ఆవనూనెలోనూ ఆరోగ్యం ఉంది

భారతీయుల వంటకాల్లో ఆవాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వారి రోజువారీన జీవితంలో ఆవనూనెకీ అంతే ప్రాధాన్యత ఉండేది. పసిపిల్లల ఒంటికి మర్దనా చేయాలన్నా, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలన్నా ఆవనూనెకే తొలి ఓటు వేస్తారు భారతీయులు. ఉత్తరభారతదేశంలో అయితే ఒకప్పుడు వంటనూనెగా సైతం ఆవనూనెను వాడేవారు. ఆవనూనెని ఆహారంగా తీసుకుంటే, ఇందులోని Erucic acid వల్ల దుఫ్పలితాలు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలుస్తుంటే, ఆవనూనెలోని Alpha-linolenic acid వల్ల గుండెకు మేలే జరుగుతందని మరికొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా రోజుకొకటిగా వెలువడే పరిశోధనల మాట అటుంచితే... జానపదుల వైద్య విధానంలో అనాదిగా ఆవనూనెను వాడుతూనే ఉన్నారు. వాటిలోంచి కొన్ని ఉపయోగాలు ఇవిగో...   ఒత్తయిన జుట్టు కోసం ఆవనూనెతో కనుక తలకి మర్దనా చేస్తే జుత్తు నల్లగా ఒత్తుగా పెరుగుతుందంటారు పెద్దలు. ఆవనూనెతో తలకి మసాజ్‌ చేయడం వల్ల కుదుళ్లలోని రక్తప్రసరణ మెరుగుపడటమే కాదు... ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఎ, ఇ, కేల్షియంలు జుత్తు ఎదుగుదలకు తోడ్పడతాయి. పైగా ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల అది చుండ్రుని నివారించడంలో తోడ్పడుతుంది.   మిలమిలా మెరిసే పళ్లు కాస్తంత ఉప్పు, వీలైతే నిమ్మరసం కలిపిన ఆవనూనెతో కనుక పళ్లను, చిగుళ్లను రుద్దితే... పంటి సమస్యలెన్నింటి నుంచో ఉపశమనం లభిస్తుందంటారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, వయసుతో పాటుగా పళ్లు బలహీనపడిపోవడం, గారపట్టడం వంటి సమస్యలన్నీ తీరిపోతాయంటున్నారు.   చర్మానికి చర్మానికి సంబంధించినంత వరకు, ఆవనూనె అద్భుతాలు చేస్తుండనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆవనూనెతో చర్మాన్ని మర్దనా చేయడం వల్ల స్వేదరంధ్రాలన్నీ శుభ్రపడతాయి. చర్మంలో పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. పైపెచ్చు ఆవనూనెలో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపుని తీసుకువస్తాయి. ఇక శనగపిండి, పెరుగు, నిమ్మరసం వంటివి కలిపిన ఆవనూనెను కనుక చర్మానికి కాసేపు పట్టించి ఉంచితే... ఒంటి మీద ఉన్న నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయన్నది నిపుణుల మాట.   శ్వాసకోశ వ్యాధుల్లో దగ్గు, జలుబు మొదలుకొని ఆస్తమా, సైనసైటిస్‌ వంటి అనేక శ్వాసకోశ వ్యాధుల్లో ఆవనూనె ఉపశమనం కలిగిస్తుందన్నది ఓ నమ్మకం. విక్స్‌ బదులు కర్పూరం కలిపి ఆవనూనెను ఛాతీకి పట్టించడమే మంచిదంటారు. ఇక రోజుకి మూడు స్పూన్లు, తేనె కలిపిన ఆవనూనెను కనుక తీసుకుంటే... కఫం ఇట్టే కరిగిపోతుందంటున్నారు.   జీర్ణం జీర్ణం కొంతమందికి అసలు ఆకలి వేయనే వేయదు. ఇలాంటివారు కనుక కాస్త ఆవనూనెను పుచ్చుకుంటే, శుభ్రంగా ఆకలి వేస్తుందంటున్నారు పెద్దలు. ఆవనూనెకు మన జీర్ణాశయంలో ఉన్న రసాయనాలను ప్రేరేపించే గుణం ఉండటంతో... ఆకలి వేయడం మొదలుకొని, తిన్న ఆహారం పక్వం కావడం వరకూ అన్ని చర్యలూ సాఫీగా సాగిపోయేలా తోడ్పడుతుంది. అజీర్ణం చేసినవారి పొట్ట మీద కాస్త ఆవనూనెను మర్దనా చేసినా కూడా తగిన ఫలితం కనిపిస్తుంది. ఇంతేకాదు! ఆవనూనె ఓ గొప్ప క్రమిసంహారిణి కూడా. అందుకే శరీరంలోనూ, చర్మం మీదా ఎలాంటి ఇన్ఫెక్షన్లు చోటు చేసుకున్నా కూడా.... వాటిని ఆవనూనె ఇట్టే అరికట్టేస్తుంది. ఆవనూనెతో వెలిగించే దీపం ఆఖరికి దోమలను కూడా తరిమికొడుతుందంటే, దాని ప్రభావం గురించి అంతకంటే రుజువేముంటుంది! - నిర్జర.

ఏక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీకి చికిత్స వచ్చేసింది..

ఒక పక్క డయాబిటీస్ తో సతమతమవుతున్న వారికీ ఒక్కోసారి కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .. ఈ సందర్భంలో చాలా కాలం పాటు డయాలసిస్ చేసుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది..  ఇలా  దీర్ఘ కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పాడుతున్న వారికీ శుభవార్త . ఫండింగ్ ఇంజక్షన్ వల్ల కిడ్నీ పనితీరు  మెరుగుపడుతుందని జార్జ్ ఇన్స్టిట్యూట్ లోని ఇద్దరు పరిసోదకులు రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజీ ఫిజీషియన్స్ కు చెందిన డాక్టర్లు  కిడ్నీ లో వచ్చే సమస్యలకు నూతన చికిత్సలు ఆవిష్కరించారు. డాక్టర్ యింగ్ అమండా వాంగ్ రినాల్ మరియు మెటాబాలిక్  విభాగంలో ఫెల్లోమెన్ గా ఉన్నారు. ఆర్ ఎ సి పి 2021   రీసెర్చ్ ఎస్టాబ్లీష్ మెంట్ కోసం $9 0 ,000   ఆర్ధిక సహాయం అందించింది. ఎ క్యూట్ కిడ్నీ ఇంజ్యూరి పై ఆమె చేసిన పరిశోధనకు ఇది లభించింది.r a c p, jac qur award, racp ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సొసైటీ నెఫ్రాలజీ నెఫ్రాలజిస్ట్ కు లభించినట్లైంది. ట్రీట్మెంట్ మేనేజ్ మెంట్, రెనాల్ డిసీజ్ కు లభించింది. డాక్టర్ వోంగ్  వహు కన్సల్ట్ నేఫ్రోలజిస్ట్ జనరల్ ఫిజీషియన్ 20   సంవత్సరాలుగా ఎ క్యూట్  కిడ్నీ ఇంజ్యూరి బాగా పెరిగింది. ఇప్పటికీ సరైన చికిత్స లేదని ఎక్యుట్  కిడ్నీ ఇంజ్యూరి వల్ల  సత్వరం కోల్కొడం సాధ్యం కాదని. ఆరోగ్యం పై దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందని ఇంకా దీనికోసం చాలా చికిత్సలె ఉన్నాయి. ఇంకా అవి అభివ్రుద్ధిలోనే ఉన్నాయని అన్నారు. వీటిపై క్లినికల్ ట్రైల్స్ జరగాల్సివుందని ఇవి ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాల్సివుందని  అన్నారు. ఈ పరిశోదన లక్ష్యం  ఒక్కటే అని ప్రపంచ స్థాయిలో  క్లినికల్ ట్రయల్స్ జరగాలని ఆస్ట్రేలియా ఎక్యుట్ కిడ్నీ ఇంజ్యూరి కి చికిత్స చేయగలదన్న నమ్మకం చాలని ఎక్క్యుట్  కిడ్నీ ఇంజ్యూరి చికిత్సలో ఆస్ట్రేలియాను అగ్రభాగాన నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. డాక్టర్ శ్రద్ధ కోత్వాల్ ఫెల్లో ఆఫ్ జార్జ్ ఇన్స్టిట్యూట్ యునివర్సిటి క్రానిక్ కిడ్నీకేసులో పరిసోదనకు గాను ఆమెకు $50,000  ప్రోత్సాహక బహుమతిగా లభించింది. ఈధనం క్లినికల్ ట్రైల్స్ కు వినియోగించాలని  సూచించారు . సి కె డి డి ఎన్ ఎ బ్లడ్ శాంపిల్ ద్వారా మరిన్ని పరిశోధనలు  చేయడానికి వీలు అవుతుంది . సి కె డి నిర్వహించే క్లినికల్ ట్రైల్స్ లో స్వచ్చందంగా పాల్గొనాలని సూచించారు. క్లినికల్ ట్రైల్స్ విజయవంతమైతే కిడ్నీ రోగుల పాలిట వరంగా మారుతుందని  నిపుణులు అన్నారు.

మానసిక సమస్యలకు ఎవరూ అతీతులు కాదు.. ?

ఇటీవలి కాలంలో చాలామందిలో స్చిజోఫ్రీనియా గురించి విటున్నాము నాగ్ నాధ్  గారు  ఆశలు ఇది ఏరకమైన అనారోగ్యం కిందకు వస్తుంది ? ఇది ఒకరకమైన మానసిక వైకల్యంగా చెప్పొచ్చు.. ప్రపంచ జనాభాలో ఎంతమంది  స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారు ? ప్రపంచ జనాభాలో 11 % మంది  ప్రజలు వివిద రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.  అమెరికాలో 3.5 మిలియన్ ప్రజలు  స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారని మానసిక వైద్యులు నాగ్ నాథ్ అన్నారు. స్చిజోఫ్రీనియా  సమాస్య ఉన్నవాళ్లు  ఎలా ప్రవర్తిస్తుంటారు? ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు  కొన్ని ఏళ్లుగా ఉండి  ఉండవచ్చు అన్నారు నాగ్ నాధ్. వీళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారని , ఆలోచనలు సవ్యంగా ఉండవని, అందరిలా కాకుండా సమాజానికి విరుద్ధంగా  ప్రవార్థిస్తూ ఉంటారు.  దీనిని  ఏరకమైన డిజార్డర్ గా పేర్కొంటారు ? దీనిని సైకోటిక్ డిజార్డర్ గా  చెప్తారు . ఇలాంటి సైకోటిక్ డిజార్డర్ తో బాధపడేవాళ్లను ఎలా గుర్తించాలి ? వీళ్ళు మామూలుగానే ఉంటారని అయితే సైవోటిక్ డిజార్డర్ తో ఉన్నవారు  ఆ సమయంలో వాస్తవాలను గుర్తించరని నాగ్ నాధ్ చెప్పుకొచ్చారు. అసలు స్చిజోఫ్రీనియా ను గుర్తించవచ్చ? అసలు  ఏ ఏ వయస్సుల వారిని ఈ సమస్య . వేధిస్తుంది ? దీనిని గుర్తించడం సులభమే అని అన్నారు . 16  నుంచి 25  సంవత్సరాల  మధ్య వయస్సు ఉన్నవారు  దీని బారిన పడుతున్నారని అన్నారు. స్చిజోఫ్రీనియా  వారసత్వంగా వస్తుందా ? కుటుంబంలో ఎవరికైనా ఉండవచ్చు . అప్పుడే దీనిని గుర్తిస్తే  సమస్య నుంచి బయటపడచ్చు. అసలు స్చిజోఫ్రీనియా  ఎవరికీ ఎక్కువగా వస్తుంది అంటే స్త్రీలలోనా,  పురుషులలోనా ? స్త్రీలకంటే పురుషులలో 1 5 % అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారని  అన్నారు మానసిక నిపుణులు  నాగ్ నాధ్ . చిన్నపిల్లల్లో స్చిజోఫ్రీనియా  వస్తుందా ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంచనా ప్రకారం  40,000   మంది పిల్లలో ఒకరికి మాత్రమే వస్తుందని, ఈసమస్య 13  సంవత్త్సరాల ముందు రావచ్చని, ఇంకా పూర్తి పరిశోధన అంశాలు రావాల్సి ఉందన్నారు  నాగ్ నాధ్  గారు.  అసలు స్చిజఫ్రీనియా ఎన్నిరకాలు ఉండచ్చు ? ఇందులో ఐదు రకాల  స్చిజోఫ్రీనియా ఉందని అంతార్జాతీయ  మానసిక విభాగం చేసిన అధ్యయనంలో పేర్కొన్నారు . వీటిలక్షణాలను బట్టి వేరు వేరు గా విభజిం చారని నాగ్ నాధ్   పేర్కొన్నారు . అవి వివరిస్తారా ? 1) పరో నోయిడ్  స్చిజోఫ్రీనియా  2) డిసోర్గనైజ్డ్ స్చిజోఫ్రీనియా  3) కాటాటోనిక్ స్చిజోఫ్రీనియా  4) అండిఫరియేట్డ్  స్చిజోఫ్రీనియా  5) రెసిడ్యూయల్  స్చిజోఫ్రీనియా గా వైద్యులు  నిర్ధారించారని  ఆయన అన్నారు . ఇందులో మొదటి దశకగా  చెప్పబడే  పారనోయిడ్  స్చిజోఫ్రీనియా  గురించి దాని లక్షణాలు చెపుతారా ? వీళ్ళు చాలా సహజంగా ఉంటారు .వీళ్ళ ప్రవార్తన ఎప్పుడు భ్రమలో ఉంటారు, హలొ సినేషన్స్  ఉంటాయి . ఇలానే వాళ్ళు ఏ ఏ రంగాల వాళ్ళు ఉంటారు ? సామాన్యులు , నుంచి ప్రముఖులు , ముఖ్యంగా రాజకీయ నాయకులు  ఉంటారు,  నటీనటులు కూడా ఉండచ్చు, వీళ్లు అపర మేధావులు, పలుకుబడి కలిగి ఉంటారు, ఉపాధ్యాయులు కూడా ఈకోవకే చెందుతారు. అటు సామజిక అవగాహన ఇటు విషయం పరిజ్ఞ్యానంలోను  తమను మించినవారు లేరని తాము సమాజంలో అత్యత ప్రభావవంతంగా  పని చేస్తారని  ఇటీవలి  పరిణామాలు నిరూపిస్తున్నాయని అందుకు ఉదాహరణగా మదన పల్లి ఘటన ఈ కోవలోకి చెందిందని అన్నారు . డిసోర్గనైజ్డ్  స్చిజోఫ్రీనియా లో వాళ్ళ ప్రవర్తన మాటలు ఒకదానికొకటి సంబంధం ఉండదని , అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని అర్ధం చేసుకోడం కష్టమే అని అన్నారు. అయితే అన్ని తమకు తెలుసుఅని  భావోద్వేగాలను నియంత్రించుకోలేరని సందర్బోచితంగా  వ్యవహరించరని.. రోజువారీ కార్యక్రమాలలో  చాలా పోషక విలువలు ఉన్న ఆహరం తీసుకుంటారని భిన్నమైన ఆలోచనలతో  తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని నాగ్ నాధ్  వివరించారు. కేటా టానిక్  స్చిజాఫ్నేరియా లో చెప్పిందే చెప్పడం వీళ్ళ లక్షణమని అన్నారు. అన్ని చోట్లకు వెళ్తుంటారు,  నేను అన్నిటికీ చాలా అతీతుడిని , అనుకుంటూ ఉంటారు.. నేను పూజిస్తే చాలు అందరు  నాశనం అయిపోతారు, నాకు అతీతమైన శక్తులు  ఉన్నాయని భ్రమలో ఉంటారు . వారి పై   వారికీ శ్రద్ధ ఉండదు . రోజు వారీ కార్యక్రమాలు  పూర్తి చేయరు . అవసరం లేని పనులమీద తిరుగుతూ ఉంటారు . అన్డి ఫరెంటియేటెడ్ స్చిజోఫ్రీనియాలో మూడు రకాల లక్షణాలు  ఉంటాయి . భ్రమ , భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు. అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడడం వీళ్ళ  క్వాలిఫికేషన్ , ఆలోచనలు అస్తవ్యస్తం , స్థిరమైన జీవితం ఉండదు, తమని అందరు మోసం చేస్తన్నారని , అందరు తప్పు చేస్తూ,  నన్ను మాత్రమే తప్పు చేస్తున్నావని నిందిస్తారని అనుకుంటారు . కొన్ని సందర్భాల్లో వీరికి  మొండి తనం ఎక్కువే అని ,నేను ఎవరు చెప్పినా వినను నాకు అన్నీ తెలుసు అనుకుంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండ వాదానికి దిగుతారు , ఇంక పరాకాష్టగా ఆత్మాహత్యకు సైతం వెనకడుగువేయరు ,లేదా వాడిని చంపేస్తాను ,నరికేస్తాను అన్న ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారని నాగ్ నాధ్  విశ్లేషించారు . ఇకచివరిది 5 వది  రెసిడ్యుల్ వీరు గతం గురించి జరిగిన సంఘటనలను పదేపదే గుర్తు చేసుకోవడం అదే పనిగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని తనను ఇంట్లో అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన కలిగినప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తారు అని అందులో భాగంగానే అన్నం తినకుండా ఉండడం, అలగడం, అరవడం చేస్తుంటారని నాగ్  నాధ్  అన్నారు. పైన పేర్కొన్న కొన్ని అంశాలను చూసినప్పుడు మదన పల్లి ఘటన అందరూ ఈ రకమైన మానసిక సమస్యతోనే బాధపడుతున్నారని తేల్చి చెప్పారు.  

కోవిడ్ 19 కన్నా అత్యంత ప్రమాదకరం డయాబెటీస్ వైద్యుల హెచ్చరిక ?

ఇన్సులీన్ ఇంటర్ సెప్టర్ తో డయాబెటీస్ కు చెక్ పెట్టచ్చు అంటున్నారు వైద్యులు. దీర్గ కాలంగా మీరు డయాబెటీస్ తో  బాధ పడుతున్నారా ఇక నిశ్చింతగా ఉండండి. జర్మనీకి చెందిన సెంటర్ ఫర్ ఇన్వి రాన్ మెంట్ సంస్థ జరిపిన పరిశోధనలో పనిచేయకుండా ఉన్న ప్యాం క్రియాస్ నుండి ఇన్సులిన్ ను  ఉత్పత్తి చేయడం ప్యాం క్రియాటిక్ డాటాసెల్స్ ను సంరక్షించడం ఇన్సులిన్ పునరుత్పత్తి  చేయడం ద్వారా డయాబెటీస్ ను  నిలువరించ వచ్చని తెలుస్తోంది. ఇన్సులిన్ ఇంటర్ సెప్టర్ పేరుతో మందును కనుగొన్నారు. హెల్మ్  హేల్త్జ్ ముఎంచెం సెంటర్ ఫర్ డయాబెటేస్  పై చేసిన పరిశోదన ఒకమైలురాయిని  దాటిందని వైద్యులు అనందం వ్యక్తం చేసారు. డయాబెటీస్ పై చేస్తున్న పరిశోధనలో శాస్త్రజ్ఞులు  దీనితో కీలక ఆడుకు పడినట్లు అయ్యింది. 100  సంవత్సరాల ఇన్సులిన్ వాడడం ద్వారా బ్లడ్ షుగర్ ను అడుపు  మాత్రమే చేయగలిగామని పేర్కొన్నారు . 5 ౦ సంవత్సరాల ఇన్సులిన్ ఇన్ సెప్టర్ ను కనుగొన్నట్లు  వైద్యులు ఆనందం వ్యక్తం చేసారు. పనిచేయకుండా పోయిన ప్యాం క్రియాస్ ద్వారా ఇన్సులిన్, ఇంటర్ సెప్టర్  ద్వారా ఇన్సులిన్ వృద్ధి చెందిందని. ప్యాం క్రియాస్  డాటా సెల్స్  పునరుత్పత్తి చేయడం ద్వారా డయాబెటీస్ ను పెరగకుండా నిలువరించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.     డయాబెటీస్  ఒక మెటా బాలిక్ డిజార్డర్ వల్ల ఇన్సులిన్ ఉత్పతి కాకపోవడం ఇన్సులిన్ డాటా సెల్స్ ఉత్పత్తి లేనందు వల్లే ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా  ప్యాం క్రియాస్ ఆవయవం చక్కేర శాతాన్ని ఇతర సమస్యలను  తగ్గిస్తుంది. మెటా బాలిక్ వ్యవస్తలో  లోపం వల్లే ఈ సమస్యకు మందులు వాడినా  పరిష్కారం కాకపోగా ఇతర అనారోగ్య సమస్యలు వేదిస్తాయి. ముఖ్యంగా  డయాబెటీస్  న్యూరో పతి , డయాబెటీస్ నేఫ్రోపతి , కిడ్నీ, లివర్ చివరికి గుండె సైతం ఇబ్బందుల్లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు . గుండె పని చేయక పోయినా , షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినా మెదడులో నాళాలు పూడుకు పోవడం , పూర్తిగా అన్ని అవయవాలు పని చేయకండా పోతాయని దానివల్ల  మరణం సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్ ను నిలువరించే  పూర్తి వైద్యం, మందులు, చికిత్సలు  అందుబాటులో లేవని  నిపుణులు విశ్లేషించారు. గతంలో ఇన్సులిన్ తెరఫీ వినియోగించినప్పటికీ దీని వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించాగాలిగినా ఇన్సులిన్ వల్ల బరువు పెరగడం, ఊబకాయం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఇన్సూలిన్  ఇంటర్ సెప్టర్ ద్వారా ఇన్సూలిన్ ఉత్పత్తి  ప్యాం క్రియాటిక్ బీటా సెల్స్ ను బతికించవచ్చని, దీనిద్వారా మెటా బాలిక్ థెరపీతో  ఇన్సులిన్ రోగులను రక్షిస్తుందని  పరిశోధకులు  వెల్లడించారు. ఇంటర్ సెప్టర్ ద్వారా మాలిక్యుల్స్ లక్ష్యంగా బీటా సెల్స్ ను రక్షిస్తుంది. సెల్స్ రీజనరేషన్,   సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు తేల్చారు. ఎలుకలపై జరిపిన పరిసోదనలో ఇన్ సెప్టర్ ఉత్పత్తి చేసే సెల్స్ ఒక షీల్డ్ లా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ మార్గాన్ని సుగమం చేసింది ఇన్ సెప్టర్  షుగర్ లెవెల్స్ ను తగ్గించగలిగిందని,  ఇన్సులిన్ ను శక్తి వంతంగా ఉంచుతుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇన్ సెప్టర్ పని చేస్తే ఏమౌతుందని జనటిక్ గా లేదా ఫార్మాకాలజీ  ప్రకారం ఎలా పనిచేస్తుంది ? అన్న సందేహాన్ని వైద్యులు  వెలిబుచ్చారు . ఇన్ సెప్టర్ బీటా సెల్స్ ను తాకడం ద్వారా యాంటీ బాడీలు తయారై బిటాసెల్స్ పని చేయడం మొదలౌతుంది. ఇవి మరింత వృద్ధిచెంది ఇన్ సెప్టర్ డయాబెటేస్  లక్ష్యంగా డయాబెటీస్ కు గల కారణాలను శోధించింది . ఈ పరిశోదన చేసిన ఫ్రెడ్ రిక్ బ్యాటింగ్ కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉందని ఇన్సులిన్ మందు తో జీవితం పరిరక్షించవచ్చని నిపుణులు  భరోసా కల్పించారు. 1 ౦ ౦ సంవత్సరాల  క్రితం ఇన్సులిన్ డ యాబెటేస్ ను నివారించలేదని కేవలం  లక్షణాలను బట్టి డయాబెటీస్ ను మేనేజ్ చేయవచ్చని మాత్రమే తెలుసుకోగలిగామన్నారు. ఈ విధానం వందల సంవత్సరాలుగా  కొనసాగిందని ఇన్ సెప్టర్ కనుగోనడం ద్వారా మందుతో బెటా సెల్ పునరుత్పత్తి చేయడం సాధ్యమయ్యిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంటర్ సెప్టర్  టైపు 1 టైపు 2 డయాబెటీస్ రోగులకు లాభదాయకమని అన్నారు. ఇన్సులిన్ ఇంహేబిటరీ  రిసేప్టర్ మరో ముఖ్యమైన అడుగుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెల్మ్ హెల్తజ్ ఎంటర్న్ ముంచెన్ సిఇఓ  కోవిడ్ 19 కన్నా అత్యంత ప్రభావం చూపేది  డయాబెటీస్ మాత్రమే అని హెచ్చరించారు, త్వరిత గతిన  చంపేస్తుందని అన్న విషయం  మరువరాదని  పేర్కొన్నారు. ప్రపంచంలో డయాబెటీస్ లేకుండా చేయాలన్న లక్ష్యం తో డాక్టర్ల బృందం పనిచేసింది . ఇప్పటికే  డయాబెటీస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న భారత్ లాంటి దేశంలో ఇన్స్యూల్ ఇంటర్ సెప్టర్ మందు క్లినికల్ ట్రైల్స్ నిర్వహించేందుకు జర్మనీ సిద్దమవుతుంది.

పసుపు వల్ల ఇన్ని అద్భుతమైన లాభాలా!

పసుపు చేసే మేలు మరేది చెయ్యదు ఇది నిజం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అయితే గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉంటె పసుపు వాడద్దని సూచించారు. ముఖ్యంగా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు వాడకూడ దని  వైద్యులు తెలిపారు. చాలా రకాల మూలికలను కూరలో వాడతామని, అదీ ముఖ్యంగా తాజాగా పచ్చిగా ఉన్నవి మాత్రమే వాడడానికి ఇష్టపడతామని శరీరానికి ఆయుర్వేదం చాలా శక్తి వంతమైన  వైద్యాన్ని అందిస్తుందని వాటిని ప్రతిరోజూ వాడితే మరిన్నిలాబాలు ఉంటాయని... ముఖ్యంగా మనజీవన శైలిని మారుస్తుందని అందులో భాగమే తాజా పసుపు కొమ్ములు వేళ్ళు వాడతారని ముఖ్యంగా పోడిరూపంలో వాడడం అన్ని విధాలా శ్రేయస్కరమని ఆయుర్వేద వైద్యులు విశ్లేషించారు. ఇది చూడడానికి అల్లంలా కనిపిస్తుందని అయితే అది అల్లం కాదని వైద్యులు వివరించారు. తాజా పసుపు కొమ్ములు బంగారంతో సమానమని చెప్పాలి. బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే దెబ్బకి జలుబు పోతుందని ప్రజల విశ్వాసం. పసుపు భారతీయ జీవితంలో ముడిపడి ఉన్నదని ఇంట్లో శుభకార్యానికి పూజా పునస్కారానికి శుక్రవారం గడపకు పసుపు పూయడంలో ఇటికి లక్ష్మి దేవి వస్తుందని, ఇది క్రిములు ఇతర గాలులు రాకుండా అడ్డుకుంటుందని నమ్మకం. అయితే 5 ౦ ౦ ౦ సంవత్సరాలుగా ఆయుర్వేదంలో పసుపు  ఔషదంగా  వాడుతున్నారంటే మనం ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదని సాంప్రదాయ వైద్యులు స్పష్టం చేసారు. ముఖ్యంగా శరీరానికి గాయం అయినప్పుడు గాయాన్ని రక్త స్రావాన్ని తగ్గించడం గాయం ఇంన్ఫెక్ట్ కాకుండా పసుపు వాడడాన్ని మనం చూస్తాం. స్య్హ్రీలు ముఖ్యంగా ముఖానికి వాడే సౌందర్య సాధనాలలో ఒకటి పసుపే అని అంటున్నారు వైద్యులు. సాంప్రదాయ పెళ్ళిలలో బ్యూటీ పార్లర్లు లేనపుడు పెళ్లి కూతురు పెళ్లి కోడును చేయడానికి ముఖవచ్చస్సు పెంచే సౌందర్య సాధనం పసుపే అని అంటున్నారు సంప్రాదాయవైద్యులు. స్త్రీల కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే పసుపు శరీరాన్ని మృదువుగా ఉంచేది పసుపు మాత్రమే అని పరిసోదనలు చెపుతున్నాయి. ప్రతి రోజూ ఆహారంలో తప్పకుండా పసుపు వాడడం అవసరం. కూరల్లో రుచికోసం మాత్రమే కాదు పసుపు శరీరంలోపల ఉండే ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. థెరఫీలో క్యాప్సుల్ సప్లిమెంట్‌గా స్పైస్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా మనలను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచేది పసుపు మాత్రమే. ముఖ్యంగా శరీరంలో వచ్చే ఎక్షిమా, సోరియాసిస్, ఆస్తమా, ఆర్తరైటిస్, ఆస్టియో అర్త రైటీస్, కోలైటిస్, నివారణకు పసుపు వాడతారు. ముఖ్యంగా మనకు తెలియని మరో రహాస్యం రక్త శుద్ధికి పసుపు నూటికీ నూరు శాతం దోహదం  చేస్తుంది. మూసుకు పోయిన రక్తనాళాలను తిరిగి ప్రభావవంతంగా పనిచేసేది పసుపు మాత్రమే అని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు. యాంటి ఎలర్జీగ పనిచేస్తుందని,లివర్ గాల్,బ్లాడర్, పని తీరును మెరుగు పరుస్తుందని అంటున్నారు. పొట్ట క్రింది భాగంలో ఏర్పడే మ్యుకస్ ను తగ్గించే గుణం పసుపుకు ఉందని అంటున్నారు వైద్యులు. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలకు పరిష్కారం పసుపే అని అంటున్నారు వైద్యులు. పసుపుకు మరో పేరు హరిద్రా. గాయానికి చక్కని మందు హరిద్రా అయితే గాయాన్ని పూర్తిగా శుబ్రం చేసిన తరువాత మాత్రమే పసుపు వాడాలని సూచించారు. అయితే గాల్ బ్లాడర్‌లో వచ్చే స్టోన్స్ కు పసుపు వాడరాదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరించారు. పసుపు చక్కని హీలింగ్ హెర్బ్ అని చెప్పుకోక తప్పదు.

2030 క్యాన్సర్ లేకుండా చేద్దాం...

ప్రపచంలో సంవత్సరానికి 1 ౦ , ౦ ౦ ౦ మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ ఐ వి, ఎయిడ్స్, మలేరియా, ఉబ్బసం కన్న 6 ౦ % ఎక్కువేఅని ఇవన్నీ కలిపినా మరణాల శాతం ఎక్కువేఅని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది. 2 ౦ 3 ౦ నాటికీ క్యాన్సర్ మరణాలు 1 3 మిలియన్లు చేరవచ్చని అంచనావేసింది. వైద్య రంగంలో క్యాన్సర్ పై ఎన్నో పరిసోదనలు, కొత్త మందులు మరెన్నో పరిసోదనలు, క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలు శాస్త్రీయ అవగాహన కలిగిఉన్నమని అన్నారు. అసలు క్యాన్సర్ కు ఉన్న ప్రమాదం లేదారిస్క్  కొన్నికారణాలు యదార్ధాలు, గుర్తించడం చికిత్స సంరక్షణ విజయం సాధించినప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు యునైటెడ్ నేషన్స్ , డబ్ల్యు హెచ్ ఓ యు ఎన్ సంస్థలు క్యాన్సర్ గురించి మాట్లాడం హార్శనీయమని అన్నారు. నాయకులూ మాట్లాడుతున్నారని క్యాన్సర్ నివారణలో సమస్యలు ఎదుర్కుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచాన్ని క్యాన్సర్ రహితంగా తాయారు చేయాలన్న సంకల్పాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. 6 5%క్యాన్సర్  మరణాలు అభివృద్ధి చెందిన దేశాలలోనే జరుగు తున్నాయని అధిక ఆదాయం వున్న దేశాలలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్కువా ఆదాయం ఉన్నవారు, వలస వచ్చినవారు, నిరాశ్రయులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రూరల్ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ  సూచించింది. క్యాన్సర్ నివారణ , క్యాన్సర్కు గల కారణాలు గుర్తించడం చికిత్స, సంరక్షణ, క్యాన్సర్ బారిన పడకుండా రక్షించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ప్రజలు, రాజకీయనాయకులు, విద్యావంతులు క్యాసర్ పై అవగాహన పెంచుకున్నారని, క్యాన్సర్ పట్ల భయం, తగ్గించాలని కొన్ని రకాల మూడ నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా మనదేఅని డబ్ల్యు హెచ్ ఓ తమవిధానాలను వెల్లడించింది. ప్రజల ప్రవర్తన వైఖరిలో  మార్పు తీసుకు రావాల్సిన అవసరాన్ని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ఇందు కోసం కొన్ని సంవత్సరాలుగా యు ఐ సి సి యూనియన్ ఫర్ ఇంటర్ నేషనల్ క్యాన్సర్  కంట్రోల్ సంస్థ ప్రపచంలో క్యాసర్ అత్యంత భారంగా మారకముందే ప్రపంచ ఆరోగ్యం పై  అభివృద్ధి తమ లక్ష్యంగా డబ్ల్యు హెచ్ ఓ నిర్దేశించుకుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో తమ బాధ్యతగా గుర్తించాలని తమ విధానాలను జాతీయ విధానాలుగా రూపొందించుకోవాలని పరిసోదనలకోసం నిధుల విదుల చేయడం,అవసరమైనచట్టం రూపొందించాలని డబ్ల్యు హెచ్ ఓ  నిర్దేశించింది. ఫిబ్రవరి 4 న నిర్వహించే  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం  రోజున సదస్సులు, రోగులసేవలలో మరింత వృద్ధి, అవగాహనా కోసం ప్రజలసమీకరణ అందరినీ భాగస్వాములను చేయడం అత్యవసరమని సంస్థ భావించింది.

సంగీతం వినండి.. ఆరోగ్యంగా వుండండి...

సర్జరీ అంటేనే ఏమౌతుందో అన్నఒక భయంతో కూడిన ఒత్తిడికి  గురి అవుతారు రోగులు. ఇంక గుండెకే సర్జరీ అంటే ఎంక్సైటీ శస్త్ర చికిత్స తరువాత వచ్చే నొప్పి నివారణకు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసేందుకు నెదర్లండ్స్ కు చెందిన వైద్య బృందం శస్త్ర చికిత్స సమయంలో సంగీతాన్ని వినడం ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని తెలిపారు. అయితే శస్త్ర  చికిత్స చేసే సర్జన్లుకు ఎన్నోప్రస్నలు తలెత్తాయి. ఇన్విసివ్ శస్త్ర చిక్త్సలో గుండెను తెరవాల్సి ఉంది. లేదా గుండె పనిచేయడం నిలిపివేయాల్సి ఉంటుందని ఇందుకోసం హార్ట్,లంగ్,గుండె ఊపిరి తిత్తులు, మెషిన్ ను వినియోగిస్తారని , దీనిని గుండెకు అమర్చడం ద్వారా మరలా రోగి కి పునర్జీవితం వస్తుందన్నారు. కార్డియో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ హెరాల్డ్  ఫెర్నాన్డేజ్. కార్దియోక్ సర్జన్ ఈవిషయంపై అనేక పరిసోదనలు చేసారు. ఈ పద్దతులవల్ల ఎం క్సైటి,నొప్పి తగ్గించాగలిగామన్నారు . ఈ పరిశోదన గురించి 25 జనవరి ఓపెన్ హార్ట్ ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు. డచ్ కు చెందిన బృందం 16 మంది పై చేసిన పరిసోదనలో సంగీతం వినడం ద్వారా వచ్చేలాభం పోస్ట్ ఆపరేటివ్ కేర్‌లోను 1౦,౦౦౦  మంది పై పరిసోదించారు. దాదాపు 9౦% పద్దతులు కరోనరీ ఆర్ట్ట్రీ, బై పాస్, గ్రాఫ్ట్, హ్రుదాయకవాటం, మార్పిడి సంగీతం వినడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉన్నారని... వారికి ఏ సంగీతం కావాలో అదే వినిపించేవారని వేల్యు  ఏ టెడ్  విధానం ద్వారా స్కోరింగ్ సిస్టంతో రోగులలో ఎన్ క్సయిటీ పెయిన్ నుకోలిచినట్టు తెలిపారు . సంగీతం పై జరిపిన పరిసోదనలో రోగులలో ఎంక్సైటీ, పెయిన్, మేజర్ హార్ట్ సర్జరీ తరువాత  తగ్గిందని చాలారోజులు సంగీత వినడం వల్ల ఎనిమిది రోజులలో తగ్గిందని అన్నారు. అయితే ఈమధ్య కాలంలో వింటున్న మ్యూజిక్ తెరఫి  కొన్ని సందర్భాలలో అసహనానికి గురిచేసిందని దీనిప్రభావం పెద్దగా లేదని  డాక్టర్ల బృందం ఆభిప్రాయపడింది.

2030 నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యం

2030 నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం అని కుష్టు వ్యాధి నివారణ గుడ్విల్ అంబాసిడర్ యోహీ ససకావా అన్నారు. ప్రతియేటా జనవరి 30 న జరుపుకునే కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ససకావా మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కోవిడ్ 19  ప్రధాన అంశంగా మారిందని, ప్రపంచం ఇతర సమస్యలను నిర్లక్ష్యం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కుష్టు వ్యాది పట్ల నిర్లక్ష్యం వహించామన్నారు. ఈ వ్యాధిపై శ్రద్ధ అవసరమని ఇప్పటికే 2,00,000 కేసులు గుర్తించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు అంగవైకల్యానికి గురి అవుతున్నారని కుష్టు వ్యాధి వల్ల ముప్పులేదని కాని సామాజికంగా బహిష్కరణకు గురికావడం వెలివేయడం దురద్రుష్టకరమని అన్నారు. ఇంకా వివక్ష కోనసాగడాన్ని ససకావా తప్పు పట్టారు. ఇంకా చాలా దేశాలలో చట్టాలు అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. కుష్టు వ్యాధి గ్రస్తులు విడాకులు తీసుకుంటున్నారని.. ఈ వ్యాధి నుంచి నివారణ అవసరమని సామాన్య జన జీవన స్రవంతిలో కలకపోవడం, వీరిపై ఇంకా నియంత్రణ కొనసాగడం బాధాకరమని యోహీ వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధిని ప్రపంచం నుండి శాశ్వతంగా నిర్మూలించడానికి వ్యక్తుల మధ్య హద్దులు చెరిపెయ్యాలని దీని వల్ల కుష్టు వ్యాధి బారినపడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలు సామాజికంగా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యోహీ ఆవేదన వ్యక్తం చేసారు . కుష్టు నివారణకు తక్షణం గుర్తించడం సరైన చికిత్స మాత్రమే కాదని సామజిక మార్పు అవసరమని అన్నారు. కుష్టువ్యాది గ్రస్తుల పట్ల ఈవిధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. కుష్టు వ్యాధి బారిన పడ్డ వారి పట్ల వారి కుటుంబం పట్ల వివక్ష చూపరాదని, వారూ గౌరవ ప్రదంగా జీవించే హక్కు ఉందని అన్నారు. ఇతర వ్యాధులతో పోలిస్తే కుష్టు వ్యాధి బాధితులు తక్కువే అన్నారు. 2030 నాటికి కుష్టు వ్యాధిని ప్రపంచం నుండి తరిమెయ్యాలన్నదే డబ్లు హెచ్ ఓ లక్ష్యమని యోహీ ససకావా పిలుపునిచ్చారు.

పచ్చి కూరగాయలు, పండ్లు తింటే సంపూర్ణ ఆరోగ్యం

పచ్చి కూరగాయలు, పండ్లు తింటే సంపూర్ణ ఆరోగ్యంతోపాటు శరీరం దృఢంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు పరిశోధించారు. ఈమేరకు 1930 నాటి నుంచి అంటే దాదాపు 55 సంవత్సరాలు పచ్చి కూరగాయలు, పండ్లు భుజిస్తున్న మానవులపై అనేక పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ ఎడ్వర్డ్ హొవెల్ తెలిపారు. పచ్చికూరగాయలు, పండ్లు తీసుకునే వారు, వండిన కూరాగాయలు తీసుకున్న వారిలో వ్యత్యాసం గమనించినట్లు తెలిపారు. పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నట్లు వివరించారు. పచ్చి కూరాగాయలు, పండ్లు తినడం వల్ల ఆక్సీజనేషన్, హైడ్రేషన్ వంటి లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. శక్తి పెరిగి అనారోగ్యం, వ్యాధులు ఉండవని స్పష్టం చేసారు. పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరంలో వచ్చే అల్కలైన్ ను సమానంగా ఉంచుతుందని. పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా మనదేశంలో మునులు, తపుస్సు చేసే ఋషులు సుదీర్ఘకాలం పాటు ఎలా జీవించి ఉండగలిగారన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. పూర్వకాలంలో ఋషులు మునులు ఆద్యాత్మిక సాధన తపస్సు తోపాటు వ్యతిరేక భిన్నమైన వాతావరణంలో సైతం ఎలా జీవించారన్నది ప్రశ్నార్థకమే అని అన్నారు. వారి సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక బలానికి, దృఢత్వానికి గల ఆ రహస్యం ఏమిటి? అన్నది సందేహం ఇదేనా అని అంటున్నారు నిపుణులు. ఎన్నోరకాల సవాళ్ళను అధిగమించి జీవించడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఆధునిక సమాజంలో మనం బ్లూ జోన్స్ లో నివసిస్తున్న వారు ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు, 100 సంవత్సరాలు జీవించడం అంత సులభం కాదని శాస్త్రజ్ఞులు ఆభిప్రాయపడ్డారు. అయితే వారు నిత్యం ప్రతిరోజూ పచ్చికూరగాయలు,పండ్లు తమ ఆహారంలో భాగంగా మారిపోయిందని నిపుణులు విశ్లేషించారు. ఇందుకు ఉదాహరణగా ఇండోనేషియా అడవుల్లో జీవించే మానవులకు అత్యంత సన్నిహితమైన సంతతికి చెందిన ఒరాంగుటాన్ రోబుస్ట్ లో 99 % డిఎన్ఎ సహజంగా ఉంటుందని, శాస్త్రజ్ఞులు పరీక్షించినట్లు తెలుస్తోంది. ఒరాంగుటాన్ ను ముందు నుంచి పరిశీలించినప్పుడు అవి ఇతర అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కోలేదని అన్నారు. అయితే మానవులు మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని నిపుణులు వ్యాఖ్యానించడం విశేషం. అద్భుతం ఏమిటి అంటే ఒరాంగ్ టాన్ తో సమానంగా పచ్చి కూరలు, పచ్చి పండ్లు తింటున్నారని పేర్కొన్నారు. దీనివల్ల తెలిసిన నిజం ఏమిటి అంటే మానవులు పచ్చి కూరగాయలు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. పచ్చికూరగాయలు, పచ్చిఫలాలలో 10,000 రకాల న్యూట్రిషియన్లు లభిస్తాయని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వివరించారు.

ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. సహాజంగా మన ఎముకలు బలహీనంగా ఉంటాయి. అయితే వయస్సుతో సంబంధం లేకుండా మన జీవితంతో కలిసి జీవిస్తాయి. మళ్ళీ నిర్మితం అవుతూ ఉంటాయి. వయస్సు తగ్గుతున్నకొద్దీ  మీరు మీ కాల్షియం బ్యాంకు నుంచి కొంత శక్తిని పొందవచ్చు. ఈ సమస్యను ఒస్టియో ప్రోరోసిస్ అంటారు. ఇది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత, కాల్షియం లోపం వల్ల వస్తుంది. ప్రోరోసిస్ సమస్యను సులభంగా నివారించవచ్చు. ఎముకల చివర వచ్చే సమస్యకు వయస్సుతో సంబంధంలేదు. ఎముకలకు, కండరాలకు ఉండే టిష్యూ మరలా పునర్నిర్మిస్తుంది. ఈ సమస్య ప్రధానంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వస్తుంది. శరీరంలో అప్పటికే నిల్వ ఉన్న శక్తిని వయస్సు పెరిగే కొద్ది తిరిగి పొందవచ్చు. ఏ వయస్సులో ఐనా ఎముకలలో శక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి కాల్షియం అవసరమని నిపుణులు తేల్చారు.   సహాజంగా అమెరికన్లు మినరల్స్ ఎక్కువగా పొందలేని కారణంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండవు. కాల్షియం మాత్రమే ఎముకలను బలంగా ఉంచుతుంది.  మీ శరీరంలో కాల్షియం శాతం తగ్గినట్లయితే మీ శరీరం నుంచే మళ్ళీ తీసుకుంటుంది. శరీరంలో ఎక్కువగా కాల్షియం తగ్గితే ఒస్టియో ప్రోరోసిస్ సమస్యలు వస్తాయి. దీనివల్ల మీ ఎముకలు విరిగిపోవడం, ఎముకలలో ఉండే రాపిడికి రజను రాలిపోడం సంభవిస్తుంది. మీకు 50 సంవత్సరాలు వచ్చాయా.. మీరు ప్రతిరోజూ 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలా కాల్షియం తీసుకోడం వల్ల ఎముకలకు జరిగే నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు. పాలు, తమలపాకులో వేసే సున్నం కాల్షియం ఇస్తుంది. విటమిన్ సి కాల్షియం పెంచవచ్చు అంటున్నారు. 18-19 సంవత్సరాల వయస్సులో ఉండే వారికీ కొంత కాల్షియం నిల్వ ఉంటుంది.  ఒకకప్పు పెరుగు- లేదా మీగడ, ఉడికించిన బీన్స్, విటమిన్ డి మందులు, చేపలు, ఆవుపాలు, బాదం, సోయా, ఓట్స్ , గుడ్లు , పోర్క్ , దీనితోపాటు వ్యాయామం చేయడం వల్ల ఎముక్సలు మరింత బలంగా ఉంటాయి.  పెద్దవాళ్ళు ఎవరైతే వర్క్ అవుట్ చేస్తారో బోన్ లాస్ ను నివారించవచ్చు. 30లో ఎముకల వ్యాయామం చేయడం వల్ల మజిల్ నిర్మితమౌతుంది. ఎముకలలో డి విటమిన్ పెరుగుతుంది. ఉత్తమ వ్యాయామం ఎముకలను నిర్మిస్తుంది. రన్నింగ్, నడక , నృత్యం, మెట్లు ఎక్కడం దిగడం , ఎముకలలో బలాన్ని పెంచుతుంది . జాగింగ్ వల్ల ఎముకలు గట్టిపడతాయి. కాళ్ళలో, పాదాలలో ఎముకలు గట్టి పడతాయి. చేతులలో ఎముకలు గట్టి పడాలంటే పుషప్స్, రోవింగ్, రెసిస్టెంట్ట్ బ్యాండ్స్ వాడవచ్చు. అయితే పొగ తాగడం మానివేయాలి.  అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఒస్టియో ప్రోరోసిస్ సమస్యతో బాధపడుతున్నారు. నికోటిన్ ఇతర రసాయనాలు పొగాకు, ఎముకలలో నిర్మాణ గతిని తగ్గిస్తాయి. మీ ఎముకలకు రక్తప్రసారాన్ని తగ్గిస్తాయి. ఎముకలు బలహీన పడడం వల్ల వెన్నెముకలో రక్తప్రసారం తగ్గుతుంది. సాఫ్ట్ డ్రింక్స్, కుకీలు, ఇతర ప్రాసేసుడ్ ఫుడ్స్ లో చాలా చక్కెర ఉంటుంది. చక్కర మీ ఎముకలలో ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. కాల్షియం మెగ్నీషియం ఎక్కించుకోవాల్సి వస్తుంది. పేగులలో కాల్షియం తగ్గించుకోవాలి. ఆహారంలో న్యుట్రీషియన్స్ మార్చాలి. మీరు తీసుకునే మద్యం వల్ల ఎముకల వృద్ధి మందగిస్తుంది. ఈ సమస్య మరింత ముదిరితే ఆస్టియో బ్లాస్ట్ వల్ల ఎముకలు విరిగిపోతాయి. వెజిటేరియన్ ప్రోటీన్లు నిమ్మ, బత్తాయి రసం, సంత్రా రసం, ఆకుకూరలు న్యూట్రిషియన్స్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ద్రాక్షపళ్ళు, సిట్రస్, విటమిన్ సి, ఎముకలలో బలాన్ని పెంచుతాయి. చేపలు, బ్రెడ్ సాండ్ విచ్, పాలు, కొబ్బరిపాలు తదితరాలు తీసుకుంటే మీ ఎముకలు బలంగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు.  

Tips to fitter and healthier…

Food Check Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s. Fitness Check Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime... No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit.  Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts,  This keeps your workout fun and your mind motivated. Take care, Stay Healthy!!!! -Sandya Koya

పౌష్టికాహార లోపం.. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం 

నేడు ప్రపంచంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు విస్తరిస్తున్నాయి. డీజనరేటివ్ డిసీజెస్ లో ముఖ్యమైనవి హృద్రోగ సమస్యలు, డయాబెటీస్. 1960 లో ఈ అంశాలపై జరిపిన పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో ఒక శాతం మాత్రమే డయాబెటీస్ తో బాధ పడుతున్నారని పేర్కొన్నారు. డయాబెటీస్ ఇప్పుడు 20 నుంచి 30 శాతానికి చేరుకుంది. డయాబెటీస్ వచ్చే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో ఉంటుందని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాలలో నివసిస్తున్న 40% ప్రజలు హై బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాలలో ఉండే మరో 30% మంది ప్రజలు ఊబకాయం సమస్యలతో బాధ పడుతున్నారని, దీని వల్ల వారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు దురదృష్టం కొద్దీ ఈమధ్య కాలంలో పాండమిక్ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కరోనా మొదటి విడత రెండవ విడత ప్రజలను మరింత భయానికి గురి చేసింది. చాలా మంది యువతీ యువకులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురి అయినట్లు, అందులో తమకూ కరోనా వచ్చిందన్న భయంతో చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాలలో ముఖ్యంగా కౌమారదశలో ఉండే పిల్లలలోను డయాబెటీస్ తో బాధపడుతున్నవారు 70% మంది ఉన్నట్లు, ఇందులో స్త్రీ పురుషులు ఉండటం గమనార్హం. ఇందులో అయితే సాధారణ, అతిసాధారణమైన పౌష్టిక ఆహారం లోపంతో పాటు హార్మోన్ లోపాలు, అనీమియా సమస్యలు అంటే రక్తహీనత వంటి సమస్యలతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు గ్యాస్ట్రో సమస్యలు, పెద్దపేగు చిన్నపేగుకు సంబందించిన సమస్యలతో బాధ పడడం సహజమని ప్రచురణలో పేర్కొన్నారు. అనారోగ్యం నాణ్యమైన జీవితాన్ని తగ్గించడమే కాదు, ఆర్ధిక సమస్యలు సృష్టించడంతో పెనుభారంగా మారుతోంది. గతంలో ఉన్న సమస్యలకు తోడు పాండమిక్స్ తో పాటు పౌష్టికాహార లోపం మరిన్ని ఆనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయని తేల్చి చెప్పారు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న ఆనారోగ్య సమస్యలకు కారణం పౌష్టికాహార లోపం. అందువల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుందని, ఇవే దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మ్యాక్స్ జరసం పేర్కొన్నాడు.

భారత్ లో 63 మిలియన్ల ప్రజలకు చెవిటి సమస్యలు!!

భారత్ లో 63 మిలియన్ల ప్రజలు చెవిటి సమస్యలతో బాధపడుతున్నారు. చెవుడు ప్రధానమైన సమస్య వయస్సు వల్లేనని, అనుకోకుండా రావడం లేదా నెమ్మదిగా వినికిడి శక్తి తగ్గుతూ ఉంటుందని అంచనా. కొందరిలో దీనికి భిన్నంగాను ఉండవచ్చు. అయితే దీనిని నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపై పూర్తిగా చెవిటి వారిగా ఉండకుండా వినికిడి సమస్యనుండి బయటపడవచ్చునని, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వినికిడి సమస్య  నివారణతో పాటు వినికిడి శక్తిని పెంపొందించుకోవచ్చని అంటున్నారు. వినికిడి సమస్య చాలా తీవ్రమైనదిగా చెప్పవచ్చు. ఇది ఇతర అనారోగ్యసమస్యలకు దారి తీస్తుందని వైద్యులు పేర్కొన్నారు. వినికిడి సమస్యవల్ల చదువుపై శ్రద్ధ తగ్గడం, ఒత్తిడికి గురికావడం, సామాజికంగా వెనుకబడ్డామన్న ఆత్మన్యూనతా భావానికి గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. తక్కువ వినపడటం, కొన్ని శబ్దాలు వినపడకపోవడం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అర్ధం కాకపోవడం వల్ల వినికిడి లోపం ఉన్నట్లు గమనించవచ్చు. ఇతరులతో పూర్తిగా చెప్పలేకపోవడం, సంబంధబాంధవ్యాలు తగ్గిపోవడం, ఇతరులతో కలిసేందుకు ఇష్ట పడకపోవడం వంటి అంశాలు వేధిస్తాయి. దీని ప్రభావం నిత్యజీవితంపై చూపిస్తుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఫ్రస్టేషన్ వంటిసమస్యలు ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గమనించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వినికిడి సమస్యతో భార్యా భర్తలు  దాంపత్య జీవితానికి సైతం దూరంగా ఉండాల్సి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే మీ చెవికే ప్రమాదం ఏర్పడవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వినికిడి సమస్యను గుర్తించండి.. వినికిడి శక్తిని పెంచుకోండి. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన తరువాత ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు అందులోబాటులో ఉన్నాయి. సమస్య ఏదైనా సకాలంలో గుర్తించడం ముఖ్యం. చికిత్స తీసుకోవడం అత్యవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.

టైప్ 2 డయాబెటిస్ రోగులు రోసి గ్లిటజోన్ వాడటం ప్రమాదకరం

టైప్ 2 డయాబెటిస్ రోగులు తీసుకునే రోసి గ్లిటజోన్ వాడకం వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తాయి. రోసి గ్లిటజోన్ మందు టైపు 2 డయాబెటిస్ కోసం తయారు చేసిన మందుగా వైద్యులు పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం 1999 లో అనుమతించింది. యూరప్ ఈ మందును సస్పెండ్ చేసింది. ఈ మందు వాడకం వల్ల గుండెపై ప్రభావం పడుతుందన్న కారణం చేత వాడకాన్ని తగ్గించింది. ఈ మందు వాడకంపై ఇప్పటికే బిఎంజే  పరిశోధనలు ప్రారంభించింది. ఈ మందు అత్యంత ప్రమాదకరమని 43 % హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీస్తుందని 2007 లో వెలువరించింది. 2010 లో యూరప్ నిషేదించింది. మనం వాడే మందులు సరైనవో కాదో  కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.. లేదంటే ముప్పేనని అంటున్నారు వైద్యులు. 

నిద్రలేమి సమస్య గుండె జబ్బుకి దారితీస్తుంది

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? సమస్య తీవ్రమైతే మీ గుండెకి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి నిద్ర పోవడం కొందరికి సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొందరు పుస్తకాలను, మరికొంతమంది కంప్యూటర్ ను, కొంతమంది సెల్ ఫోన్లలను ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అలా నిద్రలేని రాత్రులు గడిపేవాళ్లకు గుండె జబ్బు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి- గుండెజబ్బు వంటి అంశాలపైన పరిశోధనలు జరిపిన వైద్యులు ఒక రిపోర్టును అందించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారని అన్నారు. 50% గుండె సమస్యలకు, గుండె నొప్పికి నిద్రలేమి సమస్యలే కారణమని వెల్లడించారు. అమెరికన్ హార్ట్ జనరల్ ప్రచురించిన జర్నల్లో గుండె నెప్పి తర్వాత నిద్రలేమి వల్ల వచ్చేసమస్యలు అత్యధికమని పేర్కొన్నారు. నిద్రలేమి సమస్య వల్ల ఊపిరి ఆగిపోవడం దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. నాలుక లేదా గొంతు వద్ద శ్వాస నాలం పూడుకు పోతుందని వివరించారు. దీనివల్ల శ్వాస ప్రసరణలో మార్పులు వస్తాయని, కొందరు వ్యక్తులకు గురక వస్తుందని ఇది నిద్రలేమికి కారణంగా పరిశోధనలో తేలిందని వివరించారు. కొన్ని సెకండ్లలో 70% మందికి గుండె నొప్పికి కారణంగా తేల్చారు. గురక, లేదా శ్వాస ఆగిపోవడం  కొన్నిసెకండ్ల పాటు ఉంటుందని పేర్కొన్నారు. శ్వాస ఆడక నిద్రలేమి సమస్యకు కారణంగా చెప్పవచ్చు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తో తీవ్రంగా బాధ పడుతున్న వారు గంటకు 30 కంటే ఎక్కువ సార్లు నిద్రాభంగం కలిగినప్పుడు దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని  డాక్టర్ సందీప్ కోట్ విశ్లేషించారు. సరైన నిద్రతో మరల శక్తిమంతులుగా మారవచ్చని, శ్వాసలో పెనుమార్పులు రావడం వల్ల శరీర ఆకృతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా రక్త ప్రసారంలో ఒత్తిడి పెరగడం గమనించవచ్చని డాక్టర్ సందీప్ కోట్ తెలిపారు. దీనివల్ల హై బీపీ, పెరుగుతుందని దీనివల్లే నిద్రలేమి గుండె సమస్యలు విషయం కొందరు గుర్తించరని, బీపీ వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయం గ్రహించాలన్నారు. స్థూల కాయం  నిద్రలేమి ఒకదానికొకటి ముడిపడి ఉందని ఈ రెండు సమస్యలు  ఉన్నవారిలో గుండె సమస్య తప్పకుండా ఉంటుందని విశ్లేషించారు.

Influence Of Daily Life Habits

Eating healthy, appreciating life, understanding true happiness and living well is a bigger issue than your waistline or looks - poor habits can also take a toll on your careers, claim few studies. When we eat well, take in proper nutrients and stay active, we are making the choice not only to ensure our long-term health, but also to impact our long-term success in the workplace. Simple changes can impact productivity at your workplace. 1. Whether it is a small choice between a fruit like banana and a bag of chips, or a larger lifestyle shift such as wiping out processed foods from your diet, it is important to start living a healthy lifestyle today. 2. There are seven differently coloured fruit and vegetable families. Each family contains different antioxidants, which is why it’s important to include a variety of colours. Aim for at least one portion each of red, purple, dark green, light green, yellow, orange and white fruit and vegetables every two days. 3. One handful of nuts a day is all it takes to slash your risk of heart disease and potentially add three years to your life, say American researchers. Nuts are packed with heart-healthy fats, plus loads of selenium - vital for all – round good health ,say nutritionists. Avoid buying chips, junk food and sodas during work hours and stuffing yourself with too many teas or coffees. 4. Never allow yourself to get past 11 on the hunger scale (which goes from 1 to 20) before eating. If you get too hungry, you’ll end up bingeing on fatty ,sugary foods for instant energy. Eating at regular intervals with not more than 3 hours gap may help boosting your metabolism. 5. Five portions of fruit and vegetables is the minimum you need each day for good health. Fruit and vegetables are packed with substances called antioxidants, which reduce the risk of serious illnesses such as cancer and heart disease. Antioxidants also help fight common infections. Try for three servings of vegetables and two of fruit, as vegetables have more fibre and less sugar. 6. Water helps your body with physical and mental performance, detoxification and digestion. Keep a water bottle at your desk and you’ll find it much easier to drink the recommended water each day as per your body and lifestyle needs. It will ease stress and result in sustained energy throughout the day. You can also supplement it with fresh lemonade and coconut water, etc, to avoid monotony. 7. Give yourself several reasons to take a break and move around after every 40 minutes at your workplace. Simply getting up and moving around for a few moments can keep you focused, less fatigued and feeling better. 8. Get down from your vehicle a few blocks before your office and walk the remaining distance use staircase more frequently than the lift to lead a more active lifestyle. 9. People who work at desks often face stress, back and joint pains and weight gain problems at work. To get rid of such health problems, while sitting in your chair, flex your feet and circle your ankles, stretch your legs and arms as frequent as you can. 10. Thinking positively is the best way to train our brain, lacking in brain stimulation thoughts may cause brain shrinkage and impact our behavior and actions. Also sufficient sleep allows our brain to rest. Long term deprivation from sleep will accelerate the death of brain cells. Courtesy Glow with health welness solutions

ఈ సింపుల్ యోగ ముద్రలతో ఎన్నో రోగాలు అరికట్టవచ్చు...

  మానవ శరీరం లో ఉన్న ప్రతీ అవయవం చాల గొప్పది.. ఏది సరిగా పని చేయకపోయినా దాని ప్రభావం పూర్తిగా శరీరం పై పడుతుంది. కానీ ఒక్క అవయవం తో  మనం మానసిక స్థితిని, భౌతిక స్థితిని , ఆధ్యాత్మిక స్థితిని కూడా పొందవచ్చని మీకు తెలుసా..  అది ఎలా అంటారా మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్ళని కొన్ని భంగిమలలో పెట్టె ప్రక్రియని ముద్ర అంటారు. మరి ఆ ముద్రలలో రకాలు వాటి వాళ్ళ మనకి కలిగే ప్రయోజనాలు అవి ఎలా వేయాలో చూద్దాం.. 1.జ్ఞాన ముద్ర: ఈ జ్ఞాన ముద్ర వేయడం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది , నాలెడ్జి కూడా ఇంప్రూవ్ అవుతుంది ,ఇంకా మన జ్యపకశక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఈరోజుల్లో చాల మంది నిద్రలేమి తో బాధపడుతున్నారు. ఈ ముద్ర వేయడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. మరి ఈ ముద్ర వేయడం ఎలా అంటారా చాల సులభం. మనం బొటన వేలుని చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగిలిన మూడు వెళ్ళాను నిటారుగా నిలపడమే ఈ జ్ఞాన ముద్ర. ఇది మనం ఎపుడైనా వేయవచ్చు నిల్చున్నపుడు , కూర్చున్నపుడు , నిద్రపోయేటప్పుడు ఇలా ఎప్పుడైనా వేయవచ్చు 2.సూన్య ముద్ర: ఈ ముద్ర ని ఎలా వేయాలంటే మన మధ్య వేలుని బొటన వేలు తో ఒత్తి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టాలి ,ఇలా రోజుకి కనీసం నలభై నిమిషాలైనా చేస్తే మన శరీరంలో ఉన్న dullness అనేది లేకుండా పోతుంది ,చెవి నొప్పి లాంటి సమస్యలేమైనా ఉన్న కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు ఇంకా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర  బాగా  ఉపయోగపడుతుంది 3.ప్రాణ ముద్ర: ఈ ముద్ర ఎలా వేయాలంటే మన ఉంగరపు వేలుని ,చిటికెన వేలుని బొటనవేలికి టచ్ చేసి మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ ప్రాణ ముద్ర ,ఇది ఎప్పుడు ఐన వేయవచ్చు. ఇది వేయడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది , ఇంకా బద్దకాన్ని నివారిస్తుంది, ఇంకా మానసికంగా , శారీరకంగా దృఢం గ ఉండేలా చేస్తుంది ,ఇంకా మన కంటిచూపు మందగించడాన్ని మెరుగుపరుస్తుంది ,ఈ ముద్ర వేయడం వల్ల మనిషి చాల ఆక్టివ్ గ ఉంచేలా చేస్తుంది 4.ధ్యాన ముద్ర: ఇది ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని అరచేతులు పైకి వచ్చేలా మన ఒడిలో పెట్టుకుని రెండు బొటన వేళ్ళు మాత్రమే టచ్ అయేలా ఉంచాలి. దీన్ని కదలకుండా నిటారుగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంతసేపైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చిరాకు,డిప్రెషన్, స్ట్రెస్ లాంటి వాటినుండి చాల రిలీఫ్ ఉంటుంది. ఇది చాల పవర్ఫుల్ ముద్ర 5.బుద్ది ముద్ర: ఇది కూడా చాల ముఖ్యమైన ముద్ర మన చేతి బొటన వేలుని చిటికెన వేలితో కలిపి ఉంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ  బుద్ధి ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా , మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఇది  బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతని కోరుకునే ప్రతి ఒక్కరు  ఈ ముద్ర లు తప్పక  కంటిన్యూ చేయండి. 6.సూర్య ముద్ర: మన చేతి ఉంగరం వేలు ని బొటన వేలు కింద మడిచి పెట్టి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ సూర్య ముద్ర ఈ సూర్య ముద్ర వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఈ ముద్ర చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 7.ఆపాన ముద్ర: మన చేతి మధ్య వేలుని , ఉంగరం వేలుని బొటన వేలుతో కలిపి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ ఆపాన ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా మన శరీరంలోని  వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపిస్తుంది. 8.గణేష్ ముద్ర: మన రెండు చేతులను సగం పిడికిలి బిగించి ,రెండు చేతులను కలిపి బిగించి , మన ఛాతి భాగానికి పెట్టి నిటారుగా కూర్చుని ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేయడం వల్ల మన శరీర దారుఢ్యం చక్కగా ఉంచడానికి , మన కండరాల తీరు పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 9.వాయు ముద్ర: మన చేతిలో చూపుడు వేలుని మధ్యకి మడిచి బొటనవేలితో అదిమిపెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర ఈ ముద్ర ని వేయడం వల్ల మన శరీరం లో ఉన్న చేదు గాలి బయటికి వచ్చి మన కి ఉన్న నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు విపరీతమైన కీళ్ల, కండరాల నొప్పులను రాకుండా చేస్తుంది, ఇంకా మనం చిరాగ్గా అనిపించినపుడు కూడా ఈ ముద్ర వేస్తె ప్రశాంతంగా ఉంటాం.. https://www.youtube.com/watch?v=BFMHOO_XUE8  

మాంసాహారంతో గుండె సమస్యలు!  

ముక్క లేనిదే ముద్ద దిగదు.. కొందరికి రోజూ ఉంటే, కొందరికి  వారానికి  ఒక్కసారైనా నాన్ వెజ్ లేనిదే ఆ వారం గడవదు. సండే వచ్చిందా పిల్లలకి పెద్దలకి పండగే. సండే వస్తే నాన్ వెజ్ ఉండాలి. పుట్టినరోజు పార్టీకి నాన్ వెజ్ ఉండాలి. పండగ వచ్చిందా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొన్ని చోట్ల ఆయా సంప్రదాయాలు అలవాట్లని బట్టి నాన్ వెజ్ తప్పనిసరిగా వండుకుంటారు. ఇలా ప్రతి సారీ అవకాశం దొరికినప్పుడల్లా ఈదేవి, ఎగిరేవి, పాకేవి అనే తేడా లేకుండా.. పిట్ట మాంసం, జింక మాంసం, పంది మాంసం, కుందేలు మాంసం ఇలా దొరికిందల్లా మీ పొట్టలోకి తోసేస్తే కొవ్వుపెరిగి గుండెలో కొలెస్ట్రాల్ చేరి, రక్తనాళాలు మూసుకు పోయి స్టెంట్లు వేసుకోడం ఒకబాధ. అసలు గుండె నొప్పి వచ్చినట్టు కూడా తెలియకుండా మనిషిని తీసుకుపోయే హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కకోసం కాస్త కక్కుర్తి పడ్డారో గుండె లో సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చ్రరిస్తున్నారు.   మాంసాహారము తినే వారిలో కార్డియో వాస్క్యులర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియో వాస్క్యులర్  సమస్యలతోపాటు చనిపోయే అవకాశం ఉందని కార్డియో సర్జన్లు హెచ్చరిస్తున్నారు. అయితే చేపలు కొంత ప్రమాదం తక్కువే అని పేర్కొన్నారు .  మాంసాహారము తింటున్న వారిపై ఇటీవల జరిపిన పరిశోధనలో చికెన్ ఇతర మాంస పదార్ధాల వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వచ్చే అవకావం ఉందని సాచురేటెడ్ ఫాట్స్  ఉంటాయని కార్డియో సమస్యకు దారితీస్తాయని హృద్రోగనిపుణులు తెలిపారు. న్యూయార్క్ కు చెందిన కర్నాల్  విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఈ విషయం బయట పడిందని తెలిపారు.