మేకప్ మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..!
మేకప్ అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన వాటిలో ఒకటిగా మారింది. ఫంక్షన్, పెళ్లి, పండుగ.. సరదాగా బయటకు వెళ్లడం, ఫ్రెండ్స్ తో ఎక్కడైనా టూర్ కు వెళ్లడం.. ఇలా ఒకటనేమిటి.. ప్రతి సందర్భంలోనూ మేకప్ వేసుకుంటేనే వారికి తృప్తి. ఎక్కువ మేకప్ అలవాటు లేనివారు కూడా సింపుల్ గా లిప్స్టిక్, ఫౌండేషన్ మొదలైనవి వేసుకుంటారు. అయితే మేకప్ వేసుకోవడం పెద్ద సమస్య కాదు.. వేసుకున్న మేకప్ ను ఎక్కువ సేపు ఉంచుకోవడం, మేకప్ అట్రాక్షన్ గా ఉంచుకోవడంలోనే అసలు సమస్య దాగుంది. మేకప్ వేసుకోవడం చాలామందికి వచ్చు కానీ మరింత ఆకర్షణగా వేసుకోవడం మాత్రం రాదు. మేకప్ మరింత ఆకర్షణగా వేసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుంటే..
క్లెన్సర్..
మేకప్ మెరుస్తూ ఉండాలంటే చర్మ రకానికి తగినట్టు తేలికపాటి క్లెన్సర్ ఉపయోగించాలి. ఇది మేకప్ బాగా వచ్చేలా చేస్తుంది.
మాయిశ్చరైజర్..
చర్మం హైడ్రేట్ గా ఉండాలంటే చర్మానికి తేలికగా మాయిశ్చరైజర్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.
ఫౌండేషన్..
ఫౌండేషన్ ను అప్లై చేయడానికి తడి స్పాంజ్ లేదా బ్రష్ ఉపయోగించాలి. దీని వల్ల ఫౌండేషన్ చర్మంలోకి బాగా కలిసిపోతుంది. సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. అలా చేయకపోతే తెరలు తెరలు లేదా చారలుగా ఫౌండేషన్ ముఖం మీద ఉండిపోతుంది.
కన్సీలర్..
కళ్ల కింద ఏవైనా నల్లటి వలయాలు, లేదా మచ్చలు ఉంటే వాటిని కవర్ చేయడానికి కన్సీలర్ ఉపయోగించాలి. వేళ్లతో లేదా బ్రష్ తో కన్సీలర్ ను అప్లై చేసి బాగా బ్లెండ్ చేయాలి.
హైటైటర్..
నిగనిగలాడే మేకప్ లో హైలైటర్ చాలా ముఖ్యం. మఖంలో సహజ కాంతి పడే భాగాలలో హైలైటర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.
ఎండింగ్..
మేకప్ ముగించే ముందు లిక్విడ్ రూపంలో ఉన్న లేదా క్రీమ్ రూపంలో ఉన్న హైలైటర్ ను ఉపయోగించాలి. ఇది అయితే బాగా బ్లెండ్ అయ్యి మొత్తం పరుచుకునేలా చేస్తుంది.
ఐ షాడో..
ముఖంలో ఆకర్షించేవి కళ్లు. ఈ కళ్ల ఆకర్షణ మరింత పెంచాలి అంటే మెరుపుతో కూడిన ఐ షాడో ను ఉపయోగించాలి.
పెదవులు..
పెదవులు కూడా ఆకర్షణగా మెరుస్తూ ఉండాలంటే లిప్ గ్లాస్ లేదా గ్లాసీ లిప్ స్టిక్ ను ఉపయోగించాలి.
*రూపశ్రీ.
