అమెరికన్ జనంపై.. ట్రంప్ టారిఫ్ దెబ్బ!
అవును. మీరు కరెక్ట్ గానే చదివారు. మీరు చదివింది నిజమే. అయినా,అమెరికా అధ్యక్షుడు. డోనాల్డ్ ట్రంప్‌పై తమ దేశ ప్రజలపైనే టారిఫ్ భారం మోపడం ఏమిటి ? టారిఫ్’ కొరడా ఝులిపించడం ఏమిటి ? అనే అనుమానం రావచ్చును, కానీ, జరిగింది, జరుగుతున్నది అదే., ఎలాగంటే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’కు తెలుగు సామెతలు తెలియక పోవచ్చును,కానీ, ఆయన, తీసుకుంటున్న నిర్ణయాలు, అయ్యవారిని చేయబోతే కోతి అయింది’ వంటి సామెతలను గుర్తుకు తెస్తున్నాయి.
నిజం. ఒక్క టారిఫ్ విషయంలోనే కాదు, కాల్పుల విరమణ విషయంలో నేనే...నేనే..నేనే ట్రంప్ నేనులను పనిగట్టుకుని లెక్కపెట్టిన రాహుల్ జీ లెక్క ప్రకారం 30 సార్లు) చేశా అంటూ ట్రంప్ చేసిన గోల విషయంలో కానీయండి,మరో విషయంలో కానీయండి, ట్రంప్’ తీసుకుంటున్న ‘సంచలన’ నిర్ణయాలు, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా, బ్రూమ్రాంగ్’ అవుతున్నాయి. అంటే, గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ముఖాన్ని, ముద్దాడుతున్నాయి.ఈ విషయం ఎవరో చెప్పడం కాదు, కాదు, అమెరికన్’ ప్రజలు, పార్లమెంటేరియన్స్’ చెపుతున్నారు.
అవును. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం,మన దేశం చేసిన మహాపరాధం అని భావించిన ‘ శ్రీ’ ‘ట్రంప్’ మన దేశం పై ఎడాపెడా,సుంకాలు విధించారు. ముందు 25 శాతం అన్నారు, ఆ తర్వాత మరో పాతిక కలిపి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్’ చేశారు. ఇలా ఎడాపెడా టారిఫ్’లు పెంచి భారత దేశాన్ని దారికి తెచ్చుకోవాలని, శ్రీమాన్ శ్రీ ట్రంప్’ ఆశించారు, కావచ్చును. కానీ, డామిట్’ కథ అడ్డం తిరిగింది. తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అన్నట్లు, ట్రంప్ ఒకటి తలిస్తే, మోదీ ఇంకొకటి తలిచారు. భారత ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కుండ బద్దులు కొట్టారు.
దాంతో, డామిట్ కథ అడ్డం తిరిగిందని తల పట్టుకోవడం ట్రంప్’ వంతైంది. సరే, జరిగిందేదో జరిగింది, ట్రంప్ టారిఫ్’ వలన అమెరికా ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా, అంటే అదీలేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు అన్నట్లు, భారత ఆర్థిక వ్యవస్థ పై పెద్దగ భారం పడలేదు, పడే పరిస్థితి ప్రస్తుతానికి లేదనే, అంటున్నారు. కానీ, ఇంతలోనే అమెరికా ప్రజలు నెత్తిన ధరల భరం మాత్రం గట్టిగ పడింది. నిజానికి ట్రంప్. టారిఫ్’ల ప్రభావం ఇంకా పూర్తిగా అములులికి రాలేదు,అయినా, ఇంతలోనే అమెరికా ప్రజల ఇతీ బాధలు. ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయని అక్కడి ప్రజలు సోషల్ మీడియా కోడై కూస్తోంది.
కాగా,ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మెర్సిడెస్ చాండ్లర్,వాల్‌మార్ట్‌లో ధరలు ఎలా పెరిగాయో వివరిస్తూ రిలీజ్ చేసిన వీడియో భయంకరంగా వైరల్ అవుతోంది. ‘ట్రంప్ టారిఫ్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్’ అనే క్యాప్షన్తో రిలీజ్ చేసిన వీడియోలో మెర్సిడెస్ చాండ్లర్ వాల్‌మార్ట్ ‘లోని బట్టల సెక్షన్‌లో తిరుగుతూ, పాత ధరల ట్యాగ్‌లను కొత్త ధరలతో ఎలా రీప్లేస్ చేశారో చూపించారు. కొన్ని ట్యాగ్‌లు కొత్త ధరల స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. ఫ్రెండ్స్, టారిఫ్స్ ఇప్పుడు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయంటూ చాండ్లర్ చెప్పుకొచ్చారు.
ఉదాహరణకు ఒక చిన్న షర్ట్ ధర $6.98 నుంచి $10.98కి పెరిగింది. అలాగే, ఒక బ్యాక్‌ప్యాక్ $19.97 నుంచి $24.97కి చేరింది. అంటే 4 డాలర్లు పెరిగిందని ఆమె ఆశ్చర్యంగా చెప్పింది. మీరు నమ్మకపోతే, మీ దగ్గరలోని వాల్‌మార్ట్ లేదా టార్గెట్‌కి వెళ్లి స్వయంగా చెక్ చేయాలని సవాల్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ట్రంప్ సుంకాలను విమర్శిస్తున్నారు. చివరకు ట్రంప్’ ను జోకర్ అనే స్థాయిలో విమర్శలు ఉంటున్నాయి, అందుకే అమెరికన్లు, ట్రంప్’ దురాశ దుఖానికి చేటు’ అంటున్నారు.