ఏడిస్తే ఎన్ని లాభాలో...
posted on Mar 21, 2024 @ 12:30PM
మనిషి అన్నవాడికి స్పందించడం అవసరం అంటే కొన్ని సందర్భాలలో ఆనందం తో కన్నీరు వస్తే. బాధతో కన్నీరు వస్తుంది. అలా కన్నీరు పెట్టుకుంటే లాభమే. అని పరిశోదనలో తేల్చారు.కన్నీరు వల్ల లాభామ నష్టమా అన్న విషయం లో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా మరి. కొందరికి కన్నీరు అస్సలు రాదు.కొందరికి కన్నీరు అతికష్టం మీద వస్తుంది. కొందరికి కన్నీరు అలవోకగా వస్తుంది.వాళ్ళ నెత్తిన నీళ్ళ కుండ ఉందేమో అని అనిపించే విధంగా అదే ధారగా కన్నీరు పెట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తారు.కొందరు మనసులో ఉన్న బాధను దుఖం రూపం లో బయటికి వెళ్ళ గాక్కుతారు.పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటారు.గతం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బాహాటంగా మనస్పూర్తిగా ఏడవడం లేదా కుళ్ళి కుళ్ళి ఏడవడం మనం గమనించ వచ్చు.అసలు కన్నీరు పెట్టుకుంటే లాభమా నష్టమా చూద్దాం. మనిషి ఏడవడం దుఃఖించడం ఒక సాధారణ ప్రక్రియ.ఒక్కోరిలో ఒక్కో భావనలు ఉంటాయి.దానికి బదులుగా దుఃఖం పెల్లుబికి బయటికి వస్తూ ఉంటుంది.అసలు మనిషి ఎందుకు ఏడు స్తాడో దుఃఖం తో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? మీరు ఆలోచించారా ? ఈమేరకు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు పలు ఆశక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి.మనము ఏడవడం ద్వారా మనశరీరం, మెదడు రెండూ కీలక మని కనుగొన్నారు.అప్పుడే దానిఫలితాలు మనకు అందుతాయని అన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే మొదటి సారి ఏడుస్తాడు.అసలు ఏడవడం ద్వారా వచ్చే లాభాము మీకు తెలియదు. ఏడవడం వల్ల వచ్చే లాభాలు అశక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం.
1)శరీరం డీ టాక్సీ ఫై అవుతుంది.
*కన్నీరు మూడు రకాలు...
*రిఫ్లెక్స్ ద్వారా వచ్చే కన్నీరు...
*అదే పనిగా వచ్చే కన్నీరు...
*భావనాత్మ కంగా వచ్చే కన్నీరు...
*రిఫ్లెక్స్ వల్ల వచ్చే కన్నీరు...
కంటిలో పేరుకు పోయిన మట్టి,ఇతర పనికిరాని చెత్త అది కంటిని శుభ్రం చేస్తుంది. అదే పనిగా కంటి నుండి కన్నీరు ప్రవహిస్తుంటే అది మీ కళ్ళు చేమ్మగిల్లినట్లు. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.భావనాత్మకంగా వచ్చే కన్నీరు ఒత్తిడి వల్ల,లేదా ఉద్వేగాల వల్ల కన్నీరు బయటికి వస్తుంది.అవి మరల వేరే టాక్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కన్నీరు మన శరీరం లో ఉన్న వస్తువుల్ని శరీరం నుండి బయటికి వస్తుంది.
మిమ్మల్ని మీరు శాంతింప చేసుకోవడం కన్నీరు సహకరిస్తుంది..
మన మనస్సు శాంత పరుచుకోవాలంటే ఏడవడం మంచి పద్ధతి.పరిశోదనలో ఏడవడం ద్వారా సింథటిక్ నర్వస్సిస్టం యాక్టివేట్ కావడాన్ని గమనించవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తద్వారా మన శరీరానికి కొంత ఉపశమనం కల్పించడం లో సహకరిస్తుంది.కొంత సేపు ఏడ్చిన తరువాత శాంతం గా ప్రాశంతం గా ఉన్నట్లు అనుభూతి పొందుతారు.
మీకు సహకారం లభిస్తుంది..
ఒక వేళ మీరు నిరాశ చెందినట్లయితే ఏడవడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు సపోర్ట్ అవసరం.అని భావిస్తారు.చిన్న పిల్లలు సైతం తమ పై దృష్టి పెట్టాలంటే ఏడవడం ఆయుధం గా వాడతారు.ఇలా చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యం పూర్తి చేసామని భావిస్తారు.
దుఃఖం నుండి బయటికి రావడానికి దోహదం చేస్తుంది..
ఏడవడం లేదా దుఃఖించడం అన్నది ఒక ప్రక్రియ దుఃఖం పడడం,ఆగ్రహంతో కూడా దుఃఖం వస్తుంది.ఎడుస్తున్నప్పుడు ఏడ్చే సమయంలో ఒక పద్ధతి ప్రకారం ఏడవడం అవసరం దీనిద్వారా దుఃఖం నుండి బయటికి వచ్చినట్లు బరువు దిగి పోయినట్లు భావిస్తారు.
నొప్పి నివారిస్తుంది..
దీర్ఘ కాలం పాటు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్ విడుదల అవుతుంది.ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ గా పేర్కొన్నారు.శారీరక భావనాత్మక రెండువైపులా ఉన్న భావనను మనసులోని బాధను నివారించేందుకు సహకరిస్తుంది.ఒక్కో సారి ఎండోర్ఫిన్ విడుదల అయినప్పుడు మీ శరీరం ఒక నియమిత హద్దు వరకు వినే ప్రయత్నం చేస్తుంది.మన శరీరంలో ఉన్న ఆక్సిటోసిన్ ప్రశాంతత ఇస్తుంది.
మూడ్ లో మార్పు వస్తుంది..
మన బాధను నొప్పిని తగ్గించడం లో సహకరిస్తుంది.ఏడవడం ద్వారా మీ మూడ్ కూడా బాగా అద్భుతంగా ఉంటుది.సత్వరంగా స్వేచ్చగా ఉండే విధంగా మీ మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు చల్ల బడుతుంది.శారీరకంగా బాగా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది.
భావనలను నియంత్రిస్తుంది...
ఏడవడం అన్నది బాధ పడడం అన్నది మరొకరి బాధకు ఏడుపుకు జవాబుగా కాదు.చాలా సార్లు ఎప్పుడు ఏదైనా చాలా ఆనందం గా ఉంటారు. భయం లేదా ఒత్తిడి లో యాలె విశ్వ విద్యాలయం పరిశోధకులు అంటున్న మాట ఏమిటి అంటే ఈ విధంగా బాధపడడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించు కునేందుకు సహకరిస్తుంది.
అసలు సహజంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారు..
భయంకర మైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ,లేదా తాను అనుకున్న లక్ష్యం లో ఓటమి పాలై నప్పుడు.తనకు కావాల్సిన ఆప్తులైన వారు దూరమై నప్పుడు. లేదా తమకి ఇష్టమైన వారే తమను తీవ్రంగా ద్వేషించి నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం పొర్లి పొర్లి ఏడవడం.మనకు కనిపిస్తుంది. మానసిక భావోద్వేగాలతో ముడి పడిన సంఘటనలకు కారణంతామే అని భావించిన వారు.అనుకోని విధంగా అనూహ్య విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు కంటినుండి వస్తాయి.
వైద్య చికిత్స ఎప్పుడు అవసరం...
ఏడవడం ఎలాంటి వస్తువంటే మీకు సుఖం లభిస్తుంది.బాధ కలుగుతుంది.అందుకు ప్రతిగా మీరు ఏడుస్తారు అది సర్వసాధారణం మీరు ఏడవడం వల్ల మీరు బాగా ఉన్నట్లు భావిస్తారు.ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడవద్దని ఏడుపు వచ్చినప్పుడు మనస్త్రుప్తిగా ఏడవండి. ఆబాధనుండి విముక్తి పొందండి. ఏదైనా విషయం లో ఆనందం లభిస్తుందో.లేదా దుఃఖం కలిగిస్తుందో చాలా సార్లు అప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నా ఎడుస్తారని ఏలే విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు అంగీకరిం చారు.ఏడవడం వల్ల భావనాత్మక నియంత్రణ బయటికి వస్తుంది.సహాయ పడుతుంది. ఏడుపు మంచిదే.