మూడు విడతలుగా సినీ కార్మికుల వేతనాలు పెంపు
posted on Aug 9, 2025 @ 8:01PM
సినీ కార్మికుల ఆందోళనపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు విడతలుగా వేతనలు పెంచలని నిర్ణయించారు. రోజుకు రూ.2000 లోపు ఉన్నవారికి తొలి విడతలో 15 శాతం, రెండో వితలో 5 శాతం, మూడో విడతలో 5శాతం పెంచలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1000 లోపు ఉన్న కార్మికులకు 20శాతం ఒకేసారి పెంచుతమని వెల్లడించారు. తాము పెట్టిన నిబంధనలకి ఒప్పుకుంటే వేతనలు పెంచడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్ఫష్టం చేశారు.
మరోవైపు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశంలో, సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంపుపై తాను హామీ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన కొందరు సభ్యులు తనను కలిశారనీ... వారి డిమాండ్లకు తాను అంగీకరించి, షూటింగ్స్ త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చాననీ... మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని మెగాస్టార్ తన ప్రకటనలో తెలిపారు. "నేను ఫెడరేషన్ నుంచి ఎవరినీ కలవలేదు. అసలు వాస్తవాలు వెల్లడించడానికే ఈ ప్రకటన చేస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.