Heard anyone in your circle with Calcium deficiency?

  When it comes to bone health, calcium is the first thing that comes to anyone’s mind. Are you aware that a sizable population today suffers from calcium deficiency related issues? And, despite the fact that there are many plant based foods that have more calcium than milk, the only solution people are generally being offered, unfortunately, is a glass of milk and calcium supplements. But despite this solution people continue to complain of calcium deficiency and most often osteoporosis kind of diseases are still not controlled. India which is reported to be high in milk / diary products consumption in that case should have very low calcium related health ailments reported. But the reality today is some thing else. Pregnant women, lactating mothers, growing teens, those suffering from bone related diseases, middle aged people, senior citizens and those in their early thirties and even one year old babies - all have been reporting calcium deficiency! So instead of just the milk intake, one should be worried about the diet and lifestyle changes that can minimize calcium loss and maximize its absorption. As stated earlier there are plenty of calcium rich plant based foods such as all legumes, peas, lentils, leafy greens, tofu, Ragi, seeds like sesame or flax, etc. that can be included in daily diet. Also Vitamin D plays an important role in calcium absorption and reducing urinary calcium losses via kidneys. Most people today find themselves deficient in this vitamin because of lack of proper exposure to sunlight. Many times, addressing the vitamin D deficiency solves problems like joint pain. Unfortunately, no amount of fortification of foods can provide an adequate quantity of vitamin D, hence people need to depend on either sunlight or supplements. Courtesy Glow with health wellness solutuions

బ్రేక్‌ఫాస్ట్‌తో ఎంతో బెని‘ఫిట్’...

  ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి ఏoతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు . అయితే టైం లేదనో, బద్ధకించో బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తుంటాం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఉండద్దు.  అది కోరి అనారోగ్యాలని కొని తెచ్చుకోవటమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాధారణంగా రాత్రి భోజనానికి, పొద్దున్న చేసే బ్రేక్ ఫాస్ట్ కి మధ్య దాదాపు పన్నెండు గంటల సుదీర్ఘ విరామం వుంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిపోతాయి. ఆ శక్తిని మళ్ళీ పుంజుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకుని తీరాలి. * బ్రేక్ ఫాస్ట్ చేయని వారితో పోలిస్తే చేసిన వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలలో తేలింది. * బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానకూడదు. పొద్దున్నే ఏమన్నా తినటం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది . *  మాంసకృత్తులు , పిండి పదార్దాలు, ముఖ్యంగా పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహరం తీసుకోవాలి. *  ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో పాటు పండ్లు, పండ్ల రసాలు, తప్పనిసరిగా తీసుకోవాలి. *  ఏ రోజన్నా బ్రేక్ ఫాస్ట్ చేసే టైం లేదు అనిపిస్తే పూర్తిగా ఏమి తినకుండా ఉండటం కన్నా, కీరా , క్యారట్ , ఆపిల్ , అరటిపండు వంటివన్నా తినాలి. గుప్పెడు వేరుసెనగలు లేదా కాసిని జీడిపప్పుతో పాటు ఓ గ్లాసు మజ్జిగ తాగినా చాలు. *  ఖాళీ కడుపుతో ఉండకుండా ఏదో ఒకటి తీసుకుంటే శరీరానికి శక్తి, మెదడుకు చురుకు  వస్తాయి. -రమ

Watch! What you Eat!

Here are some significant fact to be kept in mind while we gulp down the supplies from our pantry! These are few add-ups in our diet routines : Fibre is one such nutrient that makes us feel full, thus cutting down on our food intake and also aid in digestion. So an intake quamtity of 3-5g would be great! Though proteins are the sources of energy and build the tissues, but an intake of more than 5g is not advisable. Sugar intake less than 20g is beneficial, since we can not cut down sugar in some foods, so it is wise to cut down sugar as an additive in our beverages. Avoid the consumption of fastfoods, refrigerated and canned foods; but opt for fresh foods,Before dumping a pack into your shopping basket check out for the nutrient label. Keep icecreams and cookies at the bay as the are loaded with calories and not with energy or any useful nutrients! If you deny the intake of food without liquids like aerated drinks or sodas, swap these for fresh fruit juice, milkshakes or water. If you like something to munch with your cuppa or teas, try crackers or breadsticks rather than cookies or fried foods. Pulses are one of a kind, as they are loaded with proteins, fibres and energy yeilding carbohydrates, so these are a must in our diet! Sodium intake is a big No for Diabetes and Hypertension victims, while fats are a big No for Heart patients! Besides, following these advices, it is also mandatory to exercise! As, it is rightly sai a sound mind in a sound body! Take Care!! Stay Healthy!!

SOME HEALTH FACTS YOU SHOULDN’T IGNORE

    In our life we tend to ignore the fact that our body needs to be taken care of. In the rush of trying to make a life, we forget to live it. There are some simple health facts we tend to ignore everyday, which when given attention can be life changing. A health study has revealed that the number of people dying of lack of exercise is now the same as the number of people dying because of smoking. So, its time you change your lifestyle, if you want to live longer. Some simple exercises everyday can add a few extra years to your life.     Its also important to keep track of what you eat and where you eat it from. Research says that those who eat either breakfast or dinner in a restaurant have a greater chance of being effected by obesity than those who mostly eat  home cooked food. Although it is considered socially inappropriate to fart, it has been found that by allowing yourself to fart, you can decrease high blood pressure and stay healthy.     You must have heard people say laughter is the best medicine. Now its time to know how. Experts say that laughing hundred times in a day is as good as exercising on a stationary cycle for 15 minutes. So, laugh a lot and stay happy, because happy is healthy.   Remember not to sit continuously for more than 2 hours in a day. Sitting for a longer than that is known to decrease your life expectancy by two years. If you have the habit of sitting for long hours, find a reason to get up and walk a little. Making a few changes in your routine can improve life to a great extent.   -Kruti Beesam krutibeesam@gmail.com

జుట్టు గురించి కొత్త విషయాలు

  జుట్టుకి మనం ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందం గురించి పెద్దగా శ్రద్ధపెట్టని వారు సైతం చీటికీ మాటికీ జుట్టుని సరిచేసుకోక మానరు. ఆ జుట్టు రాలిపోతున్నా, తెల్లబడుతున్నా కంగారుపడని మానవుడూ ఉండడు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఈ మధ్యనే జుట్టు గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. అవేమిటంటే... ఉక్కుకంటే గొప్పది మన వెంట్రుకలు, అంతే సన్నగా ఉండే ఉక్కతో సమానమైన బలం కలిగి ఉంటాయని చదివే ఉంటాము. కానీ ఉక్కుకంటే వెంట్రుకే గొప్పది అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అదే స్థితిస్థాపకగుణము (elasticity). ఒక వెంట్రుకని దాదాపు ఒకటిన్నర రెట్లు లాగిన తరువాత కానీ అది తెగదు. మరే లోహంలోనూ ఇలాంటి గుణం కనిపించదు. చిత్రమేమిటంటే నిదానంగా లాగేకన్నా గబుక్కున జుట్టుని లాగినప్పుడే అది మరింత బలంగా కనిపిస్తుందట.   కారణం తెలిసింది ఒక పక్క దృఢంగా ఉంటూనే మరోపక్క సాగతీత గుణాన్ని కలిగి ఉండటం వెనుక కారణం ఏమిటా అని పరిశోధన మొదలుపెట్టారు. జుట్టులో ఉండే రెండు సూక్ష్మమైన వ్యవస్థలే దీనికి కారణం అని తేలింది. అవే కార్టెక్స్, మాట్రిక్స్లు! ఒక చిన్నపాటి కార్టెక్స్లో వేలాది ‘alpha helix chains’ అనే కణాలు ఉంటాయి. చుట్టలు చుట్టలుగా ఉన్న ఈ కణాలు జుట్టుని లాగినప్పుడు విచ్చుకుంటాయి. అంటే జుట్టుని లాగినా కూడా తెగకుండా నిలిపి ఉంచుతాయన్నమాట. మాట్రిక్స్ వ్యవస్థలో ఇలాంటి ఏర్పాటు ఏదీ లేకపోయినా, జుట్టు గట్టిదటానికి తోడ్పడుతుంది. అంటే ఈ రెండు వ్యవస్థలూ కలిసి జట్టు పాడవకుండా కాపాడతాయన్నమాట.   తడి జుట్టుని దువ్వకూడదా! జుట్టు దృఢత్వానికి కారణం తెలిసింది సరే! మరి అది ఉష్ణోగ్రతలకి ఎలా ప్రభావితం అవుతుందో కూడా చూడాలనుకున్నారు. అందుకోసం నీటిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు కార్టెక్స్, మాట్రిక్స్ల పనితీరుని గమనించారు. జుట్టులోకి అధికశాతం తేమ చేరినప్పుడు దానిలోని సాగతీత గుణం కొంత తగ్గి, వెంట్రుకలు త్వరగా తెగిపోతున్నట్లు తేలింది. అంటే తడిగా ఉన్న జుట్టుని దువ్వకూడదంటూ ఇప్పటివరకూ పెద్దలు చెబుతూ వస్తున్న మాట నిజమేనన్నమాట! అలాగే 60 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతల వద్ద వెంట్రుకలు శాశ్వతంగా దెబ్బతినిపోవడాన్ని కూడా గమనించారు. చీటికీ మాటికీ హెయిర్ డ్రయ్యర్ల వంటి పరికరాలు వాడద్దంటూ వినిపించే హెచ్చరికలు కూడా నిజమే అని అర్థమవుతోంది. పరిశోధకులు కనుగొన్న ఈ కొత్త విషయాలు జుట్టు విషయంలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని ఆశిస్తున్నారు. జుట్టుని దృఢంగా ఉంచేందుకు కొత్త చికిత్సలను రూపొందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు. అంతేకాదు! జుట్టులోని కణజాలాన్ని గమనించడం ద్వారా, అదే తరహా కణజాలంతో కొత్తరకం లోహాలను ఉత్పత్తి చేయవచ్చని కూడా భావిస్తున్నారు. - నిర్జర.

Cell Phones in trousers can cause male Infertility

  The next time you keep your Mobile in your trouser pocket ,think twice! According to a study published in the journal Environment International, radio-frequency electromagnetic radiation (RF-EMR) emitted by mobile phones can have a detrimental effect on male fertility. "This study strongly suggests that being exposed to radio-frequency electromagnetic radiation from carrying mobiles in trouser pockets negatively affects sperm quality," cautioned Fiona Mathews, a professor of biosciences at University of Exeter in Britain. "This could be particularly important for men already on the borderline of infertility, and further research is required to determine the full clinical implications for the general population," he said. Most of the global adult population own mobile phones and around 14 percent of couples in high and middle income countries have difficulty in conceiving. To reach this conclusion, a team led by Mathews conducted a systematic review of the findings from 10 studies, including 1,492 samples. The sperm quality was measured in three different ways: motility, viability and concentration. In control groups, 50-85 percent of sperm have normal movement. The researchers found this proportion fell by an average of eight percentage points when there was exposure to mobile phones. Similar effects were seen for sperm viability. The effects on sperm concentration were less clear. The results were consistent across in vitro studies conducted under controlled conditions, said the study published in the journal Environment International. Given the enormous scale of mobile phone use around the world, the potential role of this environmental exposure needs to be clarified. While the study found an association between cellphone exposure and male infertility, the study was not designed to determine a cause-and-effect relationship.

ఫుడ్ క్రేవింగ్ అంత ప్రమాదకరమా!

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాకా మధ్యాహ్నం లంచ్ తినేలోపు ఏదో ఒకటి తియ్యగా, కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీలో ఆందోళన లేదా వత్తిడి ఎక్కువగా ఉన్నాయనే  అర్ధం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనుకోవటాన్నే క్రేవింగ్ అంటారట. ఆస్ట్రేలియా లో తాజాగా నిర్వహించిన ఒక సర్వే పురుషులకన్నా ఈ క్రేవింగ్ బారిన ఎక్కువగా పడినది స్త్రీలేలని తేల్చి చెప్పింది. ఇది కొందరిలో స్థిరంగా ఉంటే మరికొందరిలో మారుతూ ఉంటుందిట. ఒక నెలలో ఎక్కువగా  తీపి  పదార్థాలు తినాలని అనిపిస్తే మరో నెలలో పులుపు లేదా కారం ఉన్నవి ఎక్కువగా తినాలనిపిస్తుందిట. మానసిక స్థితిలోని మార్పులలాగానే ఆహారపదార్థాల మీదుండే కోరిక కూడా మారుతూ ఉంటుందిట. అంతేకాదు మానసిక ఆందోళనా,టెన్షన్స్,నిరుత్సాహం ఎక్కువగా ఉన్నవారి మెదడులో కొన్ని రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో వారు అతిగా తినటం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎంత తింటున్నదీ,ఏం తింటున్నది అస్సలు పట్టించుకోరట. కేవలం డిప్రెషన్,టెన్షన్ మాత్రమే క్రేవింగ్ కి కారణం కాదు. రక్తంలో గ్లూకోస్ నిలవలు తగ్గిపోవటం, భోజనం చేసే వేళల మధ్య మరీ ఎక్కువ గ్యాప్ రావటం, హార్మోన్ల ఇంబాలన్స్ కూడా క్రేవింగ్ కి కారణాలు అవుతాయని చెపుతున్నారు వైద్యులు. అయితే ఇలాంటి ఇలా క్రేవింగ్ బారిన పడినవాళ్లు దానిని నియంత్రిన్చుకోవటం అంత  పెద్ద పనేం కాదు. ఇది తగ్గుముఖం పట్టాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో లంచ్,డిన్నర్లాంటివి తీసుకోకుండా ప్రతి మూడు గంటలకి ఒకసారి మితాహారాన్ని తీసుకోవటం వల్ల దీనిని నివారించవచ్చు. ఇలా మితాహారం కొంచెంకొంచెంగా తినటం వల్ల గ్లూకోజ్  పర్సెంటేజ్ నిలకడగా ఉంటుంది. క్రేవింగ్ బారిన పడినవారు పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలిట. ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్,ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలిట. ఏదైనా తినాలని అనిపించినప్పుడు దాని మీద నుంచి ధ్యాస మారటానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే క్రేవింగ్ నుండి బయటపడటమే కాదు నాజుకుగా కూడా తయ్యారవుతారు. కళ్యాణి 

కొవ్వు తగ్గాలంటే

  కొలెస్ట్రాల్.... ఈ మాట వినటం సర్వసాదారణం అయిపొయింది. ఇది శరీరంలో సమపాళ్ళలో ఉంటే  పర్వాలేదు కాని కాస్త పెరుగుతున్న సూచనలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టాల్సిందే  అంటున్నారు వైధ్యనిపుణులు. మనం తీసుకునే ఆహరపధార్ధాల్లో కొవ్వు శాతం ఎంత ఉందో, ఎంత ఉండచ్చో అనే విషయాలపై అవగాహన లేకపోవటమే కొవ్వు పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువయితే అది గుండె పోతుకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు కార్డియోలజిస్ట్ లు.   అయితే ఆహారంలో  మనం తీసుకునే కొన్ని పదార్ధాల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.       *  చూడగానే తన ఎర్రటి రంగుతో కూరాలకి మంచి రంగునిచ్చే మిరపకాయలు కొవ్వుని కరిగిస్తాయట. ఎండుకారం ఒంట్లో వేడి పుట్టేలా చేసి కొవ్వుని నియంత్రిస్తుంది. అంతేకాదు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుందిట. అయితే వేసవిలో మాత్రం వీటి వాడుకలో కొంత మార్పులు చేసుకోవాలి.     *  మిరియాలలో ఉండే పిపరైన్ అనే పదార్థం ఒంట్లో కొవ్వుని పెంచే కణాల పెరుగుదలని నియంత్రిస్తుందిట.కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూరలలో కారానికి బదులు మిరియాలపొడి వేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.       *  మసాల దినుసులలో మంచి ఘుమఘుమలాడే దాల్చిన చెక్కకి కూడా కొవ్వుని కరిగించే గుణం ఉంది. ఇది షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచటం వల్ల బరువు త్వరగా పెరగరు. దాల్చిన చెక్క పొడిలో  కొద్దిగా తేనే కలిపి వేడినీటితో సేవించినా కొవ్వు కరుగుతుంది. ఇలా ఆహారవిషయంలో పాటించే కొద్దిపాటి జాగ్రత్తల వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.    ...కళ్యాణి

పోషకాల గని.. గోధుమ

  చవకగా లభించే పుష్టికరమైన ఆహారం గోధుమ. బంగారు రంగులో ముత్యాల్లా మెరిసిపోయే గోధుమ నుంచి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే వీటిలో మాంసకృత్తుల శాతం తక్కువ. కాబట్టి ఆ లోటుని పూరించడానికి గోధుమలని మరికొన్ని ఆహార పదార్ధాలతో కలపి తీసుకోవాలి. మినుములు, పెసలు, కందులు, బఠానీ, సోయా, లెంటిల్స్ వంటి పప్పు దినుసులతో కలిపి వండితే గోధుమలోని పోషక పదార్ధాలతోపాటు తగినన్ని మాంసకృత్తులు కూడా అందుతాయి శరీరానికి. అలాగే పాలకూర, గోంగూర, చుక్కకూర, మునగాకు వంటి ఆకు కూరలతో కలిపి కూడా వండచ్చు. ఉదాహరణకి చపాతీ పిండిలో గుప్పెడు శనగపిండి కలపటం, చపాతీలతోపాటు పప్పు దినుసులతో చేసిన కూర లేదా ఆకు కూరతో చేసే పరాఠా... వంటివి చేస్తే గోధుమల నుంచి పూర్తి పోషకాలని పొందచ్చు.   -రమ

అలెగ్జాండర్‌ టెక్నిక్

  మనం నడిచే నడక తీరులోనూ, నిల్చొనే భంగిమలోనూ... ఆఖరికి గాలిని పీల్చే విధానంలోనూ లోటుపాట్లను ఉంటాయని తెలుసు. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోము. పైగా ఇలాంటి పొరపాట్లకి మన శరీరం కూడా అలవాటుపడిపోవడంతో... జీవితం సాగిపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి చిన్నచిన్న లోపాలను సవరించుకుంటే మరింత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటామని తెలిస్తే. తెలిశాక ఓసారి ఆచరించే ప్రయత్నం చేస్తే! అలాంటి ప్రయత్నాలలో ఒకటి అలెగ్జాండర్‌ టెక్నిక్‌! ఎవరీ అలెగ్జాండర్‌! అలెగ్జాండర్‌ మాధియాస్‌ అనే ఆయన 19వ శతాబ్దంలో పేరుగాంచిన ఒక నటుడు. అవడానికి అస్ట్రేలియాకు చెందిన ఈ అలెగ్జాండర్‌ లండన్‌లో షేక్‌స్పియర్‌ నాటకాలను ఆడుతూ మంచి పేరునే సంపాదించాడు. అయితే ఏమైందో ఏమోగానీ, అలెగ్జాండర్‌ గొంతు మూగబోవడం మొదలుపెట్టింది. అతన్ని పరిశీలించిన వైద్యులు నాటకాల్లో సంభాషణలు చెప్పేందుకు అరిచీ అరిచీ ఉన్నందుకు గొంతు కండరాలు దెబ్బతిన్నాయీనీ... మునుపటిలా మాటలు వచ్చే అవకాశాలు తక్కువనీ తేల్చేశారు. వైద్యుల మాటలు అలెగ్జాండర్‌లో నిస్తేజాన్ని కలిగించాయి. గొంతు పోవడం వల్ల తనకు ఇష్టమైన నాటకరంగం నుంచి దూరం కావడం అన్న ఆలోచన అతన్ని క్రుంగదీసింది. దాంతోపాటే రకరకాల ఆలోచనలూ ఆయనను చుట్టుముట్టాయి. ఒక్కసారి అద్దాల ముందు నిల్చొని తను సంభాషణలు చెప్పే విధానాన్ని చూసుకున్నాడు. లోపాలు బయటపడ్డాయి: సంభాషణలు చెప్పే సమయంలో తన గొంతుని రకరకాలుగా తిప్పుతూ, దాని మీద లేనిపోని ఒత్తిడిని కలుగచేస్తున్నానన్న విషయం అర్థమైంది అలెగ్జాండరుకు. అదే తన అనారోగ్యానికి కారణమేమో అన్న ఆలోచనా మొదలైంది. అందుకని గొంతు కండరాల మీద అంతగా ఒత్తిడిని కలిగించకుండా సంభాషణలు చెప్పేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అలెగ్జాండర్‌ అనుమానం నిజమైంది. అతని ఉపాయం ఫలించింది. గొంతు కండరాల మీద అనవసరమైన ఒత్తిడిని నివారించినప్పుడు, అవి మళ్లీ యథాస్థితికి చేరుకోవడం గమనించాడు. రాదు అనుకున్న స్వరం మళ్లీ తిరిగివచ్చేసింది. దాంతో అలెగ్జాండర్‌ తన దృష్టిని పూర్తిగా ఇలాంటి పొరపాటైన అలవాట్ల మీదే కేంద్రీకరించడం మొదలుపెట్టాడు. చాలానే ఉన్నాయి: అలెగ్జాండర్‌ పరిశీలన ప్రకారం మన నడక, పరుగు, మాట, తలని నిలపడం, బరువులు మోయడం... ఇలా కండరాల సాయంతో చేసే చాలా చర్యలు లోపభూయిష్టంగా ఉంటాయి. ఇలా కండరాలను తమదైన రీతిలో ఉపయోగించడం వల్ల కొన్నాళ్లకి, అవి కూడా అలాగే స్పందించడం మొదలుపెడతాయి. కొన్ని రకాలైన అభ్యాసాల ద్వారా ఈ భంగిమలను కనుక మెరుగుపరుచుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నది అలెగ్జాండర్‌ మాట. అలెగ్జాండర్‌ చూపిన ఈ ఉపాయమే ‘అలెగ్జాండర్‌ టెక్నిక్‌’గా విస్తృత ప్రచారాన్ని సాధించింది. అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియాలలో ఈ టెక్నిక్‌ను నేర్పేందుకు కోర్సులు మొదలయ్యాయి. అలెగ్జాండర్ సమకాలికులైన బెర్నార్డ్‌ షా వంటి ప్రముఖులెందరో ఈ టెక్నిక్‌తో ప్రభావితం అయ్యారు. హక్స్‌లీ అనే ప్రముఖ రచయిత అయితే అలెగ్జాండర్‌ పాత్రతో ఏకంగా ఒక నవలనే రాసేశాడు. అంతా నిజమేనా! అలెగ్జాండర్ టెక్నిక్‌ను నేర్చుకోవాలనుకునేవారి భంగిమలను నిశితంగా పరిశీలిస్తారు. ఆపై శిక్షకులు, ఆ లోపాలను సవరించేందుకు సాయపడతారు. యూట్యూబ్ లేదా పుస్తకాల ద్వారా కూడా ఈ టెక్నిక్‌ను కాస్త వంటి పట్టించుకోవచ్చు. ఈ టెక్నిక్‌ను అభ్యసించడం వల్ల ఒత్తిడి మాయం అవుతుందనీ, కంటిచూపు మెరుగుపడుతుందనీ, పార్కిన్‌సన్స్‌ వ్యాధి దూరమవుతుందనీ, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయనీ, అన్నిరకాల వెన్నునొప్పులూ తగ్గిపోతాయనీ.... ఇలా చాలా ఫలితాలనే చెబుతూ ఉంటారు శిక్షకులు. ఇవన్నీ శాస్త్రీయంగా రుజువు కాకపోయినప్పటికీ వెన్ను నొప్పి, మెడనొప్పి విషయంలో ఇది ఉపయోగపడుతుందని తేలింది. పార్కిన్‌సన్స్‌ విషయంలో కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపుతుందంటూ పరిశోధనలు తేల్చాయి. - నిర్జర.  

తండ్రిగా ఉంటే బోలెడు ఆరోగ్యమట!

  ఇంట్లో చిన్న పిల్లల అల్లరితో చిరాకుపడని తండ్రులు ఉండరు. పని చేసుకోనివ్వకుండా, పడుకోనివ్వకుండా కాళ్లకి అడ్డం పడిపోతూ ఉండే పిల్లలను విసుక్కోని నాన్నాలు ఉండరు. కానీ పైపైకి ఇలా విసుక్కుంటున్నా, జీవితంలోని ఈ పార్శ్యం ఎంతో అమూల్యం అని వారికి తెలుసు. అయితే వారికి కూడా తెలియకుండా జరిగే ప్రక్రియ ఏమిటంటే.... పిల్లల వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటం! ఒత్తిడి మాయం! పిల్లల పట్ల అనుబంధం కలిగిన తండ్రులలో ఒత్తిడి శాతం చాలా తక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు పరిశోధకులు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ వంటి సంస్థలు ఎన్నో వందలాది కుటుంబాల మీద పరిశోధనలు చేసిన తరువాతే తేల్చిన అంశం ఇది. ఇలా ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి, అజీర్ణం, డిప్రెషన్, ఛాతీనొప్పి వంటి లక్షణాలు కూడా దూరంగా ఉండటాన్ని గమనించారు. ఆఫీసులో ఆరోగ్యం ఒక పరిశోధన ప్రకారం పిల్లలు ఉన్న తండ్రులు తమ తోటివారికంటే 22 శాతం ఎక్కువ బోనస్‌ను సంపాదించగలుగుతున్నారు. పైకి కాస్త చిత్రంగా కనిపిస్తున్నా దీనికి కారణం లేకపోలేదంటున్నారు పరిశోధకులు. పిల్లలు ఉన్న తండ్రులకి సర్దుకుపోయే లక్షణం ఉంటుందనీ, పైగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడంలాంటి దూకుడు తక్కువగా ఉంటుందనీ అంటున్నారు. బహుశా ఈ కారణాలన్నింటివల్లా కావచ్చు... తండ్రులలో ఉద్యోగ తృప్తి (Job Satisfaction) కూడా ఎక్కువగా ఉంటుందట. చెడు అలవాట్లకు దూరం కుర్రతనంలో ఉండేవారు సిగిరెట్లు, మందు... ఇంకా మాట్లాడితే మాదకద్రవ్యాలు అంటూ విచ్చలవిడిగా ప్రవర్తించడం మనకి తెలుసు. కానీ అదే కుర్రకారు పెద్దై తండ్రి బాధ్యతను చేపట్టిన తరువాత వారిలోని దురలవాట్లు చాలావరకూ దూరం కావడమో, మోతాదు తగ్గిపోవడమో జరుగుతుందట. బాధ్యత తెలియడం వల్లో, తన దురలవాట్ల వల్ల పిల్లలు పాడు కాకూడదన్న తపన వల్లో ఇలాంటి మార్పు వస్తుందంటున్నారు విశ్లేషకులు. పక్కచూపులు చూడరు మగవారిని పునరుత్పత్తికి ప్రోత్సహించే ముఖ్యమైన హార్మోను- టెస్టోస్టెరోన్‌! తండ్రి అయ్యిన తరువాత ఈ టెస్టోస్టెరోను శాతం చాలా సాధారణ స్థితికి చేరుకోవడాన్ని గమనించారు. దీని వల్ల మగవారిలో చెడుతిరుగుళ్లు తిరగడం, వివాహేతర సంబంధాలకు పాల్పడటం వంటి ప్రవర్తన తగ్గుతుందట. శుభ్రమైన తిండి తండ్రి హోదా దక్కిన తరువాత ఏది పడితే అది ఎడాపెడా తినేసే అలవాటు తగ్గిపోతుందట. ఆరోగ్యం కోసమో లేకపోతే పిల్లలకు ఆదర్శంగా ఉండేందుకో చిరుతిళ్ల కంటే పోషక పదార్థాల మీదే ఎక్కువగా దృష్టిని సారిస్తారట. తండ్రిగా మోయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు కూడా ఆహారం మీద శ్రద్ధ పెరుగుతూ ఉండవచ్చు. ఇలా పోషాకాహారాన్ని తీసుకోవడం వల్ల కాస్త ఊబకాయం వచ్చినట్లు కనిపించినా, మనుషులు మాత్రం మునుపటి కంటే ఆరోగ్యంగా మారతారని తేలుస్తున్నాయి పరిశోదనలు. ఇంకా దాంపత్య జీవితం మెరుగుపడం, పనివేళలు పెరగడం, ఆత్మవిశ్వాసంలో మార్పు రావడం, రోజువారీ సమస్యలను ఎదుర్కొనడంలో మరింత నైపుణ్యాన్ని సాధించడం.... ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ తండ్రిగా బాధ్యతను సక్రమంగా పోషించడంలో చాలా లాభాలే ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. అంటే పిల్లలకు ఏడాదిలో ఒక్క రోజే ఫాదర్స్‌ డే అయితే, తండ్రులకు ఏడాది పొడవునా ఉన్న రోజులన్నీ తమవే అన్నమాట! - నిర్జర.

మీరు టిఫిన్ చేయడం లేదా..?

  లేటుగా లేవడమో.. సమయం లేకపోవడమో సాకుగా చూపుతూ చాలా మంది ఉదయం పూట ఏమీ తినకుండా హడావిడిగా బస్సో, రైలో పట్టుకొని ఆఫీసులకు పరిగెడుతూంటారు. కానీ ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ముందు రోజు రాత్రి 10 గంటలకు తిని తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 15 గంటలకు పైగా కడుపును మాడ్చేస్తుంటారు.   కాని తప్పు తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొన్ని రోజులకు చిన్న పనికే అలసిపోవడం.. మరికొన్ని రోజులకు రక్తహీనత ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రాను రాను పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. దీనికి కారణం శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడమే.. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే. మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి అవసరం. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. మనం తీసుకునే ఆహారం నుంచే.   మనం తిన్న ఆహారం మూడు నుంచి నాలుగు గంటల్లో జీర్ణం అయిపోతుంది. కాబట్టి ప్రతి నాలుగు గంటలకు ఏదో ఒకటి తినాలి అంటారు పెద్దలు. అలాంటిది ఏకంగా 10 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీని వల్ల పోను పోను రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అథెరోస్క్లె‌రోసిస్ అనే అనారోగ్య సమస్య ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దళసరిగా ఉన్న ధమనులు గుండె నుంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల ధమనుల పనితీరు మందగించడాన్ని వారు గుర్తించారు. సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా, తక్కువ పోషకాలున్న అల్పాహారం తీసుకున్నా ఈ సమస్య తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎంత ఆలస్యమవుతున్నా.. ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా సరే అల్పాహారం చేసి తరువాత ఎటువంటి పనైనా చేయండి.

Shield your Skin this Winter!

    With the onset of the winter season the, climate becomes more harsh and dry mostly towards our skin. Skin being the most easily exposed, is most affected and its vital moisture and oils are snatched away! Your skin also needs moisturizing during the winter chills, so it is advisable to use oil-based creams; a wise choice is to be made among oils as certain clog facial pores. Avocado oil, mineral oil, primrose oil and almond oils are amongst the advisable oils! Just because it is not summer-time we need not put away the sunscreen lotions. They are very much needed during the winter also the sun and snow glare do the same damage to our skin as the hot sun does during summer. But the sunscreen with a lower SPF is advisable i.e., above 20 SPF! Try covering your limb extremities with woolens, start with cotton thermals and then switch to wool as wool may cause irritation. Wearing wet socks and gloves is most likely to invite problems; it flares up skin irritation and diseases like, itching, cracking and eczema. Most of us apply various peels and replenishing packs while, most of these masks, alcohol-based toners and astringents also evaporate the moisture from the skin. Instead of these masks it is advisable to use cleansing milk or foaming cleansers which are devoid of alcohol. When the temperature drops down, taking steaming hot baths feels great. But the saddening fact behind these super hot baths is that they break down the lipid barriers and the snatch away the moisture and making the skin all the more dry and life-less! Protect your skin and look stunning round the year! Take Care!! ......SIRI

నడకలోని నిజాలివి

  * నడక శరీరంలో ఎముకలు, కండరాలకు మెదడుతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. నడకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కండరాలు తరిగిపోతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే అలవాటు లేనివాళ్ళ శరీరంలో నిత్యం ఉపయోగించగలిగే కీళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఎక్కువశాతం కీళ్ళు బిగుసుకుపోతాయి. * బరువు తగ్గాలనుకునేవారు నడకకి వెళ్ళేముందు ఏమీ తినకూడదు. ఎందుకంటే, ఓ ముప్ఫై నిమిషాలపాటు నెమ్మదిగా నడవటానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి 45 శాతం, కొవ్వు నుంచి 65 శాతం విడుదలవుతుంది. అంటే నడుస్తుంటే మరింత శక్తి కావాలన్న సంకేతం అందుకున్న శరీరం కొవ్వు నిల్వల్ని కరిగిస్తుంది అన్నమాట. * నడక మంచిది అన్నారు కదా అని మొదలుపెడుతూనే వేగంగా నడవకూడదు. మొదట 5 - 10 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే ఏ వ్యాయామానికైనా కాసేపటికీ ముందు నుంచీ శరీరాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ వెళ్ళాలి. ఎంత వేగంగా నడవాలీ అంటే, నడుస్తూ కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడనంత వేగం మంచింది. అలాగే నడక ముగించేటప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రిలాక్సింగ్‌గా నడక ముగించాలి. * నిజానికి నడకతోపాటు కొన్ని వేరే వ్యాయామాలూ శరీరానికి అవసరం. ఎందుకంటే, నడక కొన్ని కండరాలపై ఎక్కువగానూ, కొన్ని కండరాలపై తక్కువగానూ ఒత్తిడి పడేట్ట చేస్తుంది. అందుకని వారంలో ఐదురోజులు నడిస్తే, రెండు రోజులు మీకు నచ్చిన వ్యాయామాలను చేయండి. ఈత, యోగా, ఏరోబిక్స్, జిమ్ ఇలా... * రోజూ నడిచే అలవాటు వున్నవారికి గుండె, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు 10 నుంచి 20 సంవత్సరాల పాటు వాయిదా పడితీరతాయి అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. * ఎంతసేపు నడవాలి? దీనికి పరిమితి లేదు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు అన్నది సూత్రం. కాబట్టి 24 నిమిషాలకు తగ్గకుండా వీలునుబట్టి, ఆరోగ్యాన్నిబట్టి ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చుకావాలని నడిచేవారు మాత్రం ఎంత దూరం నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని నడక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. * ఇక ఒకసారి నడవటం మొదలుపెట్టాక 12 వారాలపాటు అయినా కొనసాగించాలి. రెండు రోజులో మూడు రోజులో నడిచి మానేస్తే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా వుంటాయట. * చివరిగా ఒక్కమాట... క్రమం తప్పకుండా మూడు నాలుగు నెలలపాటు నడిస్తే ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇక అప్పుడు మానేద్దామన్నా మానలేరు. కాబట్టి ఒక్క నాలుగు నెలలపాటు ఓపికపట్టి నడిచారంటే ఇక ఆ తర్వాత ఆ నడకే మిమ్మల్ని ముందుకు నడిపించుకుని వెళ్తుంది. -రమ