కేన్సర్‌ను ఎదుర్కొనే టీకాలు మొదలయ్యాయి!

  ఎంతటి ఆరోగ్యవంతుడైన మనిషినైనా నిర్వీర్యం చేసి, విషమ స్థితిలోకి నెట్టివేసే రోగం కేన్సర్‌. ప్రాథమిక దశలో ఉన్న కేన్సర్‌ను నిర్మూలించడం సాధ్యమైన విషయమే అయినా, అందుకోసం చేసే చికిత్స, శరీరాన్ని నిస్సత్తువకు గురిచేస్తుంది. పైగా కొన్ని రకాల కేన్సర్‌ మళ్లీ మళ్లీ తిరగబెట్టే ప్రమాదమూ ఉంది. ఒకవేళ కేన్సర్‌ను కనుక ఆఖరి దశలో గుర్తిస్తే, దాని నుంచి కోలుకోవడం కష్టం కావచ్చు. అందుకనే ఎలాంటి ప్రతిచర్యలూ లేని కేన్సర్‌ చికిత్స కోసం సుదీర్ఘకాలంగా ప్రపంచం వేచి చూస్తోంది. ఇప్పుడు ఆ శుభసమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. లండన్‌లోని గయ్స్‌ ఆసుపత్రి, మనిషిలోని కేన్సర్‌ కణతుల మీద దాడి చేసే విధంగా ఒక టీకాను అమలుచేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టీకాను, ఎంపిక చేసిన కొందరు రోగులకు అందించడం మొదలుపెట్టారు. ట్రాన్స్‌స్క్రిప్టేస్ అనే ఒక ఎంజైము ఆధారంగా రూపొందించిన ఈ టీకాను రోగికి ఇచ్చినప్పుడు, అది విచ్చలవిడిగా పెరిగిపోతున్న కేన్సర్‌ కణాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేస్తుంది. భారతీయ సంతతికి చెందిన కేన్సర్‌ నిపుణుడు, హర్‌దేవ్‌ పండా కూడా ఈ ప్రయోగంలో ముఖ్యపాత్రను పోషించడం గమనార్హం.  

పరకాల ప్రభాకర్ ఎక్కడ..? ఏమైంది..?

  ఎప్పుడూ ఏదో ఒక విషయంపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి.. మీడియాతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఒక వ్యక్తి ఏపీ సర్కారు మీడియా అడ్వైజర్ గా ఉన్న పరకాల ప్రభాకర్ కొంత కాలం నుండి కనిపించడంలేదు.. దీంతో ఇప్పుడు అసలు పరకాలా ఎక్కడికి వెళ్లారు.. ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు తెలత్తుతున్నాయి. అయితే ఈయన అంతగా కనిపించకపోవడానికి గల పలు కారణాలు రాజకీయ వర్గాలు చెబుతున్నారు. గత ఏడాది రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు నోటు కేసుకు సంబంధించి మాట్లాడిన మాటల్లో తప్పు బాబు చేశారనే అర్దం వచ్చేలా కన్ఫ్యూజన్ లో ఇరికించారని బాబు ఆయన మీద కోప్పడ్డారట. అది అయిపోయిందంటే.. ఆ తరువాత జరిగిన గోదావరి పుష్కరాలకు సంబంధించి జరిగిన తప్పిదంలో.. ఏర్పాట్లు సరిగా చేయలేదని పరకాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారంట చంద్రబాబు. అంతేకాదు మీడియా సమావేశంలో కూడా విలేఖరులు ఏదో అడిగితే ఆయన మరేదో చెబుతుండటంతో…టీడీపీ ఇరుకున పడాల్సి వస్తుంది. దీంతో ఆయన్ను రాజకీయ పరమైన నిర్ణయాలకు దూరంగా ఉంచుతున్నారట చంద్రబాబు. అయితే ఇవన్నీ నిజమో కాదో తెలియదు కానీ.. పరకాల ప్రస్తుతం ఏదో అనారోగ్య సమస్య మీద ముంబై వెళ్లారని.. అక్కడ ఓ హాస్పిటల్లో చికిత్స చేయింటుకుంటున్నారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. మరి అది ఎంత వరకూ నిజమో తెలియదు. ఏది ఏమైనా ఒకవేళ నిజంగానే పరకాల ఆస్పత్రిలో ఉంటే తొందరగా కోలుకోవాలని కోరుకుందాం..

నేనేం చంద్రబాబు బినామీని కాదు..

  ఏపీ నూతన రాజధానిలో టీడీపీ నేతలకు భూములు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆపార్టీ నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై సినీ నటుడు.. టీజీపీ నేత మురళీ మోహన్ మాట్లాడుతూ.. మాపై జగన్ మీడియా లేనిపోని ఆరోపణలు చేస్తుందని..హాయ్ లాండ్ కొన్నానని లేనిపోని పుకార్లు సృష్టించార అని అన్నారు. నేను 1993 లో హైదరాబాద్ షిప్ట్ అయ్యాను.. అప్పటినుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను.. నా దగ్గర అపార్ట్ మెంట్లు కొన్నవారు హ్యాపీగా ఉన్నారు అని ఆయన తన గతాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు.. నేను చంద్రబాబుకి బినామీని కాదు అని ఆయన అన్నారు. పీజేఆర్, వైఎస్సార్ కూడా నా మీద ఆరోపణలు నిరూపించలేకపోయారు అని చెప్పారు. ఎన్నికలకు ముందే భూములు కొన్నాను.. ఇప్పటి వరకూ అనుమతులు రాలేదు.. అనుమతులు రాకముందే బురద చల్లుతున్నారు అని ఆరోపించారు.

తండ్రి హత్య విషయంలో నో కామెంట్స్ అంటున్న రాహుల్..

  ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా నేనున్నానంటూ వెంటనే అక్కడికి వెళ్లిపోతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. ఇక జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలు జరిగినప్పుడైతే చెప్పనవసరం లేదు.. ఆ యూనివర్శిటీల్లోకి వెళ్లి విద్యార్ధులకు మద్దతు పలికారు కూడా. రోహిత్ ఆత్మహత్య ఘటనలో రెండుసార్లు ఢిల్లీ నుండి వచ్చి మరీ దీక్షలో పాల్గొన్నారు. ఇక ఈ వ్యవహారంలో స్మృతీ ఇరానీపై కూడా ఆరోపణలు వస్తుండటంలో రాహుల్ రెచ్చిపోయారు. అయితే ఎవరో సామాన్య వ్యక్తుల కోసం ఇంతలా స్పందిస్తున్న రాహుల్ తన తండ్రి విషయంలో మాత్రం ఎందుకు నోరు తెరవడంలేదు అన్న సందేహాలు వస్తున్నాయి.   రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించాలని రాహుల్ ను కోరినప్పుడు మాత్రం నో కామెంట్ అని నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అంతేకాదు కొడుకుగా తాను ఈ విషయం మీద మాట్లాడలేనని చెప్పారు. దీంతో ఇప్పుడు కన్న తండ్రి వ్యవహారంలో మాట్లాడలేరు కానీ.. వేరే వ్యక్తుల విషయంలో మాత్రం మాట్లాడతారా అంటూ కామెంట్లు విసురుతున్నారు. అసలు ఎందుకు ఈ విషయంలో మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాహుల్ ఎందుకు మాట్లాడటంలేదో వివరణ ఇస్తే బావుంటుంది. 

సెల్ఫీ తీసుకోబోయి.... ఐదుగురికి తీవ్ర గాయాలు!

  సెల్ఫీల పిచ్చిలో ప్రాణాల మీదకు తెచ్చుకునే వార్తలకు అంతులేకుండా పోతోంది. తాజాగా గోవాలోని ఒక కొండ మీద సెల్పీని తీసుకోబోయిన అయిదుగురు తీవ్ర గాయాలకు లోనయ్యారు. కొండ చరియ మీద ఉన్న ఒక తలుపుకి ఆనుకుని, సెల్ఫీని తీసుకుంటుండగా, అకస్మాత్తుగా తలుపు తెరుచుకోవడంతో.... అంతా కిందకి పడిపోయారు. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరి వెన్నెముకకి తీవ్రగాయాలు కావడంతో మున్ముందు ఒకవేళ కోలుకున్నా, లేచి నడవడం అసాధ్యమని చెబుతున్నారు వైద్యులు. ఇలా ఉండగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకోబోయి కనీసం 27 మందన్నా మరణించి ఉంటారని వాషింగ్టన్‌ పోస్టు అనే పత్రిక పేర్కొంది. వీరిలో దాదాపు సగం మంది భారతీయులే అని తెలుస్తోంది. వీరంతా సముద్రాలలోనూ, కొండచరియల మీదా, రైళ్లు వస్తుండగా.... సెల్ఫీలు తీసుకోబోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆరోజు మహిళా ఎంపీలే మాట్లాడాలి.. మోడీ

  ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పక్ష, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఈ విషయాలపై మోడీ ఎలా స్పందిస్తారు.. విపక్ష నేతలకు ఎలా సమాధానమిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఈనేపథ్యంలోనే తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ మొదట రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. సభను అడ్డుకోవటం సరికాదంటూ పలు  కోట్ చేసిన ఆయన.. అవన్నీ దివంగత ప్రధానులు నెహ్రు.. ఇందిరా.. రాజీవ్ గాంధీల కొటేషన్లు చెబుతూ కాంగ్రెస్ కు చురక పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. కమ్యూనిస్ట్ సీనియర్ నేత సోమ్నాథ్ చటర్జీ కోట్ లను ప్రస్తావిస్తూ.. వామపక్షాలకు డిఫెన్స్ లో పడే ప్రయత్నం చేశారు. ఇంకా ఈనెల 8వ తేదీ మహిళా దినోత్సవం కావడంతో ఆరోజు మహిళా ఎంపీలే మాట్లాడితే బావుంటుందని సూచించార. అంతేకాదు కొత్తగా ఎన్నికై తొలిసారి సభకు వచ్చే ఎంపీలకు చాలానే ఐడియాలు ఉంటాయని.. వారి భావాలు వినేందుకు ఒక వారం పాటు వారు మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నను సందించారు.

జగన్‌ది బినామీ బతుకు.. జగన్ కూడా మగాడైతే..

  టీడీపీ నేతలకు రాజధానిలో భూములున్నాయని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పత్రిక అయిన సాక్షిలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్ మాత్రం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్‌ది బినామీ బతుకు అని, తాను అతనిలా బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేదని, మగాడిలా ఆస్తులు కొన్నానని వ్యాఖ్యానించారు. జగన్‌ది బినామీ బతుకు జగన్ కూడా మగాడైతే, ఆయన ఒంట్లో రాయలసీమ రక్తమే ఉంటే, బినామీ బతుకు కాకుంటే... రాజధాని నడిబొడ్డున తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు.

నన్ను కొనుక్కోండి.. ఫ్లిప్కార్ట్లో ఐఐటీ విద్యార్ధి పోస్ట్

  సాధారణంగా ఉద్యోగం కావాలంటే ఏం చేస్తాం.. రెజ్యూమ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. అయితే ఓ విద్యార్ధి మాత్రం కొత్తగా ఆలోచించి తననే కొనుక్కోండంటూ అంటూ ఆఫర్ ఇచ్చాడు..అదీ ఏ కంపెనీకి అనుకుంటున్నారా.. ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ లో. వివరాల ప్రకారం.. ఆకాశ్ నీరజ్ మిట్టల్ అనే అబ్బాయి ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చదువుతున్నాడు. అయితే తను ఉద్యోగం కోసం తిరుగుతున్న క్రమంలో  ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే అందరిలా తాను రెజ్యూమ్ పట్టుకొని వెళితే ఏం బావుంటుందని ఆలోచించాడేమో.. ఆ వెబ్ సైట్లోనే  తాను అమ్మకానికి ఉన్నానంటూ.. తనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ.. తనకు తాను రూ. 27,60,200 గా ధరను కూడా ఫిక్స్ చేశాడు. అంతేకాదు..  ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి మిట్టల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. అతని తెలివికి ఫ్లిప్ కార్ట్ సంస్థ ఇంప్రెస్ అయి ఉద్యోగం ఇస్తుందో లేదో చూడాలి.

ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ గా కేటీఆర్..

  తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అవార్డు దక్కింది. మంత్రి కేటీఆర్ ను స్కోచ్ సంస్థ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో టీహబ్ వంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, కొత్త భారతదేశ ఆవిష్కరణ కోసం పని చేస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి, ఈ అవార్డును స్వీకరించేందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల కేటీఆర్ స్పందిస్తూ ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా గతంలో కేటీఆర్ కు ఐకాన్ ఆఫ్ ధ ఇయర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

కాపులను ‘దరిద్రపు జాతి' అన్న ముద్రగడ..

  కాపులకు అన్యాయం జరుగుతుంది.. కాపులకు న్యాయం చేయాలి.. కాపులకు రిజర్వేషన్లు కల్పించండి అంటూ పోరాటం చేసిన ముద్రగడ.. ఇప్పుడు కాపులను ఉద్దేశించి అన్న ఒక మాటకు కాపులే తెగ ఫీలవుతున్నారంట. అదేంటి అనుకుంటున్నారా.. ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని హామీలు కూడా ఇచ్చింది. అయితే వాటిపై ముద్రగడ నిన్న మీడియాతో మాట్లాడుతూ దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని.. హామీలు నెరవేరక నేను సిగ్గుపడుతున్నాని.. దీనిపై రెండు మూడు రోజుల్లో కాపు నేతలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అంతేకాదు దీనిపై సీఎం చంద్రబాబుకి కూడా ఒక లేఖ రాశారు. అయితే ఆలేఖలో ముద్రగడ తన కులాన్ని ఉద్దేశించి ‘దరిద్రపు జాతి’’ అంటూ రాశారు.   అయితే ఈ మా ను ఆయన ఒక్కసారి కాదు నాలుగుసార్లు  ఉపయోగించారంట. ఇప్పుడు ముద్రగడ ఈ పదాన్ని పదే పదే వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.  ‘‘దరిద్రపు జాతి’’అని తమను తాము కించపర్చుకునేలా.. తక్కువ చేసుకునేలా అనుకోవటం ఏ మాత్రం సబబు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరో సంచలానికి జయలలిత.. కేంద్రానికి లేఖ..

  రాజీవీ గాందీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు ఎల్టీటీ ఉగ్రవాదులు ఇప్పటికే యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి వ్యవహారంపై తమిళనాడు సర్కార్ మరో సంచలానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలోనే జయలలిత సర్కార్ 24 ఏళ్లుగా వారు జైల్లోనే మగ్గుతున్నారు అంటూ దయ చూపగా.. నాటి యూపీఎ హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ మాత్రం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జయలలిత మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్ హత్య కేసులో నిందితులు గత 24 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నారు.. వారి విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం.. దీనిపై మీరేమంటారు?అంటూ జయలలిత కేంద్రానికి లేఖ రాశారు. మరి ఈ లేఖపై కేంద్రం ఏలా స్పందిస్తుందో.. అసలు ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.

ముందు చర్యలు తీసుకోండి.. తరువాతే పాక్ తో చర్చలు..

భారత్ పాకిస్థాన్ మధ్య చర్చలకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇరు దేశాల ప్రధానులు చర్చలు అనుకొని.. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తరువాత ఉగ్రవాదులు సడెన్ గా పఠాన్ కోట్ ఎయిరే బేస్ పై దాడి చేశారు. ఇక అప్పుడు బ్రేక్ పడిన చర్చలు ఇంత వరకూ జరగలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడప్పుడే కూడా జరిగేలా లేవు. ఎందుకంటే ఈ దాడికి సంబంధించిన కేసులో పాక్ తగిన చర్యలు తీసుకోకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన పలువురిని పాక్ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినా వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ని పట్టుకున్నామని పాక్ ప్రభుత్వం చెప్పినా అందులో నిజం లేదని తేలింది. ఇక ఆ తరువాత దర్యాప్తు కూడా అంతంత మాత్రంగానే జరిపారు పాక్ పోలీసులు. అయితే ఇప్పుడు మళ్లీ భారత్ తో చర్చలకు పాక్ మళ్లీ ద్వారాలు తెరిచింది. కానీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాత్రం ముందుగా పఠాన్ కోట్ పై దాడి చేసిన సూత్రధారులపై చర్యలు తీసుకోండి ఆ తర్వాతే పాక్ తో చర్చల విషయాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పారు. మరి ఇప్పుడైనా పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

కన్హయ్య కుమార్ కు బెయిల్.. 'నా కుమారుడు ఉగ్రవాది కాదు

  జెఎన్ యూ విద్యార్ది సంఘ నేత కన్హయ్య కుమార్ కు తాత్కాలిక ఊరట లభించింది. దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. అయితే ఈ బెయిల్ ను ఆరు నెలల వరకే ఇవ్వగా ఆ ఆ తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆరు నెలలు కూడా దర్యాప్తుకు సహకరించాలని షరతులు విధించింది. జేఎన్‌యూ సిబ్బందిలో ఒకరు పదివేల విలువైన పూచికత్తుని సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభారాణి స్పష్టంచేశారు. కాగా కన్హయ్య మొదట బెయిల్ కోసం సుప్రీం ను ఆశ్రయించగా.. సుప్రీం కోర్టు హైకోర్టును ఆశ్రయించమని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు తన కొడుకుకు బెయిల్ వచ్చిందని తెలుసున్న తల్లి మాట్లాడుతూ 'నా కుమారుడు ఉగ్రవాది కాదు. ఈ విషయం ప్రపంచం తెలుసుకొని తీరుతుంది' అని భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా కన్హయ్య బెయిల్‌ లభించడంపై కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు హర్షం వ్యక్తంచేశాయి.

సికింద్రాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై హత్య..

  సికింద్రాబాద్ లో ఓ దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుమీద ఓ వ్యక్తిని కత్తులతో దాడి చేసి చంపేశారు. వివరాల ప్రకారం.. సంజయ్ అనే వ్యక్తి సదర గ్లోబల్ ల్యాండ్ సర్వీస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే మార్నింగ్ జాగింగ్  చేస్తున్న అతని పై దుండగులు దాడి చేసి చంపారు. సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ దగ్గర స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు సంజయ్ పై కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే పోలీసులు దుండగుల కారును వెంబడించగా.. వారు ట్యాంక్ బండ్ వైపు పరారైనట్టు చెబుతున్నారు. దీనిలో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా సంజయ్ పార్శిగుట్టలో నివాసం ఉంటున్నాడు.

ముద్రగడపై చంద్రబాబు సీరియస్.. జగన్ పై కేసులు వేయండి..

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వ వైఖరిని తప్పు బడుతూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని.. హామీలు నెరవేరక నేను సిగ్గుపడుతున్నాని.. చంద్రబాబు తనను మోసగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముద్రగడ చంద్రబాబుకి లేఖ కూడా రాశారు. అయితే ఇప్పుడు ముద్రగడ రాసిన లేఖపై చంద్రబాబు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ముద్రగడ లేఖపై చర్చిస్తూ.. తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది. గడువు తీరకుండానే మళ్లీ డెడ్ లైన్ పెట్టడం ఏమిటని.. ఈ లేఖ జగన్ కోసం రాసినట్టు ఉందని.. ప్రభుత్వాన్ని ముద్రగడ డిక్టేట్ చేయలేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.   అంతేకాదు నవ్యాంధ్ర రాజధానిలో టీడీపీ నేతలను భూములు ఉన్నాయని వార్తలు వచ్చిన దానిపై కూడా ఆయన స్పందిస్తూ.. ఆ వార్తల్లో తెలిపిన వ్యక్తుల్లో ఎవరికైనా భూములు ఉన్నాయా అంటూ నిలదీశారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఆశ్తులు ప్రకటించాలన్నారు. ఏ నేతల పేర్లు అయితే వార్లు ప్రస్తావించారో.. వారు కేసులు వేయాల్సిన అవసరముందన్నారు. వారి వ్యాఖ్యల పైన చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా వెళ్దామని చెప్పారు.