ధూల్ పేట్ లఖన్ సింగ్‌పై పీడీ యాక్ట్

  ధూల్ పేట్ ను అడ్డగా మార్చుకుని గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న లేడీ డాన్ పై పీడియాక్ట్ నమోదుచేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే దూల్పేట్ లో గంజాయి వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాది స్తున్న మరో వ్యాపా రిపై కలెక్టర్ పీడి యాక్ట్  నమోదు చేయాలంటూ  ఆదేశాలు జారీ చేశారు...గంజాయి హోల్  సెల్ వ్యాపా రిగా ఎదిగిన ఓ వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో,ఎక్సైజ్ స్టేషన్లో 30కి పైగా  కేసులు నమోద య్యాయి..పోలీసులు ఒక మారు, ఎక్సైజ్ రెండో మారు లకాన్ సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.. అయినా కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ తిరిగి గంజాయి దందా  కొనసాగిస్తూనే ఉన్నాడు.. దూల్పేట్ లో నివాసం ఉంటున్న లఖన్ సింగ్ ఒరిస్సా లోని గంజాయి సాగు, అమ్మకం  బడా వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. అంతే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదిం చాలని ఆలోచించిన లఖన్ సింగ్ ఒరిస్సా నుంచి నేరుగా 25 కిలోల నుంచి 100 కేజీల వరకు గంజా యిని పోలీసుల కంట పడకుండా ధూల్పేటకు తెప్పించి స్థానిక వ్యాపారులకు అమ్మకాలు జరుపుతూ...హాయిగా గంజాయి  దందా కొనసాగిస్తున్నాడు.    ఎనిమిది నెలల్లోనే  లఖాన్ సింగ్ మూడుమార్లు 25 కేజీల, 27,26 కేజీల గంజాయిలతో ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి బృందానికి పట్టుపడ్డాడు. అంతే కాదు ఇతనిపై మంగళ హార్ట్, దూల్పేట్, నారాయణగూడ తో పాటు మరో స్టేషన్లో పదికి పైగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టు కున్న కేసులు నమోదయ్యాయి. దూల్పేట్ లో గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై కూడా పీడీ యాక్ట్ పెట్టడంతో నిందితు రాలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా లఖాన్ సింగ్ పై కూడా హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడియాట్ ఇంపోస్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం పిడి యాక్ట్ పెట్టాలని చేసిన సిఫార్సు మేరకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఇచ్చినటు వంటి పీడీ యాక్ట్ ఉత్తర్వులను దూల్పేట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మధుబాబు లఖాన్ సింగ్ కు యాక్ట్ నోటీసులను అందించారు.  

గురువులను జీవితంలో మర్చిపోలేము : సీఎం చంద్రబాబు

  దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు  సీఎం చంద్రబాబు అన్నారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే అని చంద్రబాబు అన్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సూచించారు. హాస్టళ్లతో విద్యాశాఖ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాలని ఆదేశించారు.  ఇటీవల ఐఐటీలకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తనను కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దాలని తెలిపారు.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగో ర్యాంక్ రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతు మా ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంతో బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్లాని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నానని మా నాన్న బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. నారాయణని పిలిపించి నాకు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత యూనివర్శిటీలో రాజిరెడ్డి ఆధ్వర్యంలో చదువుకున్నాను. సమయానికి హెయిర్ కట్ కూడా చేయించుకోవాలని తెలియదని లోకేశ్ తెలిపారు, తల్లిని ఆ తర్వాత నా ఉపాధ్యాయులనే గౌరవిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని పిలుపిస్తే... స్కూటరుకు మైక్ కట్టుకుని అనౌన్స్ మెంట్ చేస్తూ అడ్మిషన్లు పెంచిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. జీరో ఇన్వెస్టిమెంట్-హై రిటన్స్ అని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచిన టీచర్లూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి తెచ్చామని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారనే అంశాన్ని పేరెంట్సుకు అర్థమయ్యేలా చెప్పేందుకు పేరెంట్-టీచర్ మీటింగ్ పెట్టాం.. దీన్ని కొనసాగిస్తామన్నారు. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం... అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టామన్నారు. వేదిక మీదున్న బోర్డులోనూ సీఎం ఫొటో కూడా పెట్టలేదు. పిల్లలకు అందించే పుస్తకాలు, కిట్ల పైనా ఎవ్వరి ఫొటోలు వేయలేదన్నారు.  

సోనియా తలుపు తట్టిన...ఓటు చోర్ వివాదం !

  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ఏక కాలంలో కత్తులు దూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వంతో కుమ్ముక్కై, ఓటు చోరీ (ఓట్ల దొంగతనం)కి పాల్పడుతోందని ఆరోపిస్తూ,ఆటం బాంబు పేల్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్’లో, ఓట్ చోర్ – గడ్డీ చోడ్’ నినాదంతో, పక్షం రోజుల పాటు, ఓటరు అధికార యాత్ర సాగించారు. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబుతో మరో బ్రహ్మాండం బద్దలు కొడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే,కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దేదించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సాగిస్తున్న ఓటు చోరీ యుద్ధ తత్రం ఎంతవరకు ఫలిస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది. ఈ సంవత్సరం చివర్లో, జరిగే  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెల్చేస్తాయి.     అయితే, ఓ వంక  కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై యుద్ధం చేస్తుంటే, మరో వంక కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ’ కథలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పవన్ ఖేరా,అయన సతీమణి ఇద్దరి పేర్లు రెండేసి నియోజక వర్గాల ఓటరు జాబితాలో ఉన్నాయని, బీజేపీ ఐసెల్’ చీఫ్ అమిత్ మాలవీయ బయట పెట్టారు. కేవలం నోటి మాటలతో కాకుండా. పవన్ ఖేరాకు దేశ రాజధాని ఢిల్లీలోని జంగుపుర, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గాల ఓటరు జాబితాలలో నమోదైన ఎపిక్ నెంబర్’తో సహా జారీ అయిన ఓటరు  గుర్తింపు కార్డును బయట పెట్టారు.  మాలవీయ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల  సంఘం, విచారణ చేపట్టింది. పవన్ ఖేరాకు నోటీసులు జారీ చేసింది.   అదలా ఉంటే, రాహుల్ గాంధీ ఓటు చోర్’ నినాదం, ఆయన కన్నతల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు,సోనియా గాంధీ ఇంటి తలుపులు తట్టింది. సోనియా గాంధీ,భారతీయ పౌరసత్వం పొందక ముందే,1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకు ముందే ఆమె ఓటరు ఎలా అయ్యారనే సందేహంతో, వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ ద్వారా ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.  ఇందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారు. కానీ 1980లో న్యూఢిల్లీలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైంది. 1982లో ఆ పేరు జాబితా నుంచి తొలగించారు 1983లో మళ్లీ ఆమె పేరు జాబితాలో చేరింది. దీనిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు అప్పట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ కోర్టులో మాట్లాడుతూ ఇది సరైన ప్రక్రియ కాదని, ఇందులో ఏదో తేడా ఉందన్నారు. ఓటరుగా నమోదు కావడానికి భారత పౌరసత్వం తప్పనిసరి. ఆ సమయానికి ఆమె పౌరురాలు కాకపోయినా, ఆమె పేరు ఎలా జాబితాలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో వేరే వ్యక్తులు ప్రమేయం ఉండొచ్చని, ఎలక్షన్ కమిషన్ అధికారులపై కూడా అనుమానం ఉందన్నారు. ఇది ఓ పబ్లిక్ అథారిటీని మోసం చేసే ప్రయత్నంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ అంశాన్ని విచారించిన ఢిల్లీ కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి విచారణ జరగనుంది. అయితే, ఇది కోటగా వెలుగు చూసిన విషయం కాదు, గత కొంత కాలంగా, సోనియా ఒరు చోర్’ వ్యవహరం సోషల్ మీడియాలో, వైరల్ అవుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ, ‘బుల్ షీట్’  అంటూ కొట్టేసింది. అయితే ఇప్పడు,సోనియా ఓటు చోర్’ ఫిర్యాదును విచారణకు స్వీకరించడంతో, కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  సెప్టెంబర్ 18 నుంచి వర్షకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడి విడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాబోమని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలు హజరుకానిపక్షంలో అనర్హత వేటు పడుతుందని ఇప్పటికే డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. ఇలా ఉండగా, తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు ఏపీ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్నికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం

  ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌ సోదరుడు, వైఎస్ అనిల్ రెడ్డి  పీఏగా దేవరాజులను సిట్ విచారణకు పిలిచింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తోంది. సిట్‌కు  ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా కేసు  కీలక పురోగతి సాధిస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు.  కాగా ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు  10 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఇదే కేసులో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మంత్రిగా పని చేసిన నారాయణ స్వామిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేసుకున్నారు.

యూరియా కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

  మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం....జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం ఇద్దరు  మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు..పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు.  మహబూబాబాద్ పట్టణం లోని వివేకానంద సెంటర్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు , పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్ లు పట్టు కొని  పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు.

చైనా యుద్ధ తంత్రాలతో ప్రపంచం దిగ్భ్రాంతి

    భవిష్యత్ యుద్ధ తంత్రాలంతా ఆటోమేటెడ్ అలాగే డిజిటల్‌గా మారుతున్నాయనడానికి చైనా మిలటరీ పరేడ్ నిదర్శనం. ఒకప్పుడు లక్షల సంఖ్యలో సైనికులు అవసరం. కానీ ఇప్పుడు సైనికులు తక్కువున్నా టెక్నాలజీతో దెబ్బకొట్టే మిలటరీ ఎక్విప్ మెంట్ అవసరం. ఈ పెరేడ్ తో  చైనా తన లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించడం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందంటున్నారు. గతంలో చైనీస్ వెపన్స్ అమెరికన్ లేదంటే రష్యన్ టెక్నాలజీ కాపీ ఆధారంగా ఉండేవి. కానీ ఇప్పుడు చైనా దేశీయంగా కెపాసిటీలను పెంచుకుంది. అయితే ఈ కొత్త ఆయుధాలు యుద్ధాల్లో ప్రూవ్ కాలేదు. ఎందుకంటే చైనా ఆధునిక యుగంలో ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఈ ఆయుధాలు ఎలా పని చేస్తాయో ఎవరికీ తెలియదు. పైగా అమెరికన్ ఎక్స్ పర్ట్స్ ఇవన్నీ పేపర్ వెపన్సే అంటున్నారు.  తమ బీ 2 బాంబర్ ఒక్కటి చాలు అంటున్నారు. జిన్‌పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపై కలిసి కనిపించడం ఈ మూడు దేశాల మధ్య బలమైన రాజకీయ కూటమిగా మారింది. ఇది పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఒక హెచ్చరికగా మారింది. ఎందుకంటే తైవాన్ స్ట్రెయిట్, అలాగే సౌత్ చైనా సీ లో అమెరికాకు చెక్ పెట్టే కెపాసిటీతో ున్నాయి. గతంలో జపాన్ చేసిన దురాక్రమణలపై జిన్ పింగ్ మాట్లాడడం కూడా ఆసియా పసిఫిక్ లో ఫ్యూచర్ లో ఉద్రిక్తతలు పెంచడానికి దారి తీయొచ్చు. ఈ పరేడ్ తో చైనా తన ఆయుధాలను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది.  మయన్మార్ వంటి దేశాలు ఇప్పటికే చైనా నుంచి ఆయుధాలను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా దగ్గరికి వద్దాం. చైనా మిలటరీ పరేడ్ ను చూసిన ట్రంప్ కామెంట్ చేయకుండా ఊరుకుంటారా?  చైనా, రష్యా, నార్త్ కొరియా కలిసి USకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కుట్రలు చేస్తే ట్రంప్ భయపడుతారా? అది తెలియాలంటే.. అమెరికా, చైనా ఆయుధ సంపత్తి ఏంటో తెలుసుకోవాలి. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో అమెరికా, చైనా దగ్గర ఎంత ఆయుధ బలగం ఉందో చెప్పింది. చైనా దగ్గర 20 లక్షల 18 వేల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు.  అలాగే 10 లక్షల 15 వేల మంది రిజర్వ్ సైనికులున్నారు. అటు అమెరికా దగ్గర 10 లక్షల 39 వేల యాక్టివ్ ఆర్మీ, 8,45,000 రిజర్వ్ సైనికులు ఉన్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ విషయం చూస్తే.. చైనా దగ్గర 3,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఇందులో 1,200 ఫైటర్ జెట్‌లు, 400 బాంబర్‌లు, 400 డ్రోన్‌లు ఉండగా, అమెరికా దగ్గర 13,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. అందులో 1,800 ఫైటర్ జెట్‌లు, 600 బాంబర్‌లు 2 వేల డ్రోన్‌లతో ఆధిపత్యంతో ఉంది. ఇక నేవల్ కెపాసిటీ చూస్తే చైనా దగ్గర 370 వార్ షిప్స్ ఉన్నాయి. ఇందులో 3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 50 డిస్ట్రాయర్‌లు, 70 సబ్‌మెరైన్‌లతో చైనా ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళంగా ఉంది.  అటు అమెరికా దగ్గర 290 నేవీ వార్ షిప్స్ ఉన్నాయి.  ఇందులో 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 70 సబ్‌మెరైన్‌లు, 90 డిస్ట్రాయర్‌లున్నాయి. కీలకమైన అణ్వాయుధాల విషయంలో చైనా దగ్గర 600 వార్‌హెడ్‌లు ఉన్నాయి. 2035 నాటికి 1,500కి విస్తరణ టార్గెట్ గా పెట్టుకున్నారు. అమెరికా దగ్గర 5,044 వార్‌హెడ్‌లు ఉన్నాయి. అయితే USతో పోలిస్తే చైనా దగ్గర అణ్వాయుధాలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా దగ్గర ఉన్న వాటికంటే పవర్ ఫుల్. చైనా క్షిపణుల్లో DF-41, DF-31, JL-3 వంటి ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, YJ సిరీస్ హైపర్‌సోనిక్ క్షిపణులున్నాయి. అమెరికా దగ్గర AGM-183A ARRW, HAWC హైపర్‌సోనిక్ మిసైల్స్, టామ్‌హాక్ క్రూయిజ్ క్షిపణులున్నాయి. ఇక సైబర్ స్పేస్ విషయంలో చైనా దగ్గర HQ-29 స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది.  అదే సమయంలో అమెరికాకు US సైబర్ కమాండ్ స్పేస్ ఫోర్స్, యాంటీ-శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. రోబోటిక్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ లో చైనాకు రోబోట్ వోల్వ్స్ ఉన్నాయి. GJ-11 డ్రోన్‌లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో సత్తా పెంచుకుంటుండగా.. అమెరికా దగ్గర MQ-9 రీపర్, RQ-4 గ్లోబల్ హాక్, XQ-58A డ్రోన్‌లు ఉన్నాయి. సో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. అయితే అమెరికా చైనా డిఫెన్స్ ఎక్విప్ మెంట్స్, వార్ స్ట్రాటజీల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అమెరికన్ ఫైటర్ జెట్‌లు F-22, F-35 లాంటివి యుద్ధాల్లో పరీక్షించారు. సాంకేతికంగా అడ్వాన్స్డ్. అయితే చైనా J-20, రోబోట్ డాగ్స్ కొత్త ఆవిష్కరణలు. వీటిని యుద్ధాల్లో పరీక్షించలేదు.  చైనా హైపర్‌సోనిక్ క్షిపణుల్లో ముందంజలో ఉంది. అయితే అమెరికా వేగంగా ఆ గ్యాప్‌ను తగ్గించుకుంటోంది. అటు అమెరికా 750కి పైగా విదేశీ సైనిక స్థావరాలను కలిగి ఉంది. ఇది అమెరికాకు యుద్ధాల విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. చైనాకు కేవలం 3-4 విదేశీ స్థావరాలే ఉన్నాయి. అంటే ఏ యుద్ధం చేసినా చైనా నుంచే చేయాలి. 2024 చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ ప్రకారం, చైనా సైనిక శక్తి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా నేవీ, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో అమెరికాను మించిపోయింది. అందుకే ట్రంప్ జాగ్రత్త పడుతున్నారు. చైనాకు రష్యా, నార్త్ కొరియా తోడైతే తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంలో అమెరికా ఉంది. అందుకే ఈ ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ మౌనం వెనుక వ్యూహం ఏంటి?

కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ ఇప్పటి వరకూ ఎన్నడూ ఎదుర్కొనని మహా సంక్షోభంగా చెప్పుకోవలసి ఉంటుంది.  కేసీఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. అయితే ఆమె ఉన్నట్లుండి పార్టీకి ఎదురు తిరిగారు. స్వయంగా కన్నతండ్రే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకూ తెచ్చుకున్నారు. అయినా కూడా తగ్గేదే లే అంటూ.. మాజీ  మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హరీష్ నుంచి పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు ముప్పు ఉందని హెచ్చరించారు. అలాగే తన సోదరుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీని సమర్ధంగా నడిపించడంలో విఫలమయ్యారని నిందించారు. కవిత ఆ ఆరోపణలన్నీ.. తాను పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా చేసినవి. పార్టీలో ఉండగా కవిత చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై మౌనం వహించారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, దానికి ప్రతిగా ఆమె రాజీనామా చేసిన తరువాత  కూడా కవిత విమర్శలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి స్పందన కరవైంది. కవిత ఆరోపణలు విమర్శలపై   కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ స్పందించకపోవడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా హరీష్ రావుదే అన్న విమర్శ కు కూడా   కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి స్పందన లేకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  కనీసం హరీష్ రావు అయినా కవిత తనపై చేసిన విమర్శలకు దీటుగా బదులిస్తారని ఆశించిన పార్టీ శ్రేణులకు కూడా ఆయన మౌనం అంతుపట్టడం లేదంటున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు అక్కడి పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులతో భేటీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికే పరిమితమయ్యారు. దీంతో కవిత ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మౌనం వెనుక వ్యూహం ఏమిటన్నది పరిశీలకులకు సైతం అంతుపట్టడం లేదు.   

పేదల తలరాతను మార్చేది చదువు ఒక్కటే : సీఎం రేవంత్‌

  తెలంగాణ రాష్ట్రానికి నూతన విద్యా విధానం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లో శిల్పకళా వేదికలో గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు తెలిపారు. ప్త్రెవేటు, కార్పొరేట్ స్కూళ్ల కంటె నాణ్యమైన విద్యా అందిస్తామని ప్రతిజ్ఞ చెేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  విద్యాశాఖ ముఖ్యమైందని.. అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. గత పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీచర్ల నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ హయంలో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు జరిగిందా? అంటూ ప్రశ్నించిన రేవంత్‌.. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు.  ‘‘గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. ఉస్మానియా వర్శిటీని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే. ఫుడ్‌ పాయిజన్‌ వార్తలు చూస్తే బాధేస్తుంది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి’’ అని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. విద్యలో మనం ప్రపంచంతోనే పోటీ పడేలా పాఠశాలను తీర్చిదిద్దాలని సూచించారు.  95 శాతం మంది మంచి టీచర్లు ఉంటే 5 శాతం మంది చెడ్డవాళ్ల ఉంటారని వాళ్ల వల్లే మొత్తం శాఖకు పేరు వస్తుందన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

రాయలసీమలో వైసీపీకి చెక్.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. సీమలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా.. అక్కడ గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకుంటున్న వైసీపీకి గట్టి చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  2024 ఎన్నికలకు ముందు వరకూ కూడా సీమ ప్రాంతంలో తెలుగుదేశం పట్టు, ప్రభావం అంతంత మాత్రంగానే అన్నట్లుగా ఉండేది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గాలిలో సీమలో కూడా గణనీయమైన స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం సత్తా చాటినప్పటీకీ ఆక్కడ ఇప్పటికీ వైసీపీకి చెప్పుకోదగ్గ  బలం ఉందనడంలో సందేహం లేదు. దీంతో సీమలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. మహానాడును కడప వేదకగా జరపడం నుంచి మొదలుపెడితే.. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అయిన సందర్భాన్నిపురస్కరించుకుని నిర్వహించతలపెట్టిన  సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు రాయలసీమనే వేదిక చేసుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఈ నెల 10న అనంతపురం వేదికగా ఘనంగా, అట్టహాసంగా జరగనుంది.   ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న తెలుగు దేశం.. ఆ జోరును కొనసాగించేందుకు సీమ వేదికగావరుస కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్ధమై సన్నాహాలు చేసుకుంటోందనడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం ను వేదికగా ఎంచుకోవడాన్ని చెప్పుకోవచ్చు. అలాగే పారిశ్రామికంగా, కరవును రూపుమాపడానికి నీటి వసతిని కల్పించడం వంటి కార్యక్రమాలతో  రాయలసీమ జనాలను ఆకట్టుకుని ఆక్కడ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సీమ ప్రాంతంలో వైసీపీ పునాదులు కదులుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సీమ వేదకగా ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. 

నిమజ్జనానికి సర్వం సిద్ధం : సీపీ ఆనంద్

    హైదరాబాద్‌లో  రేపు జరగబోయే గణేష్ నిమజ్జనం కొరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు.. అన్నిచోట్ల పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని సిపి అన్నారు... ఈ నిమజ్జనం సమయంలో మొత్తం 30 వేల మంది పోలీసులు షిఫ్ట్ లో ఉన్నారు. 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. అదనంగా 250 సీసీ కెమెరాలు కొన్నాం. ఆరు డ్రోన్స్ తో గణేష్ నిమజ్జనం పర్యవేక్షిస్తామని సిపి అన్నారు. 40 గంటల పాటు వినా యకుని నిమజ్జనం సాగబోతుంది. రేపు ఒక ట్యాంక్ బండ్ లోనే 50వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి.  నిన్న చత్రినాకలో ఓ ఘటన జరిగింది. విగ్రహం ఎత్తుగా ఉండడం వల్ల కరెంటు వైర్ కు తగలకుండా ఉండేలా సుమారు 6 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది... అయితే ఎత్తుగా ఉండే వినాయకులను తీసుకువచ్చే సమయంలో కరెంటు వైర్లను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే లకు అనుమతి లేదు. గత సంవ త్సరం డీజే కారణం గా చాలామంది చనిపోయారు. డిజే వైబ్రేషన్స్ వల్ల యువకుల ఆరోగ్యం దెబ్బతింటుంది.  భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా డీజే వద్దంటే ఒప్పుకుంది. ఇందులో మతం అనే అంశమే లేదు. పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తు న్నామని సిపి అన్నారు... ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అయి పోయేలా చూస్తా మని అన్నారు.... సౌత్ జోన్ విగ్రహాల తరలింపు మాకు అత్యంత ప్రాధాన్యత... ప్రతి ఒక్కరు నిదానంగా గణేష్ నిమజ్జనం చేసి... సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్ విజ్ఞప్తి చేశారు....మరోవైపు మైట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్థరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది.

ప్రధాని మోడీతో లోకేష్ భేటీ.. ముప్పావుగంట సమావేశంలో ఏం జరిగిందంటే?

  ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ తన హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో శుక్రవారం (సెప్టెబర్ 5)  భేటీ అయ్యారు.  దాదాపు  45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో నారా లోకేష్ రాష్ట్రానికి  పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర మద్దతు రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపైచర్చించారు.  ఈ భేటీ సందర్భంగా  లోకేష్ ప్రధానికి యోధాంధ్రపై రూపొందించిన టేబుల్ బుక్ ను బహూకరించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రధానికి ధ్యాంక్స్ చెప్పారు. ఈ తగ్గింపు విద్యార్థులకు, పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఇక అమరావతి ప్రణాళికలో సింగపూర్ పాత్ర గురించి కూడా లోకేష్ మోడీకి వివరించారు.   గతంలో అంటే మే 17న ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఆ భేటీకి ఇప్పుడు తాజాగా జరిగిన భేటీ కొనసాగింపుగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, టెక్నాలజీ, ఇరిగేషన్ రంగాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను మోడీకి వివరించి ఆయా ప్రాజెక్టులు సత్వరం గ్రౌండ్ అవ్వడానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించాలని ఈ సందర్భంగా లోకేష్ మోడీని కోరినట్లు తెలుస్తోంది.  ఇవే కాకుండా ఈ 45 నిముషాల భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన వివరాలను కూడా ప్రధాని మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. సిట్ దర్యాప్తు ఆధారంగా మరి కొందరి పేర్లు చేర్చుతూ మరో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆ చార్జిషీట్ లో ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు పేరు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో లోకేష్ ప్రధానితో భేటీ కావడం, ఆ భేటీలో మద్యం కుంభకోణం దర్యాప్తు పురోగతిని వివరించినట్ల ప్రచారం జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  మొత్తం మీద కేంద్రంతో రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ భేటీని తార్కానంగా చెబుతున్నారు.  

రాత్రికి రాత్రే... సమాధులు మాయం

  సర్వసాధారణంగా మన బంగారం, వాహనాలు, లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు దొంగలు ఎత్తు కెళ్లడం వంటి వార్తలు వింటూ ఉంటాము. కానీ ఓ గ్రామంలో  మాత్రం రాత్రికి రాత్రే సమాధులు మాయమవుతున్నాయి...అంతేకాదండోయ్ అందులో ఉన్న ఆస్తి కలు కూడా కనిపిం చకుండా పోవడం తో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయం కాస్త చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు తెలిసిందీ. దీంతో ఎవరైనా క్షుద్ర పూజలు చేయడానికా అంటూ  ఓ పెద్ద చర్చ మొదలైంది. అనంతరం అసలు కథ బయటపడడంతోగ్రామస్తులందరూ విస్తుపోయారు. ఈ కథ వెనుక ఓ మూవీ డిస్ట్రిబ్యూ టర్ ఉన్నాడని తెలిసింది. అయితే ఇది సినిమా కోసం మాత్రం కాదండోయ్ దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో ఉన్న డబిల్ గూడా గ్రామంలోసర్వేనెంబర్ 24 లో ఉన్న దళిత కుటుంబానికి చెందిన నాలుగు సమాధులు ఆ స్థలంలో ఉన్నాయి. జన్య పాగ కుటుంబ సభ్యులు 2006వ సంవత్సరంలో మూడు ఎకరాల, ఐదు గుంటలు తమ భూమిని అమ్మారు. ఆ సమయంలో సమాధుల కోసం వారు ఒక గుంట భూమిని తమ వద్ద పెట్టుకున్నారు. అయితే వారి భూమిని ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ కొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ ఉన్న నాలుగు సమాధులు కనిపించకుండా పోయాయి ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నేరుగా విలపించసాగారు.  తాము  కొన్న స్థలా నికి సమాధులు అడ్డుగా వస్తున్నా యని... ఆ స్థలాన్ని కొన్న సినీ నిర్మాత,రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ సమాధులను రాత్రికి రాత్రే తొలగించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా  చివరకు సమాధి లోపల ఉన్న అస్థికలు కూడా లేకుండా చేశాడని.... తమ పూర్వీకుల అస్థికలను తమకు కావాలని కుటుంబ సభ్యులు సమా ధుల వద్ద బోరున విలపించసాగారు. కబ్జాదారుల నుండి మా పూర్వీకుల అస్తికలను ఇవ్వవలసిందిగా భూమి పట్టాదారు జన్య పగా బాలమణి పోలీసులను కోరింది. లేదంటే ఆ సమాధిల వద్దే ఆందోళన చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ ఘటనపై స్థానిక పలు పార్టీల నేతలు స్పందించి బాధితు లకు అండగా నిలి చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ సమావేశం

  దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని ప్రధానిని లోకేశ్‌ కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని  మెరుగైన ఫలితాల సాధించేందుకు సహకరించాలని  కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  ఏపీలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను ఆయన వివరించారు. ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేశ్‌ బహుకరించారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేశ్‌ భేటీ కానున్నారు.  

ఏనుగుల ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్‌ సేవలు

చిత్తూరు జిల్లాను ఏనుగుల బెడద అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. పొలాలపై పడి పంటలను నాశనం చేయడమే కాకుండా, జనాలపై దాడి చేస్తున్న సంఘటనలు, ఆ దాడులలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటలూ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ఓ కొత్త ప్రయోగం చేపట్టారు.  ఏనుగుల సంచారం, కదలికలపై ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్‌ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా ఇటీవల కాలంలో అనేక మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు.  ఈ నేపథ్యంలో    ఏనుగుల గుంపును చెదరగొట్టడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులను తీసుకు వచ్చారు. ఆ ప్రయత్నం కూడా పూర్తిగా ఫలించలేదు. ఇప్పటికీ   ఏనుగులు విధ్వంసాన్ని సృష్టి స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏనుగుల సంచారం, వాటి కదలి కపై ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగిం చుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.   గ్రామాల సమీపంలోని  ఏనుగులు సమీపిస్తున్న సమయంలో ఎలిఫెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ అలర్ట్‌ మెసేజ్‌లు పంపేందుకు ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోనున్నారు. 

మాజీ మంత్రి అంబటిపై విజిలెన్స్ విచారణ

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.  వైసీపీ హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చి న ఫిర్యాదుల నేపథ్యంలో  ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. దీంతో అంబటిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ తన విచారణ నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.  విజిలెన్స్ విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే కేసు విచారణను ఏసీబీకి అప్పగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే వైసీపీ మాత్రం అంబటిపై విజిలెన్స్ విచారణను కక్ష సాధింపు చర్య అంటూ గగ్గోలు పెడుతున్నది.   అయితే అంబటిపై భారీ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ల్యాండ్ కన్వర్షన్, ఎస్టేట్ వెంచర్లలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.   వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న అంబటి ఎకరం  భూమిని పది లక్షల రూపాయలకు కొనుగోలు చేసి.. అదే భూమిని 30 లక్షల రూపాయలకు జగనన్న కాలనీల కోసం విక్రయించి, భారీగా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లూ ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి. 

బ్రాండ్ మార్చు జ‌గ‌న‌న్నా.. అన్నిటికీ ఇంకా స‌జ్జ‌లేనా?

అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్ట‌ర్ గా స‌జ్జ‌ల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విష‌యం అంత‌టా తెలిసిందే. గ‌త జ‌గ‌న్న పాల‌న‌లో ఇటు ధ‌నుంజ‌య్ రెడ్డి, అటు స‌జ్జ‌ల..  ఈ ఇద్ద‌రి హ‌వా న‌డిచింద‌ని అంటారు. మ‌రీ ముఖ్యంగా స‌జ్జ‌ల అయితే వైయ‌స్ జ‌గ‌న్ త‌ల‌రాత తిర‌గ‌రాసిన‌ట్టుగా భావిస్తారు. అస‌లు స‌జ్జ‌ల వ‌ల్లే జ‌గ‌న్ కి చాలా విష‌యాలు చేర‌క పోయేవ‌ని చెబుతారు. దీంతో జ‌గ‌న్ ఒకానొక ప‌బ్జీ గాడాంధ‌కారంలో ప‌డి కొట్టుమిట్టాడిన‌ట్టుగా ఒక అంచ‌నా. అలాంటి స‌జ్జ‌ల‌ను తొల‌గించాలంటూ పార్టీ ఓడిన‌ప్ప‌టి  నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వెల్లువెత్తింది. అయినా స‌రే స‌జ్జ‌ల‌, ఆయ‌న కుమారుడు భార్గ‌వ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జ‌గ‌న్. ఇక‌నైనా వీరిని మార్చాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికైతే భార్గ‌వ్ నుంచి సోష‌ల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మ‌రొక‌రికి దాన్ని అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. కానీ స‌జ్జ‌లే మ‌ళ్లీ త‌న పాత పాత్ర‌ను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జ‌గ‌న్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఏమాట‌కామాట విజ‌య‌సాయి రెడ్డి క‌ల‌సి వ‌చ్చిన‌ట్టు స‌జ్జ‌ల జ‌గ‌న్ కి క‌ల‌సి  రాలేద‌ని అంటారు చాలా మంది జ‌గ‌న్ అభిమానులు. ఈయ‌న‌కు ఏదీ న‌డ‌ప‌టం స‌రిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వ‌చ్చిన‌ట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో క‌నీసం ఏబీసీడీలు తెలీవ‌ని వాపోతారు. అంతెందుకూ.. తన‌పై రెడ్ కార్న‌ర్ నోటీసులు వ‌చ్చిన‌పుడు.. కొన్ని చానెళ్ల‌లో త‌న‌పై జ‌రిగిన డిబేట్ల‌కు జ‌డుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు. త‌న‌కు తాను ర‌క్షించుకోలేని వాడు.. జ‌గ‌న్ ని మాత్రం ఏం ర‌క్షించగ‌ల‌డు? ఈ విష‌యం ఎందుకో జ‌గ‌న్ కి ఇంకా అర్ధం కావ‌డం లేదు. అప్ప‌ట్లో విజ‌య‌సాయి రెడ్డి అంత రేంజ్ లో స‌జ్జ‌ల జ‌గ‌న్ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను చక్క‌బెట్ట‌డం లేద‌ని అంటారు. నిజానికి విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌న్ ఆస్తుల‌, ఆర్ధిక లావాదేవీల‌ను ఇంకా చ‌క్క‌బెడుతున్న‌ట్టుగానే చెబుతారు. ఆయ‌న రాజ‌కీయాల నుంచి దూర‌మ‌య్యారుగానీ జ‌గ‌న్ ఫైనాన్షియ‌ల్ వ్య‌వ‌హారాల నిర్వ‌హ‌ణ నుంచి బ‌య‌ట‌కు రాలేదని స‌మాచారం. ఇద‌లా ఉంచితే, పార్టీకి స‌రిగ్గా అలాంటి వ్య‌క్తి అవ‌స‌ర‌ముంది కానీ, స‌జ్జ‌ల లాంటి వారు కాద‌న్న‌ది ఫ్యాన్ పార్టీ  శ్రేణులు బాహ‌టంగా అంటోన్న మాట‌. మ‌రి స‌జ్జ‌ల కాకుండా ఇంకెవ‌రున్నారు. అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యుల‌ను అంత తేలిగ్గా ఎంట‌ర్ టైన్ చేయ‌దు. దీంతో స‌జ్జల‌కు ఇంకా ఆడింది  ఆట పాడింది పాట‌గా న‌డుస్తోంద‌ని భావిస్తున్నారు. స‌జ్జ‌ల ఫేస్ చూసి చూసి జ‌నానికి బోర్ కొట్టేసింద‌ని.. ఆయ‌న వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండ‌ద‌ని.. అంత ర‌స‌వ‌త్త‌రంగా కూడా ఆయ‌న మాట్లాడ‌లేడు కాబ‌ట్టి మాకు నీరసం వ‌స్తోంద‌ని అంటున్నారు వైసీపీ  కార్య‌క‌ర్త‌లు.

ఫేక్ న్యూస్ పై కొత్త చ‌ట్టం కాదు.. కొత్త సిస్టం తేవాలి!?

ఫేక్ న్యూస్ మీద చంద్ర‌బాబు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఇది క‌రెక్టు కాదు త‌ప్పు.. ఫేక్ కాదు రియ‌ల్ అంటూ మ‌నం వాళ్ల‌కు ఫోటోలు పెట్టుకుంటూ కూర్చోవాలా? లేక ప‌ని చేయాలా? అని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారాయ‌న‌. ఇక ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే సుగాలీ ప్రీతికి మ‌ద్ద‌తుగా నిలిచినందుకు త‌న‌ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కేసు సీబీఐకి అప్ప‌గించిన‌ట్టు గుర్తు చేశారు చంద్ర‌బాబు. ఈ విష‌యంపై అధికారులు సైతం స్పందించాల్సి ఉంద‌ని.. వీరి నుంచి స‌రైన స్పంద‌న లేక పోవ‌డం వ‌ల్ల కూడా జ‌నం పెద్ద ఎత్తున క‌న్ ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ఇటీవ‌లి కేబినేట్ భేటీ అనంత‌రం మంత్రుల‌తో మాట్లాడిన బాబు.. ఈ విష‌యంపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఫేక్ న్యూస్ ని అరి క‌ట్ట‌డానికి ఒక కొత్త చ‌ట్టం తేవాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. అంతే కాదు ఈ విష‌యంపై ఒక మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం సైతం ఏర్పాటు చేశారు  చంద్ర‌బాబు. ఈ స‌బ్ క‌మిటీలో మంత్రులు అనిత‌, నాదెండ్ల‌, అన‌గాని, పార్ధ‌సార‌ధి ఉన్నారు. వీరి ఆలోచ‌న ఏంటంటే ఇక‌పై సోష‌ల్ మీడియాకు ఆధార్ లింక‌య్యేలా ఒక అకౌంట‌బిలిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. ఎవ‌రైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో వార్ని వెంట‌నే ప‌ట్టుకుని క‌ట్ట‌డి చేసేలా ఈ కొత్త‌ చ‌ట్టం రానుంది. ఈ దిశ‌గా కొన్ని నిబంధ‌న‌లతో కూడిన కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నుంది మంత్రివ‌ర్గ ఉప‌సంఘం. అయితే ఇలాంటి చ‌ట్టాలు చాలానే వ‌స్తుంటాయ్. పోతుంటాయ్.  ఇందుకంటూ నాన్ స్టాప్ గా ప‌ని చేసే సిస్ట‌మ్ ఒక‌టి ఇంప్రూవ్ చేయాల్సి ఉంద‌ని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక యాప్ త‌యారు చేసి అందులో ఒక వార్త నిజ‌మా కాదాని టెస్ట్ చేసుకోవ‌డం. ఆపై ఒక యూట్యూబ్ చానెల్ నిర్వ‌హించి.. త‌ద్వారా ఈ ఫేక్ న్యూస్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పు అంటూ ప్రెజంటేష‌న్లు ఇవ్వ‌డం వంటివి చేయాల్సి ఉంద‌ని అంటున్నారు వీరంతా. ఇప్పుడు చూడండి ఇదే చంద్ర‌బాబు పై జ‌గ‌న్ ఒక ఉల్లి బాంబు విసిరేశారు. ఉల్లి రైతుల‌కు ఇక్క‌డ గిట్టుబాటు ధ‌ర లేక అల్లాడుతుంటే ఆయ‌న హెరిటేజ్  లో మాత్రం కిలో 35 రూపాయ‌ల‌కు అమ్ముతున్న‌ట్టు ఆరోపించారు. దీనిపై చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. అస‌లు హెరిటేజ్ కి రీటైల్ అవుట్ లెట్స్ లేవంటుంటే.. మ‌ధ్య‌లో ఈ కిలో బేరాలు ఎక్క‌డివ‌ని ఆవేద‌న వ్య‌క్తం  చేశారు చంద్ర‌బాబు. ఇక కుప్పంకి కృష్ణ‌మ్మ నీళ్ల వ్య‌వ‌హారం. ఈ విష‌యంలోనూ వైసీపీ సోష‌ల్ మీడియా శ్రేణులు.. పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగేలా చేస్తున్నాయి. ఆ నీళ్లు కృష్ణ  నీళ్లు కావ‌ని.. ట్యాంక‌ర్ల‌లో తోలిన‌వ‌ని సోష‌ల్ మీడియాలో ఈ వార్త తెగ ట్రోల‌వుతోంది. ఇలాంటి విష‌యాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యానికి రావ‌ల్సి ఉంది. ఎవ‌రైనా ఔట్ సోర్సింగ్ కి కానీ, లేదంటే స్వ‌యంగా ఐ అండ్ పీఆర్ ద్వారా గానీ ఒక యాక్టివ్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ని రెడీ చేసి దాని ద్వారా ఈ ఫేక్ న్యూస్ పై ఫైట్ చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే ఏపీడీసీ, ఆపై ఇత‌ర సోష‌ల్ మీడియా వింగుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది నియామ‌కాలు జ‌రిగాయి. కానీ ఫేక్ న్యూస్ మీద ఈ స్థాయిలో ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైతే లేదు. కేవ‌లం చ‌ట్టం త‌యారు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి యూజ్ లేదు. ఖ‌చ్చితంగా ఇందుకంటూ ఒక సిస్ట‌మ్ ఉండి తీరాల్సిన అవ‌శ్య‌క‌త అయితే క‌నిపిస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు సోష‌ల్ మీడియా వ్య‌వ‌హారాల నిపుణులు. ప్ర‌స్తుతం కేబినేట్ భేటీ ముగిశాక‌.. అంద‌రూ క‌ల‌సి నిర్ణ‌యించింది ఏంటంటే, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఎవ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చినా మూకుమ్మ‌డిగా ఒక్క‌టై.. ఈ దాడుల‌ను తిప్పి కొట్టాలని.  ఉదాహ‌ర‌ణ‌కు రాహుల్, మోడీ త‌ల్లిపై చేసిన కామెంట్ల లాంటి వాటిని అస్స‌లు ఉపేక్షించ‌రాద‌ని వీరంతా నిర్ణయించారు. కానీ ఇక్క‌డ ఏం జ‌రుగుతోందంటే.. నిజం ఒక అడుగు వేసే లోప‌ల, అబ‌ద్ధం వంద‌డుగులు వేసేస్తోంది. ఈ విష‌యంపైనా మంత్రి వ‌ర్గం మొత్తం సీరియ‌స్ గా చ‌ర్చించింది. మ‌నం రియాక్ట్ అయ్యే లోప‌ల అబ‌ద్ధాన్ని నిజమ‌న్నంత గ‌ట్టిగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అంద‌రూ క‌ల‌సి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌న ప‌నిలో మ‌నం ఉంటే- వారి ప‌నిలో వారుంటున్నార‌నీ వీరంతా అభిప్రాయ ప‌డ్డారు. కానీ, ఇక్క‌డ ఇందుకంటూ ఒక వ్య‌వ‌స్త లేక పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా దుష్ర‌చారాన్ని ఢీ కొట్ట‌డానికి యాంటీ  వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు కూట‌మి శ్రేణులు రివ‌ర్స్ అటాక్ చేయ‌డానికంటూ ఒక వ్య‌వ‌స్థ లేక పోతే.. వ‌చ్చే రోజుల్లో చాలా చాలా క‌ష్ట‌మ‌న్న‌ది నిపుణుల మాట‌. మ‌రి చూడాలి.. కూట‌మి ఈ దిశ‌గా ఏదైనా కొత్త చ‌ట్టంతో పాటు, మ‌రేదైనా కొత్త సిస్ట‌మ్ త‌యారు చేయాల‌న్న‌ ఆలోచ‌న చేస్తుందా లేదా? 

కార్ల అమ్మకాలు భారీగా పెరగనున్నాయా?.. జీఎస్టీ సంస్కరణతో ధరలు దిగిరావడమే కారణమా?

కారులో షికారుకెళ్లే పాల‌బుగ్గ‌ల ప‌సిడిదానా.. అంటూ పాట పాడుకోవాలంటే సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కూ ఆగండి.. కార్ల ధరలు రూ. 80 వేల నుంచి రూ. 1. 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ  త‌గ్గ‌నున్నాయ‌న్న‌ది పతాక శీర్షిక‌ల‌కెక్కిన వార్త‌. దీంతో 10 ల‌క్ష‌ల రేంజ్  కార్లు భారీగా సేల్ అవుతాయ‌ని పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకుని క‌నిపిస్తున్నాయి.. స‌ద‌రు కార్ల కంపెనీలు. జీఎస్టీతో పాటు జీవిత‌కాల ప‌న్ను రిజిస్ట్రేష‌న్ చార్జీల ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంద‌ని అంటున్నారు. దీంతో టోట‌ల్ ఎక్స్ పెండిచ‌ర్ ఆఫ్- కార్ ప‌ర్చేస్ లో భారీ త‌గ్గుద‌ల ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా 1200 సీసీ  కార్ల జీఎస్టీ 18 శాతానికి ప‌డిపోనుంది. దీంతో కారు కొన‌డానికి సెప్టెంబర్ 22 తరువాత వచ్చేవి మంచి రోజులు అంటున్నారు.   బేసిగ్గా గ‌త కొంత  కాలంగా కార్ల విక్ర‌యాలు ఏమంత గొప్ప‌గా లేవు. గ‌తంలో మారుతీ అయితే అత్యంత సులువుగా క‌స్ట‌మ‌ర్ల‌కు కార్ల‌ను అంట‌గ‌ట్టేసేది. పాతిక వేలు కూడా చేతిలో లేని వారు కార్లు  కొనేసి విలాస‌వంతంగా తిరిగేవారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో మారుతి సైతం ఏమంత ఎక్కువ కార్ సేల్స్ చేయ‌లేక పోతోంది.  దీనంత‌టికీ కార‌ణం జీఎస్టీ కానే కాదు.   సిబిల్ రేటింగ్. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ఒక గుదిబండ‌గా మారిందో..  కార్ల అమ్మ‌కాలు అమాంతం ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం మార్కెట్ గ‌ణాంకాల‌ను బ‌ట్టి చూస్తే త‌యారయ్యి అమ్ముడు పోక గోడౌన్ల‌లో ప‌డి ఉన్న కార్ల విలువ.. సుమారు 70 వేల కోట్ల రూపాయ‌లుగా ఉంది. దీనంత‌టికీ కార‌ణం సిబిల్ రేటింగే. ప్ర‌స్తుతం జీఎస్టీ ద్వారా త‌గ్గ‌నున్న మొత్తం డిస్కౌంట్ ఇవ్వ‌డానికి ఈ కంపెనీలు ఎప్ప‌టి నుంచో రెడీగా ఉన్నాయి. 50 వేల నుంచి 80 వేల డిస్కౌంట్ల‌కు కార్లు కొన‌మంటూ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంటాడుతూనే ఉంటాయి. కానీ స‌ద‌రు క‌స్ట‌మ‌ర్ల‌లో చాలా మందికి ప‌ర్స‌న‌ల్ లోన్, హోం లోన్ ఇంకా ఇత‌ర‌త్రా లోన్ల వ‌ల్ల‌.. వాటిని క‌ట్ట‌డంలో వారి వారి స‌మ‌స్య‌ల కార‌ణంగా సిబిల్ రేటింగ్ దారుణంగా దెబ్బ తిన‌డం వ‌ల్ల‌.. వారికి కారు కొనుగోలు అంద‌ని ద్రాక్ష‌గా మ‌రింది. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ని తిరిగి స‌వ‌రిస్తారో అప్పుడు నిజంగా కార్ల అమ్మ‌కాలు భారీగా పెరిగే ఛాన్సులు క‌నిపిస్తున్నాయని అంటారు ఆర్ధిక రంగ నిపుణులు.