తెలుగువన్ ఫౌండేషన్ అధ్వర్యంలో వైద్య శిబిరం
గత రెండు దశాబ్దాలుగా తాజా సినీ,రాజకీయ, సామాజిక వార్తా విశ్లేషణలను అందిస్తూ తెలుగు ప్రజలను ఆకట్టుకొన్న తెలుగువన్.కమ్ సంస్థ యాజమాన్యం ‘తెలుగువన్ ఫౌండేషన్’ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది. తెలుగు ఫౌండేషన్ ప్రతినిధులు, మణిపాల్ ఆసుపత్రి వైద్యనిపుణులతో కలిసి నాగాయలంక మండలంలో ఎదురుమొండి, నాచుగుంట గ్రామాలలో పర్యటించి వివిధ వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్యసేవలు అందించేందుకు వారి వివరాలు సేకరించింది. గ్రామస్తులలో ప్రధానంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళనొప్పులు, సీజనల్ జ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని మణిపాల్ ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం తెలిపారు. త్వరలోనే ఈ రెండు గ్రామాలలో ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులకు వైద్యం చేస్తామని తెలుగువన్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ కంఠమనేని రవిశంకర్ మరియు మణిపాల్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డా.రాజమోహన్ తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త వీవీ ఆర్. కృష్ణం రాజు, కృష్ణ మూర్తి, మణిపాల్ మార్కెటింగ్ హెడ్ ఉదయ కిరణ్, గ్రామ సర్పంచులు నాయుడు బాబురావు, సైకం నాగేశ్వర రావు తదితరులు ఈ బృందంలో ఉన్నారు.