ఇక్కడ ఒకలా.. ఢిల్లీకి మరోలా! కొవాగ్జిన్ పై జగన్ డబుల్ గేమ్ 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం  ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించిన విషయాన్ని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. దీని ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. కొవాగ్జిన్ పై ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కల్లోల సమయంలోనూ దరిద్రపు కులాలు, చుట్టరికాలను లింకు కలుపుతూ మాట్లాడం వివాదాస్పదమైంది. భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు.. వాళ్లకు అంతా తెలుసంటూ మాట్లాడారు జగన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఏంఆర్ తో  భాగస్వామ్యం లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను కొంత మంది వ్యక్తులకు ఆపాదించి  అత్యంత చౌకబారు విమర్శలు జగన్ రెడ్డి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ సీఎం వ్యాఖ్యలు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దిగజార్చడమేననే విమర్శలు వస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో  కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం..  కొవాగ్జీన్ టీకాను భారత్ బయోటెక్, ఐసీఏంఆర్ కలిసి ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యం  విధానంలో అభివృద్ధి చేశాయి. ఒప్పందం ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ తమ నికర అమ్మకాల పై 5% రాయల్టీ ఐసీఏంఆర్ కు చెల్లించాలి. వ్యాక్సిన్ తయారి మేధోసంపత్తి హక్కులు భారత్ బయోటెక్, ఐసీఏంఆర్ లు సంయుక్తంగా పంచుకునే విధంగా ఉభయ సంస్థల మధ్య ముందస్తు అంగీకరం ఉంది. అయితే భారత్ బయోటెక్ కి ఐసీఏంఆర్ నిధులు సమకూర్చలేదు. కాని 22 చోట్ల మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ 28500 మంది పై జరపడానికి నిధులు ఇచ్చింది. కొవాగ్జీన్ మరియు కోవిషీల్డ్  పై వివిధ పరిశోధనల కోసం ఐసీఏంఆర్ 11  కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రధాని మోడీకి రాసిన లేఖలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ఐసీఏంఆర్ ద్వారా మేధోసంపత్తి సహకారంతో సాధ్యమైనంత ఏక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని కోరారు. ఇదే మంచిదే కాని కొంత మంది సంబంధం లేని వ్యక్తులకు భారత్ బయోటెక్ ని ఆపాదించి ఎందుకు ప్రకటనలు చేశారన్నది ఆయన తెలపాల్సి ఉంది. జగన్ లేఖ రాసేటప్పటికే  కేంద్ర ప్రభుత్వం కోవాగ్జీన్ ఉత్పత్తి పెంచడానికి సాంకేతికంగా అనుభవం ఉన్న ృ The Department of Biotechnology (DBT) సహకారంతో ఇప్పటికే పని మొదలు పెట్టింది, హైదరాబాద్ లోని శాంత బయోటెక్ తో కూడా ఇప్పటికే భారత్ బయోటెక్ టీకాల ఉత్పత్తి పెంచడానికి  కలిసి ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఇవన్ని తెలిసి కూడా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై ప్రధానికి జగన్ లేఖ రాశారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు  మీడియా ముందు మీరు ఒకలా మాట్లాడుతూ.. ఇంగ్లీషు లేఖలు మరియ ట్వీట్లు మరోలా చేస్తూ ఢిల్లీకి ఇంకో రకంగా లేఖలు రాస్తూ జగన్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారనే టాక్ వస్తోంది.  మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీకాలు ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు గ్లోబల్ టెండర్లు వెళతామని సీఎం చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే గ్లోబల్ టెండర్లకి ఎలా వెళతారో ఎవరికీ అర్ధం కావడం లేదు. 45 ఏండ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రా వాట నిష్పత్తి ప్రకారం టీకాలు ఇస్తుంది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు నేరుగా కంపెనీల టీకాల మొత్తం ఉత్పత్తిలో 50%  కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే డబ్బున్న రాష్ట్రాలు ముందు చూపుతో అధిక టీకాలు కొనుగోలు  చేస్తే, ముందు చూపు లేని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం అక్కడి ప్రజలకు శాపం కాకుడదని కేంద్ర ప్రభుత్వం 18 - 44 సంవత్సరాల వయస్సు దేశంలో ఉన్న  ప్రజల ఆయా రాష్ట్రం నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు వాటా కల్పించినది. ఇప్పుడు డబ్బు చెల్లించి టీకాలు కంపెనీల ఉత్పత్తి లో మన వాటా తెచ్చుకోవాలి. అయితే తమకు వాటాకు సంబంధించిన వ్యాక్సిన్ కోసం ముందస్తుగా ఆర్డరు చేయలేకపోయింది జగన్ రెడ్డి సర్కార్. అడ్వాన్స్ చెల్లింపులు ద్వారా టీకాల డెలివరీ షెడ్యూల్ కోసం అగ్రిమెంట్ చేసుకోకుండా కాలయాపన చేసి, ఇప్పుడు అటొక రాయి - ఇటొక రాయి వేసి ఇంకా సమయం వృధా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ చెల్లింపులు ఎక్కడ అని విపక్షాలు ప్రశ్నించడంతో.. జగన్ సర్కార్ అడ్డంగా బుక్కై పోయింది. దీంతో తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. పదే పదే పాడిందే పాటరా పాసిపల్ల దాసరి అన్నట్లుగా.. కులాల కుంపటి రాజేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. తన దిగజారుడు చర్యలతో అచేతన ముఖ్యమంత్రి గా జగన్మోహనరెడ్డి మిగిలారనే ప్రచారం జరుగుతోంది.   

యజ్ఞం చేస్తే కొవిడ్ మాయం.. బీజేపీ మంత్రి కొత్త మంత్రం

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇండియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే కొవిడ్ విజృంభించిందని వైద్య సంస్థలు చెబుతున్నాయి. అయినా మన నేతల తీరు మారడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ పై చిల్లర మాటలు మాట్లాడుతూ జనాలను గందరగోళ పరుస్తున్నారి.  కొవిడ్ మహమ్మారికి సంబంధించి మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండేందుకు  నాలుగు రోజుల పాటు యజ్ఞం నిర్వహించాలని ఆమె సూచించారు. ఇండోర్ నగరంలో కొవిడ్ కేర్ సెంటరును ప్రారంభించిన మంత్రి ఉషాఠాకూర్ మాట్లాడుతూ  ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయండి.. ఇది యజ్ఞ చికిత్స. పూర్వ కాలంలో, మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి యజ్ఞ చికిత్స చేసేవారు.. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తోంది, దీనివల్ల కొవిడ్ మూడో వేవ్ భారతదేశాన్ని తాకదు.. అని బీజేపీ మంత్రి ఉషా వ్యాఖ్యానించారు.  మంత్రి ఉషా ఇటీవల ఇండోర్ విమానాశ్రయంలో విగ్రహం ముందు కర్మలు చేశారు. కరోనా పోవాలంటూ ఈ కర్మలు చేశానని చెప్పారు. గతంలో మంత్రి కొవిడ్ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు మాస్కు ధరించలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా యజ్ఞం చేస్తో కోవిడ్ పోతుందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జనాలు ఫైరవుతున్నారు. ఇలాంటి నేతల వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వాక్సిన్ బ్లాక్ దందా.. డోసుకు రూ. 600 

దేశం అంత కరోనా వాక్సిన్ లేక జనాలు అవస్థలు పడుతూ. ఎలాగైనా  తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రుల ముందు పడిగాపులు కాస్తున్నారు. వాక్సిన్ లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ సరఫరా చేయలేదని చెపుతున్నాయి. కొంత మంది వ్యక్తులు వాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో బ్లాక్ దందా  చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా విజయవాడలో ఓ ప్రైవేట్ వైద్యుడు వాక్సిన్ వేస్తూ. ఒక వ్యాక్సిన్ డోస్ కు రూ .600 అంటూ కారులోనే చికారు చేస్తే టీకాలు వేస్తున్నాడు.   కొవిడ్ టీకాల కొరతను అడ్డగోలుగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడో వైద్యుడు. ఒక్కో డోసుకు ధరను నిర్ణయించి కారులోనే దుకాణం తెరిచేశాడు. విజయవాడలో నిన్న వెలుగుచూసిందీ ఘటన. నగరంలోని సత్యనారాయణపురం  గిరి వీధిలో ఓ వైద్యుడు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ కారులోనే టీకాలు వేస్తున్నాడు. విషయం తన దృష్టికి రావడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి అక్కడికి చేరుకుని వైద్యుడిని నిలదీయడంతో కారుతో సహా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన కార్పొరేటర్ బైక్‌పై కారును వెంబడించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో కారును ఆపి వైద్యుడిని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కారును తనిఖీ చేశారు. అందులో టీకా వేయించుకున్న ముగ్గురు భీమవరం వ్యక్తులు కనిపించారు. అలాగే కొన్ని సూదులు, ఇంజక్షన్లు లభించాయి. కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించారు. జి. కొండూరులో పనిచేసే ఓ వైద్యుడు తమతోపాటు మరికొందరికి టీకాలు వేసినట్టు వారు చెప్పారు. కారులో వ్యాక్సిన్లు కనిపించకపోవడం, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు వారి ముగ్గురితో పాటు వైద్యుడిని కూడా వదిలిపెట్టేశారు. ఒక వైపు ప్రజలు ప్రాణ భయం తో భయపడుతుంటే.. కొంత మంది వ్యక్తులు వాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో బ్లాక్ దందా  చేస్తున్నారు. అసలు ప్రభుత్వాల దగ్గర లేని వాక్సిన్ వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది ప్రజలు ఆలోచిస్తూ ఆందోనళ పడుతున్నారు.   

కొడుకుని చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా..?  

ఇప్పుడు ఉన్న సమాజం లో డబ్బు మనిషిని ఎంతకైనా దిగరాజూస్తుంది. డబ్బుకి  ఫీలింగ్ ఉండవ్   ఎమోషన్స్ ఉండవ్, ఓన్లీ క్యాలుకులేషన్ మాత్రమే ఉంటాయి. మద్యం, డబ్బు మత్తులో మనిషి ఎంతటికైనా తెగిస్తాడు. ఎవరినైనా కడతేరుస్తాడు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి. గుమ్మడిదల మండలం. కొత్తపల్లి గ్రామం. ఆ దంపతులు గడ్డమీది శ్రీనివాస్‌గౌడ్‌, పద్మ, వారి కుమారుడు సాయికిరణ్ గౌడ్.  వయసు (23) సంవత్సరాలు. అందరూ కూలి పనులు చేస్తూ జీవితం కొనసాగిస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం ముగ్గురూ పనులు చేసుకుని రాత్రి ఇంటికి చేరుకున్నారు. తండ్రిని డబ్బు కావాలని కుమారుడు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ వాదులాడుకుంటుండగా తల్లి పద్మ అరిచింది. అది వైనిపించుకోలేదు. పద్మ భయపడి బయటకు వెళ్లి తెలిసిన వారింట్లో పడుకుంది.  కట్ చేస్తే.. రాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయిన పద్మ మంగళవారం ఉదయం వచ్చి చూసింది. కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.  ఆ తల్లి ఒక్కసారిగా షాక్ తిన్నది. బిడ్డను, తండ్రి కర్రతో తీవ్రంగా కొట్టాడని ఆమె గమనించిన కొద్ది సేపటికే సాయికిరణ్‌ మృతి చెందడంతో తల్లి బోరుమని విలపించింది. అక్కడే ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ను ఆమె కోపంతో రాయితో కొట్టడంతో గాయపడి బయటకు వెళ్లి పోయాడు.  అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిన్నారం సీఐ లాలునాయక్‌ సందర్శించి వివరాలను సేకరించారు. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో భారీ పేలుడు..  హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ జయరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను విసరడంతో ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు కిలోమీటర్‌కుపైగా వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో పోలీసులు ఇంకో బ్యాగ్‌ను తెరవడానికి డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు. అందులో చెత్తఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనకు బ్యాగ్‌ బాలానగర్‌లో దొరికిందని, దానిని తీసుకువస్తుండగా కుక్కలు మొరగడంతో పడేసినట్లు అనుమానితుడు పోలీసులతో చెప్పాడు. దీంతో క్లూస్‌ టీమ్‌ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లాక్ డౌన్ దెబ్బకు.. వైన్స్ లు ఖాళీ.. 

మందు  బాబులం  మేము  మందు  బాబులం  మందు  కొడితే  మాకు  మేమే  మహారాజులం  అరేయ్  కళ్ళు  తగి  గంతేస్తాం సారా  తగి  చిందేస్తాము  మందంత  దిగేదాకా  లోకలేయ్  పాలిస్తాం  మందేస్తే  ముందు  వెనక  లేదని  ఈ  మందు   లేని  సర్కారే  బందన్న.. ఈ పాట చాలా ఫేమస్.. ఎందుకంటే ఈ పాటలో చెప్పింది నూటికి నూరుపాలు నిజం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. మొన్నటివరకు ఎట్టి పరిస్థితిలోను లాక్ డౌన్ పెట్టాను అని చూపిన కేసీఆర్ సార్ కూడా చివరికి  హై కోర్టు నిర్ణయానికి తలొంచి  నేటి నుండి 10 దినాలు తెలంగాణాలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.. గిప్పుడు అసలు విషయానికి పోదాం..  ఒక వైపు కరోనా విజృంభిస్తుంది లాక్ డౌన్ పెట్టండి అని చాలా మంది దేశంలోని, రాష్ట్రము లోని ప్రభుత్వాలను విమర్శించారు. ప్రభుత్వాలకు ప్రజా ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండాపోయిందని ఇంకొంత మంది. దాని వెనుక ఎవరి స్వార్థం ఉందో అందరికి తెలుసు. ఆసలు విషయానికి వస్తే  నిన్న కేసీఆర్ సార్ 10 దినాలు  లాక్ అని చెప్పిందో లేదో.. జనాలు ఆగం ఆగం అయ్యిరు.. ఎక్కడ జూసిన లైన్ గట్టిర్రు . లైన్ అంటే ఏ కిరణం షాప్ ముందో రేషన్ షాప్ ముందో అనుకునేరు.. మందు షాప్ ల ముందు జనాలు చీమల బారులు ఉన్నారు. కరోనా గురించి ఆలోచించకుండా. 10 దినాలు మందు లేకుంటే పానాలు పోతాయి అన్న రీతిలో జనాలు పరుగులు తీశారు.  అసలే తెలంగాణ ప్రజలకు సుక్క లేకుంటే ముద్దా దిగదాయే.. మరో వైపు దేశం లో మందులో అమ్మకాల్లో మన తెలుగు రాష్ట్రాలు రెండు పోటీ పడుతున్నాయి. నిన్న ఒక్క రోజు దాదాపు అన్ని వైన్ షాప్స్ లో లిక్కర్ అయిపొయింది. దాదాపు నిన్న ఒక్క రోజు నెల రోజుల స్టాక్ అయిపోయి ఉంటుంది. మందు బాబులు నిన్న సృష్టించిన తతంగం అంత ఇంత కాదు.. ఒక్కొక్కరు అయితే కాటన్స్ కాటన్స్ తీసుకెళ్లారు. లాక్ డౌన్ దెబ్బకు వైన్స్ షాక్ లో ఉన్న స్టాక్ అంత ఖాళీ అయింది. ప్రాణాలు పోతున్నాయి అన్న.. పోయే ముందు కాస్త పెగ్గు వేసి పోతాను అన్నట్లుగా తయారు అయ్యారు జనాలు. ఏం చేస్తాం కలికాలం అందులోను కరోనా గాలం..  మందు బాబులకు ముందు చూపు చాలా ఎక్కువని వినడం తప్ప ఎప్పుడు చూడలేదు.. నిన్న ఆ సరదా కూడా తీరింది. లాక్ డౌన్ అనగానే సంచులు వేసుకొని వైన్ప షాప్స్ ముందు లైన్ కట్టరు మందు బాబులు, మే నెలలో పదోవ తేదీ వరకు రోజుకు దాదాపు రూ. 61  కోట్ల సరుకు అమ్మితే , నిన్న ఒక్క రోజే రూ. 125  కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది ఇలా ఉండగా రోజు ఉదయం 6 గంటల నుండి 10 వరకు వైన్ షాపులు తెరిచి ఉండడం విశేషం.    

కొవాగ్జిన్ కు కులాల లింక్! జగన్ రెడ్డి కుట్రలపై జనాల ఫైర్ 

ఆడ లేక మద్దెల ఓడు.. ఈ సామెత పూర్వకాలం నుంచి పాపులర్. ఎవరైనా తాను చేయాల్సింది చేయలేనప్పుడు... ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడానికి ఇతరత్రా మార్గాలు వెతుక్కుంటారు. అందుకోసం వెతికే సాకులను ఆడ లేక మద్దెల ఓడు అంటూ విమర్శలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలానే ఉంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కరోనా రోగులకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలమైన జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు అర్ధంపర్ధం లేని వాదనలు చేస్తూ అడ్డంగా బుక్కై పోతున్నారు సీఎం జగన్ రెడ్డి. తాజాగా వ్యాక్సినేషన్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కుట్రలను, అసలు నైజానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయనే టాక్ వస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో  అంతా కేంద్రమే చేస్తుందని చెబుతున్నారు జగన్ రెడ్డి. అదే సమయంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఎండీకి.. బంధుత్వాలు లింక్ పెట్టి తన కుల కుతంత్రాన్ని బయటపెట్టుకున్నారు. వ్యాక్సిన్ల కేటాయింపు కేంద్రానిదే అంటూనే... భారత్ బయెటెక్ ఎండీ కృష్ణ ఎల్లాకు...  చంద్రబాబు, రామోజీరావు బంధుత్వం అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. నిజానికి చంద్రబాబుకు..కృష్ణ ఎల్లాకు బంధుత్వం లేదు.  కాని మంగళవారం  ఓ సమావేశంలో మాట్లాడుతూ వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో ఉన్న వారికి..దేశంలో ఉన్న వారికి అందరికీ తెలుసు. భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు.. వాళ్లకు అంతా తెలుసంటూ మాట్లాడారు జగన్.  ఇటీవలే వ్యాక్సిన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి . రాష్ట్రాలకు కూడా ఎంత వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారని తెలిపారు.తాజాగా మాత్రం  బంధుత్వాలను తీసుకురావడం అందరిని విస్మయ పరుస్తోంది. దేశంలో తయారు అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం వాటాను నేరుగా కేంద్రం తీసుకుని..మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు అమ్ముకునే వెసులుబాటు ఆయా తయారీ సంస్థలకు ఇస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం విధాన నిర్ణయం తీసుకుంది. అంతా కేంద్రం చేస్తుంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధుత్వాల ప్రస్తావన ఎందుకు తెచ్చారన్నది అంతుపట్టడం లేదు. ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్లు అమ్మాలన్నది కూడా జగన్ చెప్పినట్లు కేంద్రమే డిసైడ్ చేసేటప్పుడు భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా చంద్రబాబుకు బంధువు అయితే ఏంటి?. రామోజీరావు కొడుకు వియ్యంకుడు అయితే ఏంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.  భారత్ బయోటెక్ పై సీఎం జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కృష్ణ ఎల్లా రామోజీకి బంధువైతే చంద్రబాబు ఎలా బంధువు అవుతాడో ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. రామోజీ కొడుకు వియ్యంకుడి సంస్థలో ఏం జరుగుతుందో రామోజీకి తెలుస్తుందట.. కాని తన భార్య భారతీ రెడ్డి చైర్మెన్ గా ఉన్న సాక్షిలో ఏం జరుగుతుందో జగన్ రెడ్డికి తెలియదట అంటూ సెటైర్లు వేస్తున్నారు. సాక్షిలో ఏం రాస్తున్నారో తనకు తెలియదంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కౌంటరిస్తున్నారు కొందరు నెటిజన్లు.  అవును భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు అయివుండవచ్చు...! అయితే ఏంటి..?? ఏంచెప్పాలనుకుంటున్నారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ కంపెనీ ఆంధ్రాలో ఉంటే మూయించేద్దామనుకున్నారా.. తెలంగాణాలో ఉంది కాబట్టి కుదరలేదని ప్రజలకు చెబుతున్నారా..?? అంటూ నిలదీస్తున్నారు. కొవాగ్జిన్ కోసం మీరసలు ఆర్డరు పెట్టారా..??పెడితే ఎన్ని పెట్టారు..??అప్పు అడిగారా..?? అని అడుగుతున్నారు నెటిజన్లు.  హెటిరోడ్రగ్స్ ఎవరిది..?? అరవిందో ఎవరిది..?? రాంకీ ఫార్మా ఎవరిది..??వాళ్ళకెంత దోచి పెడుతున్నారు..??అంతా దొబ్బి కూడా వాళ్ళు ప్రజలకు కంటి తుడుపు గా ఏమైనా చేసారా‌..?? అంబులెన్సు లు అప్పగించారు మీ జైలు మేట్ బంధువు కు.కానీ వారు రోడ్డు మీద మృతదేహాలనొదిలేసి పోతున్నారు..!! రోడ్డు ప్రమాదం జరిగి గిలగిల కొట్టుకుంటున్నా కాని అందుబాటులోకి రావటం లేదు. పాపం నడి రోడ్డుమీద ప్రాణాలు వదులుతున్నారు..!! ఇప్పుడు కరోనా పీడితుల హాహాకారాలు,వారి బాధను,అవసరాన్ని,అత్యవసరాన్ని సొమ్ము చేసుకోవటం కళ్ళకు కనపడటం లేదా..?? మీచావు మీరు చావండని వదిలేయలేదా..?? అంటూ సీఎం జగన్ ను కడిగిపారేస్తున్నారు ఏపీ జనాలు. రెమిడిసర్ ఇంజెక్షన్లు నల్లబజారు కు తరలించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు.ఇది శవాలను పీక్కుతినటం కాదా జగన్ రెడ్డి అంటూ నిలదీస్తున్నారు.  కోవిడ్ వ్యాక్సిన్ పై ఒక ముఖ్యమంత్రి నోట నుంచి బంధుత్వాలు లింకు కలుపుతూ మాటలు వినటం నిజంగా దౌర్భాగ్యమే అంటున్నారు నెటిజన్లు. ఇంకా కులాన్ని,చంద్రబాబుని అడ్డం పెట్టుకుని నెట్టుకొద్దామంటే కుదరదని స్పష్టం చేస్తున్నారు. మీ సత్తా,మీ పాలనాదక్షత, మీవివేకం జనాలకి,మీపార్టీ వారికి  కూడా స్పష్టంగా అర్ధమయ్యింది జగన్ రెడ్డి గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను కాపాడుకోవడం చేతకాక పోతే పదవి నుంచి దిగిపోవాలంటూ.. రిజైన్ జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఏపీ నెటిజన్లు. 

చంద్రబాబుపై మరో రెండు కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రేపుతోంది. హాస్పిటల్స్ బెడ్లు లేక, ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుపతి రుయాలో మరణ మృందగం మోగుతోంది. రుయాలో రెండు రోజుల్లో 48 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా భయంతో జనాలు వణికిపోతుండగా.. వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలను గొలికొదిలేసి.. కక్ష రాజకీయాలపై ఫోకస్ చేసింది. ఏ టీడీపీ లీడర్ పై ఎలాంటి కేసు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనే అంశాలపైనే జగన్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతల వరుస అరెస్టులు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. టీడీపీ నేతలే కాదు ఆ పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వదలడం లేదు వైసీపీ సర్కార్.  మూడు రోజుల క్రితమే ఆయనైప కర్నూల్ లో కేసు నమోదు చేయగా.. తాజాగా  మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ  న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో చంద్రబాబు పై కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కె రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని, ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని పేర్కొంటూ, జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది. నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇది కూడా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతోనే. చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై నర్సారావుపేట పోలీసులు నేతలిద్దరిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.

మరో చీలిక దిశగా  అన్నాడీఎంకే అడుగులు ?

అనుకున్నదే జరుగుతోంది. ఇంతకాలం అధికారం ఫెవికాల్’ల పనిచేయడంతో, ఏదోలా కలిసున్న,అన్నా డీఎంకే, వైరి వర్గాలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మళ్ళీ పాత పగలలకు పదును పెడుతున్నాయి. పార్టీ అగ్రనేతలు పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య విభేదాలు మళ్ళీ మరోమారు తెరమీదకు వచ్చాయి. గతంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం కుస్తీపట్లు పట్టిన, ఇరు వర్గాలు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవి కోసం, సెల్వం,స్వామి వర్గాలు పట్టుపడుతున్నాయి. సోమవారం జరిగిన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో పన్నీర్ సెల్వం, తమ వర్గానికి చెందిన మాజీ స్పీకర్ పీ. ధనపాల్’ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. అందుకు అంగీకరించలేదు.  అయితే, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం, అందుకు అంగీకరించలేదు. మ్స్స్జీ ముఖ్య మంత్రినే  ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని, అదేవిధంగా,మాజీ ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వంని శాసన సభా పక్షం ఉప నాయకుడిగా ఎన్నుకోవాలని పట్టు పట్టారు. అంతే, కాదు అప్పటికప్పుడే, ఓటింగ్ కూడా నిర్వహించారని, ఓటింగ్’లో పార్టీ ఎమ్మెల్యేలు 66 మందిలో 61 మంది పళని స్వామికి జై కొట్టారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో, ఖంగుతిన్న పన్నీర్ సెల్వం సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఉప నాయకుని పదవినీ తిరస్కరించారు.   నిజానికి, గతంలో జయలలిత అండతోనే పనీర్ సెల్వం, కేసుల్లో ఇరుకున్న ఆమెకు డమ్మీగా మాత్రమే అలాగే, ప్రజల్లోనూ పలుకుబడి లేదు. అందుకే, జయలలిత మరణంతో సెల్వం చాప్టర్ క్లోజ్ అయి పోయింది. ఇందుకు  జయ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే  సాక్ష్యంగా నిలుస్తాయి.అప్పట్లో కూడా సెల్వం కొంత కాలం పాటు, తానూ లేస్తే మనిషిని కాదు అనంట్లుగా వ్యవహరించారు.  ముఖ్యమంత్రి పీఠం కోసం  ప్రయత్నించి విఫల మయ్యారు. చివరకు ఉపముఖ్యమంత్రి పదవితో సర్దుకు పోయారు. ఇప్పడు మరో సారి, అదే సీన్ రిపీట్ అవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.అయితే,అప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడిన నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదివి కోసం పోటీ పడుతున్నారు.అదొక్కటే తేడా, మిగిలిన సీన్ అంతా  సేమ్ టూ సేమ్  అంటున్నారు.  అయితే, డిప్యూటీ లీడర్ పదవిని తిరస్కరించిన పన్నీర్ సెల్వం, వెనక్కి తగ్గరాదని అనుకుంటే, పార్టీలో ముసలం తప్పదని, కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. నిజంగా, అదే జరిగితే, పార్టులో చీలిక వచ్చినా ఆశ్చర్య పోనవసరలేదని అంటున్నారు. నిజానికి ఇంతకూ ముందే అనుకున్నట్లుగా జయ లలిత మరణంతోనే అన్న డిఎంకే రెండు వర్గాలుగా చీలిపోయింది. అధికారం అతుకుతో ఇంతాకాలం అలా కలిసి ఉన్న పార్టీ, ఇప్పడు అధికారం కోల్పోవడంతో కధ మళ్ళీ మొదటి కొచ్చింది. పైకి బాగానే ఉన్నా.. పార్టీలో మాత్రం అభిప్రాయభేదాలకు కొదవ లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. పన్నీర్, పళనిస్వామి వ్యవహారం ఇలా ఉంటెఉంటే, జయమరణం,తర్వాత జైలు జీవితానికే పరిమితం అయిన శశికళ, మొన్నటి ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అయితే, ఆమె వ్యూహాత్మకంగానే కావచ్చు,రాజకీయ సన్యాసం ప్రకటించారు. కానీ, ఆమె సమీప సహచరుడు దినకరన్ సారధ్యంలోని ఏఎంఎంకే పోటీలో నిలిచింది. దినకరన్ పోటీ చేయడం వలన, అన్నాడీఎంకేకు బలమైన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో తేవర్ వర్గం ఓట్లు.. అన్నాడీఎంకే, ఏఎంఎంకేల  మధ్య చీలిపోయాయి. ఈ ప్రభావంతో అనేక స్థానాలను డీఎంకేకు కోల్పోవలసి  వచ్చింది. ఈ నేపధ్యంలో, శశికళ, దినకరన్ కలిసి పన్నీర్సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశమూ లేకపోదని చెబుతున్నారు.మొత్తానికి, అన్నాడిఎంకేలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, పార్టీలోనే కాకుండా,  తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా భయంలో జనాలు.. జల్సాల్లో వైసీపీ లీడర్లు 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరణాలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో కడపలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా భయంతో జనాలు హడలిపోతున్నారు.  కరోనా కల్లోల సమయంలో జనాలకు అండగా నిలవాల్సిన నేతలు జల్సాలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా బాధితులకు అండగా ఉంటూ.. వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యేల రూటే సపరేట్‌గా ఉంది. కడప జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల బాధలను గాలికొదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజంపేట మండలం ఆకేపాడులో మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఎస్టేట్‌లో వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలారు. అమర్‌నాథ్ రెడ్డితోపాటు ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు సరదాగా ఎస్టేట్‌లో ఎంజాయ్ చేశారు. అమర్‌నాథ్ రెడ్డికి చెందిన గుర్రాలను తీసుకుని ఎస్టేట్‌కు దగ్గరలో ఉన్న చెయ్యేరు నది పరిసరాల్లో గుర్రపుస్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు.  అధికార పార్టీ నేతలు గుర్రాలపై స్వారీ చేస్తూ జల్సాలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ నేతల తీరుపై  స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు భయంతో చస్తుంటే పట్టించుకోకుండా సరదాల్లో మునిగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే వైసీపీ నేతల పరిస్థితి ఇలా ఉంటే... రాష్ట్రమంతా ఎలా ఉంటుందో ఊహించవచ్చు.  ఇలాంటి నేతలను ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నామంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     

తెలంగాణ లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవే..

తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. 20 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ సర్కార్ పక్కాగా మార్గదర్శకాలు రూపొందించింది. ఉదయం మినహాయింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలోనే నిత్యావసరాలు సమకూర్చుకోవాలని సూచించింది. తెలంగాణ లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవే..   - వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు,  రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.  - తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.  - వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.  - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.  -విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.  - జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.  - జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.  - కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు - ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు - ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. - ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. - గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.  - అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి - అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి. - తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం - ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ  ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.  - ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.  - కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.  - సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.  -పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది. - మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజులపాటు లాక్ డౌన్. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు . కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.  - మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. - యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.  - ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను  క్యాబినెట్ ఆదేశించింది.  - అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం. - రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం.  - ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. 

రిజైన్ జగన్! ట్విట్టర్ లో ట్రెండింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా... వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్క కంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కేసులు, మరణాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. బెడ్లు దొరక్క, బెడ్లు ఉన్నా ఆక్సిజన్ లేక కరోనా రోగులు అంతా చూస్తుండగానే చనిపోతున్నారు. సోమవారం రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్య రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సర్కార్ పై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.  రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయిన ఘటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రుయా ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ట్విటర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకే   #ResignJagan హ్యాష్‌ట్యాగ్ తో 20 వేలకు పైగా ట్వీట్లు చేశారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఓ ట్విటరాటీ ఆరోపించారు. తనకు కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.  విజయనగరం, అనంతపురం జిల్లా హిందుపురం హాస్పిటల్స్ లోనూ ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. 

కాంగ్రెస్ లోకి ఈటల రాజేందర్! భట్టీ విక్రమార్కతో మీటింగ్ 

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొందరు చెబుతుండగా.. ఇప్పుడు పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన ఈటల.. రోజులు గడుస్తున్నా ఇంకా రాజీనామాపైనా నిర్ణయం తీసుకోలేదు. తన నియోజకవర్గ నేతలు, బీసీ సంఘాలు, తనకు సన్నిహితంగా ఉన్న నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించినా... రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై మాత్రం క్లారిటీ రాలేదు.  ఈటల ఏం చేయబోతున్నారని చర్చ సాగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో  ఈటల రాజేందర్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి ఆయన సమావేశమయ్యారు ఈటల. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించినట్లు సమాచారం. భట్టీ, ఈటల చర్చలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ లో చేరికపై భట్టితో రాజేందర్ మాట్లాడుతున్నారని కొందరు చెబుతున్నారు. అలాంటేది లేదని ఈటల అనుచరులు అంటున్నారు. ఎలాంటి ప్రాధాన్యత లేకుండా భట్టీతో ఈ సమయంలో రాజేందర్ సమావేశం కావడం ఉండదని, ఖచ్చితంగా కీలక అంశంపైనే ఇద్దరు చర్చించారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు.  ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కతో ఈటల సమావేశమైనట్లు తెలుస్తోంది.

వ్యాక్సిన్ కు రెక్కలు వచ్చాయి ..

వ్యాక్సిన్ కు రెక్కలు వచ్చాయి ఇదేమి చోద్యం మేము ఎప్పుడు వినలేదు చూడలేదు అంటున్నారా అవును మీరన్నది నిజమే నేనన్నది నిజమే. దాదాపు  నాలుగు వారాలకు పైగానే వ్యాక్సిన్ దొరకక సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వ్యాక్సిన్ దొరుకు తుందా ఎంత డబ్బైనా పరవాలేదు.  ఏదోరకంగా వ్యాక్సిన్ వేసుకుందాం అనుకున్న సామాన్యుడికి సరైన సమాచారం లేకపోగా అసలు ఏ ఆసుపత్రిలో ఏ  వ్యాక్సిన్ అన్న సమాచారం లేదు. అదికాక ప్రైవేటు ఆసుపత్ర్హ్రులు ఉత్పత్తిదారుల వద్ద కొనుగోలు చేయాలనీ తెలంగాణా ప్రభుత్వం ప్రకటన చేయడం అంతకుముందే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి ఒకరేటు, రాస్గ్త్రానికి ఒకరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు మరోరేటు అంటూ ప్రకటించాయి. అంతే వ్యాక్సిన్ కోసం వెతకని చోటు అంటూ లేదు. వాకబు చేయని ఆసుపత్రి అన్టూలేదు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా తీసుకుందామని ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేద్దామంటే స్లాట్ అవైలబులిటీ లేదు సరికదా ఆన్ లైన్ రిజిస్త్రషన్ ఉన్నఇక్కడ ఓపెన్ కావడం లేదంటూ తిప్పి పంపారు. ఎక్కడ వెతుకులాడినా దొరకని వ్యాక్సిన్ అనుకోకుండా ఒక పేరుమోసిన ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లి కనుక్కున్నా అంతే సార్ మీకు సెకండ్ డోస ఫస్ట్ దోసా అన్నాడు సెక్యురిటీ ఫస్ట్ డోస్ అన్న ఫస్ట్ డోస్ అంటే 15౦౦ / సెకండ్ డోస్ అంటే 125౦/ అన్నారు అంతే మొన్నటిదాకా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రైవేటు ఆసుపత్రులు వాటిధరను అమాంతం పెంచుతాయని  అందుకే ఆసుపత్రులు వ్యాక్సిన్ కొటా ఇ వ్వలేదని చెప్పుకుంటూ వచ్చాయి.  అంటేనే ఎదో ఉందంటూ మేమువేసిన అంచనా నిజమయ్యింది. ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్19 రోగులవద్ద దోపిడీ చేస్తోంటే ఇక వ్యాక్సిన్ రేటు ను ఎవరు నిర్ణయించారు వ్యాక్సిన్ ధరల పైన నిఘానియంత్రణ ఉందా అన్నది అనుమానం.15౦ ౦ కు పైగా వ్యాక్సిన్ కొంటె రానుపోను ఖర్చులు వెరసి ఇంటిల్లిపాదికీ వ్యాక్సిన్ వేయించాలి లోక్ డౌన్ పుణ్యమా అని మళ్ళీ ఖర్చులు పెరిగి అప్పుల పాలు కాక తప్పదని సామాన్యుడు వాపోతున్నాడు.     

రుయా పాపం ఎవరిది! రమేష్ హాస్పిటల్ రూల్ వర్తించదా?

నెల క్రితం తిరుప‌తి ఉప‌ ఎన్నిక‌లు గుర్తున్నాయిగా. ప్ర‌భుత్వ ఫోక‌స్ అంతా తిరుప‌తి మీదే పెట్టారు. మంత్రులంతా మోహ‌రించారు. ఎక్క‌డ, ఏ వీధిలో, ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వారు ఎవ‌రికి ఓటేస్తారు? ఓటు వేయ‌ని వారిని ఎలా దారికి తెచ్చుకోవాలి? ఎలాంటి తాయిలాల‌తో ఎర వేయాలి? ఇలా.. తిరుప‌తిపై ఓ రేంజ్‌లో దృష్టి సారించింది వైసీపీ ప్ర‌భుత్వం. ఒక్క ఎంపీ సీటు కోస‌మే అంత గ‌ట్టిగా, చిత్త‌శుద్ధిగా ప‌ని చేసిన పాల‌కులు .. వంద‌లాది మంది క‌రోనా పేషెంట్లు ప్రాణాల‌తో పోరాడే అంశంపై ఎందుకింత నిర్ల‌క్ష్యంగా ఉంది? ఎన్నిక‌ల మీద పెట్టిన ఫోక‌స్‌లో పావు వంతైనా.. తిరుప‌తి రుయా హాస్పిట‌ల్‌పై పెట్టుంటే.. ఇప్పుడిలా ప‌దుల సంఖ్య‌లో పేషెంట్లు ప్రాణాలు కోల్పోయేవారా? ఎల‌క్ష‌న్స్ కోసం మంత్రులంతా మూకుమ్మ‌డిగా మోహ‌రించిన‌ట్టు.. క‌నీసం ఏ ఒక్క ప్రజాప్ర‌తినిధి అయినా కొవిడ్ హాస్పిటల్స్‌పై దృష్టి సారిస్తే.. ఇప్పుడింత దారుణం జ‌రిగుండేదా?  తిరుప‌తి పోలింగ్ నాడు స‌రిగ్గా స‌మ‌యానిక‌ల్లా.. ఎక్క‌డి నుంచో బ‌స్సుల్లో దొంగ ఓట‌ర్లను త‌ర‌లించిన‌ట్టు.. తిరుప‌తి రుయా ఆసుప‌త్రికి స‌కాలంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ మార‌ణ‌హోమం జ‌రిగుండేదా? ఎన్నిక‌ల మీద ఉన్నంత శ్ర‌ద్ధ‌.. ప్ర‌జ‌ల ప్రాణాల మీద చూపించ‌రా?  గెలుపు కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన‌ట్టు.. కొవిడ్ రోగుల ప్రాణాల‌ను నిల‌ప‌డంతో చెమ‌టోడ్చ‌రా? ఇదేనా ప్ర‌భుత్వం? ఇత‌నేనా ముఖ్య‌మంత్రి? ఒక్క ఛాన్స్ అడిగింది ఇందుకేనా? త‌మ చేత‌గానిత‌నంతో ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డానికి కార‌ణం అవ‌డానికేనా గ‌ద్దె నెక్కింది? ఇలా.. తిరుప‌తి రుయా ఆసుప‌త్రి మృతుల కుటుంబ స‌భ్యుల్లో, తిరుప‌తి వాసుల్లో, ఏపీ ప్ర‌జ‌ల్లో ఒక‌టే క‌డుపుమంట‌. కొవిడ్ చ‌ర్య‌ల‌పై, ఆక్సిజ‌న్ కొర‌త‌పై.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఉదాసీన వైఖ‌రిపై జ‌నాల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది.  కొన్ని వారాల‌కు ముందే విజ‌య‌న‌గ‌రం మ‌హారాజా హాస్పిట‌ల్‌లో ఇలానే జ‌రిగింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయంతో ప‌లువురు మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణ‌మంటూ ఆ ఘ‌ట‌నపై అప్ప‌ట్లో  పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లా హిందూపురం హాస్పిటల్ లోనూ ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు విడిచారు. అప్పుడే ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్తం కావాల్సింది. మ‌రో త‌ప్పిదం, మ‌రో దారుణం జ‌ర‌గ‌కుండా చూసుకోవల‌సింది. కానీ, మ‌న‌ తోలు మందం పాల‌కులు ప‌ట్టించుకున్న పాపాన పోతేగా? అందుకే, కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే తిరుప‌తి రుయా కొవిడ్ హాస్పిట‌ల్‌లో అంత‌కుమించి దారుణ ఘోరం జ‌రిగిపోయింది. ఈసారి ఏకంగా ప‌దుల సంఖ్య‌లో పేషెంట్లు ప్రాణాలు కోల్పోవ‌డం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.  ఆక్సిజ‌న్ స‌ర‌ఫరాలో అంత‌రాయ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అధికారులే ప్ర‌క‌టించారు. వేలాది మంది చికిత్స పొందుతున్న అంత పెద్ద ఆసుప‌త్రిలో.. క‌నీసం ఒక రోజుకు స‌రిప‌డా అయినా ఆక్సిజ‌న్ నిల్వ‌లు ఉంచుకోలేక పోవ‌డం ముమ్మాటికి ప్ర‌భుత్వ లోప‌మే. త‌మిళ‌నాడు నుంచి ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ వ‌చ్చాక గానీ.. రుయాలో మృత్యుఘోష ఆగ‌లేదు. ఒక‌వేళ ఆ ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ మ‌రింత ఆల‌స్యం అయి ఉంటే? మ‌రింకెన్ని ప్రాణాలు గాలిలో క‌లిసి ఉండేవి? అబ్బో.. ఊహించుకోవ‌డానికే భ‌యం క‌లుగుతోంది.  ఏపీలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగుతున్నా.. త‌గిన స‌న్న‌ద్ధ‌త చ‌ర్య‌లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ గట్టిగా వినిపిస్తోంది. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో కూర్చొని సీఎం జ‌గ‌న్‌.. ఏం చేస్తున్న‌ట్టు?  ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి క‌రోనా కంటే ముఖ్య‌మైన ప‌నులు ఏమున్న‌ట్టు? ఆక్సిజ‌న్ కొర‌త‌పై నిత్యం ఫిర్యాదులు వ‌స్తున్నా.. జ‌గ‌న్‌రెడ్డి నీరో చ‌క్ర‌వ‌ర్తిలా ఎందుకు ఉదాసీనంగా ఉంటున్న‌ట్టు? ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌పై త‌న వంతుగా ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌యత్నాలు చేస్తున్న‌ట్టు?  ఇలా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని కాల‌ర్ ప‌ట్టుకొని నిల‌దీస్తున్నారు. అయినా, పాల‌కుల నుంచి మౌన‌మే స‌మాధానం. ఇటీవ‌ల ఢిల్లీలో ప‌లు ఆసుప‌త్రుల్లోనూ ఇలానే ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. విష‌యాన్ని క్ష‌ణాల్లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వెంట‌నే కోర్టునూ ఆశ్ర‌యించారు. అత్య‌వ‌స‌రంగా ఢిల్లీకి ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు పంపించ‌క‌పోతే రోగుల ప్రాణాలు పోతాయంటూ ఎంత గ‌ట్టిగా ఫైట్ చేయాలో.. అంతే స్ట్రాంగ్‌గా ఫైట్ చేశారు. సీఎం కేజ్రీవాల్ డిమాండ్‌కు ఇటు కేంద్రం, అటు కోర్టు.. వెంట‌నే స్పందించాయి. ఢిల్లీకి కావల‌సిన ఆక్సిజ‌న్‌ను అంత‌రాయం లేకుండా అందిస్తున్నాయి. అదీ ఓ ముఖ్య‌మంత్రి ప‌ని చేయాల్సిన తీరు. మ‌రి, మ‌న ముఖ్య‌మంత్రివ‌ర్యులు ఏం చేస్తున్నారో ఎవ‌రికీ తెలీదు. రుయాలో ఆక్సిజ‌న్ నిల్వ‌లు నిండుకున్నాయ‌నే స‌మాచారం మ‌న ప్ర‌భుత్వానికి తెలియ‌నే తెలియ‌దు. స‌కాలంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ రాక‌పోతే.. వేలాది రోగుల ప్రాణాలకు ప్ర‌మాదం పొంచి ఉంద‌నే విష‌యం ఎవ‌రూ ప‌ట్టించుకోనే లేదు. ఫ‌లితం.. ప‌దుల సంఖ్య‌లో పేషెంట్లు ప్రాణాలు విడిచారు. అనేక కుటుంబాలు అనాథ‌లుగా మారాయి. కాస్తైనా క‌లిసొచ్చి.. కాస్త ఆల‌స్యంగానైనా ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి.. ఆ మిగిలిన రోగుల ప్రాణాలైనా మిగిలాయి. లేదంటే, మ‌రింకెంత‌టి దారుణం జ‌రిగిపోయేది.  ప్ర‌స్తుత కొవిడ్ క‌ల్లోల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి గారూ మీ ఫోక‌స్ దేని మీద ఉండాలి?  చంద్ర‌బాబుపై కేసులు పెట్ట‌డం మీద‌నా? ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను అరెస్ట్ చేయ‌డం మీద‌నా? సంగం డెయిరీనీ స్వాధీనం చేసుకోవ‌డం మీద‌నా?  దేవినేని ఉమాకు నోటీసులతో భ‌య‌బ్రాంతులు గురి చేయ‌డం మీద‌నా? అటు, క‌రోనాతో ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతుంటే.. ఆసుప‌త్రుల్లో బెడ్స్ లేక‌, స‌రైన మందులు లేక‌, ఆక్సిజ‌న్ అంద‌క‌.. రోగులు అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. ముఖ్య‌మంత్రి మాత్రం త‌న వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేంద‌కు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై కేసుల‌తో రాజ‌కీయంగా హ‌డావుడి చేస్తున్నారంటూ టీడీపీ విమ‌ర్శిస్తోంది.  ఏపీలో ఉంటే త‌మ ప్రాణాలు మిగ‌ల‌వ‌నే అనుమానంతోనే.. చాలా మంది పేషెంట్లు మెరుగైన చికిత్స కోసం తెలంగాణ‌కు క్యూ క‌డుతుంటే.. స‌రిహ‌ద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపైనా మ‌న ముఖ్య‌మంత్రి స్పందించ‌రు. బోర్డ‌ర్‌లో అంబులెన్సుల‌ను అడ్డుకుంటున్నా.. ఏపీ ప్ర‌భుత్వంలో క‌నీస స్పంద‌న లేదు. అంబులెన్సులో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఓ రోగి భార్య మీడియాతో చెప్పిన విష‌యాలు ఏపీలో ప్ర‌స్తుత దుస్థితికి అద్దం ప‌డుతున్నాయి. జ‌గ‌న‌న్నా.. ఏం చేస్తున్నావ‌న్నా.. అనంత‌పురం హాస్పిట‌ల్స్‌లో వెంటిలేట‌ర్లు దొర‌క‌డం లేద‌న్నా.. క‌నీసం తాము హైద‌రాబాద్‌కు వెళ్లేందుకైనా సాయం చేయ‌న్నా.. అంటూ స‌రిహ‌ద్దుల్లో, అంబులెన్సులో ప‌డిగాపులు ప‌డుతూ.. ఆ మ‌హిళ త‌న ఆక్రంద‌నతో పాటు ఆగ్ర‌హ‌మూ వ్య‌క్తం చేసింది. ఇలా.. ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు క‌రోనా విష‌యంతో సీఎం జ‌గ‌న్‌ను దోషిగా చూస్తున్నారు. రుయా ఘ‌ట‌న‌తో ముఖ్య‌మంత్రి వైఫ‌ల్యం మ‌రింత కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.  ఏడాది క్రితం విజ‌య‌వాడలో ర‌మేశ్ హాస్పిట‌ల్ కొవిడ్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగి ప‌లువురు చ‌నిపోతే.. ఆసుప‌త్రి యాజ‌మాన్యంపై కేసులు పెట్టి నానా ర‌చ్చ చేసిన స‌ర్కారు.. ఇప్పుడు తిరుప‌తి రుయా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ అంద‌క ప‌దుల సంఖ్య‌లో పేషెంట్లు మృత్యువాత ప‌డితే.. ఆ నేరం త‌న‌దేన‌ని ఒప్పుకుంటుందా? ర‌మేశ్ హాస్పిట‌ల్స్‌పై కేసులు పెట్టిన‌ట్టే.. రుయా హాస్పిట‌ల్ యాజ‌మాన్య‌మైన ప్ర‌భుత్వంపైన, ముఖ్య‌మంత్రిపైనా.. కేసులు న‌మోదు చేస్తుందా? త‌మ నిర్ల‌క్ష్యం వ‌ల్లే కొవిడ్ రోగులు చ‌నిపోయార‌ని.. త‌ప్పు ఒప్పుకొని.. ప్ర‌జ‌ల‌ను క్ష‌మాప‌ణ‌లు కోరుతుందా? రుయా ఆసుప‌త్రి విషాదమే ఏపీలో ఆఖ‌రిద‌ని.. ఇక మీద ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు హామీ ఇవ్వ‌గ‌ల‌దా? అని ముఖ్య‌మంత్రిని నిల‌దీస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు.    

కరోనా మందులు.. బంగారు దొంగతనం.. 

వైపు కరోనా మానవత్వాన్ని కనుమరుగు చేస్తోంటే.. మరోవైపు డబ్బుకోసం కొందరు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఒక వైపు కరోనా ఎక్కడ తమ ప్రాణాలు తీస్తుందో అని జనం భయపడుతున్నారు. మరో వైపు ఆ కరోనా నుండి ఎలా తప్పించుకోవాలని అదే జనం ఆలోచిస్తున్నారు. ప్రజల భయాన్ని, వాళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది మోసాలు చేస్తున్నారు. ఒక వైపు వాక్సిన్ బ్లాక్ లో అమ్ముతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు హాస్పిటల్స్ లో అవయవాలు తీసుకుంటున్నారని. మరో వైపు హాస్పిటల్స్ లో పని చేసే వాళ్ళు కరోనా పేషంట్స్ వంటి మీద ఉన్న బంగారు దొంగిలిస్తున్నారని. మరో వైపు కరోనా వల్ల చనిపోయిన వారి శవాలను స్మశానంలో దహన సంస్కారం చెయ్యాలంటే 15 వేయిల నుండి 25 వేయిల వరకు డబ్బులు వసూల్ చేస్తున్నారని. రకరకాల వార్తలు వింటున్నాం కొన్నీ వీడియోలో చూశాం.. కరోనా కాలంలో చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటే కొంతమంది వీటిని అదునుగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తు బంగారం, నగదును అపహరిస్తున్నారు. కరోనా టాబ్లెట్స్ అంటూ మహిళలకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగలు దోసుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా కుడ కుడ గ్రామంలో రెడ్డబోయిన ఎల్లమ్మ (75)వృద్ధ మహిళ పై దుండగులు కరోనా నిర్మూలించే మాత్రలు అని చెప్పి ప్రభుత్వం వారు పంపించారని ఇంటింటికి తిరిగి ఇస్తున్నామని చెబుతూ మత్తు టాబ్లెట్ ఇచ్చారు. ఆమె మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మూడు తులాలన్నర పుస్తెలతాడును అపహరించారు. కరోనాకు వ్యాక్సిన్ మత్రమే వచ్చిందని.. ఇలా కరోనా మందులని ఎవరైనా చెబితే నమ్మవద్దని.. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

వలస కార్మికుల పరిస్థితి ఏంటీ.. టీఎస్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

బుధవారం నుంచి లాక్ డౌన్ పెట్టాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారిగా రేపటి నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళతారని  ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు.  లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా సడలింపులు ఉన్నాయా అని ధర్మాసనం అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని సీరియస్  అయ్యింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే హాస్పిటళ్లై చర్యలు తీసుకోమని తామెలా చెప్తామని అన్నాది. ఆర్టికల్ 14,19 1(డీ) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను నిలిపి వేసి ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

పెళ్లికి ముందు.. పెళ్ళికొడుకు జంపు.. 

అది కృష్ణ జిల్లా. పెడన మండలం చేవేండ్రపాలెం. అతని పేరు  వీరాంజనేయులు. అబ్బాయి పెళ్లీడుకొచ్చాడు.. దీంతో తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. నిశ్చితార్థం అయింది. అటు అమ్మాయి వైపు వాళ్ళు, ఇటు అబ్బాయికి తరుపువాళ్ళు అంత పెళ్లి పనుల్లో పడ్డారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా  పూర్తయ్యాయి. బంధువులకు శుభలేఖలు పండటంతో పాటు మండపాలు మాట్లాడుకున్నారు. పెళ్లి దుస్తులు తీసుకున్నారు. ఇలా పెళ్ళికి కావాల్సినవి  అన్నీ కొనేశారు. అటు అమ్మాయి కూడా పెళ్లి, కొత్తజీవితం గురించి, భర్త గురించి  కలలు కంటోంది. అంతా బాగుందనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్ జరిగింది..  పెళ్లి పీటలు ఎక్కి అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేయాల్సిన వాడు.  మిస్ అయ్యాడు. పనిమీద బయటకువెళ్లిన వాడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇరు పక్షాల కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. దీంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఐతే పెళ్లికొడుకు మిస్సింగ్ పై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అసలు ఆ యువకుడు ఏమయ్యాడు..? ఎక్కడున్నాడు..? పెళ్లి నాటికి తిరిగొస్తాడా..? అనేది ఇప్పుడు సస్పెన్స్ సినిమాలో సీన్ లా మారింది.  వివరాల్లోకి వెళ్తే..  వీరాంజనేయులుకి మచిలీపట్నంకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. మే 13న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన బయటకు వెళ్లిన వీరాంజనేయులు మళ్లీ తిరిగిరాలేదు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలిసిన వారి వద్ద విచారణ జరిగిన తండ్రి వెంకటేశ్వరరావు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే యువకుడు అదృశ్యం ఘటన గ్రామంలో కలకలం రేపింది. మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా.. యువకుడు భారీగా నగదుతో పరారైనట్లు తేలింది. ఎల్ అండ్ టీ సంస్థలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు బంధువుల, స్నేహితులతో పాటు గ్రామస్తులను నమ్మించిన ఆంజనేయులు.. అధిక వడ్డీల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓస్థానిక ప్రజాప్రతినిథి నుంచి రూ.5లక్షలు తీసుకొని తక్కువ వ్యవధిలో రెట్టింపు మొత్తం ఇవ్వడంతో స్థానికులంతా మనోడి వలలో పడ్డారు.  

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా? 

తెలంగాణ శాసనమండలిలో  ఏడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్​ 3న, గవర్నర్​కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కరి పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 16న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్‌ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్‌ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ముగుస్తోంది.  పదవీకాలం పూర్తయ్యేవారంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే.  ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై అధికార పార్టీ కసరత్తు కూడా చేస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే జూన్ 3తో ఆరు స్థానాల గడువు ముగుస్తున్నా... ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాకా మూడు వారాల టైమ్ ఎన్నికకు ఉంటుంది. ఈ లెక్కన ఈపాటికే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.రోజూ రోజుకూ రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం దేశంలోని చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించుకున్నాయి. దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నిక జరిగితే ఎమ్మెల్యేలంతా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. కరోనా భయంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. సీఈసీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో శాసనమండలి ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని సమాచారం.  ఇటీవలే భారత ఎన్నికల సంఘంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ముంచుకొస్తుంటే.... ఎన్నికల ప్రచార ర్యాలీలకు అనుమతినివ్వడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలకు అనుమతినిస్తూ...కోవిడ్‌ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన ఇసిపై మర్డర్‌ కేసు పెట్టాలని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఇన్ని కేసులు పెరిగిపోవడానికి నైతిక, ఏకైక బాధ్యతంతా ఇసిదేనని ఆయన మండిపడ్డారు. 'ఎన్నికల అధికారులపై మర్డర్‌ కేసులు నమోదు చేయండి. కోర్టులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ...కరోనా నిబంధనలు అమలు చేయడంలో ఇసి విఫలమైంది' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల వల్లే అక్కడ కరోనా కేసులు పెరిగాయని విపక్షాలు మండిపడ్డాయి. దీంతో సీఈసీ కూడా  కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుపడే వరకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసింది. ఐతే ప్రస్తుతం  కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలను వాయిదా వేసింది ఈసీ. దేశంలో జరగాల్సి  ఉన్న ఉప ఎన్నికలను సీఈసీ వాయిదా వేయడం, గతంలో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, దేశంలో కొవిడ్ విజృంభణ వంటి పరిస్థితుల్లో తెలంగాణలో శాసనమండలి ఎన్నికలు వాయిదా పడే అవకాశమే ఎక్కువని భావిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లోనూ పలు రాష్ట్రాల్లో జరగాల్సిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ కొన్ని నెలల వరకు వాయిదా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక కూడా అలాగే వాయిదా పడింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికలు గతంలో కొన్ని రోజులు వాయిదా పడ్డాయి. 

సెకండ్ వేవ్  ప్రభావం  మహిళలపైనే ఎక్కువ 

దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా కరోనా మొదటి దశలో పురుషుల మీద ఎక్కువ ప్రభావం చూపింది. అలాగే, తెలంగాణలో కూడా తొలి దశలో కరోన సోకినవారిలో పురుషుల సంఖ్య అధికంగా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ స్త్రీల మీద అంతగా ప్రభావం చూపలేదు. ఓక్ విధంగా మహిళల పట్ల కనికరం చూపింది.  అయితే,ఇప్పుడు కొనసాగుతున్నరెండవ దశలో మాత్రం కరోనా బారిన పడిన మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. తొలి దశలో అత్యధికంగా గత జూన్’లో 34 శాతం మంది మహిళలు కొవిడ్ 19 బారిన పడితే, ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ 19 కేసుల్లో కోవిడ్ బారిన పడిన మహిళలు 38.5 శాతానికి చేరుకుంది.  ఈ సంఖ్య, ఈ నిష్పత్తి  ఈ సారి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో కూడా తొలి దశలో కంటే రెండవ దశలో ఎక్కువ మంది మహిళలు కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశం మొత్తంలో నమోదైన్ కేసుల్లో, తెలంగాణలో కంటే కొద్దిగా తక్కువగా 36 శాతం వరకు మహిళలు కొవిడ్ బారిన పడ్డారు. అలాగే ఐసీయులో చేరుతున్న మహిళల సంఖ్య, కొవిడ్’ మహమ్మారికి బలవుతున్న మహిళల సంఖ్య కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.మరణాలలో స్త్రీ, పురుషులు శాతం ఇంచుమించుగా సమానంగా, ఉందని అధికార తాజా సమాచారం సూచిస్తోంది.  గతంలో కొవిడ్ బాధిత మహిళల్లో 33 శాతం మందికి ఐసీయులో చేరితే, ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్న వారిలో మహిళల నిష్పత్తి 39 శాతానికి చేరింది.ఎక్కువ సంఖ్యలో మహిళలకు కొవిడ్ సోకడం, వైరస్ స్వభావంలోవచ్చిన మార్పుకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు సహజంగా బయటకు వెళ్లరు. కొవిడ్ నిబంధనలను పురుషులకంటే మరింత నిష్టగా, ఖచ్చితంగా పాటిస్తారు. కాబట్టి, పురుషులతో పోల్చి నప్పుడు వారికి వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే, మహిళల్లో కేసులు పెరుగతున్న కేసుల్లో ఎక్కవ భాగం యుక్త వయసు వారే ఉంటున్నారని నిపుణులు చెపుతున్నారు.  థర్డ్ వేవ్..  ఇదిలా ఉంటే, ప్రస్తుతం తీవ్ర ప్రభావం చూపుతున్న సెకండ్ వేవ్ చివరిది కాదని, మరో నెలరోజుల్లోగా ప్రస్తుత ఉదృతి తగ్గినా, మరో మూడు నెలలో (అక్టోబర్ – డిసెంబర్ మధ్య) థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు,థర్డ్ వేవ్ పిల్లల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. తొలి దశలో పిల్లలపై కరోనా ప్రభావం చాలా తక్కువగా వుంది. కేవలం 4 శాతం మంది పిల్లలపై మాత్రమే కరోనా ప్రభావం చూపింది. అంటే, పిల్లలలో నాలుగు శాతం మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్’లో 15 నుంచి 20 శాతం మంది వరకు పిల్లలు కొవిడ్ 19 బారిన పడ్డారు. ఇక థర్డ్ వేవ్ వస్తే, పిల్లలే ప్రధాన టార్గెట్ అవుతారని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, 80 నుంచి 85 శాతం మంది పిల్లలపై కొవిడ్ 19 ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమ్మలు జగ్రత్తమ్మా.. దేశంలో అందరికీ వాక్సిన్ పడే వరకు, కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శారీరక శుభ్రత, పరిసరలాను శుభ్రం ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచించే సలహాలను పాటించడం తప్పని సరని, ఫస్ట్ వేవ్ సర్డుమణిగి నప్పటికీ, సెకండ్ వేవ్ తప్పదని శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలను, ప్రజలు, ప్రభుత్వాలు పెడచెవిన పెట్టినందునే ప్రస్తుత పరిస్థితి వచ్చిందని, ఈసారి అయినా, ప్రజలు, ప్రభుత్వాలు మూడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.