ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం, ఆందోళన ఇదే!

  ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరుద్యోగ విద్యార్థుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. తమకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే, ఇప్పుడు కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం ద్వారా తమకు అన్యాయం చేశారన్న అభిప్రాయం ఉస్మానియా విద్యార్థులలో బలంగా ఏర్పడింది. మంగళవారం పోలీసుల ఆంక్షలను కూడా తప్పించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని తార్నాక కూడలిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనలను, కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థులు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలిస్తే....   1. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు.   2. ఉద్యమాలు కేసీఆర్‌కి కొత్తకావచ్చు గానీ, ఉస్మాయినా విద్యార్థులకు కాదు.   3. మొన్నటి వరకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు మా జీవితాల కోసం ఉద్యమించాం.   4. విద్యార్థిలోకం తీవ్రంగా ఉద్యమించాల్సిన పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకువచ్చారు.   5. కాంట్రాక్టు ఉద్యో్గులను పర్మినెంట్ చేసేముందు తెలంగాణలోని నిరుద్యోగుల గురించి కేసీఆర్ ప్రభుత్వం ఎంతమాత్రం ఆలోచించలేదు.   6. నిరుద్యోగ సమస్యను నిర్మూలించాల్సింది పోయి, తామేదో వాగ్దానం చేశామని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు.   7. దశాబ్దాల తరబడి ఉస్మానియా విద్యార్థులు చేసిన త్యాగాలు కేసీఆర్ ప్రభుత్వానికి గుర్తు రాలేదా?   8. ఉస్మానియాలో కేవలం ఒకరు ఇద్దరికి రాజకీయ భవిష్యత్తు కల్పించినంత మాత్రాన యావత్ విద్యార్థి లోకానికి మేలు చేసినట్టు కాదు..   9. కేసీఆర్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలి.   10. మేకు కాంట్రాక్ట్ కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. చదువుకున్న అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం అంతే.   11. ఏ ప్రభుత్వం రావాలని మేము ఉద్యమాలు చేశామో, ఆ ప్రభుత్వమే మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ వుండటం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేపట్టడం బాధాకరం.   12. ఈ ఉద్యమం నుంచి ఉస్మానియా విద్యార్థి లోకం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదు.

సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడరా?... హవ్వ!

  టెన్నిస్ తార సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతోపాటు ఆమెకు కోటి రూపాయల నజరానాను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం పట్ల భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం మీద తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్నల్లో కొన్ని ఇలా వున్నాయి..   1. సానియా మిర్జాకి అసలు తెలుగు భాష వచ్చా? తెలుగురాని వ్యక్తి తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?   2. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కి 1956 నిబంధన విధించారు కదా.. మరి సానియా మిర్జా కుటుంబం 1956 ముందు నుంచే తెలంగాణలో వుందా? ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుందా?   3. సానియా మిర్జా తండ్రి మహారాష్ట్రలో జన్మించాడు. ఆమె భర్త పాకిస్థాన్‌కి చెందిన వాడు. సానియా మిర్జా దుబాయ్‌లో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంది. అలాంటి సానియా మిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?   4. సానియా మిర్జా తెలంగాణకు గర్వకారణమా? ఏరకంగా గర్వకారణం? జాతీయ పతాకానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకుని కూర్చోవడం తెలంగాణకు గర్వకారణమా? ఆమె తెలంగాణ కోసం ఏం చేసిందని గర్వపడుతున్నారు? సానియా మిర్జా కనీసం తెలంగాణ ఉద్యమానికి మద్దతు అయినా పలికిందా?   5. టెన్నిస్ క్రీడ ద్వారా, టెన్నిస్ అకాడమీ స్థాపించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన సానియా మిర్జాకు కోటి రూపాయలు ఇచ్చారు. మరి చదువుకుంటామని అంటున్న పేదవారికి మాత్రం ఫీజులు ఇవ్వనంటున్నారు. ఇదేం న్యాయం?   6. ఎంతోమంది బంగారు తల్లులు వున్న తెలంగాణ గడ్డమీద తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి అచ్చ తెలంగాణ ఆడపడుచు ఎవరూ కేసీఆర్ ప్రభుత్వానికి దొరకలేదా?

న్యాయమూర్తుల వివాదానికి తీర్పెవరు చెపుతారు?

  సుప్రీం కోర్టు మాజీ జడ్జిగా చేసిప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా వ్యవహరిస్తున్న మార్కండేయ కట్జూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారని, పైగా వారి పదవీ కాలం పొడిగించమని ప్రభుత్వానికి లేఖలు వ్రాస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన లహోటీకి ఇదే విషయమై కొన్ని ప్రశ్నలు సంధించి వాటికి సమాధానాలు చెప్పగలరా అని సవాలు కూడా విసిరారు. ఆ ప్రశ్నలు:   1.     నేను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు అక్కడ అదనపు జడ్జీగా చేస్తున్న ఒక వ్యక్తిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నట్లు నేను మీకు లేఖ వ్రాయడం నిజమా కాదా? ఆ తరువాత నేను డిల్లీకి వచ్చి మిమ్మల్ని (లాహోటీ) కలిసినప్పుడు సదరు జడ్జీపై ఇంటలిజన్స్ బ్యూరో చేత రహస్యంగా దర్యాప్తు చేయమని కోరడం నిజమా కాదా?   2.      అప్పుడు మీరు (లాహోటీ) ఆయనపై ఇంటలిజన్స్ బ్యూరో చేత రహస్యంగా దర్యాప్తుకు ఆదేశించిన మాట నిజమా కాదా?   3.     ఇంటలిజన్స్ బ్యూరో దర్యాప్తు చేసి, సదరు జడ్జి అవినీతి పనులకు పాల్పడ్డారని దృవీకరించిన తరువాత, సుప్రీంకోర్టు కొలిజియం సభ్యుల సలహా ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అదనపుజడ్జి పదవికాలం మరో రెండేళ్ళు పొడిగించవద్దని మీరు ప్రభుత్వానికి లేఖ వ్రాసిన మాట నిజమా కాదా?   4.     ఆ తరువాత మీరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, సుప్రీంకోర్టు కొలిజియం సభ్యుల అభ్యంతరాలను లెక్కచేయకుండా, వారికి తెలియజేయకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తినే మద్రాసు హైకోర్టు అదనపు జడ్జీగా మరో ఏడాది పాటు పదవిలో కొనసాగించమని మీరు (లహోటీ) ప్రభుత్వానికి లేఖ వ్రాసిన మాట నిజమా కాదా? ఈ ప్రశ్నలను గమనిస్తే న్యాయవ్యవస్థ కూడా రాజకీయ ఒత్తిళ్లకు అతీతం కాదని స్పష్టమవుతోంది. కానీ కట్జూ చేస్తున్న ఈ ఆరోపణలకు మన న్యాయవ్యవస్థ ఏమని చెపుతుందో వేచి చూడక తప్పదు. చివరికి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో, ఏవిధంగా ముగుస్తుందో ఎవరికీ తెలియదు.

Economic Terrorism :Conspiracy behind the Inflation

Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation, GDP or ABCD! They are interested only in getting essential commodities at reasonable price . It seems the present regime has utterly failed in controlling prices in spite of Central govt. directive for strict action against hoarders and listing onions and potatoes after the Modi govt. controlled onions, now the hoarders have started inflating tomato prices. There is no decrease in production of tomato crop. Other vegetables are freely available and reasonably priced.   In India, prices are not dependent on rains (or the lack of it). The hoarders wait for signals to simply increase prices and make extraordinary profits. When the meteorological department predicted lesser rains, the news channels and papers started playing the same tune again and again -" Now prices will rise, Now prices will rise". The hoarders have fulfilled their wishes and have indeed increased the prices.Tomatoes are selling at Rs.50-60 a kilo in Bangalore which is major hub for procuring and supply of tomatoes .We can still find many vegetable sellers dumping rotten tomatoes on roadsides because people are buying less. So, there is no shortage of tomatoes, its just that it has become a target for hoarders. This is pure and simple economic terrorism. Economic terrorists are spreading their activities everywhere- real estate, vegetables, retail, education etc. Most of these states which are into tomato and onion and other major vegetable production were UPA Governed states and therefore this could be a deliberate attempt to embarrass the Ruling party.   Check out this satire on the rise of tomato prices here...

అభివృద్ధి, తాయిలాలు అన్నీ పట్టణాలకు, ఉన్నవారికే పరిమితమా??

  ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వాలు కేవలం ధర్మకర్తలలాగ వ్యవహరించాలి తప్ప వాటికి హక్కుదారులుగా వ్యవహరించరాదని మహాత్మ గాంధీజీ ఎన్నడో చెప్పారు. కానీ ఆయన చెప్పిన ఆ మంచి మాటలను చెవికెక్కించుకొన్న ప్రభుత్వం ఒక్కటీ లేదు. కోట్లాది ప్రజలు అర్ధాకలితో మాడుతుంటే వారి ఆకలి తీర్చే మార్గం ఆలోచించకుండా, పాలకులు తమకు నచ్చిన వ్యక్తులకు, ప్రాజెక్టులకు కోట్లు ధారపోస్తుంటారు. గ్రామాలలో, పట్టణాలలో వేలాదిమంది పసిపిల్లలు, యువకులు, వృద్ధులు, మహిళలు వైద్యం చేయించుకొనే ఆర్ధిక స్తోమతలేక అత్యంత దయనీయ పరిస్థితుల్లో చావుకోసం రోజులు లెక్కబెడుతూ ఎదురు చూస్తుంటే, మానవతా దృక్పధంతో అటువంటి వారిని ఆదుకోవలసిన ప్రభుత్వాలు, ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నులను కోటీశ్వరులయిన పారిశ్రామిక వేత్తలకు, క్రీడాకారులకు, కళాకారులకు ఉదారంగా దానం చేస్తుంటాయి.   మనకి స్వాతంత్ర్యం వచ్చి 67 సం.లు తరువాత కూడా నేటికీ అనేక గ్రామాలు ఆకలి, దరిద్రం, అనారోగ్యం, పారిశుధ్యలోపం, స్కూళ్ళు, ప్రాధమిక వైద్య సౌకర్యాలలేమి, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా కరువు కాటకాలు వంటి అనేక సమస్యలతో విలవిలలాడుతున్నాయి. వీటన్నిటినీ అత్యవసరంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ఇతర వ్యాపకాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నాయి. అందుకే నేటికీ మన గ్రామీణ భారతం ఈ దుస్థితిలో ఉండిపోయింది. ఏ ప్రభుత్వాలయినా పరిశ్రమలను, క్రీడలను, కళలు ఇత్యాదులను తప్పక ప్రోత్సహించవలసిందే. కానీ, ఈసమస్యలన్నిటినీ విస్మరించి వాటికే ప్రాధాన్యం ఇస్తూ అపాత్రాదానం చేయడం సబబు కాదు.   దేశ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలయినా చేప్పట్టవచ్చును. ఎంతయినా ఖర్చు చేయవచ్చును. కానీ తద్వారా దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు కడుపు మాడ్చుకొని రేయింబవళ్ళు మారుమూల గ్రామాలలో శ్రమిస్తున్న అన్నదాతలు కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితులు కలగాలి. పల్లెల్లో, పట్టణాలలో బ్రతుకు భారంగా జీవిస్తున్న నిరుపేదలు, అభాగ్యుల జీవన ప్రమాణాలు పెరగాలి. కానీ అలాకాక ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అనే పద్ధతి మంచిది కాదు.   కోట్లకు పడగలెత్తిన ఒక క్రీడాకారుడికో, క్రీడాకారిణికో ఒక కప్పు గెలుచుకు రావడానికి కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం కంటే, ఆ సొమ్మును గ్రామాలలో ఈ సమస్యలను పరిష్కరించడానికీ, మట్టిలో మాణిక్యాల వంటి క్రీడాకారులను, ప్రతిభావంతులయిన విద్యార్ధులను వెలికి తీసేందుకు వినియోగిస్తే అందరూ హర్షిస్తారు. ఒక విద్యార్ధి లేదా క్రీడాకారుడు లేదా రైతు ఎవరయినా అష్టకష్టాలుపడి, అందరి కాళ్ళు పట్టుకొని పట్టుదలతో విజయం సాధించిన తరువాత ప్రభుత్వాలు వారిని సన్మానించడం, బహుమతులు ప్రకటించడం కంటే, వారు ఒంటరిపోరాటం చేస్తున్నప్పుడే వారికి అండగా నిలబడితే మనదేశంలో ఆణిముత్యాల వంటి యువత, మేధావులు, క్రీడాకారులు వేలు, లక్షల కొద్దీ తయారవుతారు. కానీ గ్రామీణ ప్రతిభను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం పట్టణాలలో పలుకుబడి ఉన్న కొందరికే ఉదారంగా తాయిలాలు పంచిపెట్టడం సబబు కాదు. కేంద్రమయినా, రాష్ట్రాలయినా అభివృద్ధిని, దాని ఫలాలను మారు మూల కుగ్రామాలకు సైతం సమానంగా దక్కేలా చేసినప్పుడే ప్రజలకు పూర్తి న్యాయం చేసినట్లవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌కి ఎర్రచందనం చల్లదనం!

  వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఒక దుంగ దొరికితే ఎలా వుంటుంది. ఆ వ్యక్తి ఆ దుంగని పట్టుకుని నీటిలో మునిగిపోకుండా తనను తాను కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం అనే వరదలో కొట్టుకుని పోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఒక దుంగ దొరికింది. ఆ దుంగ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిగిపోకుండా తనను తాను కాపాడుకునే అవకాశం వుంది. ఆ దుంగ మరేదో కాదు.. ఎర్రచందనం దుంగ! రాయలసీమలోని పలు అటవీ ప్రాంతాలలో చాలాకాలంపాటు ఎర్రచందనం దుంగల చోరీ భారీ స్థాయిలో జరిగింది. అనేకసార్లు పోలీసులు ఎర్రచందనం దొంగలను పట్టుకుని అనేక లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు పోలీసుల స్వాధీనమయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాలలో నిల్వ చేస్తూ వచ్చారు. ఎంతోవిలువైన ఎర్రచందనం దుంగలు నిరుపయోగంగా ఎన్నోచోట్ల పడివున్నాయి. కొన్నిచోట్ల కొన్ని ఎర్రచందనం దుంగలు చెదలు పట్టి పాడైపోతున్నాయి కూడా. నిల్వలు పేరుకుపోతున్న ఎర్రచందనాన్ని అమ్మాలన్న అభిప్రాయాలు అధికారుల్లో వున్నప్పటికీ గతంలో రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకుండా పోయాయి. అవసరం కూడా చాలా ఉపాయాలను అందిస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఎంతో అవసరం. ఈ సమయంలో ఎర్రచందనం దుంగలను అమ్మాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడం సమయోచితం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బోలెడంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే విలువైన ఎర్రచందనం నిల్వలను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా రైతు రుణ మాఫీపై ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ కూడా రాష్ట్రంలో భారీగా నిల్వ వున్న ఎర్రచందనం దుంగలను అమ్మడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దాంతో ఎర్రచందనం దుంగలను వేలం ద్వారా అమ్మడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10 రోజుల్లో వేలం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్‌మెంట్ అధికారులు రాష్ట్రంలోని ఎర్రచందనం నిల్వలను అంచనా వేస్తున్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజలకు ఎర్రచందనం దొంగల పట్టివేత, దుంగలు స్వాధీనం అనే వార్తలు మాత్రమే తెలుసు.. భవిష్యత్తులో ఎర్రచందనం దుంగలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయని తెలుస్తుంది.

రుణాలమాఫీకి క్యాబినెట్ ఆమోదంతో ఇరకాటంలో పడిన వైకాపా

  ఇంతవరకు పంట రుణాల మాఫీపై ప్రభుత్వ నిజాయితీని శంకిస్తూ, రైతులలో అనుమానాలు కలిగే విధంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చేనేత కార్మికుల రుణాలతో సహా అన్ని రకాల రుణాల మాఫీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకొంది. క్యాబినెట్ ముద్ర వేయడం ద్వారా ఇక ఈ అంశంపై రైతులకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయడమే కాక దీనిపై ప్రభుత్వానికి మరో ఆలోచన కానీ, ఈ జాప్యం వెనుక ఎటువంటి దురుదేశ్యాలు కానీ లేవని విస్పష్టంగా ప్రకటించినట్లయింది. ఈ పరిణామాన్ని ఊహించని వైకాపా ఇప్పుడు ఇరుకునపడింది.   నెలరోజులలోగా అన్ని రుణాలను మాఫీ చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని తొందరపడి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇందులో నుండి గౌరవప్రదంగా బయటపడేందుకు మార్గాన్వేషణ చేయక తప్పదు. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా వైకాపా నేతలు చంద్రబాబు ఎన్నికలలో చెప్పినట్లు మొత్తం రుణాలు మాఫీ చేయకుండా ఇంటికి లక్షన్నర, డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తానని మోసం చేస్తున్నారని అప్పుడే మీడియాకు ఎక్కడం ఆరంభించారు.   ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితిలో కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సాధ్యమయినంత మేర రైతుల రుణాలను మాఫీ చేస్తుంటే, అందుకు వైకాపా సంతోషించకపోగా ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక గగ్గోలు పెడుతోంది. తద్వారా ఈ అంశంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న వైకాపా చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతోంది. పంట రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయడాన్ని రైతులందరూ హర్షిస్తుంటే వైకాపా మాత్రం నిరసించడమే ఆ పార్టీ ప్రత్యేకత. జగన్ తన దుందుడుకుతనంతో వైకాపా ఇదివరకు చాలా సార్లు భంగపడింది. బహుశః ఈ రుణాలమాఫీ వ్యవహారంలో కూడా మరోమారు భంగపాటు తప్పదేమో!

రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కొన్ని ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకొన్నారు. పంటరుణాల మాఫీపై అధ్యయనం కోసం వేసిన కోటయ్య కమిటీ సరిగ్గా నిర్దేశిత సమయానికి తన నివేదికను చంద్రబాబుకు సమర్పించడంతో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కూడా లోతుగా చర్చ జరిగింది. 2014, మార్చి31 వరకు రైతులు తీసుకొన్న అన్ని రుణాలను మాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల రుణాల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతున్న వేలాది మంది రైతులకు ఆ బాధ నుండి స్వేచ్చ దొరుకుతుంది.   ప్రతీ ఒక్క కుటుంబానికి లక్షన్నర చొప్పున పంట రుణాలు, బంగారు నగలపై తీసుకొన్న రుణాలను మాఫీ చేసింది. డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష రూపాయలు ఋణం మాఫీ చేసింది. కొందరు రైతులు, డ్వాక్రా సంఘాలు ఇప్పటికే రుణాలు తిరిగి చెల్లించినవారున్నారు. అటువంటి వారికి కూడా ఈ రుణమాఫీని వర్తింపజేసి నిజాయితీగా రుణాలు చెల్లించినవారిని ప్రభుత్వం గౌరవిస్తుందని నిరూపించుకొంది. పంట రుణాలతో బాటు చేనేత కార్మికుల రుణాలు కూడామాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.   ప్రస్తుతం ప్రభుత్వమే స్వయంగా ఈ రుణాలన్నిటినీ బ్యాంకర్లకు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోయినప్పటికీ, రిజర్వు బ్యాంకు ఈ రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది గనుక, బ్యాంకు ఇచ్చిన నిర్దిష్ట గడువులోగా ఆ రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమయిన నిధుల సమీకరణకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రుణ మాఫీ కోసం దాదాపు రూ.37,900 కోట్లు అవసరం కాగా దానిలో రూ.25, 000 కోట్లు వరకు నిధులు సమీకరించుకొనేందుకు యఫ్.ఆర్.బీ.యం. చట్టంలో వెసులుబాటు ఉంది గనుక ఆవిధంగా నిధుల సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిజర్వు బ్యాంక్ కేవలం 3సం.ల కాలపరిమితికే రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు యోచిస్తున్నప్పటికీ, మరో నాలుగు సం.లు పొడిగించమని ఆర్.బీ.ఐ. ను అర్ధించాలని మంత్రివర్గం నిర్ణయించింది.   తెదేపా రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రుణాల మాఫీకి మంత్రివర్గం చేత అధికారికంగా ఆమోదముద్ర వేయించడం ద్వారా ఇక దీనిపై ఎటువంటి సందేహాలకు తావు లేకుండా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకొంది. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకోకుండా, వాటిని రీ షెడ్యుల్ చేయించడానికి, ఆ రుణాలను ప్రభుత్వమే తిరిగి చెల్లించడానికి అవసరమయిన నిధుల సమీకరణ గురించి కూడా ఆలోచించడం ద్వారా ఈ అంశంపై చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

1956 నిబంధనకి నో ఛాన్స్!

  ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థుల స్థానికతలు 1956 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పుడు తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులతోపాటు అనేకమంది తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధన వల్ల అనేకమంది పక్కా తెలంగాణ విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం వుందని వారు వాపోయారు. తెలంగాణ ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఫీ రీఎంబర్స్‌మెంట్‌కి 1956నే ప్రామాణికతగా నిర్ణయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేసింది. ఈ నిర్ణయంతో అనేకమంది తెలంగాణ విద్యార్థులు హతాశులయ్యారు. తెలంగాణలోని విద్యార్థి లోకం నుంచి ఈ నిర్ణయం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1956 నిబంధన కనుక అమలు అయితే వేలాదిమంది తెలంగాణ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం వుంది. వీరిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా వుంటారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారి పిల్లలు కూడా ఈ జాబితాలో చేరతారు. తెలంగాణ కోసం ఇంత పోరాటం చేస్తే తమకే ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్న అభిప్రాయం వీరిలో కలిగింది. ఈ అభిప్రాయాల సెగ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తగిలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే అవకాశం వుందని తెలుస్తోంది. తెలంగాణలోని మీడియా ప్రతినిధులతో కేసీఆర్ జరిపిన ఒక సమావేశంలో దీనికి సంబంధించిన సూచనలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 1956 నిబంధనను కచ్చితంగా అమలు చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా నష్టం జరగడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా వస్తాయని అర్థం కావడం వల్ల కేసీఆర్ ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.

మోడీ మళ్ళీ అణు పరీక్షలు చేయనున్నారా?

  భారతదేశం అణు పరిజ్ఞానం గురించి ఆలోచించడానికే సాహసం చేయబోదన్న అభిప్రాయం ప్రపంచ దేశాలకు.. ముఖ్యంగా అమెరికా, చైనాలకు వున్న సమయంలో అటల్ బీహారి వాజ్‌పేయి ప్రభు్తవం పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్షలు జరిపించింది. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరీక్షల తర్వాత భారతదేశం కూడా అణ్వస్త్ర సహిత దేశంగా ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. ఈ పరిణామం అమెరికా, చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలకు ఇండియాని చూస్తేనే వెన్నులో చలిపుట్టేలా చేసింది. ఇదిలా వుంటే, ఇటీవలే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారతీయ జనతాపార్టీ నాయకుడు నరేంద్ర మోడీ దేశంలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, దేశ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారతదేశాన్ని ఇతర దేశాలు ఆషామాషీగా తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. తాజాగా ఆయన సోమవారం నాడు భాభా ఆటమిక్ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి తరహాలోనే నరేంద్ర మోడీ కూడా మరోసారి అణు పరీక్షలు నిర్వహించే అవకాశాలు వున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత అణు సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాల్సిన అవసరం వుంది. నరేంద్రమోడీ ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ రాజకీయ జీవితం ఓ లాటరీ!

  వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ జీవితం, పొలిటికల్ జీవితం ఒక లాటరీలా మారింది. దానికి ఒక తాజా ఉదాహరణ నెల్లూరు జడ్పీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ లాటరీ ద్వారా గెలుచుకోవడం. మొదటి నుంచీ జగన్ రాజకీయ ప్రస్థానం ఒక లాటరీలాగానే సాగుతూ వచ్చింది. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి పీఠం మీద వుండగా జగన్ పొలిటికల్ లాటరీ ఆడాడు. ఆ లాటరీలో పైసా పెట్టుబడి లేకుండా జగన్‌కి లక్షల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ లాటరీ ఆడాడు. అయితే ఆ లాటరీలో విజయం సాధించలేకపోయాడు. బెడిసికొట్టిన ఆ లాటరీ కారణంగా జగన్ 16 నెలలు జైలులో గడపాల్సివచ్చింది. తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీతో కలసి ఆడిన పొలిటికల్ లాటరీ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికలను కూడా ఆయన ఒక లాటరీగానే తీసుకున్నాడు. ఈ లాటరీలో ఎలాగైనా విజయం సాధించాలన్న తాపత్రయంతో కోట్లాది రూపాయలను వినియోగించాడు. అయినాసరే ఆయనకు ఆ లాటరీలో విజయం దక్కలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ ఆడుతున్న లాటరీ గురించి అందరికీ తెలిసిందే. తాను పొలిటికల్ లాటరీలో ఎలాగూ గెలవలేకపోయాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే లాటరీ ఆడటం మొదలుపెట్టాడు. అలాగే జగన్ జనజీవన స్రవంతిలో ఉండే విషయం కూడా ఒక లాటరీ మాదిరిగానే వుంది. ఆయన ఏ నిమిషంలో మళ్ళీ జైలుకు వెళ్ళాలో ఆయనకే అర్థంకాని పరిస్థితిలో వున్నారు. ఇన్ని లాటరీలు ఆయన జీవితంలో ఉండగా, తాజాగా మరో లాటరీ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. నెల్లూరు జడ్పీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను జగన్ పార్టీ లాటరీ ద్వారానే సొంతం చేసుకుంది.

మగపిల్లలన్నాక తప్పులు చేయడం సహజం: ములాయం

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు హత్యలు, సామూహిక అత్యాచారాలకు, మత ఘర్షణలకు నిలయంగా మారిపోయింది. గత కొన్ని నెలలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో అక్కడ నిత్యం హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం లక్నోలో మోహన్ లాల్ గంజ్ అనే ప్రాంతానికి చెందిన 30ఏళ్ల మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆ తరువాత చాలా కిరాతకంగా చంపేశారు.   అదే విషయం గురించి అధికార సమాజవాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ను మీడియా ప్రశ్నిస్తే, “దేశంలో కెల్లా అత్యధికంగా 21కోట్ల మంది జనాభా యూపీలోనే ఉన్నారు. అందువల్ల ప్రతీ నేరాన్ని అదుపు చేయడం అసాధ్యం. అయినా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యూపీలోనే అత్యాచారాలు చాలా తక్కువ” అని నిసిగ్గుగా సమర్ధించుకొన్నారు. ఇదివరకు ఓసారి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “మగపిల్లలు అన్నాక తప్పులు చేయడం సహజం. అంతమాత్రన్న వారినందరినీ దండించాలంటే ఎలా?” అని ప్రశ్నించారు కూడా.   ఇక ఆ తండ్రికి తగ్గ కొడుకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. పెరుగుతున్న ఈ నేరాలను మీడియా ఎత్తి చూపిస్తే, “దేశంలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మీడియా మాత్రం ఒక్క యూపీలోనే అత్యాచారాలు జరుగుతున్నట్లు గగ్గోలు పెడుతోంది,” అని సమర్ధించుకొన్నారు.   ఆవు చేలోబడి మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధినేత ఈవిధంగా మాట్లాడుతుంటే, పార్టీ నేతలు, మంత్రులు మాత్రం ఎందుకు సిగ్గుపడాలి అనుకోన్నారో ఏమో పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ అనే నాయకుడు మీడియాతో మాట్లాడుతూ “ నేతాజీ (ములాయం సింగ్) చెప్పిన మాట అక్షరాల సత్యం. లక్నో రేప్, హత్య కేసులో మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఆ మహిళా తనకు బాగా తెలిసిన వ్యక్తితోనే బయటకు వెళ్ళింది. ఆ తరువాత ఈ సంఘటన జరిగింది. అందువల్ల ప్రతీ నేరాన్ని అదుపు చేయడం అసాధ్యం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశమంతటా ఎక్కడో అక్కడ ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అటువంటప్పుడు ఒక్క యూపీలోనే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నట్లు మీడియా చూపించడం చాలా అన్యాయం,” అని యధా రాజా తధా ప్రజా అని నిరూపించారు.   ప్రజల ధన మాన ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే ఈవిధంగా మాట్లాడుతుంటే మరి హత్యలు, అత్యాచారాలు పెరగడంలో ఆశ్చర్యం ఏముంది? రాష్ట్రంలో 21 కోట్ల మంది జనాభా ఉన్నారని తెలిసి ఉన్నపుడు అందుకు తగినంత మంది పోలీసులను నియమించుకొని, వారికి కూడా నైతిక విలువలు పాటించేలా శిక్షణ ఇస్తే ఇటువంటి నేరాలు ఎందుకు జరుగుతాయి? కానీ అధికారం చేప్పట్టిన పార్టీలు ఆపని చేయకపోగా రాష్ట్రమంతట వేలకొద్దీ తమ నేతల విగ్రహాలు, చివరికి తమ పార్టీ గుర్తుగా ఉన్న జంతువుల విగ్రహాల ఏర్పాటు చేయడానికి విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తుంటారు. అటువంటప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయని ఏవిధంగా ఆశించగలము? అందుకే అది అత్యాస అవుతుందని స్వయంగా అధికార పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు.

ఉస్మానియా విద్యార్థుల కలలు కరుగుతున్నాయి!

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎంతగానో కృషి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే చల్లారిపోయిందని అనుకున్న తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున ఎగసిందంటే దానికి ప్రధాన కారణం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే. ఉద్యమాన్ని కొనసాగించలేక చేతులు ఎత్తేసిన, జ్యూసులు తాగిన నేతలు కూడా విద్యార్థుల ప్రభంజనాన్ని చూసి ఉద్యమాన్ని కొనసాగించాల్సివచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటూ అనేకమంది ఉస్మానియా విద్యార్థులు ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు. విద్యార్థులు ఉద్యమం విషయంలో ఇంత పట్టుదలగా వుండటానికి కారణం, తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశే! అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది తెలంగాణ విద్యార్థుల మీద పిడుగుపాటుగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తే తమకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయన్న ఆందోళన వారిలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థిలోకం గళమెత్తుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్ళపాటు పెంచింది. అదే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్న పక్షంలో రెండేళ్ళపాటు ఉద్యోగాల ఖాళీలు ఏర్పడవు. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఖాళీలు వుండవు. ఇది కూడా తెలంగాణ విద్యార్థుల ఆగ్రహానికి, ఆందోళనకీ కారణమవుతోంది.

ఏపీ మంత్రుల లాబీయింగ్ పురాణం!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు మంజూరు అయ్యాయి. ఆయా విద్యా సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని వారు మాత్రం అలాంటి విశాల దృక్పథం ప్రదర్శించకుండా తాము తమ ప్రాంత అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   ప్రతిష్ఠాత్మకమైన పెట్రోలియం యూనివర్సిటీని కాకినాడలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయలన్ని తమ జిల్లాకు తన్నుకుపోవాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.   కేంద్రం ప్రతిపాదించిన కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు జిల్లాలలోనే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గట్టి పట్టుదల మీద వున్నారు. వేరే మంత్రులు ఎవరైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద కర్చీఫ్ వేస్తే ఆయన ఎంతమాత్రం సహించేట్టు లేరు.   కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి మంజూరు చేసిన ఎయిమ్స్.ని గుంటూరు - విజయవాడ మధ్యలో వున్న మంగళగిరిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం ఎయిమ్స్.ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లాకు తరలించుకుపోవాలని ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు.   తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఐఐటీ మా నియోజకవర్గంలో పెట్టాంటే మా నియోజకవర్గంలో పెట్టాలని చంద్రబాబు మీద వత్తిడి పెంచుతున్నారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ని కర్నూలు జిల్లాకి ఇచ్చి తీరాల్సందేనన్న పట్టుదలను ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకే చెందిన మరో మంత్రి పరిటాల సునీల అనంతపురాన్ని రాష్ట్రానికి రెండో రాజధాని చేసితీరాలని నినదిస్తున్నారు.   అనంతపురం జిల్లాకే చెందిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన జిల్లాకు భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలను తరలించుకువెళ్ళే ప్రయత్నాలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇక రాష్ట్రమంతటా అమలు చేసే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మొట్టమొదటగా హిందూపురం నియోజకవర్గంలోనే అమలు చేసే విషయంలో నందమూరి బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలో ఇలా లాబీయింగ్ చేయగలిగినవారు తమ ప్రాంతానికి ఏమేం కావాలో సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటే, తమ ప్రాంతానికి కావలసిన వాటిని డిమాండ్ చేసి సాధించుకునే శక్తిలేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక మథనపడిపోతున్నారు.   ఏది ఏమైనప్పటికీ ఎంతో అభివృద్ధి జరగాల్సి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎవరి ప్రాంతం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమదృష్టితో చూస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టి అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరిగేలా చూస్తే బాగుంటుందన్న ఆకాంక్షలూ వినిపిస్తున్నాయి.

మరో గ్యాస్ నిధి.. ఆంధ్రప్రదేశ్ వాటా ఏది?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజవాయు నిక్షేపాలకు కొదువలేదు. ఏ ప్రాంతంలోని వనరులు ఆ ప్రాంతానికి ఉపయోగపడాన్న ప్రాథమిక సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ నిక్షేపాల విషయంలో మాత్రం అమలు కావడం లేదు. గ్యాస్ వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరగడం లేదన్న అభిప్రాయాలు, ఆందోళన వున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాస్ నిక్షేపం బయటపడింది. కృష్ణ - గోదావరి బేసిన్ ప్రాంతంలోని బంటుమిల్లి దగ్గర 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపం ఓఎన్జీసీ అన్వేషణలో బయటపడింది. ఇటీవలి కాలంలో బయటపడిన అతి పెద్ద గ్యాస్ నిక్షేపమిది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని సహజ వనరుల విషయంలో న్యాయమైన వాటా కోసం పోరాడటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశం వుంది. ఇప్పుడు బంటుమిల్లిలో బయటపడిన గ్యాస్ నిక్షేపాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన హక్కును కాపాడుకోవాల్సిన అవసరం వుంది. తనకు దక్కాల్సిన న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు నిక్షేపాల విషయంలో ఆ రాష్ట్రం ప్రదర్శిస్తున్న హక్కును గ్యాస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రదర్శించాల్సిన అవసరం వుంది. ఇప్పటి వరకూ సహజ వాయువు విషయంలో ఆంధ్రప్రదేశ్ చేసిన త్యాగం చాలు. ఇంకా త్యాగాలు చేసి భారీగా నష్టపోయే కంటే, హక్కుకోసం పోరాడి ఆర్థిక అభివృద్ధిని సాధించడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వున్న కర్తవ్యం.

బంగారు తెలంగాణ బహుదూరమేనా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దాన కర్ణుడిలాగా ప్రతిరోజూ కొన్ని వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు ఇస్తూ వున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక ‘బంగారు తెలంగాణ’ని నిర్మించుకోవడమే మన పని అన్నట్టుగా ఆయన హామీల మీద హామీలు గుప్పిస్తూ, రకరకాల పథకాలను ప్రకటిస్తూ తెలంగాణ ప్రజల్లో తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు, హామీల చిట్టా చూస్తే తెలంగాణలో ఏదో అద్భుతం జరగబోతోందన్న భ్రమ కలుగుతుంది. అయితే కేసీఆర్ వరాల జల్లు అమలుకు ఎంతవరకు సాధ్యమన్న విషయాలను వాస్తవ దృక్పథంతో పరిశీలిస్తే మాత్రం గుండె జల్లుమంటుంది. పథకాలు అయితే ఫుల్లుగా వున్నాయిగానీ, పైసల పరిస్థితి మాత్రమే డల్లుగా, నిల్లుగా వుంది. పేద దళిత రైతులకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారు. అది కూడా ఆగస్టు 15 నుంచే భూ పంపిణీ మొదలుపెడతామని అంటున్నారు. తెలంగాణలో మొత్తం 18 లక్షల పేద దళిత కుటుంబాలు వున్నాయి. వారందరికీ మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలంటే 54 లక్షల ఎకరాల భూమి కావాలి. మరి వారందరికీ పంచేంత ప్రభుత్వ భూమి లేదు. అలాంటప్పుడు ప్రయివేటు భూమిని ప్రభుత్వమే కొని పంచాలి. ప్రయివేటు భూమి ఎకరం యావరేజ్‌గా మూడు లక్షలు వుంటుంది. ప్రయివేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేయాలంటే లాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ విలువకు నాలుగు రెట్లు చెల్లించి కొనుగోలు చేయాలి. అంటే ఎకరానికి 12 లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మొత్తం 54 లక్షల ఎకరాల్లో కనీసం 30 లక్షల ఎకరాలు అయినా కొనుగోలు చేయాలంటే, 30 లక్షలని పన్నెండు లక్షలతో హెచ్చవేస్తే మూడు లక్షల అరవై వేల కోట్లు అవుతుంది. ఈ డబ్బంతా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది? భూమి విలువ సంగతి అలా వుంచితే ప్రభుత్వం పంచదలచుకున్న భూమిని సర్వే చేయడానికే 6 వందల కోట్లు ఖర్చవుతుంది మరి! అలాగే తెలంగాణ ప్రభుత్వానికి రైతు రుణాల మాఫీకి 19 వేల కోట్లు, పోలీసు వాహనాల కొనుగోలుకు 4,342 కోట్లు, 2000 మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున ఎక్స్.గ్రేషియా చెల్లించాలంటే రెండొందల కోట్లు కావాలి. కళ్యాణ లక్ష్మి పథకం కోసం 50 వేల కోట్లు కావాలి. ఇక కేసీఆర్ ప్రకటించిన పథకాలు, వరాలు ఇవన్నీ నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలన్నది ఆర్థిక నిపుణులు మాత్రమే చెప్పగలిగిన అంశం. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 70 వేల కోట్లు మాత్రమే. అయితే వార్షిక బడ్జెట్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా వున్న ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి బడ్జెట్‌కి, ఖర్చుకి వున్న హస్తిమశకాంతరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా బేలన్స్ చేస్తుందనేది కాకలు తిరగిన ఆర్థిక నిపుణులకు కూడా అంతుపట్టని అంశం. కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిస్తానని చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును తలచుకుంటే బంగారు తెలంగాణ బహుదూరంగా వున్నట్టుగా అనిపిస్తోందని తెలంగాణకు చెందిన అధికారులు, ఆర్థికవేత్తలే అంటున్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఇస్తున్న హామీలు మాత్రం తెలంగాణ ప్రజల గుండెల నిండుగా వున్నాయి. అయితే ఆ కలలను నిజం చేయాల్సిన ఖజానా మాత్రం ఖాళీగా వుంది.

ఆ విమాన ప్రయాణికులు చాలా లక్కీ

  ఆ విమాన ప్రయాణికులు చాలా లక్కీ మలేసియా విమాన దుర్ఘటనకు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే జూలై 15న అమెరికాలో న్యూ జెర్సీ నుండి 313 మంది ప్రయాణికులతో ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా కూడా అటువంటి ఘోర ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొన్న సంగతి బయటపడింది. అయితే ఆ ప్రమాదం ఉగ్రవాదుల దాడివలన కాక ఇంజనులో మంటలు అంటుకోవడం వలన జరగేది. కానీ విమాన పైలట్లు గౌతం వర్మ మరియు ఆయన సహచర పైలట్లు చాలా సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.   న్యూజెర్సీ నుండి బయలుదేరిన బోయింగ్-777 ఎయిర్ ఇండియా విమానం, ఎడమవైపు ఉన్న ఇంజన్ నుండి మంటలు అంటుకొన్నట్లు పైలట్ వర్మ గమనించారు. వెంటనే నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానశ్రయం ఫ్లయిట్ కంట్రోల్ రూమ్ అధికారులకు సమస్య గురించి చెప్పడంతో వారు విమానంలో ఉన్న ఇంధనాన్ని అవసరమయినంత మేర ఖాళీ చేసి, నిర్దిష్ట ఎత్తుకి విమానాన్ని దింపమని సూచించారు. అయితే ఇంధనం ఖాళీ చేయడానికి దాదాపు 30 నుండి 40 నిమిషాల సమయం, క్రమంగా ఎత్తు తగ్గించుకొంటూ రావడానికి మరో 15-30 నిమిషాలు పడుతుంది.   దాదాపు 80టన్నుల పైగా బరువున్న విమానం ఒక్క ఇంజనుతో గాలిలో అంతసేపు నిలవడం చాలా ప్రమాదమని గ్రహించిన పైలట్ గౌతం వర్మ, విమానాన్ని వెంటనే ఎమర్జన్సీ ల్యాండిగ్ చేయబోతున్నట్లు తెలిపి, దాదాపు గంటకు 370 కి.మీ.ల వేగంతో విమానాన్ని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానశ్రయం రన్ వే పై చాలా నేర్పుగా ల్యాండింగ్ చేసి, 313 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.   సాధారణంగా అంత భారీ విమానం, ఒక్క ఇంజనుతో సాధారణ వేగం కంటే 100కిమీ అధిక వేగంతో ల్యాండింగ్ చేయడం అసంభవమే. ఆ వేగంలో విమానం టైర్లు పేలిపోయి అదుపు తప్పవచ్చు లేదా రన్ వే దాటి ముందుకు దూసుకుపోవచ్చును, లేదా ఏమయినా జరుగవచ్చును. కానీ పైలట్లు చాలా నేర్పుగా దైర్యంగా విమానాన్ని చాలా భద్రంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా దింపగలిగారు. ఆ ప్రయత్నంలో నిజంగానే విమాన టైర్లు పగిలిపోయాయి. కానీ పైలట్లు విమానం మాత్రం అదుపు తప్పనీయలేదు. ఈ ప్రమాదం జరిగి ఉండిఉంటే ఎవరూ బ్రతికి ఉండేవారు కాదని చెప్పవచ్చును. కానీ పైలట్లు సమయస్పూర్తి, దైర్యం, నేర్పు కారణంగా ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా మరో విమానాలలో తమ గమ్య స్థానాలకు చేరుకొన్నారు కూడా.   ఇందులో కొస మెరుపు ఏమిటంటే ఈ భయంకర ప్రమాదం నుండి 313 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది చేతిలో సరిపోయినంత డబ్బు లేకపోవడంతో తమ సంస్థ యాజమాన్యానికి ఫోన్ చేసి తమందరికీ భోజనం కోసం ‘కాంప్లిమెంటరీ మీల్స్ టోకెన్లు’ ఇప్పించవలసిందిగా కోరినట్లు సమాచారం.

మలేషియా విమాన దుర్ఘటనలో 100మంది ఎయిడ్స్ శాస్త్రవేత్తల దుర్మరణం

  వేటగాడి బాణం దెబ్బకు విలవిలలాడుతూ నేలకొరిగిన శాంతి కపోతంలా, 280మంది ప్రయాణికులతో వెళుతున్నమలేషియా విమానం ఉగ్రవాదుల దాడిలో నిన్న రష్యా సరిహద్దుల వద్ద నేలకొరిగింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని అణచివేసేందుకు కృషి చేస్తున్న దాదాపు వందమంది రీసర్చ్ శాస్త్రవేత్తలు, వారికి నాయకత్వం వహిస్తున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిడ్స్ పరిశోధకుడు మరియు అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీకి మాజీ అధ్యక్షుడు అయిన జోయీప్ లాంజ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వారందరూ ఆస్ట్రేలియాలో జరగబోయే అంతర్జాతీయ ఎయిడ్స్-2014 సమావేశానికి వెళుతున్నారు. వారు గనుక మరణించి ఉండకపోతే బహుశః ఎయిడ్స్ నివారణకు వారు ఏదయినా పరిష్కారం చూపేవారేమో? కానీ దురదృష్టం కొద్దీ ఎయిడ్స్ మహమ్మారి గురించి చాలా లోతయిన అధ్యయనం చేసిన వందమంది శాస్త్రవేత్తలను ఒకేసారి ఏ కోల్పోయాము. ఇది యావత్ ప్రపంచానికి తీరని నష్టంగా చెప్పుకోవచ్చును.

వైకాపాకు 167 సీట్లు గ్యారంటీ : జగన్

  ఎన్నికలకి సరిగ్గా పదిరోజుల ముందు కూడా తన ఓటమిని పసిగట్టలేని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఓటమి నుండి తేరుకొన్న తరువాత వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి 125 సీట్లు పైనే వస్తాయని జోస్యం చెప్పారు. మళ్ళీ ఈరోజు ఆ సంఖ్యని మరికొంత పెంచి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తన పార్టీకి 167 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బహుశః మరి కొన్ని రోజుల తరువాత మొత్తం 175 సీట్లు తమ పార్టీకే వచ్చేస్తాయని తేల్చి చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎన్నికల ప్రచార సభలో 30యంపీ సీట్లు, 115-125 అసెంబ్లీ సీట్లు సాధించి కేంద్రంలో, రాష్ట్రంలో గిరగిర చక్రం తిప్పుతానని ఖరాఖండిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాదాల వల్లన్నే ఓడిపోయారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా ప్రజామోదంతో ఎన్నికలలో విజయం సాధించి అధికారం చెప్పట్టిన చంద్రబాబు నాయుడుని నిందించడం విశేషం. మరో ఐదేళ్ళ దాక ఎన్నికలు ఎలాగు రావు గనుక కేవలం 167 సీట్లు మాత్రమే వస్తాయని తృప్తిపడటం కంటే, తమ పార్టీని ఎలాగూ జాతీయ పార్టీగా ప్రకటించుకొన్నారు గనుక యావత్ దేశంలో తమ పార్టీయే గెలిచి తనే ప్రధానమంత్రి అయిబోతునట్లు ఊహించుకొంటే ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది కదా? ఏమయినప్పటికీ జగన్ తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పగలుగుతున్నపుడు, ఆ నోటితోనే తన సీబీఐ కేసుల పురోగతి గురించి కూడా నాలుగు ముక్కలు చెపితే బాగుండేది కదా?