కుంకుడు కాయలు ఇలా వాడితే చాలు.. తెల్ల జుట్టు పరార్..!
తెల్లజుట్టు చాలామందిని వేధిస్తున్న సమస్య. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నేటికాలంలో చెడు జీవనశైలి కారణంగా, అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జుట్టు సంరక్షణ కోసం అన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ఉత్పత్తులు జుట్టుకు హాని కలిగిస్తాయి. జుట్టు నెరవడానికి, రాలడానికి అతిపెద్ద కారణం చెడు జీవనశైలి. అయితే జుట్టు సంరక్షణ కోసం కుంకుడు కాయలను ఉపయోగించవచ్చు. కుంకుడు కాయలు ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గించుకోవడమే కాదు.. తెల్లజుట్టు కూడా నివారించుకోవచ్చట. అది ఎలాగో తెలుసుకుంటే..
కుంకుడుకాయ జుట్టుకు చాలా ఆరగ్యవంతమైనది. దీనిని షాంపూ స్థానంలో ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి కుంకుడు కాయలను పగలగొట్టి రాత్రంతా వేడి నీటిలో నానబెట్టండి. తరువాత ఉదయం దానిని గుజ్జు చేసి, ఆపై ఫిల్టర్ చేయాలి. ఈ నీటిని తల స్నానం కోసం వాడాలి. కేవలం ఇలా కుంకుడు కాయను నీటిలో నానబెట్టి వాడటమే కాదు. కుంకుడు కాయలను బాగా ఎండబెట్టి తరువాత పగలకొట్టి అందులో విత్తనాలు తీసేయాలి. తరువాత ఆ కుంకుడు కాయలను బాగా గ్రైండ్ చేయాలి. ఇలా చేస్తే పొడి తయారవుతుంది. తల స్నానానికి కనీసం అరగంట ముందు ఈ పొడిని వేడి నీటిలో వేసి ఉంచితే చాలు చాలా బాగా నురుగు వస్తుంది. దీంతో తల స్నానం చేయవచ్చు. కుంకుడు కాయలు వాడటం వల్ల కలిగే ప్రయజనాలు ఏంటంటే..
జుట్టును బలంగా మారుస్తుంది..
కుంకుడు కాయ నీరు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది జుట్టును మందంగా, బలంగా మార్చడంలో సహాయపడుతుంది.
చుండ్రును వదిలించుకోవచ్చు..
కుంకుడు కాయ నీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, ఇతర జుట్టు సంబంధిత సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. దీని వాడకంతో దురద సమస్య కూడా తగ్గుతుంది.
నిస్తేజమైన జుట్టు కోసం..
కుంకుడు కాయ నీరు నిర్జీవంగా ఉన్న జుట్టుకు జీవం పోస్తుంది. ముందుగా ఇది జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. తరువాత జుట్టు ఆకృతిని సరిచేసి దానికి జీవం పోస్తుంది.
జుట్టును నల్లగా చేసుకోండి.
జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి కుంకుడు కాయను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది తెల్ల జుట్టును నల్లగా చేయడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
