జాట్‌ల ఆందోళనలు ఉద్రిక్తం..ఎంపీ ఇంటిపై రాళ్లతో దాడి
posted on Feb 20, 2016 @ 12:06PM
ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. జాట్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హరియాణాలో జాట్ల ఆందోళనలు మరింత ఉద్రితంగా మారాయి. ఆందోళనలో భాగంగానే బీజేపీ ఎంపీ షైనీ నివాసంపై రాళ్లు రువ్వారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన నివాసంలో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు హజరయ్యారు. హరియాణాలోని భద్రతా ఏర్పాట్లపై వారితో చర్చించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హరియాణాలో 10 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. మరో 23 కంపెనీల బలగాలను కూడా కేంద్రం అక్కడకు పంపిస్తోంది.