ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. 40 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపిస్తారు..!
యవ్వనంగా కనిపించాలని కోరుకోని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. మహిళలు ఎప్పుడూ అందంగా తయారవుతారు. అయితే మేకప్ లు గట్రా లేకుండా సహజంగా అందంగా కనిపించడంలోనే మహిళల క్రెడిట్ దాగి ఉంటుంది. సాధారణంగా మహిళలకు 40 సంవత్సరాల వయసు అంటే ఒకరో, ఇద్దరో పిల్లలతో ముఖం మీద ముడతలతో, తెల్లని జుట్టుతో వయసును బయటకు వ్యక్తం చేస్తూ ఉంటుంది శరీరం. అయితే అలా కాకుండా 40 ఏళ్లు వచ్చినా సంతూర్ మామ్ లాగా కనిపించాలని అనుకుంటారు మహిళలు. అందుకోసం చాలా చిట్కాలు కూడా ఫాలో అవుతారు. అయితే ఈ కింద చెప్పుకునే 5 చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల 40 ఏళ్ళు దాటినా చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇంతకీ ఈ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
40 సంవత్సరాల తర్వాత మెడ చర్మం వదులుగా మారి త్వరగా ముడతలు పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ, కొల్లాజెన్ తగ్గడం వల్ల చర్మం ఎలాస్టిన్ గుణం తగ్గిపోతుంది. ఈ కారణంగా చర్మం ముడతలు పడుతుంది. చర్మం బిగుతుగా ఉండాలంటే ఇలా చేయాలి.
గ్లైకోలిక్ లేదా సాలిసిలిక్ యాసిడ్ తో ఎక్స్‌ఫోలియేషన్..
మెడ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వారానికి రెండుసార్లు గ్లైకోలిక్ లేదా సాలిసిలిక్ యాసిడ్ ఉపయోగించాలి. ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, కొత్త కణాలను పునరుత్పత్తి చేయడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. రాత్రిపూట వీటిని అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మర్చిపోకూడదు.
రెటినాయిడ్స్..
రెటినాయిడ్స్ ముడతలను తగ్గించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అవి చర్మాన్ని లోతుగా రిపేర్ చేసి, కణాల పునరుద్ధరణను పెంచుతాయి. చర్మానికి మరింత యవ్వన రూపాన్ని ఇస్తాయి. రాత్రిపూట రెటినాయిడ్స్‌ను పూయాలి, ఉదయం ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. ఎందుకంటే రెటినాయిడ్స్ చర్మాన్ని సూర్యకాంతికి మరింత సున్నితంగా చేస్తాయి.
హైలురోనిక్ యాసిడ్, నియాసినమైడ్ మాయిశ్చరైజర్..
చర్మాన్ని ఎక్కువ కాలం పాటు హైడ్రేటెడ్ గా, మృదువుగా ఉంచడానికి, హైలురానిక్ ఆమ్లం, నియాసినమైడ్ కలిగిన మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. హైలురానిక్ ఆమ్లం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అయితే నియాసినమైడ్ చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. రెండు పదార్థాలు మెడ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారం..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బెర్రీలు, సిట్రస్ పండ్లు, క్యారెట్లు, పాలకూర, చిలగడదుంపలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. అవిసె గింజలు, వాల్‌నట్‌లలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
సరైన డైలీ స్కిన్ కేర్ రొటీన్..
మెడ చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి డైలీ స్కిన్ కేర్ న ఫాలో అవ్వాలి.
ఉదయం తేలికపాటి క్లెన్సర్‌తో ముఖం, మెడను శుభ్రం చేసుకోవాలి.
విటమిన్ సి సీరం లేదా నియాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఆ తర్వాత SPF 50 సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి.
సాయంత్రం పూట ముఖాన్ని మళ్ళీ తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి.
వారానికి రెండుసార్లు గ్లైకోలిక్ యాసిడ్ రాయాలి.
ప్రతి రాత్రి రెటినోయిడ్ వాడాలి.
ప్రతి రాత్రి చర్మ సంరక్షణ దినచర్యను హైలురానిక్ యాసిడ్ కలిగిన మాయిశ్చరైజర్‌తో పూర్తి చేయాలి.
మెడ చర్మం, ముఖ చర్మం లాగా సున్నితమైనది. దానిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. సరైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలితో ముడతలు, వదులుగా ఉండే చర్మాన్ని నివారించవచ్చు. క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా కాలం పాటు అందంగా మరియు యవ్వనంగా ఉండవచ్చు.
*రూపశ్రీ.
