ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో  బ్యారేజీ వద్ద కృష్ణానది పోటెత్తుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.    ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 55 గేట్లను ఒక అడుగు మేర, మరో 15 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద  ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా వరద కారణంగా విజయవాడ నగరంలో ముంపునకు గురయ్యే 43 లోతట్లు ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు.  అలాగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంత,  లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   

లిక్క‌ర్ కేసులో ఇరుక్కున్న వారంతా ఓటమిపాలేనా?

ఇప్ప‌టి వ‌రకూ ఢిల్లీ, తెలంగాణ, ఛ‌త్తీస్ గ‌డ్ లో జరిగిన మద్యం కుంభకోణాలకు సంబంధించి అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలు ఓటమి పాలయ్యాయి. దానిని బట్టి చూస్తే ఏపీలో కూడా అదే జరిగిందని తెలుస్తున్నదా?  అంటే అవున‌నే సమాధానమే వస్తోంది. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మా..ము (మాజీ ముఖ్యమంత్రి)  జమోరె (జగన్మోహన్ రెడ్డి) సైతం పీకల్లోతు కూరుకుపోయారు. ఈయ‌న, ఈయ‌న పార్టీ ప‌రిస్థితి కూడా అంతేనా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉందంటారు  విశ్లేషకులు.  వారి విశ్లేషణలను బట్టి  వ‌చ్చే రోజుల్లో ఆయ‌న ఏదైనా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. లేకుంటే మ‌రేదైనా ఎన్నిక‌ల్లో పాల్గొన్నా.. ఈ మ‌ద్యం పాపం అంత తేలిగ్గా వ‌ద‌ల‌దు. ఆంతే కాదు త్వ‌ర‌లోనే జగన్ అరెస్టు పక్కా అని కూడా అంటున్నారు.  అలాగుంటుంది మ‌ద్యం కుంభ‌కోణ‌మంటే..  ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగింద‌దే ఇక‌పై జ‌రగబోయేది కూడా అదే అంటున్నారు విశ్లేషకులు.   దానికి తోడు మిగిలిన రాష్ట్రాల‌కూ ఏపీకీ ఉన్న మ‌రో పెద్ద తేడా,  డిస్ అడ్వాంటేజీ ఏంటంటే...  ఆంధ్రప్రదేశ్ లో కల్తీ,  నాసిర‌కం మ‌ద్యం తాగి ఎంద‌రో చ‌నిపోయారు. మరెందరో  అనారోగ్యం పాలయ్యారు.  దీంతో వీరి శాపం అంత తేలిగ్గా వ‌ద‌ల‌ద‌ని అంటారు ద‌గ్గుబాటి దుర్గా ప్ర‌సాద్ వంటి నేత‌లు. వారి శాప‌మే జ‌గ‌న్ పార్టీ లీడ‌ర్ల‌ను ఒక్కొక్క‌రిగా అరెస్టు అయ్యేలా చేస్తుంద‌ని అంటారాయ‌న‌.  ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయ‌ని అంటారు. ఢిల్లీలో పాల‌నా ప‌రంగా ఎంతో మంచి పేరు సాధించారు కేజ్రీవాల్. ఆయ‌న విద్య, వైద్య రంగాల్లో ఒక రోల్ మోడ‌ల్ గా ఢిల్లీని తీర్చి దిద్దిన ప‌రిస్థితి. అవినీతి మీద పోరాడిన నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ పెట్టి.. ఆ పార్టీ ద్వారా అనూహ్యంగా ఢిల్లీలో విజ‌యం సాదించి.. ఆపై పంజాబ్ లో కూడా ఖాతా తెరిచి.. మినీ కాంగ్రెస్ పార్టీగా పేరు సాధిస్తూ వ‌చ్చిన కేజ్రీ క్రేజ్ అమాంతం త‌గ్గిందంటే అందుకు కార‌ణం లిక్క‌ర్ స్కామ్. ఈ కేసులో సీఎంగా జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారాయ‌న‌. దీంతో మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలు కావ‌ల్సి వ‌చ్చింది. ఇక ఇదే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో  చిక్కిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌. క‌విత ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ నేత‌. ఎమ్మెల్సీ. ఇప్పుడూ ఆమె అదే పార్టీలో, అదే హోదాలో ఉన్నారు కానీ.. కానీ అప్పుడు మ‌రింత డీప్ గా ఆ పార్టీ ప్ర‌తినిథిగా ప‌ని చేశారు. ఒక స‌మ‌యంలో క‌వితను అరెస్టు చేయ‌కుంటే బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాలుంటాయ‌ని కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి వంటి వారు కామెంట్ చేయ‌డంతో.. అది నిజ‌మేన‌ని న‌మ్మిన జ‌నం కేసీఆర్   పార్టీని గత ఎన్నికలలో  ఓడించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అంటే మందుకు మంచింగ్ లా.. మందుకు చెందిన  స్కాముల్లో చిక్కిన వారు డెఫినెట్ గా ఓడిపోతార‌న‌డానికి మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఇన్నేసి ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. వారు త‌ప్ప‌క‌ అరెస్ట‌వుతార‌న్న మాట కూడా ప్ర‌చారంలో ఉంది.  ఇక చ‌త్తీస్ ఘ‌డ్ మ‌ద్యం కుంభ‌కోణం. 2019- 2022 మ‌ధ్య జ‌రిగిన‌ లిక్క‌ర్ స్కామ్ కార‌ణంగా చైత‌న్య భాగెల్ తండ్రి భూపేష్ భాగెల్ ఘోరంగా ఓడిపోయారు. 1500 కోట్ల రూపాయ‌ల ఈ స్కామ్ వ‌ల్ల  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. త‌ర్వాతి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇక్క‌డ ఓట‌మి పాలు కావ‌ల్సి వ‌చ్చింది. ఈ స్కామ్ కి ఏపీ లిక్క‌ర్ స్కామ్ కి ఎన్నో పోలిక‌లుంటాయి. అక్క‌డా ఇక్క‌డా మ‌నీ ల్యాండ‌రింగ్ కి సంబంధించిన అనేక ఆన‌వాళ్లు క‌నిపిస్తాయ్.  కాబ‌ట్టి జ‌గ‌న్ రెడ్డికి గ‌డ్డుకాల‌మే అంటున్నారు చాలా మంది. మ‌ద్యం కుంభ‌కోణంలో ఇరుక్కుంటే త‌ర్వాత వారికి రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌ ప‌రిణామాలు తప్పవంటున్నారు పరిశీలకులు. అయినా కొంద‌రు మాత్రం ఎన్నోకేసులు ఉండి కూడా గత  పదేళ్లకు పైగా ద‌ర్జాగా బెయిలు మీద తిరుగుతున్న జ‌గ‌న్ కి ఏమీ కాదంటారు కొంద‌రు. ఆ మాట‌కొస్తే మోడీ ఉండ‌గా జ‌గ‌న్ జైలుకెళ్లే ప్ర‌స‌క్తే లేద‌న్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయ్. అయితే వంద గొడ్ల‌ను తిన్న రాబందు ఒక్క గాలి వాన‌కు కూలిన‌ట్టు.. ఎన్నో స్కాముల ఆరోపణలు ఉన్న  జ‌గ‌న్ ఒక్క మద్యం  స్కాములో జైలుకెల్ల‌డం ఖాయ‌మ‌ని మరి కొందరు గట్టిగా చెబుతున్నారు. 

శ్రీవాణి టికెట్ల ద్వారా ఇక ఏ రోజుకా రోజే శ్రీవారి దర్శనం

తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్లు ఇకపై ఏ రోజుకారోజు కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇప్పటి వరకూ శ్రీవాణి టికెట్లతో దర్శనం చేసుకోవడానికి మూడు రోజులు గడువు ఇచ్చేవారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానాన్ని మార్చి ఏ రోజు శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనేం చేసుకోవలసి ఉంటుంది. ఈ నూనత విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుంచి 15 వరకూ అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఆ తరువాత నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పేర్కొంది. ఈ నూతన విధానం భక్తులకు, ప్రత్యేకించి ఆఫ్ లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు తీసుకునే వారికి సౌకర్యంగా ఉంటుందని టీటీడీ పేర్కొంది.  శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్ లైన్ లో తీసుకునే వారి దర్శన సమయాల్లో కూడా మార్పులు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌరది తెలిపారు.   తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో ఆయ‌న శ్రీ‌వాణి దర్శ‌నాల‌పై బుధవారం (జులై 30) సమీక్ష నిర్వహించారు.  ఆ సమీక్షలో శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఈ కొత్త విధానంలో తిరుమలలో ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్ల కౌంటర్లు తెరుస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు.  ఈ టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచీ దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ జారీ చేస్తారు.   తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.  కాగా  ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా  ఆక్టోబ‌ర్ 31వ తేది వ‌ర‌కు ఆన్ లైన్లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తారు. ఇకపోతే నవంబర్ 1వ తేదీ నుంచి మాత్రం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.  

బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నటి ఖుష్బూ

  ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు  ఖుష్బూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఖుష్బూ సుందర్ సహా 14 మంది నియమితులయ్యారు.  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు, రాష్ట్ర కార్యదర్శులుగా మరో 14 మందితో కూడిన జాబితాను నాగేంద్రన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, ఆమె పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 2010లో డీఎంకేతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది. 2020లో బీజేపీలో చేరారు.  

కాకాణి అరాచకాలు బయటపెడతా..సోమిరెడ్డి హెచ్చరిక

  మాజీ సీఎం  జగన్ రేపు నెల్లూరు పర్యటనపై  టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు వస్తున్నారని చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు . జగన్ మాట విని ఎంతోమంది అధికారులు ఊచలు లెక్కపెట్టారని, జగన్ వారిని పరామర్శించకుండా, కాకాణిని పరామర్శించేందుకు నెల్లూరుకు ఎందుకు వస్తున్నట్టు అని నిలదీశారు. మధ్యం కుంభ కోణంలో జైలుకు వెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి కోరారు.  "కాకాణి అక్రమాలతో ఎంతోమంది అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు... అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు... రేపు జగన్ పర్యటన ముగియగానే కాకాణి దుర్మార్గాలన్నీ బయటపెడతా" అని హెచ్చరించారు. కాకాణి పాపాలకు బలైన వారిని కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు.   గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్ మాట విని చెవిరెడ్డి, కసిరెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా చాలా మంది జైలుకు వెళ్లారని, వాళ్ల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించడంలేదని నిలదీశారు. మరోవైపు జగన్ పర్యటన దృష్ట్యా జన సమీకరణకు పరిమితులు విధించింది. జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉందని పర్యటన వేళ బయటకు రావద్దని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సహా పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

పోలీసుల పహారాలో నెల్లూరు

  వైసీపీ అధినేత జగన్ గత పర్యాటనలలో చేదు అనుభవాలు దృష్ట్యా. రేపు నెల్లూరు జిల్లా పర్యాటనకు పోలీసులు పటిష్థత బందోబస్తుతో పాటు గట్టి ఆంక్షలు విధించారు. నెల్లూరు పట్టణంలో 34 పోలీసు యాక్టు అమలుతోపాటు, ర్యాలీలు, గుంపులుగా చేరడాన్ని పోలీసులు నిషేధించారు. వైసీపీ నాయకులతోపాటు ముఖ్యమైన కార్యకర్తల స్థాయి వారితో సహా వెయ్యి మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అల్లర్లు, తొక్కసలాట జరిగిన కేసులు పెడతామని వారిని హెచ్చరించారు.  గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు జైలు వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్‌లో హెలికాప్టరు‌లో చేరుకున్న జగన్, జైలులో మాజీ మంత్రి కాకణి గోవర్థన్‌రెడ్డి‌ని ములాఖత్‌లో కలవనున్నారు. అనంతరం ఇటీవల దాడికి గురైన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపూరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి తిరిగి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  నెల్లూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు రేపు కఠినతర నిషేధాలు అమలు చేస్తున్నారు. జగన్ పర్యాటనకు హెలీప్యాడ్ దగ్గర, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పరిమిత సంఖ్యలో నాయకులు హాజరుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఘనంగా హాజరు కావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. దీంతో నెల్లూరు పట్టణంలో రేపు జరగుతుందో జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు  

శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన GSLV F - 16 రాకెట్

  శ్రీహరికోట నుంచి నింగిలోకి నిసార్ శాటిలైట్ GSLV-F16  రాకెట్‌ దూసుకెళ్లింది.సెకెండ్ లాచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి  ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్  ఉపగ్రహాన్ని సాయంత్రం 5:40 గంటలకు  ప్రయోగించగా.. 743 కి.మీ. ఎత్తులో సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా చేర్చింది. వాతవరణ సమాచారం కోసం నాసా-ఇస్రో సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టాయి. NISAR శాటిలైట్ 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తు 3D చిత్రాలను అందిస్తుంది. భూమిని స్కాన్ చేస్తూ తుఫాన్లు సునామీలు, వరదలు, అగ్నిపర్వత విస్పోటనం వంటి ప్రకృతి విపత్తులపై అలర్ట్ చేస్తుంది.

సిందూర్ పై చర్చ.. ఎటూతేలని రచ్చ!

పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్  సిందూర్ పై లోక్ సభలో జూలై 28,29 తేదీలలో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే..  ఈ సుదీర్ఘ చర్చ  వలన దేశానికి ఏమి జరిగింది?  దేశం ముందున్న సందేహాలకు ఏ మేరకు సమాధానం లభించిది? అంటే మాత్రం సమాధానం చెప్పడం సాధ్యం కాదు. నిజానికి దేశ భద్రత, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, సైనిక చర్యల నియమావళితో పాటుగా అనేకానేక సున్నిత అంశాలతో ముడిపడిన విషయాల్లో అన్ని విషయాలు బయటకు చెప్పడం కుదిరే పని కాదు. విజ్ఞత, వివేచన ఉన్న అందరికీ ఇది తెలిసిన విషయమే. కాబట్టి..  ప్రభుత్వం చెప్పిందే  జరిగిందని కానీ..  జరిగిందే ప్రభుత్వం చెప్పిందని కానీ అనుకోవలసిన అవసరం లేదని నిపుణుల అంటున్నారు. అలాగే..  ప్రతిపక్షం దేశ హితం కోరి  విజ్ఞత, వివేచనతో పరిధులు తెలుసుకునే ప్రశ్నలు సంధించిందని  కూడా అనుకోలేమని అంటున్నారు.  నిజానికి.. రాజకీయ లక్ష్యాలు, రాజకీయ ప్రయోజనాలలే పరమార్ధంగా..  రాజకీయాల చుట్టూనే తిరిగిన చర్చను, రాజకీయ కోణంలోనే  చూడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.      అందుకే.. రెండు రోజుల పాటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య, భారత్, పాక్  క్రికెట్ మ్యాచ్  అంత ఉత్కంఠభరితంగా సాగిన చర్చ  దేశంలో రాజకీయ వేడిని పుట్టించింది. ఆ కారణంగానే పార్లమెంట్  చర్చ పై  రాజకీయ వర్గాల్లో రాజకీయ చర్చ మరింత వేడిగా సాగుతోంది. పార్లమెంట్ లో జరిగిన చర్చను,   ఆ సందర్భంగా అధికార విపక్షాలు వ్యవహరించిన తీరును బట్టి రాజకీయంగా ఎవరికి  ప్లస్.. ఎవరికి మైనస్..  ఎవరికి  ఏమిటి, అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఎడతెగని జరుగుతోంది.  నిజానికి..  ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ఎక్కువగా ఆ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు.  గట్టిగానే ప్రశ్నించారు. ముఖ్యంగా..  భారత్ పాకిస్థాన్  మధ్య కాల్పుల విరమణ  తన వల్లనే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే  (మొత్తం 29 సార్లు) చెప్పుకున్నా, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మోదీకి దమ్ముంటే..  పార్లమెంట్’ నుంచి ట్రంప్  చెప్పింది అసత్యం.. ట్రంప్ అబద్ధాల కోరు  అని  మోదీ ప్రకటించాలని సవాల్  విసిరారు. అయితే..  చివర్లో చర్చలో  జోక్యం చేసుకున్న ప్రధాని మోదీ..  ట్రంప్ పేరు ప్రస్తావించకుండా.. ఒక్క ట్రంప్  అని మాత్రమే కాదు ప్రపంచ దేశాల నాయకులలో  ఏ ఒక్కరూ కూడా కాల్పుల విరమణ చేయమని కోరలేదనీ.. పాకిస్థాన్ కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాతనే తాత్కాలికంగా కాల్పుల విరమణకు మన దేశం అంగీకరించిందని స్పష్టం హేశారు. నిజానికి..  ఆ ఒక్క విషయంలోనే కాదు..  పాకిస్థాన్  కూల్చివేసిన యుద్ద విమానాల లెక్కలు చెప్పాలనీ,  మోదీ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ( పొలిటికల్ విల్) లేక పోవడం వల్లనే ఆరు యుద్ధ విమానాలు కూలిపోయాయనీ..  ఇలా చాల కాలంగా వీధుల్లో వినిపిస్తున్న సందేహలనే రాహుల్ గాంధీ. కొంత గంభీంగా లోక్ సభలో లేవనెత్తారు.   అయితే..  అధికార కూటమి, ముఖ్యంగా బీజేపీ, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహాల శాఖ మంత్రి జయ శంకర్, అలాగే చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ పార్టీని  పాకిస్థాన్  అనుకూల పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు.  కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూలమనే  నేరేటివ్  బలంగా వినిపించారు.  పాక్ పుట్టుక మొదలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన పాక్  అనుకూల ధోరణి వివరిస్తూ .. కాంగ్రెస్ పార్టీ  పాకిస్థాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. ఒక విధంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీని  పాకిస్థాన్ అనుకూల పార్టీగా చిత్రీకరించడంలో కాంగ్రెస్ పార్టీకి  పాక్  పార్టీ ముద్రవేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్  అయింది. ఈ ముద్రను తొలిగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం పడుతుందని, చాలా శ్రమ పడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి  కాంగ్రెస్  పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడంలో బీజేపీ పాత్ర కంటే హస్తం పార్టీ స్వయంకృతం పాత్ర ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు.  ముఖ్యంగా..  పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్  పై చర్చ ప్రారంభమయ్యే సమయంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం  పహల్గాంలో దాడి చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే అని ఎలా చెపుతారు? దేశీయ ఉగ్రవాదులు కూడా కావచ్చును కదా అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా..  అంతర్జాతీయ దౌత్య బృందంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, వారిని వెలివేసినట్లు ప్రవర్తించడం, అందుకు ఆ ఇద్దరు భారత్ అనుకూల స్టాండ్ తీసుకోవడమే కారణమనే ప్రచారం జరగడంతోంది.

మహిళల గౌరవం కాపాడండి.. లోక్ సభలో గళమెత్తిన బైరెడ్డి శబరి

  ఏపీలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యాలు చేయడం లైంగిక దాడితో సమానమన్నారు. ప్రజాసేవలో ఉన్న మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు సమంజనం కాదన్నారు.  కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వేసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో  గళమెత్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, 33 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తరుణంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు.  ప్రజాసేవలో ఉండటం.. మహిళా నేతలకు శిక్ష కారాదన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆమె స్పీకర్‌ను కోరారు.

సింగపూర్ లో సీబీఎన్.. వరుస భేటీలు.. పలు కంపెనీలతో ఎంవోయూలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ముగిసింది. ఆ ఏపీకి బయలుదేరారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన మొత్తం 26 సమావేశాలలో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన  ముగిసి, ఆయన ఏపీకి బయలుదేరి వెడుతున్న సందర్భంగా  ఆయన బస చేసిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు చేరుకుని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.  ఈ సందర్భంగా సింగపూర్ లోని తెలుగు ప్రజల అభిమానానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి తెలుగు ప్రజ తన పట్ల చూపిన అభిమానాలు, ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలూ మరువలేనివని చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ నుంచి చంద్రబాబు బుధవారం (జులై 30) రాత్రి పదిన్నరకు శంషాబాద్ చేరుకుని, అక్కడ నుంచి బెజవాడకు బయలుదేరి రాత్రి పదకొండున్నరకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.  చంద్రబాబు సింగపూర్ పర్యటన యావత్తూ ఆయన విజనరీకి తగినట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల రాక లక్ష్యంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిథుల నుంచి ఆయన ప్రజంటేషన్ కు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన తీరుకు ముగ్ధులయ్యారు. ఈ పర్యటనలో పలు సంస్థలు ఏపీలో కార్యకలాపాలు సాగించేందుకు అంగీకరిస్తూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సింగపూర్ సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్ అయితే చంద్రబాబు పనితీరు, దార్శనికతపై పొగడ్తల వర్షం కురిపించారు.  నిరంతరం ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యల పరిష్కారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం, అదే సమయంలో రాష్ట్రప్రగతి, పురోగతి కోసం ప్రణాళికలు రూపొందించి, వాటిని  అత్యంత కచ్చిత్వంతో అమలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమౌతుందని ప్రశంసించారు. చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాము ఉత్సు కతతో ఉన్నామంటూ..  గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై కలిసి పని చేయడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెళ్లడించారు. అంతే కాకుండా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు ఇప్ప‌టికీ అంతే నాణ్య‌త‌తో కొన‌సాగుతుండటానికి కారణం చంద్రబాబు దార్శనికతేనని చెప్పారు. 

ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాప్ట్‌కు లోకేశ్ విజ్ఞప్తి

  సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు మంత్రి నారా లోకేశ్ బృందం సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను  సందర్శించారు. అక్కడ ఏఐ గోస్టోర్ లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగ దృశ్యాలను పరిశీలించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో భేటీ అయ్యాను. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో అజూర్ ఓపెన్‌ ఏఐ సర్వీస్,  మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హ్యాకథాన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తమ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అజూర్ ఓపెన్ AI మెక్రోసాప్ట్‌ను ఉపయోగించి 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని కోరారు

మహిళలకు ఉచిత బస్సు.. ఆ గుర్తింపు కార్డు చాలు : ఆర్టీసీ ఛైర్మన్‌

    ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై  ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒక గుర్తింపు కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ బస్ స్టేషన్‌లో ‘మహిళలకు ఉచిత బస్సు పథకం సన్నద్ధతపై  ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుతో కలిసి కొనకళ్ల నారాయణ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.  ఈ పథకంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, సన్నద్ధతపై డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఛైర్మన్ వివరించారు. పంద్రాస్ట్ నుంచి అమల్లోకి వచ్చే  ఫ్రీ బస్సు  సర్వీసు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌తోపాటు నగరాల్లోని మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే క్యాబినెట్‌ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందన్నారు.  

అమర్నాథ్ యాత్ర నిలిపివేత

భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణానికి తోడు అమర్నాథ్ యాత్ర మార్గంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు రహదారులు మూసుకుపోయి రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పహల్గామ్, బల్తాల్ మార్గాలలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధకారులు ప్రకటించారు. ఈ మార్గాల్లో యాత్రను ఎప్పటి నుంచి అనుమతించేది తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించిన తరువాత రహదారులను క్లియర్ చేసి యాత్రికులను అనుమతిస్తామని వవిరించారు.  

సినిమా థియేటర్ లో అగ్నిప్రమాదం

థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన బుధవారం ( జులై 30)న కావలిలో జరిగింది.   నెల్లూరు జిల్లా కావలిలోని స్రవంతి థియోటర్ లో సినిమా నడుస్తుండగానే ప్రొజెక్టర్ రూంలో ఒక్క సారిగా మంటలుచెలరేగి థియోటర్ మొత్తం వ్యాపించాయి. దీంతో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన థియోటర్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో థయేటర్ ప్రొజక్టర్ రూంలో ఉన్న సామగ్రి మొత్దం అగ్నికి ఆహుది అయ్యింది. అలాగే థియేటర్ లోకి కూడా మంటలు వ్యాపించడంతో ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. ఈ థియేటర్ లో గురువారం (జులై 31) విజయ్ దేవరకొండ నటించిన  కింగ్ డమ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగాన అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలాన్ని  ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సందర్శించారు. సకాలంలో మంటలను ఆర్పి భారీ నష్టాన్ని నివారించిన ఫైర్ సిబ్బందిని అభినం దించారు. 

మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర వాయిదా.. ఎందుకో తెలుసా?

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ నెల 31 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ యాత్ర వాయిదా పడింది. రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలలో ఆరు రోజుల పాటు మీనాక్షినటరాజన్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లు గురువారం (జులై 31) నుంచి వచ్చే నెల 6 వరకూ రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలని షెడ్యూల్ ఖరారైంది. అయితే ఇంతలో బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హస్తిన యానం ఖరారైన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది.  అది పక్కన పెడితే మీనాక్షి నటరాజ్ చేపట్టదలచిన పాదయాత్రపై పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మీనాక్షి నటరాజ్ చేపట్టనున్న పాదయాత్ర పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపడం అటుంచి.. పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో, శ్రేణుల్లో గట్టిగా వ్యక్తం అవుతోంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదీ కాకుండా ఈ పాదయాత్ర వలన ప్రతిపక్షాలకు విమర్శించేందుకు ఒక అవకాశం ఇవ్వడమే ఔతుందని అంటున్నారు. అలాగే పాదయాత్రను అడ్డుకునేందుకు విపక్షాలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లే ఔతుందని అంటున్నారు.   వాస్తవానికి పాదయాత్రను విపక్షాలు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను చాటేందుకు చేపడతాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే పాదయాత్రలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని అంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పుడు సమస్యలు తెలుసుకోవడాని పార్టీ పాదయాత్ర చేయడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన!

కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు వచ్చే నెల 1న శంకుస్థాపన జరగనుంది.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం తెలిపారు. నిడదవోలులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జమ్మలమడుగులో ఇంటింటికీ సామాజిక పెన్షన్ష పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారనీ, ఆ తరువాత  మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారనీ వివరించారు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని ఉదయపూర్లో ఔత్సాహిక పెట్టుబడిదారు లను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటకాభివృద్ధికి కృషి చేసే కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ ఎగ్జిబిషన్ ఆగస్టు 3, 4 తేదీలలో ఉంటుందన్నారు. అలాగే  నవంబర్ 14, 15తేదీలలో  వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ నిర్వస్తున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్య సదస్సు కోసం మంత్రి లోకేష్ చైర్మన్ గా ఆరుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీలో తానూ సభ్యుడనని కందుల దుర్గేష్ తెలిపారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నామన్నారు. ముఖ్యంగా  పర్యాటక రంగంలో  కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి భాగస్వామ్య సదస్సు ఎంతగానో దోహదం చేస్తుందని కందుల  తెలిపారు. గతంలో అంటే 2014 నుంచి 2019 వరకూ సీఎం చంద్రబాబునాయుడు హయాంలో  విశాఖలో ఏటా పార్ట్ నర్ షిప్ సమ్మిట్  జరిగేదని కందుల రమేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైజాగ్ లో జరిగిన అనేక సమ్మిట్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబునాయుడు సహకారహస్తాన్ని అందుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంబించలేదని విమర్శించారు సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మళ్లీ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లపై దృష్టి పెట్టారని ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జలకళతో శ్రీశైలం కళకళ.. ఎనిమిది గేట్లు ఎత్తి నీటి విడుదల

 శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉథృతి కొనసాగుతుండటంతో   శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సుందర జలదృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు నురుగులు కక్కుతూ పరుగుల తీస్తున్నది. ఇక శ్రీశైలం జలశయం నుంచి రెండు లక్షల 16 వేల 520 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా జూరాల నుంచి లక్షా 43 వేల 999 క్యూసెక్కుల వరదనీరు, సుంకేసుల నుంచి  1 లక్ష 22 వేల 326 క్యూసెక్కుల  వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.    శ్రీశైలం జలాశయానికి    ఇన్ ఫ్లోగా 2 లక్షల 66 వేల 325 క్యూసెక్కులు  ఉండగా అవుట్ ఫ్లో 2 లక్షల 82 వేల 478 క్యూసెక్కులుగా ఉంది.   శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులగా ఉంది పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా నమోదైంది  శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

బిల్డప్ బాబాయ్!

కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్. మద్యం కుంభకోణం కేసులో  పీకల్లోతు కూరుకుపోయిన జగన్  రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా..  అబ్బే మనకున్న పరపతి  ముందు  కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.   మద్యం కుంభకోణం కేసులో  సిట్ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువ అవుతోంది. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. సీట్ తో పాటు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు  ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఏపీ వరకు అంతా తన వెంటే ఉన్నారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట.   అసలు విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతో పాటు,  లక్షలల మంది అనారోగ్యానికి కారణమని,  లక్షలాది మంది గత ప్రభుత్వంలో,నకిలీ మందు తాగి అనారోగ్యం పాలయ్యారనీ,   వేల మంది జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా  అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారనీ జనం బహటంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నది. కానీ ఇంకొంతమంది వైసీపీ నేతలూ,  మాజీ మంత్రులు అసలు  పిచ్చిమందు, మంచి మందు ఉంటాయా? అంటూ వితండ వాదం చేస్తున్నారు.  సరే అ విషయాన్ని పక్కన పెడితే..  ఇప్పుడు తాజాగా అదే మద్యం కుంభకోణం కేసులో  ఆర్థిక అవినీతి జరిగిందని ,ప్రజల ప్రాణాలతో చెలగాట మాడారని  సిట్ బృందం పక్కా ఆధారాలతో,   నివేదిక తయారుచేసి, ఈ కేసుతో ప్రమేయం ఉన్న   ఒక్కొక్కరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతోంది. ఇక ఈ కేసులో తరువాతి అరెస్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోబోయేదని మాజీ సీఎం జగన్ అని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చేశారు.  ఈ విషయాన్ని బెంగుళూరు ప్యాలెస్ నుంచి నిశితంగా  గమనిస్తున్న మాజీ సీఎం జగన్ , ఎక్కడా తగ్గేదేలే అంటూ రివర్స్ పొలిటికల్  గేమ్ ప్లాన్ చేశారంటున్నారు.  ఆ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి  బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని.. ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి కలిశారు. అంతే కాకుండా జగన్ తాను గవర్నర్ తో భేటీ అయిన విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించారు.  దీంతొ జగన్ ఎందుకు పనిమాలా గవర్నర్ తో భేటీ అయ్యారు? ఈ భేటీలో ఆయన గవర్నర్ తో  చర్చించిన అంశం ఏమిటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అంతే కాదు.. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  ఇలా జరగాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. అంటే ఆయన తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి.   ఎందుకంటే తనను అరెస్టు చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద విషయం కాదు...  ఓ పక్కన లిక్కర్ కేసు లో  సిట్ అధికారులు కూడా దూకుడు పెంచారు... కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ప్రమేయాన్ని నిరూపించే కొన్ని ఆధారాలు దొరికే ఉంటాయి.   ఇంకొన్నిటి  కోసం సిట్ దర్యాప్తు చేస్తుండి ఉంటుంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేస్తారని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా..    ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని టాక్... అందుకే గవర్నర్ ను కలిసి..  అక్కడ ఏదో జరిగిందన్న బిల్డప్ ఇచ్చి..  ఓ పక్కన ప్రభుత్వానికి మరో పక్కన అధికారులకు ఒత్తిడి పెరిగేలా జగన్ వ్యూహం రచించారనేది పరిశీలకుల విశ్లేషణ.  అందుకే సందర్భం ఉన్నా లేకున్నా, అసలు లోపల ఏం జరిగిందో ? ఏం జరగలేదో తెలియకుండా గవర్నర్ తో  భేటీ అని ఓ పెద్ద వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చారు.  అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి   గవర్నర్ కలిశారు.. అయితే  గవర్నర్ ఆయనకు చేయ గలిగిన  సహాయం ఏంటి?  రాజ్యాంగ పదవిలో  గవర్నర్.. ఆర్థిక నేరాలు, ఇతర అభియోగాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న,  వ్యక్తిని కాపాడగలరా? తనకున్న విశిష్ట, విచక్షణ అధికారాలు ఉపయోగించి, కేసుల్లో ఉన్నా సరే ఒకమాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయొద్దని చెప్పగలరా?  అంటే అదేమీ జరిగే పని కాదంటున్నాయి రాజకీయవర్గాలు.    అయితే మరి జగన్  గవర్నర్ ఎందుకు కలిశారు? కలిశారు సరే.. ఆ విషయంలో మీడియా అటెన్షన్ ను డ్రా చేసేలా ఎందుకు వ్యవహరించారు?.. అన్న ప్రశ్నకు,  అదే అసలు కామెడీ అంటున్నారు పరిశీలకులు. తన వెనుక ఏదో శక్తి ఉందనీ,  ఓ పక్కన కేంద్రం,  మరో పక్కన గవర్నర్ జగన్ కు రక్షణగా నిలుస్తారనీ..  రేపు జగన్ ను సిట్ అధికారులు,  అరెస్టు చేస్తే , తెర వెనక పెద్దోళ్ళంతా  జగన్ కు  మద్దతు పలుకుతారన్న బిల్డన్ ఇవ్వడానికే.. అలా బిల్డప్ ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు తన నాయకత్వంపై విశ్వాసం సడలిపోకుండా ఉండాలన్న భావనతోనే  జగన్ గవర్నర్ భేటీ విషయం అంతగా ప్రచారంలోకి వచ్చేలా చేశారని అంటున్నారు.   అందుకే తన వ్యూహంలో భాగంగా, గవర్నర్ ను , ఆరోగ్య కుశల, ప్రశ్నలు వేస్తానంటూ అపాయింట్మెంట్ అడిగి ,ఓ గంట పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసి,  తెర వెనక ఏదో మంత్రాంగం జరిపినట్లుగా బిల్డ్ అప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే ఎవరైనా నేత ఓ గవర్నర్ దగ్గరికి వెళ్లి, తనపై కేసులు పెడుతున్నారని తనను కాపాడాలని అడిగే ప్రయత్నం.. కాదు కాదు ధైర్యం చేస్తారా?  అంటున్నారు. ఢిల్లీ వెళ్లి రావటం,  గవర్నర్ కలవడం ఇలాంటివన్నీజగన్  పొలిటికల్ డ్రామాలో భాగమే అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఏంటో,ఆ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో?