7రోజుల్లో జుట్టు రాలడం ఆగి జుట్టు పెరగడం  స్టార్ట్ అవుతుంది. ఇలా చేయండి..!


జుట్టు పెరగడం, జుట్టు రాలడం రెండూ ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి.  చాలా మంది జుట్టు రాలిపోతుంటే జుట్టు బాగా రాలిపోతోంది నాకు జుట్టు పెరగాలి అని జుట్టు పెరగడానికి చిట్కాలు,  నూనెలు, షాంపూలు వాడతారు. కానీ జుట్టు రాలుతున్నప్పుడు మొదట చెయ్యాల్సింది జుట్టు రాలడాన్ని అరికట్టడం. జుట్టు రాలడాన్ని అరికట్టామంటే జుట్టు పెరుగుదల మోడ్ లోకి అదే వస్తుంది. అప్పుడు జుట్టు పెరుగుదలకు అవసరమైన చిట్కాలు పాటించవచ్చు. అయితే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒక చిట్కా పాటిస్తే అటు జుట్టు రాలడం తగ్గి.. ఇటు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.  ఇంతకీ అదేంటో తెలుసుకుంటే..

జుట్టు రాలడం ఆగి, జుట్టు తిరిగి పెరగడంలో అల్లం, ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తాయి. అల్లం ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.  జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అల్లం, ఉల్లిపాయ ఎలా వాడాలంటే..

ముందుగా, అల్లం,  ఉల్లిపాయలను మిక్సర్‌లో రుబ్బి పేస్ట్ సిద్ధం చేయాలి. దీని తరువాత, 50 గ్రాముల అల్లం రసం,  50 గ్రాముల ఉల్లిపాయ రసం కలిపి స్ప్రే బాటిల్‌లో ఉంచాలి.

రాత్రిపూట, అల్లం-ఉల్లిపాయ రసాన్ని తల మొత్తం చల్లుకుని, తేలికపాటి చేతులతో జుట్టును మసాజ్ చేయాలి.

ఉదయం నిద్రలేచిన తర్వాత, స్నానం చేసేటప్పుడు, షాంపూ లేదా సబ్బు లేకుండా శుభ్రమైన నీటితో  జుట్టును కడగాలి. ఇలా తయారు చేసిన రసాన్ని రెండు రోజులు నిల్వ చేయవచ్చు.

మైగ్రేషన్, సైనస్ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రాత్రి వాడకూడదు.  దీన్ని మధ్యాహ్నం సమయంలో తలకు అప్లై చేసుకుని కేవలం ఒక గంట సేపు తలకు అలాగే ఉంచి తరువాత తల స్నానం చేయాలి.

సాధారణంగా ఉల్లిపాయ రసం మాత్రమే వాడటం వల్ల తల దుర్వాసన వస్తుంది. కానీ దీనికి అల్లం కూడా జోడించడం వల్ల ఉల్లిపాయ దుర్వాసన రాదు. ఇది జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు విరిగిపోకుండా చేయడంలో సహాయపడుతుంది.  అకాల బూడిద రంగును నివారించడంలో అలాగే జుట్టును మందంగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.


                                  *రూపశ్రీ.