ఏపీలో 5, తెలంగాణలో 13 పార్టీలను డీలిస్ట్ చేసిన ఈసీ
posted on Aug 9, 2025 @ 8:09PM
దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితాను తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలో అయిన పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసీ డీలిస్ట్ చేసిన పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంపై వాటిపై ఈసీ వేటు వేసింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2,854 గుర్తింపు పొందిన పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యలతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం డీ లిస్ట్ చేసిన పార్టీల జాబితాతతో ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 13 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీలకు మాత్రమే ఈసీ జాతీయ పార్టీల గుర్తింపు లభించింది.