పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనా?  

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన (?) ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిశోర్ పేరు దేశ రాజకీయాలలో మారు మ్రోగి పోయింది. అదే సమయంలో ఆయన ఇదీ అని ఏదీ చెప్పకుండానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో మొదలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంకావాద్రా వరకు వివిధ పార్టీల నాయకులను కలిశారు. మోడీని ఓడించడం ఎలా, అనే విషయంలో విపక్షాలకు బోలెడంత జ్ఞాన బోధ చేశారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్షాలు సాగించిన  ఐక్యత క్రతువుకు తెరవెనక సూత్రధారిగా వ్యవహరించారు. పౌరోహిత్యం నెరిపారు. అ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ ఆగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షాల ఐక్యత అనే ఎండమావి, ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నట్లుంది. పక్షం రోజుల క్రితం ఎప్పుడో సోనియా గాంధీ ఒక వర్చువల్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు, ఎవరి రాజకీయం వారిది, అన్నట్లుగా పనిలో పడిపోయారు.   బీజేపీకీ, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా  వ్యూహ రచన సాగిస్తూనే, మరో వంక కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేశారు, ఆ కోణంలోనూ సోనియా, రాహుల్, ప్రియాంక త్రయంతో చర్చలు జరిపారని, అప్పట్లో వార్తలొచ్చాయి. అలాగే,  ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనపై కమల్ నాథ్, తదితర సీనియర్ నాయకులతో సొనియా,రాహుల్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ సమావేశంలోనే పీకే ఎంట్రీకి కాంగ్రెస్ నాయకులు ఓకే చెప్పారు. ఆయనకు ఏ బాధ్యతలు ఇవ్వాలి, అయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే,అ తర్వాత ఏమైందో ఏమో కానీ, పీకీ కాంగ్రెస్ ఎంట్రీ స్టొరీ బ్రేక్ తీసుకుంది. ఇప్పడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, సోనియా గాంధీ, పీకేకు గ్రీన్ సింగల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ లో ఒక వర్గం మాత్రం పీకే ఎంట్రీనే వ్యతిరేకిస్తుంటే, మరికొందరు, ఆయనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వేలులేదని అంటున్నట్లు సమాచారం. గతంలో జేడీయూలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా, పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్’తో విబేధించి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  అదీగాక తానూ రాజకీయలకు పనికిరానని స్వయంగా ప్రకటించుకున్న ఆయనకు పార్టీ పెద్ద పీట వేయడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెపుతున్నారు. మరో వంక కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ విధానలను అవలంబించడం అంత తేలికైన విషయం కాదని, స్వయంగా ప్రశాంత్ కిశోర్ ఓపెన్’గానే కామెంట్ చేశారు.   ఇక  ప్రశాంత్ కిశోర్ వద్ద మంత్రం దండం ఏమీ లేదు. జాతీయ స్థాయిలో 2014లో బీజేపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం కంటే  అంతకు ముందు పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇతరత్రా కారణాలు కీలక పాత్రను పోషించాయని  కాంగ్రెస్ నాయకులే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అదే సమయంలో, ఉత్త ప్రదేశ్, బీహార్ , ఢిల్లీలో  ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు పనిచేయని విషయాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి, పీకే ఇంతవరకు గెలిపించిన(?) పార్టీలు అన్నీ కూడా, ఆయన వ్యూహం లేకున్నా గెలిచేవే అని అంటున్నారు. నిజంగా, ప్రశాంత్ కిశోర్’ కు తమ  వ్యూహ చతురత మీద నమ్మకం ఉంటే, రేపటి యూపీ అసెంబ్లీ ఎన్నుకలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ నాయకులే సవాలు విసురుతున్నారు. రాజకీయాలలో ఎన్నికల వ్యూహాలు ఎత్తుగడలు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. పార్టీ నిర్మాణమే సరిగా లేని చోట, పీకే అయినా ఇంకెవరైనా పీకేది ఏమీ ఉండదని ,అంటున్నారు. అయితే. పేకే వ్యూహం అసలే పనిచేయదని కాదు, అదొక్కటే, గట్టేకించలేదు. ఇతర అంశాలన్నీ సానుకూలంగా ఉన్నప్పుదు మాత్రమే పేకే వ్యూహం పనికొస్తుందని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. అందుకే ఆయన్ని అంతగా ఎత్తుకోవలసిన అవసరం లేదని అన్నారు

తాలిబ‌న్ల తాత‌ల్లా వైసీపీబ‌న్లు.. నాటుతుపాకీల‌ త‌యారీ కేంద్రంగా ఏపీ..

తాలిబ‌న్లు తెలుసుగా. అఫ్ఘ‌నిస్తాన్‌లో అరాచ‌క పాల‌న‌కు మ‌ళ్లీ శ్రీకారం చుట్టిన ముష్క‌రులు. తాలిబ‌న్ల రాజ్యం వ‌స్తుంద‌న‌గానే అఫ్గ‌న్ ప్ర‌జ‌లంతా భ‌యంతో దేశం వ‌దిలి పారిపోతున్నారు. గ‌తంలో తాలిబ‌న్లు చేసిన అరాచ‌కాలు అలాంటివి మ‌రి. ఏపీలోనూ వైసీపీ పాల‌కులు, నాయ‌కులు... తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. వైసీపీ శ్రేణుల‌ను తాలిబ‌న్ల‌తో పోలుస్తూ.. వైసీపీబ‌న్లు అంటూ పేరుపెట్టారు. అధికార పార్టీ అరాచ‌కాల‌ను తాలిబ‌న్ల‌తో పోల్చుతూ.. సెటైరిక‌ల్‌గా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.   తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. వాళ్లు ఓపీయం (న‌ల్లమందు) ఒక్కటే పండిస్తారని అననారు. వైసీపీబ‌న్ల పాలనలో వాలంటీర్ వాసు సారా త‌యారీ నుంచి మొద‌లై నేడు నాటు తుపాకుల త‌యారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నెల‌కొల్పిన‌ మెడ్‌టెక్‌ జోన్‌లో క‌రోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే... జ‌గ‌న్ విధ్వంస‌క పాల‌న‌లో ఫ్యాక్షన్‌ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయంటూ ఆరోపించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వెంక‌టేశ్ అనే వ్య‌క్తి 18 నాటు తుపాకులు త‌యారు చేయ‌గా.. అత‌న్ని పోలీసులు ప‌ట్టుకున్న న్యూస్ క్లిప్పింగ్‌ను త‌న ట్వీట్‌కు జ‌త చేశారు నారా లోకేశ్‌. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళలకున్న నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందంటో మ‌రో ట్వీట్ కూడా చేశారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకుల నిర్బంధం, అక్రమ అరెస్టుల పై పెడుతున్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం పెట్టాలంటూ మండిప‌డ్డతూ కొన్ని ఫోటోలు జ‌త చేశారు. మ‌రోవైపు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. రెండేళ్లుగా ప్రభుత్వం టీడీపీ నేతల్ని వేధిస్తూనే ఉందని మండిప‌డ్డారు. కేసులు పెట్టి ఉన్మాదుల్లా పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేసినందుకు చింతమనేని ప్రభాకర్‌ని అరెస్ట్ చేశారన్నారు. దేవాలయానికి వెళితే గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా.. టీడీపీ నేతల్ని వేధిస్తున్నారన్నారు. తిరగబడితే ప్రభుత్వం తోకముడుస్తోందన్నారు. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. తప్పులు బయటపడతాయనే భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారును దుయ్య‌బ‌ట్టారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.  

సీనియర్లంతా అవుట్.. ఉద్యమ వాసన తెలియని కొత్త తరంతో కేసీఆర్ 2023 మిషన్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ముందు చూపున్న నాయకుడు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట. అందుకే తెరాస 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నోఅటుపోట్లు ఎదురైనా, ప్రత్యర్ధులను పడగొట్టి, అంతిమ విజేతగా నిలిచారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయాలను గుప్పిట పెట్టుకున్నారు. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి  పీఠమెక్కి.ఏడేళ్ళుగా ఎదురులేకుండా చక్రం తిప్పుతున్నారు. ఇప్పటి వరకూ అయితే, నేనే రాజు నేనే మంత్రి, అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తిరుగు లేని నాయకుడిగా నిలిచారు.   అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందులోనూ రాజకీయలాలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యేందుకు అట్టే కాలం పట్టదు. ఇప్పుడున్న పరిస్థితులలో, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఇలాగే కొనసాగితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస మళ్ళీ గెలిచి హట్రిక్ కొట్టడం అయ్యే పని కాదు. సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంతో పాటుగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి ఉడుకు రక్తాన్ని తట్టుకుని నిలవడం అసలే  అయ్యే పని కాదు. అదే విధంగా, ముఖ్యమంత్రి కుర్చీకోసం ముచ్చట పడుతున్న కొడుకు కేటీఆర్ ముచ్చటతీర్చడం కూడా ప్రెజెంట్ పొలిటికల్  ఈక్వేషన్స్’లో  సాధ్యం కాదు. ఇది ఇప్పటికీ ఒకటికి రెందు సార్లు రుజువైన నిజం.  ముఖ్యమంత్రి కేసీఆర్, పరిస్థితులు అనుకూలిస్తే ఇప్పటికిప్పుడు  కేటీఅర్ కు ముఖ్యమంత్రి పదవినీ ఇచ్చేందుకు, ఆయన్ని పట్టాభిషిక్తుని చేసందుకు సిద్దంగా ఉన్నారు. అందుకు కుటుంబ వత్తిళ్ళు కారణమా లేక ఇంకేదైనా కారణమా అనే విషయాన్ని పక్కన పెడితే,  2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు పోవడం మొదలు ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేసి సాగనంపడం వరకు కేసీఆర్ తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం వెనకా కేటీఆర్ ను సీఎం చేయడం అనే లక్ష్యం, వ్యూహం ఉందని అంటారు. అప్పటి  నుంచి కేసీఆర్ అదుగులు అన్నీ ఆ దిశగానే  పడుతున్నాయి.  ఒక దశలో, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ పార్టీ నాయకులు కొందరు బహిరంగ వేదికల నుంచే ప్రకటించారు.అదే సమయంలో కేటీఆర్’ పట్టాభిషేకానికి మీడియా ముహూర్తాలు కూడా పెట్టేసింది. అయితే, అంతర్గత కుమ్ములాటలు ఇతరత్రా కారణాల వలన  ఆ కార్యం కాలేదనికోండి అది వేరే  విషయం.  ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహత్మకంగా అవరోధాలను తొలగించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే, చాలా వరకు సీనియర్లను పక్కన పెట్టేశారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులకు తెరాసలో  స్థానం లేకుండా చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా, ఏమి చేసినా ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తే, పార్టీలో సీనియర్ల నుంచి తిరుగుబాటు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే, 2023 ఎన్నికల నాటికి. పాత తరాన్ని పక్కన పెట్టి కొత్త తరాన్ని తెరమీదకు తెచ్చేందుకు ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇప్పటినుంచే, పాచికలు సిద్దం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రైవేటు సంభాషణల్లో  పార్టీ వర్గాలు సైతం దృవీకరిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో సిట్టుంగులు అందరికీ తిరిగి టికెట్ ఇవ్వడంతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లను అందలం ఎక్కించడం వల్లనే, కేటీఆర్ పట్టాభిషేకానికి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు, అందుకే  ఈసారి, 2023 ఎన్నికల్లో మంత్రులతో సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికే టికెట్ ఇవ్వరాదని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పడిలేచిన కెరటంలా ఎగసి పడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకుకు కూడా ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికను సిద్ద చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడంతో పాటుగా, కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంక్ను తమ వైపుకు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఓ వంక దళిత బంధును ఎరగా వేయడంతో పాటుగా, జాతీయ స్థాయిలో కాంగ్రేస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు ద్వారా, బీఎస్పీని దగ్గర చేసుకుని దళిత ఓటును గంప గుత్తగా తమ ఖాతాలో కలుపుకునేందుకు, అలాగే ఇతర సామాజిక వర్గాలను చేరదీసి, ఉద్యమ వాసనలు,సీనియారిటీ చిక్కులు లేని కొత్త రక్తంతో 2023 ఎన్నికలకు పోవాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, మిషన్ 2023 ప్రణాళికను కేసీఆర్ సిద్దం చేశారని పార్టీ వర్గాలు ధవీకరిస్తున్నాయి.

ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష! వైఎస్ కుటుంబం పాలనలో అంతేనా? 

ఐఏఎస్ శ్రీలక్ష్మి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన అధికారిణి. సీన్ కట్ చేస్తే వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లింది. చాలా కాలం పాటు చెరసాల జీవితం గడిపింది. అక్కడే అనార్యోగానికి కూడా గురైంది. శ్రీలక్ష్మి ఒక్కరే కాదు రత్నప్రభ, పార్థసారథి, శ్యామూల్స్ తదితర సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కోర్టు కేసులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ ప్రభుత్వం గురించి చెప్పగానే... ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లిన విషయాలు గుర్తుకు వస్తాయి.  గత పరిస్థితులు గుర్తుకు వచ్చేలా.. ఏపీలో  కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారులు వరుసగా కోర్టుల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. కొందరికి జైలు శిక్షలు కూడా పడుతుండటం కలకలం రేపింది. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో కోర్టుల ఉత్త‌ర్వుల‌ను, ఆదేశాల‌ను ఏమాత్రం లెక్క చేయ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమర్శలు ఉన్నాయి. జగన్ విధానాలతో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తున్నారు.  కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు ఉంటుండటంతో .. తర్వాత కాలంలో ఐఏఎస్ అధికారులు ఇబ్బందుల్లో పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  తాజాగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం అందించని ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా పరిహారం చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడిన కోర్టు.. ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానాను విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వారి జీతాల నుంచి కోత పెట్టి పరిహారం అందించాలని ఆదేశించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూ పరిహారం కేసుపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాలు, ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్ కు నెల రోజులు, ప్రస్తుతం సీఎంవోలో ఉన్న ముత్యాల రాజుకు రెండు వారాలు, మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది. అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువునిచ్చింది ఏపీ హైకోర్టు.  గత జూలైలోనూ ఓ కేసులో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల‌కు జైలు శిక్ష ప‌డింది. జ‌గ‌న్ ప్రభుత్వంలో కీల‌క శాఖ‌ల అధికారులుగా కొన‌సాగుతున్న ఐఏఎస్ లు గిరిజా శంక‌ర్‌, చిరంజీవి చౌద‌రిల‌కు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 36 మంది ఉద్యోగుల స‌ర్వీసుల‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని హైకోర్టు ఏప్రిల్ లో ఆదేశాలు జారీ చేస్తే… వీరు వాటిని ఇప్ప‌టిదాకా అమ‌లు చేయ‌లేదు. దీంతో వారిద్ద‌రికీ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలతో వైఎస్సార్ లానే జగన్ ప్రభుత్వంలోనూ అధికారులకు చిక్కులు తప్పవా అన్న చర్చ జరుగుతోంది. కోర్టు కేసులతో తమకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన సివిల్ సర్వెంట్లలో కనిపిస్తోందని చెబుతున్నారు. 

ఢిల్లీలో అల్లుడు మిస్సింగ్‌.. హరీష్‌ను మ‌ళ్లీ సైడ్ చేసేశారా?

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి శ్రీకారం ప‌డింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్ట‌హాసంగా భూమిపూజ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇక‌పై హ‌స్తిన‌లో తెలంగాణ వాణి మ‌రింత గ‌ట్టిగా వినిపించేందుకు ఈ తెలంగాణ భ‌వ‌న్ వేదిక కానుంది. అందుకే అంత కీల‌క‌పాత్ర పోషించ‌నున్న పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు రోజులు ముందుగానే మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మ‌ల్లారెడ్డి త‌దిత‌రులు ఢిల్లీ వెళ్లి ఏర్పాట్లును ప‌ర్య‌వేక్షించారు. ముహూర్తం వేళ‌కు ముఖ్య‌మంత్రితో పాటు ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్య‌వ‌ర్గ‌స‌భ్యులు భారీగా హాజ‌రై భూమిపూజ‌ను విజ‌య‌వంతం చేశారు. అయితే.. చిన్న‌లోటు. ఆ ఫ్రేమ్‌లో ఎంత‌మంది ఉన్నా.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కీల‌క నేత క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసీఆర్ అల్లుడు, మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు, పార్టీలో ప్ర‌ధాన నాయ‌కుడైన‌.. త‌న్నీరు హ‌రీష్‌రావు.. ఢిల్లీలో జ‌రిగిన టీఆర్ఎస్ భ‌వ‌న్ శంకుస్థాప‌న‌కు హాజ‌రుకాక‌పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  హస్తిన ప‌ర్య‌ట‌న‌కు హ‌రీష్‌రావు డుమ్మా కొట్టారా? లేక‌, మామే అల్లుడిని ప‌క్క‌న పెట్టేశారా? అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఢిల్లీలో పార్టీ బిల్డింగ్‌కు శంకుస్థాప‌న జ‌రిగే కార్య‌క్ర‌మానికి మంత్రి హ‌రీశ్‌రావును కావాలనే సీఎం కేసీఆర్ తీసుకెళ్ల‌లేద‌ని అంటున్నారు. ఢిల్లీకి ఎంపీ సంతోష్ రావును తనతో పాటు విమానంలో తీసుకెళ్లిన కేసీఆర్... హరీష్ రావును ఎందుకు తీసుకెళ్లలేదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బండ్లు ఓడ‌లు.. ఓడ‌లు బండ్లు.. ఈ రెండు హ‌రీశ్‌రావు విష‌యంలో నిజమనిపిస్తుందని, సంతోష్ రావుకు ఇచ్చిన విలువ హరీష్ రావుకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  అంతేకాదు సెప్టెంబ‌ర్ 2న జెండా పండ‌గ‌ను తెలంగాణ‌వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించింది టీఆర్ఎస్‌. వాడ వాడలా పార్టీ జెండాలు ఎగురవేశారు. అయితే ఢిల్లీలో  తెలంగాణ భవన్ నిర్మాణ భూమి పూజకు హాజరు కాని హరీష్ రావుకు హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లోనూ జెండా ఎగ‌రేసే ఛాన్స్  కూడా ఇవ్వలేదు. తెలంగాణ భవన్ లో ఓ మామూలు నాయకుడే జెండా ఎగురవేశారు. హ‌రీశ్ రావు మాత్రం సిద్ధిపేట‌లో పార్టీ జెండా ఎగ‌రేసి ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.  గులాబీ అగ్ర నాయ‌క‌త్వ‌మంతా ఢిల్లీలో పండ‌గ చేసుకుంటుంటే.. హ‌రీశ్‌రావు మాత్రం ఓ మూల‌కు ప‌రిమిత‌మై.. త‌న‌కు ఇంతే ప్రాప్త‌మంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని అంటున్నారు. హ‌రీశ్‌రావు.. ఉద్య‌మం నాటి నుంచి కేసీఆర్‌కు తోడునీడ‌గా ఉన్న నాయ‌కుడు. కేటీఆర్‌ ఎంట్రీతో హ‌రీశ్‌రావు ప్లేస్ ప్ర‌మాదంలో ప‌డింది. ఇక సంతోష్‌కుమార్‌ రాక‌తో ఏకంగా ఆయ‌న ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. అప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ త‌ర్వాత కేసీఆర్ అంత‌టోడు అనే ఇమేజ్ ఉన్న హ‌రీశ్‌రావును.. అంతలోనే అడ్ర‌స్ లేకుండా చేసేశారు. పార్టీలో, ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా ఉండే అల్లుడిని.. కొడుకు కోసం అథఃపాతాళానికి కేసీఆరే తొక్కేశార‌ని అంటారు. అప్ప‌టి నుంచి.. హ‌రీశ్ పొలిటిక‌ల్‌ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. హ‌రీశ్‌రావు పేరే వినిపించ‌కుండా అంద‌రినీ క‌ట్ట‌డి చేశారు. హ‌రీశ్‌రావు ఉనికే లేకుండా అంత‌టా క‌ట్టుదిట్టం చేశారు. గ‌త ట‌ర్మ్‌లో కీల‌క‌మైన నీటిపారుద‌ల‌ శాఖ‌ను హ‌రీశ్‌రావుకు క‌ట్ట‌బెట్టిన కేసీఆర్‌.. ఈ సారి తొలుత కొన్ని నెల‌ల వ‌ర‌కు ఆయ‌న‌కు ఏ ప‌ద‌వీ ఇవ్వ‌కుండా చుక్క‌లు చూపించారు. ఆ త‌ర్వాత‌.. ఆర్థిక శాఖ‌ను క‌ట్ట‌బెట్టి.. ఎలాంటి ప‌వ‌ర్ లేకుండా కోర‌లు పీకేశారు. క‌ట్ చేస్తే.. ఈట‌ల రాజేంద‌ర్ తిరుగుబాటుతో గోడ‌కు కొట్టిన బంతిలా.. మ‌ళ్లీ స‌డెన్‌గా కీల‌క నేత‌గా అవ‌త‌రించారు హ‌రీశ్‌రావు. మామ ద‌య‌త‌ల‌చ‌డంతో.. మ‌ళ్లీ చ‌క్రం తిప్ప‌డం స్టార్ట్ చేశారు అల్లుడు. హుజురాబాద్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న హరీష్ రావు తెలంగాణ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. హరీష్ రావును కేసీఆర్ కావాలనే పక్కన పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ లో గెలవలేమని తెలుసు కాబట్టే హరీష్ కు బాధ్యతలు అప్పగించారని, ఎన్నిక తర్వాత ఆయనను బలి పశువును చేయాలని చూస్తున్నారనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గెలిచే అవకాశాలున్న చోట కేటీఆర్ ను ఇంచార్జ్ గా పెడుతూ.. ఓడిపోయే చోట హరీష్ ను తిప్పుతూ కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ వాదులు చెబుతున్నారు. మొత్తానికి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లకపోవడంతో టీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ స‌ర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ‌.. ద‌మ్మాల‌పాటికి క్లీన్‌చీట్‌.. ప్ర‌భుత్వంపై చ‌ర్య‌లు?

న్యాయం కోర్టుల రూపంలో ఇంకా నిలిచేఉంది. న్యాయం జ‌ర‌గ‌డం ఆల‌స్యం కావొచ్చు కానీ.. అన్యాయం మాత్రం ఎన్న‌టికీ గెల‌వ‌దు. ఏపీలో ఈ విష‌యం ప‌దే ప‌దే నిరూపితం అవుతోంది. అమ‌రావ‌తిని ఎత్తేయాల‌నే కుట్ర‌కూ.. హైకోర్టే బ్రేకులు వేసింది. ప్ర‌త్య‌ర్థుల‌పై కేసులు, అరెస్టుల‌తో క‌క్ష్య తీర్చుకోవాల‌నే ఎత్తుగ‌డ‌ల‌కూ హైకోర్టు ద్వారానే చెక్ ప‌డుతోంది. వ‌రుస ఎదురుదెబ్బ‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం నెత్తి బొప్పిక‌డుతున్నా.. ప్ర‌భుత్వం తీరు ఏమాత్రం మార‌క‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం. తాజాగా, మ‌రో కేసులోనూ ఏపీ హైకోర్టు జ‌గ‌న్ స‌ర్కారుకు మొట్టికాయ‌లు వేసింది. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరికొందరిపై.. ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది.  దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఆ త‌ర్వాత‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. హైకోర్టులో గత నెల రోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది.  గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం ఆ కేసులను కొట్టేసింది. ద‌మ్మాల‌పాటిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేయ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. మ‌రి, త‌న‌ను వేధించిన స‌ర్కారుపై ద‌మ్మాల‌పాటి చ‌ట్ట ప్ర‌కారం రివేంజ్ తీర్చుకుంటారా? మ‌ఆజీ అడ్వకేట్ జ‌న‌ర‌ల్ తిరిగి కేసు పెడితే ప్ర‌భుత్వం ప‌రిస్థితేంటి? అనే చ‌ర్చ న‌డుస్తోంది.   

ష‌ర్మిల హార్ట్‌బ్రేక్‌.. చెల్లి కంట క‌న్నీరు.. జ‌గ‌న‌న్న‌దే ఆ పాపం!

ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. ఎల్ల‌ప్పుడూ దేనికైనా రెడీ అంటుంది. నెగ్గ‌డ‌మే కానీ.. త‌గ్గేదే లే అంటుంటుంది. విమ‌ర్శ‌లు చేయ‌డం.. విరుచుకుప‌డ‌ట‌మే ఆమె నైజం. ఆమె నోట మాట‌ల తూటాలే. ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లే. అలాంటి వైఎస్ ష‌ర్మిల‌.. కంట క‌న్నీరు పెట్టింది.. బోరున విల‌పిస్తోంది. ఈ విష‌యం ఎవ‌రో చెప్ప‌డం కాదు.. స్వ‌యంగా ఆమే ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేసింది. అశ్రున‌య‌నాల‌తో ఆమె చేసిన ఆ క‌న్నీటి ట్వీట్‌.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఆమె క‌న్నీటి గాథ‌కు చ‌లించిపోయిన వారంతా.. జ‌గ‌న‌న్న‌దే ఆ ద్రోహం.. ఆ పాపం.. అందుకు కార‌ణం.. అంటూ త‌ప్పుబ‌డుతున్నారు. పోస్టుల‌తో ష‌ర్మిల‌ను ఓదారుస్తూనే.. సీఎం జ‌గ‌న్ను కామెంట్లో కుళ్ల‌బొడుస్తున్నారు. ఇంత‌కీ ష‌ర్మిల చేసిన ట్వీట్ ఏంటంటే... ఇదీ ఆమె బాధ‌. ఈ ట్వీట్‌లో ఎక్క‌డా జ‌గ‌నన్న పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. ప్ర‌తీ అక్ష‌రంలోనూ జ‌గ‌నే కార‌ణం అనేలా న‌ర్మ‌గ‌ర్భంగా చేశారా ట్వీట్‌. వైఎస్సార్ మ‌ర‌ణించిన ఈ 12 ఏళ్ల‌లో ఆమె ఏనాడు తాను ఒంట‌రి దాన్ని అయ్యాన‌ని భావించ‌లేదు. తండ్రి త‌ర్వాత తండ్రిలా జ‌గ‌న‌న్న తోడున్నాడ‌ని ధైర్యంగా ఉన్నారు. అలాంటి జ‌గ‌న‌న్నే త‌న‌ను ఒంట‌రిదాన్ని చేసి.. ఇంటి నుంచి త‌రిమేయ‌డంతో.. ఇప్పుడు తండ్రిలాంటి అన్న‌ అండ లేక‌.. తాను ఒంట‌రి దాన్ని అయ్యాన‌నే ఫీలింగ్ ఆ ట్వీట్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది అంటున్నారు. జ‌గ‌న్ చేతిలో అవ‌మానాలు, క‌ష్టాలు ఎదుర‌య్యాయ‌ని చెప్ప‌క‌నే చెప్పింది. జ‌గ‌న‌న్న చెల్లిని దూరం పెట్ట‌డంతో.. తండ్రిలేని లోటు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందామెకు అంటున్నారు. అందుకే, తండ్రిని గుర్తు చేసుకుంటూ.. కంట కారుతున్న  క‌న్నీరును తుడుచుకుంటూ.. బాధాత‌త్ప హృద‌యంతో ఈ ట్వీట్ చేసిన‌ట్టున్నారు ష‌ర్మిల‌.  ఇడుపులపాయ‌లో వైఎస్సార్ స‌మాధి ద‌గ్గ‌ర నివాళి అర్పించి వ‌చ్చిన త‌ర్వాతే ష‌ర్మిల ఈ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. అక్క‌డ త‌న‌కు జ‌రిగిన అవ‌మాన‌భారం త‌ట్టుకోలేకే.. ఇంటికెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి.. అన్న‌ను అన‌లేక‌.. తండ్రితోడు లేక‌.. ఇలా విషాద‌భ‌రిత‌మైన ట్వీట్ చేశార‌ని అంటున్నారు. తండ్రి స‌మాధి సాక్షిగా జ‌గ‌న‌న్న చెల్లి ష‌ర్మిల‌ను క‌నీసం ప‌ల‌క‌రించ‌పోవ‌డం.. ఓ న‌వ్వు కూడా న‌వ్వ‌క‌పోవ‌డం.. బాగున్నావా చెల్లి అని కూడా అన‌క‌పోవ‌డంతో.. ఆ తీవ్ర అవ‌మాన భారంతో కుమిలిపోయి.. ఆ ఉడుకుబోతుత‌నంతో ఇలా ట్విట్ట‌ర్‌లో ఆ గోడు వెళ్ల‌బోసుకున్నార‌ని చెబుతున్నారు. తండ్రి దూర‌మ‌య్యాడ‌నే బాధ‌తో పాటు జ‌గ‌న‌న్న సైతం దూర‌మ‌య్యాడ‌నే ఆవేద‌న కూడా ఆమె మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు. చెల్లి కంట క‌న్నీరు పెట్టించిన పాపం ఊరికోపోదంటూ.. జ‌గ‌న‌న్న‌పై సోష‌ల్ మీడియాలో కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు ష‌ర్మిల అభిమానులు.    

ఫుట్‌బాల్ రారాజు రొనాల్డొ.. 111 గోల్స్‌తో వాల్డ్‌ రికార్డ్‌..

ఫుట్‌బాల్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాగా పాపులారిటీ ఉన్న గేమ్‌. ఫుట్‌బాల్ క్రేజ్‌, బిజినెస్‌, స్టార్‌డ‌మ్ ముందు మ‌న క్రికెట్ దిగ‌దుడుపు. అలాంటి ఫుట్‌బాల్ ఆట‌లో కింగులాంటోడు రొనాల్డొ. ఆ స్టార్ ప్లేయ‌ర్ ఇప్పుడు మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఫుట్‌బాల్ గేమ్‌లో త‌నంత‌టి మొన‌గాడు ఎవ‌రూ లేర‌ని నిరూపించుకున్నాడు.  అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో ఒక్క గోల్ కొడితేనే చాలా గ్రేట్‌. అలాంటిది.. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 111 గోల్స్ కొట్టిన తొలి ఆట‌గాడిగా రొనాల్డొ చ‌రిత్ర సృష్టించాడు. జ‌స్ట్ 111 యేనా.. అలాంటి సెంచ‌రీలు మా క్రికెట్‌లో ఎంతోమంది ఎన్నోసార్లు కొట్టార‌ని త‌క్కువగా అనుకునేరు. ఫుట్‌బాల్ గేమ్‌లో 111 గోల్స్ కొట్ట‌డం న‌భూతో. అది కేవ‌లం రొనాల్డొకే సాధ్యమైంది.  మైదానంలో తన విన్యాసాలతో అందరినీ ఉర్రూతలూగించే క్రిస్టియానో రొనాల్డొ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 111 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ అర్హత మ్యాచులో ఈ పోర్చుగల్‌ స్టార్ రొనాల్డొ రెండు గోల్స్ కొట్టి.. ఈ ఫీట్‌ను సాధించాడు.  బుధవారం జరిగిన మ్యాచులో 89వ నిమిషంలో రొనాల్డొ 110వ గోల్‌ నమోదు చేసి ఇరాన్‌ మాజీ స్ట్రైకర్‌ అలీ దేయి (109)ని అధిగమించాడు. ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా రెండో హెడర్‌తో 111వ గోల్ కొట్టాడు. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. 180 మ్యాచులు ఆడి రొనాల్డొ ఈ రికార్డును సాధించాడు. ‘నాకెంతో సంతోషంగా ఉంది. కేవలం ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినందుకే కాదు. మేమంతా కలిసి ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించాం. ఆట చివర్లో రెండు గోల్స్‌ చేయడం తేలిక కాదు. అందుకే జట్టు కష్టపడ్డ తీరును నేను అభినందిస్తున్నా. ఆఖరి వరకు మేం గెలుస్తామనే నమ్మాం’ అని మ్యాచ్ ముగిశాక‌ రొనాల్డొ అన్నాడు. ఒక జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో అలీ దేయి (109), మోఖ్తర్‌ దహారి (89), ఫెర్నిస్‌ పుస్కస్‌ (84), గాడ్‌ఫ్రే చిటాలు (79) రొనాల్డొ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ఇండియా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 74 గోల్స్‌తో 12వ స్థానంలో నిలవ‌డం ఆస‌క్తిక‌రం.  

కరోనా కొత్త వేరియంట్.. ఇండియాకి ఇంకా రాలేద‌ట‌.. వ‌చ్చాక‌ ప‌రిస్థితేంటి?

C.1.2. క‌రోనా కొత్త వేరియంట్‌. ఈ పేరు చెబితేనే యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. ఆల్ఫా, డెల్టాల‌తోనే చ‌చ్చిపోతుంటే.. ఇక ఇంకో కొత్త వేరియంట్ విజృంభిస్తే ప‌రిస్థితి ఏంటంటూ బెంబేలెత్తిపోతోంది. ఈ కొత్త మ్యూటెంట్‌కు కొవిడ్ టీకాల‌నూ ఎదుర్కొనే సామ‌ర్థం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటుండ‌టంతో మ‌రింత డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో మొద‌ట గుర్తించగా.. ఇప్ప‌టికే చైనా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ త‌దిత‌ర దేశాల‌కు వ్యాపించిన‌ట్టు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టించింద‌ది. ఇప్పటి వరకు ఉన్న అన్ని వేరియంట్లతో పోలిస్తే C.1.2 మ‌రింత డేంజ‌ర‌స్ అని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టం క‌ల‌వ‌రం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండ‌టంతో స‌ర్వ‌త్రా ఆందోళన వ్యక్తమ‌వుతోంది. అయితే , ప్రస్తుతానికి ఈ రకం వేరియంట్ భారత్‌లోకి ఇంకా ప్రవేశించలేదని కేంద్రం వెల్లడించడం ఒక్క‌టే కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్ప‌టికింకా రాక‌పోయినా.. భ‌విష్య‌త్తులో వ‌స్తే? ఏంటి ప‌రిస్థితి? మ‌న దేశం ఈ కొత్త వేరియంట్‌ను ఫేస్ చేయ‌గ‌ల‌దా? దాని ముందు వ్యాక్సిన్లూ ప‌నికిరాక‌పోవ‌చ్చని అంటుంటే.. అది అంత ఖ‌త‌ర్నాకా? థ‌ర్డ్ వేవ్ దీనితోనేనా? అనే భ‌యాందోళ‌న‌లు.  మ‌రోవైపు.. దేశ‌వ్యాప్తంగా కొత్త కేసులు, మరణాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కేసుల సంఖ్య‌ 47వేలు దాటగా.. మరణాలు కూడా 500పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత ఇదే కావ‌డం ఆందోళ‌న‌క‌రం. అయితే, వీటిలో 70శాతం కేరళలోనే ఉండ‌టం ఆ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.  కరోనా సెకండ్ వేవ్ నుంచి కేరళ ఇంకా బయటపడట్లేదు. అక్క‌డ‌ బుధవారం ఒక్కరోజే 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం కేసుల్లో మూడింట రెండొంతులు కేర‌ళ‌ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,89,583 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 1.19శాతానికి పెరిగింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 66కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

పావురాల‌గుట్టలో ఆ రోజు అస‌లేం జ‌రిగింది..? మిస్ట‌రీనా? క్లారిటీనా?

సెప్టెంబర్ 2, 2009. చిత్తూరు జిల్లాలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి హైద‌రాబాద్ నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయి. అంతే. ఒక్క‌సారిగా అంతా ఉలిక్కిప‌డ్డారు. మొద‌ట అదేదో టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ అనుకున్నారు. స‌మ‌యం గ‌డుస్తున్నా.. హెలికాప్ట‌ర్‌తో కాంటాక్ట్ దొర‌క్క‌పోవ‌డంతో అనుమానం మొద‌లైంది. అంత‌లోనే అది ఆందోళ‌న‌కు దారి తీసింది. దేశ‌మంతా ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయింది. కేంద్ర ప్ర‌భుత్వ‌మూ వెంట‌నే స్పందించింది. స్థానిక పోలీసులు, అధికారుల‌తో పాటు ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. గంట‌ల త‌ర‌బ‌డి సెర్చ్ ఆప‌రేష‌న్ జ‌రిపారు.  ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాదస్థలం రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది. ఆ ప్రాంతం పావురాల‌గుట్ట‌. హెలికాప్ట‌ర్ కూలిన ప్ర‌మాదంలో నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో స‌హా మొత్తం ఐదుగురు మరణించారు.  వైఎస్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. యాక్సిడెంటల్‌గా జరిగిందా? లేదంటే ఎవరిదైనా హస్తముందా? జాతీయ స్థాయి కుట్ర దాగుందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్‌హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె.త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించారు. సీబీఐ సైతం వైఎస్సార్ మ‌ర‌ణంపై విచార‌ణ జ‌రిపింది. అయితే వైఎస్‌ఆర్ మృతిపై దర్యాప్తు సంస్థలు మాత్రం ఒకే మాటకు కట్టుబడి ఉన్నాయి. డీజీసీఏ, సీబీఐతో పాటు మరో రెండు దర్యాప్తు సంస్థలు ఒకే విషయం వెల్లడించాయి. అప్ప‌టి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆ హెలికాప్టర్ ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేసిన జేడీ లక్ష్మినారాయణ.. ఆ త‌ర్వాత ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చేసిన వ్యాఖ్య‌లు వైఎస్ మ‌ర‌ణంపై క్లారిటీ ఇచ్చాయి. ఇక‌, విచార‌ణ సంస్థ‌ల‌న్నీ అది ప్ర‌మాద‌మేన‌ని.. ఎలాంటి కుట్ర లేక‌పోవ‌చ్చ‌ని నివేదిక‌లు ఇచ్చాయి.  ఇక జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ఏమ‌న్నారంటే.. అందరిలాగే తమకు కూడా కేసు దర్యాప్తులో ఎన్నో అనుమానాలు వచ్చాయని.. ఆ ప్రమాదం యాక్సిడెంటల్‌గా జరిగిందా.. లేదంటే ఎవరైనా చేయించారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశామని తెలిపారు. ఆడియో విజువల్స్‌తో కూడిన ఓ రిపోర్ట్ రూపొందించి రిలీజ్ చేశామన్నారు. అది పూర్తిగా యాక్సిడెంటల్‌గా జరిగిందనే విషయం అందులో ప్రెజెంట్ చేశామని తెలిపారు. ఆ రోజు వాతావరణం సరిగా లేదన్నారు జేడీ. క్యుములో నింబస్ మేఘాలే వైఎస్ ప్ర‌యాణించిన‌ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమని వివరించారు. ఆ మేఘాల్లో వాక్యూమ్ నిండి ఉంటుందని.. అవి హెలికాప్టర్‌ను లాగేస్తుంటాయని తెలిపారు. ఆ క్రమంలో మేఘాల్లోకి హెలికాప్టర్ ప్రవేశించిందని.. దాంతో హెలికాప్టర్ యాక్సిడెంటల్‌గా కూలిపోయిందని జేడీ ల‌క్ష్మినారాయ‌ణ వివ‌రించారు.  ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని.. బ్లాక్ బాక్స్‌లో రికార్డయిన సంభాషణలు విన్నామని.. అటు వాతావరణ శాఖ, సివిల్ ఏవియేషన్ నిపుణుల సాయంతో రిపోర్ట్ రూపొందించామని గ‌తంలో జేడీ చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా యాక్సిడెంటల్‌గా జరిగిన ప్రమాదమని తేల్చిందని గుర్తు చేశారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాద సమయంలో కో పైలెట్ కెప్టెన్ ఎంఎస్ రెడ్డి 'గో అరౌండ్' అంటూ బిగ్గరగా అరిచినట్లు బ్లాక్ బాక్స్‌లో రికార్డయిందని గుర్తు చేశారు జేడీ. గో అరౌండ్ అనేది ఎమర్జెన్సీ సమయంలో వాడే ఒక బటన్ అని.. అది నొక్కితే సడెన్‌గా హెలికాప్టర్ పైకి లేస్తుందని వివరించారు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా హెలికాప్టర్‌లో వాడే ఫ్యూయల్, లూబ్రికెంట్స్‌ వాడకం ఒక్కసారిగా పెరిగి రెడ్ లైట్ వస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఆయన గో అరౌండ్ అని అరిచారని.. ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కితే హెలికాప్టర్ పైకి లేస్తుందని అలా చెప్పి ఉంటారని అన్నారు. ఒక్కోసారి హెలికాప్టర్లు ల్యాండయ్యే సమయంలో గేదెలు తదితర జంతువులు అడ్డొస్తే గో అరౌండ్ బటన్ నొక్కుతారని.. దాంతో హెలికాప్టర్ సడెన్‌గా దానంతట అదే పైకి వెళుతుందని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్య‌క్త‌మైన‌ప్పటికీ.. జరిగింది మాత్రం కేవ‌లం ప్ర‌మాద‌మేన‌ని అన్ని ద‌ర్యాప్తు సంస్థ‌లు పూర్తిస్థాయి ద‌ర్యాప్తు త‌ర్వాత వెల్ల‌డించిన విష‌యం. అయితే, వైఎస్సార్ మ‌ర‌ణాన్ని కొంద‌రు రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఆ త‌ర్వాత కాలంలో వైఎస్సార్ మ‌ర‌ణం.. పావురాల‌గుట్ట హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై వ‌చ్చిన అనుమానాల‌న్నీ క్ర‌మ‌క్ర‌మంగా క‌నుమ‌రుగ‌య్యాయి. వైఎస్సార్ మ‌ర‌ణించి 12 ఏళ్లు గ‌డుస్తోంది.

అన్న‌.. చెల్లి.. తల్లి.. వైఎస్‌ స‌మాధి సాక్షిగా ఏం మెసేజ్ ఇచ్చిన‌ట్టు?

వ‌స్తారా? రారా? అనుకున్నారు. క‌లుస్తారా? లేరా? అని చూశారు. జ‌యంతికి ఎవ‌రి దారి వారిదే. ఉద‌యం త‌ల్లి, చెల్లి.. సాయంత్రం అన్న‌. ఆనాడు తండ్రి స‌మాధి సాక్షిగా కుటుంబ విభేదాలు బ‌య‌ట‌పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల్లో అబాసుపాల‌య్యారు. అన్న జైలు కెళితే.. పార్టీ కోసం త‌ల్లి, చెల్లి అంత చేస్తే.. ఇప్పుడేంటి.. అంద‌ల‌మెక్కాక అన్న‌.. ఆ ఇద్ద‌రినీ దూరం పెట్టేశార‌ని.. వైఎస్సార్ అభిమానులే జ‌గ‌న్‌ను చీద‌రించుకున్నారు. అందుకే, జ‌యంతి రోజున అంత ర‌చ్చ జ‌రిగింది కాబ‌ట్టే.. ఇప్పుడు వ‌ర్థంతికి ఏం జ‌రుగుతుందోన‌ని అంతా ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. అన్ని క‌ళ్లూ ఇడుపుల‌పాయ వైపే చూశాయి.  సెప్టెంబ‌ర్ 2. ఆ రోజు రానే వ‌చ్చింది. ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వైఎస్సార్ 12వ వ‌ర్థంతికి ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ ఘాట్‌లో గంభీర వాతావ‌ర‌ణం క్రియేట్ అయింది. జ‌యంతి మాదిరి అన్నా, చెల్లి, త‌ల్లి.. వేరు వేరుగా వ‌స్తారా? ఒక తండ్రి బిడ్డ‌లుగా ఆ ఇద్ద‌రూ క‌లిసే నివాళులు అర్పిస్తారా? అని అంతా అటెన్ష‌న్‌. ఆ గ‌డియ వ‌చ్చే స‌రికి కాస్త క్లారిటీ.. మ‌రికాస్త క‌న్ఫ్యూజ‌న్ ఏర్ప‌డింది. మ‌ళ్లీ ఎటూ తేల‌కుండా.. అదే గ‌డిబిడి కొన‌సాగుతోంది. అన్న వ‌చ్చాడు. తల్లితో క‌లిసి చెల్లి కూడా వ‌చ్చింది. వైఎస్సార్‌కు నివాళి అర్పించేందుకు కుటుంబం అంతా త‌ర‌లివ‌చ్చారు. అది కూడా అంతా ఒకేసారి వ‌చ్చారు. త‌ల్లి, చెల్లి, అన్న‌.. ఆ ముగ్గురూ ప‌క్క ప‌క్క‌నే కూర్చుకున్నారు. మ‌త ప్రార్థ‌న‌లు జ‌రుగుతుండ‌గా.. మౌనంగా వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వ‌చ్చిన దారినే ఎవ‌రి మానాన వారు వెళ్లిపోయారు.  ఒక మాటా లేదు.. ఒక మంతీ లేదు.. ఒక న‌వ్వూ లేదు.. ఒక ప‌ల‌క‌రింపూ లేదు. ముగ్గురి ముఖాలూ మాడిపోయి ఉన్నాయ‌ని అంటున్నారు. బ‌హుషా వైఎస్సార్‌ వ‌ర్థంతి క‌దా.. ఆయ‌న జ్ఞాప‌కాల్లో విషాదంతో ఉండి ఉంటారు. మ‌రి, ఆ తండ్రి క‌న్న‌బిడ్డ‌లేగా.. తోడ‌బుట్టిన అన్నాచెల్లెల్లేగా.. బాగున్నావా.. అంటే ఏం పోయింది. ఓ న‌మ‌ష్కారం ప‌డేస్తే ఏ కిరీటం ప‌డిపోతుంది. త‌ల్లి సాక్షిగా.. తండ్రి స‌మాధి ముందు.. ఆ అన్నాచెల్లెల్ల జ‌గ‌డం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. వైఎస్ కుటుంబంలో పెద్ద గొడ‌వే జ‌రిగుంటుంద‌ని.. అందుకే మ‌రీ ప‌క్క ప‌క్క‌నే ఉన్నా.. ప‌ట్టించుకోనంత దూరం వారి మ‌ధ్య పెరిగిపోయింద‌ని అంటున్నారు. జ‌గ‌న‌న్న చెల్లికి పెద్ద ద్రోహ‌మే, భారీ అన్యాయ‌మే చేసుంటార‌ని చ‌ర్చించుకుంటున్నారు.  వైఎస్సార్‌ జ‌యంతి మాదిరి వేరు వేరుగా వ‌చ్చి అంద‌రినోటా ప‌డ‌కుండా.. ఒకేసారి వ‌చ్చి ఈసారికి మాత్రం కాస్త న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఫ్యామిలీ అంతా క‌నిపించి.. విభేదాల‌ను కాస్త క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు...అంటున్నారు. 

జాతీయ జంతువుగా గోవు?  చట్టం చేయాలన్న అలహాబాద్ హైకోర్టు 

హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోవు విషయంలో చాలా కాలంగా ఓ డిమాండ్ ఉంది. హిందువులకు పూజనీయమైన గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పలు సంస్థలు కోరుతున్నాయి. కొన్ని సంఘాలు ఇందుకోసం ఉద్యమాలు కూడా చేశాయి. తాజా గోవు విషయంలో ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం.. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని తెలిపింది.  గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం గుర్తు చేసింది. సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతినే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించిన అలహాబాద్ ధర్మాసనం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం భుజించే వారికి ప్రత్యేకం ఏమీ కాదని తేల్చి చెప్పింది. గోవును పూజించే వారికి, దానిపై ఆర్థికంగా ఆధారపడే వారికీ ఇది ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విజయమ్మ సమావేశం వెనుక ఆయనదే కీ రోల్? హాజరుకానున్న ఏపీ మంత్రి? 

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి విజయ్మమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆమె ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంస్మరణ సభపైనే అందరి కన్ను పడింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ విజయమ్మ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 3 వందల మందికి విజయమ్మ నుంచి ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ కలిసి పని చేసిన నేతలు, అధికారులు, జర్నలిస్టులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మంత్రులుగా ఉన్నవాళ్లకు కూడా ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. దీంతో విజయమ్మ సమావేశానికి ఎవరెవరు వెళతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.  ఇక విజయమ్మ నిర్వహిస్తున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లన్ని ఒక వ్యక్తి పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలుస్తోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం పేషీలో అడిషనల్ పీఎస్ గా వ్యవహరించిన శర్మే ఏర్పాట్లు చూస్తున్నారని చెబుతున్నారు. గతంలో వైఎస్ కార్యక్రమాలకు ఆయనే కర్త.. కర్మ.. క్రియ అనేవారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నవారిలో శర్మ.. సూరీడు.. చారి.. ప్రభాకర్ రెడ్డి.. జన్నత్ హుస్సేన్.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యులు. వైఎస్ పాల్గొనే ప్రతి కార్యక్రమం శర్మే ఫైనల్ చేసే వారని చెబుతారు. వైఎస్సార్ మరణం తర్వాత కూడా ఆయన కుటుంబంతో కలిసి ఉన్న అతి కొద్దిమందిలో శర్మ ఒకరు. అందుకే సమావేశ బాధ్యతలను శర్మకు విజయమ్మ అప్పగించారని తెలుస్తోంది.  వైఎస్సార్ సంస్మరణ సభను సక్సెస్ చేసేందుకు శర్మ తన పాత పరిచయాల్ని తిరగదోడుతున్నారని చెబుతున్నారు. సమావేశానికి ఎవరెవరిని పిలవాలి? వారికి సంబంధించిన వివరాలు.. కాంటాక్టులు అన్ని కూడా శర్మనే సేకరించినట్లు చెబుతున్నారు, కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఎవరితో నేరుగా ఫోన్లో మాట్లాడాలి? ఎవరికి మెసేజ్ లు పంపాలి? ఇలాంటివన్నివిషయాలు శర్మనే దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా విజయమ్మ ఆత్మీయ సమావేశంలో శర్మ కీలకభూమిక పోషిస్తున్నారని అంటున్నారు,  విజయమ్మ సమావేశానికి అప్పటి కేబినెట్ మంత్రులే కాకుండా గతంలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ హీరో నాగార్జున, దర్శకులు పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ తదితరులకు ఆహ్వానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీకే బృందంలోని శిష్యురాలు షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది.

నార్కో అనాలిసిస్ పరీక్షకు అంగీకరించని సునీల్.. సీబీఐ ఏం చేయనుందో? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ , దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక  పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో కొన్ని రోజులుగా దూకుడుగా వెళుతున్న సీబీఐకి నిరాశ ఎదురైంది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి  జమ్మలమడుగు కోర్టులో .. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. వివేకా హత్యకేసులో వాస్తవాలు రాబట్టేందుకు సునీల్ యాదవ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని సీబీఐ  కోర్టును కోరింది. నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను న్యాయమూర్తి అడిగారు. అయితే నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో  సీబీఐ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు జమ్మలమడుగు కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నిబంధన కారణంగా సీబీఐకి వివేకా కేసులో నిరాశ ఎదురైంది. సునీల్ యాదవ్ నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించకపోవడంతో సీబీఐ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది.  మరోవైపు సునీల్ యాదవ్ నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించకపోవడంతో కేసులో చిక్కుముడి ఎలా వీడుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇటీవలే వివేకా హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల నజరానా ప్రకటించింది సీబీఐ. దీంతో వివేకా కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా కూతురు సునీతా రెడ్డి గతంలోనే కొందరు అనుమానితుల పేర్లను సీబీఐకి ఇచ్చింది. అందులో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది. ఇటీవలే అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య కేసు విచారణలో జరుగుతున్న పరిణామాలతో ఈ కేసులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. 

తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట్టేందుకు మహిళ యత్నం.. కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ రైతు డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయంది. దీంతో కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడున్నవారంతా మహిళను అడ్డుకుని డీజిల్ బాటిల్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి అనే మహిళకు ఆరెపల్లెలో 22 ఎకరాల భూమి ఉంది. అయితే  ఆ భూమిని ఇతరుల పేరుమీద  మార్చారని ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భర్త యాదగిరి, కుమారుడు భానుతో కలిసి వచ్చిన ఆమె… పెట్రోల్‌ పోసి తహసీల్దారు ఆఫీసును తగలబెట్టేందుకు యత్నించింది.  తన భూములను ఇతరులకు రాసిచ్చారని మహిళ ఆరోపిచింది. కొండపాక తహశీల్దార్ తమను మోసం చేశారని మండిపడింది. లంచం తీసుకుని తమ భూమిని మరొకరి పేరుపై ఆన్ లైన్ చేశారని చెబుతోంది. తమ భూమిని మరొకరి పేరుతో రాయడమే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ తహశీల్దార్ బెదిరిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది.  డీజిల్ బాటిల్ తో ఉన్న మహిళను గమనించిన తహసీల్దారు రామేశ్వర్‌ పోలీసులను అలెర్ట్ చేయడంతో కుకునూరుపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళను అడ్డుకున్నారు. భూ వివాదంపై కోర్టుకు వెళ్లాలని మహిళకు తహసీల్దారు సూచించారు. ఇకపై ఇక్కడ ఆందోళనకు చేయవద్దంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. 

'వ‌ధువు కావ‌లెను'.. షాపు ముందు బోర్డు.. విదేశాల నుంచీ ఫోన్లు..

ఇత‌ని పేరు ఉన్నికృష్ణ‌న్‌. వ‌య‌సు 33 ఏళ్లు. ఉండేది కేర‌ళ‌లో. చూట్టానికి బాగానే ఉంటాడు. సొంత షాపు కూడా ఉంది. అయినా, అత‌నికి పెళ్లి కావ‌డం లేదు. తెలిసిన వారికి, క‌లిసిన వారికి.. అంద‌రికీ త‌న‌కో సంబంధం చూడ‌మ‌ని చెబుతున్నాడు. అయినా, ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌ట్లేదు. చాలా కాలం వేచి చూసి.. ఇక విసుగెత్తి.. వేసారిపోతుండ‌గా.. అత‌నికో అద్బుత‌మైన ఆలోచ‌న వ‌చ్చింది. ఆ ఐడియా త‌న జీవితాన్ని మార్చేస్తుంద‌ని అనుకున్నాడు. ఆ ప‌నితో తొంద‌ర‌లోనే త‌న పెళ్లి అయిపోతుంద‌ని భావిస్తున్నాడు. అయితే, ఇంకా పెళ్లైతే ఫిక్స్ కాలేదు కానీ.. అత‌గాడికి మాంచి పాపులారిటీ మాత్రం వ‌చ్చేసింది. సొంతూరు, రాష్ట్రం, దేశం అనే కాదు.. వివిద దేశాల్లోనూ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలిసి.. అత‌నికి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇంత‌కీ అత‌ను చేసిన ప‌నేంటంటే.... `వధువు కావలెను`.. అంటూ ఏ పేప‌ర్లోనో, మ్యాట్రిమోనీ సైట్‌లోనే ప్ర‌క‌ట‌న ఇవ్వ‌కుండా.. నేరుగా త‌న షాపు ముందు బోర్డు పెట్టాడు. కులం, మతంతో సంబంధం లేదంటూ.. ఆ బోర్డ్ పై తన ఫోన్ నంబర్ కూడా రాశాడు. షాపు కొచ్చిన వాళ్లంతా అది చూసి.. త‌మ‌కు తెలిసిన వారంద‌రికీ సంబంధం చూడ‌మ‌ని చెప్పేవాళ్ల‌ట‌. క‌స్ట‌మ‌ర్ల‌లో ఒక‌రు.. వ‌ధువు కావ‌లెను.. అనే బోర్డును ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే. ఉన్నికృష్ణన్ బోర్డు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అయింది. షేర్ల మీద షేర్లు కావ‌డంతో.. ఆ పోస్ట్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ బోర్డు మీద ఉన్న ఆయ‌న‌ నెంబ‌ర్‌కు.. తెలిసిన సంబంధం ఉందంటూ.. తెగ ఫోన్లు వ‌స్తున్నాయ‌ట‌. ఉన్ని క్రిష్ణ‌న్ వివ‌రాలు ఆరా తీస్తున్నార‌ట‌. కేర‌ళ‌తో పాటు వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి కూడా ఫోన్ చేసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నార‌ట‌. సోష‌ల్ మీడియా పుణ్యాన‌.. త‌ను పెట్టిన బోర్డు కార‌ణంగా.. దెబ్బ‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా పెళ్లి సంబంధాలు వ‌చ్చి ప‌డుతుండ‌టంతో మ‌నోడు తెగ ఖుషీ అవుతున్నాడ‌ట‌. అయితే, అవన్నీ త‌న స్థాయికి మించిన మ్యాచెస్ కావ‌డంతో.. త‌న‌కు త‌గ్గ అమ్మాయి కోసం ఓపికగా అన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాడ‌ట‌.  `నేను గతంలో కూలి పని చేసేవాడిని. ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. నా తలలో కణతి ఉండటంతో గతంలో సర్జరీ జరిగింది. ఇప్పుడు కోలుకున్నా. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. ఎక్కడా సెట్ కాలేదు. అందుకే ఇలా బోర్డ్ పెట్టాను. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కొంత మంది మామూలుగా కాల్ చేసి `ఆల్ ది బెస్ట్` చెబుతున్నార`ని ఉన్నికృష్ణన్ అంటున్నాడు. 

ఏపీ కొత్త సీఎస్ ఎవరో? జగన్ బెయిల్ కేసుతో లింక్?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం సెప్టెంబర్ ఆఖరుకు ముగుస్తుంది. నిజానికి గత జూన్ నెల చివరికే ఆయన రిటైర్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా సెప్టెంబర్ చివరికి ముగుస్తున్న నేపధ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ రాజకీయ,  మీడియా వర్గాలలో మొదలైంది.   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కావాలనుకుంటే, ఆయన ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించమని కేంద్రాన్ని కోరవచ్చును. కేంద్రం కూడా కాదనక పోవచ్చును. ఆవిధంగా  ఆదిత్యానాథ్ దాస్ మరో మూడు నెలలు. అంటే  డిసెంబర్ చివరి వరకు సీఎస్’గా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేద్రాన్ని మరో పొడిగింపు అడగక పోవచ్చని, అన్నీ అనుకూలిస్తే, 1988  బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పించే ఆలోచనలో ఆయన ఉన్నారని, అంతర్గత వర్గాల సమాచారం. తెలంగాణ క్యాడర్’కు  చెందిన ఆమెను జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం చాలా కష్టపడే రాష్ట్రానికి రప్పించుకున్నారు. అలాగే, చకచకా పదోన్నతులు కల్పించారు. ఇప్పుడు శ్రీలక్షి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆమెకు చురుకైన ఆఫీసర్’గా మంచి పేరుంది. అదే సమయంలో, జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, గాలి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ముద్దాయిగా, సీబీఐ విచారణ ఎదుర్కుంటున్నారు. జైలు జీవితం కూడా గడిపారు.   సాధారణ పరిస్థితులలో అయితే జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి లీగల్ ఇష్యూస్’ను అంతగా పట్టించుకోకపోవునేమో గానీ, రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అక్రమాస్తుల కేసులకు సంబంధించి జగన్ రెడ్డి బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లో, తమకు అనుకూలమైన అధికారులను కీలక పదవులలో నియమించుకుని,  సాక్షాధారలను తారుమారు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కేసు విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వచ్చే వస్తుందని అంటున్నారు. ఈ తీర్పును బట్టి శ్రీ లక్షికి అవకాశం ఇవ్వడమా లేక  మరోకరిని సీఎస్’గా తీసుకోవడమా అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు.  ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఐఏఎస్ అధికారులలో మాజీ సీఎస్, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాదికారిగా ఉన్న నీలం సహానీ భర్త., అజయ్ సహానీ, అందరికంటే సీనియర్ అధికారి. ప్రస్తుతం డిపుటేషన్ మీద కేంద్ర సర్వీస్’లో ఉన్న ఆయన  సీఎస్  పోస్టు ఇస్తామంటే రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవలే ముఖ్యమంత్రి అభ్యర్ధన మేరకు స్టేట్ సర్వీస్ కు వచ్చిన 1985 బ్యాచ్’ ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రెడ్డి సుబ్రమణ్యం, సతీష్ చంద్ర కూడా సీనియర్ల జాబితాలో ఉన్నారు. ఎ అందరితో పాటుగా  1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు కూడా అధికార వర్గాల్లో వినవస్తోంది. అయితే శ్రీలక్ష్మి పదోన్నతికి అడ్డుగా నిలిచిన లీగల్ అవరోధాలు తొలిగి పోతే, ఆమెకే అవకాశం ఇస్తారు. కాదంటే, నీరభ్ కుమార్ ప్రసాద్ ను అదృష్టం వరించ వచ్చని సమాచారం.  అయితే సెప్టెంబర్ 15 న సీబీఐ కోర్టు జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే ..అప్పుడు కథ వేరుగా ఉంటుంది.

వైఎస్ ఫ్యామిలీలో జగన్ రెడ్డి ఏక్ నిరంజన్?

సెప్టెంబర్ 2 దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన వైఎస్సార్, 2009 సెప్టెంబర్ 2 న హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు. అంటే ఆయన చనిపోయి పుష్కర కాలం పూర్తయింది. ఈ 12 ఏళ్ల కాలంలో రాష్ట్ర రాజకీయాలోనే కాదు, దేశ రాజకీయాలలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రాజకీయ స్థితిగతులు మారిపోయాయి.ఈ మార్పులు చేర్పులలో  వైఎస్సార్ ఫ్యామిలీ రాజకీయంగా, ఇతరత్రా అనేక సమస్యలు ఎదుర్కుంది. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా వైఎస్ కుటుంబం మొత్తం ఒకటిగానే ఉంది. కష్ట నష్టాలను ఉమ్మడిగానే అనుభవించింది.  వైఎస్ కుమారడు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు, సిబిఐ విచారణ కార్యాలయం (దిల్ కుష్ గెస్ట్ హౌస్) వద్ద జగన్ తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిల,భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఫుట్ పాత్ మీద కూర్చుని అర్థరాత్రి వరకు ధర్నా చేసిన దృశ్యాలు ఇంకా కాళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ కూడా చేశారు. అయినా లోటస్ పాండ్ వద్ద ధర్నాను కొనసాగించి, వైఎస్ కుటుంబం అంతా ఒకటిగా పోరాటం కొనసాగించింది. ఇక జగన్ రెడ్డి అరెస్ట్ కారణంగా ఆగిపోయిన పాదయాత్రను, అన్న వదిలిన బాణం నేనేంటూ షర్మిల కొనసాగించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి కుటుంబ రాజకీయ వారసత్వాన్ని సజీవంగా ఉంచడమే కాకుండా, అన్న జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేశారు. అలాంటిది ఇప్పుడు  వైఎస్ ఫామిలీ రెండుగా చీలిపోయిందా అంటే అవుననే అనవలసి వస్తోంది. కుటుంబాన్ని నిచ్చెనగా చేసుకుని, ముఖ్యమంత్రి పీఠమెక్కి కూర్చున్న జగన్ రెడ్డి, మెల్ల మెల్లగా తల్లీ చెల్లిని దూరం పెడుతూ వచ్చారు.  ఆస్తుల తగువులో, రాజకీయ విభేదాలు, వివాదాలు. కారణం ఏదైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అటు తల్లితోనూ,ఇటు చేల్లితోనూ కూడా దూరం పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వైఎస్ ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి మధ్య అగాధం ఏర్పడింది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో, ఎవరు, ఎందుకు చేయించారో గానీ, ఆ ఉదంతంతో వివేకా కుటుంబానికి జగన్ రెడ్డి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ‘ఆ ఇద్దరే’ హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక జగన్ సోదరి షర్మిల పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారు. తెలంగాణ కోడలినంటూ తెలంగాణలో  వైఎస్సార్ టీపీ పేరిట సొంత రాజకీయ వేదిక ఏర్పరచుకున్నారు. ‘రాజన్న రాజ్యం’ నినాదంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో రాజీలేని పోరాటమ చేస్తామని ప్రకటించుకున్నారు. షర్మిల రాజకీయలను కాసేపు పక్కన పెడితే వైఎస్ కుటుంబ కలహాలు రోజురోజుకు మరింతగా ముదురు పాకాన పడుతున్నాయి. జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఆనవాయితీకి భిన్నంగా, అమ్మా, కొడుకు, అక్కా,చెల్లి ఎవరికి  వారుగా ఇడుపులపాయలోని  వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఒకరికి ఒకరు తారసపడకుండా చాలా జగ్రత్తగా టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇలా కన్న తండ్రికి నివాళులు అర్పించడంలోనూ ఎవరిదారి వారిది అన్నట్లుగా వ్యవహరించారు. ఇది ఇద్దరి మధ్య తగవు ఎంత దూరం వెళ్లిందో చెప్పకనే చెప్పింది. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా వైరం ఎందుకు పెరిగింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని చిక్కు ప్రశ్నగానే మిగిలింది.  సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇటుపుల పాయలో అదే సీన్ రిపీట్ అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.  వైఎస్ సతీమణి విజయమ్మ, ఇన్నేళ్ళలో తొలిసారిగా, హైదరాబాద్ (నోవాటెల్ హోటల్‌) లో వైఎస్ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. అంతే కాదు, కాంగ్రెస్’లో మిగిలిన వైఎస్ మంత్రి వర్గ సహచరులు, అనుచరులతో పాటుగా తెరాస, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన వైఎస్ సహచర,మిత్రులు అందరినీ, వర్దంది సభకు రండని స్వయంగా ఆహ్వానించారు. అయితే, ఈ సభకు ఎవరొస్తారు, ఎవరురారు అనే విషయాన్ని పక్కన పెడితే,వర్ధంతి సభ ఉద్దేశం ఏమిటి, ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు,ప్రస్తుతానికి వెయ్యి డాలర్ల ప్రశ్న.  అయితే వర్ధంతి సభ ద్వారా జగన్ రెడ్డికి గట్టి వార్నింగ్  ఇవ్వడంతో పాటుగా, షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గం సుగమమం చేసేందుకే విజయమ్మ సభను ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించి,వైసీపీ సంబంధాలను తెన్చుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో కొందరు పరిశీలకులు ఆమె అడుగులు మళ్ళీ కాంగ్రెస్ వైపు పడుతున్నాయా అన్న అనుమానాలను కూడా  వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డితో దూరం పెరగడంతో పాటుగా షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఎదురవుతున్న వడిదుడుకులకు సమాధానంగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్డమయ్యారనే సందేహాలు వ్యక్తమమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా  విజయమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ జరగవచ్చని, అందుకు అటు నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ఫామిలీలో జగన్ రెడ్డి ఒంటరి అయ్యారనే  విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 

జగన్ సర్కార్ కు డబుల్ షాక్.. అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్

అంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఒకే రోజు జగన్ రెడ్డికి హైకోర్టులో రెండు షాకులు తగిలాయి. రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. వారికి నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకుంటూ ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ జీవోకు సంబంధించి తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చిందని, కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది వివరించారు. అయితే వారి వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వ తరఫు లాయర్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. అయినా ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ  తదుపరి చర్యలను నిలిపివేస్తూ రైతులకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక గూంటూరు జిల్లాలోని సంగం డెయిరీ అంశంలోనూ జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. ఈ అంశంపై దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంగం డెయిరీకి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెలువరించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... వైసీపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.  దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. డెయిరీ కేసులో హైకోర్టు తీర్పును టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైందని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడిరైతులు సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు. డెయిరీని తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన సర్కారుకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని ధూళిపాళ్ల అన్నారు.