One-day Detox Therapy

  Feeling tired and irritated ?Are you prone to frequent allergies and infections? Having menstrual or digestive problems? Going through a feeling of disorientation and mental fatigue? In all probabilities your body could be saying I am tired and I need a break! As we get caught up with our daily house-work-family routine we just go off track with our health and when the toxins in our body get accumulated and its time to flush it out and feed it healthy nutrients. All you need is a good Detox to get you back on track and feel energetic again. Detoxification  involves clearing impurities from the blood boosting the liver function and thereby eliminating impurities from the blood. It is necessary to detox once a year like we do in our religious rituals and customs. This has been the ancient practice recommended by Ayurveda also as a good system cleansing practice to be followed by adults. Note: Pregnant and feeding mothers, children below 12 and people suffering with terminal and chronic diseases should not do it. Try this One-Day Veg &Fruit detoxification program Choose one day in  a week other than the weekend to detox. Step 1-Pick any of your favourite fruits and vegetables. Keep some whole fruits like apple, kiwi, pears and the seasonal ones available at that time to eat as it as and choose the high water content ones like melons pineapples , oranges and musk melons  for making into juices.Do not mix sugar or use any of those sugar free pellets. If the you think the juices are thick you could dilute them with water. Step 2- Pick you favourite veggies like carrots, cucumber, beetroot and tomatoes-these can be made into juices and you could keep some long with radishes and capsicum and  celery for salads. You could also look at adding some raisins and nuts and for the burst of freshness. Try combining some fruits and vegetables if you like. Avoid too much of dressing with oils or mayo- may be  some lemon juice with salt and pepper or a spoon of honey for improving the taste should do. Step-3- Green tea or herbal tea bags and hot water for the in between drinking .Since the juices are cold the herbal tea would be used as a warm drink to keep you active. Green tea is wonderful detoxifying- agent and can be had regularly. Step Detox -Now that you have your juices and cut fruit and vegetables ready .You can start the Detox session. You can start with a juice first and alternate that way with a juice and bowl of cut fruit or salad. Drink and eat as much as you want so you do not get hungry. Tea in Between: The herbal or green teas are for drinking in-between and for the evenings. But remember just 2 hours before you go to bed stop the juices and sip only herbal tea. Drinking juices which have sugar in them may stop you from falling asleep in the night. And your dose of H2O should also be had in between to clean your system. Drink at least 2 litres of water throughout the day if you can and complete your detox program. Try this for one day and feel the benefits of this internal cleansing regime!

రక్తపోటు ఓ రాక్షసుడు!

ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత స్థాయిలో మన దగ్గర యువత సంఖ్య ఉంది. కానీ ఏం లాభం! ఇప్పటి యువత కాస్తా వృద్ధులకంటే నిస్సత్తువతో నిండిపోతున్నారు. రక్తపోటుతో కుంగిపోతున్నారు. దీని గురించి మనం మనం చెప్పుకోవడం కాదు... ‘హైపర్‌ టెన్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు ఎ.మురుగనాధన్‌ చేస్తున్న హెచ్చరికల సారాంశమే ఇది. మురుగనాధన్‌ వంటి నిపుణులు చెబుతున్న కొన్ని గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది.   - దేశంతోని 20 యువత రక్తపోటుతో బాధపడుతున్నట్లు ఓ అంచనా! - రక్తపోటు వల్ల 30 ఏళ్ల లోపువారే అనారోగ్యానికి గురవ్వడం, 40 ఏళ్లలోపే చావుకి చేరువ కావడం జరుగుతోంది. - రక్తపోటు, దాంతో పాటు వచ్చే అనారోగ్యాల వల్ల భారతీయ యువత జీవితకాలం దాదాపు 5 శాతం తగ్గిపోతోంది. - మన దేశంలో రక్తపోటు దాదాపు పదిలక్షలకు పైగా చావులకు కారణం అవుతోంది. పైన పేర్కొన్న గణాంకాలని చూసి గుండెలు బాదుకోవల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటికి కారణాలు కూడా అంతే బలీయంగా ఉన్నాయి. - ప్రతిరోజూ ఒత్తిడితో రోజుని మొదలుపెట్టక తప్పని పోటీతత్వం. - ఆ పోటీల్లో నెగ్గుకు వచ్చేందుకు, లక్ష్యాలను ఛేదించేందుకు... చదువు, ఉద్యోగాలలో ఏర్పడుతున్న ఒత్తిడి. - ఆ ఉద్యోగాలలో కూడా ఏసీ గదుల్లో, కదలకుండా, మెదలకుండా గంటల తరబడి కూర్చోవలసి రావడం. - నిరంతరం కూర్చునే ఉంటున్నామని తెలిసినా కూడా శరీరంలో పేరుకుపోయే కొవ్వుని కరిగించే వ్యాయామం చేయకపోవడం. - తినే తిండి, పీల్చే గాలి, చేసే ఆలోచనల్లో స్వచ్ఛత లేకపోవడంతో జీవితమంతా కాలుష్యంతో నిండిపోవడం. - చిరుతిళ్లు... అందులోనూ మన సంప్రదాయబద్ధమైన తిళ్లు కాకుండా చైనీయులవీ, పాశ్చాత్యులవీ తినడం. - ఊబకాయం, గుండె మంట, అజీర్ణం... వంటి సమస్యలు వచ్చినా కూడా తగిన సమయంలో వైద్యులని సంప్రదించడం కానీ, జీవనశైలిని మార్చుకోవడం కానీ చేయకపోవడం. - ఒకవేళ రక్తపోటు ఉందని తెలిసినా కూడా ఎవరికి వారే సోంతవైద్యాలు చేసుకోవడం. - ఉప్పు అధికంగా ఉండే బేకరీ పదార్థాలు, పచ్చళ్లు; తీపి ఎక్కువగా ఉండే పేస్త్రీలు, కూల్‌డ్రింకులు తీసుకోవడం ... చెప్పుకుంటూ పోవాలే కానీ మన జీవనశైలిలో వేస్తున్న తప్పటడుగులు అన్నీ రక్తపోటుకు దారితీసేవే! అందుకనే చేతులు కాలకముందే మేల్కొని జీవనశైలిని మర్చుకుంటే రక్తపోటు అనేదే మన దరిచేరకుండా చూసుకోవచ్చు. ధ్యానం, వ్యాయామం, మితాహారం, మితభాషణం... ఇవన్నీ ఏవో పెద్దలు చెప్పిన సూక్తులు కావు. రక్తపోటు వంటి రాక్షసుల బారినుండి నిండునూరేళ్లు మనల్ని కాపాడే దీప్తులు.   - నిర్జర.

బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుంటే గుండెపోటే!

బ్రేక్‌ఫాస్ట్‌ అన్న మాటలోనే ఉపవాసాన్ని విరమించడం అన్న అర్థం ధ్వనిస్తుంది. కానీ చాలామంది ఉదయాన్నే ఖాళీకడుపుతోనే పనిలోకి దూకేస్తుంటారు. ఇదేమంత ఆరోగ్యకరమైన అలవాటు కాదంటూ, ఒకదాని తరువాత ఒకటిగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.   కొందరు దూరం తీరిక లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సన్నబడతామనే అపోహతో కావచ్చు... ఉదయపు అల్పాహారాన్ని ముట్టుకోనివారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఖాళీ కడుపుతో రోజుని మొదలుపెట్టకూడదని పెద్దలు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టేవారు నానాటికీ ఎక్కువవుతున్నారు. ఇలా ఉదయపు అల్పాహారానికి దూరంగా ఉండటం వల్ల రక్తపోటు, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనీ.... అసలుకే మోసం వస్తుందనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు! బ్రేక్‌ఫాస్టుని పట్టించుకోకుంటే ఏకంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటూ ఒక పరిశోధన సైతం నిరూపిస్తోంది.   హార్వర్డు పరిశోధన బ్రేక్‌ఫాస్టుకీ గుండెపోటుకి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు హార్వర్డు విశ్వవిద్యాలయం తరఫున ఓ భారీ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం పది కాదు వంద కాదు, దాదాపు 27,000 మందిని పరిశీలించారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 16 ఏళ్ల పాటు వీరి ఆహారపు అలవాట్లను గమనించారు. వీరిలో 13 శాతం మంది తమకి ఉదయపు అల్పాహారం తీసుకునే అలవాటు లేదని తేల్చిచెప్పారు. ఆశ్చర్యకరంగా ఇలా అల్పాహారం తీసుకోవడం అలవాటు లేనివారిలోనే గుండెపోటు సమస్య ఎక్కువగా తలెత్తడాన్ని గమనించారు పరిశోధకులు. ఇక అల్పాహారం తీసుకోనివారిలో ధూమపానం, మద్యపానం, చిరుతిళ్లు తినడం, ఊబకాయం, రక్తపాటు వంటి లక్షణాలు కూడా ఉంటే... వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 27 శాతం అధికమని తేలింది.   కారణం! ఉదయం వేళ అల్పాహారాన్ని తీసుకోకపోవడానికీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో పరిశోధకులు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని వివరణలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు.   - ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఉండేవారిలో మధ్యాహ్నానికల్లా విపరీతంగా ఆకలి వేసే అవకాశం ఉంది. దాంతో అవసరమైనదానికంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.   - మధ్యాహ్నం వరకూ ఖాళీగా ఉన్న శరీరంలోకి ఆకస్మాత్తుగా ఆహారం రావడంతో, రక్తంలో చక్కెర శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి దెబ్బతినడం, రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కలుగుతుంది.   - ఉదయం వేళ నిర్ణీత సమయంలో అల్పాహారాన్ని తీసుకునేవారిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనిపించింది. వీరు ఒక క్రమశిక్షణతో, తగిన ఆహారపు అలవాట్లతో ఉంటారు కాబట్టి సహజంగానే గుండెపోటు వీరి దరిచేరదు. - నిర్జర.

గుండె జబ్బుల సమస్యలపై అవగాహన

  చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరము. నివారణ : వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేని వాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యుక్తవయస్కులు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర, రక్తపోటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాకింగ్ వంటి ఎక్సర్‌సైజ్ చేస్తూ తమ చక్కెరపాళ్లను, రక్తపోటును అదుపులోపెట్టుకోవాలి. పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే. అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో వూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.     కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి. మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి. పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.   జాగ్రత్తలు : నూనెల్లో పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - (ప్యూఫా) అంటే పొద్దుతిరుగుడు నూనె, కుసుమనూనెల్లాంటివి; మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) - అంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనెలనుమార్చి మార్చి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యం. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యి, వెన్న, పామాయిల్ చాలా తక్కువ పాళ్లలో తీసుకోవాలి. వంట వండే విధానం కూడా గుండెజబ్బులకు దోహదపడుతుంది. నూనెలో వేగాక మంచి కొలెస్ట్రాల్ సైతం చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతుంది. కాబట్టి వేపుళ్లను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్‌కు బదులు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాలు... కిచిడి, పొంగల్, ఇడ్లీ వంటివి మంచిది. మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. అప్పడాలు, పచ్చళ్లు, కారపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి

ఆక్రోటు తింటే మూడ్‌ బాగుంటుంది

ఆక్రోటు పప్పు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఇంత ఆక్రోటు పప్పు నోట్లో వేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఆక్రోటు తినడం వల్ల సంతోషంగా ఉంటారన్న విషయం కూడా ఇప్పుడు రుజువైపోయింది.   పీటర్ ప్రిబిస్‌ అనే ఓ పరిశోధకుడు రొజూ ఆక్రోటు పప్పు తినడం వల్ల మనసు మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆయన ఓ 64 మంది విద్యార్థుల మీద ఒక పరీక్షను నిర్వహించాడు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు ఉన్న ఈ విద్యార్థులంతా ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వీరిని పదహారు వారాల పాటు రొజూ ఓ మూడు బ్రెడ్‌ ముక్కలు తినమని చెప్పారు. ఇందులో ఓ ఎనిమిది వారాల పాటు మామూలు బ్రెడ్‌ను తినమనీ, మరో ఎనిమిది వారాలపాటు ఆక్రోటు పొడి కలిపిన బ్రెడ్‌ ముక్కలు తీసుకోమనీ చెప్పారు.   సాధారణంగా విద్యార్థి దశలో ఉండేవారు చాలా ఉద్విగ్నతగా ఉంటారు. సవాలక్ష సమస్యలతో చిరాకుపడుతూ ఉంటారు. వారి మనసుని కనుక ప్రశాంతంగా ఉంచగలిగితే ఆక్రోటు విజయం సాధించినట్లే! అందుకనే Profiles of Mood States (POMS) అనే పరీక్ష ద్వారా వారి మూడ్‌ ఎలా ఉందో గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఈ పరీక్షతో ఒక వ్యక్తిలోని ఉద్విగ్నత, క్రుంగుబాటు, కోపం, నిస్సత్తువు వంటి లక్షణాలను గమనించడం ద్వారా కొన్ని మార్కులు వేస్తారు. ఈ మార్కుల మొత్తాన్నీ Total Mood Disturbance score (TMD) అంటారు. ఈ TMD ఎంత తక్కువగా ఉంటే మన మూడ్ అంత బాగున్నట్లు లెక్కట!   ఆక్రోటు పొడి కలిపి ఉన్న బ్రెడ్‌ను తిన్న విద్యార్థులలో TMD విలువలు చాలా తక్కువగా నమోదు కావడాన్ని గమనించారు పరిశోధకులు. మిగతావారితో పోలిస్తే వీరి మూడ్ దాదాపు 30 శాతం సానుకూలంగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ మార్పు కేవలం మగవారిలోనే కనిపించడం విశేషం. ‘గతంలో ఆక్రోటు తినడం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయనీ, డయాబెటిస్ అదుపులో ఉంటుందనీ, ఊబకాయం మీద కూడా ప్రభావం ఉంటుందనీ తేలింది. అందుకనే ఈసారి వారి మనసు మీద ఆక్రోటు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేశాము,’ అంటున్నారు పీటర్.   ఆక్రోటులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల.... అవి క్యాన్సర్‌ దగ్గర్నుంచీ చర్మవ్యాధుల వరకూ మన శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది. అయితే అందులో ఉండే విటమిన్‌ ఇ, ఫోలేట్ యాసిడ్, మెలటోనిన్, ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్ అనే రసాయనాల వల్ల మన మూడ్‌ కూడా మెరుగుపడుతుందని తాజా పరిశోధనతో తేలిపోయింది. మరింకేం! నిరంతరం ఏవో ఒక చిరాకులతో సతమతం అవుతూ ఉండేవారు, రోజుకో రెండు ఆక్రోటు పప్పులు నములుతూ ఉంటే సరి!   - నిర్జర.

చింత చిగురు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

జూన్లో దొరికే చింత చిగురును మిస్ చేసుకోకండి… దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి… చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ప్ర ధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్ర మంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. 2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది. 3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. 4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. 5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.   6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. 7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. 9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. 10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.   11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. 12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.   15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. 16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది. 17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

Cycling – Adding a silver lining to our Health!

    Cycling may be favorite pastime for many of us but it is certainly very useful in maintaining our health! As it is one of the easiest ways to exercise without producing fat bills, moreover it can be almost everywhere and any time during the year. The health benefits though are numerous, few to pen down are: The act of cycling involves the lower body. So, it strengthens and tones up the calf and thigh muscles. It also improvises the mobility of the hip and knee joints. Cycling effectively increases the stamina, thus you are able enough to fight against the physical strains more ably and for a longer time. Cycling does only good to your heart. It improves cardio-vascular fitness due to which our heart pounds steadily. Studies suggest that people who cycle at least 20 miles a week are least likely to suffer from heart diseases when compared to non-cycling people. Cycling is great of losing the extra pound you stare at! Steady cycling burns a great deal of calories. Cycling boosts our metabolic rates even after we have finished our ride thus, aiding more in calorie-loss! Any regular exercise is capable of reducing stress and depression. It improves the well-being and self esteem. Cycling outdoors is a awesome way of connecting with nature, which aids in rejuvenating the soul. As cycling involves every part of our body, the co-ordination among the body parts is improved! So, take some time out to indulge in a cycle ride. Take Care!! ...... SIRI

Meditate to cure Back Ache

Who hasn't come across someone suffering from backaches...one in every three adults complains of back ache, at some time of the day. There have been several pain relief techniques such as over-the-counter drugs, physiotherapy treatments, exercises, acupressure and accupuncture, yoga and such, all promising to offer pain relief and problem eradication. A recent study conducted by a health research institute in Seattle, Washington state, USA revealed that training the brain through meditation can help cure back ache isssues. They invited more than 300 people between the ages 20 and 70, suffering from some form of back pain issues and offered them three different treatments, randomly to each for more than 3 months. One was a form of phychotherapy, second a mindfullness based therapy such as yoga and meditation, third being the usually followed treatment such as medication through drugs with the Doctors help. The first therapy was concentrating on changing the thought process of the patients, teaching them relaxation therapies...the Second practice taught the group to train the brain to accept the difficult emotions and thoughts of discomfort and relaxing thebrain using yoga and meditation.     After offering these two therapies for 8 weeks, the study conducted a result oriented casestudy and observed that at 6 months milestone, the second form of treatment that involved meditation fetched more good results than the phychotherapy based treatment, and the medication technique was the last...and the number of people who reported a recurrence of back pain was lesser in the meditation group, next the phychotherapy group, last the drug-treated group, after one year after starting the respective treatments. The study revealed that training the brain helped people to get more immune to back aches and recurrence was reduced than through the traditional physiotherapy and medication techniques, which is a healthier option compared to risks that may come along with medication for some people...and a cost effective, affordable option for those who cannot afford expensive medicines and physiotherapy sitting fees every week or so. There needs to be a further study extended to find out if these positive results of the meditation technique are valid even after an year and beyond or not, until then it is considered a better, healtheir and affordable alternative to any other techinques to fight chronic lower back aches. --Pratyusha

వ్యాయామం మీద అతి పెద్ద పరిశోధన

ఆరోగ్యానికి నడక ఎంత అవసరమో కొత్తగా చెప్పేదేమీ లేదు. జాగింగ్‌ చేయడం, సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం... ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇచ్చే వ్యాయామాలే అయినప్పటికీ... సులువుగా సహజంగా చేసే నడకే మన ఆరోగ్యాలను కాపాడుతూ వస్తోంది. కానీ ఈ నడక ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి అన్నదాని మీద ఇప్పటివరకూ ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారు. రోజుకి 10,000 అడుగులు నడిస్తే మంచిదన్న మాట ఉన్నప్పటికీ... అదేమీ అంత శాస్త్రీయం కాదని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఈ 10,000 అడుగులు అన్నమాట జపాన్‌లోకి ఒక వాణిజ్య సంస్థ మొదలుపెట్టిన ప్రచారం అని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో వారానికి ఓ రెండు రోజుల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందిలే... మిగతా రోజుల్లో ఆఫీసుకి పోవాలి కదా! అంటున్నారు. మరి నడకకు సంబంధించి లోగుట్టును రట్టు చేసేదెలా!     అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన ‘అలెన్‌ యూంగ్‌’ అనే కార్డియాలజిస్టుకి ఇదే అనుమానం వచ్చింది. వేలమంది జనాల రోజువారీ కదలికలను క్షుణ్నంగా పరిశీలిస్తే కనుక.... వారి జీవిత విధానం, అందులో భాగంగా వారు ఎంతసేపు నడుస్తున్నారు, ఎలాంటి వ్యాయామం చేస్తున్నారు తెలిసిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం ఏమన్నా మెరుగుపడిందా! అన్న విషయమూ బయటపడుతుంది. కానీ ఇందుకోసం వేలమంది జీవితాలను దగ్గరగా పరిశీలించడం ఎలా సాధ్యం?     తన పరిశోధనను ఎలా ముందుకు తీసుకుపోవాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్న అలెన్‌కు హఠాత్తుగా ఓ ఉపాయం తోచింది. అప్పటికే యాపిల్‌ సంస్థ విడుదల చేసిన ఒక యాప్‌ గుర్తుకువచ్చింది. మన శరీర కదలికలు ఎలా ఉన్నాయి? మనం ఎంత దూరం నడుస్తున్నాం? అని పసిగట్టగలిగే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ ఒక పిలుపుని ఇచ్చారు. అలెన్‌. అలెన్ పిలుపునిచ్చిన తొలివారంలోనే దాదాపు 53,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతానికి లక్షమంది ఈ యాప్‌ ద్వారా అలెన్‌కు తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అలెన్‌కు అందిస్తున్నారు. అందుకే వ్యాయామానికి సంబంధించి అతి పెద్ద పరిశోధనగా ఇది పేరుగాంచింది.     అలెన్‌ మొదలుపెట్టిన ఈ పరిశోధన ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందేందుకు కొంత కాలం పట్టక తప్పదు. లక్షమందికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించాలంటే అంత తేలికైన విషయం కాదు కదా! కానీ ఈపాటికే ఈ గణాంకాలు కాస్త భయపెట్టేవిగా ఉంటున్నాయట. మనలో చాలామంది అసలు కదలనే కదలడం లేదంటూ ఈ యాప్ ద్వారా తేలుతోందట. ‘అందులో ఆశ్చర్యం ఏముంది? మన సమయాన్ని పూర్తిగా కూర్చునే గడిపేస్తున్నాం. అటూఇటూ వెళ్లడం మాట అటుంచి, కనీసం లేచి నిలబడేందుకు కూడా ప్రయత్నించడం లేదు’ అంటున్నారు అలెన్. మరి ఈ పరిశోధన ముగిసేసరికి ఇలాంటి భయంకరమైన వాస్తవాలు ఎన్ని బయటపడతాయో! మరైతే ఎంతసేపు నడవాలి? ఎలా నడవాలి? అన్న విషయమై అలెన్‌ తన పరిశోధనని పూర్తి చేసేదాకా మనం ఆగాలా! అమెరికాలోనే సుదీర్ఘ కాలం నడక గురించి అధ్యయనం చేస్తున్న ‘ట్యూడర్‌ లాక్‌’ అనే నిపుణుడి ప్రకారం మనషి రోజుకి కనీసం 8,000 అడుగులన్నా నడిస్తే మంచిది. సాధారణంగా మనిషి ఓ 5,000 అడుగుల వరకు తనకు తెలియకుండానే నడుస్తుంటాడనీ, దానికి మరో 3,000 అడుగులు జోడించేందుకు, ఓ అరగంటపాటు ప్రత్యేకంగా నడకసాగించమని చెబుతున్నారు ట్యూడర్‌. మరి అలెన్‌ పరిశోధన, ట్యూడర్‌ మాటను ఎంతవరకు రుజువు చేస్తుందో చూడాలి. - నిర్జర.

గొంతు నొప్పికి చక్కటి పరిష్కారం..!

చలికాలం వచ్చిందే చాలు అనేక అనారోగ్యసమస్యలు ముసురుకుంటాయి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఏ మాత్రం జబులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించినా భయంతో హస్పిటల్స్ కు పరిగెత్తుతున్నారు. అయితే అన్ని సమస్యలను కరోనా దృష్టిలో చూడటం మంచిది కాదు. ముఖ్యం గొంతు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జీర్ణక్రియ అస్తవ్యస్తం కావడంతో కొందరిలో గొంతు ఒరుసుకుపోతుంది. గొంతు వద్ద ఏదో నొక్కుతున్న భావన కలగడం, తెమడ జిగటగా ఉండి బయటికి రావడం కష్టం కావడం, కొండనాలుకలో వాపు కనిపిస్తాయి. ఈ స్థితిలో సల్ఫర్‌, సేఫియా, ఆర్సెనిక్‌ ఆల్బ్‌ం  వంటి మందులు బాగా పనిచేస్తాయి. బ్రయోనియా, పల్సటిల్లా,  మందులు కూడా ఉపయోగించవచ్చు. కొందరిలో జీర్ణాశయ సమస్యల వల్ల గొంతు, గవద బిళ్లలు ఎర్రబారడం, గొంతు ఒరిపిడికి గురికావడంతో పాటు  గొంతు పొడిబారినా దప్పిక అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో సాయంత్రం వేళ ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చలివేయడంతో పాటు గొంతులో జిగటగా అంటుకుపోతున్న భావన కలుగుతుంది. ఇలాంటి వారికి పల్సటిల్లా మందు బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి రాగానే భయపడకుండా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

మీ వయస్సు 30 ఏండ్లు దాటిందా.. అయితే వీటికి దూరంగా ఉండండి

శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం ఆయా వయసులను బట్టి ఉంటుంది. మనిషి జీవితంలో వివిధ దశల్లో ఆహారం మారుతూ ఉంటుంది. పాపాయిగా ఉన్నప్పుడు ఆరునెలల వరకు అమ్మ పాలే ఆహారం. ఆ తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో అలా అలా జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకుంటాం. అయితే యుక్తవయసులో బండలు తిన్నా కరిగించుకునే శక్తి ఉంటుంది అంటారు.కానీ, మూడు పదులు దాటిన తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఎంటో చూద్దాం.. 1. మీగడ పెరుగు : మీగడ పెరుగు, పండ్లను కలిపి తినాలని మీరు అనుకుంటే వాటిని వేరువేరుగానే తినడం మంచిది. షాపుల్లో  రుచికరమైన పెరుగును కొని ఆరోగ్యకరమైన వాటిని తింటున్నామని మీరు అనుకోవచ్చు కానీ అది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. వీటిలో తరచుగా చక్కెర కలిసి ఉంటుంది. 30 ఏండ్లు నిండిన వాళ్ళు  ఇటువంటి వాటికి  దూరంగా ఉంటేనే మంచిది. 2. సోడా. సోడాలో అధిక మోతాదులో ఫ్రాక్టోల్ కార్న్ సిరఫ్ ఉంటుంది.  ఇది మనుషులు తీసుకునే అతి అనారోగ్యకరమైన పదార్థాల్లో ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైంది కూడా. ఇది డైరెక్టుగా లివర్ లోకి చేరుకొని అక్కడే క్రొవ్వు రూపంలో పేరుకుపోయి ఉండటమే కాకుండా ఆకలిని తగించే హార్మోన్ లెఫ్టిన్ నిరోధానికి కూడా కారణం అవుతుంది. మనుషుల శరీరంలో క్రొవ్వు పెరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. 3. కృత్రిమ తీపి పదార్థాలు చెక్కరను తగ్గించి వాటిని బదులుగా కృత్రిమ తీపి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని మీరు అనుకోవచ్చు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. వాస్తవానికి అటువంటి వాటిని కేవలం రుచి కాపాడేందుకే కలుపుతూ ఉంటారు. అది ఒకరకంగా చెక్కరను తీసుకోవడం కన్నా అతి ప్రమాదకరం. కృత్రిమ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని  అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనిని నిర్ధారించడానికి ఇంకా పరిశోధన కొనసాగుతూనే ఉంది. 4. బీర్ ఇది మనుషులు తీసుకున్నే అనారోగ్యకరమైన  మద్యంలో ఒకటి. దీన్ని పులియబెట్టిన ధాన్యాల ద్వారా తయారు చేస్తారు. అంటే ఒకరకంగా ఫంగస్ ను కలిగి ఉంటుంది. ముదురు బీర్ లో ఇంకా ఎక్కువ మోతాదులో ఆకుపచ్చని బూజు ఉంటుంది. ఇది కాకుండా, తాగేవారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచే కొన్ని కార్బోహైడ్రేట్లు ఇందులో ఉంటాయి. 5. నిల్వచేసిన సూప్ లు నిల్వచేసి ఉంచబడినది సూప్‌లు లేదా తయారుచేయబడి ఉన్న ఏ సూప్ లు ఆరోగ్యానికి మంచివి కావు. తయారుచేయబడిన సూప్‌లో చాలా ఎక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. ఎందుకంటే వాటిని సంరక్షించే ఏకైక మార్గం అదే కాబట్టి. ఆ ద్రవ పదార్థాలను సంరక్షించేందు కోసం సోడియం మాత్రమే కాకుండా చక్కెరను కూడా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.  కాబట్టి రెడీ టూ  ఈట్ , రెడీ టూ డ్రింగ్ సూప్ లను తీసుకోవద్దని డాక్టర్లు  సూచిస్తున్నారు. 6. మైదా పిండి : మైదా పిండి ఆరోగ్యకరమైనదే అనుకుంటారు. దాని వినియోగం చాలా సాధారణం అయిపోయింది.  ప్రతి ఒక్కరూ దీనిని వినియోగిస్తున్నారు. 30 ఏండ్ల వయసు తర్వాత దీన్ని ఉపయోగించడం మానేయాలి. ఇది వృద్ధాప్యా లక్షణాలు తర్వతగా కనిపించే  రసాయన ఏజెంట్‌గా పనిచేస్తుంది.  కాబట్టి  వృధ్యాప్యాన్ని కొనితెచ్చుకోకూడదు అనుకునే వాళ్ళు  30 ఏండ్లు దాటాక దీన్ని మానివేయడం మంచిది. 7. సొయా ఇది జన్యుపరంగా చాలా మార్పులు చేయబడింది. ఇది థైరాయిడ్ అసమతుల్యకు దారితీసేందుకు దోహదపడటమే కాకుండా ఇది శరీరంలో మంటను పెంచుతుంది. ఈ సోయాలో మొక్కల ఆధారిత ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉన్నాయని సెంటర్ స్టేట్ కు చెందిన డాక్టర్ ప్రూడెన్స్  హాల్ బృందం నిర్ధారించారు. అది శరీరంలోకి ప్రవేశించి థైరాయిడ్ పెంచేందుకు దారి తీస్తుంది. ఒక వేళ మీరు ఇప్పటికీ థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటుంటే వీటిని తీసుకోవడం మానేస్తేనే మంచిది. 8. ప్రాసెస్డ్ మీట్ శుద్దిచేసిన మాంసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం ప్రమాదకరం. ఇలా ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక మోతాదులో సోడియం, క్రొవ్వు ఉంటుంది. ఇది రుచికరంగా బాగుంటుందని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే  హైపర్ టెన్షన్ కు గురికావడమే కాకుండా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇతర సమస్యలతో పాటు గుండెకు కూడా ప్రమాదకరం. 9. బాగెల్స్ రుచికరమైన బాగెల్స్  తినడాన్ని ఎవరు ఆపలేరు. అది రుచిపరంగా బాగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో సుమారుగా 250 కాలరీలు ఉన్నప్పటికీ పోషకాలు, పీచుపదార్థాలు ఉండవు. గోధుమ పిండితో తయారు చేసిన బాగెల్ తీసుకుంటున్నప్పటికీ అందులో  575 మి.గ్రా సోడియం  కలిసి ఉంటుంది. అది ఒక రకంగా రోజంతా తీసుకోవాల్సిన ఉప్పును కేవలం ఒక్క స్నాక్ లో తీసుకుంటున్నారని అర్థం. సో, మీరు మూడు పదుల వయసు దాటిన వారైతే మీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.. జివ్వ రుచి కన్నా జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అన్న విషయం గుర్తుంచుకోవాలి.

గుప్పెడు గింజలతో బోలెడు ఆరోగ్యం

ఎర్రగా, చూడగానే నాలుగు గింజలు నోట్లో వేసుకునేలా ఊరించే దానిమ్మలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో పోషకాలు వున్నాయి. దానిమ్మ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసా?... నోటి పూతగా వుంటే ఒక దానిమ్మని వలచి గుప్పెడు గింజలు నోట్లో వేసుకోండి చాలు. దానిమ్మలోని యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి.  ఆడవారు నెలసరి రోజుల్లో దానిమ్మని తింటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ సమయంలో వుండే ఇతర శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇవేకాదు.. దానిమ్మని రోజూ తినడం అలవాటుగా చేసుకుంటే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. అలాగే దీనిని సహజ యాస్పిరిన్ అనచ్చు. ఎందుకంటే రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. రోజుకి పావు కప్పు దానిమ్మరసం చాలు గుండె భద్రంగా వుండటానికి. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలామంచిది.  ఆస్టియో ఆర్ద్రస్టియస్‌తో బాధపడేవారు రోజూ దానిమ్మ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వయసు పెరిగేకొద్దీ ఏర్పడే చర్మం ముడతలను నివారించే గుణం కలిగిన దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కూడా. దీనిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. రుచిగా, చూడగానే తినాలనిపించే దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిశాక తినకుండా వుంటామా! రోజూ తప్పకుండా గుప్పెడు గింజలని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యంగా వుందాం.   -రమ 

పిండివంటల్ని బెల్లంతోనే ఎందుకు చేస్తాం!

  పండుగ వస్తోందంటే చాలు... మనకి పూజలు, పిండివంటలే గుర్తుకువస్తాయి. పూజల సంగతి పక్కనపెడితే, పిండివంటల వెనకాల కూడా బోలెడు ఆరోగ్య రహస్యాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఉగాది పచ్చడిలో భాగంగా మనం పుచ్చుకునే బెల్లం గురించి కొన్ని విశేషాలు ఇవిగో....   జీర్ణశక్తికి - బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది. అందుకనే భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఒక పలుకు బెల్లం తినమని చెబుతూ ఉంటారు పెద్దలు.   కావల్సినన్ని ఖనిజాలు - చెరుకుగడలోని పోషపపదార్థాలన్నీ కూడా పంచదారలోకి వచ్చేసరికి మాయమైపోతాయి. పంచదార తెల్లగా, శుభ్రంగా కనిపించడం కోసం దానిలో ఉపయోగపడే పదార్థాలన్నింటిని తొలగించి పారేస్తారు. కానీ బెల్లంలో మాత్రం అలా కాదు. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా కనిపిస్తాయి.    రక్తహీనత బలాదూర్‌- బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే గర్భిణీ స్త్రీలనీ, బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు. 50 గ్రాముల బెల్లం తిన్నా కూడా మనకు రోజువారీ అవసరమయ్యే ఇనుములో చాలావంతు శరీరానికి అందుతుంది.   కాలేయం శుద్ధి - మన శరీరంలో పేరుకున్న కల్మషాలన్నింటినీ బెల్లం బయటకు పంపేస్తుందట. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉందని చెబుతారు. కాలేయం శుభ్రంగా ఉంటే శరీరానికి వచ్చే సగం సమస్యలు తీరిపోయినట్లే!   రుతుసమస్యలు - మహిళల రుతుసమస్యల గురించి ఎంత చెప్పుకున్నా వేదన తీరదు. ముఖ్యంగా రుతుక్రమం సమయంలో నిస్సత్తువగా ఉండటం, కండరాలు లాగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల నిస్సత్తువ ఎలాగూ తగ్గుతుంది. ఇక బెల్లంతో శరీరంలో ఎండోమార్ఫిన్స్‌ అనే హార్మోన్లు ఉత్తేజితం అవుతాయట. వీటివల్ల మనసు కూడా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు.   ఒంటికి చల్లదనం - బెల్లపు నీరు వల్ల ఒంట్లోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పకుండా ఉంటాయట. వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. అందుకనే కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకించి బెల్లపు షర్‌బత్‌ చేసుకుని తాగుతారు. మనకా అవసరం లేకుండా శ్రీరామనవమి సందర్భంగా కావల్సినంత బెల్లపు పానకం వాడవాడలా దొరుకుతుంది.   కావల్సినంత శక్తి - పంచదార ఒక కృత్రిమ పదార్థం. దాని వల్ల పంచదారలోని చక్కెరలు ఒక్కసారిగా రక్తంలోకి కలిసిపోయి షుగర్‌ స్థాయి ఆసాంతం పెరిగిపోతుంది. కానీ బెల్లం అలా కాదు. అందులోని చక్కెరలు నిదానంగా రక్తంలోకి కలుస్తూ కావల్సినంత శక్తిని అందిస్తాయి. దాని వల్ల ఒంటికి నిరంతరం శక్తి లభిస్తూ ఉంటుంది.   కీళ్లసమస్యలకి ఉపశమనం - కీళ్లనొప్పులు, బెణుకులు, వాపులని నివారించడంలో బెల్లం గొప్ప పాత్ర పోషిస్తుంది. నాలుగు నుంచి ఆరువారాలపాటు రోజు కాస్త బెల్లాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులకి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.   ఇప్పుడంటే ఇంట్లోకి రకరకాల తినుబండారాలు బయటనుంచే తెచ్చకొంటున్నాము. కానీ ఒకప్పుడు నువ్వులు, బెల్లంతో చేసిన పాకమే ఇంటింటా కనిపించేది. పిల్లలకి ఇలాంటి నువ్వుల ఉండని పెట్టడం వల్ల... వారికి తగినంత శక్తి ఎలాగూ లభిస్తుంది. దాంతోపాటుగా చిన్నతనంలో వారిని వేధించే శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుందట!!!   చెప్పుకొంటూ పోతే బెల్లం వల్ల చేకూరే ప్రయోజనాల చిట్టా చేంతాడంత తేలుతుంది. అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి... పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరం అన్న విషయం గుర్తెరిగితే చాలు.   - నిర్జర.

కషాయాలు ఎందుకు.. మిరియాలు.. లవంగాల్లో ఏముంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్నో ఇంటి చిట్కాలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ ప్రధాని సైతం కషాయాలతో కరోనాను తరిమి కొట్టవచ్చని చెప్పారు. పక్కింటివారు చెప్పినా.. ప్రధాని చెప్పినా వాటిలో మనకు కామన్ గా కనిపించేవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు. వీటి కాంబినేషన్ తో తయారు చేసే కొన్ని రకాల కషాయాలు కరోనా మన దరికి రాకుండా తరిమికొడతాయి అని చెప్తున్నారు. మరి ఇంతకీ వీటిలో ఏముంది? వీటిని ఎందుకు ఔషధాలుగా మనం చెప్పవచ్చు. అది తెలుసుకోవాలంటే మనం మన సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకోవాల్సిందే... క్రీస్తు పూర్వం  2000 కన్నా ముందు బంగారం కన్న గొప్ప విలువ సంపదగా సుగంధ ద్రవ్యాలను భావించేవారు.  దాల్చిన చెక్క, నల్ల మిరియాల తదితర దినుసుల  వాణిజ్యం ద్వారా ఆయా దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించేవి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సుగంధద్రవ్యాల్లో 70శాతం మన దేశంలోనే పండుతాయి. వీటిని పండించే రాష్ట్రాల్లో కేరళదే అగ్రస్థానం.  క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికే కాదు ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.. అందుకు కారణం వాటిలో ఉండే  ఆక్సిజన్ రాడికల్ అబ్సర్వేషన్ కెపాసిటీ. దీన్నే మనం ఓఆర్ఏసి గా పేర్కొంటారు జింజర్, తులసి, పసుపు మొదలైనవాటిలో ఓఆర్ఏసి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  విటమిన్ సి, ఒమేగా త్రీ, విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాలను మనం తీసుకున్న ఆహారం నుంచి  శరీరం గ్రహించడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి.

శరీర బరువు ఎక్కువయినా ప్రమాదమే...!

వయసు పెరుగుతున్నా కొద్దీ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటిలో ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టే సమస్య కీళ్ల నొప్పులు. పెరిగే వయసుతో పాటు మోకాళ్ళ అరుగుదలా పెరుగుతుంది. అయితే, మోకీళ్లు ఎక్కవ కాలం దృఢంగా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు పెరిగే కొద్దీ కీళ్ల మీద ఒత్తిడి పెరిగి, మృదులాస్థి పలుచనై, కీళ్లు ఒకదానికొకటి రాసుకోవడం మొదలవుతుంది. ప్రారంభంలో నొప్పి తగ్గించే మందులు, మృదులాస్థిని పరిరక్షించే మందులు వాడవలసి ఉంటుంది. రెండు, మూడు దశలు దాటి, కీళ్లు ఒరిపిడికి గురయ్యే నాలుగో దశ వచ్చిందంటే మాత్రం మోకాలి మార్పిడి చేయక తప్పదు. కాబట్టి  శరీర బరువును అదుపులో ఉంచుకుంటూ మోకాలి కండరాలు, లిగమెంట్లను బలపరిచే క్వాడ్రాసెప్స్‌, హ్యామ్‌స్ట్రింగ్స్‌ తరహా వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

వెన్న పూస్తున్నారా బాబూ!

రోజులు మారిపోతున్నాయి. రోజులతో పాటుగా అలవాట్లూ మారిపోతున్నాయి. కాస్త ఆకలి వేసినప్పుడు ఇడ్లీలో, పకోడీలో తినే పరిస్థితి దాటిపోయి... బ్రెడ్డు మీద వెన్న రాసుకునే అలవాటు మొదలైంది. కానీ ఇలా దేని మీద పడితే దాని మీద వెన్నని రాస్తే ఆకలి తీరడం మాట అటుంచి అనారోగ్యం పాలవుతామని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వెన్న భారతీయులకి కొత్తేమీ కాదు. మన రోజువారీ జీవితంలో పాలు, వెన్న, నెయ్యి శుభ్రంగా కలిసిపోయాయి. ఈ పదార్థాలు లేనిదే మన ఆహారాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ కొద్ది రోజులుగా వెన్న మీద పరిశోధకుల కన్ను పడింది. ఇందులో ఉండే విపరీతమైన కొవ్వు వల్ల గుండెపోటు, చక్కెర వంటి సమస్యలు ఏర్పడతాయంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇలాంటి మాటలు విన్న భారతీయులు కూడా అనాదిగా వస్తున్న తమ అలవాట్లలో లోపం ఏదన్నా ఉందేమో అని భయపడి అసలు వెన్నకే దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు వెన్న జోలికే పోవడం మానుకున్నారు. నిజానికి ఆయుర్వేదం ప్రకారం వెన్నకి అద్భుతమైన గుణాలెన్నో ఉన్నాయి. ఆకలిని పెంచడంలోనూ, వాతపిత్త దోషాలను నివారించడంలోనూ, జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలోనూ, శక్తిని అందించడంలోనూ... వెన్నకు తిరుగులేదంటారు ఆయుర్వేద నిపుణులు. ఇక పిల్లలపాలిట అయితే ఇది అమృతంలా పనిచేస్తుందట. మరి అలాంటి వెన్నకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారేంటా అని జనం సందిగ్థంలో పడిపోయారు. కానీ బోస్టనుకు చెందిన డా॥లారా చేసిన ఒక పరిశోధనతో అసలు విషయం బయటపడింది. వెన్నకీ గుండెజబ్బులు, చక్కెర వంటి వ్యాధులకీ పెద్దగా సంబంధం లేదని తేల్చిపారేశారు లారా. నేరం వెన్నది కాదనీ, దాంతో పాటుగా పుచ్చుకునే బ్రెడ్‌, బంగాళదుంపలు వంటి పదార్థాలదే అంటున్నారు ఈ పరిశోధకురాలు. దేని మీద పడితే దాని మీద వెన్నని పూసేసుకొని, ఆ తరువాత వచ్చే అనారోగ్యాలకు వెన్నను దోషిగా నిలబెట్టడం మంచిది కాదంటున్నారు. లారా తన పరిశోధన కోసం దాదాపు ఆరు లక్షలమంది ఆరోగ్యవిధానాలను నిశితంగా పరిశీలించారు. అదీ విషయం! రోజుకి కాస్తో కూస్తో వెన్నని మితంగా పుచ్చుకోవడంలో తప్పులేదనీ... అయితే ఆ వెన్నని దేని మీద పూస్తున్నారో కూడా గమనించుకోవాలని ఈ పరిశోధనతో తేలుతోంది. పైగా వెన్న పేరుతో బయట లభించే కృత్రిమ వెన్న (margarine) పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కృత్రిమ వెన్నని తయారుచేసేందుకు రకరకాల నూనె పదార్థాలని ఉపయోగిస్తారనీ, ఇవి శరీరంలోనే పేరుకుపోతాయని చెబుతున్నారు. అచ్చు వెన్నలాగే ఉండే ఈ margarineని బేకరీలలో విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. సహజమైన వెన్నని చూసి భయపడేకంటే ఇలాంటి కృత్రిమ పదార్థాలకు, బేకరీ ఆహారాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.

16/8 డైట్‌ అంటే ఏంటి?

  ఇప్పుడు ఎవర్ని చూసినా ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దాంతో పాటే వచ్చే డయాబెటిస్‌, గుండెపోటులాంటి సమస్యలూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. శరీర శ్రమ లేని లైఫ్‌ స్టైల్‌, ఏదిపడితే అది ఎడాపెడా తినేయడం మన ఒబెసిటీకి కారణం అని చిన్నిపిల్లాడికి కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని నివారించడానికి అప్పుడప్పుడూ రకరకాల చిట్కాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటైన 16/8 డైట్‌ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఆ 16/8 డైట్‌ కథ ఏంటో మీరే చూడండి...   ఒకప్పుడు తిండి తినడానికి కూడా సమయం ఉండేది. రాత్రి చీకటిపడేలోగా తినేసి పక్కల మీదకి చేరేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు! పొద్దన్న ఆరింటికి మొదలుపెడితే రాత్రి పదకొండు గంటల వరకూ పొట్టలో ఏదో ఒకటి పడుతూ ఉండాల్సిందే! దీనికి విరుగుడుగానే 16/8 డైట్‌ని కనిపెట్టారు. ఇది పాటించేవాళ్లు రోజులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగతా 16 గంటలూ కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు మన తిండి అంతా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల లోపే ముగించేయాలి. మర్నాడు ఉదయం పదిగంటల వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. మిగతా సమయంలో శరీరం నీరసించిపోకుండా ఉండేందుకు షుగర్‌ ఉండని లిక్విడ్స్ (నీళ్లు, బ్లాక్‌ టీ, నిమ్మరసం...) తీసుకోవచ్చు.   ఈ 16/8 డైట్‌లో మిగతా 16 గంటలూ ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరం ఒంట్లో పేరుకున్న కొవ్వుని కరిగించడం మొదలుపెడుతుంది. ఓ మూడు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినవాళ్లలో ఒబెసిటీ తగ్గినట్లు, బీపీ కూడా అదుపులో ఉన్నట్లు తేలింది.   వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంది. పాటించడానికి తేలికగా కూడా ఉంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఈ డైట్‌ ఫాలో అయ్యేందుకు సిద్ధపడితే మాత్రం ప్రమాదం తప్పదు. షుగర్‌, గ్యాస్ట్రిక్‌ లాంటి సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకపోవడమే బెటర్‌. ఏదన్నా తిని మందులు వేసుకోవాల్సినవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకి కూడా ఈ పద్ధతి సరిపడదని చెబుతున్నారు. మిగతావాళ్లు మాత్రం అలా ఓసారి ఈ పద్ధతిని పాటించి చూడవచ్చునట. మరెందుకాలస్యం... ఓ రాయి వేయండి. ఏమో ఎవరికి తెలుసు- ఏ పుట్టలో ఏ రాయి ఉందో!  https://www.youtube.com/watch?v=UFOfu35n7l8 - నిర్జర.