రఘువీరా రీఎంట్రీతో జగన్‌కు చిక్కులేనా? సీమలో వైసీపీకి నష్టమేనా?
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని కొద్ది మంది రాజకీయ నాయకులలో, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి ఒకరు. రాజకీయాలలో ప్రత్యేక స్వరాన్ని వినిపించిన రఘువీర రెడ్డి, ఒక్క ముఖ్యమంత్రి పదవిని తప్ప, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎత్తుపల్లాలు అన్నీ చూశారు. కీలక పదవువులు అనుభవించారు. వ్యవసాయ మంత్రిగా కరవు జిల్లా అనంతపూర్ జిల్లా అభివృద్ధికి చాలా గట్టి ప్రయత్నం చేశారు. జిల్లా రాజకీయలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ్లలోనూ తమదైన ముద్ర వేశారు. అయితే,,2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి కూడా ఓడి పోవడంతో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక అక్కడినుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగింఛి, దైవ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.
అయితే, గత కొంత కాలంగా, రఘువీర పొలిటికల్ రీఎంట్రీపై రాజకీయ, మీడియా వర్గాలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.విభిన్న కోణాల్లో వ్యూహాగానలు వినిపిస్తునాయి. వరస ఓటముల కారణంగా ఒక విధమైన రాజకీయ వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితం వైపుకు మరలిన రఘువీర తమ జీవిత ఆశయంగా భావించిన ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, ఆయన రాజకీయ రీఎంట్రీ గురింఛి, చర్చ సాగుతోంది. అందులో ప్రధానంగా, ఆయన తిరిగి రాజకీయాలలోకి రావదమే నిజం అయితే, ఏ పార్టీలో చేరతారు... మాతృ సంస్థ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో అధికార వైసీపీలో చేరతారా, లేక వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చేతులు కలుపుతారా? అనే చర్చ అన్ని వర్గాలలోనూ వినవస్తోంది.
అయితే, ఆయన ప్రధానంగా కాంగ్రెస్ వాది. అది నిజం. అందులో మరో అభిప్రాయం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం అయినా, రాష్ట్ర్రంలో తమిళనాడు తరహ, రెండు పార్టీల వ్యవస్థ బలపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని, ఒకప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మిత్రులు కొందరు చెపుతున్నారు. నిజానికి, రఘువీర కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు, బలోపేతం చేసేందుకు మూడు నాలుగు సంవత్సరాలు చాలా గట్టి ప్రయత్నమే చేశారు.అయినా, ఆశించిన ఫలితం రాలేదు. అందుకే చివరాఖరుకు, చేసేది లేక అస్త్ర సన్యాసం చేశారు. అలిమి కానీ చోట అధికులమన రాదనే విజ్ఞతను చూపి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేకంటే, ఇప్పటిలానీ, ఉండిపోవడమే ఉత్తమమని ఆయన మిత్రులు అంటున్నారు. ఆయనకు అలాంటి ఆలోచన లేదని కూడా, అంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు, ఆ సమావేశానికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేవీపే రామచంద్ర రావు, తదిర నాయకులతో పాటుగా రఘువీరాకు కూడా ఆహ్వానం అందింది. అయినా, ఆయన హాజరు కాలేదు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు మళ్ళీ కాంగ్రేస్ లో చేరే ఆలోచన లేదని అనుకోవచ్చని అంటున్నారు.
అదే విధంగా, వైసీపీలో చేరే అవకాశం కూడా లేదని, అలాంటి ఆలోచనే ఉంటే, ఎప్పుడోనే ఆపని చేసేవారని అంటారు. అదీ గాక, ఇప్పటికే రఘువీర, జగన్ కారణంగా ఒక సారి అప్రదిష్ట పాలయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ప్రోద్బలంతో ఆయన్నిముఖ్యమంత్రిని చేయాలని ఇంకెవరో చేపట్టిన సంతకాల సేకరణ, వెనక రఘువీర ఉన్నారని ప్రచారం జరిగింది. నిజానికి, ఆ వ్యవహారంలో రఘువీర ప్రమేయం లేక పోయినా, జగన్ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా అపవాదు భరించవలసి వచ్చింది. అదీ, కాక, జగన్ రెడ్డి అరాచక పాలన చూస్తూ రఘువీర, ఆయనతో చేతులు కలపడం వంటి దుస్సాహసం చేయరని అంటున్నారు.
మరోవంక తెలుగు దేశం పార్టీ, చాలా కాలంగా రఘువీరా రెడ్డితో వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతోంది. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించిన రఘువీరా రెడ్డిని స్వయంగా అభినందించారు. మరోవంక, తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సోదరుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి, నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి నిర్మించిన దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమ హక్కుల కోసం కలిసిపోరాటం చేసేందుకు కలిసి రావాలని కోరినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడానికే అక్కడకు వెళ్లారనే చర్చ కూడా సాగుతోంది.
రఘువీరా రెడ్డి కూడా తెలుగు దేశం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.అయితే, ఒకటి మాత్రం నిజం ఆయన తిరిగి రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే, తెలుగు దేశంలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగి, రఘువీర టీడీపీలో చేరితే, ప్రస్తుతం బీజేపీ,జనసేన, వైసీపీలలో ఇతర పార్టీలలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుకలు టీడీపీ తలుపులు తట్టడం ఖాయమని పరిశీలకులు భావిస్తన్నారు. నిజానికి, ఇటీవల కాలంలో వస్తున్న సర్వేలు అన్నీ, రానుంది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ మాజీలు చాలా మంది ఇప్పటికే టీడీపే వైపు చూస్తున్నారని, రఘువీరా చేరికతో జోరు పెరుగుతుందని అంటున్నారు.