హెయిర్ స్పా చేయించుకుంటున్నారా...ఈ నిజాలు తెలుసా!
హెయిర్ స్పా అనేది జుట్టుకు పోషణను, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేసే ఒక రకమైన హెయిర్ ట్రీట్మెంట్. ఇది జుట్టు, తలపై చర్మాన్ని లోతుగా కండిషనింగ్ చేస్తుంది, తేమ చేస్తుంది, జుట్టును మృదువుగా, మెరిసేలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొంతకాలం బాగానే అనిపిస్తుంది కానీ జుట్టుకు చాలా హానికరం అని అంటున్నారు కేశ సంరక్షణ నిపుణులు. హెయిర్ స్పాలో షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ మాస్క్, కండిషనర్ మొదలైన వాటిని అప్లై చేయడం ద్వారా జుట్టును డీప్ మాయిశ్చరైజ్ చేస్తారు. కానీ హెయిర్ స్పా వల్ల జుట్టుకు చాలా నష్టం జరుగుతుందట. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
జుట్టు రాలడం..
క్రమం తప్పకుండా హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య తొలగిపోతుంది. తల చర్మం సున్నితంగా ఉండే వ్యక్తులలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా సంభవిస్తాయి. సున్నితమైన తల చర్మం ఉన్నవారు హెయిర్ స్పా ను నివారించాలి. ఒక వేళ హెయిర్ స్పా చేయించుకుంటున్నట్లయితే అందులో వాడే ప్రోడక్స్ట్ ను ఖచ్చితంగా చెక్ చేసుకుని తరువాత చేయించుకోవాలి.
తల చర్మం దెబ్బతినడం..
హెయిర్ స్పాలో చాలా రసాయనాలు కలిగిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఈ రసాయన ఉత్పత్తులకు అలెర్జీ ఉంటే హెయిర్ స్పా చేయించుకోకుండా ఉండటం మంచిది. కొందరికి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కుతూహలంగా ఉంటుంది. కానీ ఇది తల చర్మానికి చాలా నష్టం చేకూరుస్తుంది.
జుట్టు రంగు పోతుంది..
క్రమం తప్పకుండా హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల జుట్టు రంగు మసకబారుతుంది. హెయిర్ స్పాలో బ్లీచ్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీనివల్ల జుట్టు రంగు పోతుంది. జుట్టు తెల్లగా మారే అవకాశాలు ఎక్కువ చేస్తుంది.
పొడి జుట్టు..
కొందరు హెయిర్ స్పా ఎక్కువగా చేస్తుంటారు. దీని వల్ల జుట్టు సహజ తేమ కోల్పోయే అవకాశం ఉంది. దీని కారణంగా తల చర్మం పొడిగా మారవచ్చు. ఇది తరువాత చుండ్రుకు కారణమవుతుంది.
*రూపశ్రీ
