పెదవుల నలుపును కంప్లీట్ గా తొలగించే భలే చిట్కా..!
పెదవులు నల్లగా కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరికి టాన్ కారణంగా పెదవులు నల్లబడతాయి. మరికొందరికి పిగ్మెంటేషన్ కారణంగా నల్లగా మారతాయి. ఇంకొందరికి పెదవుల విషయంలో సరైన సంరక్షణ తీసుకోకపోవడం వల్ల నల్లగా మారతాయి. మరికొందరికి నీరు సరిగా తాగకపోవడం వల్ల పెదవుల మీది చర్మం పొడిబారి నల్లగా మారుతుంది. అయితే కారణం ఏదైనా పెదవుల మీద నలుపు రంగును పొగొట్టుకోవడం కోసం చాలా మంది చాలా రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇంకొందరు పెదవుల రంగు కవర్ చేయడానికి విప్స్టిక్, లిప్ బామ్ వాడతారు. అయితే పెదవుల మీద నలుపును పూర్తీగా తొలగించే చిట్కా ఉంది. అది ఇంట్లోనే తయారు చేసుకున్నఔషద గుణాలు కలిగిన లిప్ బామ్.. దీన్ని వాడితే పెదవుల మీద నలుపు రంగు పోయి పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. దీన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే..
రత్నజోత్..
రత్నజోత్ అనేది ఒక రకమైన మూలిక. ఇది ఆహారం నుండి ఆరోగ్యం వరకు చాలా విధాలుగా ఉపయోగిస్తారు. సాధారణంగా దీన్ని రంగు కోసం ఉపయోగిస్తుంటారు. ఇది శరీరంలోని అనేక ఆరోగ్యి సమస్యలకు ఔషదంగా పనిచేస్తుంది. రత్నజోత్ ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు, ముఖం మీద మచ్చల తాలుకూ గుర్తులు వంటివి లేకుండా పోతాయి. ఈ మూలికను పెదవుల మీద కూడా అప్లై చేయవచ్చు. దీంతో లిప్ బామ్ ఎలా తయారు చేయాలంటే..
కావలసిన పదార్థాలు..
ఎండిన రత్నజోత్ ఆకులు - 1 టీస్పూన్
స్వచ్చమైన కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 1 స్పూన్
లిప్ బామ్ తయారీ..
ముందుగా, ఒక పాన్ తీసుకొని దానిలో సగం నీరు నింపాలి.
ఒక గుడ్డను నీటిలో ముంచి, దానిపై ఒక గిన్నెలో రత్నజోత్ ఆకులు, కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి.
ఇలా చేసిన తర్వాత గిన్నెలో ఉంచిన రత్నజోత్ దాని రంగును విడుదల చేస్తుంది. ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
రత్నజోత్ విడుదల చేసిన రంగు కారణంగా గిన్నెలో ఉంచిన కొబ్బరినూనె గులాబీ రంగులోకి మారుతుంది. ఇలా రంగు మారినప్పుడు గ్యాస్ ఆపివేయాలి.
ఇప్పుడు ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ఒక చెంచా దేశీ నెయ్యి వేయాలి. దీని తరువాత అందులో రత్నజోత్ ద్రావణాన్ని నెయ్యితో కలపాలి. అదంతా సెట్ అయ్యేలా కొద్దిసేపు వదిలేయాలి. ఇది గట్టి పడిన తరువాత పెదవుల నల్లదనాన్ని తగ్గించే హెర్బల్ లిప్ బామ్ నిమిషాల్లో సిద్దమైనట్టే..
ప్రయోజనాలు..
కొబ్బరి నూనె అయినా లేదా నెయ్యి అయినా రెండింటినీ పెదవులపై రాసుకోవడం వల్ల పొడిబారిన, పగిలిన పెదవుల సమస్య పరిష్కారమవుతుంది. ఇది పెదవుల నల్లదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పెదవులను మృదువుగా గులాబీ రంగులోకి మారుస్తుంది.
*రూపశ్రీ.
