కూర పనస ఎప్పుడైనా తిన్నారా? దీంతో ఎన్ని లాభాలంటే..!

  సరైన విధంగా తింటే శాకాహారం ఇచ్చినంత గొప్ప ఆరోగ్యం ఇంకేదీ ఇవ్వగదనేది వైద్యుల మాట. కూరగాయలలో కూడా ప్రాంతీయతను బట్టి వివిధ రకాలుంటాయి. వీటిలో కొన్ని చూడడానికి కొన్ని వింతగా ఉంటే మరికొన్ని తిన్నప్పుడు ఆశ్చర్యకరమైన రుచి కలిగుంటాయి. అలాంటి వాటిలో కూర పనస కూడా ఒకటి. రూపంలో అచ్చం పనస పండును పోలి ఉండే కూర పనస రుచిలో మాత్రం అందరికీ షాకిస్తుంది. ఇది అచ్చం బ్రెడ్ రుచిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ కూర పనస తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. పోషకాలు.. కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదనంగా, ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. అధిక ఫైబర్ కంటెంట్‌ ఉన్న కారణంగా, కూర పనసప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.  గట్‌లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం, జీర్ణక్రియ, పోషకాల శోషణకు అవసరమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ.. కూర పనసను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాలం కడుపు  నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.  అతిగా తినకుండా చేస్తుంది. అదనంగా, దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి, రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచుతాయి.                    *నిశ్శబ్ద.  

మధుమేహం ఉన్నవారు ఈ ఒక్క కూరగాయను డైట్ లో ఉండేలా చూసుకుంటే చాలు!

ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.. వీటిలో ఎన్నోరకాల విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ఉంటాయి, ఇవి తీవ్రమైన జబ్బుల నుండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే కొన్ని కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. మధుమేహం యొక్క సమస్యలను తగ్గించడంలో  కూరగాయలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఎంతో శక్తివంతమైనది బెండకాయ. డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా బెండకాయ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కూరగాయలలో కేలరీలు, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి, ఇది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు బెండకాయ తీసుకుంటే..  రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిచడం బెండకాయ వల్ల ఎంతో సులువు. కాల్చిన బెండకాయ విత్తనాలు మధుమేహం చికిత్సకు టర్కీలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా ఇది సానుకూల ప్రభావాలను చూపుతుంది. బెండకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎందుకు మంచిదంటే.. బెండకాయలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలి బాధలను తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, బెండకాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. బెండకాయలు రక్తంలో గ్లూకోజ్-తగ్గించే శక్తివంతమైన కూరగాయ. బెండకాయను మాత్రమే కాకుండా బెండకాయ విత్తనాలను పొడిగా చేసి తీసుకోవడం వల్ల కూడా మధుమేహం తగ్గించుకోవచ్చు.  డయాబెటిస్‌లో మాత్రమే కాకుండా బెండకాయ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బెండకాయలో విటమిన్-ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచి అవి ఆరోగ్యంగా ఉండటంతో సహాయపడుతుంది. కాబట్టి బెండకాయను వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.                                          ◆నిశ్శబ్ద.

దంత సంరక్షణ ఎంత ముఖ్యం?

ఉదయం లేవగానే అందరూ చేసే పని పండ్లు తోముకోవడం. చాలామంది ఉదయం లేవగానే పండ్లు తోముకోకుండా కాఫీ తాగడం చేస్తారు. మరికొందరేమో నైట్ డ్యూటీ లు గట్రా చేస్తూ నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే ఉదయం లేవగానే పండ్లు తోముకోవడం అనే అలవాటు చాలా మంచిది. పండ్లు తోముకోవడం కూడా ఓ కళ అంటారు దంత వైద్య నిపుణులు. మన పండ్లను సరైన రీతిలో బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ను గట్టిగా ముందుకు, వెనుకకు తోమకూడదు. అలా తోమటం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. ముందుగా పండ్లు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ చాలా మెత్తగా ఉండాలి. అలా ఉంటే పండ్ల చిగుళ్లు దెబ్బతినవు. ఇక పండ్లు తోముకునేటప్పుడు బ్రష్ తో పైకి, కిందికి మెల్లగా తోముకోవాలి. అలా చేయటం వల్ల చిగుళ్ళకు నష్టం వుండదు. మన పండ్లను బ్రష్ తో తోముకున్న తర్వాత చేతి వ్రేళ్ళతో చిగుళ్ళను తోముకోవాలి. అందువల్ల చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. కొంతమంది ఇటుకపొడి, బొగ్గు మొదలైన గరుకు పదార్థాలతో పండ్లను తోముతారు, కాని అలా తోమకూడదు. ఎందుకంటే అవి పండ్లపై ఉన్న ఎనామిల్ ను తొలగించి నష్టపరుస్తాయి. ఒకవేళ అవి ఉపయోగించేలా అయితే మెత్తగా పొడిని జల్లించుకోవాలి.  లేదంటే పండ్లకు మంచి టూత్ పేస్ట్ వాడటం చాలా అవసరం. ఎందుకంటే ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్ట్ లు వాడటం వల్ల దంతక్షయం అరికట్టబడుతుంది. చిగుళ్ళు గట్టిగా, దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.  ఎవరైనా సరే చాక్లెట్లు, పిప్పరమెంట్లు, మిఠాయిలు ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు పండ్ల సందులలో చిక్కుకొని సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. తద్వారా పండ్లు పుచ్చిపోతాయి. ప్రతీరోజూ ఉదయం బ్రష్ చేసేటప్పుడు నాలుక గీసుకొని శుభ్రపరచుకోవాలి. నాలుక పైన రాత్రిపూట ఒక తెల్లని పూత ఏర్పడుతుంది...! నాలుకపైన పేరుకున్న ఈ తెల్లని పూతను అప్ఆర్ఇంచుకుని సుక్మాజీవుల పెరుగుతాయి. ఈ పూతను ఎప్పటికప్పుడు తొలగించకపోతే సూక్ష్మక్రిములు పెరిగిపోయి దుర్వాసన కల్గుతుంది… మనం తీసుకునే ఆహరంతో పాటు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలో ప్రవేశించి చాలా రకాల  వ్యాధులు కల్గుతాయి. భోజనం చేసిన తర్వాత నీటిని పుక్కిలించి నోటిని శుభ్రపరచుకోవాలి. నోటిలో చిక్కుకున్న ఆహారపు అణువులు తొలగించటానికి ప్రతిసారి భోజనము తర్వాత నీటిని పుక్కిలించి ఉమ్మివేయాలి. అప్పుడు నోరు శుభ్రంగా, వాసన లేకుండా ఉంటుంది. సంవత్సరానికి కనీసం ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించాలి. పండ్లు అందంగా ఆకర్షవంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సంవత్సరానికి కనీసం ఒకసారి దంత వైద్యునితో పండ్లను పరీక్ష చేయించుకోవాలి. దంత వైద్యులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు.                                           ◆నిశ్శబ్ద.

నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తింటే?

మీకు నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తినాలని ఉందా తినేసయ్యండి. హాయిగా నిద్ర పొండి. సుఖంగా నిద్రపోవాలంటే సహకరిస్తుంది. లేదా ఏదైనా చిరుతిండి తింటే నిద్రవస్తుందా అంటే నిద్ర వస్తుంది అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనిషి అన్న వాడు 7 నుండి 8 ఘంటలు  నిద్రపోవాలి.మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కాని ప్రపంచంలో 3 వ వంతు అమెరికన్లు  సరిపడా చాలినంత నిద్ర పోవడం లేదని నిపుణులు గమనించారు. అల్లా ఒక సారి నిద్ర లేమి సమస్య దీర్ఘకాలంగా ఉంటె వ్యక్తి శారీరకంగా మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది.  ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. ప్రతి రోజు నిద్రపోవడం పడుకునే ముందు టి .వి ఫోన్ ,లి మీ నిద్రను పెంచుతాయి. మీఆహారం లో కొద్ది పాటి  మార్పు చేసుకుంటే నిద్ర సరిపోతుంది ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.సాయంత్రపు గాలులు తగ్గ్గిన వెంటనే  నిద్రకు ముందు ఏదైనా స్నాక్ తీసుకుంటే నిద్ర మత్తు వస్తుంది.దీనివల్ల మీనిద్ర సమయాన్ని కొంతవరకు  మీరే స్వయంగా అలవాటు చేసుకో వచ్చు.దీనివల్ల మీరు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  మీరు నిద్ర పోయే ముందు వెచ్చటి పాలు గ్లాసుడు తీసుకుంటే నిద్రకు సహకరిస్తుంది. అయితే  ఇది పాత పద్దతే కావచ్చు ఇది పాత బడిపోయిన సలహా అని మీరు ఎద్దేవా చేయచ్చు. వివిధ రకాల  నట్స్,సీడ్స్,బలమైన ఆహారం సేరోటో నిన్ ను ఉత్పత్తి చేస్తాయి,అమినోయాసిడ్స్నిద్ర పోయేలా చేస్తాయి. ఆల్మండ్స్ బాదం పీనుత్స్ పల్లి పప్పులు మెలటోనిన్ పదార్ధాని ఇస్తాయి. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రపోయే పద్ధతి ని అలవాటు చేస్తుంది.       

టమాటాలో దాగి ఉన్న ఆరోగ్యం...

టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.     ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.   మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం. ......కళ్యాణి

అవిసె గింజలు తీసుకుంటే జరిగేది ఇదే....

అవిసగింజలతో బిపి కి చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అవిసగింజలు హై బిపి సమస్య లేదా అధికబరువు తో ఇబ్బంది పడుతున్న వారికి దీర్ఘకాలిక రోగాలనునివారించే శక్తి అవిసగింజలలో ఉందనేది వాస్తవం. మీరు ఊబకాయం తో వచ్చే హై బిపి ని ఎలానియంత్రించాలి? లేదా అవిసతో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. అవిసచూడడానికి చిన్నగింజ మాత్రమే కాని బోలెడు లాభాలు ఉన్నాయని అంతున్నారు నిపుణులు. అవిసగింజలను ఫ్లాక్స్ అని కూడా అంటారు.దీనిని సూపర్ సీడ్స్ గా అంగీకరిస్తారు.అవిసగింజలు మీ గుండెకు లాభదాయకంగా పని చేస్తుంది. అవిస యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.యాంటి ఇంఫ్లామేటరీ, మైక్రో,మేక్రో,న్యుట్రీ యంట్స్, ఖజనాగా అవిస గింజను పేర్కొంటారు. అవిసగింజలలో దాదాపు ౩5%పీచు పదార్ధం ఉంటుంది.ఇందులో మహాజ్ 1౦ గ్రాములు,వినియోగిస్తే మీశారీరానికి నిత్యం అవసరమైన ప్రోటీన్,ఫైబర్, ఒమేగా౩ ఫెటియాసిస్, తోపాటు చాలా విలువైన విటమిన్లుమినరల్స్ లభిస్తాయి.శాస్త్రజ్ఞులు హెర్బల్ వైద్యులు దీపక్ ఆచార్య అవిసగింజలు తినడం వల్ల చాలా విలువైన విటమిన్లు లభిస్తాయి. అవిసగింజలు వినియోగం ద్వారా ఊబకాయం హై బిపి నియంత్రించ వచ్చు. అవిసగింజలతో లాభాలు... గుజరాత్,మహారాష్ట్ర,మధ్య,ఉత్తర భారతంలోని చాలా ఇళ్ళలో వారు వాడే కిళ్ళీలో అవిస గింజలు వినియోగించడం చూడ వచ్చు. అవిసను నేరుగా తినడం ఎలా? మార్కెట్లో లభించే అవిసగింజల్ని తీసుకోండి.వాటిని శుభ్రం చేసి కొంచం వేడిమీద వేయించండి.వాటిని వేయించి దంచి పొడి చేయండి.మీకు కావాలంటే కొంచం రుచికోసం.నల్ల ఉప్పు వేసుకోవచ్చు.ప్రతిరోజూ ౩-లేదా4 చెంచాలు అంటే 2౦-25 గ్రాముల అవిసగింజలు బాగా నమిలి తినండి.మీకు హై బిపి హై బ్లడ్ ప్రేషర్ లేదా బరువు తగ్గించాలంటే అవిస గింజల పొడి చాలా బాగా సహాయ పడుతుంది.అవిస గింజలలో లభించే ఒమేగా ౩ చాలా మంచిదని భావిస్తారు.అవిస గింజల లో ఏ.ఎల్.ఏ ఎల్ఫా లీనో లిక్ లభిస్తుంది.అది మీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అత్యవసరం. అవిసలో పీచు పదార్ధాలు పుష్కలం... అవిసలో పీచుపదార్ధం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కొన్ని పీచుపదార్ధాలు కాలిపోతే కొన్ని కలిసి పోవు,అరుగుదల ఉన్న అవిసగింజలు పంచెంద్రియాల పని తీరును తగ్గిస్తుంది.నీటిని ఎండిపోయే విధంగా చేస్తుంది.ఈ కారణంగానే ఆకలి తగ్గిపోవడం అది మీ ఊబకాయం పై పడుతుంది.అది మీకు డయాబెటిస్ పై పడుతుంది. అది మీ శరీరం లో బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది.శరీరం లో కల వాణి అవిస గింజలు సూక్ష్మ క్రిముల కొడం అద్భుతమైన ఆహారం గా పనిచేస్తుంది.అది మీపోట్టలో  ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.అంటే 2౦-25 గ్రాముల అవిస విత్తనాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానం గా చెప్పవచ్చు. అవిసను వాడండి ఇలా ... ఎవరైతే అత్యంత ఖరీదైన ఆలివ్ ఆయిల్ వాడతారో అలాగే అవిస గింజలు నూనెను వాడండి.ధర తక్కువ ఇందులో మరిన్ని గుణాలుఅధికంగా ఉంటాయి. ఎవరైతే అవిస గింజలు తింటారో వారు సీడ్రేస్ విత్తనాల స్థానం లో వాడచ్చు.అవిసగింజ పొడిని మీరు గ్రైండర్ లో వేయవద్దని.రోట్లో రోకలితో దంచిన తయారు చేసిన అవిస గింజల పొడి ని మజ్జిగలో కలపండి.పాలలో ను అవిసగింజలపొడిని కలిపి తీసుకోండి.బాగా మరుగుతున్న నీటిలో కలిపి వాడండి.లేదా అవిసపోడి ని తినవచ్చు.ప్రతిరోజూ 2౦-25 గ్రాముల అవిసపొడి తప్పకుండా తినండి ఇంట్లో వృద్ధులకు పెట్టండి.అవిసగింజలతో చేసిన లడ్డు అటు స్వేట్ కు స్వేటు ఇటు ఇమ్యునిటి పెరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అవిసగింజలతో బిపి ని నియంత్రించడం ఎలా... శాస్త్రజ్ఞులు నిర్వహించిన క్లినికల్ స్టడీస్ లో హై బ్లడ్ ప్రెషర్ బిపి తగ్గించడం లో అవిసగింజలు మంచి ఫలిత్గాలు ఇచ్చాయని 1 1/2 లేదా ఆ పైన అవిసగింజల్ పౌడర్ 2౦ గ్రాముల పొడిని 25౦ మందికి పైగా వినియోగించాగా హై బిపి తగ్గుముఖం పట్టిందని గమనించారు.అధికమోత్తలో లభిస్తున్న అవిస గింజల వాడకం వల్ల ఊబకాయం,బిపి ఇతర అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం కాగలదని ఆశిద్దాం.

లివర్‌ను నాశనం చేసే 9  రకాల ఆహారాలు ఇవే...

మనశరీరం,లో కీలక మైన మరో అవయవం లివర్ అయితే లివర్ లో ఎప్పుడు సమస్య వస్తుందో,ఎలా ఎప్పుడు ముంపు పొంచి ఉందొ అంచనా వేయడం అసాధ్యం. అయితే మీరు తీసుకునే ఆహారం విహారం వ్యాయామం వంటి అంశాలు మీ లివర్ కు ప్రమాద కారిగా మారవచ్చు. హెపటైటిస్ వల్ల మీ లివర్ తీవ్రంగా దెబ్బ తింటుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కర శాతం పెరిగిందా లివర్ డ్డ మాల్ ... మీకు చక్కెర  ఎక్కువగా తీసుకునే అలవాటు మీకు ఉందా?అది మీ పళ్లకు మాత్రమే నష్టం కాదు. మీ లివర్ ను కూడా నాశనం చేస్తుంది.హై ఫ్యాక్టోస్  కార్న్ సిరప్ కూడా ఫ్యాట్ కొవ్వును తయారు చేస్తుంది.అదే మీ లివర్ డిసీజ్ కారణంగా చెప్పవచ్చు. మీరు పెద్దగా ఊబకాయం తో లేకపోయినా ఆహారం పై నియంత్రణ అవసరమని నిపు ణులు హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం సోడా వేసిన చల్లని పానీయాలు,దాహం తీరడానికి నిమ్మషోడా, రాత్రి కి మధ్యంలో షోడా, తియ్యగా ఉండే పెష్ట్రీలు,క్యాన్డీలు, చక్కెరను పెంచుతాయి. హెర్బల్ సప్లిమెంట్స్... సహజమైన ప్రక్రుతినుండి లభించినవి కూడా కాదు.మెనోపాజ్ ఉన్న వారు కావా కావా మూలికను తీసుకుంటారు. ఇది వాడితే కాస్త ఉపసమనం  ఉంటుందని అనుకుంటారు. అయితే అది మీ లివర్ ను సరిగా పనిచేయనివ్వదనే విషయం మీకు తెలుసా?. ఈ విషయం ఒక పరిశోదనలో వెల్లడించారు.కోవకోవ ను సప్లిమెంట్ ను విరివిగా వాడితే అది మీలివర్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది.కోవా కోవా హెర్బ్ మూలికను కొన్ని దేశాలు ఇప్పటికే నిషేదించాయి.అయితే అమెరికాలో కోవా కోవా ఇప్పటికీ అందు బాటులో ఉండడం గమనార్హం.ఈ మూలికను వాడే ముందు మీరు మీ డాక్టర్ ను సంప్రదించడం అవసరం.కోవో కోవా మూలిక సురక్షితమా కదా అన్న విషయం తెలుసుకోండి. అదనపు బరువులు... మీ లివర్ లో అదనంగా కొవ్వు చేరుతుంది. అయితే అది ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గా చెప్పవచ్చు. ఇక్కడ మీ లివర్ కు వాపు వచ్చి ఉండవచ్చు. అది గట్టిగా ఉండవచ్చు. లివర్ కణాల పై ఒక మరక ఉంటుంది దీనిని వైద్యులు సిరోసిస్ అని అంటారు. మీరు అధిక బరువు,ఊబకాయం మధ్య వయస్సుల వారు అయ్యి ఉంటె డయాబెటిస్ వచ్చి ఉంటె మీరు  మీ ఆహారం వ్యాయామం చేస్తే వ్యాధికి కొంత స హకరించ వచ్చు. అతిగా విటమిన్ ఎ వాడకూడదు... మీశరీరానికి విటమిన్ ఎ అవసరమే అయితే కొన్ని రకాల చెట్లనుండి. లేదా తాజా పళ్ళు ముఖ్యంగా ఎర్రగా ఉండే ఆరంజ్,దానిమ్మ, పసుపు పచ్చగా ఉండే పళ్ళు  ,కూరగాయాలుబీట్ రూట్,క్యారెట్ లలో ఉండే సప్లిమెంట్స్ వాడడం వల్ల విటమిన్ ఏ లభిస్తుంది. అతిగా విటమిన్ ఎ వాడడం వల్ల మీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. మీ లివర్ ను పరీక్షించిన తరుబాత మాత్రమే సంప్రదించండి.విటమిన్ ఎ ను వాడడం బహుశా అవసరం రాకపోవచ్చు. శీతల పానీయాలు ... అసలే ఎండాకాలం ఎండలు ముదురు తున్నాయి. ఎండ వేడిమి భరించలేక ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఎవరికైతే శీతల పానీయాలు వాడే అలవాటు ఉందొ వారికి నాన్  ఆల్కా హాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అయితే పరిశోదనలో శీతల పానీయాల వల్ల లివర్ వ్యాధి వచ్చింది అనేది నిరూపితం కాలేదు. అయితే అతిగా షోడాలు వాడితే సోడా లేకుండా పానీయాలు తీసుకుంటే పరవాలేదు.అయితే షోడా ఎక్కువగా తీసుకున్నారో మీలివర్ ను నాశనం చేస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండడం ఉత్తమమని గ్యాస్ట్రో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసిటో మినోపెన్... మీరు తీవ్రమైన తల నొప్పి,జలుబు  లేదా మీ తల వేనుకభాగం వెన్నుపూస వీపు వెనుకభాగం, లో తీవ్రమైన నొప్పి తో బాధ పడుతూ ఉన్నారా ? అయితే మీ నొప్పి తగ్గాలంటే  ఉపసమ నానికి మీరు తప్పనిసరిగా అసిటో మినోపెన్ అధిక మోతాదులో కాకుండా సరైన మోతాదులో తీసుకుంటే నొప్పులు, జలుబుకు వాడవచ్చు.జలుబు కోసం మీరు అసిటో మినోపెన్ మాత్రను వాడితే మీ లివర్ నాశనం కావడం ఖాయం అంటున్నారు వైద్యులు.మీ డాక్టర్ ను సంప్రదించి ఏమోతాదులో వాడాలో వారి సూచనలమేరకు ఒకరోజు వాడవచ్చు. అది మీకు మేలు చేస్తుంది. సూచన మేరకే వాడండి అది మీకు మంచి చేస్తుంది లేదా అదే పనిగా అసిటో మేనోఫిన్ వాడితే మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొవ్వు పదార్ధాలు... ట్రాన్స్ ఫ్యాట్స్ అవి మనం తయారు చేసిన కొవ్వు పదార్దాలే అందులో కొన్ని మనం ప్యాక్ చేసిన పదార్దాలే. అయితే అందులో కొంత హైడ్రోజన్ ఉంటుంది.దీనివల్ల కొంత బరువు పెరుగుతారు. అది మీలివర్ కు మంచిది కాదు. ఆ పదార్దాలాలో కొవ్వు ౦% అని ఉన్నా ట్రాన్స్ ఫ్యాట్ చిన్న మొత్తంలో ఉన్నా అది మరింత పెంచుతుంది అందుకే ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా కొవ్వు పెంచే పదార్ధాలకు దూరంగా ఉండాలని అలాకాకుండా మీరు తీసుకునే కొవ్వు పదార్ధాలు అటు మీ గుండెకు ఇటు మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చ్చరిస్తున్నారు. తప్పులు జరిగాయి... కొన్ని సందర్భాలాలో నర్సులు రోగికి వారు ఇస్తున్న ఇంజక్షన్ చట్ట పూర్వకంగా కావచ్చు చట్ట విరుద్ధంగా కావచ్చు. ఈ సమయంలో నీడిల్ వాడినా సమస్య సూది కాదు అది హెపటైటిస్ సి రక్తం ద్వారా చేరవచ్చు. ఇది ఒక్కసారి జరిగినా మీరు పెనుప్రమాదం లో ఉన్నట్లే ఒకవేళ మీకు హెచ్ ఐ వి లేదా హెపటైటిస్ గర్భిణీలు అయితే మీరు పరీక్షలు చేసుకోవాలి అయితే 1945 -1965 లోపు ఉన్న వాళ్ళు లివర్ ఫంక్షన్  పరీక్ష చేసుకోవాలి. మద్యాన్ని తక్కువగా తీసుకోవాలి... మీకు మాద్యం తాగే అలవాటు ఉందా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మధ్యం తీసుకుంటే అది మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే  అతిగా మధ్యం తీసుకో కూడదని అది మీలివర్ ను పూర్తిగా నాశనం చేస్తుంది.అన్న విష్యం కనీసం మీ మిత్రులలో ఒకరికైనా వచ్చిఉంటుంది అయినా మద్యానికి బానిస అయ్యి మీరు తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగాలని భావిస్తే అంతే చాలు మీరు చాలా గ్లాసులు తాగినట్లే ఇదు ఔన్సులు మధ్యం లిక్కర్ తీసుకుంటే అది హుందాగా పెద్దమనిషి లక్షణంగా ఉంటుంది. స్త్రీలు అయితే ఒకటి పురుషులు అయితే రెండు అవున్సులు లేదా రెండు కప్పులు తీసుకోవచ్చు. ఏమైనా మీ లివేర్ను నాశనం చేసే వీటిపై జాగ్రత్త అని అంటోంది తెలుగు వన్ హెల్త్.  హెపటైటిస్ సి గనక వస్తే ప్రమాదమే,హెపటైటిస్ సి ఉంటె మీకు పచ్చకామెర్లు వాచ్చే అవకాశం ఉంది. అనుకే లివేర్ను అశ్రద్ధ చేయద్దు కొన్ని సార్లు లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు వెళ్ళాల్సి రావచ్చు.   

ఎనర్జీ డ్రింక్స్ తో ప్రమాదమే!

ఎనర్జీ డ్రింక్ తక్షణ శక్తి నిచ్చే పానీయం వల్ల 6 రకాల ప్రమాదాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఎనర్జీ డ్రింక్స్ ను యురప్ లో 1987 లో తీసుకువచ్చారు.ఆతరువాత దీనికి పాపులారిటీ పెరిగిపోవడం తో ప్రపంచ వ్యాప్తంగా తక్షణ శక్తి  నిచ్చే పానీయాలకు ప్రజలు అలవాటు పడ్డారు.తక్షణ శక్తి నిచ్చే పానీయాలు నష్టం కలిగిస్తాయని విషయం మీకు తెలుసా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక పెద్ద ప్రపంచం ప్రజలకి కొంచం ఓపిక తక్కువే ఇప్పుడు వారికి తక్షణం ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అంటే శక్తి నిచ్చే పానీయం చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారింది.ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమిటో తెలుసా.? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ ను ఆమోదించలేదు.ప్రజలు ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని అయితే మీకు తక్షణ శక్తి నిస్తాయి.అనడం లో సందేహం లేదు అయితే దీర్ఘ కాలం లో వాడితే నష్టమే అని అంటున్నారు నిపుణులు. 1)కేఫెన్ డోస్ ఎక్కువైతే... కేఫెన్ మోతాదు ఎక్కువైతే హై బిపి వస్తుందా?-- తక్షణ శక్తి నిచ్చే పానీయాల లో కేఫెన్ అధిక మోతాదులో ఉంటుంది.చింతించాల్సిన విషయం ఏమిటి అంటే ఎనేర్జీ డ్రింక్స్ లో దాదాపు 2౦౦ గ్రాముల కెఫేన్ ఉంటుంది. ఒక్కోసారి దీనిస్తాయి 5౦౦ గ్రాములు ఉంటుందని అవసరమైన దానికంటే అధిక మోతాదులో కేఫెన్ ఉంటె హై బిపి పెరుతుందని. ఈకారణంగా గుండె వేగం గా కొట్టుకుంటుంది. కాల్షియం తగ్గడం  కూడా కారణం కావచ్చు. 2)టైప్2 దయా బెటిస్ వస్తుందా... మీరు తీసుకునే ఎనేర్జీ డ్రింక్స్ లో కేఫెన్ ఎక్కువ మోతాదులో ఉంటుబ్ది.ముఖ్యంగా ఇంజక్షన్ తో పాటు చక్కర అధికంగా పెంచుతుంది.ఈ కారణంగానే బరువు పెరగడం మరో సమస్యకు దారి తీస్తుంది.శక్తినిచ్చే పానీయాలలో అరలీటరు లో 22౦ క్యాలరీల ఉంటుంది.అది దయాబిటిస్ కు దారితీన్ సే ప్రామాడం  పొంచి ఉందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ౩) మనస్సులో ఆందోళన-అసహనం... కొంతమందిలో జనటిక్ సమస్యలు ప్రారంభమౌతాయి.ఏండోక్రైన్ రెసేప్టర్స్ లో ఏరకమైన మార్పులు వస్తాయి. ఈకారణంగా వారిలో ఆందోళన రేకెత్తిస్తుంది.అవసర మైన దానికన్నా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే అందులో ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉండడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 4)కేఫెన్ తో పంటి సమస్యలు.... శక్తినిచ్చే పానీయాలలో అత్యధిక చక్కెర శాతం ఉంటుందని దృవీకరించారు.చక్కెర మీ దంతాలు పంటి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.ఇందులో ఉండే చక్కెర మోతాదు కారణంగా పళ్ళపై ఉండే ఎనామిల్ పోతుంది.ఈ కారణం గానే పళ్ళ లో హైపెర్ సెన్సిటివిటీ తోపాటు కేవిటీ సమస్యలు ప్రారంభమౌతాయని దంత వైద్యులు పేర్కొన్నారు. 5) శరీరంలో నీటి శాతం తగ్గి బలహీన పడతారు... ఎనర్జీ డ్రింక్ ఉపయోగించడం వల్ల శరీరంలో సత్వరం శక్తి నిచ్చేందుకు సిద్ధం అవుతుంది.ఈ కారణంగా నే ప్రజలు దీనిని వర్క్ అవుట్ చేసేటప్పుడు లేదా క్రీడా కారులు ఆడే సమయం లో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం సహజం.మీరు ఎనర్జీ డ్రింక్ ను మంచినీటికి బదులుగా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటారు.దీని ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.కేఫెన్ హెచ్చు స్థాయిలో ఉంటె మీ కిడ్నీ పై తీవ్ర ప్రభావం చ్చూపిస్తుంది ఏమాత్రం అశ్రద్ధ చేసినా కిడ్నీ నాశనం అవుతుంది.శరీరంలో డీ హైడ్రేషన్ ప్రారంభ మౌతుంది. కేఫెన్ తీసుకోవడం  మీశరీరానికి అలవాటుగా మారుతుంది.ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే మరోనష్టం ఏమిటంటే శరీరంలో కెఫెన్ పేరుకుపోతుంది.ముఖ్యంగా నేటి యువతరం వర్క్ అవుత  సెషన్ కు ముందే ఒక్కోబోటిల్ తాగాల్సి ఉంటుంది.సమయానుకూలంగా మీరు తీసుకునే డ్రింక్స్ లేకుండా పని చెయడం కష్టంగా ఉడే స్థితికి చేరతారు. 

మీకూ ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుందా... అయితే ఇది తప్పక చదవాల్సిందే..

బాగా గమనిస్తే ఆఫీసులలో చాలా మంది నిద్రమత్తుతో ఉంటారు. ఇలాంటి  సమస్యలతో మీరు కూడా  ఇబ్బంది పడుతుంటే దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఇది  ఉద్యోగాలు చేస్తున్న జనాభాలో కనీసం 15శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది.  ఆఫీసులో నిద్రపోవడం కేవలం ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు, బాస్ ముందు పరువు తీయడమే కాదు.. ఇది చెయ్యాల్సిన వర్క్ మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది.  అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పగటిపూట లేదా ఆఫీసులో  నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. ప్రతి ఒక్కరికీ  6-8 గంటలు నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోకపోతే, లేదా ఈ నిద్రాక్రమం అస్తవ్యస్తమైతే.. దీని కారణంగా  పగటిపూట కూడా నిద్రపోయేలా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని వ్యాధుల కారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా పగటి సమయంలో నిద్రపోతుండటం జరుగుతుంది. కొన్ని శారీరక  ఆరోగ్య  పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు దీనికి  కారణమని భావించవచ్చు. డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్,  హైపోథైరాయిడిజం మొదలైన వ్యాధుల ప్రమాదం ఇలా పగటి సమయంలో నిద్రపోవడం అనే ప్రక్రియ కారణమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇవి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. న్యూరోలాజికల్,  న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు.. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు  ఉన్నప్పుడు  పగటిపూట కూడా నిద్రపోవడం జరుగుతుంది. నార్కోలెప్సీలో మెదడు నిద్రమేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా లేదా అకాల నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా,  పగటిపూట అధికంగా  నిద్రపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. ఆహారంలో ఆటంకాల వల్లా..  పగటిపూట  నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు  మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ అధికంగా ఉన్న  స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా  నిద్ర బాగా వస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే తేలికపాటి ఆహరం తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన. పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల  శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది  నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్రను దూరం చేయడానికి ఏమి చేయాలంటే..  ఆఫీసులో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి తక్కువ మొత్తంలో కెఫిన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవచ్చు. కెఫీన్  మెదడు  నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. కాఫీ-టీ నిద్రను దూరం చేస్తుంది. ఇదిమాత్రమే  కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా  నిద్ర వస్తుంది. అందుకే పనిచేసే  స్థలం నుండి అప్పుడప్పుడు లేచి  తిరగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, శరీర నీరసం పోతుంది. నిద్ర కూడా నియంత్రణలో ఉంటుంది.                                                                    *నిశ్శబ్ద.

మీ లివర్ వంద సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసా?

పరిశోదనా శాస్త్రజ్ఞులు యు ఎన్ ఓ ఎస్ పద్ధతి ద్వారా అంటే నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంట్ నూతన పద్దతిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ లు విజయవంత మయ్యాయి. అసలు లివర్ ఎన్నాళ్ళు  జీవిస్తుంది,దానివయస్సు ఎంత? లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఏ వయస్సువారికి చేయాలి? ట్రాన్స్ ప్లాంట్ తరువాత 1౦౦ సంవత్సరాలు బతక గలదా?2,5౩,4౦6 లివర్ ట్రాన్స్ ప్లాంట్ ను 199౦-2౦22-25 లో లివర్ 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండడాన్ని గమనించారు.యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్ కు చెందినసౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్,డల్లాస్, ట్రాన్స్ మేడిక్స్, ఆండో వర్స్ మసాచుట్స్ చలాచిన్నదే అయితే లివర్ పెరుగుదల ట్రాన్స్ ప్లాంట్ 1౦౦ సంవత్సరాలు జీవించడం అన్నదే ఇక్కడ కీలకం.శాస్త్రజ్ఞులు లివర్ గుర్తించడం,లక్షణాలు అవయవము స్థిరంగా నిశ్చలంగా ఉంటాయి. ఇతరులు దానం చేసిన లివర్ సైతం దీర్ఘకాలం ఉంటుంది.వ్యక్తికివయస్సు వచ్చిన లివర్ వయసులో మార్పు రాదా ?సైంటిఫిక్ ఫోరం ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ క్లినికల్ కాంగ్రెస్ 2౦22 బృందం పరిశోదనలు నిర్వహించింది. పరిశోధకులు ఇందుకోసం యు ఎన్ ఓ ఎస్ యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం లో ఒక పద్ధతి నియమ నిబందనల ప్రకారం అనుసరించి లివర్ ను 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండే విధంగా సిద్ధం చేయచ్చు. ట్రాన్స్ ప్లాంట్ తరువాత వారు జీవించి ఉండడం ముఖ్యం.లివర్ దానం చేసిన దాతల వయస్సు లివర్ ఎన్ని సంవత్సరాలు లివర్ తీసుకున్న వ్యక్తి జీవించగలగడం ముఖ్యమని పరిశోదనకు సారధ్యం వహించిన యాష్ కోడాకియా సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ స్కూల్ కి చెందిన విద్యార్ధి. లివర్ పై పరిశోదనలు చేసి 1౦౦ సంవత్చరాలు జీవిస్తాయని నిర్ధారించారు.ఇందులో ట్రాన్స్ ప్లాంట్ కీలక మని ఇది చాలా అరుదైన పద్దతిని అనుసరించడం వల్ల లివర్ 1౦౦ సంవత్సరాలు జీవిస్తుంది. 1౦౦ సంవత్సరాలు ఉన్న లివేర్స్ వ్రుద్దులనుంచి వచ్చినవే... సెంచూరియన్ లో 1౦౦ సంవత్సరాలు జీవించిన లివర్ దాతల వయస్సు 84.7 సంవత్చరాల పైనే ౩8 --55 సంవత్సరాలు వారికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కొన్ని వంద సంవత్సరాలు జీవించి ఉంటాయని గుర్తించారు వృద్ధులు వయసు మళ్ళిన దాతల వయస్సు ఆరోగ్యంగా ఉన్న వారిని వీరిలో డయాబెటిస్,ఇన్ఫెక్షన్ తక్కువే అని గుర్తించారు.గతం లో వయస్సు మళ్ళిన వారి వద్ద నుండి లివర్ వినియోగించేందుకు సిగ్గు పడేవారని సెప్టెంబర్ 2౦ 22  నాటికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది.వయస్సు మళ్ళిన వారి లివర్ చాలా ఫలవంతంగా లివర్ దాతలను పెంచగాలిగా మన్నారు. పరిశోదన వివరాలు... సెంచూరియన్ లివర్ దోనార్స్ ట్రాన్స్ మీటర్ ఎంజాయిం లు లివర్ లో కీలక పాత్ర పోషిస్తుంది ట్రాన్స్ మినేషణ్ చేయడం వల్ల లివర్ లో సమస్యలు వస్తాయని మరల లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలి సెంచూరియన్ లివర్ దాతలు 17 నుండి 22 మంది ఉంటారు.ఇందులో రోగులకు అత్యవసరంగా ట్రాన్స్ ప్లాంట్ అవసరమైన వారే ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దాతలను తగ్గించి... లివర్ పొందే వారి సంఖ్య ను సగానికి తగ్గించి మేలే పద్ధతి మంచి ఫలితాలు ఇచ్చిందని డాక్టర్ కడాకి యా వెల్లడించారు.సెంచూరియన్ గ్రూప్ ఎలాంటి గ్రాఫ్టింగ్ చేయలేదని ప్రాధమికంగా గుండె పనిచేయక రక్తనాళాలు సరిగా లేకపోవడం ఇతర బైలేరి సమస్యలు లేకుండా ఉండాలని లివర్ ట్రాన్స్ ప్లాంట్ తిరస్కరించిన దాఖాలాలు తక్కువే అని సెంచూరియన్,నాన్ సెంచూరియన్ గ్రాఫ్ట్ లలో వ్య్సత్యాసం గమనించిన ప్పుడు సెంచూరియన్ విభాగం లో ఎలా గ్రాఫ్ట్ విజయవంతంగా నిర్వహించ గలిగామని అన్నారు రోగులు బతికి బట్ట కట్ట గలిగారు. ఆలో గ్రాఫ్ చేసిన 1౦౦ సంవత్సరాలు పాతవే అయినా ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.లివర్ సహజంగానే దీర్ఘకాలం పాటు మన్నుతుంది డాక్టర్ కోడాక్ మేము పాతకాలం నాటి దాతలు ఇందుకోసం ఉత్తమ సర్జరీ పద్దతులు అవలంబిస్తున్నాము ఇమ్యునో సర్ప్రస్ లోఆధునిక పద్దతులు దాతలు పొందే వారి లివర్ ను పొంతన చేయడం పోల్చి చూస్తే లివర్ పొందే వారిని పూర్తిగా పరీక్షిస్తాము. దీనిద్వారా మంచిఫలితాలు ఉంటాయి.                                                                                      

పిల్లలకు పారాసిట్ మాల్ వాడుతున్నారా అయితే జాగ్రత్త!

ఇండో నేషియా దేశం లో పసి ప్రాణాలు   మొగ్గలోనే రాలిపోయాయి. ఈ విషయానికి సంబంధించి ఇండో నేషియా ఆరోగ్య శాఖ అధికారులు నాడియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ బారిన 189 మంది శిశువులు దీనిబారిన పడ్డారని. ముఖ్యంగా 5 సంవత్చారాల లోపు పిల్లలు ఫెటర్న టేస్ ఉండడం గమనార్హం. ఇండోనేషియాలో 74 మంది పిల్లలు ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ గాంబియా లోనే 7౦ మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.  పిల్లలు తీవ్ర జ్వరం తో బాధపడుతూ ఉండడం తో. స్థానికంగా ఉత్పత్తి చేసిన పరాసిట్ మాల్ సిరప్ కారణం గానే మరణించారా అన్న అనుమానం వ్యక్త మౌతోంది. ఈ మందులో డై తిలిన్,గైకాల్, ఎతిలిన్ వంటివి దగ్గుమందులల్లో గుర్తించారు న్యుడిల్లికి చెందిన ఫర్మా కంపెనీ రూపొందించిన మందులు గాంబి యాలో అమ్మినట్లు తెలుస్తోంది అయితే పిల్లల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిదేశాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇండో నేషియా ప్రభుత్వ అధికారులు ఆహారం మందుల ఉత్పాదతకత సంస్థ దక్షిణ ఆశియాలో అందు బాటులో లేవని ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ నిషేదించారని తెలుస్తోంది. ఇండోనేషియా ఆరోగ్య శాఖ అధికారి సిటి నాదియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ఇంజురీ బారిన పడిన వారి ని 189 కేసులను ఇండోనేషియాలో కనుగొన్నట్లు ఇందులో 5 సంవత్స్చారాల లోపు పిల్లలు 74 మంది శిశువులు పూర్తిగా దీనిబారినజనవరి నుండే  పడుతున్నప్పటికీ గ్రహించకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనికి గల కారణాలు ఏమిటి అని ఇంకా గుర్తించ లేదని ఇంకా పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. పిల్లల మరణాల పై గతవారం లోనే ఒక నిపుణుల కమిటీ విచారణకు అదేసిన్చామని నాదియా తర్మినీ అన్నారు. ఈ విచారణ కమిటీలో ఇండోనేషియా ఆరోగ్య ఆధికారులు,పిల్లల వైద్యనిపుణులు,పిడియాట్రిక్ అసోసియేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను విచారణ చేస్తారని అధికారులు వెల్లడించారు. మంత్రిత్వ శాఖ పిల్లలకు ఇచ్చిన మందుల వివరాలను సేకరించాలని ఏమోతాదులో వాడారో తెలుసుకోవాలి డబ్ల్యు హెచ్ ఓ గంబియాలో విచారణ జరుపుతుందని అన్నారు.ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేస్తూ విచారణ పూర్తియ్యేవరకూ సిరప్ అమ్మకాలు నిలుపుదల చేసింది. కారణం ఏదైనా పిల్లల మరణాలకు కారణం సరైన మందుల,లేక నిషేదిత మందులా అన్నది తెలాల్సి ఉంది.                               .    

జున్ను తింటున్నారా? ఇది చదవండి అయితే!

జున్ను తినలేదు ఇప్పటి వరకు అని ఎవరైనా చెప్పారు అంటే అది నిజంగా చాలా పెద్ద వింత అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో విరివిగా దొరికే జున్ను చాలా మంచి పౌష్టికాహారం అని అంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే… నాణేనికి రెండవవైపు వాదించేవారు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే.. జున్ను ఆరోగ్యానికి హానికరం అని. ఇంకా జున్ను గురించి చాలా విషయాలు అనుమానాలుగానే ఉండిపోతున్నాయి అందరికీ. వాటిని నివృత్తి చేసే సమాచారం ఇదిగో ఇదే… జున్నుని అని సంస్కృతంలో పీయూషం అని అంటారు. అలాగే పన్నీర్ అని హిందీలో అంటారు. ఇంకా ఇంగ్లీష్ లో అయితే చీజ్ అని అంటారు. ప్రస్తుతం చీజ్ ఆధారిత వంటలు రోడ్ సైడ్ నుండి రెస్టారెంట్ల వరకు ఒకటే హల్చల్ చేస్తుంటాయి. అయితే అదంతా కృత్రిమమైనది.  నిజమైన జున్ను అంటే.. ఆవులు లేదా గేదెలు ఈనిన మూడు నుంచి వారం రోజుల వరకూ వచ్చే పాలు ఇస్తాయి. ఈ పాలను 'ముర్రుపాలు' అంటారు. వీటిలో పచ్చదనం ఎక్కువ వుంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇలా ఆవులు, గేదెలు ఈనిన మూడు నుండి వారం రోజుల లోపు ఇచ్చే పాలను పల్లె ప్రాంతాలలో ఆ దూడలు తాగగా మిగిలిపోయేవాటిని పిండి తమకు తెలిసిన ఇళ్లకు పంచుతుంటారు. ఈ పాలలో పంచదార లేదా బెల్లం, మిరియాల పొడి, యాలకులు పొడి వేసి స్టవ్ మీద కాచినప్పుడు ఆ పాలు గట్టిగా అవుతాయి. గడ్డ పెరుగులా… ఎంతో రుచిగా ఉంటుంది ఈ జున్ను.  జున్నులో ఏముంది? జున్నులో 355 కేలరీలు ఉంటాయి. అదే పాల నుండి మనకు లభించే వెన్నలో 716 కేలరీలు ఉంటాయి. పాల నుండి లభించే మీగడలో 204 కేలరీలు ఉంటాయి. ఇలా మూడింటిని పోల్చి చూసుకుంటే, పాల మీగడకు, వెన్నకు మధ్యగా జున్నులో కేలరీలు ఉంటాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే… ఎక్కువ కేలరీలు అవసరమయ్యే వారు మాత్రమే జున్నును ఆహారంలో భాగంగా తీసుకోవద్సమ్ మంచిది. మరీ ముఖ్యంగా షుగర్, కీళ్ల వాతం జబ్బులు, అధికబరువు గలవారు, వాతం సమస్యలు ఉన్నవారు జున్నును దూరంగా ఉంటే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు జున్ను తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులువుగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ప్రొటీన్ల కథ : జున్నులో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉంటుంది. ఇది నాణ్యమైన ప్రొటీన్, శరీరానికి త్వరగా చక్కగా వంటబట్టే ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు వెన్న, మీగడతో పోల్చి చూస్తే వెన్నలో, మీగడలో ప్రోటీన్లు చాలా తక్కువ ఉంటాయి. అదే జున్నులో అయితే వీటన్నికంటే ఎక్కువగా ఉంటుంది.  జున్నులో ఉండే ప్రోటీన్ల కంటెంట్ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వంటి ఖరీదైన పప్పులకన్నా ఎక్కువగా ఉంటుంది.  దీన్ని బట్టి చూస్తే ప్రోటీన్ లోపంతో బాధపడేవారికి  చిక్కి శల్యమై పోతున్నవారికీ, టీబి, ఎయిడ్స్ వంటి శరీర సామర్థ్యాన్ని క్షీణింపచేసే వ్యాధులతో బాధపడే వారికి జున్ను చాలా మేలు చేస్తుంది.  కొవ్వు: కొవ్వు శాతం పోలిస్తే.. వెన్నలో 81 శాతం కొవ్వు వుంటే, జున్నులో 26.9%, మీగడలో 20% కొవ్వు వున్నాయని తెలిసింది.  కాబట్టి వెన్న కన్నా జున్నులోనే  తక్కువ కొవ్వు ఉంది.  పై విషయాలు అన్నీ గమనిస్తే.. జున్నును తినకూడని పదార్థంగా భావించాల్సినంత ప్రమాదం ఇందులో ఏమీ లేదు. అయితే అతి అనేది అన్నింటిలోనూ ప్రమాదమే కాబట్టి జున్నును కూడా మితంగా తీసుకోవడం మంచిది.  జున్ను వల్ల లాభాలు:- జున్ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అన్నివిధాలా పోషకాలు, కొవ్వులు, ప్రోటీన్లు తగినమొత్తంలో ఉండటం వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి జున్ను మేలు చేస్తుంది.శారీరకంగా చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి శరీరవేడిని తగ్గిస్తుంది. పైత్యం చేసి ఇబ్బంది కలిగే వారు జున్ను తీసుకుంటే పైత్యం తగ్గిపోతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్త సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు మంచి చేస్తుంది. గొంతు సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు నయం చేస్తుంది.  సహజంగానే జున్నులో ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జీర్ణమవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. జీర్ణశక్తి సరిగా లేనివారు  దీన్ని తిన్నప్పుడు అది సరిగా అరగకపోగా వాతదోషం కఫదోషాలు పెరిగి, శరీరం బరువెక్కడం, మలబద్దకం, కడుపునొప్పి, కడుపులో  బరువు ఏదో తెచ్చిపెట్టినట్లు అనిపించడం... వంటి బాధల్ని కల్గిస్తుంది. వాతదోషం పెరిగి, కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ళు వాచిపోవడం, నడుంనొప్పి, శరీరం కదలకుండా బిగుసుకు పోయినట్లవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకని, జున్నుపాలు కాచేప్పుడే అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి జున్ను తయారుచేస్తారు. దీనివల్ల తేలికగా అరిగేందుకు ఈ మిరియాల పొడి సహకరిస్తుంది. వాతకఫ దోషాలను పెరగకుండా అదుపులో వుంచుతుంది. ఈ బాధలున్నవారు జున్నును పరిమితంగా తినాలి. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, పాత రోగాలు తిరిగి మొదలయ్యేలా చేస్తుందని జున్ను గురించి హెచ్చరిస్తారు వైద్యులు. ఇదీ జును రహస్యం...                                    ◆నిశ్శబ్ద

వేధించే కీళ్ల నొప్పులను తరిమేయాలంటే ఈ నాలుగు మార్పులే ముఖ్యం..

శరీరంలో వివిధ భాగాలను అనుసంధానం చేస్తూ కీళ్లు ఉంటాయి. కొన్నేళ్ళ క్రితం వరకు ఓ వయసు దాటిన తరువాత మాత్రమే కీళ్ల నొప్పుల సమస్య ఉండేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా లేనివారు కీళ్ల నొప్పులు అంటూ ఉంటారు. జీవనశైలి మారడం నుండి ఆహారం కలుషితం కావడం వరకూ ప్రతి ఒక్కటీ కీళ్లమీద ప్రభావం చూపిస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12వ  తేదీని ప్రపంచ ఆర్థరైటిస్ డే గా జరుపుకుంటారు. ఈరోజున కీళ్ల ఆరోగ్యం, కీళ్ల అరుగుదల, కీళ్లు దృఢంగా ఉండాలంటే తీసుకోవలసిన  జాగ్రత్తలు మొదలైన విషయాల మీద చర్చిస్తారు. కీళ్ల వ్యాధుల మీద  అవగాహన కల్పిస్తారు. ఉదయం నిద్ర లేవగానే కీళ్లలో నొప్పి, వాపు, నడవడంలో ఇబ్బంది, కీళ్లు బిగుసుకుపోవడం కీళ్ల జబ్బులలో  ప్రధాన లక్షణాలు. 50 కంటే ఎక్కువ రకాల ఆర్థరైటిస్ వ్యాధులు ఉన్న కారణంగా  ఆర్థరైటిస్ కు ఖచ్చితమైన కారణాలను కనుక్కోవడం ద్వారా మాత్రమే దాని పరిష్కారం గురించి ఆలోచించవచ్చు.  కీళ్లనొప్పులు నయం చేయలేని వ్యాధి అన్నది నిజమే కానీ  జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే అది మరింత తీవ్రం కాకుండా నిరోధించవచ్చు. జీవనశైలిలో కేవలం నాలుగు అలవాట్లను మార్చుకోవడం వల్ల కీళ్లనొప్పులను చాలావరకు తగ్గించుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. ఎక్కువసేపు కూర్చోవడం మానేయాలి.. కార్పొరేట్ సంస్కృతి కారణాన  పనివేళలు బాగా పెరిగిపోవడంతో ఎక్కువ గంటలు సిస్టమ్ ముందు ఉండాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో, సర్వైకల్ స్పాండిలైటిస్,  కీళ్ల దృఢత్వం  సమస్యలు ముందుగానే దాడి చేస్తున్నాయి.  పనులు ఆపుకోవడం సాధ్యం కాదు, కానీ పని మధ్యలో కాస్త చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి. 40నిమిముషాలకు ఒకసారి అయినా సీట్ నుండి లేచి పది అడుగులు వేస్తుండాలి.   రోజులో  30 నుండి 40 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి . ఇందుకోసం  సైక్లింగ్ , స్విమ్మింగ్ , బ్రిస్క్ వాక్  మొదలైనవి ఫాలో కావచ్చు. వ్యాయామం రక్త ప్రసరణను పెంచడమే కాకుండా కీళ్లకు కూడా మంచిది.  కండరాల బలాన్ని పెంచుతుంది. ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న  రోగులలో  వ్యాయామం,  యోగా ఉపశమనాన్ని అందిస్తాయి. ధూమపానం మానేయాలి.. ఆర్థరైటిస్ వేగాన్ని 5 రెట్లు పెంచడానికి ధూమపానం ఒక  కారణం. ధూమపానం ఆర్థరైటిస్‌ను మరింత తీవ్రతరం చేస్తుందని వైద్య పరిశోధనలలో కూడా నిరూపించబడింది.  ఇది శరీరానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను సృష్టిస్తుంది.  దీని కారణంగా, గుండె సంబంధిత జబ్బులు కూడా పెరుగుతాయి. ఆర్థరైటిస్ రోగులు ధూమపానం మానేసి మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. చక్కెర వద్దు.. పండ్లు ముద్దు..  కీళ్లనొప్పులు తీవ్రంగా మారకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ఎంచుకోవాలో తెలుసుకోవాలి.   ఆర్థరైటిస్‌లో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.   ఆహారం ద్వారా దీన్ని పూర్తిగా నియంత్రించలేనప్పటికీ, ఇది చాలా వరకు తీవ్రం కాకుండా చేయవచ్చు. ప్రతిరోజు యాంటీఆక్సిడెంట్  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ పరిమాణంలో ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉండే దానిమ్మ వంటి కొన్ని పండ్లను  రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవాలి. అదేవిధంగా పసుపు, దాల్చినచెక్క ,  మెంతి గింజలు కూడా కీళ్ళనొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవాలి.   కానీ రెడ్ మీట్, సీ ఫుడ్, శీతల పానీయాలు, ప్యాక్డ్ ఫుడ్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను ఖచ్చితంగా నివారించాలి. తద్వారా కీళ్ళనొప్పులు ఎక్కువ కావు. బరువు పెరగకండి.. భారతదేశంలో  క్రమంగా  స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది.  అందుకే మధుమేహం కేసులు కూడా పెరుగుతున్నాయి. మీ BMI 24 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అధికంగా ఉందని, ఇది సైటోకిన్‌లను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తుంది.  దీని ఫలితంగా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. అధిక బరువు ఉన్న రోగులకు ఆర్థరైటిస్‌ను నియంత్రించడానికి ఎక్కువ మందులు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం ఉన్న రోగిలో CRP స్థాయి 20 వరకు  ఉంటే అది సాధారణం. దీని కారణంగా, గత కొన్ని సంవత్సరాలుగా మోకాలి మార్పిడి  కేసులు కూడా పెరిగాయి. పై నాలుగు అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటే కీళ్ళనొప్పులను నియంత్రణలో ఉంచడం సాధ్యమే..                                               *నిశ్శబ్ద.

కడుపు ఉబ్బరంగా ఉంటుందా? దానికి అసలు కారణాలు ఇవే..!

కడుపు ఉబ్బరం చాలామందిని వేధించే సమస్య.  దీని వల్ల రోజులో చేయాల్సిన చాలా పనులలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే కడుపు ఉబ్బరంగా ఉంటే ఏ పని మీదా ఆసక్తి కలగదు. అదే విధంగా ఏమైనా తినాలన్నా, తాగాలన్నా కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ కడుపు ఉబ్బరం సమస్యకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, జీవనశైలి ఆరోగ్యకరంగా లేకపోవడం కూడా కారణం అవుతుంది.  ఈ కడుపు ఉబ్బరం కాస్తా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. కడుపు ఉబ్బరానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారపు అలవాట్లు.. పెద్ద మొత్తంలో భోజనం లేదా కొవ్వు ఫైబర్ లేదా కృత్రిమ స్వీటెనర్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను ఆలస్యమవుతుంది. ఈ కారణంగా  గ్యాస్ ఏర్పడి ఉబ్బరం పెరుగుతుంది. వేగంగా తినడం,  చూయింగ్ గమ్ నమలడం లేదా కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోకి అదనపు గాలి చేరి పొత్తికడుపు అసౌకర్యం,  డిస్టెన్షన్‌కు మరింత కారణం అవుతుంది. ఈ అలవాట్లు జీర్ణశయాంతర వ్యవస్థ  సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి, ఇది ఉబ్బరం లక్షణాలకు దారితీస్తుంది. చిన్న మొత్తాలలో భోజనం తీసుకోవడం, ఆహారం తినేటప్పుడు శ్రద్దగా ఏం తింటున్నామనే విషయం మీద ఏకాగ్రత ఉంచడం.  ఆహారపు పద్ధతులు ఆరోగ్యకరంగా ఉండటం,  కార్బొనేషన్ లేని పానీయాలను ఎంచుకోవడం వంటివి ఉబ్బరం తగ్గించడానికి,  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. లాక్టోస్ అసహనం.. లాక్టోస్ అసహనం గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా ఇతర ఆహార అసహనం ఉన్న వ్యక్తులు కొన్ని పదార్ధాలను సరిగ్గా జీర్ణం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇాలాంటి వారు కడుపు ఉబ్బరం సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.  లాక్టోస్ అసహనం ఉన్నవారికి పాల ఉత్పత్తులు లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి గ్లూటెన్ కలిగిన ధాన్యాలు వంటి  ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో సహా జీర్ణశయాంతర అసౌకర్యం ఏర్పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS), ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD) లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) వంటివి  జీర్ణక్రియ పనితీరుకు భంగం కలిగిస్తాయి. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. కడుపు నొప్పి, ఆహారపు  అలవాట్లు మారిపోవడం కూడా ఉబ్బరం కలిగిస్తాయి. జీర్ణాశయంలోని వాపు అతిసారం లేదా మలబద్ధకంతో పాటు మరిన్ని సమస్యలు  ఉబ్బరాన్ని కలిగిస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కూడా కడుపు ఉబ్బరం,  అసౌకర్యానికి కారణం అవుతుంది. కడుపులో నీరు చేరడం..  హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో కడుపు పెద్దగా ఉండటం వంటివి కడుపులో నీరు చేరడాన్ని సూచిస్తాయి.  సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో  ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది, ఉబ్బరం కలిగిస్తుంది.  కార్టికోస్టెరాయిడ్స్ లేదా హార్మోన్-ఆధారిత గర్భనిరోధకాలు వంటి కొన్ని మందులు  కూడా కడుపులో నీరు చేరడానికి, కడుపు  ఉబ్బరానికి కారణం అవుతాయి. ఒత్తిడి.. మానసిక ఒత్తిడి ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది గట్-మెదడు పనితీరుకు  అంతరాయం కలిగిస్తుంది.  ఉబ్బరానికి దారితీస్తుంది. ఒత్తిడి గట్ కదలికలను  మారుస్తుంది.  జీర్ణశయాంతర అసౌకర్యానికి సున్నితత్వాన్ని పెంచుతుంది. గట్,  మెదడు రెండూ రెండు  వైపులా  కమ్యూనికేట్ చేయడం వలన ఇది ఉబ్బరం లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.                   *నిశ్శబ్ద.

క్వినోవా  తింటే కలిగే లాభాలు ఏంటో తెలుసా?

ఆరోగ్యకరమైన ఆహారం లిస్ట్ లో చాలా రకాల ధాన్యాలు ఉంటాయి. వాటిలో క్వినోవా కూడా ఒకటి. క్వినోవా ఈమధ్య కాలంలో ఆదరణ పొందింది. ఇది  అండీస్ పర్వతాల నుండి వచ్చిన పురాతన ధాన్యం. క్వినోవా రుచిలో నట్స్ ను పోలి ఉంటుంది. ఇక దీంట్లో పోషకాలు కూడా ఎక్కువే..   దీంతో విభిన్న రకాల వంటలు తయారుచేస్తారు. అయితే కేవలం రుచికి, పోషకాల కోసమే కాకుండా క్వినోవా తింటే బోలెడు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రొటీన్స్ కు పవర్ హౌస్.. చాలా ధాన్యాల మాదిరిగా కాకుండా క్వినోవా పూర్తి ప్రోటీన్‌గా పరిగణించబడుతుంది. అంటే ఇది  శరీరానికి అవసరమైన మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఈ అమైనో ఆమ్లాలను శరీరం సొంతంగా ఉత్పత్తి చేయలేదు.  అందుకే ఇది శాకాహారులకు, ప్రోటీన్ తీసుకోవాలని అనుకునేవారికి, ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒక కప్పు వండిన క్వినోవాలో లభించే ప్రోటీన్ మాంసానికి ధీటుగా ఉంటుంది. గ్లూటెన్ రహితమైనది.. గ్లూటెన్ అసహనం లేదా ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి పోషకమైన,  రుచికరమైన ధాన్యాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అలాంటి ధాన్యాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన ధాన్యాలలో క్వినోవా ఒకటి. ఇది సహజంగా గ్లూటెన్ రహితమైనది. ఇది గోధుమ,  బార్లీకి  మంచి  ప్రత్యామ్నాయంగా మారుతుంది. క్వినోవాతో కాల్చిన రొట్టెలు, ఇతర ఆహారాలు, సలాడ్ లు ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఫైబర్.. క్వినోవాలో డైటరీ ఫైబర్ అద్భుతంగా ఉంటుంది. ఒక కప్పుకు 5 గ్రాముల  ఫైబర్ ఉంటుంది. ఇది  ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.  మైక్రోబయోమ్‌లోని మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో సహకరించడం  ద్వారా గట్ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను,  కొలెస్ట్రాల్‌ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఖనిజాలు.. క్వినోవాలో  మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్,  ఐరన్ తో సహా అవసరమైన ఖనిజాలన్నీ ఉంటాయి.  ఎముక ఆరోగ్యం,  శరీరానికి శక్తి సమకూర్చడం,  జీవక్రియ నుండి నరాల పనితీరు,  ఆక్సిజన్ రవాణా వరకు వివిధ శారీరక విధులలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. క్వినోవా  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  రోజువారీ ఖనిజ అవసరాలు సులభంగా తీర్చుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్.. క్వినోవా కేవలం పోషకాల పవర్‌హౌస్ కాదు. ఇందులో క్వెర్సెటిన్,  కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆహారంలో క్వినోవాను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది.                                                   *నిశ్శబ్ద.  

పిస్తా పప్పు తినే అలవాటుందా? వీటిని రోజూ తింటే కలిగే లాభాలివీ..!

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాము. వాటిలో  డ్రై ఫ్రూట్స్ చాలా ముఖ్యమైనవి. డ్రై ఫ్రూట్స్ లో బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అంజీర్, ఖర్జూరం ఇలా అన్ని రోజూ తీసుకోవడం చాలా మంచిదని అంటూ ఉంటారు. అయితే వీటిలో ఒకటైన పిస్తా పప్పులు చాలా ప్రత్యేకం. పైన గవ్వల్లాంటి షెల్ తో వచ్చే పిస్తా పప్పులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. పిస్తా పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాలు.. పిస్తా పప్పు చిన్నగా ఉన్నా.. అందులో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు,  ఫైటోన్యూట్రియెంట్‌లతో సహా అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు విటమిన్ B6 కూడా ఇందులో ఉంటుంది. ఇది జీవక్రియకు,  నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం. అలాగే పొటాషియం, భాస్వరం,  మెగ్నీషియం వంటి ఖనిజాలు, కండరాల పనితీరుకు,  ఎముకల ఆరోగ్యానికి  చాలా సహాయపడతాయి.  ఇకపోతే పిస్తాపప్పులలో  యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. పాలీఫెనాల్స్,  కెరోటినాయిడ్స్ వంటి మొక్కల సమ్మేళనాలు కూడా పిస్తా పప్పులో ఉంటాయి. కంటి ఆరోగ్యం.. లుటిన్,  జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పిస్తా పప్పులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమ్మేళనాలు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేయడం ద్వారా,  రెటీనాపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వయస్సు సంబంధంగా వచ్చే కంట్లో మచ్చలు,  కంటిశుక్లం మొదలైనవాటి నుండి  కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.  ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం వల్ల కంటి చూపును రక్షించుకోవచ్చు.  వయస్సు పరంగా వచ్చే కంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్.. పిస్తాలలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి   చాలామంచివి. మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచుతూ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను (LDL) తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక వీటిలో ఉండే లుటీన్,  గామాటోకోఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు క కొలెస్ట్రాల్  ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి సంతులిత ఆహారంలో భాగంగా పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా నూ,  హృదయనాళ పనితీరు మెరుగ్గానూ ఉంటుంది.  బరువు.. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ పిస్తాలు  బరువు మెయింటైన్ చేయడంలో సహాయపడతాయి. వాటిలోని అధిక ప్రొటీన్,  ఫైబర్ కంటెంట్ ఆకలి తీరిన ఫీల్ పెంచుతుంది. పదే పదే తినాలనే కోరికలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల  బరువు తగ్గడంతోపాటు నడుము చుట్టుకొలత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీఆక్సిడెంట్స్.. పిస్తాపప్పులలో  లుటిన్, జియాక్సంతిన్,  ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, కణాలను దెబ్బతీసే హానికరమైన అణువులతో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించడంలో  దోహదం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా శరీర కణాలను రక్షిస్తాయి.                                                *నిశ్శబ్ద.  

త్రిఫల చూర్ణం రోజూ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

భారతీయ మహర్షులు అందించిన గొప్ప బహుమతిగా ఆయుర్వేదాన్ని చెప్పవచ్చు. అల్లోపతి వైద్యం పుట్టకముందు, అది భారతదేశానికి పరిచయం కాకముందు ఆయుర్వేదమే అందరికీ మూలాధారం. అల్లోపతి వైద్యం బాగా ప్రాచుర్యం పొందాక ఆయుర్వేదం కుంటుపడింది. కానీ ప్రస్తుతకాలంలో ఆయుర్వేదం మళ్లీ ప్రజల్లో ఆదరణ పెంచుకుంది. ఆయుర్వేదం  ప్రసాదించిన ఔషదాలలో త్రిఫల చూర్ణం కూడా ఒకటి. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయల మిశ్రమం అయిన త్రిఫల చూర్ణం ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అసలు త్రిఫల చూర్ణం రోజూ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యం.. త్రిఫల జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, మలబద్ధకం నుండి ఉపశమనానికి,  జీర్ణశయాంతర అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది సినర్జిస్టిక్‌గా పనిచేస్తుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది.   డిపెండెన్సీని కలిగించకుండా క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది.   జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండటంలోనూ, జీర్ణవ్యవస్థలోని విషాన్ని బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్..                                                                                        పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్,  విటమిన్ సి పుష్కలంగా ఉన్న కారణంగా  త్రిఫల  చూర్ణం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే  యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్,  హానికరమైన అణువులను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడటంలోనూ,  వృద్ధాప్యాన్ని,  వివిధ వ్యాధులకు దూరం చేయడంలోనూ దోహదం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా త్రిఫల ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.   రోగనిరోధక శక్తి.. త్రిఫల చూర్ణం రోగనిరోధక శక్తిని పెంచుతుందని  ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఉసిరి, కరక్కాయ, తానికాయల కలయిక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలు,  ఫైటోన్యూట్రియెంట్ల ను అందిస్తాయి. త్రిఫల చూర్ణాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో  సహజ రక్షణ వ్యవస్థ  మెరుగవుతుంది.  ఇది అంటువ్యాధులు,  అనారోగ్యాలు రాకుండా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నోటి ఆరోగ్యం.. నోటి పరిశుభ్రత,  దంత సంరక్షణ కోసం ఆయుర్వేద వైద్యులు  త్రిఫలను చాలా కాలంగా సిఫార్సు చేస్తున్నారు. త్రిఫలలో ఉండే  ఆస్ట్రింజెంట్ లక్షణాలు చిగుళ్ల కణజాలాన్ని బిగించి, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో  సహాయపడతాయి, చిగుళ్ల వ్యాధి,  వాపు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటి బాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. కావిటీస్, ప్లేక్ బిల్డప్,  చెడు శ్వాసను నివారిస్తుంది. బరువు.. త్రిఫల బరువు బ్యాలెన్స్ గా ఉంచడంలోనూ,  ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించడంలోనూ సహాయపడతాయి.  ఇది జీర్ణక్రియకు, అధిక బరువు తగ్గించడంలోనూ   సహాయపడుతుంది.   ఆరోగ్యకరంగా బరువును మెయింటైన్ చేయడానికి ఇవి చాలా సహాయపడతాయి. జీర్ణక్రియకు,  నిర్విషీకరణకు సపోర్ట్  ఇవ్వడం ద్వారా త్రిఫల పోషకాల శోషణను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది.  కొవ్వుల విచ్ఛిన్నంలో సహాయపడుతుంది. ఇంతేకాకుండా ఇందులో ఉండే తేలికపాటి భేదిమందు ప్రభావాలు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి,  బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామందిలో మలబద్దకం సమస్య ఉంటుంది. దాన్ని  త్రిఫల చూర్ణం పరిష్కరిస్తుంది.                                                 *నిశ్శబ్ద.                              

థైరాయిడ్ క్యాన్సర్ అంటే తెలుసా?

  ఎం టి సి మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్  చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్  గ్రంధిలో వచ్చే క్యాన్సర్. ధాయ్ రాయిడ్ క్యాన్సర్ సమ స్య వివిదరూపాలలో వచ్చి క్యాన్సర్ గా మారు తుంది. ఇది వివిధ రకాల కణాల ద్వారా ఫరా ఫాలిక్యులర్ సి సెల్ ద్వారా పుడుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా చిన్న గ్రంధి. మన మెడకు ముందు భాగం లో ఉంటుంది. శరీరానికి అవసరమైన హార్మోన్లనుథైరాయిడ్ క్యాన్సర్ ఉత్పత్తి చేస్తుంది.ధై రాయిడ్ లో ఒకరకమైన కణాల ఉత్పత్తి ఎప్పుడైతే ప్రారంభమౌతాయో క్యాన్సర్ మొదలవుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటి థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ పై ఆధార పడి క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. మొ డ్యులరీ ధై రాయిడ్ క్యాన్సర్ చాలా అరుదైన క్యాన్సర్. ప్రతి 1౦౦౦ మందిలో 3 నుండి 4% ధైరాయిడ్ క్యాన్సర్లు వస్తున్నాయి. మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చికిత్స వంటి అంశాలు చూద్దాం...థైరాయిడ్ గ్రంధి గురించి... మన మెడ పై సీతాకోక చిలుక ఆకారం లో థైరాయిడ్  గ్రంధి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్బ్లను ఉత్పత్తి చేసి శరీరానికి మెటాబా లిజం ను పెంచు తుంది.థైరాయిడ్ గ్లాండ్స్ లో రెండు రకాలు ఉంటాయి. సెల్స్ ఫాలిక్యులర్ సి సెల్స్ పరా ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఫాలిక్యులర్ సెల్స్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పరా ఫాలిక్యులర్ సెల్స్ కాల్సిటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ద్వారా శరీరంలో కాల్షియం ను నియంత్రిస్తుంది. ఎం టి సి ఇతర క్యాన్సర్ల కన్నా వేరుగా ఉంటుంది.  ఎం టి సి ఫరా ఫాలిక్యులర్ సెల్స్ ద్వారా వృద్ది అవుతుంది. ఎం టి సి ని కొందరు మోడ్యులరీ థైరాయిడ్ కార్సినామా అనికూడా అంటారు. ఎం టి సి ఎన్నిరకాలు... ఎం టి సి ని రెండు రకాలుగా గుర్తించారు. స్పోరాడిక్ , ఫెమిలాల్ గా గుర్తించారు. స్పోరాడిక్ చాలా సహజమైన సమస్య వయస్సు మళ్ళిన వాళ్ళలో ముఖ్యం గా వృ దులలో థైరాయిడ్ లోబ్ లో ప్రభావం చ్గూపిస్తుంది. ఫెమిలాల్ ఎం టి సి కుటుంబం లో వస్తుంది . ఇది బాల్యం నుంచే వృద్ది చెందుతుంది. ఈ రకమైన క్యాన్సర్స్ థైరాయిడ్ లోబ్స్ లేదా ఇతర రకాల కణి తలు ఉంటె మరింత తీవ్రంగా ఉంటుంది. పరా ఫాలిక్యులర్ సి సెల్స్ ఉండే ప్రాంతం లో మోడ్యులా థైరాయిడ్ ఉండే ప్రాంతం లో వస్తుంది.ఒక్కోసారి ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఇతరథైరాయిడ్ క్యాన్సర్ లను గుర్తించడం కష్టం. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు... ప్రాధమిక స్థాయిలో ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఎం టి సి నెమ్మదిగా పెరుగుతుంది. వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కనపడవు. ప్రధానంగా థైరాయిడ్ గ్రంధి వద్ద ఒక కణిత మేడలో వస్తుంది. ఇది పూర్తిగా కణిత మాంసం ముద్దగా ఉంటుంది పెరిగిన కణిత థైరాయిడ్ లో పెరుగుతుంది. దీనివల్ల మింగడం లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది మాట్లాడడం కష్టంగా ఉంటుంది. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలలో ముఖం ఎర్ర బడడం.బరువు తగ్గడం. డయేరియా లేదా నీళ్ళ విరేచనాలు వంటివి కనిపిస్తాయి . మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఎన్ని స్టేజీలలో ఉంటుంది... ఆన్ని క్యాన్సర్ల లాగానే డాక్టర్స్ మొడ్యులారీ థైరాయిడ్ ను స్టేజిలుగా గుర్తించారు. నాలుగు స్టేజీలు ఎలా ఉంటాయో చూద్దాం . వివిధ రకాల కారణాలు అయి ఉంటాయి. ట్యూమర్ పరిమాణం సైజు లింఫ్ నోడ్స్ ను చేరిందా లేదా లేదా ఇతర అవయవాల కు దూరంగా ఉందా ,వ్యాపించిందా ? స్టేజ్ 1. ప్రాధమిక స్థాయి, ఈ దశలో ట్యూమర్ చాలా చిన్నదిగా వ్యాపించదు . ప్రతి స్టేజి లో పెరుగుతూ పోతూఉంటుంది. 4 వ స్టే జిలో క్యాన్సర్ ఏ సైజు లో అయినా ఉండవచ్చు. ప్రతి స్టేజిలో క్యాన్సర్ పెరగడం వ్యాపించడం సంభవిస్తుంది. కారణాలు... ఎం టి సి ఫలితం గా పారా ఫాలిక్యు లర్ సెల్స్ లో మార్పులు చెందుతాయి. ఏది ఏమైనా చాలా కేసులలో స్పోరాడిక్ కు గల కారాణాలు తెలియరాలేదు. 25% ఎం టి సి కేసులలో కుటుంబాలలో వస్తాయిదీని ఆధారం గా రేట్ జీన్ లో మార్పుల కారణంగా పెర్కొంటు న్నారు.రేట్ జీన్ క్రోమో జోములలో ఉంటుంది. ఇది పది రకాలుగా మారుతుంది. అని కణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు జీన్ లో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. దీనివల్ల స్పోరాడిక్ క్యాన్సర్స్ ఎం టి సి ఈ పరిస్థితిని రేట్ జీన్స్ స్థితి వల్ల మల్టి పుల్ ఎండో క్రైన్ నీమో ప్లాసియా టైప్ 2 లేదా మెన్ 2 , మెన్ 2 ఏ మెన్ 2 బి ఉండవచ్చని అభిప్రయా పడ్డారు. మోడ్యులార్ క్యాన్సర్ నిర్ధారణ... మోద్యులరీ  థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడే ప్రజలు మెడలో కణి తలలో వస్తారు. డాక్టర్ తమ పరీక్షలలో చాలా చాక చక్యం గా లంప్ ను గుర్తిస్తారు. ఇమేజింగ్ టెస్ట్ లలో అల్ట్రా సౌండ్,సిటి లేదా ఎం అర్ ఐ స్కాన్,ధైరాయిడ్ చేయిస్తారు. ఒక వేళ డాక్టర్  థైరాయిడ్ క్యాన్సర్ గా అనుమానిస్తే ఎస్పిరేషణ్ బయాప్సీ పరీక్ష అల్ట్రాసౌండ్, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా 6 ఆరు ప్రాంతాలలో కణా లాలో చిన్న కణాలను నీడిల్ ను వినియోగిస్తారు. మరిన్ని పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. మరిన్ని పరీక్షల వల్ల చికిత్స పద్దతులు ఎలా చేయవచ్చు. అని నిర్దారించాలంటే రక్త పరీక్ష చేస్తారు, రక్త పరీక్షలో కాల్సిటోనిన్, కాల్షియం కార్సినోమా ఎం బ్రాయినిక్ యాంటీ జీన్ ఎల్ ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. చికిత్సలు... ప్రాధమిక స్థాయిలో ఎం టి సి సర్జరీ చేస్తారు. దీనిని ధైరోడేక్టమీ అంటారు.ఇందులో  థైరాయిడ్గ్లాండ్ ను పూర్తిగా తొలగిస్తారు.  థైరాయిడ్ గ్రంధి వ్యక్తికి అవసరం. లేదా ఒక వేళ  థైరాయిడ్ గ్రంధి తొలగిస్తే జీవితాంతం హార్మోన్లు మార్చుకుంటూ ఉండాలి. సర్జరీ తో పాటు ఇతర చికిత్సలు చేస్తారు. ప్రత్యేకంగా ఒకవేళ కణిత లేదా ట్యూమర్ ఇతర ప్రాంతాలకు అవయవాలకు వ్యాపిస్తే  థైరాయిడ్ బయట, మెడ బయటి భాగం లో మార్పులు వస్తే సర్జరీ అనువు కాని పక్షంలో ఇతర చికిత్సలు ఎక్స్ టర్నల్ బీం రేడియేషన్ కీమో తెరఫీ లక్ష్యం దిశగా దేరఫీ లు చేస్తారు. క్యాన్సర్ తీవ్రత స్టేజీ ల ఆధారంగా ఉత్తమమైన నిర్ధారణ చికిత్స పద్దతిని ఎంచుకుంటారు. క్యాన్సర్ విస్తరిస్తే తీవ్రమైన చికిత్సలు మల్టిపుల్ స్టేటర్జీ కీమో తెరఫీ చికిత్స ఇతర చికిత్స పద్దతులు చేయాల్సి ఉంటుంది. నివారణ... ఎసి ఎస్ ప్రకారం చాలా రకాల  థైరాయిడ్ క్యాన్సర్ లలో ఎం టి సి లో కుటుంబ చరిత్ర ఉండి ఉండవచ్చు. వారిలో వస్తున్న జీన్ మార్పులు వల్ల వ్యాధి తీవ్రత సూచిస్తుంది. ఒకవేళ వ్యక్తికి హై రిస్క్ ఉంటె డాక్టర్  థైరాయిడ్ యాక్ట మీ క్యాన్సర్ ను నిలువరించ వచ్చు. డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి ?... మేడపై ఏదైనా కణిత ఉన్నట్లు అనిపిస్తే వారు డాక్టర్ ను సంప్రదించాలి. ఎం టి సి శక్తి వంతమైన లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి ఇందులో గాలి పీల్చుకోవడం మింగడం కష్టం ఉన్న లక్షణాలు గమనించాలి. కుటుంబాలలో చరిత్ర ఉంటె ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. డాక్టర్ మాత్రం జన్యుపరమైన పరీక్షలకు సూచించవచ్చు జీన్ లో మార్పులు ఉంటె ఎం టి సి వస్తుంది అన్న విష యం తెలుసుకోవాలి. విశ్లేషణ... ప్రజలలో ఎం టి సి రావడానికి రక రకాల కారణాలు ఉండచ్చు. స్టేజి నిర్ధారణ చికిత్సకు స్పందించడం పూర్తి ఆరోగ్యం గా కోలుకోవడం ముఖ్యం.ఎం టి సి అన్నది ఇతరా క్యాన్సార్ లాంటి దికాదు. దీని సత్వరం నిర్ధారణ చేయడం వల్ల చికిత్స చేస్తే ఫలితాలు ఉంటాయి. అదనంగా బయో మార్కర్స్ గుర్తించడం... కార్సిటో నిన్ సి ఇ ఏ సర్జరీ తరువాత ఎంత ఉందొ తెలుసు కుంటే ఎంతకాలం బతక గలరో అంచనా వేయవచ్చు. ఎం టి సి రావడానికి  థైరాయిడ్ క్యాన్సర్. క్యాన్సర్ నుండి బయట పడ్డ వారి సమాచారం. ముందుగా గుర్తించడం చికిత్స ఫలితాలు చూడాలి.బయో మార్కర్లను నిశితంగా పరిశీలించాలి. మొదటి సంవత్సరం కార్సి టోనిన్ చికిత్స ప్రత్యామ్నాయ మార్గాలు వల్ల మనుగడ సాగడం 2౦17 లో చేసిన పరిశోదన ప్రకారం 1౦ సంవత్సరాలు మనుగడ ఎలా బతికి బట్ట కట్టలేదు. 1)థైరాయిడ్ లో 95 % స్థానిక క్యాన్సర్ మాత్రమే . 2)75 % ఇతర అవయావాల కు విస్తరించకుండా వ్యాధి ధైరాయిడ్ గ్రందికే పరిమితం . 3)2౦ % ఇతర అవయవాలకు విస్తరించడం అదీ లివర్ఊపిరి తిత్తులకు సోకడం గమనించవచ్చు. థైరాయిడ్ లో వాపు మింగలేకపోవడం వాపు ఉంటె ధైరాయిడ్ గ్లాండ్ లో వచ్చిన మార్పుగా గమనించి సత్వరం డాక్టర్ ను సంప్రదించాలి. చికిత్స చేయించుకోవాలి.  

రోజూ మూడు పూటలా తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే 24 గంటల్లో మూడు సార్లు ఆహారం తీసుకోవాల్సిందేనని  చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం,  రాత్రి భోజనం ఈ మూడూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో  చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. అసలీ సమస్య ఎప్పుడొస్తుందంటే.. సాధారణంంగా చాలామంది  బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా రోజులో ఏదో ఒక పూట ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ   ఇలా చేయడం ద్వారా బరువు తగ్గుతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. దీనికి బదులుగా ఇలా ఆహారం ఎగ్గొట్టడం అనే అలవాటు చాలా సమస్యలను పెంచుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే, అది  శరీరంలో అనేక వ్యాధుల సమస్యలను పెంచుతుందని  పరిశోధనలు కూడా చెబుతున్నాయి.  ఇలా ఆహారాన్ని స్కిప్ చెయ్యడం వల్ల  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. భోజనం మానేయడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే..  ఏదైనా తిన్న ప్రతిసారీ మీ పిత్తాశయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది, ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అయితే ఆహారం తీసుకోకపోయినా పిత్త రసం అదే విధంగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం తీసుకోకపోతే ఆ పిత్తరసం పనిచేయకుండా ఉండిపోతుంది. దీనికారణంగా అది  పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితి పిత్తాశయంలో గట్టిపడిన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది, ఇది పిత్తాశయంలో రాళ్లకు దారితీస్తుంది.  తరచుగా రోజులో ఒకపూట ఆహారం తీసుకోవడం మానేస్తే.. ముఖ్యంగా ఉదయం పూట, స్థూలకాయం, అధిక రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్ సమస్యలు, మధుమేహం,  మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు మొదలవుతాయి.  గుండె జబ్బుల ప్రమాదం సాధఘారణంకంటే ఎక్కువగా ఉంటుంది.ఇది కార్డియోమెటబోలిక్ ప్రమాదాలకు మూలకారణం అవుతుంది. గుండె జబ్బులను నివారించడానికి,  ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడం అవసరం. ఇప్పటికే డయాబెటిక్ ఉన్నవారు  ఒక పూట  భోజనం స్కిప్ చేయడం మరింత  సమస్యాత్మకంగా మారుతుంది. ఇది ఆహారం తీసుకోవడం,  ఇన్సులిన్ ఉత్పత్తి మధ్య అసమతుల్యతను ప్రోత్సహిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఇన్సులిన్ లేదా బ్లడ్ షుగర్ తగ్గించే మందులపై ఆధారపడిన మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తులకు, రక్తంలో చక్కెర శాతం ఉన్నపళంగా తగ్గడం చాలా ప్రమాదం.                                                                                                         *నిశ్శబ్ద