైచేయి సాధించేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయినా, టీడీపీ ప‌ట్టు కోలేదు. వైఎస్‌ హయాంలో ఆర్డినెన్స్‌ ద్వారా పాల‌క వ‌ర్గాన్ని ర‌ద్దు చేసి.. డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్‌ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు.  జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. తండ్రిలానే సంగం డెయిరీపై ప్ర‌తీకార చ‌ర్య‌లు మ‌రింత పెంచారు. సంగం డెయిరీని దెబ్బ కొట్టేందుకే గుజ‌రాత్‌కు చెందిన అమూల్ మిల్క్‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని చెబుతారు. అమూల్ త‌ర‌ఫున పాల సేక‌ర‌ణ‌కు అధిక ధ‌ర‌లు చెల్లిస్తూ.. రైతుల‌ను అటువైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జోరుగా జ‌రిగాయి. అయినా, సంగంతో ద‌శాబ్దాల అనుబంధం ఉన్న పాడి రైతులు నేటికీ సంగం డెయిరీకే పాలు విక్ర‌యిస్తున్నారు. దీంతో.. అమూల్‌కు పాలు అమ్మ‌క‌పోతే ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌మంటూ అధికారులు, పాల‌కులు బెదిరింపుల‌కు దిగ‌న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.  ఇటీవ‌ల టీడీపీ నేత‌, సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌తోనే సంగం డెయిరీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. తెల్ల‌వారుజామున 100 మందికి పైగా పోలీసులు న‌రేంద్ర ఇంటిపై దాడి చేసి ఆయ‌న్ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు. 2013లో సంగం డెయిరీని మ్యాక్స్‌ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి మార్చే ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఆ కేసులో భాగంగానే ఛైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు త‌ర‌లించారు.  ధూళిపాళ్లను అరెస్ట్ చేసి త‌మ‌కు అడ్డులేకుండా చేసుకున్న ప్ర‌భుత్వం.. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే సంగం డెయిరీని ప్ర‌భుత్వ ప‌రం చేస్తూ ఆదేశాలు జారీ చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. దులోనూ వ్య‌వ‌హారం సాఫీగా సాగ‌లేదు. స‌ర్కారుకే క్లారిటీ లేదు. ముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. ఆ త‌ర్వాత‌.. తూచ్ అంటూ ఆ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత మ‌రో జీవో జారీ చేసి.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సంగం డెయిరీని తీసుకొచ్చింది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్‌కలెక్టర్‌కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ద‌శాబ్దాల కుతంత్రం సాకార‌మైంద‌ని స‌ర్కారు ప‌గ‌టి క‌లలు కంది. కానీ, కోర్టులు ఉన్నాయి. న్యాయ‌స్థానాల‌ రూపంలో న్యాయం ఇంకా మిగిలే ఉంది. అందుకే, డెయిరీ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని సంగం డెయిరీ డైరెక్టర్లు కోర్టుకు తెలిపారు.  చేతిలో అధికారం ఉంది క‌దాని విర్ర‌వీగిన‌ప్పుడ‌ల్లా.. కోర్టులు మొట్టికాయ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఆ అధికార అహాన్ని దించేస్తున్నాయి. తాజాగా, సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. హైకోర్టు తీర్పే అంతిమం. సంగం డెయిరీ. గుంటూరు, ప్ర‌కాశం పాడి రైతుల‌కు పెన్నిధి. త‌మ క‌ల్ప‌త‌రువును త‌మ నుంచి ఎవ‌రూ దూరం చేయ‌లేరంటున్నారు పాడి రైతులు. అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జ‌గ‌న్.. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా.. సంగం డెయిరీ.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. రైతుల‌దే. 

ఈటల స్టొరీ ఎటు పోతోంది? కేసీఆర్ వ్యూహమేంటీ? 

ఈటల రాజేందర్’ తెలంగాణ ఉద్యమంలో, తెరాసలో అత్యంత కీలకపాత్ర పోషించారు. తెరాస తొలి  ప్రభుత్వంలో ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్’ను ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సహా అధికార పార్టీ నాయకులు అందరూ,అద్భుత్వం, అమోఘం అని కీర్తించారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ, కరోనా పుణ్యాన ఆర్థిక శాఖ కంటే కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను, నిన్న మొన్నటి వరకు అంతే అద్భుత్వంగా నిర్వహించారు. చివరకు అత్యంత అవమానకరంగా మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ అయ్యారు. గతంలో ఇదే శాఖను, నిర్వహించిన రాజయ్య తర్వాత ఉద్వాసన (బర్తరఫ్) గురైన రెండవ మంత్రి ఈటల. ఇద్దరి శాఖలు ఒకటి కావడంతో పాటుగా, ఇద్దరూ అవినీతి ఆరోపణలకు ఎదుర్కుని మంత్రి వర్గం నుంచి అవమానకరంగా బర్తరఫ్ కావడం యాదృచ్చికమే కావచ్చును, కాకా పోవచ్చును. కానీ ఇద్దరి మధ్య ఎవరూ కాదనలేని మరో సారూప్యం కూడా ఉంది. ఆ ఇద్దరూ బడుగు,బలహీన వర్గాల నేతలు. రాజయ్య ఎస్సీ అయితే  ఈటల బీసీ. కట్ చేస్తే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏడేళ్ళ పాలనలో, ఆయన మంత్రి వర్గంలో పనిచేసిన వారిలో, ప్రస్తుత మంత్రివర్గంలో ఈ ఇద్దరే, అవినీతిపరులా, మిగిలి వారందరూ, బంగారు పూసలా? అంటే, అవుననే అమాయకులు, బహుశా ఎవరూ ఉండరు.  నిజానికి రాజకీయాలు ఖరీదైన వ్యాపారంగా మారిన ఈ కాలంలో మంత్రులనే కాదు,ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు, చివరకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సాధారణ రాజకీయ కార్యకర్తలు, నాయకులు, ఏ ఒక్కరూ  కూడా అవినీతి అంటకుండా రాజకీయాల్లో రాణించడం అయ్యేపని కాదు. అందుకే రాజకీయ నీతి అంటేనే అవినీతి అని, రాజకీయ నిఘంటువులు ఘోషిస్తున్నాయి. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలది అదే నీతి. అందుకు తెరాస మినహాయింపు కాదు.  ఇక ప్రస్తుతం ఈటలపై వేటుకు ప్రధానకారణంగా చూపిస్తున్న అసైన్డ్, దేవాలయాల భూములు  కుంభకోణం విషయాన్నే తీసుకుంటే, ఇదొక అంతులేని కథ అవుతుంది. తవ్విన కొద్దీ కళేబరాలు బయట పడుతూనే ఉంటాయి.  నిజానికి దళిత,గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జరపడం చట్ట రీత్యా నేరం. ఇతరత్రా ప్రజోపయోగ కార్యక్రమాలకు అవసరం అయినప్పుడు ఆ భూములను వెనక్కు తీసుకుని  అందుకు ప్రత్యాన్మాయంగా మరొక చోట భూమి ఇచ్చే అధికారం ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది, అన్యులు, ఎంతవారైనా ఆ భూముల జోలికి వెళ్ళరాదని చట్టం చెపుతోంది. అయితే, స్వాతంత్రం వచ్చిన నాటిటి నుంచి ఇప్పటివరకు దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో ప్రభుత్వాలు తిరిగి తీసుకున్న భూములను తీసివేసినా, మిగిలిన భూముల్లో, ఇప్పటికే కనీసం తక్కువలో తక్కువ ఓ యాభై శాతానికి మించి చేతులు మారిపోయాయి. ఇక దేవాలయ భూములు, వక్ఫ్ భూముల విషయం అయితే చెప్పనే అక్కరలేదు.ఇలాంటి పరిస్థితులలో, అసైన్డ్ భూములు అక్రమించారనే ఆరోపణపై, ఒక సీనియర్ మంత్రికి మంత్రివర్గం నుంచి  ఉద్వాసన పలకడం, నిజంగా నవ్వు తెప్పించే విషయమే. నిజానికి, అసైన్డ్ భూముల ఆక్రమణల కారణంగా, చర్య్లాఉ తీసుకోవడం మొదలు పెడితే, మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలలో కనీసం తక్కువలో తక్కువ సగం మంది ఉద్వాసనకు గురవుతారు.    రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా, ఈటల మీద వచ్చిన ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చకా చకా పావులు కదిల్చారు. కొరడా ఝుళిపించారు. అధికారులు, 24 గంటలు తిరగకుండానే, ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అవును ఈటల అసైన్డ్ భూములను అక్రమించారు, పనిలో పనిగా అటవీ నిబంధనలను ఉల్లంఘించి చెట్లు నరికారు, దేవాలయ భూములను ఆక్రమించుకున్నారు’ అంటూ తదుపరి చర్యలకు అవసరమైన విధంగా నివేదికలను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అనేది, అందరికి తెలిసిన విషయమే.  అయితే, ఇదంతా రాజకీయ చదరంగం. ఈ క్రీడలో ప్రస్తుతం  కేసీఆర్’ కింగ్.  ఎప్పుడు ఎక్కడ అట మొదలు పెట్టాలో, ఎక్కడ ‘బ్రేక్’ ఇవ్వాలో, ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ చుక్క పెట్టాలో ఆయనకు తెలిసి నంతగా ఇంకెవరికీ తెలియదు. ఈటల వ్యవహారంలో ఇంతవరకు జరిగిన కథను, ఒక్కసారి రీవైండ్ చేసి చూస్తే, కోర్ట్ జోక్యం సహా ప్రతి ఎపిసోడ్’లో కేసీఆర్, కోరుకున్నదే జరిగింది. ఆయనకు కావాల్సింది ఏదైతే వుందో, అది ఆయన ఖాతాలో చేరిపోయింది. ఇప్పటికి ఆయనే విజేత. ఇక పై ఏది జరిగినా, రాజకీయంగా ఆయనకు వచ్చే నష్టం ఏదీ ఉండదు.  ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కుంభకోణం, కూకటపల్లి పల్లి భూముల కుంభకోణం, నయీం నేరాలు, ఇంకా అనేక భూభాగోతాలు, ఇతర అవినీతి అక్రమాలకు సంబంధించి, అన్నిటినీ మించి ఏడేళ్ళ క్రితం మొదలైన, నోటుకు ఓటు కేసు ఇంకా , నడుస్తూనే ఉన్నాయి. రాజకీయంగా అవసరం అయిన కాడికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఈటల’ అవినీతి, విచారణ  చేరింది. ఇది మరో అంతులేని కథలా సాగుతుంది. అంతకు మించే, ఎదో జరిగిపోతుంది, అనుకోవడం అయితే మన అజ్ఞానం, కాదంటే అమాయకత్వం.అలాగే, రాజకీయ సమికరణలను, ఈటల వ్యవహారం తల్లకిందులు చేస్తుందని అనుకోవడం కూడా అంతే ...

పల్లకీలో గర్భిణీ.. 

మన దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు చీకటి లోనే ఉన్నాయి. కిరోసిన్ దీపాల కిందే వారి జీవితాలను గడుపుతున్నారు. ఆ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఉండవు. పిల్లలు చదువుకోవడానికి తరగతి గదులు ఉండవు.. ఆ ప్రాంతాల ప్రజలకి ఎమర్జెన్సీ అయితే పాత సినిమాలో చూపించినట్లు ఏ మంచం మీదనో. పల్లకి మీదనో వాళ్ళను ఆసుపత్రికి తీసుకువెళతారు.   ఓపెన్ చేస్తే.. ఆ ఊరు అడవిలో ఓ కొండా మీద ఉంది. అక్కడ వాహన సౌకర్యం ఉండదు. ఎవరికైన ఎమర్జెన్సీ అయితే ఇంకా అంతే .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ఆసుపత్రికి పరుగెత్తాలి. కర్మకాలి వాడి గాశారం బాగాలేకుంటే బకెట్ తన్నాల్సిందే.. తాజాగా పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆమె కుటుంబ సభ్యులు మూడు కిలోమీటర్ల దూరం పల్లకీలో తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వంతాల పంచాయతీ పెదవలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో చిలకమ్మ నిండు గర్భిణి. ఉదయాన్నే పురిటినొప్పులు ప్రారంభం కావడంతో గతంలో ప్రభుత్వం గ్రామానికి అందజేసిన పల్లకీలో ఆమెను అటవీ ప్రాంతం మీదుగా కొండ మార్గంలో వంతాల గ్రామం వరకు మోసుకువచ్చారు. అక్కడి నుంచి ఆటోలో జి.మాడుగుల ఆసుపత్రికి తీసుకువచ్చారు.     అడిగినంత డబ్బు కొట్టు.. అంబులెన్సు పట్టు  కరోనా పేరు వింటే కొందరి జేబులు కాళీ అవుతున్నాయి.  కొందరు కరోనని వ్యాపారంగా మారుతున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారు. మానవ సంబంధాలు మరిచి మనిషికి డబ్బులే ముఖ్యం అంటున్నారు. కరోనా బారినపడి.. అష్టకష్టాలతో విజయవాడ రాష్ట్ర కొవిడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు కొంచెం కుదుటపడి.. స్వస్థలాలకు వెళ్లాలనుకున్నా.. లేక మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి వెళ్లాలనుకున్నా.. అంబులెన్స్‌లు దొరకడం లేదు. ఆసుపత్రి బయట పదుల సంఖ్యలో వాహనాలు ఉన్నా.. అందరూ సిండికేట్‌ అవుతున్నారు. ఎవరైనా వస్తే.. ఆసుపత్రి వెనుక మా నాయకుడున్నాడు.. మాట్లాడుకుని రండి అని చెబుతున్నారు. అక్కడికెళ్లి అడిగితే ఎక్కువ ఇస్తామంటే గాని అంబులెన్స్‌ పంపడంలేదు.   ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అంబులెన్సులకు ధరలు నిర్ణయిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అవసరముంది. మానవత్వం చేతికున్న విశాఖ వాసి..   కరోనా సోకి సాయం కోసం ఎదురుచూస్తున్న రోగిని ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు విశాఖకు చెందిన కొండా రాజీవ్‌గాంధీ.. గాజువాక, అజామబాద్‌ ప్రాంతానికి చెందిన  వ్యక్తి(53)కి పదిరోజులు క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సలహా మేరకు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే రెండు రోజులుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకున్నాడు. గురువారం ఉదయం నుంచి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. కుటుంబ సభ్యులకు ఏమీ చేయాలో పాలుపోక గాజువాకలో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగారు. ఎవరూ చేర్చుకోలేదు.. చివరికి విశాఖలోని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎక్కడా పడక దొరకలేదు. రోదిస్తూనే భార్య, కుమార్తె(21), కుమారుడు(19) తెలిసినవారిని ఎంతో మందితో ఫోన్‌లో మాట్లాడారు. తండ్రిని బతికించడానికి సాయం అందించాలని కోరారు. ఏమీ చేయాలో పాలుపోక ఏయూ బస్‌స్టాప్‌ వద్ద తండ్రికి ఆక్సిజన్‌ పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో పూర్ణామార్కెట్‌కు చెందిన వైకాపా నేత కొండా రాజీవ్‌గాంధీ కారులో వెళ్తూ గుండెలను పిండేసే ఆ దృశ్యాన్ని చూశారు. వారివద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాడు. ఎంపీ విజయసాయిరెడ్డికి సమాచారం అందించారు. అక్కడి నుంచి తన కారులో విమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి పడకను సమకూర్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కొండా రాజీవ్‌గాంధీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.         

కూలీగా మారిన సీపీఐ నారాయణ 

సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఉపాధి హామీ కూలీగా మారారు. మండుటెండల్లో ఆయన కూలీ పనులు చేశారు.  ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కాకుండా రెండు రోజుల పాటు కూలీలతో సమానంగా ఆయన పని చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీపీఐ జాతీయ నేత  తమతో కలిసి పని చేయడంతో కూలీలు సైతం షాక్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గం నగరిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నగరి మండల పరిధిలోని అయానంబాకం గ్రామ చెరువులో  రెండు రోజులు నారాయణ కూలీ పని చేశారు. ఉపాధి హామీ పథకంలో పని చేయాలంటే జాబ్ కార్డు ఉండాలి. అందుకే తాను అఫీషియల్ గా పని చేయలేదని.. ఎందుకంటే అఫీషియల్ గా పని చేయాలంటే జాబ్ కార్డు పొంది ఉండాలనే నిబంధన ఉండడం వల్ల తాను అఫీషియల్ గా కాకుండా స్వచ్చందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను అన్నారు. కూలీలతో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఉపాధి హామీ పథకం చాలా గొప్ప కార్యక్రమమని.. అయితే ప్రణాళికతో కాకుండా ఇష్టానుసారంగా పనిచేయడం వల్ల పెడదారి పోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.  కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కు పెట్టుకుని మరి నారాయణ కూలీ పనులు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది లెఫ్ట్ పార్టీలు పార్లమెంట్లో గట్టిగా ఉద్యమించి సాధించుకున్న పథకమని, అప్పట్లో జాతీయ పార్టీలన్నీ కూడా ఈ పథకాన్ని తీసుకు రాకూడదు అని తీర్మానించాయి అని గుర్తుచేశారు. ఉపాధి హామీ వల్ల ప్రతి ఏటా 50 వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడుతుందని అన్నిపార్టీలు వ్యతిరేకించాయని.. అయినా వామపక్ష పార్టీలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆకలి చావులను, నిరుద్యోగతను పారదొలేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.  గ్రామీణ ఉపాధి ద్వారా కోట్లాది మంది గ్రామీణ నిరుద్యోగులు, మహిళలు లబ్ధి పొందారన్నారు. ముఖ్యంగా బాలింతలు ఈ పథకంలో వచ్చి పని చేసేటప్పుడు చిన్నపిల్లల కోసం ప్రత్యేక కిట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు, ఎండాకాలంలో మజ్జిగ సరఫరా చేసేవారని, కానీ ఇప్పుడు ఆ నిబంధనలు అన్నీ కాలరాసి కేవలం పనులు మాత్రం చేయించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.  చెరువులలో గుంత తీస్తూ ఆ గుంతలో తీసిన మట్టిని కట్ట మీద కాకుండా పక్కనే పడేయడం వల్ల వర్షాలు పడినప్పుడు మళ్లీ ఆ మట్టి అంతా కూడా కొట్టుకు వచ్చి గుంతలు పూడి పోతున్నాయని, ఒక ప్రణాళిక లేకుండా ఇలా చేయడం ద్వారా శ్రమ, కాలం రెండు కూడా వృధా అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.   అలా పూడిక తీసిన తరువాత ఆ మట్టిని ఒడ్డున కాకుండా కట్టమీద తీసుకుపోయి పోయడం వల్ల చెరువు కట్ట మరింత పటిష్టంగా మారుతుందని సలహా ఇచ్చారు. ఈ పథకంలో పనిచేసే వారికి కూలీలు అందిన వెంటనే సోషల్ ఆడిట్ ను నిర్వహిస్తే బాగుంటుందని, అలా కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి చేయడం వల్ల పని జరగనట్లు ఫీల్డ్ అసిస్టెంట్లతో రికవరీ చేయడం సరికాదన్నారు.

ఆమెకు ౩౦.. అతనికి 19 .. ఏంటో తెలుసుకోండి.. 

ఈ మధ్య కాలం లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లిళ్లు జరిగిన, పిల్లలు ఉన్న అటు ఆడ, ఇటు మగ ఇద్దరు రెచ్చిపోతున్నారు. పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేస్తున్నారు. భార్య మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుందని భార్య ఒకరినొకరు క్షణికావేశంలో చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో పసిపిల్లనకు అనాధలుగా చేస్తున్నారు.  అది తూర్పు గోదావరి జిల్లా. కాజులూరు మండలం. శీల పంచాయతీ. ఆమె పేరు రమణమ్మ. ఆమెకు 30 సంవత్సరాలు, ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. మొగుడు, పిల్లలు చూసుకుంటూ ఉండాల్సిన ఆమె అక్కడితో ఆగలేదు.  అతనికి పేరు జె.వెంకటశివరామరాజు. అతనికి 19 ఏళ్లు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి రమణమ్మతో పరిచయం అయింది. ఆ పరిచయాన్ని  పెంచుకున్నాడు. తర్వాత, ప్రేమిస్తున్నానని చెప్పడంతో.. గత రెండేళ్లుగా శీలలంకలోని ఓ రొయ్యల చెరువుల వద్ద పనికి కుదిరి ఇద్దరూ అక్కడే సహజీవనం సాగిస్తున్నారు. రమణమ్మ మూడేళ్ల చిన్న కుమార్తె కూడా వారితోనే ఉంటోంది.  కట్ చేస్తే.. ఆ రమణమ్మ 19 ఏళ్ళ ఆటో డ్రైవర్ కి పెళ్ళాం అవుదామనుకుంది. తనని పెళ్లి చేసుకోమని లవర్ ని అడిగింది. అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అంతటితో  ఆమె ఊరుకోలేదు అతడిని నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని రమణమ్మ వెంకటశివరామరాజు పై రోజు ఒత్తిడి తీసుకొస్తుండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మూడు రోజుల క్రితం కూడా గొడవ పడి రాత్రికిరాత్రే ముగ్గురూ మాయమైనట్లు రొయ్యల చెరువుల యజమాని ఎం.వేణుగోపాల్‌ శుక్రవారం గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అర్ధరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రమణమ్మను ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చి, తాను పని చేస్తున్న చెరువుల వద్దే పూడ్చిపెట్టడడంతో పాటు ఆమె కూతురును పిఠాపురంలో రోడ్డు పక్కన వదిలి పరారైనట్లు నిర్ధారించారు. కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి.. తహసీల్దారు బి.సాయిసత్యనారాయణ, వైద్యుల సమక్షంలో రమణమ్మ మృతదేహన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సంరక్షణలో ఉందని ఆయన చెప్పారు.

క‌రోనా సాయానికి.. మేముసైతమంటూ విరుష్క జోడీ..

క‌రోనా దేశాన్ని క‌బ‌లించేస్తోంది. రోజుకు 4 ల‌క్ష‌ల కేసుల‌తో క‌ల్లోలం సృష్టిస్తోంది. వేల మంది చ‌నిపోతున్నారు. చికిత్స‌కు డ‌బ్బులు లేక కొంద‌రు.. ఆసుప‌త్రిలో వ‌స‌తులు లేక ఇంకొంద‌రు.. క‌రోనా మ‌ర‌ణమృదంగం సృష్టిస్తోంది. ఉపాధి లేక‌, వ్యాపారం జ‌ర‌క్క‌, ఇంటి పెద్ద మ‌ర‌ణించి.. ఇలా ల‌క్ష‌లాది కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. దేశ ఆర్థిక‌, కుటుంబ వ్య‌వ‌స్థ క‌కావిల‌కం అవుతోంది. మ‌రి, వీరిని ఆదుకునేది ఎవ‌రు?  ప్ర‌భుత్వం ఎంత వ‌ర‌కు సాయం చేయ‌గ‌ల‌దు? అందుకే, సోనూసూద్ లాంటి వాళ్లు ఇప్ప‌టికే మేమున్నామంటూ తోచిన సాయం అందిస్తున్నారు. తాజాగా, ఇండియ‌న్ పాపుల‌ర్ క‌పుల్స్ విరుష్క జోడీ సైతం.. మేముసైతం అంటూ సాయానికి ముందుకొచ్చారు.  విరాట్ కొహ్లి.. నెంబ‌ర్ వ‌న్ క్రికెట‌ర్‌. అనుష్క శ‌ర్మ‌.. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌. ఇండియాలోకెల్లా క్రేజీ క‌పుల్‌. త‌మ ఆట‌తో, అభిన‌యంతో.. దేశంలో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ జంట‌.. ప్ర‌స్తుత దేశ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో త‌మ వంతు సాయం అందిస్తామంటూ ప్ర‌క‌ట‌న చేశారు. విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రకటించారు. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందని విరాట్‌ అన్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి తాను వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ketto వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు విరుష్క దంపతులు ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ‘కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తోంది. వైద్యారోగ్య వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగింది. కోహ్లీ, నేను కలిసి విరాళాల సేకరణ చేపడుతున్నాం. మనమందరం కలిసి ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. దేశానికి, భారతీయులకు మద్దతు ఇవ్వడానికి ముందడుగు వేయండి. మీరు అందించే సహకారం ఈ క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది’ అని అనుష్క శర్మ అన్నారు.   త‌మ వంతుగా 2 కోట్లు డొనేట్ చేసి ఈ విరాళాల‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విరుష్క జంట తెలిపింది. దీని ద్వారా 7 కోట్లు సమీకరించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల సంక‌ల్పాన్ని అంతా హ‌ర్షిస్తున్నారు. ప్ర‌స్తుతానికి 7 కోట్ల నిధులు స‌మీక‌ర‌ణ టార్గెట్‌గా పెట్టుకున్నా.. మ‌రింత పెద్ద మొత్తంలో డొనేష‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.   

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. సంగం స్వాధీనం చెల్లదన్న హైకోర్టు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనంపై సర్కార్ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంగం డెయిరీని ఏపీ డెయిరీలో విలీనం చేస్తూ సర్కార్ ఇచ్చిన జీవో చెల్లదని  హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోజువారి డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు పర్యవేక్షించాలని సూచించింది ధర్మాసనం. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది .  సంగం డైరీ లో ఏసీబీ సోదాలు పేరిట డేటా చౌర్యం జరగబోతోందని పాలకవర్గం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏసీబీ సోదాలు పేరిట ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు మినహా మిగతా అమ్మకాలు మార్కెటింగ్ తదితర విషయాలలో ఏసీబీ పోలీసులు జోక్యం చేసుకోరాదని డేటాను యాక్సెస్ చేయడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సంఘం డైరీని తెనాలి సబ్ కలెక్టర్కు స్వాధీన పరుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 19 ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది తాత్కాలిక కార్యకలాపాల్లో ఐఏఎస్ ఆఫీసర్ జోక్యం చేసుకోవడం సంస్థ కార్యకలాపాలకు  ఆటంకం కలుగుతుందని పేర్కొంటూ డైరెక్టర్ల బోర్డు సంగం డైరీ కార్యకలాపాలను యధాతధంగా నిర్వహించుకోవచ్చని హై కోర్టు తీర్పు ఇచ్చింది.

కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాలో ఏపీలోనే 7.. 

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఏపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలోని 30 జిల్లాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండగా.. అందులో ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. ఏడు జిల్లాల్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.  ఏపీలో ఏడు జిల్లాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. చిత్తూరు,  శ్రీకాకుళం జి, తూర్పుగోదావరి , గుంటూరు , విశాఖపట్నం, అనంతపురం,  కర్నూలు జిల్లాల్లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ 10 జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఉండటం మరింత కలవరం కల్గిస్తోంది. పాజిటివ్‌ రేటు 20 శాతం దాటిన రాష్ట్రాల్లో 13వ రాష్ట్రంగా ఏపీ ఉంది. క్రియాశీలక కేసులు బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆరోది.  విశాఖ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా  విస్తరిస్తోంది. విశాఖ జిల్లాలో ఉన్నతాధికారులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీవోలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ కూడా... ఈ ఏడు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందని.. అక్కడ ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకున్నారా అని ఆరా తీసినట్టు తెలుస్తోంది.  జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా పంజా విసురుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనా కట్టడిని గాలికొదిలేసి కక్ష రాజకీయాల్లో సీఎం బిజీగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి ఎ 1 వైరస్‌ 6093 సోకిందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జైల్లో జగన్మోహన్‌ రెడ్డి సంఖ్యను గుర్తు  చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ఎన్‌ 440 కె కరోనా వైరస్‌ కర్నూలులో బయట పడిందని చెప్పి చంద్రబాబు రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన  ప్రతిస్పందించారు. ‘‘దేశంలో వైరస్‌ ప్రమాదకరంగా ఉన్న 30 జిల్లాల్లో 7జిల్లాలు మన రాష్ట్రానివే. పాజిటివ్‌ రేటు 20 శాతం దాటిన రాష్ట్రాల్లో మనది 13వ రాష్ట్రం. క్రియాశీలక కేసులు బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆరోది. ఆయువు నిలబడటానికి వాయువు లేదు. వైద్యం అందించే నాథుడు లేడు. అంత్యక్రియలకు శ్మశానంలో ఖాళీ లేదు. మీ వైరస్‌ 6093 రాష్ట్రాన్ని శవాల దిబ్బగా మార్చేసింది’’ అని అయ్యన్న ట్వీట్‌ చేశారు. వైర్‌సకు... వైఎస్ కి మధ్యలో ఒక్క అక్షరమే తేడా అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ట్విటర్‌లో... ‘‘వైర్‌సను ఇంటి పేరులో పెట్టుకొన్న జగన్‌ రెడ్డి వైఫల్యం వల్ల ఏపీలో వైరస్‌ విజృంభిస్తోంది. ఫ్యాక్షన్‌ వైరస్‌ రాజారెడ్డి, పొలిటికల్‌ వైరస్‌ రాజశేఖరరెడ్డి, అవినీతి వైరస్‌ జగన్‌రెడ్డి. ఈ వైర్‌సలు అన్నీ నారా వ్యాక్సిన్‌తోనే అంతం అవుతాయి’’ అని జవహర్‌ వ్యాఖ్యానించారు.   

ఏపీలో కరోనా పేరుతో.. కాసుల మోసం..

ఒక వైపు ప్రాణాలు పోతుంటే. మరో వైపు పండగ చేసుకుంటున్నారు. వేల సంఖ్యలో ప్రజలు డబ్బులు ఖర్చు చేసుకుంటుంటే.. మరి కొంత మంది జేబులు నింపుకుంటున్నారు. ప్రాణాలు ఒకడివి, పైసలు మరొకడివి. కరోనా పేరుతో జనాల జేబులను లూటీ చేస్తున్నారు, కొంత మంది. మోసం చేయడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.  కరోనా  దేశాన్ని కబళించి వేస్తుంది. ఒక వైపు కరోనా బాధితులకు సామాన్య ప్రజలు సైతం తమకు తోచిన సహాయం చేస్తూ మానవసవాన్ని చాటుతుంటే.. మరోవైపు ఇదే సమయంలో కొందరు అదే మానవత్వానికి సమాధి కడుతున్నారు. కరోనా వచ్చింది అని కూడా కనికరం లేకుండా కరోనా బాధితులను దోచుకుంటున్నారు. కరోనా కేసు ఆసుపత్రికి చేరితే చాలు.. ఆసుపత్రి సిబ్బందికి వసూళ్ల పండుగే, కరోనా పేరుతో అడ్మిట్ అయినా వారి దగ్గర అన్యాయంగా దోచుకోవడమే. ఒక వైపు మరణాలు ప్రజలవి. మరోవైపు పైసలు ఆసుపత్రులవి. కరోనా రోగులను నిలువునా దోచుకుంటున్న ఆసుపత్రులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ, వైద్యారోగ్యశాఖాధికారులతో కూడిన బృందం ఆరు ఆసుపత్రుల్లో అక్రమాలను గుర్తించింది. అనుమతి లేకున్నా కరోనాకు చికిత్స చేయడం, ఆరోగ్య శ్రీ కింద చికిత్స నిరాకరించడం, చివరికి రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడాన్ని గుర్తించిన బృందం ఎక్కడికక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని పల్నాడు ఆసుపత్రిలో ఓ రోగి నుంచి ఆరు రోజుల చికిత్సకు ఏకంగా రూ. 3.15 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. అలాగే, అంజిరెడ్డి ఆసుపత్రులలో ఒక రోగి నుంచి నాన్ క్రిటికల్ చికిత్స కోసం రూ. 1.50 లక్షలు వసూలు చేసినట్టు తేలడంతో ఆయా ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్టు గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పల్లె జాషువ తెలిపారు. రూ. 2,200కు సరఫరా చేసిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను పల్నాడు ఆసుపత్రి రూ. 10 వేలకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు.        

వెళ్లి పడుకో రా.. సిగ్గుండాలి! బీజేపీ నేత విష్ణుకు హీరో కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. తమిళ హీరో సిద్ధార్థ్ నుంచి ఆయనకు ఊహించని కౌంటర్ పడింది. విష్ణువర్ధన్ రెడ్డికి మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తారనే టాక్ ఉంది. ఏపీతో పాటు దేశంలో ఎక్కడ ఏం జరిగినా అతిగా స్పందిస్తారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హీరో సిద్ధార్థ్ ను టార్గెట్ చేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు రచ్చగా మారింది.  సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా సిద్ధార్థ్ స్పందించాడు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని చెప్పాడు. 'లేదురా.. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని రోజులుగా బీజేపీ నేతలపై సినీ హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో హీరో సిద్ధార్థ్ ను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తనను, తన  కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఇటీవలే సిద్ధార్థ్ ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన టార్గెట్ చేశారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చాడు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని  ఆరోపించారు.

దేశం లో కరోనా మోత.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోత.. 

అప్పుడెప్పుడో ప్లేగు వ్యాధి గురించి విన్నాం.. అది సృష్టించిన విలయతాండవం గురించి చదివాం.. ఇప్పుడు అదే తరహాలో ప్రపంచాన్ని మరణాలతో వణికిస్తున్న    కరోనా వైరస్ ని చూస్తున్నాం.. అనుభవిస్తున్నాం.. దానితో కాపురం కూడా చేస్తున్నాం.. దేశంలో , తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. బోయపాటి సినిమాలో విలన్ మాదిరి, అవును బయపెడుతాం.. మా రాజకీయం అంతే.. దమ్ముంటే మా ఎదురుగుండా వచ్చి ఢీకొట్టు.. అంటుంది కరోనా.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదేలే అంటూ విరుచుకుపడుతుంది.  దేశంలో గడిచిన 24 గంటల్లో  4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది మూడోసారి. ఇక మరణాలు వరుసగా పదో రోజు 3 వేలకుపైగా నమోదయ్యాయి. తాజాగా కొవిడ్‌తో పోరాడుతూ 3,915 మంది మరణించారు.   తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది.  గడిచిన 24 గంటల్లో 3,915 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2,34,083కి పెరిగింది.  కేసులతో పోల్చితే రికవరీలు కూడా భారీగానే ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో 3,31,507 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,76,12,351గా ఉంది.   ప్రస్తుతం దేశంలో 36,45,164 క్రియాశీల కేసులు ఉన్నాయి.  దేశంలో నిన్న  18,26,490 పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటి వరకూ దేశంలో 16,49,73,058 టీకాలు పంపిణీ చేశారు.   తెలంగాణలో..  నిన్న రాత్రి 8 గంటల వరకు 76,047 నమూనాలను పరీక్షించగా 5,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 46 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 9,122 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 73,851కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1104 కేసులు నమోదయ్యాయి.        

కొండాతో ఈటల కొత్త పార్టీ? అంతా ఆయన డైరెక్షనేనా.. 

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని, కొత్త పార్టీతో కేసీఆర్ ను ఎదుర్కొంటారనే టాక్ నడుస్తోంది. కొత్త పార్టీ కాకుండా ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా  ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మేడ్చల్‌లోని ఈటల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వీళ్లిద్దరు కలిసి పార్టీ పెట్టనున్నారని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాత్రం ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలేమీ లేవని తెలిపారు. ఈటల భార్య జమున తమకు బంధువని, కేవలం సానుభూతితో మాత్రమే ఆయనను కలవడానికి వచ్చానన్నారు. తాము చాలా కాలం నుంచి మిత్రులమని.. కొన్ని పాత విషయాలు గుర్తుచేసుకున్నామన్నారు. ఈటల తప్పేమీ చేయలేదని, అవమానానికి గురికావాల్సిన అవసరం లేదని కొండా చెప్పారు. కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. వాటిలో ఇదొకటని కొండా అభిప్రాయపడ్డారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ సమాజం ఆయన వెనుక ఉంటుందని విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఈటలతో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని కొండా చెబుతున్నా... కొత్త పార్టీ ఏర్పాటు గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది.  కేసీఆర్ సర్కార్ పై ఇప్పటికే పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. కొండా విశ్వేశర్ రెడ్డి కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఈటల రాజేందర్ మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో కేసీఆర్ ను గద్దే దించడమే లక్ష్యంగా వీళ్లు ముగ్గురు కలిసి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి.. ప్ర‌స్తుతం పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌. ఫుల్‌టైమ్ పీసీసీచీఫ్ చేయాల‌ని ఆయ‌న ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియ‌ర్లు రేవంత్‌రెడ్డికి అడుగ‌డుగునా మోకాలు అడ్డుతున్నారు. పీసీసీ పీఠం రేవంత్‌కు ద‌క్క‌కుండా చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ తీరుతో విసిగి వేసారి పోయిన రేవంత్‌.. సొంత పార్టీకి స‌న్నాహాలు చేస్తున్నార‌ని అంటున్నారు. అందులో భాగంగనే రేవంత్‌కు న‌మ్మ‌క‌మైన అనుచ‌రుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చారని అంటారు. అంతేకాదు అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీ ఆలోచ‌న చేస్తానంటూ ప్ర‌క‌టించారు కొండా.  తాజాగా జరుగుతున్న పరిణామాలతో రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో పాటు ఈట‌ల రాజేంద‌ర్ సైతం కేసీఆర్ వ్య‌తిరేక‌ రాజ‌కీయ శ‌క్తుల ఏకీక‌ర‌ణ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. తాను ఒక్క‌డిని ఒంట‌రిగా కేసీఆర్‌పై పోరాడే బ‌దులు.. రేవంత్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన నాయ‌కుడితో క‌లిసి క‌ట్టుగా దండెత్తితే బెట‌ర్ అని ఈటల అనుకుంటున్నార‌ట‌. గ‌తంలోనే రేవంత్‌రెడ్డి, ఈట‌ల ప‌ర‌స్ప‌రం ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని చెబుతున్నారు. ఇప్పుుడు కొండాతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై ఈటల చర్చిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీళ్లద్దరి భేటీ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉద్యమ సంఘాలు, ఇతర పార్టీల్లో తనకు మద్దతుగా ఉంటారని భావిస్తున్న వాళ్లతోనే రాజేందర్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.  కేసీఆర్ మామూలోడు కాదు. ఆర్థికంగా, రాజ‌కీయంగా, వ్యూహాల ప‌రంగా.. ఉద్దండుడు. అలాంటి కేసీఆర్‌ను  గ‌ద్దె దింపాలంటే.. పెద్ద ఎత్తున ఆర్థిక‌, రాజ‌కీయ‌ అండా, దండా అవ‌స‌రం. అందుకే రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. ఈ ముగ్గురు క‌లిసి కొత్త పార్టీతో కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్నారని అంటున్నారు ఈ ముగ్గురూ ఆర్థికంగా బాగా సంప‌న్నులే. డైన‌మిక్ లీడ‌ర్‌గా రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఊరూరా రేవంత‌న్న ఫ్యాన్స్ ఉన్నారు. కావ‌ల‌సినంత రాజ‌కీయ నేర్ప‌రిత‌నం, మాట‌కారి త‌నం రేవంత్ సొంతం. తెలంగాణ‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ‌మైన రెడ్లంతా రేవంత్‌కు ఫుల్ స‌పోర్ట్‌గా ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌క్కువేమీ కాదు. ఉద్య‌మ నాయ‌కుడిగా అన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌స్తుడు. సౌమ్యుడిగా మంచి పేరు. కేసీఆర్ చేతిలో అవ‌మానింప‌బ‌డ్డాడ‌నే సానుభూతి ఎలానూ ఉండ‌నే ఉంది. తెలంగాణ‌లో అధిక సంఖ్యాకులైన‌ బీసీ సామాజిక వ‌ర్గానికి ప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నాడు. వీరికి తోడు ఆర్థికంగా సుసంప‌న్నుడు,  మాజీ ముఖ్య‌మంత్రి రంగారెడ్డి వార‌సుడైన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలు క‌లిసి.. కొత్త పార్టీతో కేసీఆర్‌ను రాజ‌కీయంగా కుమ్మేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.  రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కలసి ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీలోకి.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్త నేతలు వ‌ల‌స రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు సైతం ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని.. స‌రైన స‌మ‌యంలో వారంతా రాజేంద‌ర్ వెంట నిలుస్తార‌ని అంటున్నారు. ఏకంగా ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలే ఈట‌ల స‌పోర్ట‌ర్స్‌గా ఉన్నార‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వారంతా ఈట‌ల నుంచి ఆర్థిక సాయం పొందిన వార‌ని.. వాళ్లంతా ఆ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. 

కరోనా చావు.. బంగారం పోవు..  

మీ ఇంట్లో ఎవరికైన కరోనా వచ్చిందా..? వాళ్ళకి సీరియస్ గా ఉంటే ఆసుపత్రిలో చేర్పించాలనుకుంటున్నారా..? అయితే వారి ఒంటి మీద ఏమైనా బంగారు ఆభరణాలు ఉంటే, ముందుగానే తీసుకోండి.. ఎందుకంటే..? ఆ బంగారాన్ని అమ్మితే కనీసం వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైనా ఎంతో అంతో ఆసరావుతుంది. అదేంటి అలా చెపుతున్నాడు అనుకుంటున్నారా..?  ప్రస్తుతం కరోనా హాస్పిటల్ లో జరుగుతున్న సంఘటలను చూస్తే అదే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళా కరోనా వచ్చిన వాళ్ళ వంటి మీదా తాళి ఉంటే అని.. సందేహం పడుతున్నారా.. ? తాళి కూడా తీకుకొండి అని కూడా చెప్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు.  కరోనా కాలంలో మనుషులు మరణానికి దగ్గర అవుతూ.. బంధాలకు దూరమవుతున్నారు. మరి కొంత మంది సచ్చినోడి సొమ్ము వచినంతనే సాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు నీచమైన దారుణానికి వడిగడుతున్నారు. మానవత్వాన్ని మరిచిన మృగాలు అవుతున్నారు. ఒక వైపు కరోనా వచ్చిన వాళ్ళని హాస్పిటల్ సిబ్బంది ఆర్థికంగా పట్టి పీడిస్తుంటే.. హాస్పిటల్ లో సేవలు అందించే కొతం మంది ఆ పేషేంట్స్ వంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రిలో కరోనా శవాలను కూడా కుటుంబాలకు అప్పగించడం లేదని మరోవైపు ప్రచారం జరుగుతుంది.  పుంగనూరు కు  చెందిన ఓ బాధితురాలు ఈ నెల 3వ తేదీన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. మరుసటి రోజు మృతి చెందారు. మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం తాళిబొట్టు కనిపించలేదు. బాధితుల బంధువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో తిరుపతిలోని స్విమ్స్‌, రుయాతో పాటు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతుల శరీరాలపై ఉన్న ఆభరణాలు మాయం అయ్యాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు సైతం నమోదయ్యాయి. రెండో కొవిడ్‌ అలలో మృతుల సంఖ్య పెరుగుతున్నందున ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విషయంపై ఎలాంటి విధి విధానాలు పాటించడం లేదు. కొవిడ్‌ బారినపడ్డారని తెలియగానే బాధితులు భయాందోళనలకు గురవుతూ వెంటనే ఆస్పత్రికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తమ శరీరంపైౖ ఎలాంటి విలువైన ఆభరణాలు ఉన్నాయోనని గుర్తించే పరిస్థితి ఉండదు. ఆస్పత్రిలో చేరే వారికి కొంత దూరంగా బంధువులు ఉన్నప్పటికీ ఆభరణాలు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. తీరా మృతి చెందాక మృతదేహాన్ని పూర్తిగా కప్పి జిప్‌ బ్యాగ్‌లో పెట్టి దహన సంస్కారాలకు తరలిస్తారు.           పర్యవేక్షణ..        రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో సుమారు 900 మంది కొవిడ్‌ బాధితులు వైద్యం పొందుతున్నారు. వారి పడకల వరకు వైద్యులు, నర్సులు, అటెండర్లు వెళ్తుంటారు. బాధితుల శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి రక్షణ ఇస్తున్నామనే వ్యవస్థ అక్కడ కన్పించడం లేదు. కనీసం ఆస్పత్రిలో చేరే సమయంలో అయినా విలువైన ఆభరణాలు బంధువులకు అప్పగించాలని చెప్పడం, ఒక వేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రత్యేకంగా నమోదు చేయడం వంటివి చేయడం లేదు. ఆభరణాలు మాయం అయితే అందుకు దోషులు ఎవరని నిర్ధరించేందుకు ఎలాంటి ఆధారాలు అక్కడ లభించని పరిస్థితి.               స్విమ్స్‌లో సీసీ కెమెరాలే దిక్కు          గతంలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలు స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకున్నాయి. చివరకు ముగ్గురు స్విమ్స్‌ సిబ్బందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదు అందలేదు. అన్ని వార్డుల్లో ఉన్న సీసీ కెమెరాలు దొంగలను పట్టిస్తాయనే నమ్మకంతో స్విమ్స్‌ యాజమాన్యం ఉంది. ఇదివరకటిలా బాధితులు చేరే సమయంలోనే ఆభరణాలు నమోదు చేసి.. డిశ్ఛార్జి సమయంలో అప్పగించే వ్యవస్థ ప్రస్తుతం కన్పించడం లేదు. ప్రస్తుతం ఆక్సిజన్‌ పడకల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండా చేరిపోతున్నారు.                   అలాంటి ఫిర్యాదులు రాలేదు..     మరోవైపు స్విమ్స్‌ కరోనా ఆస్పత్రిలో బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు  ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్స్ లో  సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు మృతదేహాల వద్దకు ఎవరు రాలేని పరిస్థితి ఉందని. కరోనా వల్ల చనిపోయిన పది నిమిషాలకే ఆ శవాలను కుటుంబ సభ్యులకు రెండు గంటల్లోనే  అప్పగిస్తున్నాం అని, చేర్చుకునే సమయంలోనే కేసు షీటులో ఆభరణాల గురించి నమోదు చేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం చెపుతుంది.     

తెలంగాణలో లాక్ డౌన్! సీఎం కేసీఆర్ క్లారిటీ...

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సిజన్ రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని ద్రుష్టికి తెచ్చారు.  మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్ మీద ఆక్సిజన్ వాక్సీన్ రెమిడిసివర్ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు.  సీఎం కెసిఆర్ విజ్జప్తితో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధాని కెసిఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సిజన్ వాక్సీన్ రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సిఎం కు హామీ ఇచ్చారు. ఆక్సిజన్ ను కర్నాటక తమిళనాడులనుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. కరోనా పరిస్థితుల పై గురువారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నిసిఎం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సిఎం సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది ఇంకా ఎంతకావలి? వాక్సిన్ లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం ? రెమిడిసివర్ మందు ఏ మేరకు సప్లయి జరుగుతున్నది రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను ఆక్సిజన్ బెడ్ల లభ్యత వంటి విషయాలమీద పూర్తిస్థాయిలో చర్చించారు.  రెమిడిసివర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన..  సిఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో  ఇప్పటివరకు 9500 ఆక్సిజన్ బెడ్లు వున్నాయని వాటిని హైద్రాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరాకోసం వొక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యునిటీ హాస్పటల్స్ ఏరియా ఆస్పటల్స్ ల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయివేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షాయాభైయారు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పయివేలు (85 శాతం)  కోలుకున్నారని అధికారులు సిఎం కు వివరించారు.  రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సిఎం తెలిపారు. దీనికి  డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి  పాజిటివ్ కేసుల వివరాలు కోలుకున్న వారి వివరాలు హోం క్వారెంటైన్ లో ఎంతమంది వున్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రయివేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.  మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సిఎం ఆదేశించారు. ఆక్సిజన్  సరఫరా గురించి సమీక్షించిన సిఎం రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్ చంద్రశేఖర్ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీసారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం సూచించారు. పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సిఎం కేసీఆర్  కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ....కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

తిరుపతి ఓటమిపై బ్లేమ్ గేమ్! పవన్ ను టార్గెట్ చేసిన సోము టీమ్ 

పాయే. ప‌రువంతా పాయే. ఇచ్చిన బిల్డ‌ప్ అంతా నీరుగారిపాయే. జాతీయ పార్టీ అని ఫోజులు కొట్టారు. మోదీ బొమ్మ చూపిస్తూ చెల‌రేగిపోయారు. జ‌న‌సేన త‌మ‌కే స‌పోర్ట్ అంటూ ఊరేగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌తో ప‌వ‌ర్‌లోకి వ‌స్తామంటూ ఊద‌ర‌గొట్టారు. రిటైర్డ్ ఐఏఎస్‌ను తీసుకొచ్చి కాషాయ జెండా ఎగ‌రేయాల‌ని క‌ల‌లు గ‌న్నారు. ఇంతా చేస్తే.. అంత హంగామా సృష్టిస్తే.. తిరుప‌తితో బీజేపీ ప‌రువు బ‌జారు పాల‌య్యే. కొండంత రాగం తీసిన క‌మ‌ల‌నాథుల‌కు డిపాజిట్లు కూడా రాక‌పాయే. ఏపీలో బీజేపీ బ‌ల‌మెంతో తేలిపాయే. అందుకే ఇప్పుడు అన్నీ మూసుకొని.. మూటాముల్లె స‌ర్దుకొని.. త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలీక‌.. స‌తమ‌త‌మ‌వుతోంది కాషాయం పార్టీ.  తిరుప‌తి ఘోర ప‌రాభ‌వం నుంచి బీజేపీ ఇప్ప‌ట్లో బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌చ్చు. తిరుప‌తి త‌మ‌కు కాస్తోకూస్తో ఉనికి ఉన్న‌ ఆధ్యాత్మిక న‌గ‌రం కావ‌డం.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డం.. వ‌ల్ల గెలుపు ఈజీ అనుకున్నారు క‌మ‌ల‌నాథులు. కానీ, ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు బీజేపీని బండ‌కేసి కొట్టినంత ప‌ని చేయ‌డంతో ఇప్పుడు వారంతా ల‌బోదిబోమంటున్నారు. 50 వేల ఓట్లు తెచ్చుకోవ‌డ‌మే జాతీయ పార్టీకి అతిక‌ష్ట‌మైంది. ఇదంతా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు వైఫ‌ల్య‌మేన‌ని అంటున్నారు. సోము వీర్రాజు మొద‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నే టాక్ ఉంది. సోముతో పాటు పార్టీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న ఓవరాక్షన్ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ బీజేపీలో జరుగుతోంది. అధికార పార్టీ  వైఫల్యాలపై మాట్లాడకుండా ఎంతసేపు టీడీపీపై విమర్శలు చేయడమే వీరి పనిగా ఉంది. అదే ఇప్పుడు పార్టీకి మైనస్ గా మారిందని, తిరుప‌తిలో బీజేపీకి డిపాజిట్ కూడా గ‌ల్లంతైంద‌ని అంటున్నారు.  తిరుపతి  దారుణ ప‌రాభ‌వం చూసి అధిష్టానం వీర్రాజుపై ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో తిరుప‌తి ప‌రాభ‌వ బారాన్ని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌పై తోసేసే ప్ర‌య‌త్నం చేస్తోంది క‌మ‌ల‌ద‌ళం. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయామంటూ కొత్త రాగం తీస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక‌లో అలా క‌థ‌నం కూడా ప్ర‌చురిత‌మైంది. పవన్ ను టార్గెట్ చేస్తు సాక్షిలో వచ్చిన  కథనం వెనక సోము వీర్రాజు, సునీల్ దియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి పాత్ర ఉందంటున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.   "న‌మ్మితే న‌ట్టేట ముంచార‌ట‌. భావి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా ద్రోహం చేశార‌ట‌. చంద్ర‌బాబుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒప్పందం చేసుకున్నార‌ట‌. బీజేపీకి వెన్నుపోటు పొడిచార‌ట‌. అందుకే, వారం రోజులు ప్ర‌చారం చేస్తాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక్క రోజు ప్ర‌చారంతోనే పేక‌ప్ చెప్పాడ‌ట‌. తిరుప‌తిలో జ‌న‌సేన ఓట్లు బీజేపీకి ప‌డ‌లేద‌ట‌." ఇలా అంతా మీరే చేశారంటూ బీజేపీ ప్ర‌చారం చేస్తోంది. తిరుప‌తి ఓట‌మికి జ‌న‌సేన‌, ప‌వ‌న్‌క‌ల్యాణే కార‌ణ‌మంటూ కోడై కూస్తోంది. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుపైనా అభాండం మోపుతోంది. అవును, వాళ్లిద్ద‌రూ ఒక‌ట‌య్యారంటూ మైండ్‌గేమ్ మొద‌లుపెట్టారు క‌మ‌ల‌నాథులు.  తిరుప‌తిలో బీజేపీకి 50వేల వ‌ర‌కూ ఓట్లు వ‌చ్చాయి. అవ‌న్నీ, జ‌న‌సేన ఓట్లేన‌నేది జ‌నాల మాట‌. కానీ, బీజేపీ మాత్రం జ‌న‌సేన ఓట్లు త‌మ‌కు బ‌దిలీ కాలేద‌ని అంటోంది. త‌మ‌కు ప‌డాల్సిన ఓట్లే ప‌డ్డాయి కానీ, జ‌న‌సేన శ్రేణులు త‌మ‌కు అంత‌గా స‌హ‌క‌రించ‌లేద‌ని ఆడిపోసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దియోధ‌ర్‌ను.. వ‌కీల్‌సాబ్ సినిమా ప్ర‌మోష‌న్‌కు వాడుకున్నారు కానీ, త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారానికి  మాత్రం వ‌కీల్‌సాబ్ డుమ్మా కొట్టాడంటూ కాక రేపుతున్నారు. వారం రోజుల‌ని మాటిచ్చి.. ఒక్క రోజు మాత్ర‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్ర‌చారం చేయ‌డానికి చంద్ర‌బాబుతో కుదిరిన ఒప్పందమే కార‌ణ‌మంటూ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తోంది. ఇలా తిరుప‌తి ఓట‌మిని జ‌న‌సేన ఖాతాలో క‌లిపేసేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది క‌మ‌లం పార్టీ. బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను జ‌నాలు అస‌హ్యించుకుంటున్నారు. అస‌లు, జ‌న‌సేన కార‌ణంగానే తిరుప‌తిలో టీడీపీ రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. జ‌న‌సేనే క‌నుక టీడీపీతో చేతులు క‌లిపి ఉంటే.. తిరుప‌తి ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఇటు చంద్ర‌బాబు నాయ‌క‌త్వం, అటు ప‌వ‌న్ ఛ‌రిస్మా క‌లిస్తే.. ప్ర‌భంజ‌న‌మే ఉండేదంటున్నారు. ఏపీలో పూర్తిగా తుడుచి పెట్టుకుపోయే ప‌రిస్థితికి దిగ‌జారి పోయిన బీజేపీ.. ఆ అవ‌మాన‌భారం నుంచి త‌ప్పించుకోడానికి.. జ‌న‌సేన స‌హ‌క‌రించ‌లేద‌ని, చంద్ర‌బాబుతో ఒప్పందం కుదిరింద‌ని.. సొల్లు వాగుడు వాగుతోందని అంటున్నారు. బీజేపీ న‌వ్యాంధ్ర‌కు తీర‌ని అన్యాయం చేసింది. బీజేపీ.. వైసీపీకి లోపాయికారిగా స‌హ‌క‌రిస్తోంది. ఢిల్లీలో ఆ రెండు పార్టీలు చ‌ట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. పార్ల‌మెంట్‌లో ప‌ర‌స్ప‌రం మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాయి. ఆ రెండూ.. దొందుదొందేన‌ని ఆంధ్రులంద‌రికీ తెలుసు. అందుకే, ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. బీజేపీని దారుణంగా తిర‌ష్క‌రిస్తున్నారు ఓట‌ర్లు. ఆఖ‌రికి.. మంచి ప‌వ‌ర్ ఉన్న ప‌వ‌ర్ స్టార్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. బీజేపీని ఆద‌రించ‌కుండా గ‌ట్టి షాక్ ఇచ్చారు తిరుప‌తి ప్ర‌జ‌లు.  పార్టీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు అట్ట‌ర్ ఫ్లాప్‌. తిరుప‌తి ఎన్నిక‌ల ఓట‌మితో బీజేపీకి భ‌విష్య‌త్తుపై ఆశ‌లు లేవు. పోయిన ప‌రువు ఎలాగూ తిరిగిరాదు.. ఏపీలో కాషాయం పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు. ఉన్న కాస్తంత ఇమేజ్ కూడా ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారంతో మంట‌గ‌లుస్తోంది. క‌మ‌ల‌నాథులు ఇప్ప‌టికైనా ఇలాంటి మైండ్‌గేమ్‌కు పుల్‌స్టాప్ పెడితే ఆ పార్టీకే మంచిది. లేదంటే, ఏపీలో బీజేపీకి మ‌రిన్ని దారుణ ప‌రాభ‌వాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

వ్యాక్సిన్ కూ కుల గజ్జి! అందుకే కొనడంలేదా జగన్ రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. అధికారికంగా సర్కార్ చెబుతున్న లెక్కలకంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కరోనా రోగుల మరణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ప్రచారంతో ఏపీ జనాలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని కోరుతున్నారు. కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను కట్టడి చేసిన దేశాలన్ని వ్యాక్సినేషన్ తోనే సక్సెస్ అయ్యాయి. అందుకే భారత్ లోనే వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. మోడీ సర్కార్ కూడా వ్యాక్సినేషన్ పైనే ఫోకస్ చేసింది. మే1 నుంచి మూడో దశలో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టీకాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. కాని ప్రమాదకర వైరస్ వ్యాప్తిలో ఉన్న ఏపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పుడే టీకాలు ఇవ్వలేమంటూ  చేతులెత్తేసింది. ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీకా కోసం ఎదురు చూస్తున్న జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఇస్తున్నవి గాక రాష్ట్రం సొంతగా కొనుగోలు చేయడానికి 13.5లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని, ఇందు కోసం రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా 2 వేల 5 వందల కోట్లను వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. దీంతో ఐదు కోట్లకు పైగా జనాలున్న ఏపీకి 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏపీలో 5 కోట్ల 26 లక్షల మంది ఉన్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలి. అంటే ఏపీలో టీకా ఇవ్వాల్సిన వాళ్లే దాదాపు మూడున్నర కోట్ల మంది ఉంటారని అంచనా. మే ఐదవ తేది వరకు ఏపీలో కేవలం 69 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో 52.5 లక్షల మందికి ఫస్ట్ డోస్ట్ ఇవ్వగా.. 16.5 లక్షల మందికి సెకండ్ డోస్ కంప్లీట్ అయింది. ఈ లెక్కన ఇంకా 2.6 కోట్ల మందికి ఫస్ట్ డోస్.. 2.9 కోట్ల మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ఏపీకి ఇంకా దాదాపు ఐదున్నర కోట్ల వ్యాక్సిన్ కావాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ అవసరం ఉన్నా ఏపీ సర్కార్ మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు.  దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  ఏపీకి చెందిన కృష్ణ ఎల్లాకు చెందిన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థలోనే కోవాగ్జిన్ తయారవుతుంది. అయినా కొవాగ్జిన్ కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి సర్కార్. తెలంగాణ సర్కార్ మాత్రం కొవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్ యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరుపుతోంది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ... కంపెనీకి వెళ్లి మరీ ఎండీతో చర్చలు జరిపారు. దేశ వ్యాప్తంగా కోవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ కే ఎక్కువ డిమాండ్ ఉంది. కొవాగ్జిన్ కోసం ప్రైవేట్ సంస్థలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఇతర రాష్ట్రాలు  పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడంతో పాటు త్వరగా పంపిణి చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. కాని ఆంధ్ర సర్కార్ మాత్రం చోద్యం చూస్తోంది. దీంతో ఏపీ సీఎంకు రాజకీయం, ఓటు పథకాలు తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్క లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  తెలుగు వ్యక్తికి చెందిన ఫార్మా సంస్థలో తయారవుతున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం జగన్ రెడ్డి సర్కార్ భారీగా ఆర్డర్లు ఇవ్వకపోవడంపై మరో చర్చ కూడా జరుగుతోంది. భారత్ బయోటెక్ ఎండీ కమ్మ కావడమే ఇందుకు కారణమంటూ సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. కమ్మ వ్యక్తి సంస్థలో తయారైనందువల్లే కొవాగ్జిన్ కు జగన్ రెడ్డి సర్కార్ ఆర్డర్లు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ తో ఉన్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లోని రెడ్డీస్ ల్యాబ్ లోనే ఆ టీకాలను తయారు చేస్తున్నారు. రెడ్డీస్ లో  ఉత్పత్తి అయ్యే స్పుత్నిక్ టీకా జూన్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే కోవాగ్జిన్ వద్దనుకుంటున్న ముఖ్యమంత్రి... రెడ్డీస్ లో రూపొందుతున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసమే మూడో దశ వ్యాక్సినేషన్ ను జూన్ నెలకు వాయిదా వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కమ్మ వ్యక్తి సంస్థ నుంచి తీసుకోకుండా రెడ్డీస్ లో తయారైన వ్యాక్సిన్ కోసమే జగన్ రెడ్డి ఇలా చేస్తున్నారని అంటున్నారు.  వ్యాక్సిన్ విషయంలో జగన్ సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలంతా ప్రాణాలు కోపాడుకోవాలని ఆరాటపడుతుంటే... ప్రభుత్వం రాజకీయం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ పైనా కుల రాజకీయం చేయడం ఏంటని మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కోసం నెల రోజులు ఆగితే... అప్పటివరకు కరోనా కాటుకు ఎవరైనా బలైతే బాధ్యులు ఎవరిని నిలదీస్తున్నారు.  ఇప్పటికైనా కుల. కక్ష రాజకీయాలు మాని... రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు తెప్పించాలని ఏపీ ప్రజలు, విపక్షాలు కోరుతున్నాయి. లేదంటే కరోనా చావులకు జగన్ సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు .

అన్నను రోకలి బండతో కొట్టి  చంపిన తమ్ముడు.. 

అది రంగా రెడ్డి జిల్లా. కందుకూరు మండలం. మురళి నగర్. అతని పేరు వడ్త్యవాత్ బాల్ రామ్. అతనికి ఇద్దరు పెళ్ళాలు. మొదటి భార్య పేరు గోరి, ఆమె 8 సంవత్సరాలు క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. కట్ చేస్తే..  బాల్ రామ్. సరికోండకు చెందిన జయలక్ష్మి ని వివాహం చేసుకొన్నాడు. వీరికి 3 సంవత్సరాల బాలుడు (దేవరాజ్) ఉన్నాడు. కాపురం సజావుగా జరుగుతుందని     కందుకూరు సీఐ కృషంరాజు తెలిపిన కథనం ప్రకారం.. వడ్త్యవాత్ బాల్ రామ్ ఈ నెల 2వ తేదీన బాల్ రామ్ మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను ఇంట్లో ఉండోదాన్ని గొడవ చేశాడు.దీంతో గ్రామ సమీపన ఉన్న పల్లె ప్రకృతి వణంలోనే జయలక్ష్మి పిల్లలతో కలిసి సాయంత్రం వరకు ఉండగా.. రాత్రి తన తోడి కోడలు.. వారిని ఇంటికి తీసుకువచ్చింది. అయితే, మంగళవారం జయలక్ష్మి.. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో మాట్లాడానికి బాల్ రామ్‌ను కోరగా.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చాడు. భార్యను ఎందుకు కొడుతున్నావని బాల్ రామ్ అత్తమామలు అడగా, అత్త మామలని బూతు మాటలు తిట్టడంతో పాటు.. బాల్ రామ్ సొంత తమ్ముడు వడ్త్య వాత్ మోహన్ ను  కూడా బూతులు తిడుతూ.. కొట్టడానికి రావడంతో మోహన్ ప్రక్కనే ఉన్న రోకలి బండ తీసుకొని బాల్ రామ్ (అన్న)ను తలపై కొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటేనే బాల్ రామ్‌ను 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం (తెల్లవారుజామున) 2:43 సమయంలో చనిపోయడాని డాక్టర్లు తెలిపారు.    

జగన్ పై  కోర్టు ఫైర్.. 

మరోసారి ఏపీ హై కోర్టు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా వున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో పడకల లభ్యతతో పాటు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఫీజుల వసూళ్ల వంటి అంశాల‌పై  హైకోర్టులో విచారణ కొన‌సాగుతోంది. సామాజిక కార్య‌క‌ర్త తోట సురేశ్ బాబుతో పాటు ప‌లువురు వేసిన పిటిష‌న్లు విచార‌ణ‌కు వ‌చ్చాయి.   క‌రోనా నియంత్ర‌ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవట్లేద‌ని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న ప్ర‌భుత్వం  అఫిడవిట్‌లో పేర్కొంద‌ని, ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని  హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో వివ‌రించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ కోసం తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది హైకోర్టుకు వివ‌రిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న.. తమకు ఏం పట్టనట్లు కూర్చున్న సీఎం లు ఇద్దరే ఇద్దరు. ఒకరు జగన్ రెడ్డి మరొకరు కేసీఆర్ దొర. ఎన్ని ఏపీలో కరోనా పేషంట్ కి పాడైన ఆహరం..   శ్రీకాకుళం జిల్లాలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో వసతుల లేమిపై వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) మురళీకృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కరోనా చికిత్సకు డబ్బు చెల్లించి తన తల్లితో పాటు తాను కూడా ఆస్పత్రిలో చేరారని.. సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు. పాడైన ఆహారం పెడుతున్నారని.. పదేపదే అడిగినా వాటర్‌ బాటిల్‌ కూడా  ఇవ్వడం లేదని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేరినప్పటి నుంచి డ్యూటీ డాక్టర్‌ను చూడలేదని చెప్పారు.   కానూరు లో ఆక్సిజన్ అందక..  కానూరు పరిధిలోని టైమ్‌ ఆసుత్రిలో కరోనా బాధితులకు అందించే ఆక్సిజన్‌ నిండుకోవడంతో బుధవారం రాత్రి ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 40 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 30 మందికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఉంది. ఆక్సిజన్‌ అందించాల్సిన ఏజెన్సీ బుధవారం సరఫరా చేయలేకపోయింది. రోజూ ఇక్కడ 80 ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు బుధవారం సాయంత్రం వరకు వచ్చేలా ఉండడంతో బాధితుల్లో ఆందోళన చెలరేగింది. ఆసుపత్రి వర్గాలు ఎంతప్రయత్నించినా సాయంత్రం వరకు దొరకలేదు. చికిత్స పొందుతున్న 30 మందికి రాత్రి 9 గంటల వరకు ఆక్సిజన్‌ నిల్వలు సరిపోతాయి. ఆ తరువాత రాకపోతే పరిస్థితి ఏమిటి అని తర్జనభర్జనలు పడడం మొదలు పెట్టారు. కానీ ఫలితం కనపడలేదు. దీంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.   

బీజేపీ మంత్రి పై దాడి.. 

వివాదాల మధ్య విమర్శల మధ్య, ఘర్షణల మధ్య దేశంలో  5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రలో ఒక ఎత్తు  అయితే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమత బెనర్జీ ఒక వైపు, బెంగాల్ బీజేపీ నాయకత్వం, కేంద్ర బీజేపీ పెద్ద తలకాయలు ఒక వైపు. బెంగాల్ మాది అంటే మాదని గొప్పలు చెప్పుకున్నారు. చివరికి బెంగాల్ ప్రజలు మమతేకే పట్టం కట్టారు.  ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయినా బెంగాల్ నిత్యం ఏదో ఒక చోట హింసకాండ కొనసాగుతుంది. ఎన్నికల సమయం లో సహజంగానే ఏ రాష్ట్రము లో నైనా ఇరుపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ బెంగాల్ లో మాత్రం ఎన్నికలు ముగిశాక కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది అక్కడి స్థానికులను.   దాడులు అంటే ఏ కార్యకర్త్య పైనో, గల్లీ లీడర్ పైనో కాదు, ఏకంగా ఢిల్లీ నాయకులపైనే జరుగుతుండడడం గమనార్హం. తాజాగా బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయని మురళీధరన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. కాగా, బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుసగా హింస చోటుచేసుకోవడం పట్ల బెంగాల్ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.