శంషాబాద్‌లో చిరుత సంచారం కలకలం

  శంషాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందంటూ గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్న పెద్ద షాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. పొలం వద్ద పనిచేస్తున్న కొంత మంది రైతులకు చిరుత కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.  అటవీ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు గుర్తించిన రైతులు తీవ్ర భయాందో ళనకు గురవుతు న్నారు పొలం వద్ద పనిచేస్తున్న రైతులపై దాడి చేసే అవకాశం ఉందంటూ రైతులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని పనిచేస్తున్నారు అటవీశాఖ అధికారులు వచ్చి ఆనవాళ్లు చూసి చిరుతను బంధించే ప్రయత్నం చేయా లని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు... సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు

దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

  జూబ్లీహిల్స్‌లో మాజీ మంత్రి  రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.  దామోదర్ రెడ్డి ప్రజాసేవలను కొనియాడారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని రేవంత్ తెలిపారు. మరోవైపు దామోదర్ రెడ్డి అంత్యక్రియలు రేపు తుంగతుర్తిలో నిర్వహించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి  తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేసి.. నాలుగుసార్లు గెలిచారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 1988, 1989లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం ఆయన రాజకీయ పట్టుకు నిదర్శనం. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థిపై మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2009లో సూర్యాపేట నుంచి గెలిచి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 

తిరుపతిలో బాంబు బెదరింపులు.. అలర్టైన పోలీసులు

నగరంలోని పలు ప్రాంతాలలో బాంబులు పెట్టామంటూ వచ్చిన బెదరింపు ఈ మెయిల్స్ తో తిరపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బెదరింపుల వెనుక ఉగ్ర హస్తం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఐఎస్ఐ, ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి తిరుపతి నగరంలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు  పేర్కొంటూ  రెండు ఈ మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.  తిరుపతిలో నాలుగు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకుపాల్పడతామన్నది ఆ బెదరింపు ఈమెయిల్స్ సారాంశం.  దీంతో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు.  తిరుపతిలోని  న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాలలోనూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేవారు.  అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో కూడా సోదాలు  నిర్వహించారు.  

చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం దేవళంపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  గ్రామస్తులు ఆందోళనకు దిగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు వైసీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ  ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మద్దతు పలికారు. కాగా అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారు, నిందితులను కఠానంగా శిక్షిస్తామన్నరు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.   దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాని కొందరు దుండగులు గురువారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో విగ్రహం పాక్సికంగా దెబ్బతింది.   విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అండేడ్కర్ విగ్రహానికి అపచారం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీరియస్ అయ్యారు. దోషులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  

ప్రముఖ రచయిత లల్లాదేవి మృతి

ప్రముఖ రచయత పరుచూరి నారాయణా చార్యులు నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. పరుచేరి నారాయణా చార్యలు లల్లాదేవి అనే కలం పేరుతో పలు రచనలు చేశారు. అలాగే కొన్ని సినిమాలకు కూడా రచయతగా పని చేశారు. 2004లో విడుదలైన శ్వేత నాగు అనే చిత్రానికి లల్లాదేవే కథ రాశారు. పాములపై పరిశోధనలు చేసిన మరీ రచనలు సాగించిన ఏకైక రచయత లల్లాదేవి.  తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు లల్లాదేవి సన్నిహితుడు.  లల్లాదేవి ఎన్టీఆర్  కార్యదర్శిగా కూడా  కొంత కాలం పని చేశారు. లల్లాదేవి ప  దాదాపు 250 పై చిలుకు నవలలు రాశారు.  కొన్ని వందల  కథలు, నాటికలు, నాటకాలు కూడా రాశారు.  

మిథున్ రెడ్డికి జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదా?

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారా? తనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మిథన్ రెడ్డిని కనీసం కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదా? అంటే పార్టీ వర్గాలే కాదు.. పరిశీలకులు సైతం ఔననే అంటున్నారు. అందుకు ఉదాహరణగా మిథన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్టై నెలల తరబడి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ.. జగన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా మిథున్ రెడ్డిని పరామర్శించిన పాపాన పోలేదు. అయితే.. మిథున్ రెడ్డి అరెస్టుకు ముందు.. వివిధ కేసులలో అరెస్టైన పార్టీ కింది స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకూ అందరినీ జగన్ పనిగట్టుకు వెళ్లి మరీ పరామర్శించారు. అలా పరామర్శించిన వారిలో గంజాయి కేసుల్లో, వేధింపుల కేసుల్లో అరెస్టైన పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు.   అయితే మిథున్ రెడ్డి ని మాత్రం జగన్ పరామర్శించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.  జైలుకు వెళ్లి పరామర్శించలేదు సరే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డి మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు రెగ్గ్యులర్ బెయిలుపై విడుదలైన తరువాత కానీ జగన్ మిథున్ రెడ్డిని పలకరించ లేదు. మిథున్ రెడ్డి జగన్ తో  భేటీకి చేసిన ప్రయత్నం ఫలించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మిథున్ రెడ్డికి జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అంటున్నాయి. ఒక్క  మిథున్ రెడ్డి అనే కాదు..  అసలు మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఏ ఒక్కరినీ కూడా జగన్  ఇంత వరకూ పరామర్శించలేదు. పలకరించలేదు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో జగన్ లో భయం పేరుకుపోయిందనీ, ఆ కేసులో అరెస్టైన వారికి ఎంత దూరంగా ఉంటే... ఆ కేసు దర్యాప్తు తనను చేరడానికి అంత ఆలస్యం అవుతుందనీ జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ కర్నాటక మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మ్యాటరేంటంటే?

ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉన్నాయి. అయితే అవెప్పుడూ ప్రభుత్వాల మధ్య వైరానికీ, మంత్రుల మధ్య  ఘర్షణాత్మక పరిస్థితులకూ దారి తయలేదు. ఇటీవల కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకుని, అందుకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టేయడానికి రెడీ అయిన సందర్భంగా కూడా ఏపీ నుంచి ఖండనలు అయితే వచ్చాయి కానీ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడే పరిస్థితి రాలేదు. అయితే.. తాజాగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సామాజిక మాధ్యమ వేదికగా రెండు రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్యా జరుగుతున్న మాటల యుద్ధం నెట్టింట వైరల్ అయ్యింది.   ఇటీవలి కాలంలో బెంగళూరు  ఓఆర్ఆర్ ప్రాంతం నుంచి పలు కంపెనీలు.. ఆంధ్రప్రదేశ్ కు తమ బిచాణా ఎత్తివేసే దిశగా యోచిస్తున్నాయి. అటువంటి కంపెనీలను మంత్రి నారా లోకేష్  ఏపీకి రావాలని ఆహ్వానం పంపడమే కాకుండా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అములు అవుతోందంటూ కంపెనీలకు ది బెస్ట్ అనదగ్గ రాయతీలను ఇస్వామని ప్రతిపాదిస్తున్నారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, అలాగే ఎకో ఫ్రెడ్లీ వ్యవస్థలన తీసుకువస్తున్నదని చెబుతున్నారు.   అయితే లోకేష్ తమ రాష్ట్రంలోని కంపెనీలను ఏపీకి ఆహ్వానాంచడంపై బెంగళూరు ఐటీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   బెంగళూరు ఇప్పటికే ఇండియాకు టెక్నికల్ కేపిటల్ గా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పెట్టుబడులు క్షేమదాయకం కాదంటూ ఏపీలో 2019-2024 మధ్య కాలంలో ఆ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ ప్రతిపాదనలు, ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఏపీని పరాన్నజీవిగా అభివర్ణించారు.  కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే మాటలకు లోకేష్ దీటుగా స్పందించారు. ఎక్కడా పరుషమైన పదాలను ఉపయోగించకుండానే.. కర్నాటక మినిస్టర్ కు దిమ్మదిరిగే బదులిచ్చారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్న మాట వాస్తవమేననీ, అయితే ఈ ఆహ్వానాలు పోటీ తత్వంతోనో, మరో రాష్ట్రానికి నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతోనో కాదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కొత్త కొత్త రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.    

సిలెండర్ పేలి రెండు ఇళ్లు దగ్ధం

జిల్లాలో పండుగపూట గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇళ్లు ధ్వంసమైన ఘటన నంద్యాల  జిల్లా శివనగరంలో జరిగింది. బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన  గోవింద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అయితే అలా వెళ్లే సమయంలో గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఆపడం మరచిపోయారు. దీంతో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోవందరెడ్డి ఇంటితో పాటు.. పక్కనే ఉన్న ఇళ్లు దగ్ధమైంది. పేలుడు సంభవించిన సమయంలో రెండు ఇళ్లలోనూ కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ పేలుడు కారణంగా రెండు ఇళ్లలోనూ విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 40 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.  

రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి

ఏటా విజయదశమి రోజున కర్నూలు జిల్లా దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఏ ఏడాది రక్త సిక్తంగా మారింది. సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఈ బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దేవతా మూర్తులను గ్రామానికి తీసుకువెళ్లే విషయంలో కర్రల సమరం నిర్వహించడం దేవరగట్టు ఆచారం అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ కర్రల సమరంలో ఇద్దరు మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.  ఏటా సంప్రదాయం ప్రకారం దేవరగట్టులో  విజయదశమి నాడు దేవతామూర్తులకు గ్రామానికి తీసుకువేళ్లేందుకు మూడు గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, ఏడు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడతారు.  చెడుపై మంచి విజయం సాధించడానికి  ప్రతీకగా ఏటా జరుపుకునే ఈ ఉత్సవం రక్తసిక్తం కావడం కద్దు.    ఈ ఏడాది కూడా విజయదశమి రోజున అంటూ  గురువారం (అక్టోబర్ 2) అర్ధరాత్రి స్వామి, అమ్మవారి విగ్రహాల ఊరేగింపు జరిగింది. యథావిథిగా దేవతామూర్తులను తీసుకువెళ్లేందుకు రెండు వర్గాలు కర్రలతో పోటాపోటీగా తలపడ్డారు.  ఈ సందర్భంగా జరిగిన కర్రల సమరంలో ఇద్దరు మరణించగా, మరో వంద మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా భక్త జన సంద్రంగా మారిన తిరుమలలో శుక్రవారం ( అక్టోబర్ 3) కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నది.  శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. ఇక గురువారం (అక్టోబర్ 2) శ్రీవారిని మొత్తం 75 వేల 188 మంది దర్శించుకున్నారు. వారిలో  31 వేల 640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది. 

తరుముకొస్తున్న తుపాను.. ఆ మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో మెరుపు వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.    ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఉన్న ఈ వాయుగుండం..  గురువారం (అక్టోబర్ 2) అర్దరాత్రి లేదా శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం గోపాల్ పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  ఈ వాయుగండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాలకూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.  అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  

వంద మందికి పైగా నక్సల్స్ లొంగుబాటు

దేశంలో నక్సలిజాన్ని అణచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్ లలో మావోయిస్టు అగ్రనేతలు పలువురు హతం కాగా, అనేక మంది లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఏకంగా వంద మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలను వదిలి లొంగిపోయారు. గాంధీ జయంతి  రోజు (అక్టోబర్ 2) వీరంతా హింసామార్గాన్ని వీడి శాంతియుత మార్గంలోకి అడుగుపెట్టారు.   బీజాపూర్ జిల్లాలో పోలీసు, పారామిలటరీ ఉన్నతాధికారుల సమక్షంలో వీరంతా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. అలా లొంగిపోయిన వారిలో 49 మందిపైన రూ. కోటి రూపాయల రివార్డులు ఉంది. అలాగే లొంగిపోయిన వారిలో డివిజనల్, ఏరియా కమిటీల సభ్యులు, మిలీషియా కమాండర్లు కూడా ఉన్నారు.  చత్తీస్ గఢ్ ప్రభుత్వం చేపట్టిన నవ జీవన మార్గం  అనే పునరావాస కార్యక్రమంలో భాగంగా ఈ లొంగుబాట్లు జరిగాయి.  

విజయదశమి రోజున విషాదం.. మధ్యప్రదేశ్ లో 11 మంది మృతి

విజయదశమి పర్వదినం రోజున మధ్య ప్రదేశ్ లో మహా విషాదం సంభవించింది. శరన్నవరాత్రులలో భక్తి శక్తలతో పూజలు చేసి విజయదశమి రోజున అమ్మవారి విగ్రహ నిమజ్జనం సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఖండ్వా జిల్లా జమ్లి గ్రామంలో భక్తులు దుర్గామాత విగ్రహాన్ని ట్రాక్టర్-ట్రాలీపై  నిమజ్జనం కోసం తీసుకు వెడుతుండగా,  ఓ   కల్వర్టును దాటుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మృతులలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో మరి కొందరు గల్లంతయ్యారు. వారి కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.   

గిన్నిస్ రికార్డులకెక్కిన బెజవాడ దసరా కార్నివాల్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా ఉత్సవ్ అద్భుత విజయం సాధించింది. మైఃసూరు దరసా ఉత్సవాలను తలదన్నెలా బెజవాడ దసరా ఉత్సవ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన  విజయవాడ దసరా కార్నివాల్-2025 గిన్నిస్ బుక్ ఆఫ్  వరల్డ్ రికార్వ్స్ లో స్థానం లభించింది.  విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 2)  నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్ లో అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇచ్చారు. దీనితో ఈ కార్నివాల్ కు గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది.   మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఈ భారీ కార్నివాల్ ర్యాలీలో వేలాది   మంది కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ అద్భుత ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. దీనిని అధికారికంగా ధృవీకరించిన  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగాచంద్రబాబు మాట్లాడుతూ,  ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ఔన్నత్యానికి, , ప్రభుత్వ ఆశయాలకు సాక్ష్యంగా అభివర్ణించారు. 

యాచించడం కాదు.. శాసించే స్థాయికి చేరాలి.. చంద్రబాబు

విజయదశమి రోజు సంకల్పించిన ప్రతి పనీ విజయవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో విజయదశమి రోజు (అక్టోబర్ 2)  ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీకి విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  స్టాళ్లను సీఎం పరిశీలించారు.  ఖాదీ ఉద్యమంలో...స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్న వారి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.  ఖాదీసంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు.  అనంతరం ప్రసంగించిన చంద్రబాబు  ప్రపంచాన్ని యాచించే స్థాయిని దాటిపోయిందని...ఇకపై శాసించే స్థాయికి భారత్ చేరుకోవాలని  అన్నారు.  ఖాదీసంత స్వదేశీ   ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందన్నారు.  ఇప్పటి వరకూ విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చామనీ,  ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీకి పిలుపునిచ్చారన్నారు.  కోవిడ్ సమయంలో భారత్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయన్నారు. 2038 నాటికి భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనీ, ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుతుందని చెప్పారు.  2047 నాటికి అగ్రస్థానంలోకి ఇండియా చేరుతుందన్నారు.   శాటిలైట్ లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తులు కూడా   ఉపగ్రహాలను తయారు చేసి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేశామన్నారు. దేశ జనాభాయే మనకు అతి పెద్ద ఆస్తి అన్న చంద్రబాబు  మన ఉత్పత్తులు మనమే వినియోగించుకుంటే డిమాండ్ పెరిగి ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయన్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ఇలా వేర్వేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు అవుతున్నాయి. వీటిని మనమే ప్రమోట్ చేసుకోవాలి. వీటి వినియోగం పెరిగితే.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటంతోపాటు.. మన ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందన్నారు.  

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి ఇక లేరు

కాంగ్రెస్   సీనియర్ నాయకుడు,   మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి  ఇక లేరు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కిడ్నీల సమస్యతో  బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.  ఆయన పార్దివ దేహాన్ని రేపు సాయంత్రానికి తుంగతుర్తికి తరలించనున్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్న రేవంత్  రాంరెడ్డి దామోదరరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  టీసీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్న, తుమ్మలలు రాంరెడ్డి దామోదరరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ సంతాపం ప్రకటించారు.  తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక సారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది. గురువారం (అక్టోబర్ 2) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలా తోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 1) శ్రీవారిని మొత్తం 72 వేల 247 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 738 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.  

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త

  తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది.  ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా -  జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా - నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( తెలిపారు. గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.  దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషమన్నారు. మరోవైపు ఏపీకి కూడ కేంద్ర ప్రభుత్వం నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది.  శ్రీకాకుళం జిల్లా మంగసముద్రం (చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో వీటిని ఏర్పాటు చేయనుంది.  దీంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదలు తెలిపారు.