ముఖం మీద మచ్చలు తొలగించి మెరుపును ఇచ్చే అద్బుతమైన చిట్కా..!


ముఖం అందంగా, ఆరోగ్యంగా మచ్చలు లేకుండా ఉండాలని కోరుకోని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ముఖం మీద మచ్చలు, మొటిమలు, చర్మ సమస్యలు ఏవో ఒకటి లేకుండా కనిపించే అమ్మాయిలు చాలా అరుదు.  వాణిజ్య ప్రకటనలు  చూసి చాలా మంది అమ్మాయిలు చాలా ఉత్పత్తులు వాడుతు ఉంటారు. కానీ పాత కాలం నుండి ఉపయోగిస్తున్న ఒకే ఒక పేస్ట్ ముఖం మీద మచ్చలు తొలగించడంతో పాటు ముఖానికి అద్భుతమైన మెరుపును కూడా ఇస్తుందట. ఇంతకీ అదేంటో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..

పాత రోజుల్లో రసాయన ఉత్పత్తులు లేవు.  అప్పటి కాలం  వారు శనగపిండి, ముల్తానీ మట్టి, పెరుగు, పచ్చి పాలు, తేనె,  పసుపు వంటి సహజ పదార్ధాలతో తయారు చేసిన పేస్టులను మాత్రమే వాడేవారు. ముల్తానీ మట్టితో తయారు చేసిన పేస్ట్,  సబ్బులను ఉపయోగించారని, ఇది వారి ముఖం,  శరీరంలోని మిగిలిన చర్మాన్ని  కూడా శుభ్రంగా ఉంచేదని చెబుతారు. ఇలాంటి ఒక పేస్ట్ తయారీ గురించి తెలుసుకుంటే..

ముల్తానీ మట్టి పేస్ట్..

ముల్తానీ మట్టి పేస్ట్ తయారు చేయడానికి, 1 గిన్నె ముల్తానీ మట్టికి అవసరానికి అనుగుణంగా పచ్చి పాలు,  2 టీస్పూన్ల తేనె వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఎక్కువ పాలు వేయకూడదు. లేకుంటే పేస్ట్ చిక్కగా మారుతుంది.

ఈ పేస్ట్ ని ఉపయోగించడానికి, ముందుగా దీన్ని  ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. సమయం ముగిసిన తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి,  ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.

ప్రయోజనాలు..

ముల్తానీ మట్టి  చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా,  వృద్ధాప్యాన్ని నివారించే ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి పూయడం వల్ల పెద్ద చర్మ రంధ్రాలు తగ్గుతాయి.  చర్మం మచ్చలేనిదిగా కనిపిస్తుంది. అదనంగా మచ్చలు తగ్గుతాయి,  మెరుపు పెరుగుతుంది.

సబ్బు కూడా..

శరీర చర్మాన్ని శుభ్రంగా,  ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకుంటే ముల్తానీ మట్టితో తయారు చేసిన సబ్బుతో స్నానం చేయడం మంచిది. దీన్ని తయారు చేయడానికి మీకు పేస్ట్ కోసం ఉపయోగించే పదార్థాలు మాత్రమే తప్ప పెద్దగా అవసరం లేదు.

ముల్తానీ మట్టి చిక్కటి పేస్ట్ తయారయ్యాక, దానికి సబ్బు ఆకారం ఇచ్చి, ఎండలో ఆరనివ్వాలి. అది రాయిలా మారుతుంది. ఇప్పుడు స్నానం చేసే ముందు 2-3 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆపై స్నానానికి వాడాలి.

                           *రూపశ్రీ.