మావోయిస్టులు వర్సెస్ పోలీసులు
posted on Mar 2, 2014 @ 10:49AM
పోలీసులు.. మావోయిస్టుల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టులపై పోలీసులు దాడిచేసి వారిని హతమార్చడంతో.. అందుకు ప్రతీకారంగా అన్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసు బృందంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.100 మంది మావోయిస్టులు పాల్గొన్న ఈ దాడిలో ఒక ఎస్.ఐ, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ వివేక్‌శుక్లాతో పాటు కానిస్టేబుళ్లు సందీప్‌సాహు, ఛవీలాల్ కాశి, ధనేశ్వర్ మండావి, నావల్‌కిషోర్ శాండిల్య అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టుబుళ్లు పుష్పేంద్ర కుమార్, పర్‌దేశీ రామ్, భగీరథీ మండావి గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ తరలించినట్లు అదనపు డీజీపీ (నక్సల్ ఆపరేషన్) ఆర్.కె. విజ్ తెలిపారు.